24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆకుకూరలు

 🌻🌹ఆకుకూరలు🌹🌻


రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్.  

భార్య డెలివరీకి వెళ్ళింది. 

అప్పటిదాకా తాముంటున్న

సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని 

ఖాళీ చేసి ఊరికి కొంచెం 

దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 

అద్దెకు తీసుకుని చేరాడు ...

స్వయంపాకం చేసుకుంటాడు.  


ఆరోజు ఆదివారం.  

పోర్టికోలో కూర్చుని 

కాఫీ తాగుతున్నాడు.  

"ఆకు కూరలు..

ఆకు కూరలు" 

అని కేక వినిపించింది.  

డెబ్బై ఏళ్ల వృద్ధురాలు 

తలపై కూరల గంప పెట్టుకుని

కనిపించింది. పిలిచాడు.  


"కాస్త గంప దించయ్యా"  

అన్నది ఆమె.  

"పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.  


"పది రూపాయలకు మూడయ్యా"  

చెప్పింది అవ్వ.


"మరీ అన్యాయం... 

బయట అయిదు ఇస్తున్నారు" 

అన్నాడు చిరుకోపంగా


"నాలుగు తీసుకో నాయన.." 

కట్టలు తీసింది అవ్వ


పదిరూపాయలు ఇచ్చాడు. 

"గంప కాస్త పట్టయ్యా"  

అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. 


గంపను పైకి లేపుతూ 

రెండు కట్టలు 

పాలకూర తీసి 

ఇంట్లోకి విసిరాడు రవి ....


అవ్వ వెళ్ళిపోయింది.


"ఎంత ఆశో 

ఈ ముసలిదానికి, 

ఇవాళో రేపో చావబోతుంది... 

ఇంకా మూటలు కడుతున్నది"

ముసిముసిగా నవ్వుకున్నాడు.  


అప్పటినుంచి 

అవ్వ వచ్చినపుడల్లా 

గంప ఎత్తడానికి సాయం పడుతూ

ఒక బీరకాయో, 

రెండు వంకాయలో, 

ఒక దోసకాయో, 

చిన్న సొరకాయో 

లాఘవంగా తీయడం మొదలుపెట్టి 

ముసలిదాని 

రోగం కుదిర్చానని

సంతోషపడసాగాడు.  


కొన్నాళ్ల తరువాత 

ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ 

రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు.  

అంతలోనే ఎవరిదో 

ఏడుపు వినిపించింది.  

ఎనిమిదేళ్ల అమ్మాయి 

పుస్తకాల సంచీని మోస్తూ 

"నానమ్మా.. నన్ను 

స్కూల్ నుంచి పంపేశారు..."

ఏడుస్తూ వచ్చింది.  


అవ్వ కంగారుగా 

"అయ్యో నా బిడ్డ.. బాబూ...

కాస్త గంప కిందికి దించు" 

అన్నది రవితో.


"ఏడవకమ్మా...

నేనొచ్చి చెబుతాలే.  

రేపు ఫీజు కడతాలే..

నా తల్లే...

ఇంటికిపొదాం పద"  

అన్నది పిల్లను 

వాటేసుకుని ధారాపాతంగా 

నీరు స్రవిస్తున్న 

ఆ చిన్నారి 

నయనాలను తుడుస్తూ.  


రవికి అర్ధం కాలేదు.  

"ఎవరీ పిల్ల?"  

అడిగాడు అవ్వను.


"నా మనవరాలు బాబూ...

ఆడపిల్ల పుట్టిందని 

అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు 

సూటిపోటి మాటలు అంటుంటే

తట్టుకోలేక కూతురు

ఎలుకలమందు మింగి

చచ్చిపోయింది.  

మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు.   

ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు.  

ఎప్పుడూ బయటకు వచ్చి

ఎరగని నేను రోజూ

తెల్లారుజామునే లేచి 

పొలాలకెళ్లి 

ఇరవై కిలోల కూరలు 

అరువు మీద తీసుకుని  

మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ  

అమ్ముకుంటూ 

పైసాపైసా కూడబెట్టి 

దీన్ని చదివిస్తున్నా.  

మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే

వెయ్యి రూపాయలు

పెరిగిందని చెప్పారు.  

నెలరోజుల్లో కడతానని 

చెప్పి బతిమాలితే 

సరే అన్నారు.  

ఈరోజు చూడు బాబు...

పసిపిల్ల అనే కనికరంకూడా

లేకుండా బయటకి పంపించారు."

అన్నది కళ్ళు తుడుచుకుంటూ.


రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి.  

రక్తప్రవాహం స్తంభించిపోయింది.

గిరుక్కున తిరిగి 

హాల్లోకి వచ్చాడు.  

అతని హృదయం 

ఆకాశం చిల్లులు పడేలా

ఏడుస్తున్నది.  

మనసంతా 

ఉష్ణ జలపాతం అయింది.  

ఎంత నిగ్రహించుకున్నా 

కళ్ళు ధారలు కట్టాయి.  

"ముసల్దానికి ఎంత డబ్బాశ" 

అనే తన వెకిలిమాట 

వెయ్యి గునపాలై 

దేహాన్ని కుళ్ళబొడిచింది ....  

ప్రతి కష్టం వెనుకా 

ఒక కన్నీటి గాధ ఉంటుందని

తెలియని తన అజ్ఞానానికి 

తనను తానే శపించుకున్నాడు ....  


పర్సులో చెయ్యి పెట్టాడు. 

బయటకొచ్చి 

"అవ్వా ...

ఈ ఐదువేలు తీసుకుని

మనవరాలి ఫీజ్ కట్టెయ్యి"  

అన్నాడు బలవంతంగా 

అవ్వ చేతిని తీసుకుని.  


హంపి మొహంజదారో 

శిధిలాలకు  

ప్రతీకలాంటి   

అవ్వ వృద్ధశరీరం 

భూకంపం వచ్చినట్లు కంపించింది.  


"బాబూ .... 

ఇంత అప్పు తీర్చాలంటే 

నాకు ఏడాది పడుతుంది"  

అన్నది వణుకుతూ 


"అప్పని ఎవరు చెప్పారు? 

చనిపోయిన 

మా అమ్మ ఆత్మశాంతి

కోసం ఇస్తున్నాను ...

ఇప్పుడే కాదు .... 

నీ మనవరాలి చదువు

అయ్యేంతవరకు

నేనే ఫీజ్ కడతాను .... 

రేపటినుంచి రోజూ  

నేను ఉన్నా లేకపోయినా  

పది రూపాయల

ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు

" గంప పైకెత్తాడు రవి.  


మరునాడు రవి 

నిద్రలేచి తలుపు తీశాడు.  

వాకిట్లో ఆరు ఆకుకూర

కట్టలు కనిపించాయి!

యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..

 🙏PLEASE


ఆసాంతం చదవండి.

పిల్లలకి చెప్పండి / పంపించండి.



***************


భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని 

టిఫిను తింటున్నారు......భార్య భర్తను ఇలా

అడిగింది.

" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? "

భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?

భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా

మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో

హోం వర్కు చేయిస్తూ.......వారితో గడుపుతూ......నాతో చాలా

ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో తెలుసుకుందామని.....అంటూ

కాస్త భయంగానే అడిగింది.

భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే!

నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.

భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి

చిన్న ఇల్లు కానీ పెట్టలేదుకదా!

భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.

భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.

భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు......

అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు.

ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య.

ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన

కళ్ళతో చదవసాగింది.

ప్రియమైన కుమారునికి......

ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.

కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును

అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......

మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన 

తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.

బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం

మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు.

వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా ఉన్నది.

తరువాత అన్నీ ఎదురుచూపులే!

మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో

సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.

ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......

మీ రాక కోసం ఎదురుచూపు.........

ఇలా మీరు పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడా

సమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,,

ఉద్యోగాలు వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనా

నాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు.........

మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........రాగానే అలసిపోయి

భోంచేసి పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీ

చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు..... మీ నాన్న వ్యాపారాన్ని

నీకు అప్పచెప్పారు.......నువ్వుకూడా బిజీ అయిపోయావు.

నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది.

ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు

మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......

మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని

అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని.

చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.

నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడు

చెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా

మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతే

పేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైం

ఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే సరి....

వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?

ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......

ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........

నాలా నీ కూతురో .కొడుకో ఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో

ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...

ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే

బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యను

బాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో!

నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు......ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........ఇదే

నా చివరి కోరిక....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......

నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ

అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు

యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని

వెళ్ళదీయనీయకు.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే

ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.

ఇట్లు 

మీ మంచికోసమే ఎదురుచూసే నీ తల్లి,.

దయచేసి మీ కుటుంబంతో గడపండి......వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే

గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..మీ సంసారమే

మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దని ప్రార్థన..


ఇంత మంచి కథ రాసిన ఆ రచయిత ఎవరో కానీ ఆయనకు వందనం

🌹🙏🏻🌹

శ్రీమద్భాగవతము

 *24.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2271(౨౨౭౧)*


*10.1-1392-*


*సీ. "మమ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ*

  *కైశోర వయసులఁ గదిసి మీర*

*లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు*

  *నుండు సౌభాగ్యంబు నొంద రైతి;*

*రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు*

 *తల్లిదండ్రుల యొద్ద తనయు లుండి*

*యే యవసరమున నెబ్బంగి లాలితు*

  *లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ*

*తే. మాకు నిన్నాళ్ళు లే దయ్యె మఱియు వినుఁడు*

*నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న*

*మేని కెవ్వార లాఢ్యులు మీరకారె*

*యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు.* 🌺 



*_భావము: "అమ్మానాన్నలారా! మమ్మల్ని కన్నారే కానీ, మీరు కోరుకున్నట్లు, మా శైశవ, పౌగండ, (పౌగండము - 5 నుండి 10 సంవత్సరముల బాల్యము), కిశోర ప్రాయములలో మమ్మల్ని ఎత్తుకుంటూ, దింపుతూ, గారాబము చేస్తూ ఉండే భాగ్యమును పొందలేకపోయారు. ఇది దైవనిర్ణయము. అలాగే మేము కూడా మీ వద్దనే ఉండి మీ లాలన, పాలనా భాగ్యానికి నోచుకోలేదు. ఇంకను, చతుర్విధపురుషార్థములను సాధించుకోవటానికి ఉపయోగపడే ఈ శరీరమునకు మీరే కదా కారణభూతులు? మీ ఋణము తీర్చుకొనుటకు నూరేండ్లయినను సరిపోదు."_* 🙏



*_Meaning: Dear Mother and father! You gave birth to us but you never enjoyed the exultation and the pleasure of our pranks and playful acts during our infancy and childhood. This happened in accordance with destiny. Similarly we too could not have your soothing touch and fond presence. But it is your blessing that we got this physical body to achieve the prinicipal object of human life and pursuit (four purusharthas- vij. Dharma, Artha, Kama and Moksha. We will not be able to repay this debt even in 100 years."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

_విఫలమైన గణిత ప్రేమికుడు_

 *_విఫలమైన గణిత ప్రేమికుడు_*


డియర్ రేఖ


*వాస్తవ సంఖ్యాసమితి* లాంటి నా జీవితంలోనికి *కల్పిత సంఖ్య* లా చొరబడ్డావు. అప్పటినుండి *క్రమ భిన్నం* లా సాఫీగా సాగే నాజీవితం *అపక్రమ భిన్నాని* కి ఎక్కువ *మిశ్రమ భిన్నాని* కి తక్కువగా మారింది. 


మనిద్దరి వయస్సులు *సామాన్య నిష్పత్తి* లో ఉన్నాయనుకున్నా కానీ, భావాలు *విలోమాను పాతం* లో ఉన్నాయని తెలుసుకోలేకపోయా. 


నువ్వు దక్కవని తెలిసాకా నా కన్నీళ్ళ *ఘన పరిమాణం* కొలిచే పాత్రలేదు. నా హృదయ వేదన *వైశాల్యానికి సూత్రం* లేదు.  


నీతో *సంకలనం* ఇష్టాలని *వ్యవకలనం* కష్టాలని *గుణకారం* *అంతం* లేని, *ఆవర్తనం* కాని *భాగాహారమ* ని తెలుసుకోలేకపోయా.  


మన ప్రేమకు *సమీకరణాలు* అన్నీ *సాధన* లేని *అసమీకరణాలు* అవుతాయని కలలో కూడా ఊహించలేదు.  


*నిరూపణ* లేని *సిద్ధాంతాని* కి *దత్తాంశం* నువ్వు అయితే *సారాంశం* నేనయ్యా. నా *ప్రమేయం* లేకుండా నీతో ఏర్పడ్డ ఈ బంధం *తుల్య సంబంధం* కాకపోయినా కనీసం స్నేహబంధమైనా కాలేదు.  


ఇంతకాలం *సమైక్య రేఖ* లా ఉన్న నువ్వు ఒక్కసారిగా *సమాంతర రేఖ* గా ఎందుకు మారావో తెలియదు. 


ఏది ఏమైనా నీతో *వ్యవహారం* *సున్నా* తో *భాగాహారం* లాంటిదని *నిర్వచితం* కాదని ఇన్నాళ్ళకు తెలుసుకున్నా.


                           ఇట్లు

         నీ *విఫల ప్రేమ గణిత విద్యార్ధి*


 🤔 😄😝

దానం దాని ఫలితాలు

దానం అంటే మనదైన వస్తువును భౌతిక ఫలితాన్ని ఆశించకుండా ఉచితంగా ఇవ్వటం అన్నమాట.  మనకు ఒక నానుడి వుంది అదేమంటే " పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ  బిడ్డలు" అని అంటారు.  దీని భావం మనం పుణ్యకార్యాలు మరియు దానాలు చేయాలని వాటి ఫలితంగా మనకు వచ్చే జన్మలో మంచి జీవిత భాగస్వామి, మంచి సంతానం కలుగుతారని. ఇంకొకటి కూడా మనం వింటుంటాము అదేమిటంటే

 " ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః

ఋణక్షయే క్షయం యాంతి కాత్రపరివేదనా'' 

నిజానికి శ్లోకం ఎంతో వేదాన్త సారాన్ని మనకు తెలియచేస్తుంది. పశువులు, భార్య/భర్త  పుత్రులు, ఇల్లు, ఆస్తులు- ఇవన్నీ కూడా మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి ఋణానుబంధలుగా (పాపపుణ్యాలను) కలుగుతాయి. ఋణం తీరిపోగానే ఇవేవీ ఉండవు. వేటి మార్గంలో అవి పోతాయి. బంధాలు, బంధుత్వాలు చెదిరిపోతాయి. మనం చాలా చోట్ల చూస్తూవుంటాం. కొంతమంది శిశువులు జన్మించిన తటుపరియే గతించటం దీనిని మనం శిశువుతో గతజన్మ ఋణం చాలా కొద్దిగా వుండివుండ వచ్చు. కొన్ని సందర్భాలలో మనం తల్లితండ్రులను వాళ్ళ కొడుకులే అనేకవిధాలుగా బాధించటం కూడా అది కూడా ఋణానుబంధం కావచ్చు. జన్మలో మనం ఇతరులకు సాయపడితే ఋణానుబంధాని తీర్చుకోవటానికి వాళ్ళు వచ్చే జన్మలో మనకు తారసపడతారని. జన్మలో మనకు సాయం చేసేవారు గతజన్మలో నీకు ఋణపడినవారని అర్ధం చేసుకోవాలి. అంటే పుణ్యఫలం పొందటానికి మనం వలసినంత దానం చేయాలి. అప్పుడే పుణ్య ఫలం వస్తుంది. మనకు పదిరకాల దానాలు తెలిపారు. వాటిని చూద్దాం.

 

 దశ (10) దా నా లు

1.గోదా నం (= ఆవు లను దా నం ఇవ్వ డం )

 2.భూ దా నం , (= భూ మిని దా నం గా ఇవ్వ డం )

 3.తిల దా నం , (= ను వ్వు దా నం )

4.హిరణ్య దా నం , (బం గా రం దా నం )

5.ఆజ్య దా నం , (= నెయ్యి దా నం )

6.వస్త్ర దా నం , (= దు స్తు దా నం )

7.ధా న్య దా నం , (= ధా న్యం దా నం )

 8.గు దా నం , (= బెల్లం దా నం )

 9.రౌ ప్య దా నం (= రౌ ప్యం అం టే రూ ప్యం . అం టే బం గా రు లేదా వెం డితో చేసిన నా ణ్యం . స్థూ లం గా దీన్ని ధనదా నం అనవచ్చు )

10.లవణ దా నం (= ఉప్పు దా నం ) 

ఇవికాకుండా ఏదానం చేస్తే ఫలితం వస్తుందో చూద్దాం. 

. బియ్యాన్ని దానం చేస్తేపాపాలు తొలుగుతాయి.

2. వె౦డిని దానం చేస్తే  మనశ్మా౦తి కలుగుతుంది.

3.  బ౦గారం దానం చేస్తేదోషలు తొలుగుతాయి.

4. ప౦డ్లను దానం చేస్తేబుద్ధి. సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తేఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తేరోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.

7. పాలు దానం చేస్తేనిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తేస౦తానంకలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తేమతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.

10. టె౦కాయ దానం చేస్తేఅనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.

11. దీపాలు దానం చేస్తేక౦టి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తేఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తేబ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తేఆయుష్షు పెరుగుతు౦ది.

15. అన్న దానం చేస్తేపెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

 

రకంగా దానాల ఫలితాలు తెలిపారు. ఏతావాతా తెలిపేది ఏమంటే దానం చేయండి దానివల్ల దానఫలితాన్ని పొందండి.

మనపూర్వులు ఎంతోమేధావులు. పేదరికంలో వున్నవారికి ధనవంతులు ఆసరాగా వుండాలనేందుకే రకంగా దానాలు చేయమని మనకు మార్గదర్శనం చేశారు. అవసరాలకు మించి సంపాయించే వారు తమ నల్లధనాన్ని ఎక్కడికో పోయి దాచుకునే బదులు కొంత భాగాన్ని పేదవారికి దానంగా ఇస్తే మంచిది. తిరుపతి హుండీలో డబ్బులు వేసేదానికన్నా ధనాన్ని పదిమంది అన్నార్తులకు ఆకలి తీర్చటానికి ఉపయోగిస్తే తిరుమల వెంకన్న తప్పకుండా దీవిస్తాడు.

తనకు మాలిన ధర్మం మొదలుచెడ్డబేరం ---

తన సంగతిని ముందుగా చూసుకున్న తరువాతనే ఎదుటివారికి సహాయం చెయ్యాలి కానీ తనవి తాను నిర్లక్ష్యం చేసుకోకూడదు అని దీనికి అర్థం చెబుతారు. సామాన్య దృష్టికి దీని అర్థం ఇదే.

తన కుటుంబ సభ్యులపట్ల ఉండే బాధ్యతలను నెరవేర్చటం ప్రథమ కర్తవ్యం.

కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఎంతటి మహత్తర కార్యాలు చేసినా నిష్ర్పయోజనం. సంపాదనంతటినీ దాన ధర్మాలకి వెచ్చించి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలనుకోవటం బాధ్యతా రాహిత్యం.

అలాగే కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా సమాజసేవ అని తిర గటం కూడా అంతే. తన పిల్లలని ఆయాలకి అప్పచెప్పి అనాథ బాలల సేవ చేయడానికి వెళ్లటం ఎంత విడ్డూరం.

తల్లిదండ్రులను సరిగా చూడక తరిమి కొట్టి, వృద్ధాశ్రమాలకు ఎన్ని విరాళాలు ఇస్తే మాత్రం ఏం ఫలం.

"క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"భూమి యొక్క సారాన్ని బట్టి పంట వేస్తె మంచి దిగుబడి వస్తుందో చూసి పంట వేయాలి.  అదేవిధంగా యాచకుని పరిస్థితినెరింగి మాత్రమే దానం చేయాలి.  మీరు ఒకవ్యక్తి ధనాన్ని దానంగా  ఇచ్చారనుకోండి. వ్యక్తి ధనంతో సారా తాగి తన భార్యనో లేక వేరే ఎవరినో హింసించదనుకోండి.  దాని వలన అతనికి వచ్చే పాప ఫలంలో మీకు కూడా వాటా ఉంటుంది.  అంటే మీరు మీ ధనంతో అప్రత్యక్షంగా పాపాన్ని కొనుకున్నారన్నమాట. యెంత మూఢమతి అయినా కావాలని పాపాన్ని కోరుకోడుగా.  మీరు మంచి ఉద్దీస్యంతోటి ఒకరికి ఒక దేముడి భక్తి పుస్తకాన్ని దానంగా ఇచ్చారనుకోండి దానిని ఆటను పాటించి దానిని ఆకళింపుచేసుకొని నలుగురికి దానిలోని విలువలను తెలియచేస్తే దానివలన అతనికి లభించే పుణ్యఫలంలో కొంత భాగం మీకు ప్రాప్తిస్తుంది.  అదే పుస్తకాన్ని తాను చదవక చులకన చేసిన లేక అతనివద్ద వున్న దానిని ఎవరైనా నీచంగా చూసిన అతనికి లభించే పాపఫలం మీకు కూడా సంక్రమిస్తుంది.

అపాత్ర దానం చేయటం కన్నా దానం చేయకుండా ఉండటమే శ్రేయస్కరం. ఇప్పటి పరిస్థితులలో ఉచితంగా వస్తుందంటే పొందటానికి అపాత్రులు చాలామంది ముందుకు వస్తున్నారు.

“అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న”  . మీకు దానం చేయాలనీ అనిపిస్తే ఉత్తమమైనది అన్నదానం. మీరు ప్రత్యక్షముగా ఎవరికైనా అన్నాన్ని దానంగా చేసి ఆటను భజించినదాకా చూసి చేసే దానము చాలా శ్రేయస్కరము .

తస్మాత్ దానం చేసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త.జాగ్రత్త

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ