20, ఏప్రిల్ 2022, బుధవారం

నారదుడు ఎవరు

 నారదుడు ఎవరు? జన్మరహస్యం ఏంటి?


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


వీణాతంత్రులు మీటుతూ, నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుణ్ని ‘కలహ భోజనుడు’ అని పిలుస్తారు. ఆయన గొప్పతనం, చరిత్ర తెలిస్తే ఎవరూ అలా అనరు. పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచినవాడు నారదుడే.


వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన కథను చెప్పి ప్రేరణ కలిగించినవాడు. ‘నేను ఇంతటి వాడిని ఎలా కాగలిగానంటే... గత జన్మలో సన్యాసులు నాకు ఉపదేశించిన జ్ఞానమే. కాబట్టి నువ్వు భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే విన్నవారు కూడా నాలాగే ఉత్తర జన్మలో మహా జ్ఞానులు, భక్తులు కాగలరు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు’ అని తన కథను చెప్పాడు.


నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది. ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు. బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. ‘వారికి  సేవలు చేస్తూండ’మని యజమాని నారదుడికి పురమాయించాడు. సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడ్డారు. దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించారు. మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు. ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి.


పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ క్రూరసర్పాలు, ప్రాణులను చూసినా ‘ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే  శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపదా రాదు. నాకేమిటి భయం?’ అనుకుని ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామాత్రంగా అయింది. అశరీరవాణి ’ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ, నా గురించే చెబుతూ, పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఒకరోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు. ఆ తరవాత నీవు  బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. 


దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.


ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ. ’మహతి’ అనే వీణను ఇచ్చాడు. ఆ వీణపై నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం... ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు. దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్కల్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజాల్లో, కార్యాల్లో నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. ‘భక్తి సూత్రాలు’ రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటాడు.


ఆ కథ విన్న వ్యాసుడు పొంగిపోయి ‘నారదా’ మంచిమాట చెప్పావు. ఇప్పుడు నేను భగవంతుడి గురించి, ఆయన విశేషాలు, ఈ బ్రహ్మాండాల ఉత్పత్తి, ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి రచన చేస్తాను. వీటిని చదివిన, విన్నవారు నీలాగే తరించిపోవాలి’ అని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంబించాడు.


హరి నామ స్మరణం 

సమస్త పాప హరణం


జై శ్రీరామ్ జై హనుమాన్

చతుస్సాగర పర్యంతం

 *చతుస్సాగర పర్యంతం అంటే...*


ఉన్నవి సప్తసముద్రాలైతే. చతుస్సాగర పర్యంతం' అంటారు ఎందుకో తెలుసుకుందాం.


'చతుస్సాగర పర్యంతం' అంటే, ఈ నాలుగు సముద్రాల 'పర్యంతం' చుట్టబడిన జంబూద్వీపంలో మనం వుంటున్నాం...ఆ నాలుగు సముద్రాలే కాలాంతరంలో 'ఏడు సముద్రాలు'గా మారాయని 'దేవీ భాగవతం' చెపుతున్నది....

'చాతుర్వర్ణస్య సౌవర్ణో మేరుశ్చోల్బమయః స్మృతః' అన్న వేదోక్తి ప్రకారం మేరువుకు నాలుగు వర్ణాలు {రంగులు} ఉన్నాయని మన పూర్వీకులు చెప్తారు....అవి తూర్పున తెలుపు రంగు, దక్షిణాన పసుపు రంగు, పశ్చిమాన నలుపు రంగు, ఉత్తరాన ఎరుపు రంగుగా చెప్పారు... ఇక్కడ తెలుపు శాంతికి ప్రతీక. అందుకే, తూర్పు సముద్రాన్ని 'ప్రశాంతో ధధి'గా పేర్కొన్నారు... అలాగే, పసుపు పవిత్రతకు చిహ్నం... కాబట్టి, దక్షిణ సముద్రాన్ని 'అతులాంతకం' {సరి లేనిది}గా పేర్కొన్నారు....ఇక, సింధువు అంటేనే జలరాశి.... నీరు స్వతహాగా నలుపు రంగులో ఉంటుంది.... కనుక, పశ్చిమాన ఉన్న సముద్రాన్ని 'సింధు సముద్రం' అన్నారు. ఉత్తరాన ఉన్న సముద్రం రక్తవర్ణంతో ఉండటం వల్ల దానిని 'అర్క సముద్రం'గా పిలిచారు.... అలాగే, పసిఫిక్‌ మహాసముద్రాన్ని 'ప్రశాంత సముద్రమని', అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని 'అతులాంతక సముద్రమని', ఆర్కిటిక్‌ సముద్రాన్ని 'అర్క సముద్రమ ని', ఇండిక్‌ లేదా హిందూ సముద్రాన్ని 'సింధూ సముద్రమని' కూడా పిలుస్తారు.... పురుషార్ధాః సాగరాః అన్నది 'భావనోపనిషత్తు'. ఎలాగైతే, 'సాగరాలు సర్వవ్యాపకాలో అలాగే, పురుషార్థాలు కూడా సర్వవ్యాపకాలే' అంటూ, ధర్మార్థకామ మోక్షాలను ఆధ్యాత్మిక వేత్తలు సాగరాలతో పోలుస్తారు.... అంతేకాక, పిండాండాన్ని బ్రహ్మాండాన్ని సమన్వయం చేయడంలో బ్రహ్మాండంలోని సాగరాలను పిండాండాలలోని పురుషార్థాలకు ప్రతీకలుగానూ భావించారు.

వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్

 *కేన్సర్‌తో బాధపడుతూ వైద్యం చేయించుకుని విసిగి వేసారిన వ్యక్తి మీకు తెలిస్తే వారికి ఈ మెసేజ్ షేర్ చేయండి.*


 *దయచేసి వేడి కొబ్బరి నీళ్లు*


*వేడి కొబ్బరి నీళ్లు మీ జీవితాంతం క్యాన్సర్ నుండి కాపాడుతాయి*

 

  *వేడి కొబ్బరికాయ క్యాన్సర్ కణాలను మాత్రమే చంపుతుంది!*


  *ఒక కప్పులో 2 నుంచి 3 సన్నగా కొబ్బరి ముక్కలను కోసి, వేడినీళ్లు వేసి, "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, రోజూ తాగితే ఎవరికైనా మంచిది.*


  *వేడి కొబ్బరి నీరు క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది, క్యాన్సర్‌ను సమర్థవంతంగా చికిత్స చేయడానికి వైద్య రంగంలో సరికొత్త పురోగతి.*


 *వేడి కొబ్బరి రసం అల్సర్ మరియు ట్యూమర్లపై ప్రభావం చూపుతుంది.  అన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుందని నిరూపించబడింది.*


  *కొబ్బరి సారంతో ఈ రకమైన చికిత్స ప్రాణాంతక కణాలను మాత్రమే నాశనం చేస్తుంది, ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.*


 *అంతేకాకుండా, కొబ్బరి రసంలోని అమైనో ఆమ్లాలు మరియు కొబ్బరి పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌ను సమర్థవంతంగా నివారిస్తాయి, రక్త ప్రసరణను సర్దుబాటు చేస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.*


   *టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర ఎ. ఈ మెసేజ్ పంపుతున్నారు*

 *ఇతరులకు ఫార్వార్డ్ చేయగలిగితే, కనీసం ఒక ప్రాణమైనా తిరిగి రక్షించబడుతుంది...మీ వంతు సహాయం చేయండి. ధన్యవాదాలు!*


*స్నేహితులకు చెప్పండి, ప్రేమను పంచండి! మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.*

నీరు తాగారా లేదా

 *మొరింగ్ లేవగానే నీరు తాగారా లేదా నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి*


ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారకన్న ...బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే...దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు ? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు... నీళ్లు తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య. ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. 


1.మీరు కుర్చుని లేవలేక పోతున్నారా... కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా...అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి..


2. తలనొప్పి తరచుగా వస్తుందా... నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.


3. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.


4. అలసట ,ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం అనేవి తక్కువ నీరుకు సంబంధించినదే... బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.


5. యూరిన్ కలర్ మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.


6. బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.


7. పెదాలు ఆరిపోవడం , చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవదటం. అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం. 


మీ శరీర బరువును తగ్గించే ఈ 8 ఆయుర్వేద చిట్కాలు గూర్చి మీకు తెలుసా ?


భారతదేశంలో "ఆయుర్వేదం" అనేది చాలా పురాతనమైన మూలాలను కలిగి ఉంది, అంటే సుమారుగా 15,000 సంవత్సరాల ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నది. మీరు మీ శరీర బరువును తగ్గించుకోవడం గురించి ఆలోచించినప్పుడు - మీ మనసులో అనేక వేల ఆలోచనలు మెదులుతాయి. ఈ విషయం కోసం అవసరమైన సమాచారాన్ని పొందడానికి మీరు ఇంటర్నెట్లో సర్ఫింగ్ను ప్రారంభిస్తారు.


అయితే, ఇంటర్నెట్లో మీకు లభించే సమాచారం పూర్తిగా తప్పయినది కావచ్చు, కావున అలాంటి సమాచారాన్ని మీరు పూర్తిగా నమ్మలేరు. కానీ, ఇప్పుడు బరువు నష్టం కోసం మీరు ఎలాంటి మార్గాన్ని వెతుకుతారు ? దానికి గల సరైన సమాధానమే సహజసిద్ధమైన ఆయుర్వేద మార్గము !


ఆయుర్వేద మీ శరీర బరువు తగ్గడానికి సరళమైన, సులభమైన సహజ చిట్కాలను మీకు అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఖరీదైన మాత్రల జోలికి, బరువును తగ్గించే వ్యాయామాలపై దృష్టిని పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఏ రకమైన సప్లిమెంట్స్ను ఉపయోగించవలసిన అవసరం లేదు. మీరు ఆకలితో అలమటించవలసిన అవసరం కూడా లేదు.

ఆయుర్వేదం అనేది సహజ పద్ధతుల్లో, సహజ మార్గంలో మీ బరువును తగ్గించే చిట్కాలపై పూర్తిగా దృష్టిని పెడుతుంది. ఈ వ్యాసంలో, మీ శరీర బరువును కోల్పోవటానికి 9 ఉత్తమమైన ఆయుర్వేద చిట్కాలను మీకు అందిస్తుంది. ఈ చిట్కాలను మీరు అనుసరించినట్లయితే మీరు ఏ సమయంలో అయినా మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వుకి చెక్ పెట్టగలరు.


నిమ్మకాయ జ్యూస్ + వెచ్చని నీరు :-


తాజా నిమ్మరసానికి ఒక గ్లాసు వెచ్చని నీటిని కలిపి తీసుకోవడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇది మీ ప్రేగులను యాక్టివేట్ చేస్తుంది. వెచ్చని నీరు + నిమ్మరసం మీ జీర్ణవ్యవస్థను పూర్తిగా మెరుగుపరుస్తాయి, అలాగే మీరు మీ రోజును ప్రారంభించినప్పుడు తాజాగా అనుభూతిని పొందేలా చేస్తాయి.


ధ్యానం తప్పనిసరి :-


మీరు ధ్యానం (లేదా) యోగా చెయ్యడానికి - శాంతియుత, ప్రశాంతమైన వాతావరణం అనేది కేవలం సూర్యోదయం అయినప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి అదే మీకు అనుకూలమైన సమయం. మీ శరీరాన్ని & మనస్సు విశ్రాంతిగా ఉంచడం కోసం మీరు 10-15 నిమిషాల పాటు ధ్యానము చేయండి. ధ్యానం, మీ మనస్సును మాత్రమే ఉపశమనపరచటం కాకుండా, మీ బరువు పెరగటానికి ముఖ్యమైన కారణాలలో ఒకటైన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది,

మీ పనిలో మరింత శ్రద్ధను & దృష్టిని ప్రేరేపించేలా చెయ్యడంలో సహాయపడుతుంది. అవసరమైన పరిస్థితులలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం బాగా సహాయపడుతుంది.


సీజన్ ప్రకారం వచ్చే పండ్లను తినండి :-


ప్రకృతి మనకు ప్రతి సీజన్లో పండ్లను & కూరగాయలు పుష్కలంగా అందిస్తుంది. ఉదాహరణకు :- వేసవిలో మనము వేడితాపాన్ని తట్టుకునేలా ఉండేందుకు ఈ ప్రకృతి మనకు తాజా శక్తిని అందిచేలా సహాయపడే కార్బోహైడ్రేట్ కంటెంట్తో ఉన్న పండ్లను మనకి అందించి మన శక్తిని పెంచడమే కాక, మనల్ని మరింత కూల్గా కూడా ఉంచుతుంది.


వాకింగ్ తప్పనిసరి :-


మీరు అధిక మొత్తంలో భోజనాన్ని తీసుకున్న తర్వాత కొంచెం దూరం నడవటంపై దృష్టిని పెట్టండి. మీరు తక్కువ దూరాలు ఇలా నడవటం వల్ల పెరిస్టాలిసిస్ & జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఒక గొప్ప మార్గంగా ఉంటుంది. మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత కొంత దూరం వరకు నడక సాగించటం మంచిది. సగటు వేగంతో మీరు సుమారుగా 10-20 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది. మీ జీర్ణక్రియను మరింత మెరుగుపరచడానికి, 10 నిమిషాల నడక తర్వాత మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం చాలా మంచిది.


తగు సమయానికి భోజనం చెయ్యండి :-


ఒక రోజులో 3 పూటలు మాత్రమే భోజనం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఇలా కాకుండా మీకు నచ్చిన సమయంలో కోరిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, మీ శరీరంలోనికి అవసరంలేని కేలరీలు అధికమొత్తంలో చేరటంవల్ల మీ శరీర బరువు పెరిగేలా ప్రేరేపిస్తుంది. కావున ఈ అలవాటును మీరు మానుకోవాలి.

మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలో మీరు అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకోవచ్చు. అలా అని మీరు మీ అల్పాహారాన్ని మాత్రం దూరం చేయవద్దు ఎందుకంటే మీ రోజును ప్రారంభించడంలో మీరు తీసుకునే మొదటి భోజనం ఇది. కాబట్టి మీరు అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల ఆ రోజంతా శక్తివంతులుగా ఉంటూ, బాగా పనిచేయగలుగుతారు. ఉదయం 8-9 గంటల మధ్యలో మీ అల్పాహారం ఉండేటట్లుగా నిర్ధారించుకోండి.


మీరు ఎక్కువగా నీటిని తాగండి :-


మీ శరీర బరువు తగ్గడానికిగానూ, మీ శరీరంలో నీటి స్థాయిలను అతిగా పెంచడమనేది అత్యంత ప్రభావవంతమైన చిట్కాలలో ఒకటి. ప్రతిరోజూ మీరు కనీసం 8 - 10 గ్లాసుల నీటిని తాగాలి. భోజనానికి ముందు నీరు తాగటం వల్ల మీ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

మీరు మినరల్ వాటర్ కంటే, సాధారణమైన నీటిని తాగడానికి ఉపయోగించండి ఎందుకంటే ఇవి ఎటువంటి ఫ్లవర్స్ను కలిగి ఉండవు. మీరు శరీర బరువును కోల్పోయే క్రమంలో అన్ని రకాల పానీయాలు కన్నా మొట్టమొదటి స్థానంలో రంగు, రుచి లేని ఈ సహజమైన నీరే అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అలాగే ఇది సహజసిద్ధంగా అని చోట్ల కూడా లభిస్తుంది.


త్వరగా పడుకొని, త్వరగా లేవాలి :-


మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో పటిష్టమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉండాలని కోరుకుంటే ఈ పాత సామెతను తప్పక ఆచరించాలి. అది

'ఒక వ్యక్తి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షును కలిగి ఉండటానికి రాత్రిళ్ళు త్వరగా పడుకొని, తెల్లవారుజామునే త్వరగా నిద్ర లేవాలి' !


మీ అమ్మమ్మలు తాతయ్యలు వారి నడి వయస్సులో కూడా పటిష్టమైన శరీరాన్ని కలిగి, ఎలా ఆరోగ్యంగా ఉన్నారో అని - మీకు ఆశ్చర్యం కలగక మానదు. వారు పాటించే రోజువారి కార్యాచరణను మీరు గమనించినట్లయితే, వాళ్ళు రాత్రిళ్ళు త్వరగా నిద్ర పోయి - తిరిగి వేకువజామునే లేస్తారు. కానీ మీరు దీనికి విరుద్ధంగా, టీవీలను చూస్తూ / ఆన్లైన్లో మీ స్నేహితులతో చాట్ చేస్తూ రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా నిద్రపోతారు.


           ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు...ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి.

ధన్యవాదములు.

ప్రతీ సంవత్సరం మీ గ్రోత్ చూసుకోండి.

 భారతీయుల సగటు సంపాదన సంవత్సరానికి 1,27,000. 

సంవత్సరానికి 5,00,000 దాటితేనే మీరు ట్యాక్స్ కట్టొచ్చు. నెలకి 42,000. 

అంటే మీరు నెలకి 40,000+ సంపాదిస్తేనే మీరు మిడిల్ క్లాస్ కేటగిరీలోకి వస్తారు. అంతకంటే తక్కువ ఉంటే పేదవారే. 


ఒకప్పుడు బ్యాంక్ లో డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలకి డబ్బులు రెట్టింపు అయ్యేవి. ఇప్పుడు అలా లేదు. కొన్ని బ్యాంక్లు 3% కూడా ఇవ్వట్లేదు. వ్యాపారవేత్తలు లోన్స్ కట్టకపోతే నష్టపోయేది సామాన్య ప్రజలే. బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేసి దాచుకుంటే మాత్రం మీరున్న స్థితి నుంచి కిందకి పడిపోతారు. 


ప్రతీ సంవత్సరం డబ్బు విలువ సగటున 12% - 14% పెరుగుతూ ఉంటుంది. 

ఉదాహరణకి మీ సంపాదన నెలకి 30,000 అయితే అది కనీసం 7 సంవత్సరాలలో 60,000 అవ్వాలి. మీ ఆస్తి కూడా ప్రతీ 7సంవత్సరాలకైనా రెట్టింపు అవ్వాలి. అప్పుడే మీరు ఉన్న మిడిల్ క్లాస్ లో ఉంటారు. 

అలా కాకుండా మీ డబ్బు పదేళ్ళకు రెట్టింపు అవుతుంటే మాత్రం మీరు మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ కీ, ఆ తర్వాత పేదరికంలోకీ పడిపోతారు. 


బ్యాంక్ లో డబ్బుకి భద్రత ఉంటుంది. 

కానీ బ్యాంక్ లో డిపాజిట్ చేసి దానితో బతకాలనుకుంటే మీ జీవనానికి భద్రత ఉండదు. 


మీ ఇంట్లో లక్ష ఉంటే సంవత్సరం తర్వాత కూడా లక్షే ఉంటాయి. కానీ ఇప్పుడు లక్షకి వచ్చే వస్తువుల విలువ సంవత్సరం తర్వాత 10%-15% పెరిగి ఉంటుంది. 


“”ఉన్న చోటే ఉండడమంటే వెనక్కి వెళ్ళడమే””


మీ డబ్బు ప్రతినెలా 2% పెరిగేలా చూసుకోండి. 4 ఏళ్ళలో రెట్టింపవుతుంది. అలా ప్రతీ నాలుగేళ్ళకీ మీ డబ్బు రెట్టింపవుతూనే ఉండాలి. 


డబ్బు మీద ఆలోచనలు లేకపోవడం(ఆశ కాదు), జీవితంలో లక్ష్యాలు లేకపోవడం గొప్పవిషయమేమీ కాదు. కొంతమంది అసమర్థతని గొప్పతనంగా చెప్పుకుంటారు. 


సగటున మీ ఆస్తి ప్రతీ నాలుగేళ్ళకీ పెరుగుతుంటే 12 ఏళ్ళకి మీరు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కేటగిరీకీ, 20-24 ఏళ్ళలో హై క్లాస్ కేటగిరీలోకీ వెళ్తారు. 


ఒకరి సంపాదనతో నలుగురు బతికే పరిస్థితి మార్చుకోండి. 

ఇంట్లోనే ఉంటూ మీ వ్యాపకాల ద్వారా సంపాదించండి. 

కొత్త వ్యాపకాలు అలవాటు చేసుకోండి. 

డబ్బుని ఇన్వెస్ట్ చేయండి. అవి పెరుగుతూ ఉంటాయి. 


పాసివ్ ఇన్ కమ్ క్రియేట్ చేసుకోండి. మీరు హాలిడేకి వెళ్ళినా మీ డబ్బు డబ్బుని సంపాదించాలి. 


ప్రతీ సంవత్సరం మీ గ్రోత్ చూసుకోండి. 


పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు. 

పేదవాడిగా జీవించడం మన తప్పే. 


మన దేశంలో మొదటి లక్షమంది ధనవంతుల దగ్గర 50 కోట్లమంది దగ్గర ఉన్నంత డబ్బు ఉంది. 


97% జనాభా దగ్గర ఉన్న డబ్బు కంటే 

3% ధనవంతుల దగ్గరే ఎక్కువ ఉంది. 


“సంపాదించడం చేతకాని వారే డబ్బు హీనమైనదని చెప్తారు”. 


                   ~~~~ శ్రీనివాస శర్మ ~~~~


#copied

దక్షిణామూర్తి స్తోత్రం,*

 *దక్షిణామూర్తి స్తోత్రం,*:

ఏ స్తోత్రము లు చదవాలో తెలియక సమస్యలు ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణంగా సకల సమస్యలని పరిష్కారం చూపుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే తదేకంగా స్వామి వారిని చూస్తే చాలు బుద్ది మాంద్యం తొలగి పోతుంది.!!! ఈ దక్షిణా మూర్తి శ్లోకం చాలా మహిమాన్వితమైనది.  ఈ శ్లోకం నిత్యం పఠిస్తే విద్య ఎంతో బాగా వస్తుంది. ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. కేవలం విద్య మాత్రమే కాదు .. విద్యార్థులకు విద్యని.. సాధకులకు జ్ఞానాన్ని.. అటుపిమ్మట సిద్ధ స్థితిని కూడా ఇవ్వగలిగే మహిమాన్విత " స్తోత్రం "... క్రింది లింకులో స్తోత్రము మరియు దానిని తప్పు లేకుండా ఎలా చదవాలో వివరంగా ఉంచాము చూడండి

👇👇👇

.https://tinyurl.com/69fa4f22 

🙏🙏🙏

జన్మ ఒక పరీక్ష

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷జన్మ ఒక పరీక్ష. గెలిస్తే మోక్షం. ఓడితే మరుజన్మ🌷* 

**పరచింతన పాపాన్ని పెంచుతుంది.  పరమాత్మ చింతన 

మొక్షాన్నిస్తుంది.

**పరమాత్మని పట్టుకోవాలంటే , సద్గుణం అనే తాడుని 

పట్టుకొని తిరగాలి.  పరమాత్మ దొరికేవరకు పరుగులు తప్పవు.

**చేసిన పాపం నుండి రక్షించబడాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి .

**భగవంతునికి కృతజ్ఞతగా బంగారం యిచ్చినా సరిపోదు . 

ఒక్క మనస్సుని కరిగించి ఆ ద్రవాన్ని అభిషేకించాలి ఆంతర్యంలో.

**మనం అడగకుండా పరమాత్మ యిస్తాడన్నదీ సత్యమే . 

అడిగితేనే గానీ యివ్వడన్నదీ సత్యమే.  ఎందుకంటే, అడగకుండా 

జీవితానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు.  మోక్షం మాత్రం 

అడిగిగేనే యిస్తాడు.

**మనస్సనే తెరని అడ్డు తొలగిస్తే , రాబోయే కాలాన్ని చూడొచ్చు .

**మనస్సు తో ఉంటె అన్నీ నియమాలు, హద్దులు.

మనస్సును వదిలేస్తే, అంతా స్వేచ్ఛే.

**సుఖదుఃఖాలు స్పందించకుండా ఉంటె బ్రహ్మంగా ఉన్నట్లే.

**మనసు గంగలా ఎత్తు పల్లాలు అనే జన్మలు ఎత్తినా, చివరికి మోక్ష సంద్రం లో కలవక తప్పదు.

**మానసిక భక్తి తైలం వంటిది.  అది నిండుగా ఉన్నంతకాలం 

జ్ఞాన దీపం వెలుగుతూనే ఉంటుంది.  మోక్ష మార్గం 

చూపుతూనే ఉంటుంది.

** భగవంతుడు కరుణించడమే మనలోని మార్పు.

**పరమాత్మ ఎవరిని కరుణిస్తాడో వారినే మారుస్తాడు.  

ప్రపంచాన్ని మార్చడు.

**జీవితంలో ప్రతీ సంఘటన పరమాత్మ పెట్టే పరీక్షలే.  అవి తట్టుకొని భగవంతుని వీడకుండా ఉండుటయే గెలుపు.

తట్టుకొనలేక  తిట్టుకోవడమే ఓటమి.  అదే మరుజన్మ.

**తల్లి పసిబిడ్డ నడకని చూసి ఆనందిస్తుంది.

పరమాత్మ మనిషి నడతని చూసి ఆశీర్వదిస్తాడు.

**మౌన పోరాటం చేసి ఇంద్రియ దౌర్జన్యాన్ని గెలిచి మోక్ష సామ్రాజ్యాన్ని సాధించాలి . మొహమే నీకు పెట్టిన పరీక్ష.  మనో మౌనమే నీకు రక్ష.

**జ్ఞాని భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది.  అజ్ఞాని భవిష్యత్తు 

మాయ చేతుల్లో ఉంది.

**భగవంతుడ్ని గుర్తించేవరకు మన బాట ముళ్లబాటగానే ఉంటుంది.   తెలుసుకొన్న క్షణం నుండి మల్లెపూలై;

పూల బాటగా మారుతూ ఉంటుంది.  కానీ లోతుగా 

ఆలోచిస్తే, మారేది బాట కాదు , మనస్సు.

**భగవంతునికి మనకి మధ్య కోరికలే అడ్డు.  అవి లేకుంటే పరమాత్మ యిచ్చే జ్ఞానం మనకి అర్ధం అవుతుంది.

**కోరికలు, అహంకారం, మమకారం వీడి, ఆశని విడచి 

సంచరించు పురుషుడు శాంతిని పొందుతాడు.  

**నేను బ్రహ్మమును.  అంతా బ్రహ్మము.  సర్వమునకు 

ఆధారము బ్రహ్మమే.  తానుగా అనుభవించడమే బ్రాహ్మీ స్థితి . దీనిని పొందాక ఇక భ్రమించడు. యిందులో చివరివరకు నిలిచి బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు.  

**చైతన్యం లో మనస్సుకు సంకెళ్లు వేయాలి.  నేను దేహమును కాదు. నేను బ్రహ్మమును, అనే గొలుసు 

మనస్సుకు ముందుగా వేయాలి. అప్పుడు మనస్సు తన ప్రయాణమును ఆపి లోపలకు చూసుకొంటుంది.  దేహ లక్షణాలు వదులుకొని బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా మిగులుతుంది.  అవిద్య పొర తొలగిన జీవుడే బ్రహ్మము.


 *సర్వం బ్రహ్మార్పణం.*

 *సేకరణ* :- వాట్సాప్ పోస్ట్.

తిరుమలలో శ్రీవారికి నైవేద్యాలు

 తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి..??


👉 ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..?? 


➢ 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 


⚫ అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం. 


➢ 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO " .. 


⚫ దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.

➢ ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..

⚫ ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు. 


➢ అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.)

ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది...

స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.... 


⚫ మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు  తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.. 


➢ శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 


⚫ అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 


➢ అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని  గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది.. 


⚫ తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే  తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు...... 


➢ ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.

మనోవ్యధ తో   మంచం పట్టి నేరుగా ని సేవలో  పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 


⚫ అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... ఈ గంగాళలను ఇప్పటికీ

" మన్రో గంగాళాలు "  అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి...

శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు. 


➢ తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు. 

భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...

శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ..నలుగురికి తెలియజెప్పండి.. 


ఓం నమో వెంకటేశాయ..! 🙏

ఓం నమో వెంకటేశాయ..!🙏🙏

ఓం నమో వెంకటేశాయ..!🙏🙏🙏 


➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏

! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ.

 kgm Indraganti sankar 3:

*!! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ. !!*                                                   >>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<<

 తరువాతదేవికి *"లమిత్యాదిపం చపూజ"* చేస్తారు.గురుధ్యానం కూడా చేస్తారు.                                     


వేయినామాలు,ఇది శ్రీదేవివేయినా! అమ్మనుస్తుతించే ప్రధాన భాగము. ఉదాహరణగా కొన్ని శ్లోకాలుఇక్కడ వ్రాయడమైనది.1,2,3వ,శ్లోకములు *శ్రీమాతా,శ్రీమహారాజ్ఞీ,శ్రీమత్సిం హాసనేశ్వరీ!.*                                             చిదగ్నికుండ సమ్భూతా దేవకార్య స ముద్యతా!ఉద్యద్భానుసహస్రా భా,చతుర్బాహుసమన్వితా!రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశో జ్వలా!మనోరూపేక్షుకోదండా పంచ తన్మాత్రసాయకా!నిజారుణ ప్రభా పూరమజ్జ ద్బ్రహ్మాండ మండలా!.


21వ, శ్లోకము,సర్వారుణా ఽనవ ద్యాంగీ సర్వాభరణ భూషితా!శివ కామేశ్వరాంకస్థాశివాస్వాధీనవల్లభా!.52వ,శ్లోకం,సర్వశక్తిమయీ,సర్వమంగళా! సద్గతిప్రదాసర్వేశ్వరీసర్వ మయీసర్వమంత్రస్వరూపిణీ!.


65వ శ్లోకము,భానుమండల మధ్య స్థా భైరవీ భగమాలినీపద్మాసనాభగ వతీ పద్మనాభ సహోదరీ!


70వశ్లోకము,నారాయణీనాదరూపా నామరూపవివర్జితాహ్రీంకారీ హ్రీ మతీహృద్యాహేయోపాదేయవర్జితా!.


118వ, శ్లీకము,ఆత్మవిద్యా మహావి ద్యాశ్రీవిద్యాకామసేవితాశ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా!.


130వ, శ్లోకము,ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీసర్వధారాసుప్ర తిష్ఠా సదసద్రూపధారిణీ!.


148వ శ్లోకముదురారాధ్యా దురాధ ర్షాపాటలీకుసుమప్రియామహతీమే రునిలయామందారకుసుమప్రియా!.


172వ శ్లోకముస్తోత్రప్రియా స్తుతిమ తీ శృతిసంస్తుత వైభవామనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః!.


182, 183, 184వ, శ్లోకములు, (చివరి మూడు)

అభ్యాసాతిశయజ్ఞాతాషడద్వాతీతరూపిణీ,అవ్యాజకరుణామూర్తిరజ్ఞా నధ్వాందీపికా,ఆబాలగోపవిదితా స ర్వానుల్లంఘ్యశాసనా,*"శ్రీ చక్ర రాజనిలయా,శ్రీమత్త్రిపురసుందరీ,శ్రీశివా,శివశక్త్యైక్యరూపిణీ,లలితాంబికా!!.*

ఏవం శ్రీలలితాదేవ్యాం నామ్నాం సాహస్రకం జగుః!!


*-: ఉత్తర పీఠిక :-  (ఫలశృతి)* 

~~~~~                                          

మూడవ అధ్యాయం అయిన *"ఉ త్తర పీఠిక"* లో ఫలశృతి చెప్ప బ డింది.                                    అందులో హయగ్రీవుడలువారుఅగ స్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు:


శ్రీలలితాసహస్రనామములురహస్య మయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడాపోగొట్టు ను.రోగాలనునివాఱించిదీర్ఘాయుర్దాయమును ప్రసాదిస్తాయి.              *"సకలసంపదలనూకలిగిస్తాయి".*                                                   ఈ స్తోత్రమును శ్రద్ధా సక్తులతో విధి విధానుసారముగా పఠించాలి.                అన్ని పాపాలను హరించడానికి శ్రీల లితాదేవియొక్క,ఒక్కనామం,చాలును. భక్తుడైనవాడు నిత్యము గాని, పుణ్యదినములయందుగాని ఈ నా మపారాయణ చేయాలి.                            విద్యలలో శ్రీవిద్య, దేవతలలోశ్రీలలి తాదేవి, స్తోత్రాలలో శ్రీలలితాసహస్ర నామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్య నామపారాయణ అనే భాగ్యాలు అ ల్ప,తపశ్వినలకులభించవు,భక్తిహీనులకు,దీనినిఉపదేశింపరాదు.            ఈ శ్రీ లలితాసహస్రనామస్తోత్రము ను తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.


*-: అర్ధాలు, రహస్యార్ధాలు :-* 

~~~~~                                              

ఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా శ్రీ లలితా సహ స్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులుభావి స్తారు.                                                   నామాలలో అనేకమంత్రాలు,బీజాక్ష రాలు నిక్షిప్తమై యున్నాయనికూడా వారి విశ్వాసము, ముఖ్యంగా శాక్తే యులకు ఇవిచాలా విశిష్ఠమైనవి.                                                           ఈ శ్లోకంలోనినామాలఅర్ధాలను,భా వాలనుఅనేకులువ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగాకొ న్ని విభాగాలుగాచేసి, ఒక్కొక్కవిభా గం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికిచెందినట్లుగాభావిస్తున్నారు.                                                      


సృష్టి ,స్థితి ,సంహారము,తిరోధానము,అనుగ్రహము -అనేపంచకృత్య  ములకు అనుగుణంగా ఈ శ్లోకాల లోనినామములుకూర్చబడినాయని ఒక వివరణ, దేవి *"పంచకృత్య పరాయణ"* అని వర్ణింపబడింది.                              


సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యాసర్వావస్థా వివర్జితాసృష్టికర్త్రీబ్రహ్మరూపాగోప్త్రీ గోవిందరూపిణీ -- (63) సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ,సదా శివానుగ్రహదా పంచకృత్య పరాయ ణా -- (64)శ్లోకం.


అనగాదేవిబ్రహ్మరూపిణియైసృష్టిని, విష్ణు (గోవింద) రూపిణియై స్థితి కా ర్యమును, రుద్రరూపిణియై సంహార మును, ఈశ్వరియైతిరోధానమును, సదాశివమూర్తియై అనుగ్రహమును నిర్వహించుచున్నది.


మొదటి శ్లోకంలోని మొదటిమూడు నామములు - *"శ్రీమాత, శ్రీ మహా రాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి - కూ డా సృష్టి, స్థితి, సంహారములను, సూచించుచున్నవి".*                                    ఆలాగే తరువాతవి రెండు నామ ములు - *"చిదగ్నికుండ సమ్భూ తా, దేవకార్యసముద్యతా"* - అనునవి తిరోధానమును, అనుగ్ర హమును,సూచించుననిఅంటారు.        .                                                                   *ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేన మః.*

                                                          (శక్తిఆరాధనయేశ్రీచక్రఉపాసన.)                .    *సర్వేషాంశాన్తిర్భవతు.*                        .                          *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*


*!! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ. !!*                                                   >>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<<<                                     *"ఉద్యద్భానుసహస్రాభా"నుండి "శింజానమణిమంజీర మండితశ్రీ పదాంబుజా"* వరకు శ్రీ దేవి కేశాది పాద సౌందర్య వర్ణన ఉన్నది.                                                                   తరువాత దేవి ఆవాసమైన చింతా మణిగృహవర్ణన,ఆపైభండాసురసం హారము, కుండలినీశక్తికి సంబంధిం చిన నామాలు ఉన్నాయి.                                                                          ఆతరువాతఅనేకవిద్యలు,పూజలు,మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయి అంటారు.                                                                                                

                                                          

మరికొందరు విశ్లేషకులు ఈ వెయ్యి నామాలను వందేసి నామములున్న పది విభాగాలుగా చెబుతారు.                                                                                          ఆ పది విభాగాలలోనిమొదటినామ ముల క్రమం ఇలా ఉన్నది. -


*శ్రీమాతా - చూడండి!:* శ్రీలలితా సహస్ర నామములు - 1-100.మణి పూరాంతరూఢితా - చూడండి!:శ్రీల లితా సహస్ర నామములు - 101 - 200.సద్గతిప్రదా - చూడండి!:శ్రీలలి తాసహస్రనామములు-201-300.హ్రీంకారీ - చూడండి!: శ్రీ లలితాస హస్ర నామములు - 301- 400.వివి ధాకారా - చూఋడండి!: శ్రీ లలితా సహస్ర నామములు - 401-500.గు డాన్నప్రీతమనసా-చూడండి!: శ్రీలలి తాసహస్ర నామములు-501- 600. దరాందోళితదీర్ఘాక్షీ-చూడండి!: శ్రీ ల లితా సహస్ర నామములు - 601 - 700.దేశకాలపరిచ్ఛిన్నా - చూడం డి!: శ్రీలలితాసహస్రనామములు - 701- 800.పుష్టా - చూడండి!: శ్రీ ల లితా సహస్ర నామములు - 801- 900.నాదరూపిణీ - చూడండి!: శ్రీ లలితా స హస్ర నామములు - 901 -1000. శ్రీ విద్య, శ్రీ లలితా సహస్ర నామము,శ్రీ లలితా సహస్రనామపా రాయణ.(మంత్రము), శ్రీచక్రపూజ. (యంత్రము),కుండలినీయోగసాధన.(తంత్రము),- అనేవి, శ్రీ విద్యోపా సనలో ముఖ్యమైన అంశములు.                                                                               సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణబ్రహ్మో పాసన, అనే రెండు విధానాలు, ఈ విద్యాసాధనలో నిక్షిప్తమైఉన్నాయి. యోగసాధనలోచెప్పబడేషట్చక్రము లు (1.మూలాధార చక్రము, 2,స్వా ధిష్ఠాన చక్రము, 3.మణిపూరక చక్ర ము, 4.అనాహత చక్రము, 5.విశు ద్ధిచక్రము, 6.ఆజ్ఞాచక్రము)ఇవి శ్రీ లలితా సహస్రనామంలో చెప్పబడి నాయి. ఈచక్రములను, అధిగమిం చి,సహస్రారములోకొలువై,యున్నజగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవ డమే!కుండలి నీ యోగసాధనలోని ముఖ్యలక్ష్యం.                                                           

                                                         

ఇలా లలితాసహస్త్రనామంగురించి ఎంత చెప్పుకున్నా!అదితక్కువే !అ వుతుంది..తెలుసు కుంటున్నకొద్దీఆ శ్చర్యంగానే ఉంటుంది!...శ్రీ లలితా సహస్త్ర నామములోఒక్కనామము తోనే!మహోన్నతిస్థితిని పొందినవా రు ఉన్నారు!!......                                               ఒక్కోనామాన్నిహోమంలోసంపుటీకరణ చేసినప్పుడు ఒక్కోనామముఒ క్కో బీజాక్షరంగా వ్యక్తం అయినట్లు నిరూపించబడినది..........ఇలాంటినామములను మనమురోజూపారా యణచేద్దాము!!...                                         .                                                            *ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేన మః...*                                                .                                                                                                                (శక్తిఆరాధనశ్రీచక్రఉపాసన).                  .                                                  *సర్వేషాంశాన్తిర్భవతు.*                     .                                                             *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.             సింగరేణి సూపర్ బజారు వెనుక.        కొత్తగూడెం. భద్రాద్రికొత్తగూడెం జిల్లా.తెలంగాణారాష్ఠ్రం.*

భారతదేశం తయారు చేసిన ఉత్పత్తి లను మాత్రమే కొందాం & వాడుదాము

 దేశాన్ని బాగు పరచడం కోసం మీరు చెయ్యాలి అని తలచుకుంటే ఉదాహరణ : మా ఇంటి పక్కన వెంకటరెడ్డి గారని ఒక పెద్దాయన రిటైర్ అయ్యాక,ఉన్న కాస్తపొలం కౌలుకిచ్చి పెన్షన్/కౌలు డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారు,

ఒకటో తారీఖు అనుకుంటా, పొద్దున్నే సందు చివర షాప్ కి వెళ్లి 500 రూపాయల సరుకులు కొన్నారు.ఆ షాప్ అబ్బాయికి కూడా ఒకటో తారీఖు కదా అని పక్కన బిరియానీ పాయింట్ లో బిరియానీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.ఆ బిరియానీ షాప్ ఆయనేమో రోజూ బిరియానీ ఏం తింటాంలే అనుకున్నాడేమో, పక్కన కర్రీ పాయింట్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు.ఆ కర్రీ పాయింట్ అబ్బాయి ఆ పక్కన ఉన్న కూర గాయాల షాపులో ఆ డబ్బులతో కూరగాయలు కొన్నాడు.కూరగాయల షాప్ అబ్బాయి సాయంత్రం రైతుకి కూరగాయల డబ్బులు ఇచ్చి లెక్కరాసుకున్నాడు.రైతేమో వెంకటరెడ్డిగారి పొలం కౌలుదారు, పొలం కౌలు డబ్బులు తెచ్చి వెంకటరెడ్డి గారికి ఇచ్చేశాడు.

కథ ఐపోయింది. ఐతే ఒక్క నిమిషం : ఈజీ లెక్క కోసం, అందరూ తమ దగ్గరికి వచ్చిన 500 /- రూపాయల నోటు పూర్తిగా ఖర్చుపెట్టారు, వాళ్లకు అదే ఆధారం అనుకుంటే,

ఈ కథ లో మొత్తం ఎకనామిక్ ఆక్టివిటీ వచ్చేసి

500x6 = 3000 రూ ( GDP అంటారే., అదే ఇది )అదే 500 రూపాయలు మళ్లీ వెంకట రెడ్డి గారి జేబులోకే వచ్చేసినా, ఊరులో కనీసం 6 కుటుంబాలు లాభ పడ్డాయన్న మాట.

కనుక ఇదే వెంకటరెడ్డిగారు అదే 500 తీసుకెళ్ళి ఏ ఫారిన్ కంపెనీ లోషనో లేదా ఏ విదేశీ తయారు చేసిన చెత్త, చెదారం నో కొన్నారనుకోండి, ఆ మిగిలిన 5 కుటుంబాలు ఆ రోజుకు పస్తన్న మాట.చైనా వాడి GDP మనకన్నా ఎక్కువ ఉంది. అమెరికా is very developed. What is India అభివృద్ధి అని బాధ పడకుండా,

వీణ్ణీ వాణ్ణీ తిట్టక్కర లేకుండా,దేశాన్ని బాగు పరచటం ఎలాగో తెలిసింది కదా,

 కనుక మన భారతదేశం తయారు చేసిన ఉత్పత్తి లను మాత్రమే కొందాం & వాడుదాము 

& మన వస్తువులను మాత్రమే వాడదాం స్వాభిమానంతో జీవిద్దాం 


From : *sri satya sai dhyana mandali,* 


       *శ్రీ రంజిత్ గురూజీ,*

 🙏🙏ధన్యవాదాలు 🙏

పెళ్లితంతు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*పెళ్లితంతు*


పెళ్లి తంతులో తమాషా,ఫోటోగ్రాఫర్ల అతి ప్రవర్తన.


ఈ మధ్యన జరుగుతున్న శాస్త్రీయబద్ధమైన పెళ్లిళ్లలో ఫొటోగ్రాఫర్ల ప్రవర్తన అతివింతగా వుంటోంది.ఆ వేదిక మీద ఐదారుగురు కెమెరామెన్లు గొడుగులు పట్టుకుని కళ్యాణవేదికను ఆక్రమించేస్తున్నారు అసలు కార్యక్రమం నిర్వహించే పురోహితుడి పాత్రని తగ్గించేసి, వీరే ఆ పాత్రని నిర్వహిస్తున్నారు. 

 

       వాళ్ళవైపు చూడమనడం మూడుముళ్లు కట్టిన తరువాత మరోసారి కడుతున్నట్టుగా నటించమనడం,ఒకసారి అక్షితలు వేసిన తరువాత మరోసారి ఫోటో కోసం వేస్తున్నట్టు చేయి పెట్టమనడం, తాళిబొట్టును రకరకాల యాంగిల్స్ లో నేలమీద పెట్టి, దానిమీద పూలు ఎగరేస్తూ ఫోటోలు తీయడం,ఒకటేమిటి? వధూవరుల మధ్యలో పడుకుని ఫోటోలు తీసేయడం 


         ఇవి చాలదన్నట్లు నెత్తిమీద వెంట్రుకలు చెల్లా చెదురయ్యేలా పైన ద్రోన్  ఎగరేస్తూ ఏదొ శత్రు సైన్యాలను ఫోటోలు తీస్తున్నట్టుగా హాలంతా పైనుంచి తీస్తూ ఒకటే అలజడి సృష్టిస్తున్నారు.


      మరో వెఱ్ఱి కూడా ఈ మధ్యే మొదలైంది  పెళ్లికి ముందు షూటింగ్ అట కాబోయే వధూవరుల భంగిమలు..వాటేసు కోవటాలు,ఎత్తేసుకోవడాలు,గిరగిరా తిప్పేయడాలు లాంటి వ్యక్తిగతానికి సంబంధించినవి పెళ్లికి ముందు చేయటమే తప్పు పైగా , వందలమందిలో ఆ LED Screens పై చూపించడాలు ఏమిటీ ఈ విపరీత బుద్ధులు?


నాకు తెలిసి ఏ మతం దీనికి సమ్మతం కాదు. కానీ ట్రెండ్ అయింది

    ఇదంతా వధూవరుల తల్లి దండ్రుల సమ్మతి తోనే,వారించవలసిన అవసరం లేదా? వధూవరులు ఏమైనా

ప్రదర్శన వస్తువులా?

శాస్త్రీయబద్ధంగా ,ఘడియలు విఘడియాలు లెక్కేసి మరీ  ముహూర్తం నిర్ణయం చేసి పెళ్ళి చూపుల తో మొదలై పెళ్లితంతు, ఆ పై తంతు నిర్వహిస్తున్నప్పుడు ఇది వాటికి విరుద్ధంగా లేదని అనిపించడం లేదా?


*పెళ్ళిసందడి జ్ఞాపకాలను పదిలం కొసం ఫోటోలు, వీడియోలు కానీ ఫోటోలు, వీడియోల కోసం పెళ్లి కాదని గుర్తించాలి కొంచమైనా విజ్ఞత పాటించాలి*.

*సేకరణ* :- వాట్సాప్ పోస్ట్.

*ఆది శంకరాచార్యుల వైభవం* :-

 


*ఆది శంకరాచార్యుల వైభవం* :-

ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.


*గణపతి స్తోత్రాలు*:

గణేశ భుజంగ స్తోత్రం

గణేశ పంచరత్న స్తోత్రం

వరద గణేశ స్తోత్రం

గణేశాష్టకం


*సుబ్రహమణ్య స్తోత్రాలు*:

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం


*శివ స్తోత్రాలు*:

అర్థనాదీశ్వర స్తోత్రం

దశస్లోకి స్తుతి

దక్షిణామూర్తి  స్తోత్రం

దక్షిణామూర్తి  అష్టకం

దక్షిణామూర్తి  వర్ణమాల స్తోత్రం

ద్వాదశ లింగ స్తోత్రం

కాల భైరవ  అష్టకం

శ్రీ  మృత్యుంజయ  మానసిక  పూజ  స్తోత్రం

శివ  అపరాధ  క్షమాపణ  స్తోత్రం

శివానందలహరి 

శివ భుజంగ స్తోత్రం

శివ కేశాది పదాంత వర్ణన స్తోత్రం

శివ మానస పూజ 

శివ నామావళి అష్టకం

శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం

శివ పంచాక్షర స్తోత్రం

శివ పంచాక్షర నక్షత్రమాల

సువర్ణ మాల స్తుతి

ఉమా మహేశ్వర స్తోత్రం

వేదసార శివస్తోత్రం

శివాష్టకం


*అమ్మవారి స్తోత్రాలు* :

అన్నపూర్ణ అష్టకం

ఆనంద లహరి

అన్నపూర్ణ స్తోత్రం

అన్నపురణ స్తుతి

అంబాష్టకం

అంబాపంచరత్నం

భగవతి మానస పూజ

భవాని అష్టకం

భవాని భుజంగం

బ్రమరంబ అష్టకం

దేవి భుజంగ స్తోత్రం

దేవి చతుశ్శస్త్య ఉపచార పూజ

దేవి పంచరత్నం

దేవి అపరాధ క్షేమాపణా స్తోత్రం

దేవి అపరాధ భజన స్తోత్రం

గౌరీ దశకం

హరగౌరీ అష్టకం

కాళి అపరాధ భజన స్తోత్రం

కామ భుజంగ  ప్రయత

కామబింబ అష్టకం

కనకధారా స్తోత్రం

శ్రీలలితా పంచరత్నం

మంత్రముత్రిక పుష్పమాలస్థావం

మాతృకా పుష్ప మాల స్తుతి

మీనాక్షి స్తోత్రం

మీనాక్షి పంచరత్నం

నవరత్నమాలిక

రాజరాజేశ్వరి అష్టకం

శారద భుజంగ ప్రయతా అష్టకం

సౌందర్యలహరి

శ్యామల నవరత్న మాలిక స్తోత్రం

త్రిపురాసుందరి అష్టకం

త్రిపురాసుందరి మనసపూజ స్తోత్రం

త్రిపురసుందరి వేదపద స్తోత్రం


*విష్ణు స్తోత్రాలు* :

అచుతాష్టకం

భగవాన్ మానసపూజ

భజగోవిందం

హరిమీడే స్తోత్రం

హరి నామావళి స్తోత్రం

హరి శరణాష్టకం

శ్రీ విష్ణు భుజంగ ప్రయతా స్తోత్రం

జగన్నాథాష్టకం

కృష్ణాష్టకం

లక్ష్మినృసింహ పంచరత్నం

నారాయణ స్తోత్రం

పాండురంగాష్టకం

రామ భుజంగ ప్రయతా స్తోత్రం

రంగనాథాష్టకం

లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రం

లక్ష్మినృసింహ కరవలమబ స్తోత్రం

షట్పది స్తోత్రం

విష్ణు పాదాదికేశాంత స్తోత్రం


*హనుమాన్ స్తోత్రాలు*

హనుమత్ పంచరత్నం


*ఇతర స్తోత్రాలు*:

మాతృ పంచకం

కౌపీన పంచకం

కళ్యాణ వృష్టి

నవరత్నమాలిక

పుష్కరాష్టకం

మొహాముద్గ్రహ స్తోత్రం


*క్షేత్ర స్తోత్రాలు*:

కాశి పంచకం

కాశి స్తోత్రం

మణికర్ణికాష్టకం

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం


*నదీ స్తోత్రాలు*:

గంగాష్టకం

గంగా స్తోత్రం

నర్మదాష్టకం

యమునాష్టకం


*ప్రకరణ గ్రంధాలు*:

అద్వైత అనుభూతి

అజ్ఞాన భోదిని

అమరు శతకం

అనాత్మశ్రీ వికర్హన

అపరోక్షానుభుతి

ఆత్మ-అనాత్మ వివేకం

ఆత్మ బోధం

ఆత్మజ్ఞాన ఉపదేసనవిధి

దృక్ దర్శన వివేకం

ఆత్మ పంచకం

అత్మశతకమ్

అద్వైత పంచకం

అత్మపూజ-పరపూజ

బాలబోధ సంగ్రహం

భోధసారం

అత్మచింతన

బ్రహ్మచింతన

బ్రాహ్మణా వలిమాల

ధ్యానాష్టకం

జ్ఞానగంగాష్టకం

గురు అష్టకం

జీవన ముక్త్యనందలహరి

యతి పంచకం

మణిరత్నమాల

మానిషా పంచకం

మాయా పంచకం

మతామ్నాయ

నిర్గుణ మనసపూజ

నిర్వాణ దశకం/సిధాంత బిందు

నిర్వాణ మంజరి

నిర్వాణ శతకం/ఆత్మ శతకం

పంచీకరణం

ప్రభోద సుధాకరం

ప్రశ్నోతర రత్నమాలిక

ప్రపంచసార తంత్రం

ప్రాతః స్మరణ స్తోత్రం

ప్రౌడానుభుతి

సదాచార సంతానం

సాధనా పంచకం/ఉపదేశ పంచకం

శంకర స్మృతి

సన్యాస పథ్థతి

సారతత్వ ఉపదేశం

సర్పత పంచారిక

సర్వసిధాంత సంగ్రహం

సర్వ వేదాంత సిద్దాంత సార సంగ్రహం

స్వాత్మ నిరూపణం

స్వాత్మ ప్రకాశికం

స్వరూపానుసంతానాష్టకం

తత్వ బోధం

తత్వ ఉపదేశం

ఉపదేశసహస్రి

వాక్యసిత

వాక్యవృతి

వేదాంత కేసరి

వేదాంత శతశ్లోకి

వివేకచూడామణి

ఏకస్లోకి

యోగ తారావళి


*భాష్య గ్రంధాలు* :

విష్ణు సహస్రనామ భాష్యం

లలిత త్రిశతి భాష్యం

యోగసూత్ర భాష్యం

భగవద్గీత భాష్యం

ఉపనిషద భాష్యం

బ్రహ్మసూత్ర భాష్యం

ఆది శంకరులు

 జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి ఆశీస్సులతో ......



ఆది శంకరులు, వారి  మొదటి ప్రయాణం కేరళలోని కాలడి నుండి ప్రారంభమై కాలినడకన మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డు వరకు  దాదాపు  1700 కిలోమీటర్ల ప్రయాణము సాగింది.  అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు ఎక్స్‌ప్రెస్ హైవేలు కలిగిన ఈ రోజులలో అయితే, రోడ్డు మార్గం ద్వారా  వాహనంపై ప్రయాణించడానికి దాదాపు 36 గంటల సమయం  పడుతుంది.  దట్టమైన అడవుల గుండా నడిచిన ఆ ప్రయాణం,  శ్రీ శంకరుని కాలంలో ఎంత సమయం పట్టిందో ఒక్క సారి ఆలోచించాలి.  అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని, హైందవ ధర్మాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంత వేత్త ఆది శంకరాచార్యులు.  


నర్మదా నది ఒడ్డున, శ్రీ శంకరులు తొలుత తమ గురువైన శ్రీ గోవింద భగవత్పాదుల దర్శనం పొంది, గురువుల నుండి పరంపరాగత క్రమ సన్యాసం స్వీకరించి, వారి వద్ద శాస్త్రాలను అభ్యసించినారు. పన్నెండేళ్ల వయస్సులోనే, వారు అన్ని శాస్త్రములను అధ్యయనం గావించి,  ఉపనిషత్తులలో ప్రకటించిన విధంగా అద్వైత సిద్ధాంతం లో నిమగ్నమైనారు. పదహారేళ్ల వయస్సులో,  వారు బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీతలకు భాష్యాలు వ్రాసినారు. వీటిని ప్రస్థానత్రయం  అని పిలుస్తారు. వేదాంత, పురాణేతి హాసాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడే అనేక ప్రకరణ గ్రంధములను, మరియు మనిషిని భక్తి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడే  వివిధ స్తోత్రములను రచించినారు.  


భక్తులను అనుగ్రహించడానికి విష్ణువు, శివుడు, అమ్మవారు  మొదలైన వివిధ రూపాలలో వ్యక్తమయ్యే పరమాత్మ ఒక్కడే అన్న వేదాంత  సూత్రాన్ని ఉటంకిస్తూ, బలపరుస్తూ, సమాజంలోని వివిధ వర్గాలను ఏకం చేయడానికి శ్రీ శంకరాచార్యుల వారు కృషి చేసినారు. 


మన దేశం నలువైపులా మూడుసార్లు, కాలినడకన ప్రయాణించి, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిచోటా ప్రచారం చేశినారు. ధర్మం మరియు వేదాంత సూత్రములను సదా ప్రజలకు అందుబాటలో వుంచడానికి మరియు అద్వైత వేదాంత వ్యాప్తికి అనుగుణంగా  వారు భారతదేశంలోని నలుదిశల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠములను స్థాపించినారు.  మఠ-ఆమ్నాయ స్తోత్రంలో ఇలా చెప్పబడింది:


చతుర్దిక్షు ప్రసిద్ధాసు ప్రసిద్ధ్యర్థం స్వనామతః ।

చతురోsథ్ మఠాన్ కృత్వా శిష్యాంశస్థాపయద్విభుః |॥ 1 ॥

చకార సంజ్ఞామాచార్యశ్చతురాం నామభేదతః ।

క్షేత్రం చ దేవతాం చైవ శక్తిం తీర్థం పృథక్పృథక్ ॥ 2 ॥


దక్షిణమున శృంగేరిలో శారదా పీఠమున తమ శిష్యులైన శ్రీ సురేశ్వరాచార్యులను, పశ్చిమమున ద్వారకా క్షేత్రములో  కాళికా పీఠమున శ్రీ పద్మ పాదాచార్యులను, తూర్పున జగన్నాథ క్షేత్రములో గోవర్ధన పీఠమున శ్రీ హస్తామలకాచార్యులను, ఉత్తరమున బదరికాశ్రమములో  జ్యోతిష పీఠమున శ్రీ తోటాకాచార్యులను అధిపతులుగా నియమించినారు. వారు పీఠమును, పీఠాధి దేవతను,  తీర్థమును మరియు ప్రతి పీఠమునకు మహా-వాక్యాన్ని కూడా నిర్ణయించినారు. (ఇంకా వుంది)

శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ  పాహిమాం….దాసోహం శృంగగిరి నాథ ...

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.





11. తాతగన్న తల్లి తమ తండ్రి గను తల్లి 

తన్ను గన్న తల్లి తల్లి తల్లి 

తల్లి శూద్రురాలు తానెట్లు బాపడో

 విశ్వదాభిరామ వినురవేమ.






: