18, జూన్ 2021, శుక్రవారం

అమ్మ అనుగ్రహం*

 *అమ్మ అనుగ్రహం* 

*****************

"డాక్టర్ గారు ఫోన్ చేసారు బ్లడ్ రిపోర్ట్ వచ్చిందిట "టైఫాయిడ్"అని చెప్పారు. అన్నారు "రామనాధం గారు.


"టైఫాయిడా!?.....అంది కంగారుగా శకుంతలమ్మ.


" ఓ పది రోజులు బాగా రెస్ట్ తీసుకుని.... జాగర్త గా మందులు వాడితే తగ్గిపోతుంది కంగారు పడకు" అన్నారు రామనాధం గారు.


"నా భయం,......కంగారు,.... జ్వరం గురించి కాదు.....జరుగుబాటు గురించి"....అంది నీరసంగా శకుంతలమ్మ.


"ఏదో తంటాలు పడాలి....తప్పదు మరి" అన్నారాయన.


"పెద్దమ్మాయి కి ఫోన్ చేసి చూస్తాను" అంటూ రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసారు.


"హలో..హలో....వసంతా!...ఆ...ఆ...నేనే నమ్మా!.....అమ్మ బ్లెడ్ రిపోర్ట్ లు వచ్చాయి,. టైఫాయిడ్...అని చెప్పారు....బాగా జ్వరం, ...ఒళ్ళు నెప్పులూ....బాగా నీరసంగా ఉంది."


"అయ్యో!! ఇప్పుడెలా నాన్నా! నేను వద్దామంటే మీ మనవడికి సెమిస్టర్ పరీక్షలు,....ఆయన కూడా ఉండటంలేదు, ఆయన ప్రోజెక్ట్ పనిమీద రేపు సింగపూర్ వెడుతున్నారు. నెల రోజుల వరకూ రారు.


మీరేమో అక్కడ ఒక్కళ్ళూ ఉండద్దంటే వినరు.వీలైతే ఎవరినైనా సాయం తీసుకుని ఫ్లైట్ లో వచ్చెయ్యండి" అంది.


"సరే.....చూస్తాం వసంతా! "అని స్పీకర్ ఆపి ఫోన్ పెట్టేసారు.


"పోనీ.....చిన్నదానికి ఫోన్ చేస్తారా!?.....అది రాగలదేమో".....అంది శకుంతలమ్మ ఆశగా!


సరేనంటూ, ఫోన్ రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసారు.


"హలో....హలో.... సుజాతా!...ఆ...ఆ...నేనే....అమ్మకి టైఫాయిడ్ అని చెప్పారు.ఓ పది రోజులు నువ్వు రాగలవేమోనని"......


"రేపటి నుండి నాకు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఉంది నాన్నా!.....లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని. మీకు కూడా స్పాండిలైటిస్, బేక్ పెయిన్ ఉన్నాయి కదా! అమ్మకి బాగా తగ్గేవరకూ ఏదైనా ఏజెన్సీ నుంచి అన్ని పనులకీ ఓ మనిషిని పెట్టుకుంటే మంచిది" అంది


"విన్నావుగా.....అదీ సంగతి" అన్నారు ఫోన్ ఆఫ్ చేసి.


"ఏంచేస్తాం ......ఎవరి ఇబ్బందులు వాళ్ళవి......మన తిప్పలేవో మనం పడవలసిందే"... అంది శకుంతలమ్మ.


శకుంతలమ్మ కి జ్వరం బాధ కంటె కూడా, మర్నాటి నుండి మొదలయ్యే "దేవీ నవరాత్రి పూజలు" గురించే ఎక్కువ బాధగా ఉంది. ప్రతి సంవత్సరం పది రోజులు కలశ పెట్టి నవావతారాలనూ, ప్రతి రోజూ పూజించి, ప్రత్యేక నివేదనలు చేసి, ప్రతిరోజు సువాసినులకి వాయన తాంబూలాలు, పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం అలవాటు ఆవిడకి.


ఈ సంవత్సరం పూజ మాట అటుంచి, కనీసం దీపం పెట్టుకునే భాగ్యం కూడా లేదని బాధగా ఉంది.


"ఎదురుగా గోడ మీద కలకలలాడుతూ అభయ హస్తం తో, కరుణా పూరిత దృక్కులతో , దివ్య మందహాసం తో ఉన్న అమ్మవారి పటానికి నమస్కారం చేసి దీనంగా మనసులోనే వేడుకుంది "ఎప్పుడూ నిన్నే భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, నీవు తప్ప వేరు దిక్కు లేదని నమ్మిన దాన్ని , నువ్వే నాకు ఏదో దారి చూపి సహాయ పడు తల్లీ!" అని పదే పదే వేడుకుంది.


రామనాధం గారికి ఏం చెయ్యాలో తోచట్లేదు....'ఈ అవసర సమయంలో సహాయం ఎవరిని అడగాలా, ఎవరు సహాయ పడతారని ' ఆలోచిస్తున్నారు.


**********


కాలింగ్ బెల్ మోగింది,....... మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీశారు రామనాధం గారు.


ఎదురుగా.....గౌరి.... నవ్వుతూ......"నమస్తే అంకుల్" అంది.


"గౌరీ........నువ్వా!!?.....ఎలా ఉన్నావమ్మా!?.... రా..... లోపలికి.... అంటూ , హాస్టల్ నుంచి ఎప్పుడొచ్చావు?" అన్నారు కూర్చోమని సోఫా చూపిస్తూ!


"నిన్న రాత్రి వచ్చానంకుల్..... ఇప్పుడు దసరా శెలవులు. పండగయ్యేవరకూ ఉంటాను. మిమ్మల్ని,. ఆంటీనీ చూసి వెళదామని వచ్చాను" అంది.


రవణమ్మ గారి కూతురు గౌరి. ఇంటరు రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే పోయాడు. రవణమ్మ గారు కొందరి ఇంట్లో వాడుకగా వంటలు చెయ్యడం, పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు, తయారు చేసి అమ్మడం చేస్తూ ఉంటుంది. గౌరి చాలా తెలివైన పిల్ల......చురుకు కూడా, తల్లికి పనిలో సహాయ పడుతూనే, చదువులో ముందుంటుంది. టెంత్ క్లాసు 90% మార్కులతో పాసైంది . రవణమ్మ గారు ఇంక చదివించలేనంటే ..


రామనాధం గారు, గౌరిని" దీనదయాళ్ చారిటబుల్ ట్రస్ట్ వారి బాలికల హాస్టల్ "లో చేర్పించారు. అక్కడ ఆర్ధికంగా వెనుక బడ్డ తెలివైన విద్యార్ధులకి, ఉచిత విద్య , వసతి కల్పిస్తారు. వారు కనపరిచే ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.


రామనాధం గారు రవణమ్మ గారి కుటుంబానికి అప్పుడప్పుడు, ఆర్ధిక సహాయం కూడా చేసారు. అందుకే గౌరి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళని కలిసి వెడుతూ ఉంటుంది.


"అంకుల్!... ఆంటీ లేరా?....కనిపించలేదు" అంది లోపలికి చూస్తూ!.


"ఉందమ్మా! పడుకుంది..... నాలుగు రోజుల నుండి జ్వరం..... టైఫాయిడ్ అన్నారు డాక్టర్"


"అయ్యో!... .మరి మీకు సహాయం. ఎవరు!?"


"మా అమ్మాయిలిద్దరూ రాలేని పరిస్ధితిలో ఉన్నారు. అదే ఏం తోచట్లేదు! "అన్నారు దిగులుగా.


"అంకుల్ మీకు అభ్యంతరం లేకపోతే నేను వచ్చి మీకు,...... ఆంటీకీ సహాయంగా ఉంటాను"


"నువ్వా!!??........ ఎందుకమ్మా!......నీకు శ్రమ"


"నాకు శ్రమేం లేదు అంకుల్, ఇంటికెళ్ళి అమ్మ తో చెప్పి,. నా బట్టలు, పుస్తకాలు తెచ్చుకుని వస్తాను. నాకిప్పుడు ఎలాగా శెలవలే కదా! మీరు నాకు చేసిన సహాయానికి, ఇది నాకో అవకాశం మీ ఋణం తీర్చుకోవడానికి. ఒక గంటలో వస్తాను అంకుల్" అంటూ లేచింది.

**********


దేవుడు పంపినట్టు "దేవత" లా వచ్చిన గౌరి రాకతో సగం భారం తీరింది రామనాధం దంపతులకి.


శకుంతలమ్మ గారి మనసు తెలిసిన గౌరి,. ఉదయాన్నే లేచి, దేవుడి గది శుభ్రం చేసి, పూజా సామాగ్రి తోమి, .... స్నానం చేసి ఆరేసిన బట్టలు కట్టుకుని,. అమ్మవారికి ధూప దీపాలతో పాటు, , శకుంతలమ్మ గారి ని అడిగి..... ప్రసాదం కూడా చేసి నివేదించేది.


రామనాధం గారికి కూడా ఇబ్బంది లేకుండా సమయానికి,....బ్రేక్ఫాష్ట్, భోజనం ఏర్పాటు చేసేది.


శకుంతలమ్మ గారికి, సమయానికి మందులు వెయ్యడం , డాక్టర్ గారి సలహా అనుసరించి ఆహారం, పళ్ళరసాలు, తయారు చేసి సమయానికి ఇవ్వడం, స్పాంజి బాత్ చేయించి, బట్టలు మార్పించడం.......కన్నకూతురిలా ప్రేమగా, అభిమానంగా చేసేది.


పనంతా అయ్యాక,. కొంచెం సేపు తన పాఠాలు చదువుకునేది.


గౌరి సేవలతో , శకుంతలమ్మ గారి జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టింది.విజయ దశమి రానే వచ్చింది. శకుంతలమ్మ మెల్లగా లేచి గౌరి సాయంతో దీపం పెట్టింది దేవుడికి. పూజ పూర్తయిన తరువాత ఒక పళ్ళెంలో చక్కని చీర ,పసుపు కుంకుమ, పూలు పెట్టి అమ్మవారికి సమర్పించింది. ప్రతి సంవత్సరం అలా సమర్పించిన చీర గుడిలో అమ్మవారి కి ఇస్తుంది


ఈసారి ఆలా చెయ్యలేదు. "కులమత, వర్ణ, వయో, బేధాలెంచకుండా,....ప్రతి జీవిలో భగవంతుని చూడమన్న ఆర్యోక్తి ని స్మరించుకుని, మనిషి రూపంలో సమయానికి వచ్చి ఆదుకున్న "దేవత"లాంటి గౌరికే ఆ వాయినం తీసుకునే అర్హత ఉందని" భావించింది


గౌరిని కూర్చోపెట్టి, పసుపురాసి, బొట్టు పెట్టి, గంధం పూసింది, చేతికి అక్షింతలు ఇచ్చి, అమ్మవారికి సమర్పించిన చీర, పసుపు కుంకుమ, పూలు ఉన్న పళ్ళెం గౌరి చేతికిచ్చి "నువ్వే ఈ సంవత్సరం నేను సమర్పించే వాయినం అందుకుంటున్న అమ్మవారివి" అంది భక్తిగా కాళ్ళకి నమస్కరించి.


గౌరి కంగారు పడిపోయింది "నాకు నమస్కరించడం ఏంటి ఆంటీ" అని.


"తప్పులేదమ్మా! అమ్మవారి స్ధానం లో నిన్ను భావించి వాయినం ఇచ్చాను కనుక నమస్కరించవచ్చు" అంది శకుంతలమ్మ మనస్ఫూర్తిగా!


**********

శకుంతలమ్మ బాగా కోలుకుంది. దగ్గరలోని అమ్మవారి గుడికి వెళ్ళింది.


గుడిలో రవణమ్మ గారు కనిపించింది. కుశల ప్రశ్నలు అయ్యాక......"దసరాల్లో మీకు ఒంట్లో బాగులేదని

విన్నాను.....ఈసారి దసరాకి నేను మా గౌరి....మా తమ్ముడి ఊరు వెళ్ళాం".........


"ఆవిడ ఇంకా ఏమో చెప్తోంది శకుంతలకి అవేం వినిపించడం లేదు...... అమ్మవారి మూల విరాట్ కి తాను విజయ దశమినాడు గౌరికి వాయనంలో ఇచ్చిన చీర కట్టి ఉంది.......అమ్మవారి మూల విరాట్.....కరుణా మయ దృక్కులతో, మధుర మందహాసం తో...అభయ హస్తమిస్తూ.... కళ్ళముందు కదలాడుతోందంతే".....!?!


సమాప్తం.

సరదాగా కాసేపు*

 *సరదాగా కాసేపు* 


🔅🔅🔅🔸🔸🔸🔅🔅🔅


ఇంట్లో మగవాడి కర్తవ్యం:


1) స్టవ్ మీదున్న కుక్కర్ వేసే 3 విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.

 2) స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే తెలివిగా స్టవ్ ఆఫ్ చేయడం.

3) డోర్ బెల్ అటెండ్ అవ్వడం.

 4) అటకపైన పెట్టిన సామాను కిందికి దించడం.

 5) గట్టిగా మూత బిగించినవి తీసివ్వడం.

 6) సాస్, జామ్ మూతలు ఓపెన్ చేసి ఇవ్వడం.

 7) ఇంట్లో బల్లి, బొద్దింకలవంటి భయంకరమైన జీవులను కొట్టి బయట పడేయడం.

 8) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.

9) భార్య చెపితే మాత్రమే పిల్లలను తిట్టి కంట్రోల్ చేయడం.

10) డోర్ దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్ వెంటనే చదివేయాలి. లేదంటే,'పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ ' అని నిందిస్తుంది.

11) షాపింగ్ చేసేటప్పుడు నసపెట్టకుండా భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.

12) ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్ ప్లంబింగ్ పనులు చేయడం.

13) టాయిలెట్ క్లీన్ చెయ్యటం.

14) తనని అందంగా ఉన్నావని పొగుడుతూ ఉండటం.

15) సీరియల్స్ నడిచేటప్పుడు నిశ్శబ్దముగ ఉండటం.

16)ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్ సరిఅయిన టైం కి కట్టి తనకు కోపము రాకుండా చూసుకోవడం.

17) కూరగాయలు తరిగి ఇవ్వటం.

18) కొబ్బరికాయ పీచు తీసి ఇవ్వటం.

19) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం.

20) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం. 

  ఈ 20 పనులు చక్కగా నిర్వహించడం భర్త కర్తవ్యం.




  రిటైర్ అయ్యాక యివన్నీ 

  *పనికి ఆహార పథకాలు*

😂

Modi has following work in these 7 years :

 Modi  has following work  in these 7 

years :


▶️CAA

▶️Rera Act

▶️Ram Mandir 

▶️3 Cr Homes

▶️9 Cr Toilets

▶️Stable Govt

▶️370 Removal

▶️Triple Talaq 

▶️Low Inflation

▶️Terrorism Drop

▶️15 new AIIMS

▶️35 new Airports

▶️Transgenders Act

▶️1.8 lakh Km Roads

▶️Motor Vehicles Act

▶️Weaponry for forces

▶️New Education Policy

▶️7 New IITs ,IIMs, IITs

▶️Reduced Corporate tax

▶️PM Kisan for all Farmers

▶️2nd largest Solar Power

▶️2nd largest steel producer

▶️2nd largest mobile manufacturer

▶️4th largest Automotive market.

▶️Not even a Single scam reported so far.

▶️Stature of India has grown multiple folds internationally.

▶️Fugitive Economic Offender Act

▶️Converting post offices into Banks

▶️Reduction in Bank Non-Performing assets

▶️Clearing 2 Lakh crore fuel debt by Congress

▶️Worlds largest healthcare - Ayushman Bharat

▶️5th Largest GDP Power from the previous 11th

▶️Privatization of failed Business for over 12 years


*All in 7 years*


If you wish, pls share with friends works of our PM Narendra Modiji...

*ముక్తి*

 *ముక్తి*..


ముక్తి అనే మాట వినని వాళ్లే ఉండరు. మోక్షం కావాలని ప్రతి వాళ్లు కోరుకుంటారు. మోక్షం అంటే ఏమిటి ప్రతి వాళ్ళు ఒక్కో అర్ధం చెపుతారు. దీనికి కారణం హిందూ మతంలో ఏది ముక్త స్థితి అనే విషయంలో  వివిధ రకాలైన అభిప్రాయభేదాలు ఉండడమే. 


ముక్తి మోక్షము అనే మాటలకు బంధాల నుంచి విడిపోవడం అని సాధారణ అర్థం. జైలు నుంచి బయటకు రావడం కానీ గొలుసుతో కట్టివేసి ఉంటే దాని నుంచి బయట పడడం గాని సంస్కృత భాషలో ముక్తి లేదా మోక్షము అంటారు.


వేదాంతులు అజ్ఞానము మాయ మొదలైన విషయాలు జీవుడిని బంధిస్తాయి అని ఆ బంధాల నుంచి జీవుడు జ్ఞాన మార్గం ద్వారా విముక్తుడు అవడమే మోక్షము అని చెబుతారు. వేదాంతులు జీవుడికి భగవంతుడికి నిజానికి బేధం లేదని మాయ అవిద్య వల్ల బంధం ఏర్పడుతుందని జ్ఞానంతో ఆ బంధాన్ని నాశనం చేయవచ్ఛని భావిస్తారు. వీళ్ళు అసలు పరబ్రహ్మ (భగవంతుడు) నిరాకారుడని ఏ గుణాలు లేని వాడిని భావిస్తారు. స్వర్గ నరకాలు కూడా వీళ్ళ దృష్టిలో బ్రాంతి లేదా మాయ మాత్రమే. జీవుడు తన అజ్ఞానాన్ని మాయను విడిచిపెట్టి తాను భగవంతుడిని అని తెలుసుకోవడమే మోక్షము అని వేదాంతులు భావిస్తారు. ఈ విధమైన మోక్షానికి శరీరాన్ని వదిలి పెట్టవలసిన అవసరం కూడా లేదు. శరీరం ఉన్నప్పుడే బ్రాహ్మజ్ఞానాన్ని సాధించి ఆస్థితిలో ఉండగలగడం మే మోక్షం అన్నమాట.


*ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి, రామకృష్ణ  పరమహంస ఇతర అవధూతలు ఈ కోవకు చెందిన వాళ్ళు. వీళ్లను జీవన్ముక్తులు అంటారు.*


కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఈ జన్మ తరువాత ఉత్తమ లోకాలకు లేదా  ఉత్తమ జన్మలలోకి పోవడం మోక్షమని భావిస్తారు. సత్కర్మలకు ఫలితంగా మంచి జన్మలు లేదా ఉత్తమలోకాలు చెడు కర్మలకు ఫలితంగా చెడ్డ జన్మలు లేదా నరకము మొదలైన లోకాలు లభిస్తాయని వీరి నమ్మకం.  తర్వాత ఎక్కడికి పోతారు అనే విషయాన్ని పక్కన పెడితే శరీరాన్ని వదిలి పెట్టడం కూడా విదేహముక్తి అని కొందరు అంటుంటారు.


భగవంతుడికి నామ రూపాయలు ఉన్నాయని ఆయన వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ మణిద్వీపంలో గాని ఉంటాడని నమ్మేవాళ్ళు అక్కడికి వెళ్లడమే మోక్షము అని భావిస్తారు. కానీ ఇందులో కూడా చాలా తారతమ్యాలు ఉన్నాయి.


భగవంతుడికి దగ్గరగా ఉండడం ఆయనను నిత్యం చూడగలగడం సేవించుకోగలగడం అనే స్థితిని సామీప్య ముక్తి అంటారు. ఈ విధమైన ముక్తి లో జీవుడికి తన నామ రూపాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ కూడా అవి తెలుస్తూ ఉంటాయి. ఈ స్థితిలో బ్రహ్మ లోకం వెళ్లినా ఈయన అత్రి మహర్షి ఈయన దూర్వాసుడు అని అందరూ గుర్తుపడతారు. ఆ విషయం వాళ్లకూ తెలుసు.


భగవంతుడి చిహ్నాలను ధరించి అదే విధమైన ఆకారంతో ఆలోకం లో భగవంతుని కి దగ్గరగా ఉండగలగడం సారూప్య ముక్తి అంటారు. ఈ విధమైన ముక్తి లో జీవునికి తన నామ రూపాలు ఉండవు. కానీ జీవుడికి తన అభిజ్ఞ ఉంటుంది. అలాగే తన చరిత్రకు సంబంధించిన జ్ఞాపకాలు తను చేసిన తపస్సు పడిన కష్టాలు అన్నీ గుర్తుంటాయి.


*భగవంతుడు శరీరంలో ఒక ఆభరణంగా గాని ఆయుధంగా గాని ఆయన వాహనంగా గాని శరీరంలో ఒక గుర్తుగా గానీ కలిసి ఉండడం సాయుజ్య ముక్తి అంటారు. యోజించడం అంటే దేనితోనైనా కలవడం. ఉదాహరణకు విష్ణుమూర్తి శంఖము చక్రము నందకము వన మాల గరుత్మంతుడు శ్రీవత్సము మొదలైన వాటిని / వారిని కూడా విడిగా దేవతలుగా భావించి పూజిస్తారు. ఆ దేవతలు  సాయుజ్య ముక్తిని పొందిన వాళ్లు. వాళ్ళు అప్పుడప్పుడు భూలోకంలో  అవతరి స్తుంటారు. ఉదాహరణకు పన్నిద్దరు ఆళ్వారులను శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు ఆభరణాలు వాహనము మొదలైనవాటి అవతారాలుగా భావిస్తుంటారు. వాళ్లకు అప్పుడప్పుడూ గర్వం కలగడం, తర్వాత మళ్లీ భగవంతుడు వాళ్లకు గర్వభంగం కావించడం వీటికి సంబంధించిన కథలు పురాణాల్లో చాలా ఉన్నాయి. వీళ్ళను దేవతలుగా పూజించడం వీళ్లు భక్తులను అనుగ్రహించడం జరుగుతుంటుంది. వీళ్లకు ఇంతకుముందు జన్మల లో ఎక్కడ ఉన్నారు ఏం తపస్సు చేశారు ఏ పనులు చేశారు మొదలైన జ్ఞాపకాలు ఏమీ ఉండవు.*


సార్ష్టి ముక్తి అని ఇంకోటి చెప్తారు. భగవంతుడు తనకున్న కొన్ని శక్తులను (వీటిని విభూతులు అంటారు) కొందరికి ఇచ్చి కొంత పరిధి వరకు కొన్ని పరిమితులకు లోబడి ఆ శక్తులను వినియోగించుకునేటట్లు అనుగ్రహిస్తాడు. వీరు వివిధ దేవతల గా ఆయన యొక్క అనుమతి కి లో బడి సృష్టిలో పరిపాలన చేస్తుంటారు. ఉదాహరణకు ఇంద్రుడు చంద్రుడు అంకాలమ్మ పోలేరమ్మ మొదలైన దేవతల స్థితి. శ్రీ చక్రం లో వివిధ ఆవరణ లలో చాలామంది పరివార దేవతలు అమ్మవారి రూపాలతో ఉంటారని చెబుతారు. వాళ్లకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి. ఇవన్నీ సార్ష్టి ముక్తి కి ఉదాహరణలు. వీళ్ళను కూడా దేవతలుగా పూజించడం వీళ్లు భక్తులను అనుగ్రహించడం జరుగుతుంటుంది. వీళ్లకు కూడా పూర్వజన్మ వాసనలు ఉండవు. 


పైన చెప్పిన వివిధ మైన ముక్తులన్నీ భగవంతుని అనుగ్రహాన్ని బట్టి ఉంటాయి. పైన చెప్పిన వివిధ మైన ముక్తులలో దేవుడికీ జీవుడికి ఇద్దరికీ బేధం  ఉంటుంది. జీవుడికి తన సొంత వ్యక్తిత్వము, అహంకారం ఉంటాయి. 


*భగవంతుడికి పంచకృత్యాలు అనేవి ఉంటాయి. అవి సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోధానాలు.*   *ఈ శక్తులు భగవంతుడికే ఉంటాయి.  ఆయన్ని విడిచి ఎన్నడూ వేరే వారిని ఆశ్రయించవు. సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానాల తో కలసి ఉన్న పూర్ణ స్వరూపుడైన భగవంతునిలో పూర్తిగా కలిసిపోయి తనదంటూ వ్యక్తిత్వం గాని నామరూపాలు గాని ఏమీ లేకుండా జీవుడు తిరిగి రాకుండా ఐక్య మవడం కైవల్య ముక్తి. ఇది ఆఖరి స్థితి.*


బౌద్ధులకు జైనులకు ముక్తి మోక్షము మొదలైన పదాలకు వేరే అర్థాలు ఉన్నాయి. వాళ్లలో కూడా హిందూ మతం లాగానే బోలెడు శాఖలు అభిప్రాయభేదాలు ఉన్నాయి.


ఇతర మతాలలో  జీవుడికి శరీరానికి శాశ్వత సంబంధం ఉంటుంది. వాళ్లు పునర్జన్మ లను నమ్మరు. అందువల్ల ఆ మతాల వాళ్లకు ముక్తి మోక్షము మొదలైన పదాలకు వేరే అర్థాలు ఉన్నాయి...  

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳గీతా సారాంశం

విఙ్ఞానం,ప్రఙ్ఞానం,సుజ్ఞానం

పదునెనిమిది అధ్యాయాలలో ఏడువందల శ్లోకాలతో భగవద్గీత వ్రాయబడింది. ఇందులో విఙ్ఞానం, సుఙ్ఞానం, ప్రజ్ఞానం గురించి చెప్పారు. ఈ మూడు జ్ఞానులు మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుచున్నవో చూద్దాం.

      భగవద్గీత ను కర్మ, భక్తి, జ్ఞాన యోగాలుగా విడదీసారు. మానవుడు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. అలా చేసిన కర్మ నుండి వివిధ 'వి' కారాలు ద్వారా పొందిన జ్ఞానం ని 'విజ్ఞానం' అన్నారు. మానవునికి సుఖజీవనానికి కావలసిన అన్నీ ఈ విజ్ఞానం ద్వారానే పొందుచున్నాడు. Cultivation, Business, Medicine, Engineering, మొదలైనవి ఈ విజ్ఞానం నుండి వచ్చినవే. కర్మ ద్వారా విజ్ఞానం పొంది సుఖాలు పొందమంది గీత.

         భక్తి నుండి వివిధ సూక్తులు ద్వారా పొందిన జ్ఞానంని "సుఙ్ఞానం" అంటారు. మానవుడు సంఘజీవనానికి కావలసిన క్రమ శిక్షణ ను ఈ సుఙ్ఞానం ద్వారా పొందుచున్నాడు. పరులను పోషించడం పుణ్యమని, పరులను హింసించడం పాపమని తెలియజేయుచున్నది. పెద్దలను గౌరవించటము, సాటివారి యందు ప్రేమ, దయ కలిగి ఉండటం ఈ సుఙ్ఞానం నుండి నేర్చుకున్నదే.

             జ్ఞానయోగం నుండి జ్ఞానంలో జ్ఞానంని తెలుసుకోవడమే "ప్రజ్ఞానం" అన్నారు. "నేనెవ్వరిని?" ఎక్కడ నుండి వచ్చేను? ఎవ్వరు నన్ను నడిపించుచున్నారు? "అని ప్రశ్నించుకొంటూ నిన్ను నీవు తెలుసుకుంటూ ఆత్మతత్వాన్ని అలవరచుకోవడమే ప్రజ్ఞానం. దీనివలన మరణ భయం ఉండదు. ఇతరులకు, నీకు తేడా కనిపించదు. అందరిలోనూ ఒకే చైతన్యం కనిపిస్తుంది. అప్పుడు రాగద్వేషాలకు తావుండక నిర్మల హ్రదయంతో త్రుప్తిగా ఉంటారు. 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳



*పవని నాగ ప్రదీప్*

బిచ్చగాళ్లకు (ఆహారం + నీరు) ఇవ్వండి.

 ఈ రోజు నుండి

బిచ్చగాళ్లకు (ఆహారం + నీరు) ఇవ్వండి. 

కానీ నగదు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు  


ముంబై-పూణేలో మరియు మహారాష్ట్ర అంతటా ఇదే ఉద్యమం ప్రారంభమైంది, 

ఇక  ఏ విధమైన బిచ్చగాడు అయినా సరే నగదు డబ్బులు చెల్లించ రాదు. 

ఈ ఉద్యమం సరైనది. 


* ఏ రకమైన వ్యక్తి (ఆడ / మగ / ముసలి. వికలాంగులు / పిల్లలు) యాచించుకుంటే, మేము డబ్బుకు బదులుగా (ఆహారం + నీరు) ఇస్తాము, ఆ రోజు నుండి వారు డబ్బు కోసం వేడుకోరు


*ఫలితంగా, అంతర్జాతీయ / జాతీయ / రాష్ట్ర స్థాయిలో, 'బిచ్చగాళ్ల' ముఠాలు వీగిపోతాయి మరియు తరువాత పిల్లల అపహరణ స్వయంగా ఆగిపోతుంది. ఇటువంటి ముఠాల పాత్ర నేర ప్రపంచంలో ముగుస్తాయి*


ప్రారంభించండి 

పోస్ట్ షేర్ చేయండి ..

మరియు ఏ  బిచ్చగాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు.

*మీ కారులో 2 బిస్కెట్లు ప్యాకెట్లు పెట్టుకోండి*

 *డబ్బు ఉన్నా చెల్లించవద్దు*


* మీరు ఈ ప్రచారంతో అంగీకరిస్తే, ఈ ఆలోచనను కనీసం మూడు గ్రూప్స్ కి పంపండి. *

🙏🙏

షష్టిపూర్తి అంటే ఏంటీ

 *షష్టిపూర్తి అంటే ఏంటీ ? ఎందుకు చేస్తారు ?*


మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథుడు అను పేరుతో , 78 వ యేట విజయరథుడు అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.


షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము


పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.


'' తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.


పక్షములను , తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు , చంద్రుడు , అంగారకుడు, బుధుడు , గురువు , శుక్రుడు , శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని , జలము , భూమి , విష్ణువు ఇంద్రుడు , ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు , దుర్గ , కుమారస్వామి , బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.


అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.

బ్రాహ్మణుడు యెట్లా ఉండాలి (మను స్మ్రుతి)

బ్రాహ్మణుడు యెట్లా ఉండాలి (మను స్మ్రుతి)

బ్రాహ్మణుడు ధర్మ రక్షణకై పుట్టినవాడు.  అంటే ధర్మాన్ని రక్షించటమే బ్రహమణుని ప్రధాన కర్తవ్యం. తానూ 1) అధ్యయనము ( అనగా గ్రంధాలను చదివి వాటిలోని విషయాలను తెలుసుకోవటం) 2)అద్యాపనము ( తా చదివిన దానిని ఇతరులకు బొఅదించటం) 3)యజనము 4) యాజనము 5)దానము 6) ప్రతి గ్రహణము అనే షట్ కర్మలను సదా ఆచరిస్తూ ఉండాలి.  సదాచార సంపన్నుడు కావలెను, లేకపోతె వేదాధ్యానము చేసినా కూడా ఫలితము ఉండదు. ఇతరులను మోసము చేయక మంచి మార్గములో నడువ వలెను. అన్యాయముగా ధనము సంపాదించ కూడదు. వేదోక్త కర్మలను మాత్రమే చేయవలెను. ఇంద్రియ నిగ్రహుడై ఉండవలెను.  

బ్రాహ్మణునికి కోపం వస్తే రాజుని సహితం శపించి సమైక్యంగా నాశనం చేయగలరు.  అగ్నిని సర్వ భక్షకునిగా చేసింది, చంద్రుని క్షయ రోగిగా చేసింది, సముద్ర జలాన్ని క్షార జలంగా ( తాగటానికి వీలులేకుండా) చేసింది బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు తన బ్రహ్మ తేజముతో తనకు కీడు సల్పిన వారిని శిక్షించాలి, తనకు కీడు సల్పిన వారిని అధర్వణ వేదంలో అంగిరస మహర్షి చెప్పిన విధంగా అభిచార మంత్రముల చేతనే నిగ్రహించాలి. బ్రాహ్మణులూ నిగ్రహ అనుగ్రహ సమర్ధులై ఉండాలి అంటే శపించటానికి వరాలు ఇవ్వటానికి కావలసిన తపో శక్తి వంతులై ఉండాలి. 

బ్రాహ్మణుని శిక్షించే శక్తి రాజుకు కూడా లేదు.  రాజు తప్పు చేస్తే బ్రహమణులు శిక్షించగలరు. 

ఇవి చూస్తూ ఉంటే ఇప్పుడబ్రహమణులుగా జన్మించిన మనం ఎంతవరకు బ్రాహ్మణులుగా వున్నామన్నది ప్రశ్నర్ధకమే 

మనమంతా బ్రాహ్మణులకు వుండాలిసిన శక్తులన్నీ సంపాదించి ఈ లోకాన్ని కాపాడటానికి ఉద్యమిద్దామని పిలుపునిస్తూ 

మీ 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 

. అత్రి మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

2. అత్రి మహర్షి 

అత్రి మహర్షి ఎవరో తెలుసా ? మనం సప్తమహర్షులు అనే మాట వింటూంటాం కదా ... వాళ్ళల్లో ఈయన ఒకడన్నమాట . అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు . అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట . అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు " లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను , నువ్వు గొప్ప తపశ్శక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి ” అని అడిగాడు . అందుకు అత్రి మహర్షి సరే ! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు . ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి , ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది . ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది . ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని , క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు . కొంతకాలం తర్వాత , అత్రి మహర్షికి దేవహూతి కర్దముడు అనే దంపతులకు పుట్టిన తొమ్మిదిమంది కూతుళ్లలో ఒక కూతురయిన అనసూయతో పెళ్ళి జరిగింది . పెళ్ళి చేసుకున్న అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి జీవిస్తున్నాడు . అనసూయాదేవి గొప్ప పతివ్రతగా వినుతికెక్కింది . ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు . అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు . అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి 


అన్నారు . అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు . త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి , చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది . మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది . భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది . త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి , లక్ష్మి , పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు .

 ఒకసారి కౌశికుడి భార్య , సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది . అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది . అత్రి మహర్షికి పిల్లలు లేరని వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు . అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు . కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి కంట్లోంచి చంద్రుడు , అనసూయాదేవికి  మేముడు , దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు .

ఒకనాడు అత్రి మహర్షి అనసూయని పిలచి మనకి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగారు కదా ... నేనింక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదామనుకుంటున్నాను . నువ్వుకూడా నాతో వస్తావా ? పిల్లల దగ్గరుంటావా ? అని అడిగాడు . అప్పుడు అనసూయ స్వామీ ! మీకంటే నాకు పిల్లలు ఎక్కువ కాదు . కానీ , పిల్లలు బాగా చిన్నవాళ్ళు . వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళయ్యాక మనం వెడితే ధర్మంగా ఉంటుంది , ఈ లోగా పిల్లల్ని పోషించడానికి కొంచెం ధనం కావాలి కదా ! మీరు పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ధనం తీసుకురండి అంది . ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు . ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు . అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు . పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు . అత్రి ఓ మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు . అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు . అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం , వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు . ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది . అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది . అప్పుడు అత్రి మహర్షి తన చూపులోనే రాక్షసులందర్ని చంపేశాడు . 

*క్షత్రియ చంద్రవంశానికి ఆదిపురుషుడు అత్రి మహర్షే*

మన భారత దేశంలో క్షత్రియ వంశాలు ప్రధానంగా సూర్యవంశం, చంద్ర వంశంగా విభజితం అయ్యాయన్నది తెలిసిందే. అత్రి కుమారుడైన సోముడినే చంద్రుడు అనటంకూడా ఉంది. ఈ చంద్రుడి పేరుమీదనే 'చంద్రవంశం' రూపొందింది. ఈ వంశంలో దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, ఆ తర్వాత వారి సంతానమైన కురుపాండవులు ఉన్నది తెలిసిందే. (కశ్యపుని కుమారుడైన సూర్యుని పేరుమీదుగా సూర్యవంశం రూపొందింది. ఈ వంశంలో దిలీపుడు, రఘు మహారాజు, దశరథుడు, శ్రీరాముడు వంటి వారు ఉన్నారు.) 

 


ఎంతోమంది ఋషులు అత్రిమహర్షి నడిగి పూజా విధానం అభిషేకం , దేవతా ప్రతిష్ట , ఉత్సవాలు , దోషాలకు ప్రాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలుసుకుంటూ ఉండే వాళ్ళు , అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు , జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి . అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు , గురుప్రశంస , చాతుర్వర్ణ ధర్మాలు , జపమాలాపవిత్రత , పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి .


 దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశ పెట్టింది . అత్రిమహర్షి  ! 


అత్రి మహర్షి గురించి చాలా విషయాలు మనకి తెలిసినట్టే కదా !  అత్రి మహర్షి గురించే కాదు ఆయన భార్య అనసూయాదేవి గురించి కూడా.

                            2. అత్రి మహర్షి 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

తెలుగువారు వాడే సామెత.

 దిక్కు దివాణం తెలుగువారు ఎక్కువగా వాడే సామెత. కానీ యిందులో సంస్కృత పదములే యున్నవి.దిక్కు అనగా దిశకు మరో పేరు. దినము నిర్ణయం సూర్యుని గమన పూర్వకంగానే. దివి ఆణం దివిని అణు వ్యాప్తమును తెలుపుచున్నది. ఆకాశ తత్వమే అణు వ్యాప్తము. దివి స్వర్గమనగా ఆకాశమును అది కంటికి కనిపించని అణు వ్యాప్తమని తెలియుచున్నది. అణువు యెుక్క వ్యాప్తం సర్వ వ్యాప్తమని. భూమికి దాని చలనము రూపము వలన మరియు అంతరిక్షం కూడా అణు శక్తి వ్యాప్తమై అనగా నక్షత్ర మండలం దాటి యున్నది.భూమి అడుగు నుండి కూడా అంతరిక్షం వరకూ  వివిధ రూపములలో  వ్యాప్తమై యున్నది.భూమిపై వ్యాప్తము మనకు తెలియుచుానే వున్నది.దాని పరిమాణం వస్తు రూపంలో వున్నది కావున. యిక అంతరిక్షంలో వక దగ్గర లేదు తెలియుటకు. అది దాని వాతావరణ  పరిస్ధితిని బట్టి వక్కొక్క రూపములో వక్కొక్క లక్షణముగా వక్కొక్క దిక్కును ఆశ్రయించి యున్నది.  నక్షత్ర రూపంలో గ్రహించి రూపంలో దాగియున్నది. దానిని ఋక్కుయని అది ఋతు లక్షణము.అణా యనగా ఆరు పైసలు 16 అణాల శక్తి గణనయే పూర్ణమైన 96 గా మనం వాడుకలో యుండి యున్నవి. అనగా దాని మూలమైన విలువ తిరిగి 6 గా తెలియుతున్నది. 16 కళల శక్తి జీవ మనుగడకు మూలం. జీవం అనగా మానవుడే. ఎందుకనగా జీవ లక్షణము తెలియుట మానవునికే బుద్ది యున్నది.ఏకం ౦ పూర్ణము తెలియదు, ద్వి రెండు అసలు తెలియదు, త్రీణి యిచ్చట కొంత దెలియుచున్నది. అది ఊర్ధ్వ కోణము.ఆ తరువాత అదో ఊర్ధ్వ కోణ శక్తి మరలా రూపాంతరం చెంది అధోకోణమై షట్కోణము ఆరు కోణ లక్షణములు గల కోణగతమైన (షాఫ్ట్) తత్వమని పూర్ణ లక్షణమని అణువుయని అవగాహన కలుతున్నది. యిదే మవ్వురు అమ్మలు మువ్వురు అయ్యల మూల ప్రకృతి జీవుడు. వీని కళలు షోఢశ కళలకు 16 కు అధిపతి విష్ణు తత్వ ముగా తెలియుచున్నది.పదహారు కళలలో ఏ కళ లేకపోయిన జీవుడు పరిపూర్ణుడు కాడు.ఋతువు అనగా శక్తి రూపంగా మారి లక్షణముగా తెలియుట.ఋతువులు వాటి ధర్మములు లేనియెడల సృష్టి వినాశనం.జీవ వ్యాప్తి విశ్వవ్యాప్తమైన అణువు యెుక్క తత్వం. విశ్వచక్షుత ఉత విశ్వతోముఖో, విశ్వతోహస్త ఉత విశ్వతస్పాత్, యని శివ సంకల్పంలో సూత్ర పర సూచన. విశ్వం అంతా ఈశ సత్ అనే ముఖం.విశ్వం  అంటే ముఖం. చూసే శక్తికి ముఖము ప్రధానం. మన చక్షువులుతో చూస్తూవున్నాం. కానీ దాని లక్షణము యిది యని స్పష్టంగా తెలియుటలేదు. దాని లక్షణము వలననే తెలియుచున్నది. అదియును ఋతుపరముగా ఫలితం పదార్ధ రూపంలో అనుభవించిన గాని తత్  పదార్థమును దానిలో దాగియున్న వునికి గుర్తించ లేకుండా యున్నాము. గుర్తించిన తరువాతనే అదికూడా వేరు రూపంలో తెలియుట. యిదియే ఙ్ఞానము. ముఖంతో చూచుట కుదరదు. అంతర్ముఖుడవై చూడాలి. అనగా ఙ్ఞానం కావాలి. విశ్వ వ్యాప్తమైన శక్తిని చూసే ఙ్ఞానం తపస్సు ద్వారానే మౌనంగానే తెలియాలి మననం ద్వారానే తప్ప వేరు మార్గం లేదు.

కోరికలు దేవుడు తీరుస్తాడంటారా

 దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా.. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా?" 


"అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా వినండి"  


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి

ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు. 


శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. 


" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." 


"ఏమిటా కోరిక గురువు గారూ" 


"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని." 


"వచ్చే జన్మలోనా" 


"కాదు ఈ జన్మలోనే" 


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా" 


" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"


" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత. 


శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత

విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 


గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." 


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.

ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 

చేశాడు శిష్యుడు. 


         భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు.

  

                          

                                  

           🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చారు

 *చారు*…


🔅🔅🔅😇😇😇🔅🔅🔅

 ఆటవిడుపు  ...

*

చారుకి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో...*నవ్వకండి, ఇది చిత్తగించండి...


చింతపండు

ఇంగువ

పోపు దినుసులు

ఉప్పు


ఈ నాలుగు(చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో మరేమో....

చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది....


పప్పేస్తే పప్పు చారు


టమాటాలతో టమాటా చారు


మునగేస్తే మునగచారు


మిరియం వేస్తే మిరియాల చారూ


ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో.......


ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.


పళ్ళు రాని పాపడి నుంచి  పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ....


అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే.

మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే...


మీకు ఉప్మా నచ్చదా...ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి...అమృతమే....


జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే...


*ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే...* *అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా....నిజం ఒప్పుకోండి....* 


ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే...మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే...


*ప్రియే....చారు శీలే ... అన్నారు గుర్తుందండీ జయదేవులవారు...*


**చారు అంటే అందమైనది అద్భుతమైనది అని..*  *అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా... చెప్పండి...* 


మరి చారు  తాగే జయదేవులు  అష్టపదులు చెప్పుంటారు లెండి మరి...ఒడిషా మరి తెలుగు దేశానికి దగ్గరే కదా....


మరి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం....


వేడి వేడి చారు  పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే... మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి... అద్భుతః, అమోఘః......


మా అమ్మమ్మ పెట్టేది కుంపటి పై కాచిన సత్తుగిన్నెలో చారు....ఆ పోపుకొచ్చిన ఘాటు నాకు ఇప్పటికీ జ్ఞాపకం....ఆ రుచి....ఇప్పటికి మళ్ళీ చూడలేదు....


మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది....  గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు... ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు....

ఇలా చెప్పుకుంటూ పోతే..


అహో ఏమి చెప్పను చారు...

వేడి వేడిగా గొంతులో జారు.. చెవులనుండి వచ్చు హోరు..

జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు......


ఇంకే ద్రవమేనా చారుముందు  బేజారు


చార్ మినిట్ మే బనే చారు

ఆ ఘాటుకు  మాత్రం నా జోహారు


*మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,*

*శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!!*


తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి  తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.


గరికపాటి  వారి హాస్యం వెదజల్లే ప్రవచనాల సంకలనం 

https://youtu.be/J_i_xp89Wv8


*🙏మరి స్వస్తి🙏*


🔅🔅🔅😇😇😇🔅🔅🔅

ఆరోగ్య సూత్రాలు -

 ప్రాచీన గ్రంధాలలోని ఆరోగ్య సూత్రాలు  - 



  * పిండివస్తువులు , కూరలు , పెసరపప్పు వీనితో కూడిన ఆహారము తినినప్పుడు త్వరగా జీర్ణం అగుటకు పెరుగు మీద తేట , పలచటి మజ్జిగ , పుల్లని గంజి ( తరవాణి ) తాగవలెను . 


 *  శరీరము కృశించిన వారు కల్లును సేవించవచ్చు . కల్లును కేవలం వేసవికాలము నందు మాత్రమే సేవించవలెను . మిగిలిన కాలములలో సేవించిన రోగములు కలుగచేయును . 


 *  శరీరము నందు కొవ్వు పేరుకుపోయి లావుతో ఇబ్బంది పడువారు తేనె కలిపిన నీరును తాగుచుండవలెను . 


 *  క్షయవ్యాధి వలన ధాతువులు శోషించినప్పుడు మాంసరసం ( మాంసముతో ఉడికించిన నీరు ) తాగవలెను . 


 *  జఠరాగ్ని తగ్గినపుడు , మాంసము భుజించునప్పుడు మద్యము పానం చేయవచ్చు . 


 *  వ్యాధి కలిగి క్షీణించిన శరీరము కలవానికి ఔషధములు అధికంగా వాడుట , ఎక్కువ దూరం నడవడం , ఎక్కువగా మాట్లాడటం లేక ఎక్కువ భారం మొయ్యుట , అధికంగా స్త్రీసంగమం చేయుట , అతిగా ఉపవాసములు చేయుట , శరీరశ్రమ అధికంగా చేయుట వంటి వాటివలన శరీరము కృశించిన వారికి పాలు త్రాపుట చాలా శ్రేష్టం అగును. 


 

 * మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.


  *  మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును.  ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి,  ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.


*   భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .


 *   భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.


 *   ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .


 *  ఆహారం తినుచూ నీటిని సేవించు పద్దతి మెడకొంకులకు మీదగా నుండు శిరోభాగము నందలి వ్యాధులలోను , గుద భాగము నందు జనియించు వ్యాధులలోను , శ్వాసకాస , ఉరఃక్షత , పీనస అను వ్యాధులలోను హితము కాదు . ఆయా సమస్యలు ఉన్నవారు ఆహారం భుజిస్తూ నీటిని సేవించరాదు . 


 *  పాట పాడినప్పుడు , బిగ్గరగా చదివినప్పుడు , ఉపన్యాసం చెప్పిన తరువాత వెంటనే నీటిని తాగరాదు . స్వర్ణబేధి వ్యాధి యందు కూడా నీటిని సేవించరాదు . 


 *  శరీరము నందు అధికంగా తేమ కలిగినవారు , అతిమూత్ర వ్యాధి కలిగినవారు , నేత్రరోగములు , కంఠరోగములు కలిగినవారు , వ్రణములతో భాధపడువారు నీటిని అధికంగా తీసుకోరాదు . 


 *  నీటిని తాగిన వెంటనేగాని , భోజనం అయిన వెంటనే గాని చదువుట , దారి నడుచుట , నిద్రించుట చేయరాదు . అనగా కొంత సమయం విశ్రాంతి తీసుకుని మిగిలిన కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చు . 



           మరిన్ని ఆరోగ్య నియమాల కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


 

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

ఇన్ని శాఖలా

 🕉వామ్మో ఇన్ని శాఖలా..... ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి..

వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం......😎


😎 ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..


1) ప్రధమ శాఖ ద్రావిడ

2) ద్రావిడ

3) పేరూరు ద్రావిడ

4) పెద్ద ద్రావిడ

5) దిమిలి ద్రావిడ

6) ఆరామ ద్రావిడ

7) పుదూరు ద్రావిడ

8) కోనసీమ ద్రావిడ

9) ద్రావిడ వైష్ణవులు

10) తుమ్మగంటి ద్రావిడ

11) తుమ్మ ద్రావిడ


😎 వైదీక బ్రాహ్మణ శాఖలు..


1) వెలనాటి వైదీక

2) వెలనాట్లు

3) వెలనాటి పూజారులు

4) వెలనాటి అర్చకులు

5) కాసలనాటి వైదీక

6) కాసలనాట్లు

7) ములకినాట్లు

8) ములకినాటి వైదీక

9) తెలగాణ్యులు

10) వేగనాట్లు

11) వేగనాటి వైదీక

12) ప్రధమ శాఖ వైదీక

13) కరణకమ్మ వైదీక


😎 నియోగి బ్రాహ్మణ శాఖలు..


1) ప్రధమ శాఖ నియోగి

2) ఆరువేల నియోగి

3) నందవరీక నియోగి

4) లింగధారి నియోగి

5) ఉంత్కఖ గౌడ నియోగి

6) ఆరాధ్య నియోగి

7) అద్వైత నియోగి

8) నియోగి వైష్ణవులు

9) పాకనాటి నియోగి

10) ప్రాజ్ఞాటి నియోగి

11) పొంగినాడు నియోగి

12) నియోగి ఆది శైవులు

13) యజ్ఞవల్క్య నియోగి

14) ఆరాధ్యులు

15) వేమనారాధ్యులు

16) తెలగాణ్యు నియోగి

17) కరణకమ్మ నియోగి

18) బడగల కరణకమ్మ నియోగి

19) కరణాలు

20) శిష్ట కరణాలు


😎 వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..


1) శ్రీవైష్ణవులు

2) నంబులు

3) గోల్కొండ వ్యాపారులు

4) ఆచార్యులు 

5) మర్ధ్యులు

6) వ్యాపారులు

7) కరణకమ్మ వ్యాపారులు

8) బడగల కరణకమ్మ

9) మెలిజేటి కరణకమ్మ

10) దారుకులు

11) యజ్ఞవల్క్యులు

12) యజుశ్యాఖీయులు

13) బడగ కన్నడలు

14) నంబూద్రి బ్రాహ్మలు

15) వైఖానసులు

16) మధ్వలు

17) కాణ్వులు

18) కాణ్వేయులు


😎 శివార్చక బ్రాహ్మణ శాఖలు.....


1) మహారాష్ట్ర చిత్సవనులు

2) లింగార్చకులు

3) ఆది శైవులు

4) శివార్చకులు

5) వీర శైవులు

6) మోనభార్గవ శైవులు

7) కాశ్యప శైవులు

8) శైవులు

9) ప్రధమ శాఖ శైవులు

10) రుద్ర శైవులు

11) పరమ శైవులు

12) శివ పూజారులు

13) శైవ స్మార్తులు


😎😧😦😲 మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75 ఉన్నాయి.....


మీ బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ పోస్ట్ ను షేర్ చెయ్యండి.....🌸

భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి

 భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం...

1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.

2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.

3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.

4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.

5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.

6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.

7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.

8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.

9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.

10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.

11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి

12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి.  హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.

13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.

14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి

10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.

15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.

16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.

17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.

18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.

19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.

20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.

21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.

22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.

23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి హైద్రాబాద్,తెలంగాణ,కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.

24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.

25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.

26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.

27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.

28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.

29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.

30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.

31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.

32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.

33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.

34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.

35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.

ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది.