18, జూన్ 2021, శుక్రవారం

బ్రాహ్మణుడు యెట్లా ఉండాలి (మను స్మ్రుతి)

బ్రాహ్మణుడు యెట్లా ఉండాలి (మను స్మ్రుతి)

బ్రాహ్మణుడు ధర్మ రక్షణకై పుట్టినవాడు.  అంటే ధర్మాన్ని రక్షించటమే బ్రహమణుని ప్రధాన కర్తవ్యం. తానూ 1) అధ్యయనము ( అనగా గ్రంధాలను చదివి వాటిలోని విషయాలను తెలుసుకోవటం) 2)అద్యాపనము ( తా చదివిన దానిని ఇతరులకు బొఅదించటం) 3)యజనము 4) యాజనము 5)దానము 6) ప్రతి గ్రహణము అనే షట్ కర్మలను సదా ఆచరిస్తూ ఉండాలి.  సదాచార సంపన్నుడు కావలెను, లేకపోతె వేదాధ్యానము చేసినా కూడా ఫలితము ఉండదు. ఇతరులను మోసము చేయక మంచి మార్గములో నడువ వలెను. అన్యాయముగా ధనము సంపాదించ కూడదు. వేదోక్త కర్మలను మాత్రమే చేయవలెను. ఇంద్రియ నిగ్రహుడై ఉండవలెను.  

బ్రాహ్మణునికి కోపం వస్తే రాజుని సహితం శపించి సమైక్యంగా నాశనం చేయగలరు.  అగ్నిని సర్వ భక్షకునిగా చేసింది, చంద్రుని క్షయ రోగిగా చేసింది, సముద్ర జలాన్ని క్షార జలంగా ( తాగటానికి వీలులేకుండా) చేసింది బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు తన బ్రహ్మ తేజముతో తనకు కీడు సల్పిన వారిని శిక్షించాలి, తనకు కీడు సల్పిన వారిని అధర్వణ వేదంలో అంగిరస మహర్షి చెప్పిన విధంగా అభిచార మంత్రముల చేతనే నిగ్రహించాలి. బ్రాహ్మణులూ నిగ్రహ అనుగ్రహ సమర్ధులై ఉండాలి అంటే శపించటానికి వరాలు ఇవ్వటానికి కావలసిన తపో శక్తి వంతులై ఉండాలి. 

బ్రాహ్మణుని శిక్షించే శక్తి రాజుకు కూడా లేదు.  రాజు తప్పు చేస్తే బ్రహమణులు శిక్షించగలరు. 

ఇవి చూస్తూ ఉంటే ఇప్పుడబ్రహమణులుగా జన్మించిన మనం ఎంతవరకు బ్రాహ్మణులుగా వున్నామన్నది ప్రశ్నర్ధకమే 

మనమంతా బ్రాహ్మణులకు వుండాలిసిన శక్తులన్నీ సంపాదించి ఈ లోకాన్ని కాపాడటానికి ఉద్యమిద్దామని పిలుపునిస్తూ 

మీ 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: