27, ఆగస్టు 2024, మంగళవారం

సరదాగా

 🙏🏻 *సరదాగా...* 🙏🏻


 గోదావరి ఎక్సప్రెస్ కి ఇంకా చాలా  టైమ్ ఉంది. ఎక్కబోతూ ఒకసారి చార్ట్ లో నాపేరు, బెర్త్ నెంబర్ చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది.  అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి స్మార్ట్ గా, యాక్టీవ్ గానే ఉండేవాడు. నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. *(అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎)* కాలేజీకి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా బాడీ గార్డ్ లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని, నిజానికి మూడు సంవత్సరాల డీగ్రీ లో ప్రపోజ్ చేసి చావలేదు, అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితి గానే ఉండేది.  నేనో రెండ్రోజులు ఏ ఊరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను  ప్రేమించక పోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.... బహుశా ప్రేమని వ్యక్త పరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో.  ఆ తర్వాత మా నాన్నగారికి  ట్రాన్స్ఫర్ అవటం....

మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 25 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు. అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే... *exitement తో నా హృదయం బరువెక్కింది, అసంకల్పితంగా నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే.... ఎస్ అతనే, సీరియస్ గా సూట్ కేస్ సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండే వాడో ఇప్పుడూ అలాగే కత్తి లాగ ఉన్నాడు.* నీట్ గా ట్రిమ్ చేసిన salt & pepper గెడ్డం, full sleeves సగం fold చేసి, పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి in-shirt చేసాడు, అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటు చూస్తున్నా. 

ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది, బీపీ పెరిగింది.


ఒకటి....రెండు.... అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను.... నన్ను చూసి 


" ఆంటీ మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా lower బెర్త్ తీసుకోండి"*


దొంగ సచ్చినోడు

చెత్త వెధవ

పండు గెడ్డం గాడు

వాడి గుడ్లు పీకా

....




🙏🏻🙏🏻🙏🏻🙂🙂🙂🙏🏻🙏🏻🙏🏻

సమస్యాపూరణము

 సమస్యాపూరణము

డా. దీవి శ్రీనివాసాచార్యులు మంగళగిరి

ఉ. ఏలికయండతో పథము నేమియు వేయక మొత్తమందినన్, 

     కాలము తీరకే యెరుగు కాళపు నోరగు నానకట్టకై, 

     పాలికి వచ్చి కూలి పని బత్తెము మింగిన గుత్తేదారు పై     

     జాలిని జూపినప్పుడె, ప్రజల్ నిరసింతురు పాలక ప్రభున్.

ఆశుపద్యం

 ఆశుపద్యం

27/08/2024


డా. రాంభట్ల వేంకటరాయ శర్మ


*కనులారగ నీ రూపము*

*తనివిగ నే చూచినంత ధన్యుడ నైతిన్!*

*ననునే మరచితి స్వామీ!*

*వెనుకటి నా నన్ను నీయు! వేంకట రమణా!!*


మొన్న సుప్రభాత సేవ లో స్వామి వారి దర్శనం తర్వాత కళ్ళముందు స్వామి రూపమే కదలాడుతోంది.. అనుకున్న వెంటనే ఛందస్సుతో సంబంధంలేకుండా, పదబంధాలతో పనిలేకుండా, పదాలకు వెతుక్కో అక్కర లేకుండా పద్యాలు భావానుగుణంగా పొంగుకొచ్చేవి... అత్యంత దగ్గరనుండి స్వామి వారి ని ఆపాద మస్తకం చూసిన దగ్గరనుండి ... మదిలో భావాలు స్ధంభించిపోయాయి... పదబంధాలు ఆవిరైపోయాయి... మొత్తానికి అతి కష్టంమీద ఈ పద్యమైనా రాయగలిగాను.. ఇది కూడా స్వామి వారి దయాలబ్ధమైనదే...పామరులను పండితులను, పండితులను వేదాంతులను చేసే అపురూపమైన లావణ్యం వేంకటేశ్వర స్వామి వారిది... ఆ స్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించు గాక... 


 నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*శ్రీ గణనాథోద్భవము

 *శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహా పురాణము.

33సీ.

సిద్ధలా గజముఖున్ సేవించి మ్రొక్కచు

            సిద్ధి నామంబున చేరిరతని!

సుగుణంబు లెల్లను నగనంద నందనున్

            నర్చించి బుద్ధులై యలఘు జేరె!

సిద్ధి బుద్ధులు జేరనా చిన్న వాడు

           జయ గణేశ్వరుడయ్యె శాశ్వతముగ!

ఆ గజానను గాత్ర మగజాత నిమురుచు

          హెచ్చు వరములిచ్చె మెచ్చి మిగుల!

తే.గీ.

సుతుని మోమును ముద్దాడి సుదతి హిమజ

చేరువకు జేరి దీవించి శిరము తాకి

ఆద్యుడవు నీవు తొలిపూజ లందగలవు

శుభము లిచ్చుచు జగతిలో శూలి తనయ!!


భావము:ఆ గజముఖుని సిద్దులు సేవించి సిద్ధి పేరు తోను, సుగణములు సేవించి బుద్ధి పేరుతోను అతనిని చేరెను,అతడందుచే శాశ్వతముగా జయగణేశు డయ్యెను.

అతని శరీరమును నిమురుచూ అనేక వరములిచ్చి నీవు వేల్పుల లో మొదటివాడవై తొలి పూజలందుకొనుచూ లోకమునకు శుభములు కలిగింపగలవు అని పార్వతి పలికినది.

నిత్యపద్య నైవేద్యం-1592

 నిత్యపద్య నైవేద్యం-1592 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-227. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

ధీర: శోకం తరిష్యంతి 

లబంతే సిద్ధిముత్తమామ్l

ధీరై: సంప్రాప్యతే లక్ష్మీ 

ధైర్యం సర్వత్ర సాధనమ్ll


తేటగీతి:

తేట ధీరులు దుఃఖమున్ దాటగలరు

బుద్ధితో సిద్ధియును కూడ పొందగలరు 

పుడమిపై ధనలక్ష్మినీ పొందగలరు 

సకల సిద్ధికి ధైర్యమ్ము సాధనమ్ము.


భావం: ధీరులు దుఃఖాన్ని దాటగలరు. సిద్ధి కూడా పొందుతారు. ఐశ్వర్యాన్ని అంటే లక్ష్మినీ పొందుతారు. ధైర్యం అన్నిటికీ ఒక సాధనంగా ఉంటుంది.

श्रीकृष्णनामसंकीर्तनं

श्रीकृष्णनामसंकीर्तनं


              ✍️कोरिडे विश्वनाथ शर्मा , 

                      विश्रान्त प्रांशुपालकः।


कृष्ण कृष्ण यदुकुलनंदन ,

गोपीनंदन गोपकिशोर,

नंदनंदन नवनीतचोर,

नारायण ते नमो विभो ! ।


चाणूरमर्दन सज्जनरक्षक

कंसविनाशक कैवल्यदाता

देवदेवकीगर्भसंभव

 नारायण ते नमो विभो ! ।


गीताबोधक गिरिधरवरकर

गीर्वाणतोषक गानविलोल

धर्मरक्षक दानवभंजक

नारायण ते नमो विभो ! ।


राधामाधव रासविहारी

मुरळीलोल मोहनरूप

मुक्ति दायक मुनिजनसेवित

नारायण ते नमो विभो ! ।

హరి స్మరణ

 *

             హరి స్మరణ

             ••••••••••••

  నిను నిర్జింపబకాసురుండు బకమై

                        నిన్ మ్రింగె నుష్ణోద్ధతిన్

   కనలంజేసి బిరాన వెల్వడి కరాఘాతాల

                                 శిక్షించుచున్

    కినుకన్నాసిక పిండి చంపితివి పక్షిన్

                        రాక్షసున్ కృష్ణ ! నీ

     ఘనతన్ చూపితివయ్య మిత్రులకు

                      రక్షన్ గూర్చు లక్ష్యంబుతో.


    2.హరి! బాల్యంబున నిన్ను స్నేహితుల

                     సంహారంబు చేయన్నఘా

       సురు డందంబగు వ్యూహమున్ 

              సలుపగా  సూక్ష్మంపురూపంబుతో

        నరి కంఠంబును దూరి చీల్చితివి

                స్థూలాకారమున్ దాల్చుచున్

        నరులున్ దేవతలందరున్ పొగడ

                  కృష్ణా నంద గోపాలకా!

          -- తంగిరాల నరసింహకుమార్

వ్యాసం లయ-లయం

 https://epaper.prabhanews.com/Hyderabad?eid=2&edate=24/08/2024&pgid=411635&device=mobile&view=0&sedId=0&uemail=

 

24-8-2024 ఆంధ్ర ప్రభలో ప్రచురితమైన వ్యాసం లయ-లయం  

दसवां

 दसवां 

From telugu to hindi google translation

  पहले एक स्थान से दूसरे स्थान तक जाने के लिए अच्छी सड़कें या वाहन नहीं थे, केवल कुछ अमीर लोगों के पास रथ और गाड़ियाँ थीं। ऐसे ही किसी दिन दस यात्री एक जंगल में जा रहे होते हैं। कुछ दूर चलने के बाद वे एक नदी के पार पहुँचे जहाँ उनमें से कोई भी तैर नहीं सकता था। उन सभी ने उस भगवान पर बोझ डालकर सावधानी से नदी पार करने का निर्णय लिया। वे एक-दूसरे का हाथ पकड़कर गहरी नदी पार कर गए। जब वे दूसरी ओर पहुँचे तो मानो सभी की जान में जान आई। अब सवाल यह है कि क्या उनमें से दस सुरक्षित वहां पहुंच गए या कोई उस नदी में डूब गया, जिसमें सभी की गिनती करने को कहा गया था। उसने गिनकर कहा कि कुल नौ लोग थे। फिर दूसरे ने गिनती की और उसे नौ लोग मिले। हर कोना गिना जाता है. लेकिन दसवें का पता नहीं चल रहा है. तब उन सभी ने निर्णय लिया कि उनमें से एक नदी में डूब गया है और रोने लगे। 


तभी नदी के पास से गुजर रहे एक राहगीर ने उन्हें देखा और उनसे अपने सामने दोबारा गिनती करने को कहा. जब उन्हें मामले की जानकारी हुई तो उन्होंने कहा कि इस बार आप सभी एक पंक्ति में खड़े हो जाएं और मैं गिनती करूंगा और दस लोगों की गिनती की गई। तब वे सब प्रसन्न हुए और पूछा कि उनके पास एक व्यक्ति कम क्यों आ रहा है? सज्जनो, जो तुममें गिना गया, उसने अपने को न समझा, इसलिये हफ़्तों को समझाकर भेज दिया। 


इस कहानी की तरह ही हम दसवें व्यक्ति को भी नहीं जानते. हम कब से बाहर नौ लोगों को गिन रहे हैं और दसवें को नहीं गिन रहे हैं और हमें चिंता है कि दसवां नहीं मिल रहा है। वास्तव में, हमारे अद्वैत गुरु श्री आदिशंकर चार्युला ने अपनी कई पुस्तकों के माध्यम से हमें सूचित किया है कि दसवां व्यक्ति मैं हूं। हम अपने भीतर के ईश्वर को जाने बिना अज्ञान में जी रहे हैं और उसे बाहर मंदिरों और गुंबदों में ढूंढ रहे हैं। भार्गव शर्मा कहते हैं कि क्षेत्र और तीर्थ आपको अस्थायी मानसिक खुशी देने के लिए केवल उपकरण हैं, वास्तव में शाश्वत खुशी तभी मिलती है जब आप मेरे दसवें हिस्से को जानते हैं। फैई की कहानी में उन्हें टेबल पर गिनने वाला कोई और नहीं, बल्कि सतगुरु ही हैं। श्री आदि शंकराचार्य जैसे अच्छे गुरु पाना हमारा जन्मसिद्ध अधिकार है। आइए शिक्षकों के नक्शेकदम पर चलें और अपने जन्म का उद्धार करें। 


आजकल बहुत से लोग पूछ रहे हैं, नेने सद्गुरु, कृपया मुझे मापें और मेरी पूजा करें। उनके साथ जाकर अपने जीवन का बहुमूल्य समय और पैसा बर्बाद न करें। अद्वैत ही मुक्ति का मार्ग है, श्री शंकर के अलावा कोई गुरु नहीं है। यह एक तथ्य है कि प्रत्येक साधक सबसे पहले श्री भागवत गीता का पाठ करता है और समझता है जो कि भगवान कृष्ण द्वारा हमें दिया गया एक अनमोल खजाना है और गृहस्थाश्रम का सही ढंग से आचरण करता है और फिर आदि शंकराचार्य के वेदांत ग्रंथों का पाठ करता है और मुक्ति का अभ्यास करता है। 


"मोक्ष पैसे से नहीं मिलता"


उपनिषदों में, संपूर्ण का सार ज्ञानामृत में परिवर्तित हो गया है और श्री आदि शंकराचार्य द्वारा हमें दिया गया है। आइए हम उनके बताए रास्ते पर चलें.   


ॐ तत्सत्


ॐ शांति शांति शांति   


आपका भार्गव शर्मा

ताल - लय

 

From telugu to hindi google translation 

 


ताल - लय 


ये दो शब्द हम अक्सर सुनते हैं . " ताल " का अर्थ है एक नियमित पैटर्न में गति या ध्वनि और हम इसे लय कहते हैं । उदाहरण के लिए हमारी सांस लेना , चलना , दिल की धड़कन , गतिमान चक्र को लें इसके अलावा, आधुनिक विज्ञान के अनुसार , यदि हम कंप्यूटर की शक्ति , या कंप्यूटर की शक्ति ( हर्ट्ज़ ) को देखें , तो हम देख सकते हैं कि सब कुछ लयबद्ध है ।    


भौतिक दृष्टि से ये संगीत और नृत्य की विद्याएं हैं , जो पूर्णतः लय पर आधारित हैं । ये तो हर कोई जानता है ... एक शब्द में कहें तो संपूर्ण विश्व एक ही लय के अनुसार एक व्यवस्था में है । स्पष्ट रूप से कहें तो लय के बिना कोई संसार नहीं है । यदि हम अपनी पृथ्वी से अलग आकाश का अवलोकन करें तो हमें हर चीज़ एक लय में दिखाई देगी । सूर्य , चंद्रमा और तारों की भी एक पूर्ण लय है हम जानते हैं कि पृथ्वी को अपने चारों ओर घूमने में एक दिन लगता है और यह एक ऐसी लय है जो किसी भी समय अपनी गति नहीं बदलती है यानी एक बार इसे आधा दिन लगता है और दूसरी बार इसे दो दिन लगते हैं । इसी प्रकार चंद्रमा एक माह की अवधि में पृथ्वी की परिक्रमा करता है । चन्द्रगति भी अनादिकाल से एक ही है । इसी प्रकार भगवान सूर्य भी आकाशगंगा, प्रत्येक ग्रह और तारे में एक निश्चित गति से भ्रमण करते हैं । संपूर्ण दृश्य जगत लय पर निर्भर है । एक और बात जो हमें ध्यान रखनी है वह यह कि एक ग्रह का दूसरे ग्रह को छुए बिना घूमना भी लय पर निर्भर करता है । यह कहने की जरूरत नहीं है कि यदि लय गलत है, तो सितारे भी गलत होंगे ।       


सड़क पर चलने वाले वाहनों की एक लय (गति) होती है और जब भी लय बदलती है या लय रुकती है तो हम दुर्घटनाएं होते देखते हैं । कल्पना कीजिए कि एक आदमी सड़क पर चल रहा है , इसका मतलब है कि वह हर कदम पर लय तोड़ रहा है । यदि वह एक बड़ा और एक छोटा अन्यथा नहीं फेंक सकता तो उसकी गति बदलने से परिणामस्वरूप लय बदल जाएगी । लेकिन एक लय है . यदि आप तेजी से यात्रा करते हैं, तो आपकी लय तेज होगी ; यदि आप धीरे-धीरे यात्रा करते हैं, तो आपकी लय धीमी होगी । लेकिन हमेशा एक लय होती है . मनुष्य का जीवन एक लय में चलता रहता है . जन्म से लेकर अंतिम अवस्था तक  


एक प्रदर्शन जो लय को तोड़ता है वह भगवान द्वारा बनाया गया नृत्य है । इसीलिए ईश्वर का एक नाम नटराज भी है । उस परमेश्वर द्वारा लिखित नाटक में हर चीज़ की भूमिका होती है । इंसानों की भूमिका इंसानों की भूमिका है, जानवरों की भूमिका उनकी है । कुछ निर्जीव वस्तुएँ तथा कुछ सजीव वस्तुओं का जीवित होना या न होना भी उस परमेश्वर की लीला का ही एक भाग है । यह बात हर साधक को पता होनी चाहिए . 


लय वह नहीं है जो लय है आमतौर पर हम लगातार कुछ न कुछ ऐसा करते रहते हैं जो एक लय में होता है और कुछ समय बाद काम खत्म हो जाता है । यानी लय रुक जाती है . एक ही लय के कारण फिर वह कार्य नहीं होता । आप हैदराबाद से काशी की यात्रा के लिए ट्रेन में चढ़े , ट्रेन चली और लय शुरू हो गई । कुछ देर बाद आपकी ट्रेन काशी पहुंच गई यानी तब तक ट्रेन की लय बंद हो गई यानी कि लय शांत हो गई .     


हर इंसान की सांस भी एक लय है , एक दिन वह लय बंद हो जाएगी और एक लय बन जाएगी । इसका अर्थ है जीवन का अंतिम चरण । परमेश्वर वह है जो लय और लय दोनों को नियंत्रित करता है । हमें यह जानने की जरूरत है . जब हमें लयकार के स्वरूप का ज्ञान हो जाता है , तब हमारे मन में यह भाव उत्पन्न होता है कि जो हमारा उद्धार करता है , जो हमारा उद्धार करता है , जो दयालु है , जो मोक्ष देता है, वह कोई और नहीं बल्कि परमेश्वर ही है । शिव मंदिर में हमें लय और ताल दोनों दिखाई देते हैं । हमारे ऋषि-मुनि हमें हर पल याद दिलाते रहते हैं कि हमें किस तरह का ध्यान करना चाहिए और किस तरह के विचार करने चाहिए जिससे हम जन्महीनता को प्राप्त कर सकें ।    


शिव मंदिर में हम पानी की एक-एक बूंद को भगवान शिव के लिंग पर गिरते हुए देखते हैं । उस पानी के बर्तन का पानी एक दिन या कुछ घंटों में ही खाली हो जाता है । उसी प्रकार मानव जीवन का समय भी क्षण - क्षण में विलीन होता जाता है और अंततः खाली हो जाता है । यानि उसका समय वहीं रुक जायेगा . इसलिए इस बात का ध्यान रखना चाहिए कि समय बहुत मूल्यवान है । और हमें समय का उपयोग कैसे करना चाहिए , जिस प्रकार पात्र में पानी की बूंद- बूंद करके भगवान का अभिषेक किया जाता है , उसी प्रकार हमारा मन भी हमेशा उस भगवान यानी कि भगवान शिव के चरणों में रहता है , और यदि हम सदैव उसके संपर्क में रहेंगे , तभी हमें उसकी करुणा का अनुभव होगा ।     


यदि हम इस सत्य को जान लें कि शिव बाहरी नहीं बल्कि हमारे हृदय में संग्रहीत हैं , तो अपने हृदय के स्वामी को सदा के लिए नापते - नापते रहने से हमें निश्चित ही मुक्ति मिलेगी । इस तरह से यह है  


मुझे अपने द्वारा ली जाने वाली सांस को अजपा जप मानना ​​चाहिए और नियमित रूप से अजपाजप करना चाहिए । अर्थात् ऐसा अनुभव करना कि मैं दिन भर जप कर रहा हूँ । मेरे मन में ऐसी भावना होनी चाहिए कि मैं स्नान कर रहा हूं अर्थात भगवान शिव का अभिषेक कर रहा हूं । मैं बोल रहा हूं कि मैं शौच और मूत्र कर रहा हूं जिसका मतलब है कि मैं भगवान शिव से अशुद्धियां दूर कर रहा हूं यानी भगवान शिव बोल रहा हूं । यह स्थिति उतनी आसान नहीं है जितना हम कहते हैं , यह केवल कड़ी मेहनत और अथक उद्योग से ही संभव है । लेकिन यह असंभव नहीं है . " मेहनत से बर्बादी "        


ॐ तत्सत्


ॐ शांति शांति शांति


इस कदर 


आपका भार्गवशर्मा

From telugu to hindi google transportation

पवित्र-अपवित्र

  पवित्र-अपवित्र


From telugu to hindi google translation


 हम अपने जीवन के अनुभवों में अक्सर दो चीजें देखते हैं। एक पवित्र है और दूसरा अपवित्र है , हमें अपनी आवश्यकता के अनुसार इन दोनों की आवश्यकता होती है। अगर आप घर में ताजा पानी पीने के लिए खड़े होते हैं और उसे किसी जार या स्टील के छोटे ड्रम में रखते हैं और जब भी आपका मन हो उसे गिलास में भरकर पीते हैं, इसका मतलब है कि आप उस पानी को पवित्र रख रहे हैं। . वह पानी है जो आप उपयोग करते हैं, अर्थात वह पानी जो स्नान और बर्तन धोने जैसे विभिन्न कार्यों के लिए उपयोग किया जाता है, इसे आप एक बड़े ड्रम या पानी की टंकी में रखें, बाल्टी में भरें और उस पानी को एक कप या मग। यहां बाल्टी में पानी और बाल्टी में पानी दोनों एक ही जगह से लिया जाता है लेकिन उनका उपयोग केवल अपने उद्देश्य के लिए किया जाता है। आप बाल्टी में पुण्य लेकर नहीं नहाते और आप बाल्टी में पानी नहीं पीते, पानी एक ही होते हुए भी जरूरत के हिसाब से अलग-अलग रखते हैं। भूमिका के आधार पर, एक स्थान का जल पवित्र माना जाता है और दूसरे स्थान का जल सामान्य माना जाता है।  


भक्ति मार्ग में भी यही सिद्धांत लागू होता है। मंदिर में जो सीढ़ियाँ, दीवारें और गुंबद हम देखते हैं वे सभी पत्थर से बने हैं। इसी प्रकार, गर्भ गुड़ी में शिवलिंग लेकिन विष्णु की मूर्ति भी एक ही पत्थर से बनाई गई होगी। लेकिन हम गर्भगृह के पत्थर की पूजा क्यों करते हैं क्योंकि हम उस पत्थर को पवित्र मानते हैं। हाल ही में, कुछ अज्ञानी लोग यह तर्क दे रहे हैं कि यदि मंदिर की सीढ़ियाँ, वाशिंग स्टोन और मंदिर के खंभे सभी एक ही पत्थर से बने हैं, तो गर्भ मंदिर में केवल शिवलिंगम या विष्णु की मूर्ति ही एकमात्र है। देवता. ऐसे लोगों को यह जानने की आवश्यकता है कि यदि आप अपने घर में पानी दो प्रकार से रखते हैं अर्थात स्वच्छ (पवित्र) पीने का पानी एक बांध में रखते हैं और साधारण पानी को बाल्टी में रखते हैं, उसी प्रकार यदि आप जानते हैं तो कोई भी निंदा नहीं कर सकता है। सच तो यह है कि यहां आप मूलविरट्टू को पवित्र और बाकी पत्थरों को सामान्य मानकर डाल रहे हैं। 




हिंदू धर्म में हर चीज़ के प्रति प्रतिबद्धता है। केवल अज्ञानी लोग ही आलोचना कर सकते हैं। 




ॐ तत्सत् 




शांति शांति शांति 




बुधजन आज्ञाकारी है 




सी। भार्गव शर्मा, 

కృష్ణ జననం

 *సుందర సుమధురం - కృష్ణ జననం*

                  ✍️ - జి. రామచంద్ర, కనగాల

🙏🦚🦚🦚🦚💐💐🦚🦚🦚🦚🙏


*ప్రతిమలోనైనా ప్రత్యక్షంగానైనా శ్రీకృష్ణుడి సుందర రూపాన్ని దర్శించడం కళ్లు చేసుకున్న అదృష్టం. ఆ మురళీధరుడి వేణుగాన మాధుర్యాన్ని ఆస్వాదించగలగడం చెవులకు దక్కిన వరం. మంచిని బోధించిన ఆ భగవానుడి మాట "గీత" అయ్యింది. గోపాలుడు పాండవులకు అండగా నిలవబట్టే ధర్మస్థాపన సాధ్యమైంది. ఆ జగన్నాటక సూత్రధారి లీలా విలాసాలు మాటలకందని మాధుర్యాలూ.. చెప్పనలవికాని పరమాద్భుతాలు.*


꧁┉┅━❀🔯❀━┅┉꧂


*చేత వెన్నముద్ద.. చెంగల్వ పూదండ.. బంగరుమొలతాడు పట్టుదట్టి.. సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు.. చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతు'*  


🌈 ఈ ఆటవెలది పలకని తెలుగువాళ్లుండరు. విశ్వ సృజన కర్త అయిన మాధవుడికి జననం ఒక ఆటవిడుపు. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు తన లీలా విలాస ప్రదర్శనకు ముందుగానే చేసుకున్న ఏర్పాట్లు, జీవన సమరంలో మనకెదురయ్యే సందేహాలకు సమాధానం శ్రీకృష్ణావతారం.


🌈 నేస్తాలతో ఆటపాటలు, గోపికలతో దుడుకు చేష్టలు, పూతన తదితర రాక్షస సంహారం, కాళీయుని మదమణచడం.. వంటి చిత్రవిచిత్ర పనులతో బాల్యాన్ని ఆస్వాదించిన నందగోకుల విహారి శ్రీహరి.


🌈 శ్రీకృష్ణ నామాన్ని స్మరించడమంటే అమృతాన్ని ఆస్వాదించడమే. ఆ దేవదేవుడి స్వరూపం అంతకంటే మధురం. అందుకే విశ్వమోహనుడి సుందర స్వరూపాన్ని దర్శించాలని దేవతలూ, రుషులూ శక్తికొద్దీ యత్నించారు. కానీ ఎవరికైనా దొరికాడా ఆ వెన్నదొంగ!


*చిక్కడు సిరికౌగిటిలో, జిక్కడు సనకాది యోగిచిత్తాబ్దములన్*

*జిక్కడు శ్రుతి లతికావళి, జిక్కె నతడు లీల దల్లిచేతన్ రోలన్*


🌈 శ్రీ మహాలక్ష్మి కౌగిటికీ చిక్కనివాడు, సనకాది మునీంద్రులు చిత్తంలోనూ స్థిరంగా నిలవనివాడు, వేదాలు చదివినా అర్ధం కానివాడు.. ఆశ్చర్యంగా తల్లి యశోద చేతికి చిక్కి రోలుకు బంధితుడయ్యాడు. 


🌈 ఆహా..! అమ్మ ప్రేమ మాధుర్యానికి అంతర్యామి అయినా తలవంచక తప్పదనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది? మన్ను తిన్న నోట్లోనే మిన్నును, మొత్తం అంతరిక్షాన్ని ఇముడ్చుకున్న బృందావన సంచారి ఆ శిఖిపింఛ మౌళి.


🌹 *సుమధుర వాత్సల్యం* 🌹


🌈 మనం మాయాబంధితులం. కష్టాల కార్చిచ్చు -  జీవితాన్ని దహించేయడానికి సదా సిద్ధంగా ఉంటుంది. తప్పించుకునే తరుణోపాయం కోసం అన్వేషిస్తే నల్లనయ్య చల్లని కృపకు పాత్రులం కావడమేనని అర్ధమవుతుంది. 


🌈 కన్నయ్య గొప్ప యోగి అడవిలో చెలరేగిన దావానలాన్ని మింగి గోవులను, గోప బాలకులను రక్షించిన మహిమా సంపన్నుడు. ఆ యోగ బలాన్ని ప్రత్యక్షంగా దర్శించిన గోపాలకులు *'ఈ బాలుడు బ్రహ్మో, విష్ణువో శివుడో అయ్యుంటాడే గానీ సామాన్యుడు కాడు'* అనుకున్నారు. అరణ్యంలో పుట్టిన దావాగ్నిని అవలీలగా అజచేసిన ఆ యోగిపుంగవుడికి భక్తుల్ని కష్టాల కార్చిచ్చు నుంచి బయటపడేయడం శ్రమ కాదు. మనుషులకే తప్ప సృష్టికర్తకు రాగాలుండవు. నిప్పులాంటి స్వచ్ఛత పరమాత్మ తత్వం. చెదల వంటి వైషమ్యం అంటితే దేవుడెలా అవుతాడు. కృష్ణుడు పరమాత్ముడని రుజువు చేస్తుంది భాగవతం. గోపికలు కాంక్షతో సేవించారు. కంసుడు ప్రాణభయంతో తలచుకున్నాడు. కృష్ణుణ్ణి ఎలా కష్టపెట్టాలన్నదే శిశుపాలుడి నిరంతర ఆలోచన.


🌈 యాదవులంతా బంధుప్రీతితో స్మరిస్తే, పాండవులేమో స్నేహభావంతో మెలిగేవారు. ఎవరు ఎలాంటి భావంతో తలచుకున్నా అందరికీ మోక్షాన్ని అనుగ్రహించాడంటే ఆ సర్వేశ్వరుడి వాత్సల్యం ఎంతటిదో! *మోక్ష పథగాములకు ఆయన శ్రీ చరణ సన్నుతి తప్ప అన్య గతి లేదు.* 


🌈 భాగవతం మరో రహస్యాన్ని కూడా బోధిస్తుంది. ఆ కథలను వింటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. శ్రవణేంద్రియాల ద్వారా హృదయపద్మంలోకి ప్రవేశిస్తాడు. శరదృతువు వచ్చే వేళకు నదిలో మాలిన్యమంతా అడుగుకు చేరి స్వచ్ఛమైన నీరు పైకి తేలినట్లు కన్నయ్యను మనసులో నిలిపితే దోషభావాలన్నీ అడుగంటిపోతాయి. ఇక ఆ మహితాత్ముడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. మాటల్లో సత్యం ప్రతిష్ఠితమవుతుంది. చేతల్లో స్థిరత్వం ప్రతిపాదితమవుతుంది. కృష్ణభగవానుడి అనుచరులం అనిపించేలా వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. అందుకే అనునిత్యం కృష్ణుణ్ణి స్మరించమంటారు పెద్దలు. తెలిసీతెలియక చేసిన పాపాలు కృష్ణ నామస్మరణతో నశిస్తాయంటోంది స్కాంద పురాణం. కుచేలుడిపై కృష్ణుడు చూపిన స్నేహమాధుర్యం అందుకు సాక్ష్యం. అర్జునుడితో సాగించిన నర నారాయణ సంబంధం ఆత్మ స్వరూపులమైన మనతో ఆ పరమాత్మ చుట్టరికాన్ని కూడా కలపగలడని అవగతమవుతుంది.


🌹 *ఆయుధం పట్టని వీరుడు* 🌹


🌈 కురుక్షేత్ర యుద్ధంలో గోపాలుడు ఆయుధాన్ని చేపట్టలేదు. యుద్ధం గెలవడానికి మాత్రం కారణమతడే. యుద్ధ విముఖుడై వెనుదిరిగిన పార్ఖుణ్ణి ముందుకు నడిపిన బోధ., అదే *భగవద్గీత.* సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు పాండవ సైన్య శ్రేణిని ఊచకోత కోస్తుంటే భీష్ముణ్ణి సంహరించడానికి ధర్మరాజుతో సగం అబద్దం పలికించినప్పుడు సకల వేదవేత్త అయిన ఆ కృష్ణ పరమాత్మ అసలైన రాజకీయవేత్తలా అనిపిస్తాడు. ప్రత్యక్షంగా కనిపించకున్నా జీవితాన్ని ఎంత అందంగా మలచుకోవాలో తెలియజేసిన ఆ మాధవుడే మన గురువు. ఆ మహితాత్ముడే మన ధైర్యం. ఆ మహనీయుడే మన సైన్యం. కనుకనే... *కృష్ణుడి జన్మదినం పర్వదినం, విశ్వ కల్యాణ కారకం.*


*Courtesy:* ఈనాడు మకరందం

 *జైశ్రీరామ్*

🙏🦚🦚🦚🦚💐💐🦚🦚🦚🦚🙏

 గాంధర్వం కవిత్వంచ  దాతృత్వముచితజ్ఞత ౹

ప్రయత్నే నోపజాయంతే చత్వారస్సహజా గుణాః॥


బాగా పాడగలగటం, కవిత్వం, దానము చేయు గుణము, సమయం, సందర్భం తెలిసి మాట్లాడటం అను ఈ నాలుగు గుణములు సహజ సిద్ధముగా రావలసినవే గాని నేర్చుకుందామంటే సాధ్యం కాదు.

పుష్పకవిమానాల

 మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -


    ఈ ప్రపంచం లో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు . నా పరిధిని అనుసరించి కొంతసమాచారం నేను సేకరించాను . అది ఇప్పుడు మీకు తెలియచేస్తాను.  


      ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు . ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు భయపడ్డాడు . అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాల్ని అత్యంత రహస్యముగా ఉంచాడు. 


         అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు. వాటిలో ఒక అద్బుత గ్రంథం " గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు " దీని గురించి చరిత్రకారులు కు తెలుసు కాని వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు . ఈ పుస్తకం ప్రధానంగా "గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ" సమాచారం కలిగి ఉంటుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంధాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు .దీనికోసం చాలామంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు.  


          కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి. అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి . వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు. వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియచేసారు. 


           లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్థ్రాలుగా పేర్కొన్నారు . ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేసారు. అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకొనే "యాంటిమ" చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే "గరిమ" , పెద్ద వస్తువుని సైతం బరువుతక్కువ గా చేయగల "లగిమ" రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి.


         చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్ గా తీసుకోలేదు . ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది . యాంటి గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి .


          గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలు లో అంత వివరంగా లేదు . కాని మొత్తంమీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి . భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంతో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది . రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడి పైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదరభాగంలో ప్రతిష్టించింది . ఇది రామాయణంలో నేను కూడా చదివాను. 


           నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ , ఏరోస్పేస్ టెక్నాలజీ కి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే . వారి పూర్తిపరిజ్ఞాన్ని మనం అర్ధం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకి వెళ్లవలిసిందే . 


            ఉత్తర భారతదేశం ,పాకిస్తాన్ లో ఉండేది అని చెబుతున్న "రామరాజ్యం" పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది. ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి. వీటిలో చాలామటుకు నగరాలను పాకిస్తాన్ , ఉత్తరపశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మద్యభాగంలో "అట్లాంటియన్ " నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరత ఖండంలో రాముడు రాజ్యం చేసాడు .రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో "సప్తఋషి" నగరాలుగా ప్రసిద్ది చెందాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ఉపయోగించే వారని ప్రాచీన బారతీయ గ్రంథాలలో ఉన్నది . భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు , పైభాగాన గుమ్మటం ( డోము ) బయట చుట్టూరా రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియచేశాయి .   


           ఈ విమానం అనేది వాయువేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడినది. అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి . ఈ విమానాల్ని తయారుచేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు. ఈ విమానాల్లో కొన్ని సాసర్ ఆకారంలో మరికొన్ని సిగిరెట్ ఆకారం లో నిలువుగా కూడా ఉండేవి . 


        విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం "సమరసూత్రధార" ఈ గ్రంధంలో విమానం తయారి , అది బయలుదేరే తీరు , వేలాది మైళ్ళు ప్రయాణించుటకు కావలిసిన వివరాలు , బలవంతంగా దానిని కిందకి దించే విధానం , ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టటానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విశదపరిచే 230 శ్లోకాలు ఈ గ్రంధరాజంలో ఉన్నాయి. 


         క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్బుత గ్రంథం "భరద్వాజ వైమానిక శాస్త్రం" ఈ గ్రంధాన్ని 1875 వ సంవత్సరం లో ఒక ఆలయంలో కనుగొన్నారు. విమానాల పనితీరుపైన ఇందులో చాలా ఆసక్త్తికరమైన ముఖ్యవిషయాలు ఉన్నాయి . విమానాన్ని ఎలా నడపాలి , దూరప్రాంతానికి ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు , మెరుపులు నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్యవిషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 


                  భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి . విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరోక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవడం పై విస్కృత సూచనలు ఉన్నాయి . బహుశా ఆ ఉచిత ఇంధనవనరు యాంటి గ్రావిటి కావొచ్చు అని పరిశోధకుల అభిప్రాయం . ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి . 


        "వైమానిక శాస్త్ర " లో నిప్పంటుకోని,విరగని సామగ్రి , పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు , బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . ఈ వాయువాహనాల్లో ని 31 ప్రధాన భాగాలను , వాటి తయారీకి ఉపయోగించే 16 పదార్థాలు , సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రధాన భాగాల తయారికి ఉపకరించే సామాన్లు , పదార్థాలు వేడిమికి , మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించాడు . 


          ఈ విమానాలు ఒక రకమైన యాంటి గ్రావిటీ తో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కరలేదు అని చెప్పుకోవచ్చు. విమానాలు నిలువుగా గాలిలో లేచేవి . ప్రాచీన కాలంలో గగనవిహారం పైన దాదాపు 70 మంది సాధికార వ్యక్తులు , 10 మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు.కాని వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు . 


         విమానాలని విమానగృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరచేవారు. విమానాలను కొన్నిసార్లు పసుపుఛాయతో ఉండే తెల్లనిద్రవంతో మరికొన్నిసార్లు ఒకరకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది . ఈ ఇంధనం విషయంలో చాలమంది పరిశోధకులు సరైన అవగాహనకి రాలేకపోయారు . ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయొగించుటకు పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేసి ఉంటారు .


          ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ V -8 "బజ్ బాంబులు" కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేశారు . ప్రాచీన భారతావని , టిబెట్ అంటే నాజీలు , వారి అధినాయకుడైన హిట్లర్ కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు . ఈ దేశాల్లోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్ కి నమ్మకం . 


            ప్రాచీన భారతావని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం . ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన "రహస్య సాక్ష్యాధారాలు" కోసం వాటిని సేకరించడానికి 30 వ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు.


         మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలో ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉన్నది. విమానం గుండ్రంగా ఉన్నది. పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోధకుడు దానిని అన్నివైపులా తిప్పగలిగేలా ఉండేది . మరో ప్రాచీన గ్రంథం "సమర" లో లో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి . వెనుక భాగంలో మండే అగ్నికీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది. 


      " సమరాంగణ సూత్రధార " ఈ వాహానాలని ఎలా నిర్మించారో వర్ణించింది. పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలీయమైన సంభంధం ఉన్నది. నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉన్నది.


      సోవియట్ పరిశోధకులు తుర్కుమెనిస్థాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు . వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది . ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలిన్ తో తయారుచేసిన అర్ధగోళాలు వీటిచివర్లు మొనదేలి ఉన్నాయి . లోపల కొన్నిచుక్కల పాదరసం లభించింది. 


        రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయ్యింది .కాని ఆ లిపి యొక్క అర్థం ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. మొహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపి ని రాంగో లిపి అంటారు. ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.


   భవభతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదోవ శతాబ్దం నాటిది . ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది. అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాలు గురించి ఎన్నో విషయాలు తెలియచేశాయి . అట్లాటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాలు గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది. 


              భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి. ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు . ఇవి వివిధ ఆకారాల్లో , పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలురకాలుగా వివరించాయి.  


      "అగ్నిహోత్ర విమానం" రెండు ఇంజన్ల తో ఉంటుంది. "గజవిమానం" అనేక ఇంజన్లతో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాలకొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి. పరిశోధకుల అబిప్రాయం ప్రకారం ఇవి 80,000 హార్స్ పవర్ శక్తితో నడిచేవి . 


        పది నుంచి పన్నెండువేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉన్నది. ఆనాటి యుద్ధంలో భయంకరమైన విద్వంసక ఆయుధాలు ఉపయోగించారు . వాటిలో అప్పుడు జరిగిన యుద్దం గురించి ఈ విధంగా వివరణ ఉన్నది. 


      " ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది. కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలుని ఆవరించిన పొగ ...ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలవంతమైన వెలుగులతో నిండిన అగ్నికీలలు ...మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మన్దమైన మృత్యుసందేశ వాణి ఇవన్ని కలిసి అంధకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి " .


       పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి. మట్టివస్తువులు ,ఇళ్లు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి. పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారపదార్థాలు అన్ని ఆ ప్రళయ బీభత్సానికి గురిఅయ్యాయి. దానిబారి నుంచి రక్షించుకొనుట కొరకు , తమ దేహాలు , ఆయుధాలు, వస్తుసామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు , కాలువల్లోకి దూకారు . ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణు యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉన్నది. 


        గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలలో కొన్నిటికి చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు. వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమ్మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయ్యినట్టుగా తేల్చారు. ఇటుకలు, గాజు కరిగి ముద్దలా పడివున్నాయి . ఒకరకంగా చెప్పాలి అంటే హిరోషిమా , నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబులు కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది.ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ప్రాన్స్ , టర్కీ , స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి . 


      మహేంజదారో వీధులలో గాజు గోళాల వంటి నల్లటి పదార్థం పెద్దమొత్తంలో పేరుకొనిపోయింది. వీటిని పరిశీలించగా అత్యంత వేడిమిదగ్గర కరిగిన మట్టికుండలు అని తేలింది . ఇక్కడ ఇంకొ ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉన్నది . మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండువేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినపుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్లెం వంటి ఆకారాలు కలిగిన వాయువాహనాలు విరుచుకుపడ్డాయి అని కాని ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారుల తమ గ్రంథాలలో రాశారు. 


        ఆధునిక పరిశోదకుల అబిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు. పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉన్నది . బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటారు. 


  

   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సరైన వ్యక్తులే నీకు మిత్రులు

 *శుభోదయం* 

"నువ్వు నిజాయతీగా ఉంటే, చాలా మంది మిత్రులు నీతోపాటు ఉండకపోవచ్చు కానీ, ఖచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు".

       

"ఒకరి మీద ప్రేమని, ఇష్టాన్ని 

మరొకరి మీద చూపించలేము.

ఒకరి మీద కోపాన్ని చిరాకుని వేరొకరి మీద ఎందుకు చూపించడం?"

ఆగష్టు, 27, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🍁 *మంగళవారం*🍁

🌹 *ఆగష్టు, 27, 2024*🌹

     *ధృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి   : నవమి* రా 01.33 వరకు ఉపరి *దశమి*

*వారం:మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం  : రోహిణి* సా 03.38 వరకు ఉపరి *మృగశిర* 


*యోగం  : హర్షణ* రా 08.31 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : తైతుల* మ 01.52 *గరజి* రా 01.33 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.30 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*మ 12.28 - 02.03*

అభిజిత్ కాలం  : *ఉ 11.44 - 12.34*


*వర్జ్యం          : ఉ 07.43-09.18 & రా 09.17-10.54*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.00 - 11.46*

*రాహు కాలం: మ 03.16 - 04.50*

గుళికకాళం      : *మ 12.09 - 01.43*

యమగండం    : *ఉ 09.01 - 10.35*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 05.53* 

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం   :      *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    :*10.54 - 01.24*

అపరాహ్న కాలం: *మ 01.24 - 03.54*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ నవమి*

సాయంకాలం  :  *సా 03.54 - 06.24*

ప్రదోష కాలం  :  *సా 06.24 - 08.42*

నిశీధి కాలం      :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

*_గోమాతను 🐄పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ ఆంజనేయం శిరసా నమామి*


♦️మత్కధావేక్షితా యావత్ 

యావత్ పర్వతసంస్థితి: 

యావచ్చంద్రశ్చసూర్యశ్చ 

తావత్వం సుఖితోభవ 

పశ్చాత్ చతుర్ముఖో 

భూత్వ సృష్ట్యా లోకాన్ 

యధావిధి త్రిలోకవాసిభిస్స్వార్ధం

మత్స్వరూపము పైష్యసి♦️ 


👉లోకములో #రామకధ ఉన్నంత వరకు...

పర్వతాలు సూర్యచంద్రులు

ఉన్నంతవరకు... 

నీవు చిరంజీవిగా ఉండి... 

తర్వాత కల్పంలో

 #భవిష్యత్_బ్రహ్మ వై లోకాలను 

సృష్టించి, పాలించి 

ఆ కల్పాంతంలో 

నా సాయుజ్య ముక్తిని పొందుతావు

అని భావం.


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పెళ్ళి ముచ్చట్లు :-

 కనుమరుగయిన ఆనాటి పెళ్ళి ముచ్చట్లు :-


పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక.


పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. 


సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.


పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. 


వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి, పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. 


ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.


ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి.మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాము 😃

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 23*

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝 శ్లోకం 𝕝𝕝 


*తరఁగల్‌ పిప్పల పత్త్రముల్‌ మెఱుఁగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌*


*కరికర్ణాంతము లెండమావులతతుల్‌ ఖద్యోతకీటప్రభల్‌*

*సురవీథీలిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్స్నాపయఃపిండముల్‌*


*సిరులం దేల మదాంధు లౌదురు జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 23*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మనిషి ప్రాణములు నీటి కెరటముల వంటివి, రావిచెట్టు ఆకులవంటివి, మెఱుగు దిద్దిన అద్దములవంటివి, గాలిలోని దీపకళికలవంటివి, ఏనుగు చెవులవంటివి, ఎండమావులవంటివి, మిణుగురుపురుగుల వంటివి, ఆకాశపు అక్షరములవంటివి, వెన్నెలముద్దల వంటివి.... అట్టి అశాశ్వతమైన జీవితములలో సిరులను చూసి జనాలు ఏల మదాంధకారులవుచున్నారు? ప్రభో?*


✍️🌹💐🌷🙏

శ్రీకృష్ణుడు

 శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు...

శ్రీకృష్ణుడు అధర్మవాది...

శ్రీకృష్ణుడు మాయలమారి..

శ్రీకృష్ణుడు ...ఎన్నో... ఎన్నెన్నో ఊహలలో అందరికీ అందినవాడు...

శ్రీకృష్ణుని గురించిన పలురకాల ఊహలు అభిప్రాయాలు, నిందలు, శిలాశాసనాలు...

ఎవరి చిత్తానికి వచ్చిన భావనలో వారు ఆ శ్రీకృష్ణుడిని చిత్రించుకున్నారు.

శ్రీకృష్ణ తత్త్వాన్ని అర్థం చేసుకున్న కొందరు ఆయన లీలలను ఆస్వాదించారు

ఆయన అంటే ఏమిటో బోధపరచుకున్నారు... 

          ఏయే వేళల నే సరోజముఖి యేయే లీలలం గోరు దా

        నాయా వేళల నా సరోజముఖి నాయాలీలలం దేల్చి, యే

       చాయం జూచిన దానయై మెలగుచున్సౌఖ్యాబ్ధినోలాడు భో

  గాయత్తుండయి పెక్కురూపముల మాయా కల్పనా చాతురిన్‌. 

                                                                                (పారిజాతాపహరణం ప్ర.ఆ.40)

       ‘‘ ద్వాపర యుగంలో స్త్రీలందరూ శ్రీకృష్ణునే తమ భర్తగా కావాలని కోరుకుంటే ఆ లీలామానుష విగ్రహుడు వారు కోరిన రూపాలలో వారికి దర్శనమిచ్చాడు. ఏ వేళలో ఏ స్త్రీ తనను ఏవిధంగా చూడాలనుకుందో, ఆయా రూపాలలో ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడు. ‘తానే అంతటా’ అన్నట్టుగా అందరికీ సౌఖ్యం కల్పించాడు. అనేక రూపాలను ఒకేసారి చూపిన మాయా కల్పనాచతురుడు,’’ అని నంది తిమ్మన పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని వర్ణించాడు. 

పారిజాత పుష్పం విషయంలో సత్యభామకు వచ్చిన కోపాన్ని పాద తాడనంతో చూపింది. అది కూడా బ్రహ్మ, ఇంద్రాదుల చేత పూజలందుకునే ఆ జగన్నాథుని మీద ప్రదర్శించింది. అయినా ఆయనకు కించిత్తు కోపం కూడా కలగలేదు. పైగా.. తన కఠిన వక్షస్థలాన్ని తాకిన సత్యభామ లేత పాదం కందిపోయిందేమో చూడమని లాలనగా పలికాదు. ఇతరుల మనసును నొప్పించలేని శ్రీకృష్ణుడు తనను నిందించిన వారిని సైతం క్షమించే గుణం కలవాడు. అంతటా తానే అనే విషయాన్ని నిరూపించడానికే గీత ప్రబోధించాడు. మీరా వంటి భక్తురాలిని తనలో ఐక్యం చేసుకున్నాడు. పెంచిన తల్లి యశోదకు తన ముద్దుముద్దు మాటలతో, చేష్టలతో ఆనందాన్ని కలిగించాడు. కన్నతల్లిదండ్రులయిన దేవకీ వసుదేవులను చెర నుండి విడిపించాడు. కంస సంహారం చేశాడు. చీరలిచ్చి ద్రౌపది మానం కాపాడాడు. అర్జునునికి భగవద్గీత బోధించాడు. కర్మసిద్ధాంతాన్ని జాతికి అందించాడు. ధర్మహాని జరిగిన ప్రతి చోటా ధర్మాన్ని నిలబెట్టాడు. ఎక్కడ ఎప్పుడు తన అవసరం ఉందో అక్కడ అప్పుడు ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. 

                                                                           డా. పురాణపండ వైజయంతి

దేవాలయాలు - పూజలు 23*

 *దేవాలయాలు - పూజలు 23*


6) *తీర్థము* :- తీర్థం అంటేనే తరింపజేసేది అని అర్థము. భగవంతునికి ఆరాధనా పూర్వకంగా పంచామృత స్నాన/ అభిషేక గంగనే (జలము) తీర్థం కాబట్టి ఈ పావనోదకము ప్రభావ మరియు ఔషధ గుణాలు/శక్తులను కల్గి ఉంటుంది. ఈ తీర్థం మహిమాన్విత మంత్ర సంయుక్తం కూడా. స్వీకరించిన వారికి సర్వ శుభాలను అందజేస్తుంది. గత వ్యాసాలలో వివిధ తీర్థముల గురించి తెలుసుకునియున్నాము. మరొకసారి పునశ్చరణ.... *పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం, జల తీర్థం, కషాయ తీర్థం,తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చ కర్పూరం తీర్థం*. తీర్థ సమయంలో ఒక్కొక్క సారి అర్చక స్వాముల వారు పాలు మరియు పెరుగు కూడా అందజేస్తారు. పూజాదికాల అనంతరం తీర్థ గ్రహణ వలన, గ్రహించిన వారిలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. 


భగవత్ పరమైన కార్యక్రమాలన్నియు నియమ నిష్ఠలతో మరియు నియమాలతో కూడి శాస్త్ర మరియు జ్ఞాన పరంగా ఉంటాయి, *భక్తులు పాటించవలసి ఉంటుంది*. శాస్త్ర మరియు జ్ఞాన పరంగా ఉంటాయి కాబట్టి అవి భక్తులకు హిత కరములే. భక్తులు గమనించాల్సింది *అన్నిటికంటే "భక్తి" ప్రధానం*


*నియమాలు*

1) *సావధానంగా*:- పూజల అనంతరము మాత్రమే తీర్థమును ప్రశాంతంగా, సావధానంగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. అవతల పనులున్నాయని అర్చక స్వాముల వారిని ఇబ్బంది పెట్టీ, బలవంత పెట్టీ, పూజ మధ్యలోనే తీర్థము కోరరాదు, పుచ్చుకోరాదు. సాధారణంగా గృహాలలో ఈలా జరుగుతూ ఉంటుంది.

2) తీర్థం తీసుకును నప్పుడు భక్తులు చేతిని గోకర్ణ (గోవు చెవి) ముద్ర వేసి అనగా ఈ ముద్రలో బొటన వేలు చూపుడు వేలును అంతర్ మడతతో నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్ళు మాత్రం ముందుకు సాగి ఉంటాయి. తీర్థము మినప గింజ పరిమాణంలో తీర్థము జాగ్రతగా పుచ్చుకోవాలి.

ఇందుకు శాస్త్ర ప్రమాణం..

*గోకర్ణాకృతి హస్తేన మాష మగ్న జలం పిబేత్* దేవాలయంలో గాని గృహంలో గాని పూజానంతరమే తీర్థం స్వీకరించాలి. *వాయు ముద్ర* లో తీర్థము సాధారణంగా పుచ్చుకోన రాదు, నిషిద్ధము. వాయు ముద్ర అంటే కుడి అరచేతిని మొత్తము వెడల్పుగా చాపడము. అలవాటుగానో, పొరపాటుగానో *వాయు ముద్ర* లో తీర్థం పుచ్చుకుంటే ఆ ప్రభావాలు వేరుగా ఉంటాయి.


3) *తీర్థం ఎన్ని సార్లు*:- దేవాలయంలో అవుతే ఒకసారి మాత్రమే. పూజలు నిర్వహించ బడిన గృహంలో...ఆ గృహంలోనే భోజనం చేసే అవకాశం, అవసరం ఉంటే.. తీర్థం *ఒకేమారు* పుచ్చుకోవాలి. ఆ గృహంలో భోజనం చేసే అవకాశం లేకుంటే తప్పనిసరిగా *మూడు సార్లు* తీర్థం స్వీకరించాలి. తీర్థం మూడు మార్ల విశిష్టత గూడా తెలియజేయ బడినది. *మొదటి* సారి పుచ్చుకున్నపుడు శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

*రెండవ సారి* పుచ్చుకున్నప్పుడు న్యాయ మరియు ధర్మ ప్రవర్తనలు అబ్బుతాయి.

*మూడవ సారి* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం దక్కుతుందని పెద్దల విశ్వాసం.

మూడు సార్లు శ్రద్ధ, భక్తి, నియమ, నిష్ఠలతో తీర్థం పుచ్చుకుంటే భోజనము చేసినంత ఆత్మ నిబ్బరం లభిస్తుందని భక్తుల విశ్వాసము.

4) *ఉపవాస తదనంతరం* 

ఏకాదశి మరియు మిగతా పర్వ దినాల సందర్భంగా... ఉపవాసం ఉన్న మరుసటి ఉదయమే ఒకసారి తీర్థం పుచ్చుకోవాలి. *ఈ చర్య ఉపవాస దీక్ష ఉపసంహరణ (ముగింపు) ను తెలియజేస్తుంది*.

5) *తీర్థం స్వీకరణ* :- 

భక్తులు నుదుట తిలకము, విభూతి, కుంకుమ, చందనము ఇత్యాది మంగళకర లేపనములు లేకుండా తీర్థము స్వీకరించరాదు. 

తీర్థం కుడి చేతితో స్వీకరించాలి. నోటి వెంట శబ్దము కాని *జుఱ్ఱు* మని చప్పుడు రాకూడదు. ఆ వెంటనే తలపై చేతిని అద్దుకో రాదు, తుడుచుకోరాదు. తీర్థము గ్రహించునప్పుడు పై కండువా, ఉత్తరీయము, చేతి రుమాలు, మహిళలు అవుతే చీర చెంగును, బాలికలవుతే ఓణీని గాని హస్తము దిగువన ఉంచి తీర్థము తీసుకొన వలసి ఉన్నది, ఉంటుంది కూడా. తీర్థము ఒక చుక్క కూడా నేలపై పడరాదు. *గమనిక* అర్చక స్వాములు భక్తులకు తీర్థము ఇచ్చినప్పుడు యథాలాపంగా, అన్యమనస్కులై, ఇతరులతో సంభాషించుచూ అశ్రద్దగా *ఉండరాదు* తీర్థము చేతిని నీటితో శుభ్రం గాని అందుబాటులో ఉన్న వస్త్రంతో గాని శుభ్రపర్చాలి. తలకు తీర్థమును అద్ద రాదను నియమానికి పెద్దలు తెలియజేసిన రెండు కారణాలు. మనుష్యులు తలపై బ్రహ్మ దేవుడు పరివేష్టించి ఉండడం. మరియొకటి తీర్థము భక్తులకు అందించిన పిదప అర్చక స్వాముల వారు శఠారిని భక్తులపై తలపై ఉంచి భగవత్ అనుగ్రహము కల్గిస్తారు. శఠారి అంటే భగవత్ పాదములు. తీర్థము పుచ్చుకున్న *ఎంగిలిని* బ్రహ్మ దేవుల వారికి మరియు భగవత్ పాదములకు *అంటించ రాదు*. 

6) *తీర్థ విశిష్ట సంప్రదాయము*. సాధారణంగా దేవాలయాలలో/పూజల సంప్రదాయములతో పరిచయమున్న భక్తులు, తీర్థ స్వీకరణ సమయంలో పుచ్చుకునేటప్పుడు మొదటి సారి *కేశవాయ స్వాహా* అని, రెండవ సారి *నారాయణాయ స్వాహా* అని మూడవ సారి *మాధవాయ స్వాహా* అని ఉచ్చరించడం ఆనవాయితి. ఇంకా ఇంకా విశిష్ఠులు పుచ్చుకునే విధానంలో *బ్రహ్మ తీర్థ, దేవ తీర్థ, ఋషి తీర్థ మరియు పితృ తీర్థ* పద్ధతులు పాటిస్తారు.


ధన్యవాదములు

*(సశేషం)*