ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
31, అక్టోబర్ 2023, మంగళవారం
శ్లోకానికి మంత్రానికీ తేడా ఏమిటి?*
*శ్లోకానికి మంత్రానికీ తేడా ఏమిటి?*
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🪷🪷🪷🪷🪷🪷
మననాత్ త్రాయతే ఇతి మంత్రః. గురుముఖంగా పొందేది మంత్రం.
కొన్ని లక్షల జపం చేసి శిష్యుడి శక్తికి తగినదైతేనే మంత్రాన్ని ఇస్తాడు గురువు. మంత్రం కొన్ని బీజాక్షరాల సంపుటీకరణం. దాని అర్ధం తెలియవలసిన అగత్యం లేదు.
అర్ధం లేని చదువు వ్యర్థం —అనేది మంత్రానికి పట్టదు.
మంత్రాధీనం తు దైవతం
డాక్టర్ సిఫార్సు చేసిన మందు వేసుకుంటాం.. అందులో ఏ కెమికల్సు ఉన్నాయో మనకు తెలియక పోయినా అది పనిచేస్తుంది గదా! పేషెంట్ బలాన్ని బట్టి మందు ఇచ్చినట్టే -శిష్యుడి సామర్థ్యం, ధరించగలిగిన శక్తిని బట్టీ గురువు మంత్రం ఇస్తాడు.
శ్లోకం చెప్పడానికి ఛందస్సులో పరిజ్ఞానం ఉంటే చాలు.
ఎవరైనా చెప్పవచ్చు.
మంత్రం ఊహాశక్తితో చెప్పేది కాదు.
అంతర్ముఖులైన ఋషులకైన దర్శనాలవి .
మంత్రాలు కొన్ని కుటుంబాలలో ఉంటాయి. సేవించుకుంటూ ఉంటే కొన్ని తరాలపాటు ఆ మంత్రాధిష్ఠాన దేవత అనుగ్రహిస్తూ ఉంటుంది. పూర్వులు చేసిన ఉపాసన బలం అది. కుటుంబంలో ఉండాలి గాబట్టి తండ్రి కొడుక్కు ఆ ఇంటి విద్యను తప్పక ఇవ్వాలి. భరించే యోగ్యత లేనప్పుడు ఇవ్వకూడదు.
యోగ్యులకెంతమందికైనా ఇవ్వచ్చు . ఉపదేశకుడి ఉపాసనాబలం శిష్యుడి మంత్రసిద్ధికి మూలమౌతుంది. అందుచేత —జపానికి ముందు మంత్రమిచ్చిన గురువును, ఆ మంత్రద్రష్టయైన ఋషినీ స్మరించడం తప్పనిసరి..
కామ్యకర్మలకు నియమాలెక్కువ.
సమయమూ, జపసంఖ్య, ఆహారాది నియమాలూ పాటించాలి.
నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి—--మంచి పని చేసేవాడికెన్నడూ అమంగళం జరగదు నాయనా! అని భగవద్గీత.. కాబట్టి భయపడబనిలేదు గానీ త్వరగా సిద్ధి కలగాలంటే నియమాలు తప్పక పాటించాలి. మంత్రార్థం తెలియాలంటే కష్టం. లౌకిక సంస్కృత భాషకూ, మంత్రభాషకూ చాలా వ్యత్యాసం.
శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము —అనే షడంగాలు అధ్యయనం చేసినపుడే కొంతైనా మంత్రార్థం తెలుస్తుంది.
మంత్రం బీజాక్షరాల సంపుటి. అది శ్లోక రూపంలోగూడా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం 108 శ్లోకాలున్న మహా మంత్రం. శివుడు పార్వతికి ఉపదేశించింది గాబట్టి మంత్రం అయింది.
పుస్తకాలలో మంత్రాలు చూచి నేర్చుకోవడం వలన ఎటువంటి ఫలితమూ ఉండదు. పైగా అది వృథాప్రయాస అవుతుంది. మంత్రమనేది గురువు అనుగ్రహంతో గురుముఖమునుండి మాత్రమే పొందవలసినది.
బాగా తెలిసిన దారిలో పోవడం చాలా తేలిక.
కొత్తదారిలో అడుగడుగునా జంకు కొంకూ తప్పవు.
నమ్మకంగా ఎవరైనా తీసుకుపోగలరనుకొంటే —కళ్ళు మూసుకొనైనా నడిచిపోవచ్చు.
శ్రీ మారుతి మందిర్
🕉 మన గుడి : నెం 225
⚜ గోవా : పంజిమ్
⚜ శ్రీ మారుతి మందిర్
💠 సూర్యాస్తమయం తర్వాత గోవా రాజధాని పంజిమ్‌లోకి ప్రవేశించినట్లయితే, సముద్ర మట్టానికి ఎగువన, చీకటిలో ఉల్లాసంగా వెలిగించే ఒక దేవాలయం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు.
అదే పంజిమ్ లోని మారుతి మందిర్.
💠 మారుతీ మందిర్ రాత్రిపూట అందంగా వెలిగిపోతుంది మరియు ప్రకాశవంతంగా వెలిగించడం వల్ల ఆలయం దూరం నుండి కనిపిస్తుంది.
💠 ఆకుపచ్చ నేపథ్యంలో ప్రకాశవంతమైన నారింజ రంగులో పెయింట్ చేయబడిన పంజిమ్‌లోని అత్యంత అందమైన దేవాలయాలలో ఇది ఒకటి!
💠 ఈ మారుతి ఆలయం ఒక చిన్న కొండపై ఉంది, ఇక్కడ నుండి పంజిమ్ యొక్క తూర్పు భాగం, అలాగే రిబందర్ మరియు సెయింట్ క్రూజ్ సమీపంలోని గ్రామాలు, మాండోవి నది దాని మడ అడవులతో పాటు పక్షుల వీక్షణను చూడవచ్చు.
ప్రసిద్ధ లాటిన్ క్వార్టర్ ఆఫ్ ఫాంటైన్‌హాస్ (దీనిని మాలా అని కూడా పిలుస్తారు) ఈ కొండ దిగువన, ఆలయానికి దిగువన ఉంది.
💠 మారుతీ ఆలయం పంజిమ్‌లోని ఐదు ప్రధాన దేవాలయాలలో ఒకటి;
మిగిలినవి శ్రీ మహాలక్ష్మి ఆలయం,
శ్రీ ఆప్తేశ్వర్ గణపతి ఆలయం
శ్రీ సతీ ఆలయం (భట్లెం).
💠 1818లో, ఆ కాలపు ఉదారవాద పోర్చుగీస్ గవర్నర్ పంజిమ్‌లోని సంపన్న హిందూ సమాజానికి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు, దాని ఫలితంగా శ్రీ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడింది.
1900వ దశకం ప్రారంభంలో, నగరంలోని కొంతమంది వ్యక్తులు మరొక దేవాలయం అవసరమని భావించారు, ఆ విధంగా మాలా వద్ద మారుతీ ఆలయానికి విత్తనాలు నాటారు.
💠 ఆలయ నిర్మాణం 1931లో ప్రారంభమైంది మరియు జనవరి 1934 నాటికి పూర్తయింది. హనుమంతుని అసలు విగ్రహాన్ని స్థానిక వ్యాపారవేత్త రాందాస్ గోకుల్‌దాస్ క్సేటే గుజీర్ విరాళంగా ఇచ్చారని నమ్ముతారు.
ఆలయ ఆధునిక శైలిని 90వ దశకంలో పంజిమ్‌కు చెందిన వాస్తుశిల్పి భాస్కర్ వాగ్లే రూపొందించారు మరియు అమలు చేశారు.
💠 ఆలయ ఆవరణలో, మారుతి భగవానుని రెండు విగ్రహాలు ఉన్నాయి - ఒకటి తెల్లని పాలరాతి మరియు మరొకటి నలుపు పాలరాతితో.
💠 వార్షిక జాతర సమయంలో జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో ఎక్కువ సందడి ఉంటుంది .
జాతర సమయంలో , పల్లకీ ( పల్కి) ఊరేగింపు మరియు అనేక పండుగ స్టాల్స్ కూడా ఉంటాయి.
💠 మారుతీ దేవాలయం యొక్క ప్రణాళిక మాలలోని శ్రీ విఠల్ రఖుమాయి ఆలయంలో జరిగింది, కాబట్టి, జాతర సమయంలో , పల్కీ ఇక్కడ నుండి ప్రారంభమై, కొండపై ఉన్న ఆలయం వైపు వెళుతుంది.
ఈ జాతర మొదటిసారిగా 1944లో నిర్వహించబడింది, పోర్చుగీస్ ప్రభుత్వం ప్రజా హిందూ కార్యక్రమాలను అనుమతించడంపై కొంచెం ఉదారవాదం చూపినప్పుడు.
💠 హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.
💠 ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. పోర్చుగీస్ పాలించినప్పుడు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఆ విధంగా, హిందూ సమాజం రహస్యంగా ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. బాణసంచా దుకాణం లోపల హనుమంతుని బొమ్మను ఉంచి భక్తులు పూజించారు. పోర్చుగీస్ పాలన ముగిసిన తరువాత, దేవుడి వెండి విగ్రహంతో భర్తీ చేయబడింది.
💠 ప్రస్తుత ఆలయం గతంలో ఉన్న దుకాణం ఉన్న స్థలంలోనే ఉంది. నైపుణ్యం కలిగిన కళాకారులచే చెక్కబడిన క్లిష్టమైన డిజైన్లతో ఆలయ తలుపులు అలంకరించబడ్డాయి.
💠 పనాజీ శ్రీ మారుతి ఆలయ సమయాలు: ఉదయం 5:00 నుండి రాత్రి 8:00 వరకు
💠 పంజిం కదంబ బస్ స్టాండ్ నుండి 3.3 కి.మీ, వాస్కోడగామా రైల్వే స్టేషన్ నుండి 28 కి.మీ మరియు మపుసా నుండి 17 కి.మీ దూరంలో, శ్రీ మారుతి దేవాలయం ఉత్తర గోవాలో ఉంది.
భారతీయ మహిళలను
*దుబాయ్‌లో జరిగిన మహిళల రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పాకిస్థాన్ మహిళా రెజ్లర్ విజేతగా నిలిచింది. భారతీయ మహిళలను ఎగతాళి చేస్తూ, తనతో కుస్తీపోటీకి భారతీయ మహిళ ఎవరైనా వస్తారా అని వేదికపైకి సవాల్ విసిరారు. తమిళనాడుకు చెందిన కవితా విజయలక్ష్మి* అనే భారతీయ యువతి అకస్మాత్తుగా తాను సిద్ధంగా ఉన్నానని చేతులెత్తింది. చాముండ రూపాన్ని ధరించి, కుంకుమ ధరించి వేదికపై కనిపించి, మెరుపులా మెరిసిన ఆమె, ఆ తర్వాత పాకిస్థానీ రెజ్లర్‌ను రెండుసార్లు ఓడించి విజయం సాధించింది. చూసి ఆనందించండి. మన దేశాన్ని అవమానించే వారందరి గతి ఇదే అవుతుంది. * జై దుర్గా! జైజై దుర్గా🙏🙏🙏
సమాచారం క్షణాల్లో
*ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది*
☎️దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం : https://goo.gl/gDaGJ4
🕉️ఎ పి లో జిల్లాల వారి దేవాలయాల వివరాలు : https://goo.gl/Qzhzis
🕉️రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం : https://goo.gl/VnNaj5
🕉️జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు : https://goo.gl/X9NBUe
🕉️శక్తిపీఠాలు సమాచారం : https://goo.gl/LtvStS
🕉️గ్రూప్ టెంపుల్స్ : https://goo.gl/N9xD8M
🕉️ఆరుపడైవీడు క్షేత్రాల కోసం : https://goo.gl/HqGR8P
🕉️పంచారామ క్షేత్రాల వివరాలు : https://goo.gl/ygX5hW
🕉️పంచభూత క్షేత్రాల వివరాలు : https://goo.gl/pqtgxj
🕉️తిరుమల గురించి : https://goo.gl/mb2DGD
🕉️శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF
🕉️కాశి గురించి : https://goo.gl/DZzKa1
🕉️రామేశ్వరం గురించి : https://goo.gl/yyH424
🕉️అరుణాచలం గురించి : https://goo.gl/eFbKNE
🕉️మదురై గురించి : https://goo.gl/1Ntthd
🕉️శ్రీశైలం గురించి : https://goo.gl/ZUfFHo
📀కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి : https://goo.gl/A5UU7v
🕉️ప్రసిద్ధ శైవ క్షేత్రాలు : https://goo.gl/mn2K3y
🕉️మహాభారతం పుస్తకాలూ : https://goo.gl/v1XuqV
🕉️భాగవతం పుస్తకాలూ : https://goo.gl/9fMcDp
🕉️టెంపుల్ క్విజ్ ఆడండి : https://goo.gl/nrhsBK
➡️అందరికి షేర్ చేయండి 🙏🙏🙏
భగవంతునికి
*భగవంతునికి దగ్గర కావాలన్నా , భగవదనుగ్రహం పొందాలన్నా మనో నిగ్రహం కావాలన్నా అది ఎలా సాధ్యం.???*
పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు, అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు,
అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి.
🌿"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."
శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు...
🌿ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది, జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేము...
ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే. "కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం.
🌿నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మనలోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి.
ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది, పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు.
🌿నెయ్యి లేదని ఇతడన్నాడు, అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా అని చెప్పాడు,
ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది...
ఆ విధంగానే కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి...
వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి.
కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొoటే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి.
ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి.
కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి.
రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలో ని అనుభవం గూర్చి ఇలా వివరించారు
ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి.
ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు,
ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను...
నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో
దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు... అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది.
ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు, ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి.
వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు..
🌿రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి..
హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు...
ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు
ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటాడు...
కొంటె ప్రశ్నలు
*_!!కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు!!_*
1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు...😜
2.మనకు అర్థం కాకున్నా భద్రంగా దాచుకునేది ఏది?
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్...🤓
3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?
డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి...😩
4.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?
మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి...😲
5.పొలాలు అభివృద్ధి చెందితే?
ప్లాట్లు అవుతాయి🙁
6.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేసెంట్ చెప్పినప్పుడు..😫😜😜😂😂 ********************
“SORRY “
అనే పదము చాలా
చిత్రంగా ఉంటుంది...
మనము చెబితే మన వాళ్ళు
దగ్గరౌతారు.
అదే డాక్టర్ చెబితే
మనవాళ్ళు మనకు
దూరమౌతారు....!😂
******************** ప్రపంచంలో
రెండు అతి ప్రమాదకరమైన
మారణాయుధాలు!
1. భార్య కన్నీరు
2. పక్కింటి అమ్మాయి చిరునగవు
😄😄😄😄😄😀
********************
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా.......................
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ 😜😜
********************
క్యాన్సర్ cancer
క్యాన్సర్ ఓడిపోయింది
పైనాపిల్ వేడి నీరు
దయచేసి ప్రచారం చేయండి!! దయచేసి ప్రచారం చేయండి!!
ఈ బులెటిన్‌ని అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు పంచితే కనీసం ఒకరి ప్రాణమైనా కాపాడబడుతుందని ఐసిపిఎస్ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా. గిల్బర్ట్ ఎ. క్వాక్ అన్నారు.
నేను నా వంతు పూర్తి చేసాను మరియు మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు!
పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని కాపాడుతుంది
వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
ఒక కప్పు వేడి నీటిలో 2 నుండి 3 తరిగిన పైనాపిల్స్ వేసి, ప్రతిరోజూ త్రాగడం వల్ల "ఆల్కలీన్ వాటర్" అందరికీ మంచిది.
వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి.
వేడి పైనాపిల్‌కు సిస్ట్‌లు మరియు ట్యూమర్‌లను తొలగించే సామర్థ్యం ఉంది. ఇది అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తుందని నిరూపించబడింది.
పైనాపిల్ వేడి నీరు అలర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని క్రిములు మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది.
పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం *ప్రాణాంతక కణాలను* చంపుతుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.
అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉండే అమినో యాసిడ్‌లు మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, అంతర్గత రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.
చదివిన తర్వాత, ఇతరులను, కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని అడగండి.
*ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*
*కొందరు పంపరు*
*అయితే మీరు తప్పకుండా పంపుతారని ఆశిస్తున్నాను* https://nrinagireddy.com/
నన్నయ నాటకీయత!
నన్నయ నాటకీయత!
కురువృధ్ధుల్ గురువృధ్ధబాంధవులులనేకుల్ చూచుచుండన్ మదో/
ధ్ధరుఁడై ద్రోవది నిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ/
కరలీలన్ వధియించి,తద్విపులవక్షశ్శైల రక్తోఘని/
ర్ఝర ముర్వీపతి చూచుచుండ,ననినాశ్వాదింతు నుగ్రాకృతిన్;
ద్రౌపదీ పరాభవ ఘట్టము.కౌరవసభ.
"భీమసేనుని భీకర ప్రతజ్ఙా విధానమును కవి వర్ణించుచున్నాడు.
"కురు గురు వృధ్ధులేగాక, ఇతరులనేకులు కొలువైయున్న యీసభలో ద్రౌపది కిట్టి పరాభవమొనరించిన,దుశ్శీలుడగు,దుశ్శాసనుని లోకభయంకరముగా చంపి,కొండవంటివానివక్షస్థలమున సెలయేరువలె పరువులిడు రక్త సముదాయమును,ఈకురురాజుచూచుచుండగనే యుధ్ధరంగమున భయంకరాకారుడనై త్రాగెదను.
యుధ్ధరంగంలోనీకనులముందే నీతమ్ముని గుండెలు చీలిచి రక్తాన్నిత్రాగుతా!కాచుకో యీపరాభవానికి నాప్రతీకారం.అంచున్నాడుభీముడు.
"ఆరభటీవృత్తిలో ఆతనినోట నీమాచలపలికించి,కౌరవ సభను భయభ్రాంత మొనరించిన తీరును వ్యంగ్య మర్యాదతో మనకన్నులముందునిలిపి, నన్నయ తన నాటకీయ రచనాపరిజ్ఙానమును,పాఠకులకు పరిచయమొనరించెను.
సభాపర్వమునందలి యీపద్యమున నన్నయ గారి నాచకీయతను గమనింప వచ్చును.
సాగరంలో చిక్కుకున్నాను
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
శ్లో" *_సంసారఘోరగహనే చరతో మురారే_౹*
*_మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య_౹*
*_ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య_౹*
*_లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్_౹౹*......
_*శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ -04*_
భా:
ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను..... ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను...... మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను......కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ నేను కరముల యొక్క రక్షణను (శరణును) నాకు ప్రసాదించుము.
శ్రీధరరావు, ప్రభావతి గార్ల అనుభూతి..
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*శ్రీధరరావు, ప్రభావతి గార్ల అనుభూతి..*
*(పదమూడవ రోజు)*
శ్రీ స్వామివారు తన తపోసాధనకు భూమి కావాలని అడగటం..ఆపై అందుగురించి వివరణ ఇవ్వటం అయిన తరువాత ..శ్రీధరరావు దంపతులు "దైవ నిర్ణయం ఎలా వుంటే..అలా జరుగుతుంది..మనం నిమిత్తమాత్రులం!.." అని ఒక నిర్ణయానికి వచ్చేసారు..
శ్రీధరరావు గారి అన్నయ్య కూతురు "కుమారి" మొగలిచెర్ల కు వచ్చింది..కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి..దేవుడూ.. సాధువులు అంటే ఆట్టే నమ్మకం లేకుండా.."మీదంతా చాదస్తం పిన్నమ్మా..అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూవుంటారు" అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది..ప్రభావతి గారికేమో..ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండ లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించాలని..వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలనీ కోరిక..మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకున్నది.. కానీ ఒక షరతు పెట్టింది..మధ్యాహ్నం రెండు గంటల లోపు తిరిగి వచ్చేయాలనీ..తాను సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోవాలనీ నూ..ప్రభావతి గారు "సరే తల్లీ..ఉదయాన్నే ఎడ్ల బండి కట్టిస్తాము..బయలుదేరి వెళ్లి వద్దాము.." అన్నారు..
ప్రభావతి గారు శనివారం తెల్లవారుఝామున లేచి, తమకూ బండితోలే మనిషికి మరో పదిమంది కి సరిపోయేటట్లు గా పులిహోర, దద్దోజనం తయారు చేసుకుని, బండిలో సర్ది.. కొద్దిసేపటిలో బైలుదేరాలని అనుకుంటున్నంతలో..ఒక్కసారిగా మబ్బులు క్రమ్ముకొచ్చి..కుంభవృష్టి కురవసాగింది..బండి వాడు, గబ గబా ఎద్దులను విప్పేసి, కొష్టం లోకి తోలుకెళ్లి పోయాడు..
"పిన్నమ్మా!..ఎక్కడ మీ దేవుడు?..ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం?.." అంటూ కుమారి ఆట పట్టిస్తోంది..శ్రీధరరావు గారు కూడా "ఈ వానలో మనం వెళ్లలేము ప్రభావతీ.." అన్నారు..ప్రభావతి గారు హతాసులయ్యారు.. ఆవిడ మనసులో ఒకటే బాధ.."స్వామీ..నీ ఉన్నావన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే..ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది..సాధువులను.. బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు..అసలు దైవాన్నే నమ్మకపోతే..మనలను మనమే మోసగించుకోవటం అవుతుంది.." అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గది లోకి వెళ్లి..(ప్రత్యేకంగా వారింట్లో దేవుడి గది ఉంది) ఆ లక్ష్మీనారసింహుడిని ప్రార్ధిస్తూ కూర్చున్నారు..
ఇంతలో..వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది..రెండు నిమిషాల తరువాత శ్రీధరరావు గారు గబ గబా దేవుడి గది దగ్గరకు వచ్చి.."ప్రభావతీ!..ప్రభావతీ!.." అని పిలిచారు..ఆవిడ లేచి రాగానే.."కందుకూరు నుంచి అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు దంపత్సమేతంగా వచ్చారు..వాళ్ళు మాలకొండ లో దర్శనం చేసుకుని..మనలను చూసి వెళదామని వచ్చారు.." అన్నారు..ఈలోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేసారు..కొద్దిసేపు మాటాడుకున్న తరువాత, శ్రీధరరావు గారు మాటల్లో..తాముకూడా మాలకొండ వెళదామని అనుకోవడం, ఈ వర్షం వల్ల ఆగిపోవడం.. చెప్పేసారు..ఆ దంపతులిద్దరూ వెంటనే.."మా జీపులో వెళ్ళిరండి..మేమిక్కడ రెస్ట్ తీసుకుంటాము.." అని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను, కుమారి ని కూడా జీపెక్కించేశారు..ఒక్కక్షణం ప్రభావతి గారి కళ్ళముందు నవ్వుతున్న ఆ దేవుడు.. లక్ష్మీనృసింహుడు..కనిపించాడు..మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరారు..
కుమారి కి ఆశ్చర్యంగా ఉంది..దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్లీ మొదలవడం వింతగా ఉంది..ముగ్గురూ మాలకొండ చేరారు..వర్షం సన్నగా పడుతూనే ఉంది..కొండమీద నుంచి జాలువారుతున్న నీటి పాయలు.. కొండచుట్టూ అలుముకున్న మబ్బులు..మెట్ల మీది నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు..ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి..ఆ కొండమీద లక్ష్మీ నృసింహుడి దర్శనం కాగానే..ఒక విధమైన ఉద్వేగంతో.."పిన్నమ్మా..చిన్నాన్నా.. దైవం వున్నాడు..నేనీ క్షణాన చూస్తున్నాను..నిజంగా ఇది దైవ సంకల్పమే.."అన్నది..ముగ్గురూ శివాలయం వద్దకు వచ్చారు.."ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్నా.." అన్నది..
"కష్టం తల్లీ..బహుశా ఆయన ఈ సమయం లో కిందకు దిగిరారు..మనం ఆ పైనున్న గుహల వద్దకు వెళ్లలేము..ఈ వర్షం లో బండల మీద జారుతుంది.." అని నచ్చచెప్పబోతున్నారు...ఇంతలో..
ఆ వర్షంలో..తలపైనుండి నీళ్లు జాలువారుతూ..ముడివీడిన జుట్టు , పాయలుగా విడిపోయి..తెల్లటి శరీరఛాయతో..శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగివస్తున్నారు.. సాక్షాత్తూ పరమశివుడి లాగా గోచరిస్తున్నారు..శ్రీధరరావు దంపతులు అప్రయత్నంగా చేతులెత్తి మొక్కారు..ప్రక్కనే ఉన్న కుమారి..కూడా నమస్కారం చేసింది..శ్రీ స్వామివారు వీళ్ల దగ్గరకొచ్చి.."ఇంత శ్రమపడి రావాలా?.." అన్నారు..ఈ లోపలే కుమారి స్వామికి వారికి మళ్లీ ప్రణమిల్లింది..చేయెత్తి ఆశీర్వదించారు.."మరో వారం రండి!..మనం మాట్లాడుకుందాము.." అన్నారు స్వామివారు..ముగ్గురూ మౌనంగా తలూపి..వెనక్కు వచ్చేసారు..
తిరుగుప్రయాణంలో , జీపులో..కుమారి తన భావోద్వేగాన్ని అణుచుకోలేక పోయింది.."పిన్నమ్మా..మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను..దైవాన్ని దగ్గరగా చూసాను..భవిష్యత్ లో కూడా మీరెలా చెపితే అలా వింటాను..నా వివాహ విషయం లో కూడా..!" అన్నది..శ్రీధరరావు ప్రభావతి గార్లు ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామికి, తపోసాధన లో మునిగిపోయివున్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు..
శ్రీ స్వామివారి సోదరుడు.. పద్మయ్య..రేపటి భాగంలో..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
పుష్కకవిమానంలో
🤔 *రహస్యం* 🙄
చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
Dress కుట్టిస్తే..
ఎంత ఆనందమో...👗👕
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...🥳
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ..
చేతిలో రూపాయో...
అర్ధరూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...😊
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...💞
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...🥰
ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...💖
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..🙄
పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...😇
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...🥰
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....🏃🏻♂️
సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...☺️
మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...😴
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..🤷♂️
20/-రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..💓
ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...🥰
తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?🤩
రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...✈️
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..🍧
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్,
చేతిలో ఫోన్లు...
అరచేతిలో స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...😍
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు ...?
ఎందుకు...? ఎందుకు...?🤔
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి
అయిపోయింది..
మార్పు ఎందులో...?🤔
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో ...?
చెప్పవా తెలిస్తే....!!8
ఎవరు రాసారో కాని మనసుకు హత్తుకునేలా రాసారు.. గత జ్ఞాపకల్లోకి పుష్కకవిమానంలో తీసుకొని వెళ్ళారు..👌👌
ప్రకటనల
ప్రకటనల
మనబ్లాగులో అమెరికా వారు కెనడా వారు విశేషంగా చూస్తున్నారు. దీనిని ఎందుకు ఇతరులకు అంటే అక్కడ వుంటూ అక్కడి మన తెలుగువారితో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి దోహదకారిగా ఉండకూడదు అని తలంచి ఒక వ్యాపార ప్రకటన విభాగాన్ని మన బ్లాగులో తెరువ తలచాము. అది ఎలావుంటే బాగుండునది అనే విషయాన్ని పాఠకులు కామెంటులో పెట్టి తెలుపగలరు. అదే విషంగా ఎంత రుసుము తీసుకుంటే బాగుంటుంది తెలుపగలరు.
పాఠకుల పేజీ
పాఠకుల పేజీ
పోస్టుకు కామెంటు రూపంలో మీ
పోస్టులను పంపండి. అందరకు ఆమోదకరం, ఉపయుక్తకరం అని తలచినవి నేను కామెంట్ల
రూపంలో పబ్లిష్ చేస్తాను.
పాఠకులతో కాసేపు
మనబ్లాగు అనేక దేశాల తెలుగు వారు చూస్తున్నారని తెలుపుటకు సంతోషితున్నాను. ఒక్కొక్క రోజు భారత దేశంలో వీక్షకులకన్నా ఎక్కువగా అమెరికా, కెనడా, ఫ్రాన్సు దేశంల నుండి ఉండటం ముదావహం. కాగా నిత్యం అనేక విషయాలను గురించి నేను పోస్టులు పెడుతున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ బ్లాగు మనమందరిది. మీరు కూడా ఈ బ్లాగులో చక్కటి విషయాలను పంపి భాగస్వాములు కావచ్చు. మీరు చేయవలసినది ఏమంటే మీరు తెలుపదలచుకున్న విషయాన్నీ తెలుగులో కానీ, ఇంగ్లీషులో లేక హిందీలో పంపండి. ఎలా అంటే ఈ రోజునుంచి నేను పాఠకుల పేజీ అని ఒక శీర్షికతో ఒక పోస్టు పెడతాను. మీరు ఆ పోస్టుకు కామెంటు రూపంలో మీ పోస్టులను పంపండి. అందరకు ఆమోదకరం, ఉపయుక్తకరం అని తలచినవి నేను కామెంట్ల రూపంలో పబ్లిష్ చేస్తాను.
పంచాంగం గురించి
మన బ్లాగులో నిత్యం పంచాంగం రెండు మూడు రకాలుగా పెడుతున్నాము. కానీ ఈ పంచాంగం విషయంలో ఇతరదేశాలలో వుంటున్నవారు గమనించాల్సినది ఏమిటంటే పంచాంగం ఒక ప్రాంతంలోని సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను గణనలోకి తీసుకొని లెక్కిస్తారు.కాబట్టి ఇక్కడి (హైదరాబాదు) తిథి వార నక్షత్రాదులు మీరు ఉండే ప్రాంతానికి సమన్వయము కావటం జరగదు. అటువంటప్పుడు ఏమి చేయాలి.
పంచాంగ సవరణ: మీరు హైదరాబాదు సూర్యోదయకాలం మీ ప్రాంతపు సూర్యోదయకాలంకు వున్నా వేత్యాసాన్ని కలిపి లేక తీసివేస్తే మీకు మీ ప్రాంత పంచాంగం వస్తుంది. అదే సమయం ఇతరత్రా విషయాలకు సమన్వయము చేసుకోవాలి. అంటే ఉదాహరణకు మీరు హైదరాబాదు నుంచి వున్నా ప్రదేశం హైదరాబాదు సూర్యోదయానికన్నా 5 నిముషాలు ముందుగా వున్నారనుకోండి అప్పుడు హైదరావాడు సమయానికి 5 నిముషాలు కలుపుకుంటే మీ ఆ రోజు పంచాంగం వస్తుంది.
ప్రకటనల గురించి
మనబ్లాగులో అమెరికా వారు కెనడా వారు విశేషంగా చూస్తున్నారు. దీనిని ఎందుకు ఇతరులకు అంటే అక్కడ వుంటూ అక్కడి మన తెలుగువారితో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి దోహదకారిగా ఉండకూడదు అని తలంచి ఒక వ్యాపార ప్రకటన విభాగాన్ని మన బ్లాగులో తెరువ తలచాము. అది ఎలావుంటే బాగుండునది అనే విషయాన్ని పాఠకులు కామెంటులో పెట్టి తెలుపగలరు. అదే విషంగా ఎంత రుసుము తీసుకుంటే బాగుంటుంది తెలుపగలరు.
ఇట్లు
మీ భార్గవ శర్మ
బాపురే! తెలుగు
బాపురే! తెలుగు !!
AN AMAZING SENTENCE IN ENGLISH
Remarkable indeed ! The person who made this sentence must be a GENIUS in English vocabulary.
"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness."
పై వాక్యంలో మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవయ్యవ పదం ఇరవై అక్షరాలతో ఉన్నాయి.
దీనికి ప్రతిగా ఏల్చూరి మురళీధరరావు గారు వ్రాసిన తెలుగు వాక్యం. “మిత్రవినోదంకరణగా మీకు విన్నవిస్తున్నాను; మేధావద్విశిష్టతకు కాదు ...” అని కూడా ప్రకటించారు.
“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!
పై వాక్యంలో 26 పదాలున్నాయి. మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ పదం ఇరవైయారు అక్షరాలతో ఉన్నాయి.
1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తికి,
9. సద్గుణాలంకారవ్యక్తికి,
10. రసోచితశబ్దార్థయుక్తికి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,
20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,
25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!
మంగళవారం, అక్టోబరు 31,2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
మంగళవారం, అక్టోబరు 31,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:తదియ రా10.53 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:రోహిణి పూర్తి
యోగం:వరీయాన్ సా6.27 వరకు
కరణం:వణిజ ఉ11.11 వరకు తదుపరి భద్ర రా10.53 వరకు
వర్జ్యం:రా10.04 - 11.41
దుర్ముహూర్తము:ఉ8.18 - 9.03 &
రా10.28 - 11.18
అమృతకాలం:రా2.54 - 4.31
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి : తుల
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం:6.01 సూర్యాస్తమయం:5.27
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
అర్హత వారికున్నదా
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
ఆ అర్హత వారికున్నదా ???????
....
ఒక గదిలో ఆమె ఒక చిరిగిన పంచెకు మాసిక వేసుకొని చీరలాగ కట్టుకొన్నది !
.
ఆమె ఒక గొప్పవ్యక్తి కూతురు .
.
ఆవిడ తండ్రిగారి కార్యదర్శి ఆమె ఉన్న గదిలోకి వచ్చి ఆమెను చూశారు !
.
అమ్మా! ఈ దేశంలో అత్యంత శక్తివంతుడు ,దేశాన్ని ప్రభావితం చేయగల నాయకుడి కూతురివి ! నీకు ఈ చిరిగిన చీరెందుకమ్మా ? అని అడిగారు .
.
ఆ ప్రశ్నకు నవ్వి ఇలా చెప్పారావిడ !!
.
ఇది నాన్నగారు సంవత్సరానికి నేయించుకొనే రెండుపంచెలలో ఒకటి !
.
చిరిగి పోయింది అని పారవేయలేము కదా !
.
నాన్నగారు కట్టుకొన్నది కదా !
.
అయినా కొత్తవెందుకు?
ఇవి సరిపోతాయికదా ! అని అన్నారావిడ
.
ఆవిడ మణిబెన్ !
సర్దార్ వల్లభ భాయ్ పటేల్ గారి కూతురు ,
.
తండ్రి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనమయితే పిల్లలు కూడా అలాగే ఉంటారు !
.
మరి కొన్ని తరాలకు సరిపడా , సంపాదించి సంపాదించటానికే రాజకీయాలు ఆశ్రయించిన నేటి నాయకులకు ఆయన విగ్రహాన్ని కూడా చూసే అర్హత లేదేమో!
.
*వూటుకూరు జానకిరామారావు.*
*సేకరణ:- శ్రీ వసంతకుమార్ గారి వాట్సాప్ పోస్ట్.*
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - తృతీయ - రోహిణీ - భౌమ వాసరే* *(31-10-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/IzSEPnuYpuY?si=VNmsJVI03lpz4MjE
🙏🙏
మంగళవారం, అక్టోబరు 31, 2023*
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
*మంగళవారం, అక్టోబరు 31, 2023*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - బహళ పక్షం*
తిథి : *తదియ* రా10.53 వరకు
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *రోహిణి* పూర్తి
యోగం: *వరీయాన్* సా6.27 వరకు
కరణం : *వణిజ* ఉ11.11 వరకు తదుపరి *భద్ర* రా10.53 వరకు
వర్జ్యం: *రా10.04 - 11.41*
దుర్ముహూర్తము : *ఉ8.18 - 9.03*&*రా10.28 - 11.18*
అమృతకాలం: *రా2.54 - 4.31*
రాహుకాలం:*మ3.00 - 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*¡
సూర్యరాశి: *తుల* || చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *6.01* || సూర్యాస్తమయం: *5.27*
🪷శ్రీరఘునందనరాజారామ్
దశరధనందనసీతారామ్🙏
🌹పవనపుత్రాపాహిమామ్
శ్రీరామభక్తజయహనుమాన్🙏
*సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు* 🙏
---------------------------------
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
ఆగిపోయిన శోకం..*
*ఆగిపోయిన శోకం..*
2005, 06 ప్రాంతాల్లో మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద భక్తుల కొరకు పెద్దగా వసతి ఏర్పాట్లు ఉండేవి కాదు..స్వామి సమాధి మందిరం..ఆ మందిరానికి ముందు ఒక మంటపం మాత్రమే ఉండేవి..మందిరం చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి నాలుగు, ఐదు అడుగుల మేర దారి లాగా ఉండేది..మిగిలిన ప్రదేశం అంతా పిచ్చి మొక్కలు మొలచి ఉండేవి..బాగా దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు, లేదా గ్రహచేష్టలతో బాధపడే వాళ్ళు స్వామివారి మందిరం వద్దకు వచ్చి..మందిరానికి వెలుపల ఉన్న రేకుల షెడ్లలో ఉండేవాళ్ళు..ఆ సమయం లో బాధ్యతలు తీసుకున్న నాకు..ముందుగా భక్తులకు వసతి ఎలా చూపాలా అనే ఆలోచన ఉండేది..అయితే స్వామివారి కృప వల్ల ఒక్కొక్క వసతి ఏర్పడసాగింది..
ఆరోజుల్లో ఒకనాడు..ఒక భార్యాభర్తలు తమ పధ్నాలుగేళ్ల కూతురిని వెంటపెట్టుకొని స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ దంపతుల ముఖం లో ఆందోళన కనబడుతోంది..వాళ్ళ కూతురు చిన్నగా ఏడుస్తోంది..అలా ఏడుస్తున్న కూతురిని పొదివి పట్టుకొని..స్వామివారి మందిరం చుట్టూరా ఒక ప్రదక్షిణ చేయించి..మంటపం లో పడుకోబెట్టారు..ఆ తరువాత ఆ పిల్ల నాన్న మా సిబ్బంది వద్దకు వచ్చి.."అయ్యా..దూరం నుంచి వచ్చాము..కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాము..మేము ఉండటానికి ఏదైనా వసతి ఉన్నదా..?" అని అడిగాడు.."గుడి వెనకాల ఒక రేకుల షెడ్డు ఉన్నది..ప్రస్తుతం అందులో ఇద్దరే వున్నారు..మీరు కూడా అక్కడే వుండండి..అందులో ముప్పై మంది వరకూ ఉండొచ్చు..మీకు ఇబ్బంది లేదు.." అని చెప్పారు.."అలాగే అయ్యా.." అని తాము తెచ్చుకున్న సంచులు తీసుకొని..రేకుల షెడ్ లో పెట్టుకొని వచ్చాడు..అతని కూతురు మాత్రం ఏడుస్తూనే ఉన్నది..ఆ రాత్రికి ఆ దంపతులు స్వామివారి మంటపం లోనే కూతురితో సహా పడుకున్నారు..ఆ అమ్మాయి ఏడుపు ఆపటం లేదు..అలా అని పెద్దగా కేకలు పెట్టటం లేదు..కానీ చిన్న స్వరంతో ఏడుస్తూనే ఉన్నది..
ఆ ప్రక్కరోజు ఉదయం నేను స్వామివారి మందిరానికి వచ్చి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చేసరికి..ఆ అమ్మాయి మంటపం లో బోర్లా పడుకొని ఏడుస్తూ ఉన్నది..ఆ పిల్ల తల్లి ఎంతగానో సముదాయిస్తోంది..కానీ ఫలితం లేదు..కొంచెం సేపటికి ఆ అమ్మాయి లేచి కూర్చుని..తల్లి భుజం మీద తల పెట్టుకొని.."అమ్మా..ఈ నొప్పి తగ్గలేదే..కడుపులో కుట్టుగా ఉంటోంది.." అంటూ మళ్లీ ఏడవడం మొదలు పెట్టింది..చూస్తున్న మా కందరికీ ఒక విధమైన చిరాకు గా ఉంది కానీ..ఆ అమ్మాయి దేని వల్ల బాధపడుతున్నదీ తెలియలేదు..మరో రెండు మూడు గంటల తరువాత కూడా అదే పరిస్థితి..ఆ అమ్మాయి దగ్గరే కూర్చుని ఉన్న ఆ పిల్ల తండ్రిని పిలిచాను..వచ్చాడు.."మీ అమ్మాయి ఏ జబ్బుతో బాధపడుతున్నదో మీకు తెలుసా?..ఇంతకుముందు ఎవరైనా డాక్టర్ల కు చూపించారా..?" అని అడిగాను.."అయ్యా..ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టు..ఇప్పుడే వస్తాను.." అని చెప్పి..గబగబా రేకుల షెడ్ లోకి వెళ్లి ఒక సంచీ తీసుకొచ్చాడు..అందులోనుంచి..దాదాపు పది హాస్పిటళ్ల తాలూకు ఫైళ్లు తీసి నాకు చూపించాడు..చెన్నై విజయా హాస్పిటల్ మొదలుకొని..ఒంగోలు లో పేరెన్నికగన్న డాక్టర్ల వరకూ చేసిన టెస్టులూ..రిపోర్టులు అన్నీ ఉన్నాయి..
"అందరికీ చూపించానయ్యా..ఎవ్వరూ దీని కొచ్చిన జబ్బు తేల్చలేదు..కడుపులో ఏమీ లేదు..అమ్మాయికి ఏ లోపం లేదు అన్నారు..అమ్మాయేమో తనకు కడుపులో మెలి పెట్టినట్టు బాధగా వుంటుంది అని చెప్పి..నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నది..మాకు ఏ దిక్కూ తోచక ఈ స్వామి ని నమ్ముకుంటే బాగుపడుతుందని మాకు తెలిసిన వాళ్ళు చెపితే ఇక్కడకు వచ్చామయ్యా..మాకు ఇదొక్కటే కూతురు..దాదాపు ఎనిమిది నెలల నుంచీ ఇట్లా ఏడుస్తూనే ఉంది..దాని బాధ చూడలేకుండా ఉన్నాము.." అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.."సరే..స్వామిని గట్టిగా నమ్ముకోండి.." అని చెప్పాను..అలాగే అని తలవూపి వెళ్ళిపోయాడు..
మరో మూడురోజుల దాకా ఆ అమ్మాయి పరిస్థితి లో మార్పు రాలేదు..ఆరోజు శనివారం..స్వామివారి పల్లకీసేవ అయిపోయిన తరువాత..భక్తులు భజన చేయడం మొదలుపెట్టారు..భజన మొదలైన అరగంట తరువాత..ఈ అమ్మాయి లేచి కూర్చుని..ఆ భజన పాటకు అనుగుణంగా చేతితో చప్పట్లు కొడుతున్నది..ఏడుపు లేదు..అలా ఆ రాత్రి భజన అయిపోయిన తరువాత..ఆ పిల్ల ఏడవకుండా నిద్రపోయింది..ప్రక్కరోజు ఆదివారం ఉదయం కూడా ఆ అమ్మాయి మామూలుగానే ఉన్నది..ఆ పిల్ల తల్లిదండ్రులకు కొద్దిగా సంతోషం గా ఉంది..మళ్లీ ఎక్కడ ఏడుస్తూ ఉంటుందో అనే భయం తోనూ వున్నారు..కానీ ఆరోజు నుంచి ఆ అమ్మాయి ఏడవలేదు సరికదా..కడుపులో నొప్పి అని కూడా చెప్పలేదు..ఆ దంపతులు తమ కూతురిని పెట్టుకొని స్వామివారి వద్ద మొత్తం ఇరవై ఒక్క రోజులున్నారు..తమ కూతురికి సంపూర్ణంగా తగ్గింది అని నమ్మకం ఏర్పడ్డాక..స్వామివారికి నైవేద్యం పెట్టుకొని..మా సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళుతూ.."అయ్యా..ఆ శనివారం రాత్రి భజన సమయం లో ఏమి జరిగిందో తెలీదు కానీ..మా బిడ్డ ఆరాత్రి నుంచి ఏడవలేదు..స్వామి ఏ మహిమ చూపాడో..మొత్తానికి మా అమ్మాయి సంతోషంగా ఉంది..అదే చాలు.." అని చెప్పి వెళ్లారు..
ఇప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు బిడ్డల తల్లి..భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వస్తూ వుంటుంది..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని.."ఈ స్వామి దయవల్లే ఇప్పుడు నేను ఇలా వున్నాను..నన్ను కాపాడినట్లే నా భర్తను, పిల్లలను చల్లంగా చూడు తండ్రీ.." అని మొక్కుకుంటుంది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
విచిత్రమైన ప్రశ్నలు
Nice Joke...
----------
కొంత మంది వివిధ సందర్భాలలో కలసినపుడు వేసే విచిత్రమైన ప్రశ్నలు..వాటికి సరదా జవాబులు.😅
1. సినిమా హాల్లో:
"మీరు కూడా సినిమాకే వచ్చారా?"
నేను: "లేదు పాప్ కార్న్ అమ్ముకోవటానికి వచ్చాను"
2. సిటీ బస్సులో కాలు తొక్కి:
"Sorry .. నొప్పిగా ఉందా ?"
నేను: "అబ్బే లేదండీ.. anesthesia తీసుకుని వచ్చాను, కావలంటే మళ్ళీ తొక్కండి!!"
😴😴😴😴😴😴😴😴
3. అర్ధరాత్రి ఫోన్ చేసి: "పడుకున్నారా?"
నేను: "లేదు ఆఫ్రికా కోతుల మీద రీసర్చ్ చేస్తున్నాను.. మీ చుట్టాల వివరాలు తెలిసాయి" 😴
💇💇💇💇💇💇💇💇
4. బార్బర్ షాప్ నుండి వస్తుంటే: "ఏంటి హేర్ కటింగ్ చేయించుకున్నారా?"
నేను: "శరత్కాలం కదా రాలిపోయింది!"
☎☎☎☎☎☎☎
5. ఇంట్లో Land-line కి ఫోన్ చేసి: "ఎక్కడున్నారు?"
నేను: "ఫోన్ మెళ్ళో వేసుకుని, మార్కెట్లో కూరగాయలు కొంటున్నా !!"
🚘🚘🚘🚘🚘🚘🚘🚘
6. కారు కడుగుతున్నప్పుడు ప్రక్కింటాయన: "సార్ !! కారు కడుగుతున్నారా??"
నేను: "లేదండీ, నీరు పోస్తున్నాను. ఇది పెరిగి పెద్దదై బస్సంతవ్వాలని..
😄😄😄😉😉😉
.. 😊😊😊😊😊😊😊😊....
ఆలోచనాలోచనాలు
: ///// ఆలోచనాలోచనాలు ///// మోచర్ల వెంకన్న కవి కృత సమస్యాపూరణములు ( ప్రాచీనం) గత వారపు శేషభాగం. ***** "" ఇనశశిబింబయుగ్మముదయించె దినాంతమునందు తద్దిశన్."" చం. ఇనసమతేజ! మీరు సెలవిచ్చిన పీఠము హేమరత్న సం / జననము మేరుప్రస్తరము జక్కగఁ దీర్చితిఁ బక్షమయ్యె, నే / ర్పునసురకోటుల న్దిశలఁ బొల్పుగ వ్రాయుచు రాఁగ నేఁటికా / యిన శశిబింబ యుగ్మము
:
దయించెఁ దినాంతమునందుఁ దద్దిశన్. ***** "" తలలొక్కే పదినాల్గు కానబడియెన్ దద్గౌరి వక్షంబునన్."" మ. లలితాకారుఁగుమారు షణ్ముఖునిఁ దాలాలించి చన్నిచ్చుచో / గళలగ్నగ్రహరత్న దీప్తకళికాగాంభీర్య హేమాంచితో / జ్జ్వలరత్నప్రతిబింబాననములన్ శంభుఁడు వీక్షింపఁగాఁ / దలలొక్కేఁబది నాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్. ***** "" మార్తాండుండపరాద్రిఁగ్రుంకె నదిగో మధ్హాహ్నకాలంబునన్."" శా. కీర్తింపందగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా / వర్తిన్ రావణుఁగాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె న / ట్లార్తిన్ జెంద మిమున్ జయించుఁగద! మున్నత్యుగ్రుఁడై దైత్యరా / ణ్మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్. ***** ""కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్."" కం. కుప్పలకావలి కేగఁగఁ / జెప్పులు కఱ్ఱయునుఁ బూని శీఘ్రముగాఁగన్ / జప్పుడుఁజేయుచు జనువెం / కప్పను జూడంగఁ బాము గడగడవడఁకెన్. ***** "" ఉత్తరమున భానుబింబ ముదయంబాయెన్."" కం. అత్తుగఁ దూరుపుఁబడమరఁ / జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా! / చిత్తరువు వ్రాయఁబోవలె / నుత్తరమున భానుబింబ ముదయంబాయెన్. ***** "" చందురులో నిఱ్ఱి నేల చంగలిమేసెన్."" కం. కందర్పహరుఁడు నరుఁడును / పందికినై పోరిపోరి పరిపరిగతులన్ / గ్రిందైన హరుని శీర్షపుఁ / జందురులో నిఱ్ఱి నేలచంగలిమేసెన్. ***** "" మరుఁడు దొనఁజూపె, యముఁడు కింకరులఁ జూపె."" తే. గీ. భరతకులవీరుఁ డైనట్టి పాండురాజు / మాద్రిపై దృష్టిఁ బఱపిన మగువ యంత / వలదు వలదని వారింప వాంఛఁగదియ / మరుఁడు దొనఁజూపె యముఁడు కింకరులఁ జూపె. . ***** "" కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్."" కం. చేమంతి చెట్టుపొంతను / భామామణి నిదుర వోవఁ బయ్యెదజారన్ / రోమావళి పామోయని / కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్. . ***** "" కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్."" కం. నిటలమున నీవు దాల్చిన / పటుతరకస్తూరిరేఖ బహుగతిరతిచే / నటునిటుజారిన చెమటకుఁ / గుటిలాలక! యెడమకన్ను కుడికన్నాయెన్. తేది 31--10--2023, మంగళవారం, శుభోదయం.
దేవుడు అంటే ఏంటి
ఆత్మ విద్య : మీ జన్మ రహస్యం *దేవుడు అంటే ఏంటి*?
*పూజ చేయకపోతే ఏమవుతుంది*? అని...
చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.
*పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. మనసుతో చేసే వ్యాయామం*.
*మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి*
*మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ*.
*దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ*.
రోజూ ఓ *మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు* అని పెద్దలు చెప్పిన మాట.
ఏదైనా *కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు*.
*అది నాలికకు ఎక్సర్‌సైజ్*. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.
*ధారణ శక్తి పెరుగుతుంది*. *భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్ ఫియర్ కూడా పోతుంది*.
*పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని* చెప్పండి.
*మన హిందూ ధర్మాన్ని ప్రోత్స హించండి*.
అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....
*1. మూలవిరాట్* 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.
*2. ప్రదక్షిణ 🚩* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.
*3. ఆభరణాలతో దర్శనం 🚩* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.
*4. కొబ్బరి కాయ* 🚩
ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.
*5.మంత్రాలు 🚩* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజ పరువస్తాయి.
*6. గర్భగుడి 🚩* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.
*7. అభిషేకం 🚩*
విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.
*8. హారతి 🚩* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.
*9. తీర్థం 🚩* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._
*10. మడి 🚩* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!
*🙏లోకాః సమస్తాః సుఖినోభవంతు🙏*
రాశి ఫలితాలు
(31-10-2023)
రాశి ఫలితాలు
భౌమ వాసరః మంగళవారం
***********
మేషం
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.
---------------------------------------
వృషభం
అన్ని రంగాల వారికీ లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
---------------------------------------
మిధునం
వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల ఆహ్వానాలు అందుతాయి.
---------------------------------------
కర్కాటకం
సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ పూర్తిచేస్తారు. వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
---------------------------------------
సింహం
నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
కన్య
దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
---------------------------------------
తుల
సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.
---------------------------------------
వృశ్చికం
ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి.
--------------------------------------
ధనస్సు
దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తివ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
మకరం
ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు.
---------------------------------------
కుంభం
చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలుంటాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి. గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.
---------------------------------------
మీనం
వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి.
---------------------------------------
ఈ రోజు పంచాంగం 31.10.2023 Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: తృతీయ తిధి భౌమ వాసర: రోహిణి నక్షత్రం వరీయాన్ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.
తదియ రాత్రి 09:34 వరకు.
రోహిణీ రాత్రి 03:58 వరకు .
సూర్యోదయం : 06:17
సూర్యాస్తమయం : 05:41
వర్జ్యం : రాత్రి 07:59 నుండి 09:35 వరకు.
దుర్ముహూర్తం : పగలు 08:34 నుండి 09:19 వరకు తిరిగి రాత్రి 10:44 నుండి 11:34 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు
యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పూజాకార్యక్రమాల సంకల్పము
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన మరియు
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ. 31.10..2023
మంగళ వారం (భౌమ వాసరే)
**************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భౌమ వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే తృతీయాయాం
భౌమ వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.01
సూ.అ.5.27
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణ పక్షం తదియ రా.10.47 వరకు.
మంగళ వారం.
నక్షత్రం రోహిణి పూర్తి.
అమృతం రా. తె.2.59 ల 4.37 వరకు.
దుర్ముహూర్తం ఉ.8.18 ల 9.04 వరకు.
దుర్ముహూర్తం రా.10.28 ల 11.19 వరకు.
వర్జ్యం రా. 10.06 ల 11.44 వరకు .
యోగం వరీయాన్ సా. 6.26 వరకు.
కరణం వనజి ప. 11.04 వరకు.
కరణం భద్ర రా. 10.47 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు.
గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు.
యమగండ కాలం ప.9.00 ల 10.30 వరకు.
.***********
పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ తదియ.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
Sachivalayanagar,
Vanasthalipuram,
Rangareddy Dist, 500 070,
80195 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
సాటిలేని మహా భక్తుడు
ఓం నమశివాయ శివుని యొక్క తొలి భక్తుడు ఎవరు
"సాటిలేని మహా భక్తుడు శ్రీ మహావిష్ణువు".....
శివుని యొక్క సకార స్వరూపమైన సదాశివుని వామంగం నుండి ఆవిర్భవించిన తొలి పురుషుడు శ్రీ మహావిష్ణువు. ఈ సృష్టిలో శివుని యొక్క తొలి శివ భక్తుడు అనే ఘనకీర్తి విష్ణు దేవునికే లభించినది. కారణం శివుడిని ఆరాధించే మొదటి అవకాశం మహాభాగ్యం విష్ణుదేవుని లభించినది.
*పార్వతి శంకరుడిని, రాధ శ్రీ కృష్ణుడిని,,సీత శ్రీరాముడిని, ఏ విధంగా ధ్యానం చేస్తూఉంటారు. ఆ విధంగా విష్ణువు శివుని సదా ధ్యానిస్తూ ఉంటాడు. నిరంతరం శివ నామస్మరణ చేస్తూ ఉంటాడు.
ఈ కారణం వల్లనే!...
శివుడి అష్టోత్తర శత నామాలులో శివుడు విష్ణు వల్లభూదాని కీర్తించబడినాడు. నేను నిరంతరం ధ్యానించే శివుడు నాకు ప్రియమైన వాడు అందుకే శివుడిని విష్ణు వల్లభూదాని అని అంటారని విష్ణువు పార్వతితో ఇలా తెలిపెను.
శంకర: శూలపాణిచ కట్వంగి విష్ణువల్లబా:
విష్ణువు యొక్క శివ భక్తుని మెచ్చి. శివుడు విష్ణువు కు ఎన్నో వరాలను ప్రసాదించాడు. ఎన్నో దివ్యశక్తులను ప్రసాదించాడు. క్షణాలలో శత్రువులను సమూలంగా నాశనం చేసే సుదర్శనచక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు.
భూలోకములో మానవులచే పూజలందుకునే వరాన్ని కూడా ప్రసాదించాడు, భూలోకములో, క్షేత్రం, ప్రతిష్ట, ఉత్సవం, జరిగే విధంగా శివుడు విష్ణువు వరం ప్రసాదించాడు. విష్ణువు ఎంతటి శివభక్తుడు ఆదిశంకరులు, పరమశివ! త్రిపుర సంహారం కాలమందు విష్ణువు నీకు బాణం అయ్యెను. వృషభ రూపమును పొంది నీకు వాహనం అయ్యెను. ఆర్య రూపమును పొంది నీ అర్థంగమ్మున భార్యఅయినాడు. నీ పాదాలను దర్శించుటకు వరాహ రూపం దాల్చనో. జగన్మోహిని రూపమును పొంది నీ వల్లభూదపొందేన. నీవు శివ తాండవం చేసే సమయాన నీ పాదాలకు నమస్కరించి సాహసం చేసిన నీ దేహం ఒక భాగం గలవాడై బ్రహ్మాదుల కంటే కూడా అధికంగా పూజింపబడిన లేనిచో విష్ణువు అంతటి పూజ్యుడు ఎలా అగునని తెలిపెను.
హనుమంతుడు శ్రీరాముడిని నిండు ప్రేమతో, అనన్య భక్తితో ఏ విధంగా ప్రేమించాడో, సేవించాడు. ఆ విధంగా శివుడిని ప్రేమించినవాడు, సేవించినవాడు విష్ణువు. అందుకే ఎన్నో పురాణాలు విష్ణువు సాటిలేని గొప్ప శివ భక్తుడు అని కొనియాడారు.
హనుమంతుడు తన హృదయములో గల శ్రీరాముడిని చూపినట్లు మహావిష్ణువు తన హృద యములో గల శివుడు ని చూపించుని వామన పురాణం ఎలా తెలిపినది. మహావిష్ణువు, కమలం అంటే తన హృదయాన నివసించే శివ లింగేశ్వరుడు దేవతలకు చూపించెను. విష్ణువు ఎంతటి గొప్ప శివభక్తుడు, "శుద్ధగామం" ఈ విధంగా తెలిపినది. త్రయోదశo హరే రార్ధం - అర్ధనారి చతుర్దశo'
విష్ణువు శివుని ధ్యానించి సేవించి సగము శరీరమును పొందిన హరిహర మూర్తి. ఈ లీల రూపము మహేశ్వరుని లీలా రూపములలో 13వ అర్ధనారీశ్వర రూపం 14 విష్ణువు పార్వతీ కన్నా ముందే శివుని శరీరమును పొందాడు. అందుకే పార్వతి విష్ణువును ఆదర్శంగా తీసుకున్నది. విష్ణువుచే అష్టోత్తర శత నామాలను ఉపదేశం పొంది కఠోరంగా తపస్సు చేసి శివుని లో సగం శరీరం సాధించి "అర్ధనారీశ్వరి" అయినది.
విష్ణువు ఎంతటి గొప్ప మహా శివ భక్తుడు కాబట్టి శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు.......
🙏🙏🙏🙏
కావమ్మ మొగుడు కథ*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*కావమ్మ మొగుడు కథ*
దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ:
ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.
రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.
మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్ గ్రోత్ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య.
ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.
పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.
అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.
*ఎం. వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్.*
*సేకరణ:- శ్రీ వసంతకుమార్ గారి వాట్సాప్ పోస్ట్.*
నవగ్రహా పురాణం🪐* . *70వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *70వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*చంద్రగ్రహ చరిత్ర - 8*
దక్షప్రజాపతి ఇంద్రుడి వైపు చూశాడు. *"ఇంద్రా ! నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టం నాకు లేదు. సరస్వతీ నది సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే క్షయ తగ్గుముఖం పడుతుంది. చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది. ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు పక్షం రోజులు వృద్ధి చెందుతాడు. పక్షం రోజులు క్షీణిస్తూ ఉంటాడు. భార్యలందరినీ సమదృష్టితో చూసే సత్ప్రవర్తన సరస్వతీ సంగమ స్నానం ద్వారా సిద్ధించే వృద్ధికి మూలంగా ఉంటుంది.”*
*"మాతామహా ! అంటే చంద్రుడు ఒక మాసంలో పక్షం రోజులు తన 'కళ' పరంగా క్రమంగా వృద్ధి చెందుతూ పరిపూర్ణమైన కళతో ఆనందంగా ఉంటాడు. రెండవ పక్షం రోజులూ కళ క్షీణిస్తూ ఉంటుంది ! అంతే కదు !"* అన్నాడు ఇంద్రుడు.
*"చక్కగా గ్రహించావు ! మాసంలో సగం రోజులు వృద్ధి చంద్రుడుగా , సగం రోజులు క్షీణ చంద్రుడుగా ఉంటాడు !"* దక్షుడు వివరించాడు. *"ప్రతీ అమావాస్య నాడూ ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉండాలి !"*
*"చక్కటి పరిష్కారం. ఇది ఉభయతారకం !"* నారదుడు మెచ్చుకున్నాడు.
చంద్రుడిని అక్కడే వదిలి పెట్టి , ఇంద్రాదులు వెళ్ళిపోయారు.
*“మామగారూ ! నన్ను క్షమించండి !"* చంద్రుడు దక్ష ప్రజాపతితో అన్నాడు.
*"క్షమించాను గనుకనే శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించాను. అమావాస్య , అమావాస్యకూ సరస్వతీ సాగర సంగమ స్థానంలో పవిత్ర స్నానం చేస్తూ , నీ కళలను వృద్ధి చేసుకుంటూ ఉండు. నీ సప్తవింశతి సతీమణులనూ సమానంగా ఆదరించు !”* దక్షుడు ప్రబోధించాడు.
చంద్రుడు అశ్వినీ , ఆమెలాగే తన మూలంగా క్షోభించిన ఆమె చెల్లెళ్ళనూ కలయజూస్తూ , గద్గద కంఠంతో క్షమాపణ అడిగాడు. చేసిన అపరాధానికి చింత వ్యక్తం చేసి , అత్తగారి ఆశీస్సులు అందుకున్నాడు. అందరి నుండి అనుమతి స్వీకరించి , సరస్వతీ సంగమ స్థానంలో స్నానం చేయడానికి వెళ్ళాడు.
పావన తీర్థంలో స్నానం చేయగానే చంద్రుడి శరీరాన్ని పీడిస్తూ వస్తున్న భయంకర వ్యాధి నిమ్మళించింది. ఆరోగ్యాన్ని పుంజుకుంటూ , వర్చస్సునూ , కళనూ పెంపొందించు కుంటూ పత్నులందరితోనూ అత్తవారింట కొంతకాలం విడిదిచేసి ఇరవై యేడుగురు చక్కని చుక్కలనూ వెంటబెట్టుకుని తన మందిరం చేరుకున్నాడు చంద్రుడు.
ఆనాటి నుండి పత్నులందరినీ సమదృష్టితో ఆదరిస్తూ - 'బహు సతీవ్రతుడి'గా పేరు పొందాడు. చంద్రుడు కళాపూర్ణుడైన క్షణం నుంచీ ఔషధులకూ , వృక్షసంతతికీ , సస్యాలకూ ప్రాణాలు లేచి వచ్చాయి.
ప్రాణులకు ఆహారము , ఆరోగ్యం సంప్రాప్తించాయి. అన్ని లోకాలలోనూ ఆనందం వెళ్ళి విరిసింది.
చంద్ర మందిరం ఆనంద మందిరంగా మారింది.
*"ఇదీ చంద్రుడి చరిత్ర !"* కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.
*"ఆలోచిస్తూ ఉంటే , చంద్రుడు సౌందర్యోపాసకుడనిపిస్తోంది. గురువుగారూ !".* విమలానందుడు నవ్వుతూ అన్నాడు. *“వివాహానికి ముందు తారా ప్రణయం , వివాహానంతరం రోహిణీ పక్షపాతం !"*
నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *"స్థూల దృష్టికి కనిపించేది అదే ! ఇలాంటి విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి. అలా ఆలోచించేటప్పుడు ప్రస్తుతం మన ఆచారాలనూ , నియమ నిబంధనలనూ , కట్టుబాట్లనూ కొలబద్దలుగా తీసుకోరాదు. చంద్రుడు నవగ్రహాలలో ఒకడు. దైవస్వరూపు డాయన. దైవస్వరూపాల కార్యకలాపాలు లోకాల హితం కోసమే జరుగుతాయి. చంద్రుడు తారతో ప్రణయ యాత్ర సాగించాడు. దాని ఫలితంగా నవగ్రహాలలో మరొక గ్రహమైన బుధుడు ఆవిర్భవించాడు. ఇదే లోక హితం ! ఆ విషయంలో బృహస్పతి ఆలోచనా , స్పందనా సుస్పష్టమే. తన ధర్మపత్ని తార పాతివ్రత్యానికి భంగం కలిగిందని ఆయన అనుకోలేదు. స్త్రీ వ్యభిచార దోషం బహిష్టుతో ప్రక్షాళనమైపోతుందన్న నీతిని ప్రకటించిన శాసనకర్త ఆయన. తను అనుశాసన ధర్మానికి కట్టుబడే ప్రవర్తించాడు.”*
*"ఇక చంద్రుడి రోహిణీ పక్షపాతం - రోహిణిని ఇష్ట పత్నిగా నెత్తికెక్కించుకుని , ఇతర పత్నుల్ని కష్టపెట్టినందుకు ఆయన క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. పర్యవసానంగా నెలలో పక్షం రోజులు వృద్ధి చంద్రుడుగా , పక్షం రోజులు క్షీణ చంద్రుడుగా ఉండాల్సి వచ్చింది. సృష్టిలో - ఈ విశ్వంలో సాగుతూ వస్తున్న చంద్రుడి వృద్ధి , క్షీణత వల్ల వాతావరణానికి మేలే జరిగింది కదా ! లోకాలకు హితమే జరిగింది కదా ! అదే విధంగా అంతరాళంలో నెలకొన్న చంద్రుడి వల్లా , ఆయన పత్నులైన అశ్వినీ , భరణీ మొదలైన ఇరవై ఏడు నక్షత్రాల వల్ల కూడా జరిగిందీ , జరుగుతుందీ లోకహితమే !"*
*"బాగుంది గురువుగారూ ! మీ విశ్లేషణ మాలో కలిగిన అనుమానాలను నివృత్తి చేసింది !"* శివానందుడు అన్నాడు.
*"సంతోషం , నాయనా ! ఇప్పుడు నవగ్రహాలలో మూడవ గ్రహమైన కుజుడి చరిత్ర శ్రవణం చేయండి !”* నిర్వికల్పానంద అన్నాడు. *"కుజుడు పరమశివుడి స్వేదబిందువు నుంచి ఆవిర్భవించాడనీ , భూదేవి ఆ బాలుడిని తన బిడ్డగా స్వీకరించిందనీ చెప్పుకున్నాం. కదా ! పరమేశ్వరుడు సూచించిన విధంగా , భూమాత కుజుణ్ణి కన్నబిడ్డలా చూసుకుంటోంది. కుజుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు...”*
*రేపటి నుండి కుజగ్రహ చరిత్ర చదువుకుందాము*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 80*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 80*
*నిర్వికల్ప సమాధి*
ఒక రోజు సాయంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా నరేంద్రునికి అద్వైత పరాకాష్టయైన నిర్వికల్పసమాధి స్థితి సిద్ధించింది. ముందు అతడి తల వెనుక విభాగంలో ఒక దివ్యజ్యోతి కానవచ్చింది. పిదప అతడు మెల్లమెల్లగా బాహ్య, శరీర స్మృతులను కోల్పోయి సమాధిలో మగ్నుడయ్యాడు. ఇంద్రియాలకూ, మనస్సుకూ, లోకాలకూ, సమస్తానికీ అతీతమైన చైతన్యమయమైన నిర్వికల్పసమాధిలో లయించిపోయాడు. అలా చాలాసేపు గడచిపోయింది.
సమాధిస్థితి నుండి దిగి వచ్చిన తరువాత కూడా అతడికి శరీర స్మృతి పూర్తిగా రాలేదు. తల మాత్రమే ఉండడం అతడి కెరుక, తక్కిన దేహం ఉన్నట్లు అసలు తెలియలేదు. కాబట్టి, "నా శరీరం ఎక్కడ? నా శరీరం ఎక్కడ?” అంటూ కేకలుపెట్టాడు. అతడి కేకలు విని పరుగున వచ్చిన పెద్దగోపాల్, అతడి శరీరాన్ని తాకి చూపి, "ఇదుగో ఉంది. నరేన్, ఇదుగో ఉంది" అన్నాడు. గోపాల్ మాటలు నరేంద్రునికి వినిపించినట్లు లేదు. ముందు మాదిరిగానే కేకపెట్టాడు. దాంతో భయపడిపోయిన గోపాల్
పరుగెత్తుకొని మేడ మీదికి వెళ్ళి శ్రీరామకృష్ణులకు ఈ విషయం వివరించి చెప్పాడు.
అంతా ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ, "అతణ్ణి ఆస్థితి లోనే ఇంకా కొంతసేపు ఉండనివ్వు. ఈ స్థితి కావాలని పలుమార్లు అతడు నన్ను వేధించాడు" అన్నారు.
చాలాసేపు గడచిన తరువాతే నరేంద్రునికి బాహ్యస్కృతి వచ్చింది. కళ్ళు తెరచి చూసిన అతడికి తన చుట్టూ సోదర శిష్యులు విచారవదనంతో కూర్చుని ఉండడం కనిపించింది. ఇన్ని రోజులుగా అతడి మనస్సులో చెలరేగుతున్న తుపాను ఉపశమించింది: అమిత ప్రశాంతత నెలకొంది.
ఆ తరువాత అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అతణ్ణి ఆనందంగా చూస్తూ ఆయన, "కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్నీ చూపించింది. కాని ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేయబడి ఉంటుంది. దాని తాళం చెవి నా వద్ద ఉంటుంది. నువ్వు ఆమె కార్యాన్ని పూర్తిచేయగానే ఈ పెన్నిధి మళ్లీ నీకు దక్కుతుంది; మళ్లీ నీకు సమస్తమూ "అవగతమవుతుంది" అన్నారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 70*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 70*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం*
*చతుర్భి స్సౌందర్యం సరసిజభవ స్త్సౌతి వదనైః |*
*నఖేభ్య స్సంత్రస్యన్ ప్రథమమథనా దన్ధక రిపో*
*శ్చతుర్ణాం శీర్షాణాం సమ మభయహస్తార్పణధియా ||*
*కంఠాధఃకటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ*
*శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారణీ ||*
అని శ్రీ లలితా సహస్రనామలలో చెప్పినట్లు ఈ శ్లోకములో అమ్మవారి హస్తములను వర్ణస్తున్నారు.
మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం = అమ్మా నీ నాలుగు చేతులు కమలములవలే మృదువుగా వున్నాయి.
చతుర్భిః సౌందర్యం సరసిజభవ స్త్సౌతి వదనైః = ఆ నాలుగు చేతుల సౌందర్యమును చతుర్ముఖ బ్రహ్మ నాలుగు రెట్లుగా స్తుతించాడు.ఎప్పుడు ?
నఖేభ్య స్సంత్రస్యన్ ప్రధమమధనా దన్ధక రిపో = అంధకాసురుని మర్ధించిన శివుడు తన వాడియైన గోళ్ళతో
తన తలను త్రుంచివేసినప్పుడు దీని సందర్భమేమిటో అందరికీ తెలుసు కానీ మరొక్కమారు స్మరిద్దాం.
ఒకప్పుడు ఐదు శిరస్సులు కలిగిన బ్రహ్మకూ, విష్ణువుకూ తగాదా వచ్చిందిట.మనలో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో వారిద్దరిమధ్య ఆద్యంతములు తెలియని ఒక పెద్ద జ్యోతిర్లింగ రూపంగా శివుడు ఉద్భవించాడట. ఆయన బ్రహ్మకూ విష్ణువుకూ చెప్పారుట.నా ఆద్యంతములు తెలుసుకుని ముందు ఎవరు వచ్చి చెపుతారో వారు గొప్ప అని.అప్పుడు విష్ణువు ఆదివరాహ రూపంలో భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళారుట. బ్రహ్మ తన హంస వాహనం పై ఆకాశ మార్గన వెతుక్కుంటూ వెళ్ళారుట.ఎంతకాలమైనా వారిద్దరూ ఆ జ్యోతిర్లింగము యొక్క ఆద్యంతములు కనుగొనలేకపోయారు. విసుగు చెందిన బ్రహ్మ దారిలో ఎదురైన కేతకి(మొగలి)పుష్పాన్ని తాను శివలింగం యొక్క చివరి భాగాన్ని కనుగొన్నట్లుగా అబద్ధపు సాక్ష్యము చెప్పమన్నాడు.విష్ణువు విఫలుడై తిరిగిరాగా,బ్రహ్మ అబద్ధం చెప్పటంతో శివుడు తన వాడి గోరుతో ఆయన ఐదవ తలను త్రుంచివేశాడు. కేతకి పుష్పాన్ని దైవపూజకు అనర్హురాలిగా శాపమిచ్చాడు. బ్రహ్మ తన మిగిలిన నాలుగు తలలను ఖండిస్తారనే భయంతో అమ్మా అని ఆక్రందన చేశాడు.అప్పుడు అమ్మవారు వచ్చి తన నాలుగు హస్తాలను ఆయన నాలుగు తలలకు రక్షణగా నిలిపింది.అంటే సృష్టికర్తనూ,సృష్టినీ ఆమె కాపాడుతతుందని భావం.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
మహనీయుడి పేరు శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి
హనుమాన్ ఆశీర్వాదంతో జన్మించిన సనాతన హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఉత్తరాది హిందీ రాష్ట్రాలను జాగృతం చేస్తున్న ఓ యువ సంత్ గురించి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది అనుకుంటారు.
ఆ మహనీయుడి పేరు శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి వయస్సు 27సం , గ్రామం ; గాఢ , ఛత్రపూర్ జిల్లా , మధ్యప్రదేశ్ రాష్ట్రం . వంశపారంపర్యంగా బ్రాహ్మణ పూజారి కుటుంబం, తన గ్రామంలో స్వయంభూగా వెలసిన బాగేశ్వర్ బాలాజీ హనుమాన్ దేవాలయంలో పూజ కార్యకలాపాలు , హనుమాన్ ఉపాసకుడు , ప్రవచన కర్త . ఆయన వాక్కు ఎలా ఉంటుందంటే మన శ్రీ గరికపాటిగారిని + శ్రీ చాగంటి గారి ఇద్దరు ఒక్కటిగా ఉంటే ఎలా ఉంటుందోఆయనే శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి - బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ఆలా హిందూ ధర్మం , రామరాజ్యం , హిందూ ధర్మం , హిందూ దేశం గురించి దేశమంతా తిరుగుతూ హిందువులను చైతన్య పరుస్తున్నారు . ఎక్కడ తొణకుడు బెణకడు - సూటిగా సుత్తిలేకుండా తలకెక్కుతుంది - భయమనేది అసలే లేదు
ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సభ పెడుతున్నారంటే లక్షల్లో ప్రజలు వస్తారు , కనీసం దూరం నుంచి చూస్తే చాలు జన్మ ధన్యం అయ్యింది అనేవారు లక్షల్లో ఉన్నారు .
ఒకానొక సందర్భంలో బీహార్ లో 7 రోజుల రామ కథ ప్రవచనం అంటే , అక్కడి ప్రభుత్వంమీరు అన్ని రోజులు సబ పెడితే సెక్యూరిటీ ఇవ్వడం మావల్ల కాదు సభను కుదించండి అని వేడుకుంది ఎందుకంటే అంతకు కొన్ని నెలల ముందు ఓ బీహార్ మంత్రి "శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి" ఎలా వస్తారో చూస్తా అన్నాడు అప్పుడు ఆయన రానే వచ్చాడు ఒక్క రోజు సభ పెట్టారు స్వచ్చందంగా 10 లక్షల మంది భక్తులతో తో పాట్నా నగరం అష్టదిగ్బంధనం అయ్యింది . ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి అదే "శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి" ఈ పీఠాధిపతి రాజకీయ నాయకుడు కాదు సుమా .
ఎంతటి పేరుమోసిన జర్నలిస్ట్ అయినా ఆయన దగ్గర తోకముడవాల్సిo దే తప్పదు అంతటి మాట చాతుర్యం ఈ సంత్ గురించి మన ఈటీవీ , టీవీ 9, వాళ్లకు తెలుసు కానీ హిందీ భాష వల్లనో ఏమో మనకు చూపించరు
ఈయన హనుమాన్ వరప్రసాదం పుత్రుడు - ఈయన సభలో నువ్వు ఎక్కడ కూర్చున్న నీ పేరు , నీ తండ్రి పేరు , నీ తాతగారి పేరు పెట్టి మరి పిలిచి నువ్వు ఇంతకుముందు చేసిన పనులు , నీ కష్టం , నీ భవిష్యత్తు అన్ని పూసగుచ్చి , ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు wahttsapp చాటింగ్ ఎవరితో చేస్తున్నావ్ కూడా చెప్పగలరు - నీ భవిష్యత్తుకు మార్గం దిశా నిర్దేశం కూడా చేయగలడుఅంతటి దైవాంశ సంభూతుడు ఆయన పేరు కన్నా "బాగేశ్వర్ ధామ్ సర్కార్ "అంటేనే ఎక్కువ గుర్తు పడతారు
ఒక్కసారి “Bageshwardhamsarkarofficial” అని youtube లో చూడండి ఆయనగురించి మీకే తెలుస్తుంది హైదరాబాద్ హిందీ కాకుండా ఒరిజినల్ హిందీ నేర్చుకోవాలి అనుకునే వారు ఈ సంత్ ప్రసంగం వింటే చాలు మీకు హిందీ వచ్చినట్టే
జై శ్రీరామ్ - జై సీతారాం - జై హనుమాన్