31, అక్టోబర్ 2023, మంగళవారం

పాఠకులతో కాసేపు

 

మనబ్లాగు అనేక దేశాల తెలుగు వారు చూస్తున్నారని తెలుపుటకు సంతోషితున్నాను. ఒక్కొక్క రోజు భారత దేశంలో వీక్షకులకన్నా ఎక్కువగా అమెరికా, కెనడా, ఫ్రాన్సు దేశంల నుండి ఉండటం ముదావహం. కాగా నిత్యం అనేక విషయాలను గురించి నేను పోస్టులు పెడుతున్న సంగతి పాఠకులకు విదితమే.  ఈ బ్లాగు మనమందరిది.  మీరు కూడా ఈ బ్లాగులో చక్కటి విషయాలను పంపి భాగస్వాములు కావచ్చు.  మీరు చేయవలసినది ఏమంటే మీరు తెలుపదలచుకున్న విషయాన్నీ తెలుగులో కానీ, ఇంగ్లీషులో లేక హిందీలో పంపండి.  ఎలా అంటే ఈ రోజునుంచి నేను పాఠకుల పేజీ అని ఒక శీర్షికతో ఒక పోస్టు పెడతాను.  మీరు ఆ పోస్టుకు కామెంటు రూపంలో మీ పోస్టులను పంపండి.  అందరకు ఆమోదకరం, ఉపయుక్తకరం అని తలచినవి నేను కామెంట్ల రూపంలో పబ్లిష్ చేస్తాను. 

పంచాంగం గురించి  

మన బ్లాగులో నిత్యం పంచాంగం రెండు మూడు రకాలుగా పెడుతున్నాము.  కానీ ఈ పంచాంగం విషయంలో ఇతరదేశాలలో వుంటున్నవారు గమనించాల్సినది ఏమిటంటే పంచాంగం ఒక ప్రాంతంలోని సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను గణనలోకి తీసుకొని లెక్కిస్తారు.కాబట్టి ఇక్కడి (హైదరాబాదు) తిథి వార నక్షత్రాదులు మీరు ఉండే ప్రాంతానికి సమన్వయము కావటం జరగదు.  అటువంటప్పుడు ఏమి చేయాలి. 

పంచాంగ సవరణ: మీరు హైదరాబాదు సూర్యోదయకాలం మీ ప్రాంతపు సూర్యోదయకాలంకు వున్నా వేత్యాసాన్ని కలిపి లేక తీసివేస్తే మీకు మీ ప్రాంత పంచాంగం వస్తుంది. అదే సమయం ఇతరత్రా విషయాలకు సమన్వయము చేసుకోవాలి.  అంటే ఉదాహరణకు మీరు హైదరాబాదు నుంచి వున్నా ప్రదేశం హైదరాబాదు సూర్యోదయానికన్నా 5 నిముషాలు ముందుగా వున్నారనుకోండి అప్పుడు హైదరావాడు సమయానికి 5 నిముషాలు కలుపుకుంటే మీ ఆ రోజు పంచాంగం వస్తుంది. 

 ప్రకటనల గురించి 

మనబ్లాగులో అమెరికా వారు కెనడా వారు విశేషంగా చూస్తున్నారు.  దీనిని ఎందుకు ఇతరులకు అంటే అక్కడ  వుంటూ అక్కడి  మన తెలుగువారితో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి దోహదకారిగా ఉండకూడదు అని తలంచి   ఒక వ్యాపార ప్రకటన విభాగాన్ని మన బ్లాగులో తెరువ తలచాము.  అది ఎలావుంటే బాగుండునది అనే విషయాన్ని పాఠకులు కామెంటులో పెట్టి  తెలుపగలరు. అదే విషంగా ఎంత రుసుము తీసుకుంటే బాగుంటుంది తెలుపగలరు. 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

 





కామెంట్‌లు లేవు: