ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, అక్టోబర్ 2024, సోమవారం
*శ్రీ ఆది శంకరాచార్య చరితము37 వ భాగము*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము37 వ భాగము*
🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒
*విష్వక్సేనాలయము:*
అనుమల్లపురము నుండి పశ్చిమ దిశగా బయలుదేరి మంగళ వాద్యములతో, దారి పొడవున గురువులను స్తోత్రములు చేయుచు, ప్రాంతీయ విశేషముల నరయుచు, శ్రీశంకర శిష్యులు ఆహ్లాదముతో వెంటనంట శ్రీశంకరా చార్యస్వామి మరుంధ నగరం ప్రవేశించారు. దేవాలయం లేని గ్రామ ముండదనిలోకమనును తీరా ఈ ఊరు దేవాలయం లేని ఊరని తెలిసికొన్నారు. వెంటనే ఆలయ నిర్మాణమునకు గ్రామ వాసుల సహాయంతో వలయు నేర్పాట్లు గావించి, శాస్త్రాను గుణముగ, అందచందాలు తీర్చి దిద్ది గోపురాలయము లను నిర్మించి అందు విష్వక్సేనుని ప్రతిష్ఠిం చారు. ఆలయమునకు తూర్పుదిశగా నొక పాకశాలను నిర్మించారు. ఆలయ ఆవరణలో ఇంకను వలయు మందిరాదులు, ప్రకార ములు నిర్మించారు.
ఆ దేవాలయమున నొకచో శ్రీ శంకరాచార్య స్వామి దర్భాసన మును పరుచుకొని సుఖాసీనులై, మనోన్మణీ ముద్రను ధరించి తనలో నుండు పరమాత్మను, లోకము నంతను పరమాత్మగను జ్ఞాన దృష్టితోచూచుచుబ్రహ్మానందములో మునిగి యున్నారు. ఆ విధమున చాలకాలము మహాయోగ సమాధిలో నుండి జ్ఞానామృతము ను ఆస్వాదిస్తూ ఉన్నారు.
మహాయోగిపుంగవులు, జ్ఞాన స్వరూపులు శ్రీ శంకరపాదులు అట్లు ఉండుటజూచి అబ్బుర పడి యోగనిద్ర నుండి మేల్కాంచు వరకు భక్త కోటి వేచియున్నది. శ్రీజగద్గురువులుసమాధి నుండి మేల్కాంచుట గని పురమందలి విష్వక్సేన భక్తులు చక్రాంకి తములతో ప్రకాశించుచు మునికోలలను ధరించి "యతీశ్వరా! మా మత ధర్మములువిని అందు గల విశిష్టతను తిలకిం చండి. మా మతము అన్నిటి కంటే గొప్పది. వైకుంఠవాసుడైన విష్వక్సేనుడు మాకం దరికీ ఉపాస్య దేవుడై వెలయుచున్నాడు. మేమా విష్వక్సేనుని పరమభక్తులమై యున్నాము. యముడనిన మాకు నిర్భయము. ఈ శరీర విసర్జన సమయమందు వైకుంఠము నుండి విష్ణుభటులు వచ్చి మమ్ములను స్వయంగా వైకుంఠమునకు తీసికొనిపోవుచున్నారు. కావున మా మతము సర్వజనా దరణీయమై యొప్పుచున్నది" అని వినిపించారు.
శ్రీశంకపాదులు విష్వక్సేన భక్తులాడిన పలుకులు వినుటతో వారలయెడ పరమప్రేమ గలిగి, “విష్వక్సేన భక్తులారా! మీరాడిన మాటలలో నిజం కానరాదు. విష్వక్సేనుడు శ్రీమన్నా రాయణ మూర్తి భక్తుడై యున్నాడు. ఆ నారాయణ మూర్తి వైకుంఠమునకు ప్రభువు. విష్వక్సేనుని వంటి భక్తులు చాలామంది గలరు. ఎవరి కిష్టమైన విష్ణుభక్తులను పరమ దైవముగ భావించి కొలుస్తారు. అందులకు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించియున్నారు. ఆవిధముగ విష్ణు భక్తులందరు పూజనీ యులైరి.ఈ విష్ణు భక్తులకు స్వాతంత్య్ర మన్నదిలేదు. మీరందరు వారిని స్వతంత్రులని భావించి పూజించు చున్నారు. అందువలన లాభము లేదు మీకు విష్ణులోకము కావలెన ను కోరిక ఉన్నచో శ్రీమన్నారాయణ మూర్తినే సేవించుడు.ఆయనేముక్తినిచ్చును. “ఆయనే నేను నేనే ఆయన” అని నిరంతరం మననం చేయుడు. భేదభావం మాత్రం ఉండరాదు. అప్పుడది నిర్గుణపూజ యగును. భేదభావం లేనివారు తత్త్వజ్ఞానులై ముక్తినిపొందుచున్నారు. గురూపదేశమును పొంది, వారి నుండి అద్వైతతత్త్వ బోధలు వినుచు, ప్రయత్నంతో నిర్గుణ ధ్యానం చేసి ముక్తిని పొందుడు. మీ మీ బాహ్యచిహ్నములు విడ నాడండి.” అని బోధించారు.
విష్వక్సేన భక్తులందరు శ్రీ శంకరపాదుల బోధ విని సంతసించి తమ తమ బాహ్య చిహ్నములను విడనాడి
శ్రీ శంకరాచార్యస్వామి చెప్పిన విధముగ అద్వైతమార్గము ననుసరించడం మొదలుపెట్టారు. పిమ్మట మన్మధోపాస కులు వచ్చి తమ మతవిధానమును తెలుపుకొన దొడగారు.
*మన్మథ మతస్థులు:*
మన్మథమతస్థులు ఎట్లైనను తమమతము ను నిలబెట్టుకొన తలంపు గలిగి శ్రీశంకర దేశికేంద్రులను సమీపించి, నమస్కారము లర్పిం చారు.
"యతీశ్వరా! మా మతము చాల ప్రసిద్ధి కెక్కియున్నది. మన్మథుడే మాకు పరమదైవం. ఆయన అందరి హృదయములలో భావనా రూప ముగా సర్వదావెలయు చున్నాడు.మామతము చాలా అద్భుతమైనది. మన్మథుడు ప్రతిష్ఠించిన దిది. ఆయన సృష్టిస్థితి లయములకు కారకుడై యున్నాడు. అందు వలన ఆయన్ని అందరు ఉపాసించ వలెను. మన్మథదేవుడు వక్షస్థలమందు రెండు గుండ్రని భూషణము లను దాల్చి అందరిని మోహంతో తన వశం చేసికొను చున్నాడు. మనస్సును హరించే అద్భుతశక్తి గలిగి వెలుగొందు చుండుట వలననే మన్మథుడను గొప్పపేరు కలిగినది. సుందర స్వరూపముతో నొప్పారు కాంతలతో కామక్రీడా సుఖములను పొందడమే మోక్షమొస గునని మా దృఢ నమ్మకం. మన్మథోత్సవ ములందు తాముగూడ పాల్గొని అనంతమైన సుఖములను పొందుడు!" అని ఒక మన్మథ మతస్థుడు నివేదించాడు.
శ్రీ శంకరాచార్యస్వామి అదివిని, "మన్మథభక్తులారా! సృష్టిస్థితి లయములకు బృహ్మవిష్ణు మహేశ్వరులే కారకులు గాని ఇతరులు కారు. త్రిమూర్తులు ఆ పనికి నియమింపబడినట్లు శాస్త్రములు తెలుపు చున్నవి. సూర్యునకున్న ప్రకాశము రవిపుత్రున కున్నదా? అదియును గాక స్త్రీలతోటి సహవాసము, పొందుపై మక్కువ గలవాళ్ళకు దూరముగనుండుమని శాస్త్రములు వచిస్తు న్నాయి. అందువలన మీమతము మతి మాలినది. మన్మథుడు మోక్ష మిచ్చు ననుటకు ప్రమాణములు కలవా? జ్ఞానమార్గమే మోక్ష హేతువు" అని బోధించారు.
అప్పుడు వారు తమ,తమ మతధర్మాలను విడనాడి పంచాయతనపూజలు ప్రారంభించి, ఇతర సత్కర్మలను నిష్ఠతో అచరించుచు, అద్వైత తత్త్వ విచారణ యందు నిమగ్నులై మన్మథభక్తులందరు శ్రీ శంకర పాదులకు భక్తులై సుఖముగ నున్నారు. అచ్చోటువీడి శ్రీ శంకరా చార్యస్వామి శిష్య గణమును వెంట నిడుకొని మాగధపుర మునకు ప్రయాణమై నారు.
*మగధ పురము:*
మన్మథభక్తులను అద్వైతభక్తు లనుగా జేసి, ఉత్తరముగ ప్రయాణమై శ్రీశంకర పాదులు మగధపురం ప్రవేశించారు. ఏ మేడ జూచిన, ఏ గడప జూచిన అంతాబంగారు మయమే. మాగధపుర సంపద వర్ణించ నలవి గానిది. ఏ ఏయింటి ప్రాకారపుగోడ చూచినా బంగారు యిటుకలతో నిర్మించినవే. గోడలు నక్షత్రాల నంటు చుండెను. ఆ గోడలకు వింతవింత లతలు చెక్కబడిన బంగారపు రేకులు అమర్చబడి యుండెను. మధ్య మధ్య కాంతులు విరజిమ్మే మేలైన రత్నములు పొదుగబడి యున్నవి. వారి ధనాగా రములు అంతులేని విత్తంతో పూర్తిగావింప బడినవే! ఆ పురమునగల ఏయమ్మను జూచినను బంగారు ఆభరణములు మోయ లేక అడుగు లిడుటకు గూడ శక్తి హీనమైనదే ! ఆయమ్మల శరీర కాంతులు అనుపమా నములు. మగవాళ్ళు తక్కువా? వేళ్ళకు, ముంజేతులకు భుజ ములకు, కంఠములకు, దండలకు, చెవులకు, రకరకాల ఆభరణము లు తగిలించెడివారు. వాళ్ళ సంపదను ఒక్కమాటలో చెప్పవలె నన్న కుబేరసంపదను ధిక్కరించినది. వాళ్ళ కంతంత సంపదలెట్లు చేకూరెనో యను చింతన శ్రీ జగద్గురువుల శిష్య గణంలో మెదలక పోలేదు.
శ్రీ ఆచార్యస్వామి శిష్యగణంతో మాగధ పురవీధులలో నుండి కుబేరసంపదలు తిలకించుచు తిన్నగా దేవాలయమునకు జని చూడ గుడి గోపుర ములు, ప్రాకారములు, ద్వారములు, కిటికీలు సర్వము బంగారు మయమై దివ్యకాంతు లు వెదజల్లు చున్నవి. దేవుని దర్శించి ఆలయ మందు శ్రీశంకరాచార్య స్వామి విశ్రమించారు. శ్రీ జగద్గురు వులు వచ్చిరన్న వార్త విని పురజనులందరు బయలుదేరి దర్శించారు. వేలాది శిష్యులతో అవతారమూర్తి తమ పురం వచ్చారన్నవార్త చెవులబడుటతో మాగధపురములోని కుబేరభక్తులు ఆబాల గోపాలం ఉత్సాహంతో వెడలి దర్శించారు. వారికి అనేక సదుపాయాలు సమ కూర్చారు. వాళ్ళు సంపదను జూచు కొనుచు కులుకుచుండు వారు. తమకు మహా భాగ్యం కలిగించిన కుబేరుని గురించి శ్రీశంకరపాదులకు నివేదించదలచి అందొక భక్తుడు జగద్గురువు లకు నమస్కరించి,
'స్వామీ! ఈ జగత్తు అంతయు ధనం మీద ఆధారపడి యున్నది. ఏ పని చేయవలెనన్నా ధనం కావలెను గదా! కనుక మోక్షమునకును ధనమే మూలము. ధనం కావలె నన్నను, మోక్షం కావలెనన్నను మా పరమదైవం కుబేరుడినే ఉపాసించ వలయును. ఆయన మాకే కాదు, బ్రహ్మాది దేవతలందరికి ధనము నిస్తున్నాడు. గనుక బ్రహ్మ మొదలు మానవుని పర్యంతం, మా దేవాది దేవుడైన కుబేరుడు సేవింప దగిన వాడయ్యెను. ఆయనను నిత్యం సేవించే ఒక యక్షిణి గలదు. ఆదేవతా స్త్రీని సేవించినను లెక్క లేనంత ఐశ్వర్యం పాప్తించును. అట్టి మహాభాగ్యములు కలుగజేసే కుబేరుణ్ని, యక్షిణిని సేవించని వాళ్ళు దరిద్రులే కదా! కావున తాముకూడ ఆ ఇరువురిని సేవించి సమస్త సంపదలు బడసి సుఖంగా ఉండండి!' అని తెలియజేసెను.
శ్రీ శంకరాచార్యులు కుబేరభక్తుల ప్రభావాలు ఆలకించి, ‘కుబేర భక్తు లారా! మీరాడిన మాటలకు ఆధారములు లేవే! ధనమునకు అధిపతి కుబేరుడైనా, మరి యొకడైనా ఆ విషయమటుండ నిండు ధనంతో తృప్తిపడు వాడెవడు?ఆశకు అంతమున్నదా? ఆశ దినదినాభివృద్ధి నొందు స్వభావం గలది. ధనమున్న వానికి లోభత్వము సహజంగా ఉండునదే! అట్టి పిసిని గొట్టు వానికి ధర్మబుద్ధి అసలే ఉండదు కదా! కనుక ధనమునకు మోక్షమునకు దూరము హెచ్చు. పైగా ధనము నకు శాశ్వతమైన చంచలత్వముంది. అది ఒకచోట స్థిరంగా ఎప్పుడూ ఉండలేదు. చెప్పకుండ, తెలియ కుండ తప్పుకొనును. ధనము అనేక అనర్థ ములకు హేతువు. పూర్వ జన్మలో చేసి కొనిన సుకృతం కొలది ధనవంతులగుచున్నారే గాని, ఈ జన్మలో చేయుచున్న సుకృతం వల్ల ఈ జన్మలో ధనికులు కాలేరు.
బ్రహ్మగర్భంలో బంగార మున్నది. అందువలన హిరణ్యగర్భుడన్న సార్థకనామం కలిగిన దాయనకు. లక్ష్మి సకల సంపదలకు పుట్టినిల్లు. ఆమె విష్ణుమూర్తి ఇల్లాలు. బంగారముతో కూడి యున్నవాడు ఈశ్వరుడు. బంగారు మేరువు పర్వతం మీదనే ఉన్నవాడు దేవేంద్రుడు. ఆలాటి వాళ్ళందరు కుబేరుని ధనంతో బ్రతుకుతున్నా రనడం నింద తప్ప వేరుగాదు. బ్రహ్మాది దేవతలందరి అను గ్రహంతో కుబేరుడు కుబేరుడై నాడనిన ఎంతో సమంజసముగ నుండును. కుబేరోపాస నలను విడనాడి ధర్మములను ఆచరిం చుడు' అని తెలియ చెప్పారు.
దేశికేంద్రులు వచించిన సత్యమును గ్రహించి కుబేర ఉపాసనలను కట్టిపెట్టి శ్రీ శంకర భక్తులై, పంచపూజాది సత్కర్మ నిరతులై, జ్ఞానార్జన తత్పరులై అద్వైతమతమును స్వీకరించారు.
*దేవేంద్ర భక్తులు:*
ఒక దేవేంద్రభక్తుడు లేచి, 'యతీశ్వరా! నమస్కారములు! లోకాధీశుడు, సృష్టిస్థితి లయకారకుడు తిమూర్త్యాత్మక మైన వాడు, బ్రహ్మాది శబ్దము లతో పిలువబడువాడు, దేవతల చేతను, యక్షులచేతను, గంధర్వుల చేతను నిరంతరం సేవింప బడుచుండువాడు మా దేవేంద్రుడై యున్నాడు.అదియును గాక ఆయన సర్వేశ్వరుడని, సర్వదాత యని శ్రుతులు తెలుపు చున్నవి. వామనుడు ఆతనికి సోదరుడై యున్నాడు. అమృత పానమే ఆయన కాహారము. అట్టి దేవ దేవుడైన దేవేంద్రుడు అమరనగరంలో వాసం చేస్తూ స్వపరిపాలకుడై ప్రకాశించు చున్నాడు.
ఆయనే సర్వాంత ర్యామి.
దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు సర్వ సమర్థుడై యున్నాడు. అలాటి దేవదేవుడైన దేవేంద్రుని త్రికరణ శుద్ధిగా సేవిస్తున్నాము. కనుక తాము కూడ మాలాగే దేవేంద్రుని ఉపాసించండి!' అని అన్నాడు.
దేవేంద్ర భక్తుడు చెప్పిన దంతయు శ్రద్ధతో శ్రీ శంకరా చార్యులు విని, ‘దేవేంద్ర భక్తులారా! బ్రహ్మ, పరబ్రహ్మ మొదలయిన శబ్దముల వలెనే ఇంద్రశబ్దము గూడ సచ్చిదానంద స్వరూపమునకే చెందు చున్నది. అంతియ గాని వజ్రాయుధధారియైన దేవేంద్రుడే పరమాత్మ యని చెప్పరాదు. 'సదేవ' మొదలైన వేదవాక్యములు పర మాత్మకే చెందుచున్నవి. బ్రహ్మ, విష్ణు మహేశ్వ రులు ముగ్గురు పర బ్రహ్మమునుండియేఉద్భవించారు. బ్రహ్మ నుండి ఇంద్రుడు, యముడు మొదలైన వారు ఉద్భవించారు. అట్టితరి దేవేంద్రుడు సృష్టికి కారణ మనుట పొసగునది కాదు. దేవేంద్రుణ్ని 'సర్వదాత' అనుచుంటివి. లోకంలో దానంచేయుట యందు ఒకకరిని మించినవారు మరియొకరు ఉందురు. అట్లు మించిన వానిని 'సర్వదాత' అనవచ్చు.
దాతృత్వంలో దేవేంద్రు నకు గొప్ప ఉంటే ఉండు గాక! అంత మాత్రంచేత అతనిని పరమాత్మ అనుట అవివేక మగును. సర్వదాత పరమాత్మ ఒక్కడే. ఇతరుల కా యోగ్యతలేదు. బ్రహ్మ కాలంలో పదియారవ వంతు ఇంద్రునకు గలదు. కనుక మీరు ఉపాసించు దేవేంద్రుడు బ్రహ్మకన్న ఎన్నిరెట్లు తక్కువగా నుండెనో యోజించుకొనుడు.' అని కచ్చితముగ వక్కాణించారు.
అట్లు శ్రీ ఆచార్యస్వామి బోధించుటతో ఇంద్ర భక్తు లందరుసంతసించి తమ మతమునకు స్వస్తి చెప్పుకొని, శ్రీ శంకరులకు సమస్కార ములర్పించి, పంచాయ తనపూజ ప్రారంభించి, వేదవిహితమైన కర్మ లాచరించుచు శ్రీశంకరు ల యందు భక్తికలిగి శిష్యులయ్యారు. తరువాతి మజిలీ యమప్రస్థపురము.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 37 వ భాగముసమాప్తము*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము36 వ భాగము*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము36 వ భాగము*
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
క్షపణకుడు: క్షపణకుడు తన మతమును విని పించుటకై లేచి శ్రీ శంకరులను అర్థించెను. అంత శ్రీ జగద్గురువులు అంగీకరించగా క్షపణకు డు నమస్కరించి,
'స్వామీ! మా మతము అతి విచిత్రమైనది, శుభదాయిని, ఎల్ల కోరికలను సమకూర్చ గలట్టిది, ఏ సమయ మునకేమి జరుగుచున్న దో కూడ తెలుప గలదు. త్రికాలముల యందు జరిగినది, జరుగుచున్నది, జరుగ బోవునది ఉన్నదున్నట్లు తెలియ జేయును కనుక కాలమే మాకు పరమదైవం. పరాత్ప డుగూడ మా మతము ను కాదన జాలడు.' అని తెలియ జేసెను. క్షపణకుని మాటలు ఆలకించిన శ్రీశంకరా చార్యులు, 'క్షపణకా! నీచేత నున్న వేమి?’ అని ప్రశ్నించగా, 'స్వామీ! ఒక చేత నున్నది తురియంత్ర ము. రెండవ చేతిలోనిది గోలయంత్ర ము' అని క్షపణకుడు జవాబీయగా 'క్షపణకా! నీవన్నట్లు బాగుగనే యున్నది. కాలమును తెలిసికొనుటలో గట్టి వాడివే! సంశయం లేదు! కనుక నన్ను ఆశ్రయించి యుండు. నిన్ను పరీక్షించు తరుణ మాసన్నమయ్యే పర్యంతము వేచి యుండుము.' అన్నారు శ్రీశంకరపాదులు. అందులకు క్షపణకుడు సమ్మతించి శ్రీ ఆచార్య శిష్యగణంతో పాటు ఉండి సమయం కొరకు వేచియున్నాడు. అంతలో జైనమతస్థు డు ఒకడు వచ్చి తన మతవిశిష్టతను వెళ్లడిం చ గడగెను.
*జైనమతస్థుడు:*
క్షపణకుని వేచియుండ మనడం విని జైనమత స్థుడొకడు ఒడలంత మలము నలదుకొని గోచీని గట్టిగా బిగించుకొని, శిష్యుల ను వెంటనిడుకొని, ‘అర్హన్నమ:' అనుచు శ్రీ శంకరులను దర్శించి, 'స్వామీ! మాకు జిన దేవుడు ముక్తినిచ్చును. అందుకొరకై మేము ఆయనను ఉపాసించె దము. ఆయన సర్వాం తర్యామి. కావున తాముకూడ అయననే పూజించుడు. అందరి లోనుండే జీవస్వరూపం మా దైవము. శరీరం నశించుటతో జీవునకు నిర్మలత్వము వచ్చును. శరీరముసర్వకాలముల యందు మల సహిత ముగనే యుండును. ఎన్ని స్నానములు చేసినను, ఎటువంటి శుద్ధు లొనర్చినను ఈ శరీరము అపరిశుద్ధమే కదా! అట్టి శరీరములు పట్టుకొని ప్రాకులాడడం నిరుపయోగము. కావున మా జిన దేవుణ్ని ఉపాసించుడు' అని పలికినంత శ్రీశంకరాచార్యస్వామి విని, ‘జీవుని యొక్క నిజస్థితి నీకు తెలియ కున్నది. పైకి కనిపించే ఈ శరీరమొక్కటే జీవు నకున్నదని తలంచు చున్నావు. సూక్ష్మ శరీరము, కారణ శరీరము అను మరి రెండు శరీరములున్నవి. జీవుడు స్వశక్తితో ఆరెండు శరీరములనుదాటి పరమాత్మ స్వరూపుడగుచున్నాడు. నేను జీవుడును వేరు గాదు అని తలంచుట అజ్ఞానము. అందు వలన ఈ జీవునకు భేదమేర్పడుచున్నది. అట్టి బుద్ధి నశించి నేనే బ్రహ్మను, మరి యొకటి కాదు. అను దృఢమైన జ్ఞానము కలిగిన ముక్తు డగుచున్నాడు. శరీరం నశించినంత మాత్రం చేత ముక్తిరాదు అని వివరించారు. జైనుడు శ్రీశంకర పాదులు వచించిన సత్యమును నమ్మి తన మూఢత్వం పారదోలి శ్రీశంకరాచార్య స్వామిని శరణు వేడ అంత దయామయుడు పద్మపాదాదులకు శిష్యునిగా నొనరించిరి..
*శబలుడను బౌద్ధుడు*:
బౌద్ధమతము నవలం బించిన వారు కొందరు శ్రీ శంకరాచార్య సభలో నుండగా తమ మతమును స్థాపింప నెంచి అందు శబలు నువాడు లేచి జగద్గు రువులను సమీపించి, "యతివర్యా! నమస్కారములు. తాము చేయు బోధల న్నియు నిస్సారములు. జీవేశ్వరులకు అభేద మనుచున్నారు. మాన వులకు కొమ్ము ఉందనుట యెట్టిదో ఇదియునట్టిదే! మీ వంటి వారిట్లు వచించడం విచారకరం. జీవుడుజీవుడే, పరమా త్మ పరమాత్మయే! ఈ ఇద్దరు ఒకటే అనడం ఎన్నటికీ సంభవమ య్యేది గాదు. చూడగా లోకమునకు తాము ప్రబల శత్రువై కనబడు చున్నారు. ప్రత్యక్షంగా కంటికి గోచరించేది కాదనుట మూర్ఖత గాదా? లేనిది ఉన్నదనుట, ఉన్నది లేదనుట మోసము గాక మరేమి? ఆత్మ ఒక్కటైనను చైతన్య శక్తితో అనేకరూపము లు పొందు చున్నది. ఆయన సర్వాంతర్యా మియై అందరిని పాలిస్తూ సర్వదాముక్తు డై యున్నాడు. నేనే కర్తనై యున్నాను, నేనే ఆనందమయ రూపం లో నున్నాను, అని తలచుకొనుచు ఈశరీర మున్నంత వరకు హాయిగా తనకి ఇష్ట మున్నంత వరకు ఉంటూ ఆపైని శరీర మును విడచిపోవు చున్నాడు. అదియే ముక్తి. వేరొకటి కాదు.” అని తన మతధర్మ మును వివరించాడు.
శ్రీశంకరాచార్యులు బౌద్ధుని పలుకులు విని, "బౌద్ధుడా! సత్యకర్మ లాచరించుచు పుణ్య మును సంపాదించు కొనినవాడు పదునాలు గు ఇంద్రప్రళయములు జరుగువరకు బ్రహ్మలోక నివాసం పొందుచు న్నాడు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేసిన వానికి ఇంద్రలోకవాసం లభించును. పౌండరీక మను యజ్ఞము చేసిన సత్యలోక నివాసం కలుగును. ఈవిధముగ ఎవరు చేసికొనిన పుణ్యము ననుసరించి వారికి ఆయా పుణ్య లోకములు ప్రాప్తించు ను. ఎవరు ఏయే దేవతలను శ్రద్ధతో ఉపాసించెదరో అట్టి భక్తులకు అచలమైన భక్తిని కలుగజేయుదు నని శ్రీకృష్ణపరమాత్మ
(శ్లో॥ యో యో
యాం యాం తనుం భక్త, *శ్రద్ధయార్చితు మిచ్ఛతి అస్య తస్యాచలాం శ్రద్ధాం తామేన విదధామ్య హమ్ ॥ భ.7 అ21 శ్లో॥) వాగ్దానం చేసియున్నారు.
ఇందుల కాధారము. స్మృతులలోను పురాణ ములలోను గలదు. జీవునకు పరలోకము నకు పోవుట అనునది సదా ఉన్నదే. కాని శరీరం నశించుటతో మాత్రం ముక్తి రాదు. నీ వనునది సర్వకల్ల. ఎవడు ప్రాణులందరి లోను తనను చూచునో తనలో ప్రాణులన్నిటిని చూచునో ఆతడే విజ్ఞాని. వేరొకడు బ్రహ్మమును పొంద నేరడు. ముక్తి నొందు టకు ఆత్మజ్ఞానమే ఆధారము. ఆత్మజ్ఞానం వలన బంధములువిడి వడును. బంధవిము క్తుడే ముక్తుడు. నేను జీవుడను అని తలంచుట అనర్ధము లకు హేతువు. జీవ భ్రాంతి. నేను కర్తను, నేను భోక్తను, నేను బద్ధుడను ఇవి అజ్ఞాన కారణములు. కనుక జ్ఞానమును వృద్ధి పొందు మార్గములు తెలిసికొనుము" అని తత్త్వమును వ్యక్తం చేశారు.
శ్రీశంకరపాదుల ఉపదే శామృతమును గ్రోలి పునీతుడయ్యాడు బౌద్ధుడు. అప్పుడనేక విధముల స్తోత్రం చేశాడు జగద్గురువు లను. పిమ్మట శిష్యుడై భక్తిశ్రద్ధలు గలిగి నిత్యము గురువులను స్తుతించుచు శ్రీశంకర పాదుల కరుణకు పాత్రుడయ్యాడు.
అట్లు శ్రీశంకరాచార్య స్వామి భాస్కర తేజో విరాజమానుడై కర్ణాటక దేశమంతయు తిరిగి అనేకమతములలో నుండు లోపములను సరిదిద్ది అద్వైతమత మును సర్వత్ర ప్రతిష్ఠించి అనంత శిష్యగణాలతో అనుమల్లపురం ప్రయాణ మయ్యారు.
*మల్లారి భక్తులు:*
కర్ణాటక దేశసంచారం ముగించుకొని శ్రీశంకర పాదులు శిష్యగణంతో అనుమల్లపురం ప్రవేశించారు. ఆ పుర మందు నిండా మల్లారి భక్తులే. శ్రీశంకర పాదులు తమ పురం ప్రవేశించిన వార్త తెలిసి కడుభక్తితోదర్శించారు. వారందరు బ్రాహ్మణు లు. శ్రీశంకరపాదులకు అనేక నమస్కారము లర్పించి వారికి తగు సదుపాయములు సమ కూర్చి బహురీతుల గౌరవించి యతీశ్వరుల కరుణకు పాత్రులు య్యారు. తమ మతమందు మంచి అభిమానం గలవార లగుటచే తాము ఆచరించువిధానమును జగద్గురువులకు నివేదించి మన్ననలను బడయనెంచి శంకరుల ను సమీపించి వారిలో నొక పెద్ద, 'యతీశ్వరా! అనేక నమస్కార ములు! మా పురం మహానుభావులు మీరు ప్రవేశించుటతో పరమ పవిత్రమైంది! మేమం దరం ధన్యులము. స్వామీ! మాపురమందు పూర్వం మల్లాసురు డను రాక్షసుడొకడు ఉండేవాడు. ఆ రక్కసు డు క్రూరుడై ప్రజలను నానా హింసలుపెట్టుచు స్వైరవిహారము చేసే వాడు. పురజనులు తాళ లేక గోల చేశారు. మా వాళ్ళ ఆర్తనాదం విని కరుణామయడై మాకష్టములు గట్టు నెక్కించ నెంచి పరమేశ్వరుడు మల్లాసురుని సంహరించాడు.
అందువల్ల ఆ మల్లారి మాకు దేవాదిదేవుడు అయినాడు. అప్పటి నుండి మేమా మల్లారి దేవుని, ఆయనవాహన ములైన కుక్కలను నిత్యం పరమభక్తితో పూజించుచుందుము. వారి వేషమును మేమందరము భక్తి సూచకముగ ధరించు దుము. మాకు మరో దేవుడు లేడు. ఆయన మాకు సకల సంపదలు కలుగ జేయుచుండును మాకు పరమానందము పరమసుఖము, ఆ దేవాదిదేవుని దయతో కలుగుచున్నవి. లోకములతోను, లోకేశులతోను ఆయన గర్భము నిండియున్నది అందుచే ఆయనను, వారి వాహనమైన శునకములను భక్తితో పూజింతుము. అది మాదృఢ విశ్వాసము. మాకితర సుఖము లనగా కిట్టదు' అని అన్నాడు.
శ్రీ శంకరాచార్యులు మల్లారిభక్తుల విధాన మునంతయును విని, 'మల్లారి భక్తుడా! దేవుడొక్కడే. తన మాయాశక్తితో పరాత్ప రుడు సర్వప్రాణులనుసృష్టించుచున్నాడు. ఆయనకంటె వేరొక దేవుడు లేడు. ఆయనలో నుండి బ్రహ్మవిష్ణు మహేశ్వ రులు ఉద్భవించారు. సర్వలోకములకు, సమస్తజీవులకు, పంచ మహాభూతములకు, సృష్టిస్థితిలయములకు పరాత్పరుడే కారణ మగుచున్నాడు. రుద్రాంశ సంభూతులైన వీరభద్రాదులకు లయ మున్నది. రుద్రునకు మాత్రం లయం లేదు. అది ఆయన అధీన మందున్నది. వీర భద్రా దులకు లయం సాధ్యం కాదు. ఈవిధముగ ఈశ్వరోపాసకులు నమ్ముచున్నారు. పరమేశ్వరుని అంశ వలన రుద్రుడు ఉద్భవించాడు. అట్టి వాని నుపాసించిన ముక్తిరాదు. పరమేశ్వ రునే ఉపాసించిన ఆయనే ముక్తినిచ్చును' అని రహస్యమును వివరించెను.
పురమందలి మల్లారి భక్తులందరు
శ్రీ శంకర పాదులు వెలువరించిన విషయము లన్నియు నాకర్ణించి తామాచరించు చుండిన విధాన మంతయు మహాపాప భూయిష్టమైనదని గ్రహించి జగద్గురువుల నాశ్రయించారు.
అంతట శ్రీ శంకరా చార్యులకు వారిపై కరుణ కలిగి మల్లారి భక్తులకు ముండన ములు చేయించి ఒక్కొక్కరిచేత పదివేల మృత్తికా స్నానములు చేయించారు. మరల ముండనములు చేయించి ఒక్కొక్కరి చేత వందేసి మృత్తికా స్నానములు చేయించి పిమ్మట విధినను సరించి ప్రాయశ్చిత్త కాండ సలిపి పవిత్రుల నుగజేశారు. అంతటితో మల్లారి భక్తులకు బాహ్మణ ధర్మము లాచరించుటకు అధి కారమబ్బెను.
శ్రీ శంకర పాదుల ఆదేశానుసారం వారందరికి పంచాయ తన పూజ ప్రవేశపెట్టి ధర్మ శాస్త్రములు చదువుకొనుటకు ఏర్పాటు గావించారు. మల్లారి భక్తులందరు అద్వైతమతము నవలంబించి శ్రీ శంకర పాదులకు శిష్యుల య్యారు.
శ్రీ జగద్గురువులు వారలనావిధముగ జేయుటకు ఇరువదిరోజులు అనుమల్ల పురంలో నుండిపోయారు.
పిమ్మట ,శ్రీ శంకరాచార్యులు మరుంధ నగరానికి ప్రయాణమయ్యారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 36 వ భాగము సమాప్తము*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
రేపు (08-10-2024) రాశి ఫలితాలు
రేపు (08-10-2024) రాశి ఫలితాలు
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
మేషం
08-10-2024
ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
వృషభం
08-10-2024
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు తగినంత దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.
మిధునం
08-10-2024
సన్నిహితుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
కర్కాటకం
08-10-2024
మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
08-10-2024
ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య
08-10-2024
చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
తుల
08-10-2024
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృశ్చికం
08-10-2024
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
ధనస్సు
08-10-2024
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి లాభాలు అందుకుంటారు.
మకరం
08-10-2024
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం
08-10-2024
వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి.
మీనం
08-10-2024
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది
38. " మహాదర్శనము
38. " మహాదర్శనము "--ముప్పై ఎనిమిదవ భాగము--సర్వజ్ఞుడు 1
38. ముప్పై ఎనిమిదవ భాగము-- సర్వజ్ఞుడు-1
" ప్రశ్నయైతే బాగానే ఉంది , కానీ యాజ్ఞవల్క్యా , వెనకా ముందూ చూడకయే అడిగిన ప్రశ్నకు నేనేమని ఉత్తరమిచ్చేది ? "
యాజ్ఞవల్క్యునికి అయోమయముతో తబ్బిబ్బు అయినది . మిగిలిన వారిని ఒక్క ప్రశ్నతో పల్టీలు కొట్టించుతున్న యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు తానే పల్టీ కొట్టునట్లాయెను . ముఖము తనలోని క్షుబ్ధతను చూపుచుండగా అడిగినాడు . " తమరు చెప్పినది అర్థము కాలేదు ."
" నువ్వు రేపు , అనగా ఇంక కొన్ని సంవత్సరములలో మహా విద్వాంసులతో పోరాడుటకు నిలువవలసిన వాడివి . అప్పుడు ప్రశ్న వేస్తే ఎలా ఉండవలెనో తెలుసా ? నువ్వు ముష్ఠి తో కొట్టితే , నీ సర్వ సామర్థ్యమునూ దానిలో ఉపయోగించునట్లు ఉండవలెను . ప్రశ్న వేస్తే ఎదుటివాడిని నిరుత్తరుడిని చేసి నీటిలోకి తోసినట్లు ఉండవలెను , నీట పడ్డ వాడు , మొదట తనను కాపాడుకొని , అనంతరము తనను తోసిన వాడి వైపుకు తిరుగవలెను కదా ? అలాకాక, సిద్ధుడై నిలచు ఉన్నవాడిని తోసినట్లు కారాదు . ఈ చిన్నది , ఈ పెద్దది అనునది ఎలా అనికదా , నీ ప్రశ్న ? నీ ప్రశ్నలోనే ఉత్తరమున్నది . చూసుకో , చిన్నది , పెద్దది అను భేదము ఎందులో ? జాతిలోనా , పరిమాణములోనా ? "
యాజ్ఞవల్క్యుడు ఆలోచించినాడు . ఒక ఘడియ యైన తర్వాత , " ఉన్న భేదం అంతా పరిమాణము లోనే తప్ప , జాతిలో కాదు . "
" నేను కూడా అదే చెప్పేది . నీ చేతిలోనున్న బీజమూ , దానినిచ్చిన చెట్టుకు కారణమైన బీజమూ ఒకటే జాతి యంటే నీకెందుకు స్ఫురించలేదు , తెలుసా ? ఇంద్రియాతీతమైన విషయమును ఇంద్రియములతో కొలుచుటకు సిద్ధమైనావు ! ఇప్పుడు ’ కృత్వా చింత ’ చేయి . ( అలాగయిన , ఇలాగ కావచ్చును అని ఒప్పుకొనుట కృత్వా చింత .) ఇంద్రియములు బహిర్ముఖములు . నేను , నేను యను చేతనమును ఏ ఇంద్రియము చేత చూస్తావు ? కఠము ( కఠోపనిషత్తు ) లో చెప్పినట్లు ఆ ప్రత్యగాత్మను చూచుటకు ఆవృత్త చక్షువు కావలెను . అదయినంత మాత్రాన చాలదు . ధీరుడు కూడా అయి ఉండవలెను . అప్పుడు ఆ ’ నేను ’ కనబడును. అది ఇంద్రియ వృత్తియా ? "
" కాదు "
" సరే , నువ్వు విషయమును గ్రహించినావు . కాబట్టి , ఆవృత్త చక్షువూ , ధీరుడూ అయినవాడు సాక్షాత్కరించుకొను స్థితిని బట్టి చెప్పిన మాటను నువ్వు ఎక్కడో నిలచి ప్రశ్నిస్తే తప్పు కాకున్నా , ఏమని ఉత్తరమివ్వ వలెను ? "
" ఔను , ప్రశ్నలోనే తప్పుంది "
" అలాగనవద్దు . గెలుచుటకే పుట్టిన వాడి నోటిలో ఓడిపోతిని అన్న మాట రాకూడదు . కాబట్టి ప్రశ్న తప్పు అనవద్దు , వేరే దృష్టితో చూడవలసినది అని , ఆ దారిని వదలి ఈ దారిని పట్టుకో "
" తమ వంటి వైచక్షణ్యము వచ్చిన తర్వాతే కదా , ఆ మాట ? "
" మరలా నువ్వు అదే తప్పు చెయ్య వద్దు . చెట్టును ఆశ్రయించిన తీగ ఎంత ఎత్తుకు వెళ్ళ వచ్చును అంటే , తాను ఆశ్రయించిన చెట్టు ఎత్తు వరకూ అన్నట్లే , అగ్ని దేవుడూ , ప్రాణదేవుల ఉపాసకుడవైన నువ్వు కూడా వారివలె విశ్వంభరుడవు కావలెను . ఇప్పుడు చేస్తున్న ఆదిత్యోపాసనము పూర్తియైన తర్వాత , ఈ విశ్వమును దాటి వెళ్ళవలెనంటే , నువ్వు ఈ దేహముతోనే వెళ్ళెదవా ? "
" లేదు , ఏమైననూ ఈ దేహము పంచభూతములతో ఏర్పడినది . ఈ భూతముల నుండీ బయటికి వెళ్ళినపుడే కదా , విశ్వమును దాటేది ? "
" ఇంకో రహస్యము , యాజ్ఞవల్క్యా , ఈ పంచ భూతములన్నీ ఒకదాని నుండే కదా వచ్చినవి ? అంటే , ఆత్మనుండీ కదా ? "
" ఔను , ఆత్మనః ఆకాశస్సంభూతః "
" ఇక్కడ ఒక ఘడియ నిలచి చూడు , ఆ తరువాత ముందుకు వెళదాము . ఆకాశమంటే ఏమిటి ? దానిని చూపించ గలవా ? "
యాజ్ఞవల్క్యుడు ఆలోచించినాడు : " ఆకాశమంటే ఏమి ? వెలుగు కన్నా సూక్ష్మమై , వాయువుకు అవకాశమును ఇవ్వవలెనంటే , అది ఎంత తేటగా ఉండవలెను ? అటువంటి దానిని చూపుట ఎలా ? శాస్త్రము , ’ శబ్ద గుణకమాకాశం ’ అంటున్నది . కేవలము శబ్ద గుణము మాత్రమే ఉన్నదానిని , తేజో గ్రాహియైన చక్షువు కానీ , స్పర్శ గ్రాహియైన ’ త్వక్కు ’ కానీ , సాక్షాత్కరించుకొనుట యెలా ? అవి రెండూ వద్దు , శబ్ద గ్రాహియైన శ్రోత్రమైనా గ్రహించనీ అంటే , శ్రోత్రేంద్రియము నకు దొరకు శబ్దములకు ఒక్కొక్క రూపముంది , పరిమితి ఉంది. అలాగైతే ఆకాశము అగ్రాహ్యమా ? "
యాజ్ఞవల్క్యుని సందేహము తెలుసుకొని ఆలాపిని అన్నది , " చూచితివా యాజ్ఞవల్క్యా , ఆకాశమును చూపించుట ఎంత కష్టమో తెలిసిందా ? పోనీ , ఆకాశము నుండీ సంభవించిన వాయువును , వాయువు నుండీ సంభవించిన తేజస్సునూ , దానినుండీ సంభవించిన జలమునూ , దానితో కలిగిన పృథ్వినీ అంటే , ఈ పంచభూతములలో ఒకదానినైననూ సాక్షాత్కరించి ఇవ్వగలవా ? పోనీ , నువ్వైనా సాక్షాత్కరించు కున్నావా ? "
యాజ్ఞవల్క్యుడు మరలా ఆలోచించినాడు . ఇప్పటికి అతడికి తెలియదు అనునది తెలిసింది . వట్టి ప్రశ్నలతో లాభములేదు అని నిర్ధారించుకొని , అతడన్నాడు , " ఈ దినము మాతా ఆచార్యాణి సరస్వతి వలె పలుకుచున్నారు . వట్టి ప్రశ్నలు వేసి నా అజ్ఞానమును ప్రదర్శించుట బదులు , విషయమును చెప్పి , నన్ను జ్ఞానిగా చేయు గాక "
ఆలాపిని ఆ మాట విని గంభీరురాలైనది : అప్రసన్నము కాకుండా , తన మాటను కొనసాగించినది . " వీటన్నిటినీ ఒక్కొక్కటిగా సాక్షాత్కరించుకొని చూచి కృతార్థుడవు కమ్ము అని నేను ఈ ప్రశ్నలను అడిగినాను . ఇప్పుడు సిద్ధాంతమును చెప్పెదను వినుము . ఈ పంచ భూతములకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది . ఇవన్నీ తండ్రీ కొడుకులవలె అయిననూ , తండ్రి వేరే , కొడుకు వేరే అనునట్లే ఇవి కూడా . సాంఖ్యము , దీనినంతటినీ ప్రకృతి యనీ , దీని పట్టులో చిక్కిన పురుషుడు , దీని పట్టు నుండీ విడిపించు కొనుటయే ముక్తి యనీ అన్నది . ముక్తిని పొందిన కొందరు పురుషులుంటే , వారేమవుతారు అనుదానిని చెప్పలేదు . ఇప్పుడు నువ్వు చెప్పు , అయితే ’ కృత్వా చింత ’ తో చెప్పు అన్నది మరవవద్దు . ఈ పంచభూతాత్మకములై గుణత్రయ విశిష్టురాలైన ప్రకృతి సంసర్గమును వదలిన వారు ఎలా ఉండవలెను ? "
" ఔను , ప్రకృతస్థుడైన పురుషుడు ఎలా ఉన్ననూ , ప్రకృతి నుండీ విమోచనమును పొందిన పురుషుడు తన పూర్వ స్థితిని పొందినవాడై యుండవలెను . సందేహము లేదు ."
" కారాగారములో ఉన్న పురుషుడు తనను బంధించియున్న గది యొక్క నాలుగు గోడల మధ్యలో తప్ప , ఇంకెక్కడా తిరుగుటకు లేదు . అతడే , అక్కడి నుండీ ముక్తుడై బయటికి వస్తే ఎక్కడికైనా పోవచ్చును కదా ? "
" ఔను "
" బంధ ముక్తుడైన వాడి స్థితి వలెనే , ప్రకృతి ముక్తుడైన వాడి స్థితి అనగానే మనము ఏమని చెప్పవలెను ? మనకు తెలిసినది ప్రకృతి గ్రస్థుడైన వాడి స్థితి మాత్రమే . ప్రకృతి ముక్తుడైన వాడి స్థితి దానికి ప్రతిగా ఉండవలెను కదా ? "
" ఔను "
" ఏదీ , ఇప్పుడు ద్వాసుపర్ణశృతి ని చెప్పు "
" రెండు పక్షులు ముద్దైన గూటిలో ఉన్నాయి . రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి . రెంటికీ ఒకటే పేరు . ఒకే చెట్టులో ఉంటాయి . వాటిలో ఒకటి రుచియైన పళ్ళను తింటూన్నది . ఇంకొకటి ఏమీ తినకుండా చూస్తూ కూచుంది . "
" తర్వాత ? "
" పండు తినే కార్యములో మగ్నమైన పక్షి పరవశమై , మోహము చెంది శోకిస్తుంటే . పండు తినని పక్షి ఈశ్వరుడైనది. ఆ పక్షి , ఈ పక్షిని చూచి ( సావాసము వలన ) తానూ దానివలెనే అగును . "
" ఇక్కడే ఉంది రహస్యము , యాజ్ఞవల్క్యా , భోగమగ్నుడై ఉండుట అంటే , పరవశమై , మోహ శోకముల చేత చిన్నవాడగుట. అది లేక పోతే ? "
" ఆ పక్షి , ఈ పక్షి వలెనే అగును . "
" అలాగవడమంటే , అప్పుడు , భేదమేమైపోయింది ? అవి విజాతి పక్షులైతే ఒక పక్షి ఇంకొకదాని వలెనే అగుటకు సాధ్యమయ్యేదా ? "
" లేదు "
" దీన్ని ఒకవైపు ఉంచుకొని , రసవాదమును చూడు . అది చెప్పేది ఇంతే , ’ ముట్టుకుంటే చేతులు నల్లబారు సీసమును , మెరుస్తున్న బంగారముగా చేయవచ్చును ’ అని కదా ?
" అదెలాగనగా , సీసములో సప్త కంచుక దోషమున్నది . దానిలో మూడు పోతే తామ్రమగును . దానిలో కూడా ఒకటి పోతే వెండి . ఇంకొక కంచుకము పోతే బంగారము . ఆ చివరి కంచుకమూ పోతే అది సిద్ధరసము . సిద్ధ రసము తనలో పడ్డ లోహములన్నిటినీ భృంగముగా చేయును . భృంగము తన అరవై నాలుగు రెట్ల తామ్రమును బంగారము చేయును . ఇప్పుడు చెప్పు , సిద్ధరసమునకు సప్త కంచుక దోషము ప్రాప్తమైతే ఏమికావలెను ? "
" సీసము కావలెను "
" సీసపు సప్త కంచుక దోషము పోతే ? ’
" అప్పుడది సిద్ధరసము కాకున్ననూ , భృంగమైనా కావలెను . "
" ఇదంతా లోహపు విషయము . ఈ సాధన ప్రక్రియను జీవుడికి జోడించి చెప్పు "
Janardhana Sharma
శ్రీనాధ కవితా వైభవం!
శ్రీనాధ కవితా వైభవం!
ఉ: ఎక్కడ లేరె వేల్పులు సమీప్సిత దాతలు, ముద్దుకూన ! నీ
వెక్కడ ? ఘోర వీర తపమెక్కడ ? యీపటు సాహసిక్యమున్
తక్కు ,'శిరీషపుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో? విహగ మెక్కిన నోర్చునొ ? నిశ్చయింపుమా?
హరవిలాసం-- 4: ఆ: శ్రీనాధ మహాకవి!
ఓముద్దుకూనా!పార్వతీ !కోరిన కోర్కెలు దీర్చుటకు, దేవత లెందరోగలరుగదా! పరమేశ్వరుని గూర్చియే తపమేల? సుకుమారివి నీవిక్కెడ? ఘోర మైన యీకఠోర తపమెక్కడ? ఈదుస్సాహసమును వీడుము, దిరిసెనపూవుపై తుమ్మెద వ్రాలిన నోర్చునుగాని, గ్రద్దవ్రాలిన నోర్వ నేరదుగదా! యని దీనిభావము.
పార్వతి పరమేశ్వరుని భర్తగా బడయఁ గోరి తపమాచరింపఁ బోవుచు ,తండ్రి హిమవంతుని యనుజ్ఙ బడయుటకేగ, గిరిజ నిశ్చయమును విని, సుకుమారివి నీవు తపమొనరింపలేవు. ఈదుస్సాహసమున వీడుమని హిమవంతుడామెకు నచ్చజెప్పు సందర్భము.
"దిరిసెన పూవు మిగుల మృదువైనది. అది తుమ్మెద సోకు నోర్చునుగాని, బలమైన పక్షి సోకు నోర్వజాలదని చెప్పుచు, అన్యాపదేశముగా శంకరునితో నీకు పొందు అనుచితము. అనిసూచించెను.
పార్వతిని శిరీషపుష్పముతో బోల్చి యామె సుకుమార ప్రకృతిని, శంకరుని యందు విహంగోపమమును, జెప్పి యతని మొఱటుతనమును కవి నిరూపించెను.
ఈరీతిని శ్రీనాధుని కవిత్వము వ్యంగ్య వైభవ విలసితమై యొప్పారును!
నిదర్శనాలంకారము.
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 1 .
పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 1 .
* ద్రాక్షపళ్ళు -
కేన్సర్ , గుండెజబ్బులు ఉన్నవారికి ఇది చాలా మంచిది . దాదాపు ఇరవై రకాల యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా నివారిస్తాయి. ద్రాక్షారసం తాగడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది . ద్రాక్ష నుంచి మెగ్నీషియం , సోడియం , పొటాషియం , ఐరన్ , థయామిన్ , ఫాస్ఫరస్ , B6 విటమిన్ కూడా లభించును. పిల్లలకు ద్రాక్షారసం ఇవ్వడం వలన చురుకుదనం పెరిగి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. జ్వరం , శ్వాసకి సంబంధించిన సమస్యలకు , కామెర్లకు , రక్తస్రావం సమస్యలకు హితకరం.
* యాపిల్ -
యాపిల్ నుండి C విటమిన్ , సెల్యూలోజ్ , చక్కెర , పిండిపదార్దాలు , పెక్టిన్లు లభిస్తాయి. వందగ్రాముల యాపిల్ నుండి 1 మి. గ్రా ఐరన్ పొందొచ్చు. అలాగే శరీరానికి అవసరం అయిన ఇతర పోషక పదార్ధాలు ఫైబర్ కూడా యాపిల్ తొక్క తీయకుండా తినడం వలన దేహానికి అందుతాయి. ఒక పెద్ద యాపిల్ తింటే 125 కేలరీల శక్తి మనకి వస్తుంది. యాపిల్ నుండి లభించే పెక్టిన్ సూక్ష్మ జీవులను నశింపచేస్తుంది. అజీర్ణం , అతిసారం , పెప్టిక్ అల్సరుతో బాధపడేవారు క్రమం తప్పక యాపిల్ తింటే ఎంతో ప్రయోజనం దంతాలు శుభ్రపడటమే కాదు దంతవ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
తరవాతి పోస్టులో మరికొన్ని పండ్లలో గల ఔషధగుణాలు వివరిస్తాను.
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
శతావధాని దోమా వెంకట స్వామి గుప్తా
శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 తెలుగు సాహితీ సంపద అపారం. మహా సముద్రం. ఆ సముద్రంలో ఈత కొట్టిన మేధావులు ఎందరెందరో! వారిలో మరొకరు శతావధాని దోమా వెంకట స్వామి గుప్తా. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు ఈ ఎపిసోడ్ లో గుప్తా గారి సాహితీ వైదుష్యాన్ని ఎంత గొప్పగా చెప్పారో వినండి. సమస్యాపూరణం , దత్తపది లో ఆయన ప్రతిభ అసాధారణం.అవధానంలో కనకాభిషేకం పొందిన ఘనుడాయన. 1940, 50 దశకాలలోనే 300 పైగా అవధానాలు చేసిన గొప్ప కవి. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
విప్లవ నారిమణి దుర్గా భాభి*
*అక్టోబర్ 7 - పుట్టినరోజు*
*విప్లవ నారిమణి దుర్గా భాభి*
భారతదేశ స్వాతంత్ర్య విప్లవ చరిత్రలో పురుషుల చరిత్ర సాటిలేనిది; కానీ కొంతమంది ధైర్యవంతులైన మహిళలు కూడా ఉన్నారు, వారు తమ కుటుంబాలను కూడా పణంగా పెట్టి మాతృభూమిని విముక్తి చేయడానికి పోరాడారు. అలాంటి వారిలో దుర్గాభాభి ఒక గొప్ప విప్లవ నారిమణి.
దుర్గాదేవి ప్రయాగలో అక్టోబర్ 7, 1907న రిటైర్డ్ జడ్జి పండిట్ బాంకే బిహారీ నగర్ ఇంట్లో జన్మించారు. ఆమె పుట్టిన కొద్దిసేపటికే ఆమె తల్లి చనిపోవడంతో, ఆమె తన మేన అత్త వద్ద పెరిగింది. 11 సంవత్సరాల చిన్న వయస్సులో, దుర్గ లాహోర్‌లోని ధనిక కుటుంబంలోని భగవతి చరణ్ బోహ్రాతో వివాహం జరిగింది. భగవతీ భాయ్ కి రాయబహదూర్ అనే బిరుదును కూడా పొందాడు; మొదటి నుంచీ భగవతీ భాయ్ బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని అనే ఆలోచన కలవాడు. అందుకే అతను కూడా భారత స్వాతంత్ర్య విప్లవోద్యమం లో చేరాడు.
దుర్గా భాభి కూడా తన భర్త పనిలో భాగస్వామిని ఐనది. కొంతకాలం తర్వాత, ఈ దంపతులకు ఒక బిడ్డ జన్మించాడు, అతనికి శచీంద్ర అని పేరు పెట్టారు. భగవతి భాయ్ తరచుగా స్వాతంత్ర్య పోరాటం పని మీద ఉండేవారు లేదా అండర్‌గ్రౌండ్‌లో ఉండేవాడు, అటువంటి పరిస్థితిలో అతను భార్య దుర్గా భాభి తో రహస్యం గా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేవాడు. వారు తరచుగా సిద్ధం చేసిన బాంబులు లేదా బాంబు పదార్థాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్లేవారు. ముఖ్యంగా ఆమె మహిళ కావడంతో పోలీసులకు అనుమానం రాలేదు.
భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులు లాహోర్‌లోని అతని కార్యాలయం ముందు పట్టపగలు పోలీసు అధికారి సాండర్స్‌ను చంపినప్పుడు, వారి కోసం వెతకడానికి నగరంలోని ప్రతి మూల, మూలలో పోలీసులను మోహరించారు. అటువంటి పరిస్థితిలో, అతన్ని లాహోర్ నుండి బయటకు చేర్చడం చాలా ముఖ్యం. అప్పుడు దుర్గాభాభి సహాయం చేసింది. భగత్ సింగ్ జుట్టు కత్తిరించి టోపీ ధరించి ఆధునిక యువకుడిగా వేషం మార్చేడు. దుర్గా భాభి తన చిన్న పాప శచీంద్రను ఒడిలో పెట్టుకుని అతనితో కూర్చుంది. సుఖ్‌దేవ్ అనే మరొక విప్లవ కారుడు అతని సేవకుడయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్ కూడా మారువేషంలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసుల కళ్లలో దుమ్ము కొట్టి అందరూ రైలు ఎక్కి లాహోర్ వదిలి వెళ్లిపోయారు.
1930 మే 28న రావి నది ఒడ్డున బాంబును పరీక్షిస్తున్న సమయంలో భర్త భగవతీ భాయ్ మరణించడం దుర్గాభాభి జీవితంలో అత్యంత విషాదకరమైన ఘట్టం. అతని సహచరులు పూజలు చేసి అక్కడ అతని సమాధిని నిర్మించారు. దుర్గాభాభి తన భర్తని చివరి చూపు కూడా చూడలేకపోయింది. దీని తర్వాత కూడా ఆమె సహనం కోల్పోకుండా విప్లవ ఉద్యమంలో సహకరిస్తూనే ఉన్నారు. 1931 సెప్టెంబర్ 12న ఆమె కూడా పోలీసులకు చిక్కింది. 15 రోజులు జైలులో ఉండి, మూడేళ్లపాటు నగరంలో గృహనిర్బంధంలో ఉండాల్సి వచ్చింది.
భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, ఆజాద్ మొదలైన వారి మరణానంతరం, దుర్గాభాభి 1936లో ఘజియాబాద్‌కు వచ్చి ప్యారేలాల్ బాలికల పాఠశాలలో బోధన ప్రారంభించారు. ఆమె కొంత కాలం పాటు కాంగ్రెస్‌తో కూడా సంబంధం కలిగి ఉంది. తరువాత అడయార్ (తమిళనాడు) వెళ్లి మాంటిస్సోరి పద్ధతిలో శిక్షణ తీసుకుని 1940 జూలై 20న లక్నోలో పిల్లల పాఠశాలను ప్రారంభించారు. ఆమె లక్నోలో 'షాహీద్ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్ మరియు మ్యూజియం'ని కూడా స్థాపించింది, ఇది నేటికీ కూడా అక్కడ ఉంది.
ఆమె చివరి రోజుల్లో ఘజియాబాద్‌లో తన కుమారుడు సచీంద్రతో కలిసి నివసించింది. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని సమాజానికి అంకితం చేసిన విప్లవ నాయకురాలు దుర్గాభాభి అక్టోబర్ 14, 1999న మరణించారు.
వృద్ధ నారీ పతి వ్రతా*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*వాడుకలోని సంస్కృత వాక్యాలు*
*వాటి పూర్తి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*వృద్ధ నారీ పతి వ్రతా*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*పూర్తి శ్లోకం :~*
*అసమర్ధస్య సాధూనాం*
*నిర్ధనస్య జితేంద్రియ:।*
*వార్ధక్యో దేవతా భక్తి:।*
*వృద్ధ నారీ పతివ్రతా॥*
*తాత్పర్యం:~*
*అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.*
*శ్రీ గురుభ్యో నమః।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
Laya Layam లయ లయము
హైందవం వర్ధిల్లాలి 23*
*హైందవం వర్ధిల్లాలి 23*
.
*ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందూ నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి* iv) :- *మన అందరిలో ఐక్యభావన, ధర్మ సంస్థాపన, సంస్కృతి సంప్రదాయాలను జాగృతం చేసి, ప్రోత్సహించడమే దేశ భక్తుల కర్తవ్యం. వీలైతే చేస్తాను, వీలున్నప్పుడు చేస్తాను అనడం దేశభక్తిత్వానికే మచ్చ, ఇంకా చెప్పాలంటే నేటి ఇతరమత వాదుల తీవ్ర కార్యాచరణ పరిస్థితులు చూస్తుంటే మనం ఆలా అనవల్సినవి రోజులు కావు*. జీవించే హక్కు సమస్త జీవులకున్నది. *అహింసో పరమో ధర్మః* అని చదువుకున్నాము గదా. సనాతన ధర్మం జంతు హింస *కూడా* కూడదని మరి మరీ నొక్కి చెబుతున్నది. దాని అర్థమేమిటి మానవ హింసకూడా కూడదనే గదా.
జీవిత పర్యంతం ఈశ్వారాధనలో *ప్రభూ నాకు ఇది ప్రసాదించూ, అది ప్రసాదించూ అంటూ ఐహిక, అముష్మిక మార్గాలను కోరడమేనా* లేక దేశకాల పరిస్థితులను గమనించి *ప్రభూ ధర్మం, దేశం మరియు జాతి భద్రతకై పాటుపడుటకు నాకు సద్వివేక సంపత్తిని, శారీరక మరియు మానసిక శక్తులను ప్రసాదించమని కొరలేని అజ్ఞానంలోనే, స్వార్థంలోనే ఇంకా మనమున్నామా (సామాన్య ప్రజలు మరియు మేధావులు*). దుష్కర్మలు అంటే సందేహించాలి గాని సత్కర్మలు ఆచరించుటకు సందిగ్ధమేల. *సత్కర్మలు చేయకుండా తటస్థంగా ఉండాలని ఏ ధర్మము, శాస్త్రము, నియమము చెప్పదు*. పుణ్యకర్మలు చేసి, ఆ పుణ్య ఫలాలు స్వర్గంలో అనుభవించడానికి *"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అన్నట్ల మళ్ళీ జన్మలు పొందాలేమో అని సందేహించే యోగులు ఈ కాలంలో నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. మన లాంటి సగటు భారతీయులు ఆ విషయంలో తత్తర పాటు చెందే అవసరమేమీ లేదు*.
దేశ కాల పరిస్థితులను బట్టి *ఆ అవస్థను* చక్కదిద్దేందుకు ధర్మ సంఘర్షణకు ఎవరైనా పాల్పడినప్పుడు అట్టి కర్మను *అక్లిష్ట కర్మ* అని శాస్త్ర నిర్వచనము. ఇది పాప ప్రస్తావన లేని పుణ్య కర్మనే.
ఒక ప్రమాణం చూద్దాము
*అహింసో పరమో ధర్మః, ధర్మ హింసా తదైవచ*. అహింస ఎంత ముఖ్యమో అధర్మం జరుగుచున్నప్పుడు, ధర్మానికి గ్లాని కలిగినపుడు ఆ హింస తోనే *ఆ అధర్మమాన్ని ఆపటం అంతే ముఖ్యం*.
దుష్టులను, దుర్మార్గులను నిరోధించుట నేరమని ఏ చట్టము గూడా చెప్పడంలేదు. కానీ చట్టాన్ని మనచేతులలోకి తీసుకోకుండా సమైక్యంగా, సంఘటితమవడం ఎదిరించడం పోరాటంలో భాగంగా కాలానుగుణ నిర్ణయాచరణ చేయడం అతిముఖ్యం. *ఉదాసీనత అత్యంత ప్రమాదకరం*.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరములు గడిచినవి. వచ్చిన స్వాతంత్ర్యాన్ని కొనసాగించుకోవాలన్న స్పృహ ప్రజలకు ఉండాలి. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు వ్యక్తిగతంగా జాతీయంగా కూడా ఎంత అభివృద్ధి చెందారో ప్రజల అంతరాత్మకు తెలుసు. ఇట్టి మాతృభూమికి ప్రజలెంత ఋణపడి ఉన్నారో... అందుకు కతజ్ఞతగా *దేశ సంస్కృతి, సంప్రదాయాల మరియు ధర్మం యొక్క సంరక్షణ చేయాలిగదా. కృతఘ్నో నాస్తి నిష్కృతి* అని గూడా మనం చదువుకున్నాము. ఇంకా ఇంకా ఈ దేశ ప్రజలను మేల్కొలపడానికి సామాజిక వైతాళికులు, ధర్మాచార్యులు, ప్రవచనకారులు, ఇతర పెద్దలు జీవితాంతం ప్రజల వెంటే ఉండాలా. మనం కూడా *సమయానుకూలంగా స్పందించాలికదా, ధర్మ ప్రోత్సాహనికి, రక్షణకు ఎల్ల వేళలా అప్రమత్తులమై ఉందామన్న స్ఫూర్తి దేశ ప్రజలకు ఎప్పుడు కలగాలికదా*.
ఈ మూల సూత్రాన్ని కనీసం *ఇతర మతాల వారి ఐక్యతను* చూసైనా నేర్చుకోవచ్చు గదా.
*కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.
ధన్యవాదములు.
*(సశేషం)*