11, ఏప్రిల్ 2023, మంగళవారం

కర్పూరం గురించి

 కర్పూరం గురించి సంపూర్ణ వివరణ - 2 . 


    ఇంతకు ముందు పోస్టు నందు మీకు కర్పూరం మరియు దానిలోని రకాల గురించి వివరించాను . ఇప్పుడు మీకు పచ్చకర్పూరం గురించి వివరిస్తాను . 


 పచ్చకర్పూరం - 


     ఇది రుచికి చేదుగా , వెగటుగా ఉండును. ఇది శరీరము నందలి అత్యుష్ణమును , రక్తపిత్త రోగమును , క్రిమి రోగము , కఫ , దాహ , తాప , పిత్తవికారము , వాతపిత్త రోగము , వాతశ్లేష్మము , నేత్రవ్యాధులు , అన్నిరకాల మూత్రవ్యాధులు పోగొట్టి విరేచనము కలిగించి , బుద్ది కుశలత , మాటనేర్పు , శరీరబలము వచ్చును . నోటి దుర్గన్ధము తీసివేయును . ఈ పచ్చకర్పూరమును పిల్లలకు మరియు పెద్దలకు తగిన మోతాదులో మాత్రలు కట్టి వాడించుచున్న ఎన్నో పెద్దరోగాలను పోగుట్టును . దోషముతో ఉన్నప్పుడు , ఆకలిదప్పికలతో ఉన్నప్పుడు , కడుపుబ్బు , శృంగార సమయము నందు , గుర్రపుస్వారీ వంటి సమయముల యందు ఈ పచ్చకర్పూరం సేవించిన శ్రమను పోగొట్టి శరీరముకు ఉల్లసము కలిగించును .  


      తరవాతి పోస్టు నందు మరికొన్ని ముఖ్యమైన కర్పూరాల గురించి వివరిస్తాను. 


           

శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!*

 *ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!*


*భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు, పులి గోళ్లతో “అఫ్జల్ ఖాన్” గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి, ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్దారకుడు, కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలి పోకుండా ప్రజలను ప్రేమించి “ఛత్రపతి” గా ఎదిగిన జిజియా బాయి ముద్దు బిడ్డ…!!*


*నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ 💪🚩🚩*


*కానీ ఈ వ్యాసం ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి కాదు ఆ శివాజీ మహరాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోదుడి గురించి.*


*రాజు కోసం, దేశం కోసం, ధర్మ కోసం – చావును సైతం దిక్కరించి, దేహమంత రక్తంతో తడిసి ముద్ద అయినా కూడా, రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిశాకే ప్రాణాలను వదులతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడి గురించి. మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత…!!*


*అది 1660 వ సంవత్సరం. బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న “ఆదిల్షాయులు” ఎన్నో సార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు. అందుకే ఈ సారి ఆధీల్షాయులు “మొగల్ చక్రవర్తి ఔరంగజేబు” సహాయం తీసుకొని మరీ పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీని, శివాజీ కుడి భుజం, సర్వ సైన్యాధిపతి అయిన “బాజీ ప్రభు థేస్పాండే” ని 10000 వేల సైన్యం తో కోటని చుట్టుముట్టి బంధీలను చేశారు. సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని “ఆధీల్షాయులు” ఎదురు చూస్తున్నారు.*


*కేవలం 600 మంది సైన్యం. ఆ 600 మంది సైన్యం, 10000 మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం. కానీ 10000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు, పన్హాలా కోటలో ఉన్న ధాన్య శాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ ఐతే ఆధీల్షాయులలోని సైన్యం కొంతభాగం ఆహారం సేకరించుటకు వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు. కొన్ని నెలలు గడిచాయి పన్హాల కోటలోని ఆహారం దాన్యగారం లోని ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి.*


*ఇప్పడు 10000 మందికి ఆహారం కావాలి కాబట్టి ఆధీల్షాయుల సైన్యం లోని కొంతభాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. ఛత్రపతి శివాజీ తప్పించుకొనే సమయం అస్సన్నమైనది. పన్హలా కోట నుండి “రంగీ నారాయణ్” అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న “విశాల్ఘట్ కోటకు” వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు.*


*13 జులై 1660 వర్షాకాలం. అమవాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి, ఛత్రపతి శివాజీ – బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికులు “విశాల్ఘట్” కు అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు.*


*సైన్యం లో శివాజీ మహారాజు పోలికలతో ఉండే “శివకాశీ” అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుగుద్దినటట్లుగా శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆధీల్షాయి సైన్యానికి కనపడే విధంగా 10 మంది సైనికులతో పంపించారు.*


*ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశీ ని చూసి శివాజీ నే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్షాయిల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదును చూసి ఆదిల్షాయిల సైన్యం మొత్తం శివకాశీ దగ్గరకు వెళ్లినప్పుడు, విశాల్ఘట్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలు దేరారు శివాజీ అతని సైనికులు.*


*వర్షాల తాకిడికి అడవిగుండా ముళ్లకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి, నడిచే మార్గం అంతా బురద ముళ్ల పొదలతో భయంకరంగా ఉంది. కానీ అక్కడ ఉన్న 600 మందికీ ఒక్కటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాల్ఘట్ కు చేర్చటం. ఆ 600 కి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే….!!*


*బాజీ ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమి చేయలేరు అనే నమ్మకం తో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆదిల్షాయిల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజు ను కాదని మారువేషంలో ఉన్న శివకాశీ అని తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు.*


*శివకాశీ ని అక్కడికక్కడే నరికి చంపి 8000 మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరముకుంటు వెళ్లి శివాజీ ని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి “గోడ్కింగ్” అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటున్న శివాజీ సైన్యం, ఆదిల్షాయుల సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్షాయిల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్ఘట్ కి చేరటం అసాధ్యం …*


*ఎందుకంటే ఆ సమయం లో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుఱ్ఱం కూడా లేదు, కానీ సగం ఆదిల్షాయిల సైన్యం వద్ద గుఱ్ఱలు ఉన్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్షాయిల సైన్యాన్ని ఓడించటం జరగని పని.*


*8000 మంది సైన్యం తో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం. ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభువు రాజుతో వివరించాడు.*


*గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఈ దారిగుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు. సైన్యం లో సగం మందిని అంటే సరిగ్గా 300 మందితో నేను గోడ్కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిల్షాయిల సైన్యం తో పోరాడుతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిగుండా రాలేరు కాబట్టి తక్కువులో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను ఆదిల్షాయిలను ఆపగలను. ఈ సమయం లో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ “విశాల్ఘట్” కు చేర్చండి. శివాజీ మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను 5 సార్లు పేల్చండి. ఫిరంగులు శబ్దం మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరారు అని నాకు సంకేతం అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు.*


*300 మంది సైన్యం తో శివాజీ మహారాజు విశాల్ఘట్ కు బయలు దేరాడు. మిగిలిన 300 మంది సైన్యం తో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్షాయిల సైన్యం గోడ్కింగ్ కు చేరుకుంది. యుద్ధం మొదలు అయ్యింది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్షాయిలను నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం. ఇరుకైన కొండ ప్రాంతం అవ్వటం తో శివాజీ మహారాజుకు తప్పించుకోడానికి ఎక్కువ సమయం దొరికినా అవతలి వైపు ఉన్నది 8000 మంది సైన్యం 300 మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పటం ఆపటం లేదు. సమయం గడిచేకొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది , కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్షాయిల వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు . సుమారు 4 గంటలు గడిచే సరికి 8000 మంది ఆదిల్షాయిల సైన్యం లో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యం లో దాదాపు అందరు మరణించారు.*


*బాజీ ప్రభు తో పాటు ఆతికొద్ది మంది మాత్రమే మిగిలారు. కేవలం 300 మంది సైన్యం తో 5000 మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటి సారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహం అంతా గాయాలతో…రక్తంతో… తడిసి ముద్ద అయ్యి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి “మనీషా – రాక్షసుడా” అని భయపడ్డారు ఆదిల్షాయిలు. నిజానికి బాజీ ప్రభువు కి తగిలిన గాయాలు కత్తి పోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు , కానీ అగ్ని పర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయువాల నుండి రక్తం ప్రవహిస్తున్నా…. అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది.*


*తనరాజు “ఛత్రపతి శివాజీ మహరాజ్” విశాల్ఘట్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేతితో మృత్యువుని ఆపుతూ….. మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశ్పాండే. చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తరువాత ఫిరంగి పేలుడు శబ్దాలు విన్నాయి.*


*“నా రాజుని కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవుల పైకి వచ్చేలోపు – దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్ళలోకి చేరే లోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది”.*


*కాళ్లు నేలకు ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ…. ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర “కనీ వినీ” ఎరగని యుద్ధం చేసి, కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యువునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించి “గోడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్” అంటే పవిత్రమైమ ప్రదేశం అని ప్రకటించాడు. ఆ తరువాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ…..!!*


*ఈ రోజు ఈ దేశం లో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహా వీరులు మనకోసం తమ ప్రాణాలను అర్పించటమే …*


*జై భవానీ…!*

*జై శివాజీ…!*

*జై హింద్…!!🚩🙏*

*శ్రీ సూక్తము

 *శ్రీ సూక్తము:*


*ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః*

*తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః*


తా॥ 

సూర్యునికి బోలిన తేజస్సుగల ఓ లక్ష్మీ, పుష్పింపకయే ఫలముల నిచ్చు బిల్వవృక్షము, నీ తపస్సు వలన ఉద్భవించినది. ఆ వృక్షము యొక్క ఫలములు, నీ దయవలన అంతరింద్రియములు బహిరింద్రియములకును సంబంధించిన అభాగ్యములను నశింపజేయును గాక.

పరమార్థాన్ని చెప్పడం కోసమే

 *ఏడు చేపల కథకు ఆధ్యాత్మిక వివరణ 

☘☘☘☘☘☘☘☘

*రాజుగారు అంటే మనిషి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ  5.మద 6.మాత్సర్యాలు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే కథలో ఆరు  చేపలను  ఎండగట్టినట్టు చెప్పారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఏమిటా చేప. అది మనస్సు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*దీన్ని జయించడం చాలా కష్టం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఎంత ప్రయత్నించినా అది ఎండదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనస్సు  అంటే ఏమిటి*❓

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనస్సు అంటే సంకల్ప వికల్పాలు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*గడ్డిమేటు అంటే ఏమిటి?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కుప్పపోసిన అజ్ఞానం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మరి అది పోవాలంటే ఏం చేయాలి❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవు వచ్చి మేయాలి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవు అంటే జ్ఞానం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ గోవును ఎవ్వరు మేపాలి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓*

🌸🌸🌸🌸🌸🌸🌸

*అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన  తన విధిని నిలిపి వేసాడా.లేదు.అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు 

ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం

 (ఢిల్లీ సుల్తాను ఎత్తుకుపోయిన సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం పూర్తిగా చదువ వలసిందిగా ప్రార్థన.శ్రీ వి.యస్.కరుణాకరన్ గారి పిలిచినంతనే పలికే దైవం- విష్ణు సహస్రనామావళి గాథలు ఆధారంగా)_


ఢిల్లీ సుల్తాను – తన కట్టెదుట నిలబడిన రాజసతేజో విరాజిత మూర్తి సుకుమార సుందర గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రవత్తులతో తేరిపార జూచాడు. *ఆ మహానుభావుని విశాల ఫాలభాగంలో తీర్చి దిద్దిన ఊర్ధ్వపుండ్ర రేఖలు మధ్యలో పసుపురంగు తిలకం. తళతళలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది. మెడలో తామర పూసల దండ. తులసీ దళధామం. మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ. తలపై చిరు పిలక జుట్టు. ఒక చేతిలో త్రిదండం, ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం.* సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మికదీధితులచే దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించాడు.

ఢిల్లీ దర్బారుకు ఆవిధంగా వేంచేసినది *శ్రీమద్రామానుజుల* వారే. ఢిల్లీ సుల్తాను - శ్రీమద్రామానుజుల కోరిన కోరిక ఈడేర్చాలనే నిర్ణయించుకున్నాడు..

“సుల్తాను వారికి ఒక విన్నపం, తమ సేనలు దక్షిణాపథ దండయాత్రలో సాధించిన విజయ పరంపరలలో దేవాలయాలలోని ఎన్నో విగ్రహాలను సేకరించి ఢిల్లీకి తీసికొనివచ్చాయి. మేల్కోట దేవళంలోని దేవుని విగ్రహం ఒకటి దయచేసి మాకు ఇప్పించాలని మా వేడికోలు. నేడు మేల్కోటదేవళం ప్రాణరహితమైన శవప్రాయంగా పాడుపడి ఉంది,” అన్నారు రామానుజులు.

“సుల్తాను, యతిరాజుల వారి మాటలు సావధానంగా విని, అయ్యా, మీ చిరుకోరిక మన్నించటానికి మాకు అభ్యంతరం లేదు. అసలు ఆ విగ్రహం ఎలా వుంటుందో, మా వద్ద ఉన్నదో లేదో, కరిగించేసేమో నాకు తెలియదు.. అల్లా అనుగ్రహం వలన మీరు కోరిన విగ్రహం దొరకుతుందేమో చూద్దాం, దొడ్డిలో పడవేసిన విగ్రహాల గుట్ట దగ్గరకు పోయి చూద్దాము,” అని అన్నాడు.

ఉభయులు నడచి వెళ్లుతూ వుండగా, సుల్తాను, *“స్వామీ, మీరు వేయి మైళ్ళు నడిచి వచ్చారు, వ్యయప్రయాసలకు ఓర్చి ఈ విగ్రహం కోసమేనా?.. ఈ విగ్రహంలో విశేషం ఏమిటి?”* అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా రామానుజులు తాము గానీ, తమ శిష్యులు గానీ ఆ విగ్రహాన్ని ఇంతకు ముందు చూడలేదనీ, తమది తమిళనాడనీ, విధివిలాసం వల్ల కర్ణాటక దేశానికి పోయినపుడు ఈ విషయం విని వచ్చామని చెబుతారు..

సుల్తాను అచ్చెరువంది, “స్వామీజీ – అయితే మీరు ఆ విగ్రహాన్ని ఎట్లా గుర్తించదలచారో దయచేసి చెప్పండి” అని అడిగాడు.

అప్పటికే ఉభయులూ పెద్ద దొడ్డిలోకి ప్రవేశించారు.. రామానుజులు అక్కడ పడివున్న విగ్రహాలవైపు చూస్తూ, “మేల్కోట దేవుడు పిలిస్తే పలుకుతాడని మా ధైర్యం, ఆయన విగ్రహం ఇక్కడే వుండి వుంటే తప్పకుండా వస్తాడు.. తండ్రీ *సంపత్కుమారా,* రా! నా తండ్రీరా” అని బిగ్గరగా పిలచారు.. ఒక్క విగ్రహం కదలలేదు.. సుల్తానుకు విగ్రహాలు కదలవు, మెదలవు, మాట్లాడవు అని మాత్రమే తెలుసును కాబట్టి అతనికి ఆశ్చర్యం కలుగలేదు.

రామానుజులు తిరిగి తిరిగి ఎంత పిలిచినా ఏ విగ్రహం కదలలేదు, మారు పలకలేదు, రామానుజుల వారు ఆశా భంగం కలిగింది.. సుల్తాను జాలితో, _*“స్వామీజి మీరు ఆశాభంగం చెందవద్దు, మీకు నచ్చిన మరో విగ్రహం ఏదైనా తీసుకోవచ్చు”*_ అని అంటాడు.

_“మాకు కావాల్సిన విగ్రహం ఒక్క మేల్కోట సంపత్కుమార విగ్రహమే, తెచ్చిన అన్ని విగ్రహాలు ఇక్కడే వున్నాయా లేక ఒకటి రెండు వేరే చోట పెట్టారా దయచేసి సెలవిస్తారా?”_ అని రామానుజులు గంభీర స్వరంతో ప్రశ్నిస్తారు..

“అన్నీ ఇక్కడే వున్నాయి. కొన్నింటిని కరగించి వేశారు.. *అయితే ఒక చిన్న విగ్రహం మాత్రం చాలా అందంగా వుందని మా అమ్మాయి ముచ్చటపడి ఆడుకోడానికి దాచుకున్నట్లు వుంది*..” అన్నాడు సుల్తాను.

రామానుజల మెదడులో ఒక మెరుపు తీగ మెరసినట్లని పించింది. _“ప్రభూ!ఆ విగ్రహాన్ని మేము చూడవచ్చా..”_ అన్నారు రామానుజలవారు.

“మా అమ్మాయికి ఎందుచేతనో ఆ విగ్రహం అంటే పిచ్చి మమకారం, రాజకుమారి భోజన సమయంలో ఆమె గదిలోని విగ్రహాన్ని చూపిస్తాను లెండి, సాధారణంగా మా అంతఃపురంలోకి పర పురుషులు ప్రవేశించరాదు, మీరు సన్యాసులు, మహానుభావులు కాబట్టి మా జనానాలోకి రానిస్తున్నాం.. ఒకవేళ మా అమ్మాయి దాచిన విగ్రహం మీ సంపత్కుమారుడే అయితే మీరు పలిస్తే పలుకుతాడేమో చూడాలని కోరికగా వుంది.” అంటూ అంతఃపురం వైపు నడిచాడు సుల్తాను.

సుల్తాను వెంట భగవద్రామానుజుల వారు *విష్ణుసహస్ర నామ* పారాయణ చేస్తూ అంతఃపురములోకి వెళ్ళారు. పదునాలుగవ నామం దగ్గరకు వచ్చి *ॐ పురుషాయ నమః* అని జపిస్తూండగా రాజకుమారి గదికి చేరుకున్నారు.. శిష్యులందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుండగా, _“తండ్రీ సంపత్కుమారా! నా దగ్గరకు రావా తండ్రీ, నీవు సంపత్ప్రదాతవు, స్వప్రదాతవు, ఓ పరమపురుషా, నీవే సంపత్కుమార దేవుడవని నా అంతరాత్మ ఉద్ఘోషిస్తోంది,”_ అంటూ బిగ్గరగా భక్తి తన్మయత్వంతో పిలిచారు రామానుజులు.

*ఇక తన కన్నుల యెదుట జరిగిన అత్యద్భుత సన్నివేశం చూచి సుల్తాను మతి పోయింది.. మందమత్తేభ గమనంతో సంపత్కుమార విగ్రహం చకచకా ముందునకు నడచి రామానుజల వారి సన్నిధికి తరలి వచ్చింది..*

సుల్తానుకు అది కన్నుల పండుగ మాత్రమే కాదు. సంపత్కుమార దేవుని మొలత్రాడు చిరుగజ్జెల సవ్వడి సుల్తానుకు వీనుల విందు చేసినది.. *సంపత్కుమార దేవుడు రామానుజలవారికి తనను తాను దానం చేసుకున్నాడు..* రామానుజుల వారు ఆ విగ్రహాన్ని మేల్కోట తీసికొనివచ్చి, సంప్రోక్షణతో తిరిగి కోవెలలో ప్రతిష్ఠించారు..

అయితే, సంపత్కుమారుని కనుగొల్కలనుండి *వేడి కన్నీటి* బిందువులు కారటం ఒక శిష్యుడు చూచాడు.. ఆ శిష్యునికి సంపత్కుమార దేవుడు అంతరంగికంగా చెప్పాడు.. _“భగవద్రామానుజులు సంపత్ప్రదాత అయిన పరమపురుషుడవని కీర్తించడంతో నేను భక్త పరాధీనుడనై లొంగి పోయి వచ్చాను.. కానీ సుల్తాను కూతురు విషయం తలుచుకుంటే నా కన్నులు చెమ్మగిల్లుతున్నాయి.. ఆమె మహా భక్తురాలు.. ఆమెను విడిచిపెడితే నేను ఎట్లా భక్త పరాధీనుడను కాగలను?”_

ఆ విషయం భగవద్రామానుజుల వారికి తెలిసి సుల్తాను కూతురును మేల్కోటకు ఆహ్వనించారు.. రాకుమారి బీబీనాచ్చియారుగా మేల్కోటలో స్థిరపడింది.. ఈ నాటికి కూడా బీబీనాచ్చియారు విగ్రహం మేల్కోటలో వుంది. అందరూ చూడవచ్చు..

వైకుంఠనాథుడైన పరమపురుషుడు రామానుజులవారికి, ముస్లిము రాకుమారికి *స్వప్రదాత* అయినాడు. అట్లే ముక్తులైన భక్తులందరికీ అతడు వివశుడే.. అందుచేతనే శ్రీమన్నారాయణమూర్తిని *ॐ పురుషాయ నమః* అని విష్ణు సహస్రనామం అర్చిస్తుంది...

.

సోమవారం ఆరోగ్య చిట్కా:

 సోమవారం ఆరోగ్య చిట్కా:

మైండ్‌సెట్‌ను జాగ్రత్తగా చూసుకోండి

ఎందుకంటే అది జీవితానికి అధిపతి

ఏదైనా తెల్లని తినదగిన పువ్వు మనస్తత్వాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది మరియు మేధస్సును పెంచడానికి మద్దతు ఇస్తుంది

చంద్రుడు 🌙 మనస్సు మరియు పునరుత్పత్తిని ప్రభావితం చేస్తాడు

మనస్సు మరియు పునరుత్పత్తి ఆరోగ్యం కోసం చంద్రకాంతిలో ఎక్కువ సమయం గడపండి

చంద్రుడు నీటి మూలకాన్ని కూడా సూచిస్తాడు

అంటే మనస్సు కూడా నీటి మూలకం ద్వారా ప్రభావితమవుతుంది

నిర్మాణాత్మక నీరు 💦 ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని మనందరికీ తెలుసు

కాబట్టి నిర్మాణాత్మక నీరు మనస్సుపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది

ఆరోగ్యకరమైన మనస్సు కోసం, మనకు అవసరం

1. 🌙 మూన్ లైట్

2. తెలుపు తినదగిన పువ్వులు

3. నిర్మాణాత్మక నీరు 💦

రెండు గొప్ప శత్రువులు

 *రెండు గొప్ప శత్రువులు* 


*మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ' అహంకారం' మరి యొకటి ' మమకారం'.* 


*అహంకారం ' నేను, నేను ' అంటే మమకారం ' నాది, నాది' అంటూ ఉంటుంది.*


*ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ' ఇది నాది ' అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు ' ఇది నేను చేసినాను ' అనే భావన అహంకారం వలన కలుగుతుంది.*


*దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన. జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు. ఆ ప్రదేశం ఎంతో పుణ్యక్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు.*


*జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రఘర్భాలు పలికినాడు. అదివింటూ జగద్గురువుల వారు మౌనంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు. గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు.*


*జగద్గురువులు: "మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా"..? అధికారి: అవును చూస్తున్నాను.*


*జగద్గురువులు: దీని ఎత్తు ఎంత..?*

*అధికారి: చాలా ఎక్కువ.*


*జగద్గురువులు: దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?*

*అధికారి: చాలా తక్కువ స్థాయిలో*


*జగద్గురువులు: ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా.? ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి. మనం ఎంతటి అజ్ఞానమైన హీన స్థితి లో వున్నామో తెలియపరచేలా చేస్తుంది. ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతో పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము. అందువల్ల " నేను దీన్ని చేసాను" వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం.*


*హరనమః పార్వతీ పతయే* 

*హర హర మహా దేవ* 


 *--- జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ*

🪷🪷🍁 🙏🕉️🙏 🍁🪷🪷