2, మే 2021, ఆదివారం

భగవంతుని లెక్క 🍀🌷

 🙏🌹🍀భగవంతుని లెక్క 🍀🌷🙏


        #ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. 


         ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు.  ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది. 

వాళ్లు ఇక అక్కడ నుంచి వెళ్లిపోలేకపోయారు. 


       ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు నాదగ్గర ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. 


        కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.


         అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు. 


        #తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను.  మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు. 


      #ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది.

 ఈ చిక్కు తీర్చుకోడానికి ఇద్దరరచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు.


#రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. 


      #న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు.


       #ఎలాంగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. అయితే మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం 3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మనదగ్గర ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే ..!

ఇక్కడ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. 

మనం గమనించదగిన విషయం ఏమిటంటే....


          🙏30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చెయ్యడం గొప్పగా దేవుడు పరిగణించడు, 3 వేలు ఉన్నవాడు 300 దానం చెయ్యడాన్నే గొప్పగా భావిస్తాడు. పుణ్యంగా జమకడతాడు. దేవుడి దృష్టిలో మనకెంత ఉంది అన్నది కాదు మనకున్న దాంట్లో ఎంత దానం చేశాం అనే దానికే విలువ.


🙏🌹🍀సర్వే జానాః సుఖినో భవంతు 🍀🌹🙏

పొడుపు కథ.!

 అచ్చమైన పొడుపు కథ.!


ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

-

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

ఇమ్యూనిటీ

 హిమ‌గ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?

మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్‌ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్‌ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా అది రక్తహీనతకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇనుము స‌రైన మోతాదులో అంద‌క‌పోవ‌డ‌మే. ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్ బీ12 వంటి పోషకాలు శ‌రీరానాకి అందాలి. ఇవి లోపిస్తే రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి.


హిమ‌గ్లోబిన్ పుష్కలంగా ఉంటే శరీరంలో చక్కటి రక్తం ప్రవహిస్తున్నట్టే లెక్క‌. అలా లేదంటే ఎర్ర ర‌క్త క‌ణాలు బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ట్లుగా అనుమానించాలి. ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచేందుకు హిమ‌గ్లోబిన్ స‌రైన మోతాదుల్లో ఉండాలి. మ‌గ‌వారిలో 16 వ‌ర‌కు మ‌హిళ‌ల్లో 14 వ‌ర‌కు ఉండాలి. అలాకాకుండా మ‌గ‌వారిలో 14 క‌న్నా త‌క్కువ‌గా. మ‌హిళ‌ల్లో 12 క‌న్నా త‌క్కువ‌గా హిమ‌గ్లోబిన్ శాతం ఉన్న‌ట్లయితే ర‌క్తంలో ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా స‌ర‌ఫ‌రా కావ‌డంలేద‌ని గ్ర‌హించాలి. హిమ‌గ్లోబిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్త‌య్యే ఆహారాలు, పండ్లు వీలైనంత ఎక్కువ తీసుకోవడం అవ‌స‌రం.


ఐర‌న్‌ను గ్ర‌హించే విట‌మిన్ సీ


ఐరన్ ఉన్న ఆహారపదార్ధాలు తినడం వల్ల శరీరంలో హింగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అదే విటమిన్ ‘సీ’ ఉన్న ఆహారాలు, పండ్లు తీసుకుంటే మనం తిన్న ఆహారంలో కొద్ది పాటి ఐరన్ ఉన్నా దానిని ఎక్కువగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. విట‌మిన్ సీ నిమ్మ, నారింజ వంటి పండ్లలోనే కాకుండా జామ కాయలు, పుచ్చకాయ, కొబ్బరి నీళ్ళు, క్యాప్సికం, టమాటాలు, కివీ పండ్లు వంటి వాటిని ప్రతి రోజూ తినడం వలన శరీరానికి కావలసిన ఐరన్‌ని గ్రహించవచ్చు.


ఎర్ర‌ర‌క్త క‌ణాల త‌యారీకి ఫోలిక్ యాసిడ్‌


ఫోలిక్ యాసిడ్ వల్ల కొత్త ఎర్ర రక్త కాణాలు తయారవ్వడమే కాకుండా కణాలు వృద్ది చెందుతాయి కూడా. అందుకే విటమిన్ ‘బీ’ అందించే ఆకు పచ్చని కూరగాయలు, వేరుశెనగపప్పులు, మొలకెత్తిన విత్తనాలు, లివర్, ఆరటి పండ్లు వంటివి నిత్యం తినాలి. తద్వారా హిమోగ్లోబిన్ సమృద్దిగా లభిస్తుంది.


ఐర‌న్ స‌మృద్ధిగా అందాలంటే..


హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఉండే ఆహారపదార్ధాలు తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, పుచ్చకాయ, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, బీన్స్, పన్నీర్, కోడిగుడ్లు తింటే శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. అలాగే, మాంసంలోని లివర్, మాంసం, చేపలు వంటి వాటిల్లో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.


కాల్షియం కోసం దానిమ్మ పండ్ల‌ను తింటూ ఉండాలి. పొటాషియం, ఫైబ‌ర్ పుష్క‌లంగా అందాలంటే బీట్ రూట్ తినాలి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు గుమ్మ‌డి విత్త‌నాలు తింటూ ఉండాలి. గుమ్మ‌డి విత్త‌నాల్లో ఐర‌న్‌, కాల్షియం, మెగ్నిషియం, మాంగ‌నీస్ పుష్క‌లంగా ఉండి హిమ‌గ్లోబిన్ శాతాన్ని పెంచ‌డంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

H2O2 Therapy

 https://youtu.be/TAHhe7hJ0Ug

నిజాలను

 Forwarded as received


*📌నిజాలను ఎందుకు దాచారో తెలుసు , కానీ ఎన్నాళ్ళు దాస్తారు ?📌*


*ప్రపంచంలో ఇపుడు 221+దేశాలున్నాయి. కానీ తన వేళ్ళతో తన కళ్ళనే పొడుచుకొని ' సంతోషించే ' దేశం మాత్రం ఒక్కటే - అది మన భారతదేశం.*


  ఈ ' పాయింట్ ' మీద కొన్ని రోజుల తరువాత కొంత వివరంగా వ్రాస్తాను.


*📍ప్రశ్న*


*1.కుంభమేళా , 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కోవిడ్ వైరస్ వ్యాపించడానికి కారణం కాదా ?*


 మరి అలాంటప్పుడు వాటిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించింది ?  


*జవాబు🚩* 


ముందుగా , ఎన్నికలు9 నిర్వహించే Election Commission of India [ ECI]  ఒక స్వతంత్ర సంస్థ.


 అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల పెళ్ళికి ముహూర్తాలు పెట్టదు. 


*నిర్వహించకూడదు అని [ ECI] నిర్ణయం తీసుకొంటే కేంద్రప్రభుత్వం దానికి కట్టుబడివుండాల్సిందే.*


 కాబట్టి కేంద్రప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు - ఈ విషయంలో. 


*ఏప్రిల్ 24 న ఒక స్వతంత్ర సంస్థ నుండి నేను సేకరించిన డాటా చూడండి.*


*కోవిడ్ 2nd wave లో మరణాలు అధికంగా సంభవించిన రాష్ట్రాల్లో మొదటి 5 స్థానాల్లో వున్న రాష్ట్రాలు ఏవంటే* - [ప్రతి 10 000 మంది కోవిడ్ బాధితుల్లో మరణించిన వారి సంఖ్య ]


*1.దిల్లీ - 49 మంది*

2.మహారాష్ట్ర - 33 మంది

3.పంజాబ్ - 27 మంది 

4.మధ్య ప్రదేశ్ - 26 మంది 

5.చత్తీస్ ఘడ్ - 20 మంది  

 

*📌ఈ 5 రాష్ట్రాల్లో కుంభమేళా జరగలేదు , ఎన్నికలూ జరగలేదు.📌*


*మీడియా చెప్పని మరో వాస్తవం* - 


*దిల్లీ లో COVID బాధితులపై జరిపిన మెడికల్ పరీక్షల్లో 50 % మందిలో ,  పంజాబు కోవిడ్ బాధితుల్లో 90 % మందిలో British Variant  బయటపడింది.*


అంటే ప్రధాన కారణం అదే అని తేలింది. 


*అది ఎక్కడినుండి వచ్చింది ?*


* 📍2020 సెప్టంబరు-అక్టోబరు నుండి ' రైతు ఉద్యమం ' పేరుతో దిల్లీ , ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో సమ్మె చేస్తూ , వేల సంఖ్యలో గుమిగూడుతున్న రైతులకు మద్దతుగా ఇంగ్లాండ్ [ బ్రిటన్ , ఐర్లాండ్] నుండి వచ్చిన పంజాబీలు. వస్తూ వస్తూ ఖాళీగా రాకుండా  బ్రిటిష్ వేరియంట్ ను వెంటతెచ్చారు📍,*


ఇక్కడికొచ్చాక సమ్మెల్లో , ఇక్కడి రైతులతో పాటూ 

మాస్కులు లేకుండా వున్నారు.


 *ఒక వైపు సుప్రీం కోర్టు ఒక కమిటీ ని ఏర్పాటు చేసి మీ సమస్యలను కమిటీ కి చెప్పండి అంటే , ' మేం కమిటి తో మాట్లాడం , సమ్మె ఆపం' అంటూ మొండివాదన చేసింది ఎవరు ?*


*ఆక్సిజన్ ను ఆసుపత్రులకు చేరుస్తున్న ట్రక్కులకు దారి ఇవ్వకుండా ,  రోడ్లను ఆక్రమించింది ఎవరు ?*


 *మానవత్వాన్ని మరచిన ఈ రైతులను ఉసిగొల్పింది ఎవరు ?*


 *రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీ వీళ్ళను ఉద్దేశించి '' మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె ఆపకండి '' అని ప్రసంగాలు చేయలేదా ?*


 *ఈ సోకాల్డ్ రైతులకు నీరు , ఆహారం , ఉచిత వైఫై సౌకర్యాలు అందిస్తూ , వీళ్ళను ' సమ్మె ఆపొద్దు ' అని మంటకు కిరోసిన్ పోసింది కేజ్రీవాల్ , ఆప్  నాయకులు కారా ?*

[ వచ్చే పంజాబు ఎన్నికల కోసం ]


*అంతే కాదు దిల్లీకి శాపంగా , దేశానికి భారంగా మారిన ఈ కేజ్రీవాల్ చేస్తున్న దుర్మార్గం చూడండి.*


 *దిల్లీ లో నంగోలి అనేచోట రోజుకు 500 టన్నుల  ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే  ప్లాంట్ ను మార్చ్ 20 న దీలీ లోని కేజ్రీవాల్ ' ఆప్ ' ప్రభుత్వం మూసేయించింది.*


 ఎందుకు ? 


*ఇపుడు దిల్లీలో ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరతనే కదా ? మరి దీనికి బాధ్యులు ఎవరౌతారు ?*

 

*కేంద్ర ప్రభుత్వం దిల్లీ మహానగరానికి 72000 Remdesvir injections ను పంపివుంటే వాటిలో 25000 ను మాత్రమే ఉపయోగించింది దిల్లీ రాష్టప్రభుత్వం. మిగతా 47000 ఎక్కడికిపోయాయి ?*


*దిల్లీ యంత్రాంగం లో Disaster Management అనే విభాగం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే వుంటుంది , కేంద్రం చేతుల్లో వుండదు. మరి కేజ్రీవాల్ Disaster ను ఎందుకు Manage చేయలేదు ?*


*కానీ తన గొప్పలు చెప్పుకోవడానికి , రోజూ దినపత్రికల్లో , టివి చానెళ్ళలో తన ప్రచారం చేసుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ పెడుతున్న ఈ  ఖర్చు చూడండి.దిమ్మ తిరిగిపోతుంది.* 


*కేజ్రీవాల్ తన సొంత డబ్బా కొట్టుకొనే Advertisements కు  ఒక రోజు కు పెట్టే ఖర్చుతో 75000 సిలిండర్లను ఆక్సిజన్ తో నింపవచ్చు.*


*3 రోజులకు పెట్టే ఖర్చుతో  1 , 00 , 000 Remdesvir injections కొనవచ్చు.*


*5 రోజులకు పెట్టే ఖర్చుతో 200 ఆక్సిజన్ ప్లాంటులను పెట్టవచ్చు.*


*30 రోజులకు పెట్టే ఖర్చుతో 125 beds తో ఒక ఆసుపత్రినే ప్రారంభించవచ్చు.*


*ఇంత దుర్వినియోగం జరుగుతున్నా మీడియా ఎందుకు కేజ్రీవాల్ను నిలదీయదు ?*


*ఎందుకంటే ఆయన గవర్నమెంటు నుండి రోజుకు 3 కోట్ల ఆదాయం వుంది కాబట్టి.*


*ఈ యాడ్స్ అందుకొని డబ్బుచేసుకొనే చానెళ్ళలో ABP , India Today , Republic tv , Aajtak , TimesNow  మొదలైనవివున్నాయి.*


*మొన్న ఒక జర్నలిస్టు [ దిల్లీ ] లెక్కవేసాడు - India Today చానెల్ లో 8 గంటల వ్యవధిలో 22 మార్లు కేజ్రీవాల్ యాడ్ ప్రసారమౌతుందట.*

 

*8 ఆక్సిజన్ ప్లాంటులు పెట్టమని కేంద్రప్రభుత్వం దీలీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి 2020 డీశెంబరు లో నిధులు ఇస్తే ఇంతదాకా పెట్టింది కేవలం 1 ప్లాంటునే.*


*10 ఆక్సిజన్ ప్లాంటులకు కేంద్రం 2021 జనవరి లో మహారాష్ట్ర శివసేన  ప్రభుత్వానికి నిధులిస్తే , అది పెట్టింది 1  ప్లాంటునే.*


*5 ప్లాంటులు పెట్టమని ప. బెంగాల్ మమత బెనర్జీ కి 2021 జనవరిలో నిధులిస్తే  ఇంతదాకా ఒక్క ప్లాంటును కూడా పెట్టలేదు.*


*📌దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఎంత దారుణగా వుందంటే 48 గంటలక్రితం సాక్షాత్తూ Supreme Court  '' మీరు దిల్లీని నాశనం చేసారు, చేతకాకపోతే తప్పుకోండి.*

 *దిల్లీ నగర యంత్రాంగాన్ని మీరు తీసేసుకోండి అని కేంద్రప్రభుత్వానికి మేము చెపుతాం '' అని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది.📌*


 *ఈ వాస్తవాలను  మన తెలుగు మీడియా చెపుతున్నదా ?*

సూర్య నమస్కారాలు

 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

 *ॐ* *ఓం నమః శివాయ* *ॐ*

సూర్య నమస్కారాలు :-


సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.


ఆసనానికో ప్రయోజనం :-


సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...


ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.


రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.


మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.


నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.


ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.


ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.


మరెన్నో లాభాలు :-


సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.

ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.


1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-

సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.


2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-

కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.


3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-

శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.


4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-

ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.


5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-

కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.


6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.


7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-

శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.


8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-

ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.


9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-

నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి


10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-

మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.


11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-

రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.


12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-

నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.


🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

 *ॐ{శివ కింకరుడు దగ్గొలుమునేంద్ర }ॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

దేవాలయాలు

 నవ గ్రహ దేవాలయాలు..!!💐శ్రీ💐

ఓం నమః శివాయ..!!🙏


ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!🙏 


నవగ్రహములు తొమ్మిది , 

ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. 


కుంభ‌కోణం:.💐

తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. 

వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. 

ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.


1) సూర్యనార్ కోయిల్ .💐

తిరుమంగళంకుడి. 

తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో 

సూర్యనార్ కోయిల్ అనీ పిలువబడే సూర్యదేవాలయము వున్నది. 

ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమణులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .

ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు 

చరిత్ర ద్వారా తెలుస్తుంది .

ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్ష్మీని, 

నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచ్చు.

ఈ ఆలయములో సూర్యభగవానుడికి 

తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.

ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది. 

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. 

రవి సంపద ప్రదాత కూడా. 

1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. 

ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు.


2) చంద్రగ్రహ దేవాలయము.💐

తిరువైయార్.. 

తిరువైయారుకు 5 k.m దూరములో 

చంద్రగ్రహ దేవాలయము వుంది. 

తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే 

చంద్ర దేవాలయములోని చంద్రభగవానుని దర్శనము సుఖాన్ని,దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని 

భక్తుల నమ్మకము. 

మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. 

సెప్టెంబర్.. అక్టోబర్ మాసాలలో వచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది.


3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము.💐

వైథీశ్వరన్ కోవిల్...

తిరువైయార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో 

కుజ దేవాలయం ఉంది. 

దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. 

అనేక వ్యాధులను అంగారకుడు పోగొడతాడని విశ్వాసం. 

ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. 

ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ల‌యిపోతుంది. 

ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము.

వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .


4) బుధగ్రహ దేవాలయము.💐

తిరువెన్నాడు.

అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది.

ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. 

అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి.

వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. 

కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .

ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారానికి మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని 

ఇక్కడ ప్రజలకు నమ్మకము.


5) బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము.💐 ఆలంగుడి.

కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. 

ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. 

ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము.

దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు.

శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. 

పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు.

భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. 

ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు.

గురుడికి ఇష్టమైన గురువారము నాడు, 

నాన బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుకబడిన వారు చదువులో మరియు 

ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, 

విద్యలో ఆటంకాలు, 

పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము.

గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగుతుంది అని 

భక్తుల ప్రగాడ విశ్వాసము.


6) శుక్ర గ్రహ దేవాలయము.💐

కామ్చనూరు.

కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది .

దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి.

ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరు

సూర్యమండల స్త్రోత్రం

 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*


చాలా అరుదుగా దొరికే సూర్యమండల స్త్రోత్రం


రోజూ చదువలేకపోయినా వారంలో ఒకరోజు ఆదివారం నాడు_చదివినా సమస్త పాపాల్ని హరించి పుణ్యఫలం  పెంచే స్తోత్రం


నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే 

సహస్రశాఖాన్విత సంభవాత్మనే |

సహస్రయోగోద్భవ భావభాగినే 

సహస్రసంఖ్యాయుధధారిణే నమః || 


యన్మండలం దీప్తికరం విశాలం | 

రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం దేవగణైః సుపూజితం | 

విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |

తం దేవదేవం ప్రణమామి సూర్యం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | 

త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం గూఢమతి ప్రబోధం | 

ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

యత్సర్వ పాపక్షయకారణం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం వ్యాధివినాశదక్షం | 

యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం వేదవిదో వదంతి | 

గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం సర్వజనైశ్చ పూజితం | 

జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |

యత్కాల కాలాద్యమరాది రూపం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | 

యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయకారణం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | 

ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |

యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం సర్వగతస్య విష్ణోః | 

ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |

సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


యన్మండలం వేదవిదోపగీతం | 

యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | 

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 


సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||


ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం..||


🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*

కర్తరి


                        *కర్తరి *

                  ➖➖➖✍️


*కర్తరి రాబోతోంది... సుడిగాలుల ముప్పును తేబోతోంది. మే 4 నుంచి 28వ తేదీ వరకు కర్తరి కొనసాగుతుంది. దీన్నే వాస్తు కర్తరి అంటారు. మే 4వ తేదీ మధ్యాహ్నం 3గం.15 నిలకు రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో చిన్న కర్తరి ప్రారంభమవుతుంది.*


*మే 11 మధ్యాహ్నం 12గం.36 ని.లకు కృత్తికా నక్షత్రం లోకి రవి ప్రవేశించడంతో పెద్ద కర్తరి ప్రారంభమౌతుంది. 28. 05 న రాత్రి 8గం.05 ని.  త్యాగమవుతుంది. ఈ సమయంలో శంకుస్థాపనులు, చెక్కపనులు, తాపీ పనులు చేయరాదు.*


*మనకు 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్న సంగతి తెలుసు!    ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున మొత్తం 27 X 4=108 పాదాలు. 12 రాసులతో భాగిస్తే ఒక్కోరాశికి 9 పాదాలొస్తాయి. మొదటి రాశి మేషం, సాధారణంగా ఒక రోజు తేడాలో ఏప్రిల్ 14న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే సూర్య సంక్రమణం అంటాం. తమిళులకు ఇది నూతన సంవత్సరారంభం.*


*సూర్యుడు భరణి నక్షత్రంలో 3,4 పాదాలలో ఉన్నపుడు డొల్లు కర్తరి అని, కృత్తిక నక్షత్రం లో ఉండగా అగ్ని కర్తరి అని అంటాం.* 


*కృత్తిక నాలుగు పాదాలులో అగ్నిలేక పెద్ద కత్తిరి నడచేటప్పటికి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది.* 


*కర్తరి అంటే కర్త + అరి = కర్తరి అంటే పని చేసేవానికి శత్రువు అని అర్ధం.     ఈ కర్తరి సమయంలోవాతావరణ మార్పులు  ఎక్కువగా ఉంటాయి. ఇక అగ్ని కర్తరి వచ్చేసరికి ఎండలు ముదరడంతో అగ్నిప్రమాదాలు,  నీటి ఎద్ధడి ఉంటుంది. సుడిగాలుల తాకిడికి నిర్మాణాలు పడిపోవచ్చు. అందుకే ఏ పనులూ చేయవద్దన్నారు. చెట్లు నరకడం, వ్యవసాయ పనుల ప్రారంభం, నూతులు, బావులు, చెరువులు తవ్వడం మొదలైన పనులపై నిషేధం పెట్టారు.* 


*ఈ సంవత్సరం మే 11 నాటికి రోహిణీ కార్తె వచ్చేస్తుంది, భరించలేని వేడి ఉంటుంది. అందుకు ఈ పదిహేను రోజులూ కూడా పై చెప్పిన పనులు వద్దన్నారు. మరో సంగతి పెళ్ళిళ్ళు, గర్భాదానాలు,గృహ ప్రవేశాలకు(కొన్ని చోట్ల గృహప్రవేశాలు నిషిద్ధం అని కూడా ఉన్నది) సంబంధించి నిషేధాలు ఏమీ లేవు.* ✍️


మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం,

 9866193557.


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

Human system is

 Human system is divided in three divisions as per sastras:

1. స్థూల శరీరము.

2. లింగ శరీరము.

3. సూక్ష్మ శరీరము.


స్థూల శరీరము; బాహ్యముగా వ్యక్తం అయే శరీర భాగాలు.( గూడు)


లింగ శరీరము: వ్యక్త భాగాలను ప్రభావితంచేసే అవ్యక్థభాగములు.

మనస్సు,అహంకారము, బుద్ధి, చిత్తము, పంచ ప్రాణములు.


సూక్ష్మ శరీరము: చైతన్యశక్తి.


స్థూల శరీరము, లింగ శరీరము

ఒకటితొ ఇకొంకటివల్ల ప్రభావితము 

జరుగుతుంది. కాని ఈ రెండూ 

సూక్ష్మ శరీరమును ప్రభావితము

చేయలేవు.


గూడు పాడైపోయాక చివరిగా పంచప్రాణాలు సూక్ష్మ శరీరమును

పల్లకీబోయలా వ్యహరించి పునర్జన్మ ఉంటే ఇంకొక గర్భంలోకి

ప్రవేశిస్తుంది. మోక్షం ఉంటే పంచప్రాణాలు వాయువులొకలసి

సూక్ష్మ శరీరము పరమాత్మ కుక్షిలోకి వెళ్లి పునర్జన్మ ఉండదు. ఓం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*ఆశ్రమ వాసానికి సన్నాహాలు..*


*(పదిహేనవ రోజు)*


శ్రీ స్వామివారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారనివతెలుసుకున్నాము.. శ్రీధరరావు, ప్రభావతి గార్ల మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు..శ్రీధరరావు గారు మాలకొండకు తరచూ వెళుతూనే వున్నా..ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకుముందులా మాలకొండకు వెళ్లడం లేదు..


ప్రభావతి గారి మనసులో "ఇద్దరమూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటే..ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతాడేమో.. తప్పించుకోలేక స్థలం విషయం లో వాగ్దానం చేసి.. స్థలం ఆయనకు ధారపోస్తే..ఆయన ఇక సాధారణ జీవనానికి అలవాటు పడి..ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారి పోతాడేమో..మాలకొండ మీదున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగుచేయించి ఇద్దామంటే..ఆ పని పెట్టుకోవద్దని చెపుతున్నాడు..ఈ సంకట స్థితి నుంచి బయటపడేదెలా?.." అని సవాలక్ష ఆలోచనలతో సతమతం అవుతున్నారు..శ్రీధరరావు గారు కూడా ఎటూ తేల్చుకోలేక వున్నారు..


ఈలోపల, కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యం లో మాలకొండ మీద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు..ఆ సంఘానికి శ్రీధరరావు గారే ప్రెసిడెంట్..వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావుగారు (కవి, పండితులు, అష్టావధాని.. కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు..) వుండేవారు..ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచార్యులు గారిని, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గార్లను సన్మానించాలని తీర్మానం చేసి, ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకొచ్చారు..వారిని ఘనంగా సన్మానించిన తరువాత, భక్తి పూర్వకంగా..ప్రభావతి శ్రీధరరావు గార్లు, శ్రీ శేషాచార్యులు శ్రీదేవమ్మ గార్ల కాళ్లకు నమస్కారం చేశారు..శ్రీదేవమ్మ గారు నిండుమనసుతో.."శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు!.." అని దీవించారు..శ్రీధరరావు దంపతులు..అక్కడున్న మిగిలిన సభికులు..కవులు, రచయితలు, పండితులూ..దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు..కారణం..శ్రీధరరావు ప్రభావతి గార్లకు ముగ్గురు పిల్లలు..హైస్కూల్ చదువుల్లో వున్నారు..పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు..ఈ మహాసాధ్వి..కొండంత మాలకొండ స్వామి సన్నిధిలో నిండుమనసుతో పెద్దగా దీవించింది..


శ్రీధరరావు, ప్రభావతి గార్ల ముఖాముఖాలు చూసుకోవడం..ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడటం గమనించిన శ్రీదేవమ్మ గారు, ప్రభావతి గారిని ప్రక్కకు పిలచి.."అమ్మాయీ..నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లీ?..నాకెలగూ సంతాన యోగం లేదు..మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి, అలా దీవించాను.." అన్నారు..ప్రభావతి గారు ఆవిడకు విషయమంతా చెప్పి.."ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మీరు దీవించారు..మీ వాక్కు వృధా పోదు.. ఆ స్వామి లీల ఎలా వుందో?..ఎలా మలిస్తే అలా జరుగుతుంది.." అన్నారు..ఆ తరువాత ప్రభావతి శ్రీధరరావు గార్లు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి..సగౌరవంగా సాగనంపి..శ్రీ స్వామివారి దర్శనం కొరకు పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..


అంతకుముందు రోజు..శ్రీధరరావు గారి అన్నయ్య గారు, కూతురు కుమారి చెప్పిన ఉదంతం అంతా విని, శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపారు..అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి వున్నారు..వారిని కూడా తోడ్కొని.. జింక చర్మాన్ని తీసుకొని శ్రీ స్వామివారి వద్దకు చేరారు..శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని వున్నారు..వీళ్ళను చూడగానే..దగ్గరకు వచ్చి, ప్రభావతి గారి నాన్న గారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి.."మీరు నమ్మిన వైష్ణవ భక్తి నే కొనసాగించండి.." అని చెప్పారు..


అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు గారి దంపతుల వైపు తిరిగి..తీక్షణంగా చూస్తూ.."మీకు నేను ఇంతకుముందే చెప్పివున్నాను శ్రీధరరావు గారూ..ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మత్తులు చేసి, సహజంగా రాతిలో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరచి..ఉన్న పవిత్రత పోగొట్టకండి..నాకు వచ్చింది దైవాజ్ఞ!..దానిని నేను అతిక్రమించలేను..మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి..మీకు మేలు జరుగుతుంది.." అన్నారు..సాక్షాత్తూ ఆ లక్ష్మీ నృసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరూ అనుభూతి చెందారు..వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలోనే తొలగిపోయాయి..


"సరే స్వామీ..మా పొలమే రెండు ప్రదేశాలలో ఉన్నది..మీరు వచ్చి చూసి, ఏది కావాలో నిర్ణయిస్తే..దానినే మీరు కోరుకున్నంత ఇస్తాము..మీ తపోసాధనకు మా వంతు సహకారం అందించి, మా జీవితాలు ధన్యం చేసుకుంటాము.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు చేయెత్తి ఆశీర్వదించారు..తిరిగి మొగలిచెర్లకు ఆ దంపతులు చేరారు..విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదమూ.. శ్రీ స్వామివారి ఆజ్ఞ..రెండూ ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి..


ఆశ్రమ స్థల నిర్ణయం...రేపు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

పూజల్లో దోషాలు

 పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే


ఒక ముసలి భిక్షువు 

శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.


ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇఖ బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది.


ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు.


"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు.


ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది.


అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.


తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.


ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది.


" ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.


ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.


" అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది " అని కోపంతో వెళ్ళిపోయాడు.


ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.


ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.


ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.


ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి


" అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు " అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.


కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి.


మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.