తెలిసినది కాదు తెలియనిది కాదు
మన మహర్షులు వారి అత్యంత గొప్ప మేధసుక్తితో మనకు భగవంతుని స్వరూపాన్ని ఆవిష్కరింప చేశారు. వారు పేర్కొన్న జ్ఞ్యాన బాండాగారం మనకు ఉపనిషత్తుల రూపంలో లభ్యమవుతున్నది. అతి సామాన్యమైన విషయంతో అనన్తమైన బ్రహ్మపదారధాన్ని తెలుసుకోవటం ఒక అసామాన్యమైన జ్ఞ్యానం అనాలి.
భగవంతుడు: మన మహర్షులు భాగావంతునికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి అని చెప్పారు.
1) త్రిగుణాతీతుడు. మనుషులమైన మనము సత్వ, రజో తమో గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో ఒక గుణం ఇంకొక గుణంతో మిళితమై లేక అధిగమించి గోచరించవచ్చు. ఏది ఏమైనా గుణాలలో మాత్రమే మనిషి కనపడతాడు. కానీ భగవంతునికి ఏ రకమైన గుణం ఉండదు అంటే ఆయనకు రాగ ద్వేషాలు వుండవు.
2) కాలాతీతుడు: ఈ భూమి మీద వున్న ప్రతిదీ అది నిర్జీవమైనది కావచ్చు లేక జీవమైనది కావచ్చు ఒక కాలంలో ఉద్బవించి (జన్మించి) కొంత కాలం వుంది తరువాత నశించి పోతుంది. ఉన్నంతకాలం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు కాలములో లేడు ఆయన త్రికాలలో ఉంటాడు అంటే భూతకాలంలో వున్నాడు, వర్తమానంములో వున్నాడు భవిష్యత్తులో ఉంటాడు. అందుకే భగవంతుని నిత్యుడు అని అన్నారు.
3) రూప రహితుడు: మనకు ఈ భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రూపంలో కనబడుతూ వున్నది. అందుకే మనం వాటిని గుర్తించగలుగుతున్నాము. కానీ భగవంతుడు ఏ రూపం లేకుండా ఉంటాడు. అందుకే ఆయన కాలంలో లేడు .
4) నామరహితుడు: అంటే పేరులేని వాడు. ఏదైనా రూపం ఉంటేనే పేరు ఉంటుంది. రూపమేలేనప్పుడు ఇక పేరు అనే సమస్యే లేదు.
5) భగ కలిగిన వాడు: మనము అదృషవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అనే మాటలు వుంటూ ఉంటాము. అంటే ఏది ఉంటే వానికి ఉన్నదాని ప్రక్కన వంతుడు అని పెట్టి అది అలిగినవాడుగా మనం పేర్కొంటాము. ఉదా : ధనం వున్నవానిని ధనవంతుడు అని అదృష్టం వున్నవానిని అదృష్టవంతుడు ఇలా మనం ఉపయోగిస్తూవుంటాము. మరి భగవంతుడు" అంటే ఎవరు? భగ అనే ఆరుగుణాలు వున్నవాడు క్రింది శ్లోకాన్ని చుడండి
"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్రియఃజ్ఞాన వైరాగ్యయేశ్చైవ షణాం - భగ, ఇత్యుక్త భగోzస్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .అంటే
1) మాహాత్మ్యం 2) ధైర్యం 3) యశస్సు4) సంపద5) జ్ఞానం 6) వైరాగ్యం ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.వీటికే "భగ" అని పేరు. ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.
ఇంకా వుంది