21, జులై 2024, ఆదివారం

మన లెక్కల

 *


*మన లెక్కల, ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు . . .😊*


అమ్మ చేసిన రొట్టె *వృత్తము*

సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*


మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*

పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*


మనకిష్టమైన లడ్డూఒక  *గోళము*

సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*


మన తరగతి గది ఒక *ఘనం*

మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*


మన జెండా కర్ర ఒక *స్థూపం*

కొడవలి మలుపు ఒక *చాపం*

ధాన్యపు రాశి ఒక *శంఖువు*


రూపాయి రూపాయి కలిపితే *కూడిక*

కొనడానికి కొంత తీస్తే *తీసివేత*

తలా పది పంచితే *భాగహారం*

హెచ్చిస్తే *గుణకారం*


కూర్చుంటే *జడత్వం*

కదిలితే *చలనం*

పరిగెత్తితే *వేగం*

ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*

పడిపోతే *ఆకర్షణ*

విడిపోతే *వికర్షణ*

తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*

గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*


మాట్లాడడానికి *శక్తి*

పనిచేయడానికి *బలం*

గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*


వింటున్నా మంటే *శబ్దం*

చూస్తున్నామంటే *వెలుగు*

రంగులన్ని *వర్ణ పటం*


ఆహారం అరగడం *జీవక్రియ*

అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*

ఉచ్వాస నిశ్వాసాలు *శ్వాస క్రియ*


నేను చూశాను *భూతకాలం*

నేను చూస్తున్నా *వర్ధమాన కాలం*

నేను చూడ బోతున్నా *భవిష్యత్ కాలం*

నాకు తొంభై తొమ్మిది ఏళ్ళు ... ఇక *పోయే కాలం*


బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...

మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.

భయమెందుకు నీకు ...

నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...

తెలుసుకో పదిలంగా

నేర్చుకో సులభంగా...!   


*అదే మన తెలుగు భాష గొప్పదనం*.  


భలే ఉంది కదా ...

సర్వేజన సుఖినోభవంతు...

🌹💐💐🎉🎉💐💐🌹

శ్రీ గురువుకి నమస్కారము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 *గురు/వ్యాస పూర్ణిమ* శుభాకాంక్షలు తెలియజేస్తూ...


 శ్లో𝕝𝕝  *గురు మధ్యే స్థితం విశ్వం* 

        *విశ్వమధ్యే స్థితో గురుః*।

        *విశ్వరూపో విరూపోసౌ*

        *తస్మై శ్రీ గురవే నమః*॥


తా𝕝𝕝 ఈ ప్రపంచమంతా గురువులో ఉంది... విశ్వమంతటిలోను గురువు ఉన్నారు.... ఆయన విశ్వరూపుడు... ఆయన రూపరహితుడు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము

~~~~~~~~~~~~~


శ్లో𝕝𝕝  *ఏకమేవాక్షరం యస్తు*

       *గురుశ్శిష్యం ప్రబోధయేత్*|

       *పృథివ్యాం నాస్తి తద్రవ్యం*

       *యద్దత్వా చా ఽనృణీ భవేత్*॥


తా𝕝𝕝 గురువుగారి వద్దనుండి ఒక్క అక్షరమంత జ్ఞానం పొందినా ఆ ఋణము నుండి విముక్తిని పొందడానికి గురుదక్షిణగా ఇవ్వగలిగిన ద్రవ్యము ఈ ధరణిలో లేదు.

మానవ జన్మ*

 *మానవత్వం*




మానవుడు అనేక జన్మల ఎత్తుతూ ఉండవచ్చు, *కాని సమాజానికి  తనవల్ల ప్రయోజనము ఏమిటి అనే విషయము ఆలోచించడము లేదు.*  సమాజము వల్ల తనకేమి లాభము అని ఆలోచించినంత కాలము అతను అజ్ఞానములో ఉన్నట్లే.  *సమాజానికి  ఏదో  సేవ చేయాలని భావిస్తున్నంత కాలము మనము  భగవంతునికి దగ్గరగా ఉంటాము, అనుగ్రహము పొందుతూనే ఉంటాము*. ఈలా దైవానికి దగ్గరగా ఉండటాన్ని గూడా మనము, ఆ కరుణను దైవానికి ఆపాదిస్తూనే ఋణపడి ఉన్నాము. ఎందుకంటే దైవము అపార కారుణ్య మూర్తి. దైవము అనేక విధాలుగా మనపై దయ చూపిస్తున్నాడు. ఆ దయ మూలంగానే మనము సుఖ సంతోషాలతో, శాంతులతో ఉన్నాము.


మనకు కష్టాలిచ్చినప్పుడు, మనలను శిక్షిoచ్చినప్పుడు, శిక్షిస్తున్నప్పుడు కూడా మనను దోష రహితులుగా శుద్ధిపరుస్తున్నట్లే. *కష్టాలు కష్టాలు కావు. మనకు ఇచ్చిన కష్టాలన్నీ కూడా మనలను కల్మష రహితులను చేయటమే*.  బాధలను అనుభవించిన తర్వాత అంతకు పూర్వము కన్నా నిర్మలంగా ఉంటాము. *కష్టాల తర్వాత మనము నిర్మలమైన, ఉన్నతమైన వ్యక్తిత్వముతో జీవనము సాగిస్తున్నందుకు మనము సంతోష పడాలి*, అంతే కాదు *కష్టాలను సరైన దృష్టితో అర్థం చేసుకుంటూ ఎల్లవేళలా ఇతరులకు సేవ చేయాలి, చేస్తూనే ఉండాలి*. కష్టాల బాధ మనకు తెల్సు కాబట్టి. 


ఆ సేవ ఇతరులకొరకు అనుకుంటాము కాని అది మనకోసమే. *ఈ కారణంగా భగవంతుడు మనకు కావల్సింది ఇవ్వడానికి ఇష్టపడతాడు*. మనము చేసే, చేయబోయే సేవ/సేవలు, మనకు రాబోయే అదృష్టానికి, పుణ్యానికి పెట్టుబడి/పెట్టుబడులు మాత్రమే. పూర్వ కాలంలోనే గాదు ఇప్పుడు కూడా ధర్మాత్ములు అన్న సత్రములు, ధర్మశాలలు స్థాపించి ఆర్తులకు కావల్సిన వసతులు కల్పిస్తున్నారు. 


*దాన ధర్మాలు అవిశ్రాంతంగా నిర్వహించిన మన పూర్వీకుల సంస్కృతి గొప్పది కావటము చేత ఈ రోజు మనము గొప్పగా, గర్వంగా చెప్పుకుంటున్నాము*. ఆ గొప్ప గుణాలను మనము మనసులో మాత్రమే దాచుకోకుండా, మనము  కూడా  వాటిని వారసత్వంగా స్వీకరిస్తే,  మన కొచ్చే కీర్తి ప్రతిష్టలతో బాటు, *మన వారసులు కూడా అంత గొప్పవారు కావడానికి మనము బీజము వేసినట్లే*. 


చాలా మందికి తెల్సు ఎలా సంపాదించాలో, ఎలా దాచుకొవాలో, *కాని దాన్ని ఎలా సద్వినియోగము చేయాలో అని తెలిసిన వాళ్లు కొద్దిమంది మాత్రమే*.


సమాజంలో ప్రతి పౌరుడు దాన కర్ణుడి లాగా, శిభి చక్రవర్తి లాగా ఆర్థుల సేవలో నిలవాలి, ఎదగాలి.  *గాలి బలం ప్రపంచానికి తెల్వదు సుడిగాలై చుట్టెంత వరకు, నీటి బలం తెల్వదు ఉప్పన అయి పోటెoత్త వరకు, విత్తు బలం తెల్వదు మొలకెత్తి మాను అయ్యేంత వరకు, ఆలాగే వ్యక్తులకు తెల్వదు సేవా రంగములో అడుగిడి సేవలకు ఉపక్రమించి విజయాలు సాధించే వరకు*. పరోపకారమే పుణ్యము, పుణ్య ఫలితమే సుఖము.


*చివరిగా.....* 

"స్వ పర హిత యోగ్యతాం జన్మ"

*తన హితముతో బాటు ఇతరుల హితము కొరునదే మానవ జన్మ*

ధన్యవాదములు.