11, మార్చి 2022, శుక్రవారం

గోవు

 *గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం...*

చాలా మందికి తెలియదు.


*****


🐃 గేదె కు బురద అంటే చాలా ఇష్టం. 


🐂 గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం.


*****


🐃 గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞ్యాపక శక్తి జీరో.


🐂 ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది.

*గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది.*


*****


🐃 పది గేదెలను కట్టి, వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు.


🐂 గాని ఆవు దూడ అలా కాదు, తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా గుర్తించగలదు.


*****


🐃 పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది. 


🐂 గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. *నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది*


*****


🐃 గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు.


🐂 ఆవు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు.


*****


🐃 గేదె పాలు భారీ గా ఉండి తొందరగా అరగవు. దాని వల్ల చలాకి తనం ఉండదు. పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు.


🐂 ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టం గా ఉంటుంది. పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము.


*****


ఆవు వీపు పైన ఉండే "సూర్య కేతు నాడి" ఎండ లో ఉన్నప్పుడు జాగృతమై ఆవు లో బంగారు లవణాలు తయ్యారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి "కాస్మిక్ ఎనర్జీ" ని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వం లో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు.


నిజానికి ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి. గేదె పాలు భారీ గా ఉండడం వల్ల, జీర్సీ పాలు వేడి చెయ్యడం వల్ల మనకి షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే తగ్గదు.


మనం అన్నింటిలోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తాము. రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి కోలేస్ట్రోల్ తయ్యారవ్వదు అని టీవీ లో చూపిస్తే ఆ ఆయిల్ నే వాడతాము. ఫ్యాట్ తక్కువ ఉన్న పాలను వదిలి గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాము.


🐃 గేదె పాలల్లో మూడో నాలుగో ఉండే పోషక తత్త్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచం వేడి చెయ్యగానే ఆవిరైపోతాయి. 


🐂 ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి- మరిగించి కోవా లా చేసినా అందులో ఉండే పోషక తత్త్వాలు నశించవు.


🙏🙏🙏🙏🙏🙏

హిందువు

 మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి!

అయితే ఓపికగా మరియు శాంతితో చదవండి.... & ఆపై ముగించండి!


- ఎ.ఎన్.డిసౌజా


*2021*


*బీజేపీ*

  Vs

*కాంగ్రెస్ + లెఫ్ట్ + BSP + SP + TDP + RJD + శివసేన + TMC + DMK + AAP + JDU + NDTV + ABP NEWS + Scroll + The Wire + Award Returning Gang + JNU + Pakistan + China*


*హిందువులు & ముస్లిములు ఇద్దరూ* మోడీ జీని తొలగించాలనుకుంటున్నారు...

కానీ వాటి మధ్య తేడా చూడండి:


ఒక హిందువు పెట్రోల్ ధరను చూస్తున్నాడు

మరియు ముస్లింలు రోహింగ్యా ముస్లింల వైపు చూస్తున్నారు!


జీఎస్టీపై హిందువులు ఆగ్రహంగా ఉన్నారని, కాంగ్రెస్‌ను తీసుకురావాలన్నారు

మరియు ముస్లింలు భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్‌ను తీసుకురావాలనుకుంటున్నారు!


అవినీతి నాయకుల మాటల్లో పడి *నరేంద్ర మోదీ* ని ఎదిరించే వారు భారతదేశంలో చాలా మంది ఉన్నారు!

*మంచిది !!*

ఇది ప్రజాస్వామ్యం... వ్యతిరేకించడం లేదా మద్దతు ఇవ్వడం - మీ హక్కు!!

*అయితే.... మోడీని ఎదిరించి ఎవరికి మద్దతిస్తున్నారు??*


ఇది చాలా తీవ్రమైన ప్రశ్న!!!

కాబట్టి.... నిర్ణయం కూడా సీరియస్‌గా తీసుకోవాలి!


ములాయం, లాలూ, అఖిలేష్, తేజస్వీ యాదవ్, మాయావతి, సోనియా, రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఏచూరీ  వంటి రాజకీయ నాయకులు. ... నరేంద్ర మోడీ కంటే బెటరా???

వారి రికార్డులు ఏమైనా బాగున్నాయా???


గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పదవీకాలం కంటే మమతా బెనర్జీ, అఖిలేష్ తదితరుల పదవీకాలం మెరుగ్గా ఉందా?

మీరు పోల్చి చూడాలనుకుంటే.... గుజరాత్‌లోని ఒక చిన్న నగరానికి వెళ్లి, ఆపై ఇతర రాష్ట్రాల రాజధాని నగరాన్ని సందర్శించండి!


లాలూ, ములాయం రాజకీయాల్లోకి వచ్చాక... వారి రాష్ట్రాల్లో వారి పరిస్థితి దయనీయంగా ఉంది.

సైకిళ్లు, లాంతర్లు కొనుక్కోవడానికి వాళ్ల దగ్గర డబ్బులు లేవు!

ఒకప్పుడు కులం పేరుతో పరుగులు పెట్టిన ఈ నాయకులు... నేడు కోటీశ్వరులు!!!


రాంగోపాల్ యాదవ్ చార్టర్డ్ విమానంలో తిరుగుతున్నాడు.

ఆడిలో శివపాల్ యాదవ్!


అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది??

నరేంద్ర మోడీ కంటే వీళ్ళే బెటరా ??? మోడీజీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఏ బ్యాంకర్‌ని అడిగినా, వారు స్టేట్ బ్యాంక్‌లోని ఒకే ఖాతాను సూచిస్తారు. అతనికి అహ్మదాబాద్‌లో రెండు పడక గదుల ఫ్లాట్ ఉంది.


సోనియా, ఆమె అల్లుడు నేడు బిలియనీర్లు!

వీళ్ళు నరేంద్ర మోడీ కంటే మంచివారా???


35 ఏళ్లు బెంగాల్‌ను పాలించి సర్వనాశనం చేసిన వామపక్షాలు... నరేంద్ర మోడీ కంటే మంచివా ???


ఐదేళ్లుగా... కేజ్రీవాల్ ప్రకటనలు చేస్తూ ఢిల్లీ ప్రజలకు వైఫై, 5000 సీసీటీవీలు, 150 కాలేజీలు, 500 స్కూళ్లు తదితర వాగ్దానాలు చేశారు.

ఈ సోకాల్డ్-ఐఐటీ పండితుడు నరేంద్ర మోడీ కంటే గొప్పవాడా???


మాయావతి తన సహచరుడు కాశీరాంతో కలిసి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు... ఆమె ఇంట్లో దీపం వెలిగించేందుకు కూడా డబ్బులు లేవు. ఆమె సైకిల్‌పై ప్రచారం చేసేది!

ఈరోజు... ఆమె చెప్పు కూడా విమానంలో వస్తుంది... ఆమె సోదరుడి పేరు మీద 497 కంపెనీలు ఉన్నాయి...

నరేంద్ర మోడీ కంటే వీళ్ళు గొప్పా???


*మోడీని వ్యతిరేకించే వారు... ముందుకు సాగండి & వ్యతిరేకించండి!!* 🤷‍♀️

*అయితే... నిర్ణయించుకోండి... ప్రత్యామ్నాయంగా ఎవరికి మద్దతు ఇవ్వాలో!!* 


బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పండి!!

దేశం గురించి కాస్త ఆలోచించండి!!

ఇంకా ఎంత నాశనం చేయాలి??

దోచుకోవడం, పరువు తీయడం ఇంకెంత?


● నేను మోడీని ఎందుకు ఇష్టపడతానో నాకు తెలియదు, కానీ నాకు ఇతర పార్టీలు నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి...


● మంచి రోజులు వస్తాయో లేదో తెలియదు కానీ, భారతదేశానికి మంచి రోజులు రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోడీ తప్ప... మరే రాజకీయ నాయకుడిని చూడలేను!


● మోడీ  భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చగలరో లేదో కూడా నాకు తెలియదు, కానీ భారత-మాతకు మళ్లీ *విశ్వగురువు* హోదా ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!


● మోదీకి చరిత్ర గురించి అవగాహన ఉందా లేదా అనేది నేను పట్టించుకోను, కానీ భవిష్యత్తు కోసం ఆయనకు పూర్తి సన్నద్ధత ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!


ఈ పోస్ట్ చేసిన వ్యక్తి "మోదీ-భక్తుడు" అని నేను అంగీకరిస్తున్నాను & నేను కూడా దానిని భాగస్వామ్యం చేసాను.

కానీ దేవుడు నీకు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు!


కాబట్టి... పూర్తి నిజాయితీతో ఆలోచించండి!

మీ కోసం కాదు... దేశం కోసం


మీరు అంగీకరిస్తే, దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి... దేశ ప్రయోజనాల దృష్ట్యా!


*భారత్ మాతా కీ జై* 🙏🇮🇳

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు - 


 * కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 * యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 * వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 * రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 * పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 * పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 * పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -


 తినవలసిన ఆహారపదార్దాలు -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


           మరెంతో విలువైన మరియు అతి సులభ యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

శ్రీరమణీయం

 _*శ్రీరమణీయం* *-(304)*_

     🌷🌷🌷🌷🌷🌷                                   

_*"పూజలతో దైవం అనుగ్రహిస్తుందా ?"*_


_*పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమేగానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నంకాదు. ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరు అంటుంటారు. అంటే ఇరవై ఏళ్ళ అశ్రద్ధ వారిలో ఉందని అర్థం. భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు. పిల్లవాడికి జబ్బుచేస్తే ఏడుకొండల వాడిని ఒకక్షణంపాటు మొక్కుకుంటాం. అక్కడ దేవుని రూపంతోగాని, స్మరించే కాలంతోగానీ పనిలేకుండానే కోరిక నెరవేరుతుంది. పిల్లవానికి జబ్బు తగ్గిన తర్వాత కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాం కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోరిక తీరుస్తానని దేవుడు చెప్పటంలేదు. క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటలకొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది ! ఒక రూపంపై మనసు నిలిపే శిక్షణకోసం విగ్రహం ఎలా అవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ కూడా అంత అవసరమైంది. అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణ, ఎక్కువసేపు నిలిపేందుకే పూజ అవసరం ! పూజ మనసు బాగుచేసుకొనే సాధన !!*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన !'*- 


🌷🌷🌷🌷🌷🌷🌷

మూర్ఖుడి లక్షణములు

 *ॐ卐 _-|¦¦|-సుభాషితమ్|¦¦|-_*ॐ


శ్లో𝕝𝕝 నిర్ధనశ్చాపి కామార్థీ 

దరిద్రః కలహప్రియః।

మన్దశాస్త్రో వివాదార్థీ 

త్రివిధం మూర్ఖలక్షణమ్॥


తా𝕝𝕝 తగినంత ధనము లేకున్ననూ *స్థాయికి మించి కోర్కెలు కోరుకోవడం*, దరిద్రుడయ్యునూ *తోటివారితో గొడవకు సిద్ధపడటం*, శాస్త్రజ్ఞానం లేకున్ననూ *మొండిగా వాదించడం - ఇవి మూడు మూర్ఖుడి లక్షణములు*....

*ధర్మ నిష్ఠ*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*ధర్మ నిష్ఠ* 


రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది?      రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?


కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు.


నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం".


ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.


ఇందులోని విచిత్రమేమిటంటే  ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.


తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక   "అస్త్ర శస్త్రాలను"   కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.


అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.


*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  | |*

 

*అని ఉపనిషద్వాక్యం.*


ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము ,   వేదశాస్త్రముల అధ్యనము,    శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట,  అంతరింద్రియ నిగ్రహము,  దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే.


దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు.  మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.


కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.


అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు.  కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".


 ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.

జీవితం కూడా అంతే

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹


    👏👏👏👏👏👏👏👏👏👏👏

                  *విత్తనం తినాలని*

                 *చీమలు చూస్తాయ్*..

                *మొలకలు తినాలని*

                 *పక్షులు చూస్తాయ్*..

           

                 *మొక్కని తినాలని*

                *పశువులు చూస్తాయ్*


                 *అన్ని తప్పించుకుని*

             *ఆ విత్తనం వృక్షమైనపుడు*..


            *చీమలు, పక్షులు, పశువులు*..

         *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....


            *జీవితం కూడా అంతే TIME*

          *వచ్చే వరకు వేచివుండాల్సిందే*

          *దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....        


               *లైఫ్ లో వదిలి వెళ్ళిన*

           *వాళ్ళ గురించి ఆలోచించకు*..


              *జీవితంలో ఉన్న వాళ్ళు*

              *శాశ్వతం అని భావించకు*..


           *ఎవరో వచ్చి నీ బాధను అర్థం*

           *చేసుకుంటారని ఊహించకు*...


              *నీకు నీవే ధైర్యం కావాలి*.....

          *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...


                  *లోకులు కాకులు,*

                 *మనిషిని చూడరు*,

              *మనస్సును చూడరు,*

              *వ్యక్తిత్వాన్ని చూడరు.*


                     *కనిపించింది,*

            *వినిపించింది నమ్మేస్తారు*,

                 *మాట అనేస్తారు,*


                 *ఒక్కోసారి మన కళ్ళే*

              *మనల్ని మోసం చేస్తాయి.*


           *మరొకసారి చెప్పుడు మాటలు*

                        *జీవితాలను*

                  *తలకిందులు చేస్తాయి*


             *అబద్దాలతో, మోసాలతో*

                   *కీర్తి, ప్రతిష్టలను*

         *ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..

          *అవి కుప్పకూలి పోవడానికి*

               *ఒక్క "నిజం"చాలు*.

             *అందుకే కష్టమైనా సరే*

          *నీతిగా బ్రతకడమే మనిషికి*

                  *ఉత్తమ మార్గం.*

         

                *ఒక చిన్న మొక్కనాటి*

      *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*      

                   *చూడకూడదు.*


             *ఎందుకంటే అది పెరగాలి*

                *మొక్క వృక్షం కావాలి*

          *పుష్పించాలి, పిందెలు రావాలి*

         *అవి కాయలై , పండితే తినగలం.*


              *అలాగే నేను ఇది కావాలి*

              *అనే కోరిక కూడా మొలకై*

       *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*    

         *మసలుకోండి సన్నిహితులారా*🌹


               *జీవితంలో కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


                    🌹🌹🌹🌹

    


                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు నేస్తమా* !


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*

          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,

         *నొప్పి విలువ తెలిసిన వాడు*

          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*

    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

         

  


                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*

             *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* 

                   *కానీ ఆత్మేయిత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు*

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*

                     *కానీ జీర్ణశక్తిని కాదు*

                     🌹🌹🌹🌹🌹

      


        *ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*

      *అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*

                          *కావాలి,*


       *స్నానాలతోనే పాపాలు పోతే ముందు*

           *చేపలే పాప విముక్తులు కావాలి,*


           *తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*

          *పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*

             *గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*


           *ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*

  *నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*

       *పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,


             *నీలో లేనిది బయటేమీ లేదు* 

          *బయటఉన్నదంతా నీలోనూ ఉంది*


        *తెలిసి మసులుకో  --  కలిసి జీవించు.....*

             *సర్వే జనా సుఖినోభవంతు* 

                     🙏*🙏* 🙏🏻


👏👏👏👏👏👏👏👏👏