5, జులై 2026, ఆదివారం

తిప్పతీగ ఉపయోగాలు

 తిప్పతీగ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .


తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం. " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం. ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను.


తిప్పతీగ యందలి ఔషధ గుణములు -


• ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును .


• జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును.


• మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును.



• కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును.


• ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును.


• తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును.


• తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు.


• తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును.


• తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును.


• తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది.


• మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను .


• తిప్పతీగ కషాయాన్ని సేవించిన వాంతులు తగ్గును.



ఆయుర్వేద ఔషధాలు

   ఆయుర్వేద ఔషధాలు సేకరించే విధానము -


ఆయుర్వేదం ఔషధాలను ఒక ప్రత్యేక మయిన పరిస్థితులు , ఒక నిర్దిష్టమైన సమయం లొ మాత్రమే ఔషదులని గ్రహించాలి. అటువంటి ఔషధాలు మాత్రమే పరిపూర్ణం గా పనిచేస్తాయి.

ఔషధాలు ఎంత శక్తివంతం గా పనిచేస్తాయి అనేది ఆ ఔషధి ఉన్నటువంటి నేల కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఔషధాలను జాగ్రత్తగా తీసుకుని వచ్చి వాడినప్పుడే శరీరం పైన వాటి ప్రభావాన్ని బలం గా చూపిస్తాయి.


  ఔషధాలు సేకరించు స్థలం -


ఋతువులు సరిగా ఏర్పడుతూ ఉండాలి. వెన్నెల, నీరు , గాలి కాలానుసారం గా ఉండాలి. అట్టి స్థలం లొ ప్రదిక్షణం గా ప్రవహించుచున్న నీరు కలిగి ఉండి దర్భ మొదలయిన మొక్కలచే వ్యాపించి అట్టి మన్ను నల్లగా కానీ బంగారు రంగులొ కలిగి ఉన్నది అయ్యి సువాసనలుతో కుడుకొని ఉన్నది అయి ఉండాలి. అచ్చట గండ్ర ఇసుక, చౌడు, గులక రాళ్లు , గోతులు, పుట్టలు మొదలయినవి ఉండకుడదు. మరియు అచ్చటి భూమి రాజవీధి , స్మశానం, ఇండ్లు, రచ్చబండ, ఉద్యానవనం వీటి సమీపం లొ ఉండకుడదు. నాగలిచే దున్నబడక వృక్షములను ఆవరించి ఉండవలెను.

పురుగులు కలదియు, సర్వ కాలంబులు నీరుచే వ్యాప్థమైపొయి , పూర్వం చెప్పిన గుణములు లేనిది అయ్యి, పిశాచములు కలిగి ఉన్న భూమిలో పుట్టిన ఔషధాలు పనికి రావు . విస్తారంగా స్థూల వృక్షాలు, గసువు, పైరు మొదలగు వానిచే ఉండి గట్టిగా ఉండి, బరువు కలిగి అనేక పాషానాలతో ఉండి శ్యామల వర్ణం కలిగి, నల్లని వర్ణం కలిగిన భూమి లొ చాలా అదిక గుణం కలిగిన ఔషధాలు ఉండును. భూమి యెక్క గుణం ఏ విదంగా ఉండునో ఆ ఔషధీ గూడా అదే విదంగా ఉండును.


• భూమి గుణాలు -


   పృథ్వి, ఉదక గుణములు కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు విరేచానకారులు అవును. ఆకాశ గుణం కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు వమన కారిణి గా ఉంటాయి. పంచ భూతముల లక్షణాలు కలిగిన భూమి లొ పుట్టిన ఔషధాలు వమన కారిణులు , విరేచన కారిణులు అవును.


• ఔషధాలు సేకరించే విదానం -


     ఔషధాలను సేకరించాలి అనుకున్న వైద్యుడు పూర్వపు రోజున ఉపవాసం ఉండి పవిత్రుడి గా ఉండి దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, బ్రహ్మ్మను, దక్షప్రజపతిని , అశ్విని దేవతలను పూజించి నాలుగు దిశలలో బలి ని సమర్పించి ఆ ఔషధిని ఆశ్రయించి ఉండు సమస్త దేవతలను గూర్చి " ఓ దేవతలారా నన్ను నిరపరాధుని చేసి మీరు ఆశ్రయించి ఉండు ఈ ఔషధిని విడిచి పొండు సర్వ ప్రాణ కోటికి జీవ పదార్ధంబైన ఈ ఔషధిని నేను గ్రహించేదను. మరియు ఓ దేవతలారా నేను ఈ ఔషధిని లోభం కొసం గ్రహించడం లేదు . ప్రధానం గా బ్రాహ్మ్మన రక్షణార్ధం అని ప్రార్ధించి నానా వర్ణములు గల దారాలతో ఆ ఔషధానికి రక్షాబంధనం చేసి పిమ్మట గృహమునకు పోవలెను.

           మరునాడు తను రక్షాబంధనం కట్టిన ఔషధి దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించ వలెను. తాను కట్టిన రక్షాబంధం పూర్వం వలె ఉండి అక్కడ మరేటువంటి వికారములు లేకుండుట చూచి బ్రహ్మ్మనుల చేత స్వస్తివాచకం చెప్పించుకొనుచూ అక్కడికి వచ్చి సూర్యుడు ఉదయించి నడినెత్తికి రాగా "ఖనన మంత్రం " ప్రకారం ఆ ఔషధి యెక్క తూర్పు వైపు బారిన వేరును అయినా ఉత్తరం వైపు బారిన వేరును అయినా తవ్వవలెను.


• ఖనన మంత్రం -


    ఔషధి కొసం తవ్వేప్పుడు ఖనన మంత్రం ఖచ్చితం గా పటించాలి ." బ్రహ్మ, విష్ణు వుని యే హస్తం చే తవ్వేధరో అట్టి అయిదు వేళ్ళు గల చేతితో నిన్ను తవ్వేదను". ఇదియే ఖనన మంత్రం. దీని చేత ముందు చెప్పిన ప్రకారం తవ్వాలి.


• గ్రహణ మంత్రం -

   

      "మంగళ కరం అగు ఔషధి నీకు నమస్కారం .మీకు శుభం ఔషదులార . బలవంతం లగుదురు కాక .ఒక్కోనియందు వీర్యం కలగ చేయుడు .మీకు ప్రార్దిన్చేదను అని మంత్రం చెప్పి ఔషధిని పట్టుకోవలెను.


• ఔషధిని పుచ్చుకునే ముందు మంత్రం


  ఔషధి శ్రేష్టమ మంగళం విగ్నం లను మిక్కిలి దహించుము . మిక్కిలి నశింప చేయుము . మిక్కిలి చీల్చుము. నీకు నమస్కారము. అని ఈ మంత్రం చెప్పి ఔషధిని లొపలికి పుచ్చుకోవలెను.


• వ్యర్ధ ఔషధాలు -


      పురుగు కుట్టినది. నీటిలో మునిగినది. మేకలు తినినది. పిశాచముల చేత వికారం పొందింది. ఎల్లప్పుడు నీడనే ఉన్నది. నీటిచేత తడియక ఎండినది . చెట్ల సందుల ఎందు ఉండినది. నడిచే దారిలో ఉన్నది. పది మందికి తెలిసినది సారం లేనిది గాని ఔషధములు వాడ రాదు. ఒకవేళ వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే చంద్రగ్రహణ సమయం లొ , మరియొక రాత్రులలో గానీ మూలికలు గ్రహింప కూడదు .


• ములికలు గ్రహింప వలసిన కాలం -


వర్ష ఋతువు నందు కొమ్మలు, వసంత ఋతువు నందు చిగురుటాకులు, శిశిర ఋతువు నందు , గ్రీష్మ ఋతువు నందు పండుటాకులను , మొలకెత్తు ఆకులను, మూలములను గ్రహించాలి.



రుణానుబంధరూపేణ

 రుణానుబంధరూపేణ పశు పత్నీ సుతాలయాః ।

రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా ॥


తాత్పర్యం:

పూర్వకర్మల వల్ల ఏర్పడిన రుణానుబంధాలే ఈ జన్మలో బంధాలుగా కనిపిస్తాయి. ఆ రుణం తీరిన క్షణం, ఆ బంధం కూడా ముగుస్తుంది. అందుకే కలయికకైనా... విడిపోవడానికైనా... అతిగా శోకించవద్దని ఋషులు హెచ్చరించారు.


---


ఈ లోకం కోసం నువ్వు పుట్టలేదు...

నీ కర్మను అనుభవించడానికి ఈ లోకమే నీ చుట్టూ అల్లబడింది.


తల్లిదండ్రులు...

భార్య... భర్త...

పిల్లలు...

బంధువులు...

స్నేహితులు...

శత్రువులు కూడా...


వీరిలో ఒక్కరూ యాదృచ్ఛికంగా రాలేదు.


నీ కర్మఫలాన్ని నీకు అందించడానికి వచ్చిన పాత్రలు మాత్రమే.


ఎవరు ప్రేమ ఇస్తారో...

ఎవరు బాధ ఇస్తారో...

ఎవరు గౌరవిస్తారో...

ఎవరు అవమానిస్తారో...


అన్నీ నీ పూర్వకర్మల ప్రతిధ్వనులే.


"వీళ్లు నావాళ్లు" అనేది మనసు సృష్టించిన మాయ.

"వాళ్లు నా జీవితమే" అనేది అహంకారం చెప్పే అబద్ధం.


చివరికి...


నీతో రానిది సంపద.

నీతో రానిది బంధం.

నీతో రానిది పేరు, ప్రతిష్ఠ.


నీతో వచ్చేది...

నీతో వెళ్లేది...

నీకు ఫలితాన్ని ఇచ్చేది...


నీ కర్మ మాత్రమే.


భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడు...


ఆయన నీ జీవితంతో ఆట ఆడటం లేదు.

నీ కర్మకు తగిన ఫలితాన్ని అందించే అవకాశాలను మాత్రమే నీ ముందుంచుతున్నాడు.


అందుకే...


ఏదీ శాశ్వతమైన గెలుపు కాదు...

ఏదీ శాశ్వతమైన ఓటమి కాదు...

ఏదీ శాశ్వతమైన బంధం కాదు...


ఇది అంతా...


కర్మ అనే మహానాటకంలో ఒక క్షణం మాత్రమే.


బంధాల మీద కాదు...

కర్మ మీద దృష్టి పెట్టు.


ఎందుకంటే...

బంధాలు మారిపోతాయి.

కర్మ మాత్రం నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు.


> "నీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి...

నిన్ను ప్రేమించడానికి కాదు, ద్వేషించడానికి కాదు...

నీ కర్మఫలాన్ని అందించడానికి మాత్రమే వచ్చాడు.

అది పూర్తయిన రోరుణానుబంధరూపేణ పశు పత్నీ సుతాలయాః ।

రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా ॥


తాత్పర్యం:

పూర్వకర్మల వల్ల ఏర్పడిన రుణానుబంధాలే ఈ జన్మలో బంధాలుగా కనిపిస్తాయి. ఆ రుణం తీరిన క్షణం, ఆ బంధం కూడా ముగుస్తుంది. అందుకే కలయికకైనా... విడిపోవడానికైనా... అతిగా శోకించవద్దని ఋషులు హెచ్చరించారు.


---


ఈ లోకం కోసం నువ్వు పుట్టలేదు...

నీ కర్మను అనుభవించడానికి ఈ లోకమే నీ చుట్టూ అల్లబడింది.


తల్లిదండ్రులు...

భార్య... భర్త...

పిల్లలు...

బంధువులు...

స్నేహితులు...

శత్రువులు కూడా...


వీరిలో ఒక్కరూ యాదృచ్ఛికంగా రాలేదు.


నీ కర్మఫలాన్ని నీకు అందించడానికి వచ్చిన పాత్రలు మాత్రమే.


ఎవరు ప్రేమ ఇస్తారో...

ఎవరు బాధ ఇస్తారో...

ఎవరు గౌరవిస్తారో...

ఎవరు అవమానిస్తారో...


అన్నీ నీ పూర్వకర్మల ప్రతిధ్వనులే.


"వీళ్లు నావాళ్లు" అనేది మనసు సృష్టించిన మాయ.

"వాళ్లు నా జీవితమే" అనేది అహంకారం చెప్పే అబద్ధం.


చివరికి...


నీతో రానిది సంపద.

నీతో రానిది బంధం.

నీతో రానిది పేరు, ప్రతిష్ఠ.


నీతో వచ్చేది...

నీతో వెళ్లేది...

నీకు ఫలితాన్ని ఇచ్చేది...


నీ కర్మ మాత్రమే.


భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడు...


ఆయన నీ జీవితంతో ఆట ఆడటం లేదు.

నీ కర్మకు తగిన ఫలితాన్ని అందించే అవకాశాలను మాత్రమే నీ ముందుంచుతున్నాడు.


అందుకే...


ఏదీ శాశ్వతమైన గెలుపు కాదు...

ఏదీ శాశ్వతమైన ఓటమి కాదు...

ఏదీ శాశ్వతమైన బంధం కాదు...


ఇది అంతా...


కర్మ అనే మహానాటకంలో ఒక క్షణం మాత్రమే.


బంధాల మీద కాదు...

కర్మ మీద దృష్టి పెట్టు.


ఎందుకంటే...

బంధాలు మారిపోతాయి.

కర్మ మాత్రం నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు.


> "నీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి...

నిన్ను ప్రేమించడానికి కాదు, ద్వేషించడానికి కాదు...

నీ కర్మఫలాన్ని అందించడానికి మాత్రమే వచ్చాడు.

అది పూర్తయిన రోజు...

అతను వెళ్లిపోతాడు.

కాబట్టి బంధాలను కాదు... కర్మను అర్థం చేసుకోజు...

అతను వెళ్లిపోతాడు.

కాబట్టి బంధాలను కాదు... కర్మను అర్థం చేసుకో

మోక్షాన్వేషణలో

 🌷మోక్షాన్వేషణలో

అనారోగ్యంతో బాధపడుతున్న నా తండ్రిని కాశీలోని ముక్తి భవన్‌కు తీసుకువెళ్లే ప్రయాణంలో నేను ఉన్నాను, ఆయన త్వరగా చనిపోవాలని ఆశిస్తూ...

నేను అక్కడికి వెళ్లాలని కోరుకున్నందున కాదు. నా తండ్రికి నిరంతరం వచ్చే అనారోగ్యాలు, ఆయన బలహీనత, మందులు మరియు చికిత్స కోసం అయ్యే అంతులేని ఖర్చులు నన్ను పూర్తిగా కుంగదీశాయి. ఆయన సంరక్షణ కోసం నేను ఇప్పటికే చాలా ఖర్చు చేశాను, ఇకపై ఇలా కొనసాగించలేనని నేను అనుకోవడం ప్రారంభించాను.

ఆ సమయంలోనే ఒక ఆప్తమిత్రుడు నాకు కాశీలోని ముక్తి భవన్ గురించి చెప్పాడు.

హిందూ నమ్మకం ప్రకారం, కాశీలో మరణిస్తే ముక్తి (మోక్షం) లభిస్తుందని, ప్రజలు తమ చివరి రోజులను గడపడానికి ముక్తి భవన్ అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి అని అతను చెప్పాడు. "నువ్వు నీ తండ్రిని అక్కడికి తీసుకెళ్తే, నీకు ప్రశాంతత లభిస్తుంది, మీ నాన్నగారికి మోక్షం లభిస్తుంది" అని అతను చెప్పాడు.

అలా, ఒక రోజు, నేను నా తండ్రితో కలిసి రైలు ఎక్కాను.

మా నాన్న కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నారు. ఆయన ముఖంలో అలసట సంకేతాలు కనిపిస్తున్నాయి, కానీ ఆయన కళ్లు ప్రశాంతంగా ఉన్నాయి.

"మనం ఎక్కడికి వెళ్తున్నాం, నాన్నా?" అని అడిగారు.

"కాశీకి."

"కాశీకా? ఓ నా పరమశివా! ఎన్నేళ్లుగానో నేను ఈ ప్రయాణం చేయాలనుకుంటున్నాను."

ఆయన ముఖంలో కనిపించిన ఆ ఆనందం నా గుండెను పిండేసింది. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు.

ప్రయాణమంతటా నాన్న గతాన్ని గురించే మాట్లాడుతుండేవారు.

నేను చిన్నప్పుడు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆయన నాతో ఎలా హాస్పిటల్‌లో ఉన్నారో చెప్పారు.

నా స్కూల్ ఫీజు కట్టడానికి మా అమ్మ తన గాజులను ఎలా అమ్మిందో చెప్పారు.

నాకు కావలసిన సైకిల్ కొనడానికి ఆయన అర్ధరాత్రి వరకు ఆటో-రిక్షా ఎలా నడిపారో చెప్పారు.

నేను విన్నాను.

కానీ నాకు మాట్లాడటానికి చాలా తక్కువ మాటలు ఉన్నాయి.

సుదీర్ఘ ప్రయాణం తర్వాత, మేము వారణాసి చేరుకుని ముక్తి భవన్‌కు వెళ్లాము.

నేను అక్కడ ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని, మరణం యొక్క నిశ్శబ్దాన్ని ఆశించాను.

కానీ నేను చూసింది మరేదో.

చిన్న గదులు. తెల్లటి గోడలు. పాత సీలింగ్ ఫ్యాన్లు నెమ్మదిగా తిరుగుతున్నాయి. మరణం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం సాధువులు కారిడార్లలో నడుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.

మాకు కేటాయించిన గదిలో నా తండ్రిని కూర్చోబెట్టాను.

"నాకు చాలా అలసటగా ఉంది, నాన్నా. కొద్దిసేపు పడుకుంటాను."

నేను తల ఊపాను.

ఆయన నిద్రపోవడం చూసిన మరుక్షణమే, నేను టేబుల్ మీదున్న నా బ్యాగ్ తీసుకుని బయటకు నడిచాను.

నేను వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా వెళ్తుండగా, ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటం గమనించి లోపలికి చూశాను.

ఒక వృద్ధుడు కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నాడు. ఆయన చేతిలో ఒక పాత ఫోటో ఉంది—బహుశా ఆయన భార్యదో లేదా పిల్లలదో కావచ్చు. అప్పుడప్పుడు ఆ ఫోటో చూసి నవ్వుకుంటున్నాడు.

మరో గదిలో, ఒక వృద్ధురాలు కళ్లు మూసుకుని, చేతిలో జపమాలతో ప్రార్థన చేస్తూ కూర్చుని ఉంది.

ఆమె పక్కన ఎవరూ లేరు.

కానీ ఆమె ఒంటరిగా లేదు.

ఆమె జ్ఞాపకాలు ఆమెతో ఉన్నాయి.

కారిడార్ చివర, ఒక వృద్ధ తండ్రి మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆయన పక్కన ఒక యువకుడు ఆయన చేతిని పట్టుకుని కూర్చున్నాడు.

"నాన్నా, నేను ఇక్కడే ఉన్నాను," అని అతను అంటున్నాడు. "భయపడకు."

ఆ ముసలాయన వినగలిగాడో లేదో నాకు తెలియదు.

కానీ ఆ కొడుకు గొంతులో ప్రేమ ఉంది.

అక్కడ ఉన్న వారంతా మరణం కోసం ఎదురుచూస్తున్నారు.

కానీ వారిలో చాలామంది మరేదో దాని కోసం ఎదురుచూస్తున్నారని నాకు అనిపించింది.

ఒక ఫోన్ కాల్.

ఒకరి సందర్శన.

ఒక కొడుకు ఓదార్పు మాటలు.

ఒక కుమార్తె "నాన్నా..." అని పిలిచే గొంతు.

దాని కోసమే వారు నిజంగా ఎదురుచూస్తున్నారు.

అక్కడి ఒక కార్మికుడు నన్ను గమనించి ఇలా అన్నాడు:

"ఇక్కడికి వచ్చే చాలా మంది మరణానికి భయపడరు సార్. వారిని ఎక్కువగా బాధించేది ఏమిటంటే, తమ ప్రియమైనవారు తమను మర్చిపోయారనే భావన. ఇక్కడ చనిపోతే మోక్షం వస్తుందని అంటారు, కానీ మీ స్వంత పిల్లల మధ్య ప్రశాంతంగా చనిపోవడానికి, ఇక్కడ ఒంటరిగా చనిపోవడానికి చాలా తేడా ఉంది."

అతను ఇలా కొనసాగించాడు:

"ఇక్కడికి వచ్చే చాలా మంది ప్రజలు త్వరగా చనిపోతారు—అనారోగ్యం వల్ల కాదు, తమ పిల్లలు తమను వదిలేశారని గ్రహించినప్పుడు వారి హృదయాలు పగిలిపోవడం వల్ల."

ఆ మాటలు నన్ను కదిలించివేసాయి.

నేను చుట్టూ చూశాను.

కొన్ని కళ్ళు తలుపు వైపు చూస్తున్నాయి—

ఎవరైనా వస్తారేమో అని.

కొన్ని కళ్ళు ఆకాశం వైపు చూస్తున్నాయి—

ఎవరైనా పిలుస్తారేమో అని.

మరికొన్ని కళ్లలో అసలు ఆశే లేదు.

కేవలం ఎదురుచూపు మాత్రమే.

హఠాత్తుగా, నాకు నా తండ్రి గుర్తుకు వచ్చాడు.

నేను వెనక్కి తిరిగి పరిగెత్తాను.

నేను గదిలోకి ప్రవేశించేసరికి, నా తండ్రి మంచం మీద కూర్చుని, చెమటతో తడిసి, బలహీనంగా కనిపిస్తున్నారు.

ఆయన కూడా తెరిచి ఉన్న తలుపు వైపు చూస్తున్నారు.

నన్ను చూడగానే ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

నేను అనుకున్నాను:

నేను ఇప్పుడు వెళ్ళిపోతే, రేపు ఆ తలుపు దగ్గర ఎదురుచూసే మరో ముఖంగా మా నాన్న కూడా మారిపోరా?

ఆ క్షణంలో, ముక్తి భవన్ ఇకపై కేవలం ఒక భవనంలా అనిపించలేదు.

తమ జీవితమంతా ఇతరులను చూసుకోవడానికి గడిపిన వ్యక్తులు, ఒక చివరి ప్రేమ స్పర్శ కోసం ఎదురుచూసే ఒక నిశ్శబ్ద ప్రపంచంలా అనిపించింది.

ఈ ఆలోచనలలో మునిగిపోయి ఉండగా, మా నాన్న పిలవడం విన్నాను.

"నాన్నా..."

"చెప్పండి నాన్నా?"

"నువ్వు వెళ్ళలేదా?"

"నేను ఎక్కడికి వెళ్తాను?"

"నన్ను ఇక్కడే వదిలేయడానికి నువ్వు నన్ను తీసుకువచ్చావని నాకు తెలుసు."

ఆయన కాసేపు ఆగారు.

"కానీ నేను నిన్ను నిందించడం లేదు. తల్లిదండ్రులు ముసలివారైనప్పుడు, వారు కొన్నిసార్లు తమ పిల్లలకు భారంగా మారుతారు. బహుశా నేను కూడా నీకు భారంగా మారానేమో."

ఆ తర్వాత ఆయన నా చేతిని గట్టిగా పట్టుకున్నారు.

"కానీ ఒక విషయం గుర్తుంచుకో నాన్నా..."

"తల్లిదండ్రులకు గొప్ప మోక్షం కాశీలో చనిపోవడం కాదు. తమ పిల్లల హృదయాల నుండి దూరం కాకపోవడం."

"దయచేసి నన్ను ద్వేషించకు నాన్నా. నేను చనిపోయిన తర్వాత, నాకు కర్మకాండలు చేయి."

ఆ మాటలు నన్ను ముక్కలు చేశాయి.

"ఇక్కడ ఎక్కువ సేపు ఉండకు నాన్నా, వెళ్ళు. కానీ నువ్వు వెళ్ళే ముందు, నీ తండ్రిని ఒకసారి కౌగిలించుకుని ముద్దు పెట్టుకో. నిన్ను ఇంకొక్కసారి దగ్గరకు తీసుకోవాలని అనిపిస్తోంది."

ఆయన చివరి కోరిక.

"నాన్నా..."

నేను వెక్కి వెక్కి ఏడ్చాను.

సంవత్సరాల స్వార్థం, లెక్కలు నా కన్నీళ్లలో కరిగిపోయాయి.

ఆ రాత్రి, నేను ముక్తి భవన్ గదిలో నా తండ్రి పక్కనే పడుకున్నాను.

నిద్రపోతున్న ఆయన ముఖం మీది ముడతలను చూస్తున్నప్పుడు నాకు ఒక నిజం తెలిసింది:

నా జీవితంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం ఒకప్పుడు ఈ మనిషి భుజం.

నేను భయపడినప్పుడు నన్ను పట్టుకున్నది ఆయనే.

నేను పడిపోయినప్పుడు నన్ను లేపింది ఆయనే.

నేను విఫలమైనప్పుడు నా వెన్నంటి నిలిచింది ఆయనే.

మరి ఆయన చివరి సంవత్సరాల్లో నేను ఆయన్ని ఎలా వదిలేయగలను?

మరుసటి రోజు ఉదయం, నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాను.

మేము బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, ముక్తి భవన్ సిబ్బంది నా తండ్రి ప్రశాంతమైన మరణం కోసం ప్రార్థనలు చేయడానికి సాధువులను తీసుకువచ్చారు.

నేను వారిని ఆపాను.

"ఇక దాని అవసరం లేదు" అని చెప్పాను.

"మోక్షం పొందింది నా తండ్రి కాదు.

నేనే మోక్షాన్ని పొందాను."

మా నాన్న ఆశ్చర్యంగా నా వైపు చూశారు.

"ఏమిటి నాన్నా నీ ఉద్దేశ్యం?" అని అడిగారు.

నేను ఆయన చేతిని పట్టుకున్నాను.

"ఇంటికి వెళ్దాం నాన్నా. కానీ ముందుగా గంగలో స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించుకుందాం."

"అయితే, నేను ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదా?" అని ఆయన అడిగారు.

"మీరెందుకు ఉండాలి?"

*"విముక్తి కావాల్సింది మీకు కాదు. నా హృదయానికి—నా స్వంత తండ్రిని ఒక భారంగా చూసిన నా హృదయానికి"*

మా నాన్న కళ్లు కన్నీళ్లతో నిండాయి.

ఆ క్షణంలో, కాశీ గుడి గంటల నాదం కంటే పవిత్రమైనది ఆ వృద్ధుడి ముఖంపై నుండి జారిన నిశ్శబ్ద కన్నీటి చుక్క.

❤️

గమనిక: *తమకు నడక నేర్పిన తల్లిదండ్రుల చేతులను ఎన్నటికీ వదిలేయకపోవడమే పిల్లల బాధ్యత. తల్లిదండ్రులకు మరణం కంటే బాధాకరమైనది ఒంటరితనం, అనారోగ్యం కంటే వినాశకరమైనది తమ స్వంత పిల్లలే తమను మర్చిపోయారనే భావన*

కథ: *"మోక్షాన్వేషణలో" (In Search of Moksha)*

*పిల్లలందరికీ మరియు తండ్రులందరికీ అంకితం*🙏🇮🇳👏