🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
👌 _*ఆప్తవాక్యము* 85_ 👌
✳️ _*సుసందృశం త్వా వయం మఘవన్ వన్దిషీమహి*_ 🙏
💐 _*యజ్ఞస్వరూపా! చక్కగా దర్శిస్తున్న నీకు మేము వందనము చేస్తున్నాము♪.*_
-- యజుర్వేదం
🪷 జగత్కారణుడైన భగవానుని స్తుతిస్తూ వేదం - _*సుసందృశం త్వావయం మఘవన్ వన్దిషీమహి*_ అని పలికింది♪. భగవానుడు సర్వసమగ్ర దృష్టి కలవాడు♪. ఆయన చూపు శక్తిమంతమైనది♪.
_*'అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః'*_ అని శ్రుతిచెప్పినట్లుగా సృష్టిలో ప్రత్యణువున బహిరంతరాలలో వ్యాపించిన పరమేశ్వరుడు అన్నిటినీ సమగ్రంగా దర్శిస్తున్నారు♪.
✳️ _*[భగవానుడు చూస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు పాపం చేయడు♪. ఆయనకు ప్రీతికరమైన సత్కర్మనే ఆచరిస్తాడు♪. ఇలా ధార్మికంగా అతడు జాగ్రత్తపడతాడు♪. అంతేకాదు - ఆయన గమనించుకుంటున్నాడు కనుక, దేనికీ వెరవకుండా ధైర్యంగా, అభయస్థితిలో ఉంటాడు♪. ఇలా ధర్మనిష్ఠనీ, అభయాన్నీ ఇవ్వగలిగే సత్యస్ఫురణ ఈ వేదవాక్యంలో విశదమవుతోంది♪.]*_
🪷 *'సుసందృశం'* అనే మాట చాలా చక్కనిది. సమ్యగ్‌దృష్టి - సదృశం. సర్వకాల జ్ఞానము, సర్వభూత జ్ఞానము కలవాడు భగవానుడు♪. జీవులది పరిచ్ఛిన్న దృష్టి. పరిమితంగానే చూడగలడు, పరిమితంగానే భావించగలడు. కానీ భగవానునిది అపరిచ్ఛిన్న దృష్టి. అనంత దర్శనశక్తి సంపన్నుడు. కాలపరంగా, దేశపరంగా అనంతత్వమది. అపరిమితమై, సర్వవ్యాపకమైన దృష్టిలో జీవుల కర్మలను గమనిస్తూ, తదనుగుణ ఫలాలను అందిస్తూ విశ్వాన్ని నిర్వహిస్తున్న విశ్వేశ్వరుడతడు♪. అది సమగ్రమైన దృష్టి♪. ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలిసిన స్వామి సర్వకాలాలలోను సర్వజీవులను గమనించుకుంటున్నాడు. అందుకే _*"సహస్రాక్షః, సుదర్శనః, సులోచనః, సాక్షీ సర్వదర్శీ"*_ అనే నామాలతో నారాయణుని స్తుతించారు♪.
🪷 భగవానుడు సర్వమును తెలిసినవాడనే భావం ఈ వాక్యంలో స్పష్టమౌతోంది♪. సూర్యుడు, చంద్రుడు, పగలు-రాత్రి (కాలము), అంతఃప్రజ్ఞ, నక్షత్రాలు...ఇవన్నీ పరమేశ్వరుని దర్శన శక్తులు. ఇవన్నీ కూడా ప్రతి జీవుని కర్మలను గమనించే సాక్షి స్వరూపాలు♪.
🪷 ఇవన్నీ భగవానుని నేత్రాల వంటివి. వీటి కన్ను ఎవరూ కప్పలేరు. భగవానుని చూపు మనపై ఎల్లప్పుడూ ఉన్నదనే జ్ఞానం ఈ వాక్యంలో ద్యోతకమౌతోంది♪. ఈ వాక్యాన్ని స్పృహలో ఉంచుకుంటే చాలు మనకు జాగ్రత్త, ధైర్యం కలుగుతాయి. భగవానుడు చూస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు పాపం చేయడు. ఆయనకు ప్రీతికరమైన సత్కర్మలనే ఆచరిస్తాడు. ఇలా ధార్మికంగా అతడు జాగ్రత్తపడతాడు. అంతేకాదు - ఆయన గమనించుకుంటున్నాడు కనుక, దేనికీ వెరవకుండా ధైర్యంగా, అభయస్థితిలో ఉంటాడు. ఇలా ధర్మనిష్ఠనీ, అభయాన్నీ ఇవ్వగలిగే సత్యస్ఫురణ ఈ వేదవాక్యంలో విశదమవుతోంది.
🪷 _*'సందృశం'*_ అనే మాటకు ముందు 'సు' అనే శబ్దం కూడా ఉంది. ఈ 'సు' శబ్దానికి శుభం, క్షేమం, మంచి, చక్కని... అని అర్థాలున్నాయి. స్వామి చూపులు శుభమైనవి, క్షేమమైనవి, ప్రసన్నమైనవి, సౌందర్యవంతమైనవి.... అని అర్థాలు గ్రహించవచ్చు♪. స్వామి దర్శనశక్తి జగతికి క్షేమాన్నీ, మంగళాన్నీ కలిగిస్తోంది♪.
🪷 ఈ భావాన్ని మరింతగా బలపరుస్తూ 'మఘవన్' అనే మాట ఉన్నది♪. పూజ్యుడు, యజ్ఞస్వరూపుడు అనే అర్థాలను ఈ మాటకు చెప్పుకోవచ్చు♪.
🙏 _*లోకహితానికై భగవానుడు చేసే విశ్వనిర్వహణయే యజ్ఞం. అదే ఆయన స్వరూపం. హితాన్ని కలిగించే శోభనమైన సమగ్రదృష్టి కలిగిన అనంత శక్తిసంపన్నుడు ఈశ్వరుడు♪.*_
🪷 అటువంటి పరమేశ్వరుని సభక్తికంగా నమస్కరించి, ఆయన కృపకు పాత్రులమవడమే మన విధి♪.
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి