21, ఆగస్టు 2024, బుధవారం

Panchaag


 

పి.వి.ఆర్.కె.ప్రసాద్ వర్ధంతి

 (ఆగష్టు 21 పి.వి.ఆర్.కె.ప్రసాద్ వర్ధంతి, 22 జయంతి)

#pvrkprasad 

 ఐఏఎస్ అధికారులు కూడా  ఉంటారు !  


1983 లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వలేదు. అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారుల్ని ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా  ఉందని, నేడో  రేపో జరుగుతుందని  ప్రచారం జరుగుతోంది. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగు అడగడానికి వెళ్తే,  ముఖ్యమంత్రి మూడు "అవినీతి నేరాల"  ప్రశ్నలతో నిలదీశారు.

                             

ముఖ్యమంత్రి: మీరు టిటిడి నిధుల్లోంచి లక్షలాది రూపాయల్ని కేవలం బ్రాహ్మణులకే దోచిపెట్టారట. నిజమా? కాదా?

ఐ.ఏ.ఎస్: కొంతవరకు నిజమే సర్. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సలహా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టిటిడి అమలు చేసిన పథకం క్రింద చేశాను. ఎవరైతే 12-16 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేసి, ఘనాపాటీలుగా, క్రమాపాటీలుగా గుర్తింపు పొంది ఉన్నారో, వారిలో ఎవరు ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున తమకి సమీపంలోని దేవాలయంలో సమాజ  క్షేమం కోసం  వేదపారాయణ చేస్తారో  వాళ్ళకి నెలకి 600 నుంచి 800 వందల రూపాయల గౌరవ వేతనాన్ని టిటిడి చెల్లిస్తుంది. అటెండర్ ఉద్యోగం చేసే వాళ్ళే నెలకి 15 వేలు సంపాదింకుంటున్నారు. 16 సంవత్సరాల పాటు కంఠ నరాలు తెగిపోయేలా వేదాధ్యయనం చేయటం అంటే ఒక పోస్ట్ గ్రాద్యుయేషన్  చేయటం వంటిది. అలా నేర్చుకున్న వేద విద్యని సమాజ శ్రేయస్సు కోసం దేవాలయాల్లో పారాయణ చేసినందుకు టిటిడి నుంచి  లబ్ధి పొందిన వేదపండితుల సంఖ్య 370. ఆ  పండితులకు   నెలకు రూ.800 చెల్లించటం దోచిపెట్టడం అనీ, నేరమనీ  నేను అనుకోవట్లేదు.


ముఖ్యమంత్రి: మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యాం   నిర్మాణం విషయంలో నిబంధనల్ని కాంట్రాక్టరుకి అనుకూలంగా సవరించేసి, లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారట గదా!

ఐ.ఏ.ఎస్: నేను  1978లో టిటిడిలో చేరాను. అప్పటికే డ్యాం నిర్మాణానికి హెచ్.సి.సి అనే కంపెనీ ఎంపికయింది. వాళ్ళు పని ప్రారంభించబోయే సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు - మరో 100-150 మీటర్లు దిగువన డ్యాం కడితే, నీటి నిల్వ సామర్ధ్యం  మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. 

కొండ మీద యాత్రికులకు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా టెండర్లు పిలవాలంటే ఇంకో ఆరుమాసాలు పడుతుంది.  పైగా పాత కాంట్రాక్టరుకి నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ నేను అప్పటి ధర్మకర్తల మండలిగా ఉన్న 'పెర్సన్స్ ఇంచార్జీ‘   కమిటీ ముందు పెట్టాను. వాళ్ళ ఆమోదంతో, కొండమీద యాత్రికులకు నీటి కొరతని త్వరగా తీర్చే ప్రయత్నంలో హెచ్.సి.సి కంపెనీకే పాత రేట్లే చెల్లించే ఒప్పందం మీద ఆ ప్రాజెక్టు కేటాయించాలని 'పెర్సన్స్ ఇంచార్జి ' అంగీకరించింది. ఫలితంగా, రెండున్నర ఏళ్ళలో పూర్తి కావలసిన డ్యాం ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తయింది. మీరు రికార్డులు తెప్పించుకొని చూడవచ్చు. ఒక్క రూపాయి కూడా హెచ్.సి.సి కి అదనంగా చెల్లించకుండా, రికార్డు సమయంలో డ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయించటమే నేరమైతే, అది నేను చేశాను.


ముఖ్యమంత్రి: సరే. పెద్ద నేరం ఒకటుంది. తిరుమల శ్రీనివాసుడికి వజ్ర కిరీటం చేయించటంలో మీరు కస్టమ్స్ శాఖవారి వజ్రాలు వద్దని, ప్రయివేటు వ్యాపారుల దగ్గర వజ్రాలు కొన్నారనీ, అందులో చాలా వజ్రాలను మీరు మూటగట్టుకున్నారనీ, మీ ఇంట్లో పరుపుల్లో, తలగడల్లో ఈ వజ్రాలు దాచుకున్నారనీ అంటున్నారు. ఇలా జరిగి ఉంటే అది పాపం కూడా ? నిజం చెప్పండి.

ఐ.ఏ.ఎస్: అవునండి. వజ్రాల కిరీటానికి వజ్రాలకోసం  ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు వచ్చారు. అక్రమ రవాణాల్లో కస్టమ్స్ వారికి పట్టుబడిన వజ్రాలు టిటిడికి తక్కువధరకు వస్తాయని ఆశపడి ప్రధానమంత్రిని అడిగాను. ఆవిడ అంగీకరించారు. కొన్ని రోజులకి ఆవిడ ముఖ్య కార్యదర్శి కృష్ణస్వామి  రావ్ సాహెబ్ గారు ఫోన్ చేసి, కస్టమ్స్ స్వాధీనం చేసుకునే వజ్రాలు స్మగ్లర్లు మర్మాంగాల్లో దాచి తెచ్చినవై ఉంటాయి కాబట్టి అలా అపవిత్రమైన వజ్రాలను పవిత్రమైన స్వామి వారి కిరీటానికి వాడవద్దని ప్రధానమంత్రి చెప్పారని అన్నారు. అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందూస్తాన్ డైమండ్ కార్పొరేషన్ (హెచ్.డి.సి)  ద్వారా హాలండ్ నుంచి వజ్రాలు కొనుకోలు చేయించే ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరక్టరుతో మౌలికమైన ఇన్సూరెన్స్ వగైరా అంశాలమీద మా  అధికార బృందానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వజ్రాలు దిగుమతి అయ్యేనాటికి చాలా ముందుగానే నాకు టిటిడి నుండి బదిలీ అయింది. ఆ వజ్రాలను చూసే అవకాశమే నాకు లేదే. ఇంక ....!!!


ముఖ్యమంత్రి  ఎన్.టి.రామారావు ఆలోచనలో పడిపోయారు.

అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ఐ.ఏ.ఎస్ అధికారి తన సీట్లోంచి ఉద్వేగంతో లేచి ముఖ్యమంత్రి మీద తన ఆవేశాన్ని కుమ్మరించారు:


"సర్. మీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి నేను లండన్లో  ఒక కోర్సు చేస్తున్నాను. నేనంటే అసూయతో ఎవరెవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నా మీద నేరాలు మోపుతున్నారు. టిటిడి లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నేను ప్రతి పనినీ ఆ స్వామి మీద విశ్వాసంతోనే  చేశాను. సత్ప్రయోజనాన్ని ఆశించే చేశాను. స్వామి ప్రేరణతో నా విధ్యుక్త ధర్మంగా  భావించి మాత్రమే చేశాను. నా చిత్తశుద్ధిని, నిజాయితీని ఆ శ్రీనివాసుడు ఆమోదించినంతకాలం ఈ ప్రభుత్వం నాలో వెంట్రుక ముక్క కూడా కదిలించలేదు. మీ ఇష్టమొచ్చినన్ని విచారణలు జరిపించుకోండి... నేను నేరస్థుణ్ణి అని మీరు నమ్ముతుంటే, ఎలాంటి శిక్ష అనుభవించటానికైనా నేను సిద్ధమే. అది కూడా శ్రీనివాసుడి ప్రసాదమే అనుకుంటాను... శలవు..."


చటుక్కున ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ లేచి, ఆ ఐ.ఏ.ఎస్ అధికారి చేతులు పట్టుకొని, "ఆవేశపడకండి బ్రదర్. మేం పాలనకి కొత్తగా వచ్చాం. ఎవరో మీమీద ఈ అభియోగాలు చేశారు. అయితే, మా కార్యదర్శులు మోహన్ కందా గారు, బెనర్జీ గారు మీమీద ఎలాంటి చర్య తీసుకోదల్చినా, అందుకు ముందుగా మీతో మేం మాట్లాడితీరాలని పదే పదే చెప్పారు. అందుకే మాట్లాడాం. అపార్థం చేసుకోవద్దు బ్రదర్..."


ఇది జరిగిన గంటలోనే ఆ ఐ.ఏ.ఎస్  అధికారికి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ఎండిగా పాత  పోస్టింగు ఇచ్చారు. రెండు మాసాల్లో 'సమాచార, పౌర సంబంధాల, సాంస్కృతిక, చలనచిత్ర అభివృద్ధి శాఖల కమీషనరుగా, కార్యదర్శి’ గా  అదే  ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ని నియమించింది ప్రభుత్వం.  


పాలనా సామర్ధ్యం, దూరదృష్టి, ప్రణాళికా రచనలో పరిణతి, నీతి నియమాలు, నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత,  సాహిత్యం-లలిత కళల పట్ల మక్కువ, విజయం పరాజయం - రెండూ భగవంతుడి అనుగ్రహమే  అని నమ్మే భక్తి విశ్వాసాలు, చివరి శ్వాస వరకూ సనాతన ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం .... ఇవన్నీ కలబోస్తే వచ్చే  రూపం శ్రీ పి వి.ఆర్.కె.ప్రసాద్.  ప్రధానమంత్రి కార్యాలయం, ఎక్సయిజ్ శాఖ, విశాఖ పోర్టు, పంచాయతీ రాజ్, ఉన్నత విద్య, ప్రకృతి వైపరీత్యాలు-పునరావాసం, మానవ వనరుల శిక్షణ తదితర ఏ పోస్టులో పని చేసినా కేవలం తన పని తీరుతో ఆ పోస్టుకి  వైభవం, గుర్తింపు  తీసుకు వచ్చిన విశిష్ట వ్యక్తి ప్రసాద్. టిటిడిలో పనిచేసిన 54 మాసాల కాలంలో (1978-82) అన్నమాచార్య  ప్రాజెక్టు నుంచి  నిత్యాన్నదాన పథకం దాకా శాశ్వతంగా నిలిచిపోయే 27 ప్రాజెక్టులను  అమలు  చేసి,  తనదంటూ ఒక చెరగని ముద్ర వేసిన కారణజన్ముడు. 

ఇప్పటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత. 


2009 నాటి   లోక్ సభ,  అవిభక్త ఆంద్ర ప్రదేశ్ శాసన సభ  ఎన్నికల నిర్వహణలో ఒక అసాధారణమైన చరిత్ర సృష్టించి, జాతీయ  స్థాయిలో  ‘ఆదర్శ ఛీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ 'గా  గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ఐ.వి.సుబ్బారావు మాటల్లో చెప్పాలంటే - "సంపూర్ణ మానవుడు అంటూ ఎవరన్నా ఉండి ఉంటే, అది పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారే."

*శ్రీ గంగాధరేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 416*






⚜ *కర్నాటక  :- శివగంగ  - తుముకూరు*


⚜ *శ్రీ  గంగాధరేశ్వర ఆలయం*




💠 శివగంగ కొండ, దక్షిణ కర్ణాటక రాష్ట్రం తుమకూరులో ఉంది.

మంత్రముగ్ధులను చేసే సహజ సౌందర్యం, పురాతన దేవాలయాలు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వంతో, శివగంగా కొండ ప్రశాంతత, ఆధ్యాత్మికత మరియు సాహసాలను కోరుకునే ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.


💠 శివగంగ సముద్ర మట్టానికి 4,559 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర కొండ.

 దీని రూపురేఖలు తూర్పు నుండి ఎద్దుగా, పడమర నుండి గణేశుడిగా, ఉత్తరం నుండి సర్పంగా మరియు దక్షిణం నుండి లింగంగా కనిపిస్తాయి. 

పైకి వెళ్లే మెట్ల సంఖ్య  (వారణాసి)కి ఉన్న యోజనల సంఖ్యకు సమానం అని చెబుతారు. అందుకే దీనిని దక్షిణ కాశీ అంటారు. 


💠 ఈ పవిత్రమైన పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా "గంగా" అని పిలువబడే ఒక నీటి బుగ్గ ప్రవహిస్తుంది, తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వచ్చింది. ఇక్కడ గంగాధరేశ్వర ఆలయం, శ్రీ హొన్నమ్మదేవి ఆలయం, ఒలకల్ తీర్థం, నంది విగ్రహం, పాతాళగంగ శారదాంబే ఆలయం మరియు అగస్త్య తీర్థం, కణ్వ తీర్థం, కపిల తీర్థం, పాతాళ వంటి అనేక తీర్థాలు ఉన్నాయి. 


💠 శ్రీ హొన్నమ్మదేవి ఆలయం గుహలోపల ఉంది. శ్రీ గవి గంగాధరే ఆలయం కూడా గుహలోనే ఉంది. 

గవి అంటే గుహ, గంగాధరేశ్వర అంటే పైభాగంలో గంగ ఉన్న పరమేశ్వరుడు. 

ప్రతి జనవరిలో, సంక్రాంతి పండుగ రోజున, శ్రీ గంగాధరేశ్వర మరియు శ్రీ హొన్నమ్మదేవి (పార్వతి) కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 


💠 ఈ ఆలయం ప్రత్యేకంగా "మకర సంక్రాంతి" అని పిలువబడే వార్షిక పండుగకు ప్రసిద్ధి చెందింది, ఈ సమయంలో సూర్యకాంతి ఒక నంది (ఎద్దు) విగ్రహం యొక్క కొమ్ముల గుండా వెళుతుంది మరియు ప్రధాన దేవతను ప్రకాశిస్తుంది.


🔅 ఒలకల తీర్థ:

ఒలకల తీర్థం కొండపై ఉన్న సహజ నీటి బుగ్గ, ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ బుగ్గలోని నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు యాత్రికులు తమ మతపరమైన ఆచారాలలో భాగంగా తరచుగా అందులో పవిత్ర స్నానం చేస్తారు.


🔅 పాతాళ గంగ:

పాతాళ గంగ అనేది పాతాళానికి అనుసంధానించబడిన ఏడు చిన్న చెరువుల శ్రేణి. ఈ చెరువులు సహజ నీటి బుగ్గల ద్వారా పోషణ పొంది పవిత్రమైనవిగా భావిస్తారు. 

ఈ చెరువుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతారు.


💠 శివగంగ కొండలో గంగా రాజవంశం పాలనలో నిర్మించిన పురాతన కోట కూడా ఉంది. కోటను అన్వేషించడం ప్రాంతం యొక్క చరిత్రలో ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల యొక్క ఉత్కంఠభరితమైన వీక్షణలను అందిస్తుంది. కొండపై నంది పాయింట్ మరియు మంతెస్వామి బెట్ట వంటి అనేక దృక్కోణాలు ఉన్నాయి, ఇవి పచ్చదనం మరియు సమీప గ్రామాల యొక్క విశాల దృశ్యాలను అందిస్తాయి.


🔅 భోగనందీశ్వర దేవాలయం:

శివగంగ పాదాల వద్ద ఉన్న భోగనందీశ్వర దేవాలయం మరొక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. 

ఈ ఆలయ సముదాయంలో శివుడు, విష్ణువు మరియు ఇతర దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి. 

ఈ ఆలయం యొక్క క్లిష్టమైన చెక్కడాలు, శిల్పాలు మరియు వాస్తుశిల్పం దీనిని తప్పక సందర్శించవలసిన ఆకర్షణగా చేస్తాయి


💠 పండుగలు మరియు వేడుకలు:

శివగంగ కొండ సంవత్సరం పొడవునా అనేక పండుగలను జరుపుకునే ఒక శక్తివంతమైన ప్రదేశం. గవి గంగాధరేశ్వర ఆలయంలో మకర సంక్రాంతి పండుగ ఒక ప్రధాన హైలైట్.

విగ్రహం కొమ్ముల గుండా సూర్యకాంతి ప్రసరించే విశిష్ట దృగ్విషయాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.

 మహా శివరాత్రి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర పండుగలు కూడా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు, సందర్శకులకు సాంప్రదాయ ఆచారాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించే అవకాశాన్ని అందిస్తాయి.


🔅 సాధారణంగా మనకు వెన్నతో నెయ్యి ఎలా తయారు చేయాలో తెలుసు, కానీ ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే విగ్రహంపై (శివలింగానికి) నెయ్యి రాస్తే కొంత సమయం తర్వాత అది వెన్నగా మారుతుంది.


🔅 విష్ణువర్ధన రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాత కాలంలో "శాంతల" అనే నర్తకి ఉండేది. కొన్ని కారణాల వల్ల కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

ఆమె మృతదేహాన్ని గుర్తించిన ప్రదేశంలో పండించిన పంటలు ఇప్పటికీ రక్తం ఎరుపు రంగులో ఉంటాయి


💠 మనం "ఒలకల్లు తీర్థం" చేరే వరకు కేవలం 250 మెట్లు ఎక్కాలి. కాబట్టి ప్రాథమికంగా ఈ ప్రదేశం ఒక చీకటి గుహ, దాని లోపల మనం దేవాలయాన్ని కనుగొనవచ్చు. 

దాని లోపల ఒక స్థలం ఉంది, అందులో మనం ఒక రంధ్రం (గ్రైండింగ్ స్టోర్) లోపల చేతులు పెట్టాలి మరియు పవిత్రమైన గంగాజలం పొందగలదని మరియు దానిని పొందని వారు పాపం చేసినట్లే అని నమ్ముతారు.


 💠 తుమకూరు నుండి 25 కిమీ, బెంగళూరు నుండి 54 కిమీ (34 మైళ్ళు) దూరంలో ఉంది

కవులు...రసావిష్కారఘనులు

 కవులు...రసావిష్కారఘనులు...క్రాంతదర్శులు

మ..

చవులూరించెడివాక్యముల్ తనర నాస్వాదంపురీతిన్ గనన్

ఛవిమఛ్ఛబ్దములన్ యథోచితముగా సారంబుతోరంబుగా

కవనంబల్లగ ధీమణుల్ భువిని నాకాశంపు వైశాల్యతన్

సవనంబంచును దీక్షతోడుతను సత్సందేశమీయన్వలెన్...

కం..

కవులెల్లం గన, రసర

మ్యవిశేషంబుగ కవితలనల్లగవలయున్

నివియవి యనంగలేదుగ!

భువియేవస్తువు సమాజపున్నతి గనునో....

దాన విశిష్ఠత !



దాన  విశిష్ఠత !


             ఉ:  దాన కళా కలాప  సముదంచిత  సార వివేక  సంపదన్


                   మానిత  యాచమాన  జనమానస  వృత్సభిపూర్తి బుధ్ధి  యె


                   వ్వానికి  లేదొకింతయును  వాడొకరుండు  భరంబు ధాత్రికిన్,


                  కానలుగారు , వృక్షములుగారు  నగంబులు  గారు  భారముల్; 


శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.


భావము:  దానంచేయటం ఒక  కళ.  దాని విశిష్ఠతను  తెలిసికొని  ,మాన నీయులైన  యాచకజన  మనోరథములను  తీర్చెడి

కుతూహలము  యెవనికి లేదో  ఈపుడమికి  వాడొక్కడే  భారము.


                       అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు  గానీ , భారములుగావు.


      విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే  దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది  కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని  సంపాదించాలట.

యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని  గౌరవనీయులుగా భావించాలి. వారి  మనసెరిగి  దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి  ఉత్తముడే దాత అతడు పుడమికి  అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.

పర్వతాదులు గూడా భూమికి భారము కాదని  భావము.🙏🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌾🌷🌷🌷🌷🌷🌾🌷🌷🌷🌷🌷🌷

ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు -

 ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు  - 


 *  ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.


 *  నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.


 *  రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.


 *  వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.


 *  ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .


 *  ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.


 *  నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .


 *  రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.


 *  నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.


 *  కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .


         మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కనిపించని బంధాలేవో

 ఒక  వ్యక్తి  తన మూడు గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు... మార్గమధ్యంలో ఓ నది కనిపించింది... అసలే నడిచీ నడిచీ ఒళ్లంతా చెమట చిటచిట... స్నానం చేస్తే పుణ్యం, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు...


ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్లున్నాయి... మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా..?


ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు... తనను పిలిచాడు... స్వామీ, నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా...? కాసేపు నా గాడిదను కట్టేస్తా, నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా...


నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు...


నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ రెండు గాడిదలను కట్టెయ్... మూడోది చూస్తూనే ఉంటుంది... తరువాత దీని వెనక్కి వెళ్లి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు...


సాధువు చెప్పినట్టే చేశాడు... నదీస్నానం పూర్తిచేశాడు... వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్లు విప్పేశాడు... అదిలించాడు, తను ముందు నడుస్తున్నాడు... కాసేపయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు... అక్కడే ఉండిపోయింది...


తట్టాడు, కొట్టాడు, తిట్టాడు... ఊహూఁ... ఫలితం లేదు... అటూఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు... స్వామీ, స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది...


అసలు నువ్వు కట్లు విప్పితే కదా, అది కదిలేది... అన్నాడు సాధువు...


అసలు నేను కట్టేస్తే కదా విప్పేదిా... అంటాడు రైతు...


అవునోయీ, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ గాడిదకు తెలియదు కదా... తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది...


అయ్యో, మరేం చేయాలిప్పుడు..?


కట్లు విప్పితే సరి... కదులుతుంది...


అసలు కట్టేస్తే కదా... విప్పేది...


పిచ్చోడా... కట్టేసినట్టు ఎలా నటించావో, విప్పేసినట్టు కూడా నటించవోయ్...


అతను అలాగే చేశాడు... గాడిద ముందుకు కదిలింది, మిగతా రెండింటితో కలిసింది... రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు...


‘‘మనుషులు కూడా అంతేనోయ్... కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం... కదలం, ఉన్నచోటు వదలం... నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు... అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు... ప్రపంచమంతా నీదే...


అర్థమయ్యీ కానట్టుగా ఉంది... అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా... అతను కాసేపు బుర్ర గోక్కున్నాడు... సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు... 💐


*🙏 కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻

శుభోదయం 🌹🕉️🌹Goodmorning

దేవాలయాలు - పూజలు 17*

 *దేవాలయాలు - పూజలు 17*

సభ్యులకు నమస్కారములు.


*ప్రదక్షిణ (2)*

(పురాణ గాథ)


గణాధిపత్య షరతులతో 

శ్రీమహా గణపతి యుక్తిగా జననీ జనకులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల ప్రదక్షిణ చేసి ఉన్న చోటనే ఈశ్వర ప్రదక్షిణ ద్వారా భూ ప్రదక్షిణ గావించిన ఫలితం పొందాడు.  


ప్రదక్షిణ లోని కొన్ని విధానాలను పరిశీలిద్దాము.

 1) ఆత్మ ప్రదక్షిణ

 2) పాద ప్రదక్షిణ 

3) దండ ప్రదక్షిణ 

4) అంగ ప్రదక్షిణ 

5) గిరి ప్రదక్షిణ.


ఈ *సదాచారము* దేవాలయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇంకా కొందరు మహానుభావులు అశ్వత్థ ప్రదక్షిణ, భూ ప్రదక్షిణ, కుల శైల ప్రదక్షిణ ,తులసీ ప్రదక్షిణ మరియు గో ప్రదక్షిణలు గూడా చేస్తూ ఉంటారు. 


తండ్రికి, గురువుకు మరియు తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదానికంటే ఒకటి దశోత్తరమైన 

(పది రెట్లు అధికము) ఫలితాలనిస్తాయి.  

బ్రహ్మ చర్యం పాటించే వారికి, గృహస్థులకు మరియు సన్యసించిన వారికి ప్రదక్షిణలు వేర్వేరుగా ఉంటాయి. 


*ప్రదక్షిణ ఫలితాలు*  మొదటి ప్రదక్షిణ బ్రహ్మ హత్య లాంటి పాపాలను గూడా హరిస్తుంది. రెండవ ప్రదక్షిణ ఆరాధకుడిని అధికారిగా చేస్తుంది అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలకు అర్హత కల్గిస్తుంది. మూడవ ప్రదక్షిణ నైంద్ర సంపద సమకూరుస్తుంది అనగా జీవిత అంతంలో =  చివరి విముక్తిలో ఆనందం పొందుపరుస్తుంది. *ఇంకొక భావన* మొదటి ప్రదక్షిణలో  *తమో గుణం*, రెండవ ప్రదక్షిణలో *రజో గుణం*, మూడవ సారి *సత్వ గుణం* అనగా మనలో ఉన్న త్రిగుణాలను భగవంతునికి అర్పించి ఒక్కొక్క గుణం నుండి విముక్తి పొంది పరి శుద్ధాత్ములము కావడానికి సహకరిస్తుంది. సాధారణంగా దేవాలయాలలో కనీసము మూడు మార్లు, విష్ణు ఆలయాలలో నాలుగు సార్లు, ఆంజనేయ స్వామి ఆలయంలో అయిదు సార్లు, మొక్కుబడులు ఉంటే కనీసము పదకొండు మార్లు, అవకాశం ఉంటే 108 సార్లు చేయడం ఆనవాయితి. 


*కనీస నియమాలు*

1)సవ్యదిశలో సరి సంఖ్య కంటే బేసి సంఖ్యలో ప్రదక్షిణలు ఉండాలి. విష్ణు ఆలయాలలో మినహాయింపు వర్తిస్తుంది.

2) ప్రదక్షిణలు మెల్లగా (నిదానంగా),  *గజగమనము*  లేదా నిండు చూలాలు ఏవిధంగా నెమ్మదిగా నడువగలదో ఆ ప్రకారంగా.... ఆలయ భగవంతుని నామాన్ని/ శ్లోకాలను ధ్యాన పూర్వకంగా ముకుళిత హస్తాలతో, శరీరం మరియు మనస్సు స్మరణ/భగవంతుని కీర్తిస్తూ/...తమయభీష్ట కోరికలపై దృష్టి ఉంచాలి. 


*ప్రదక్షిణ మంత్రాలు*.

ప్రతి దేవాలయంలో సాధారణ ప్రదక్షిణ మంత్రం. 

*యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే*

*పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః, త్రాహిమాం కృపయా దేవ శరణా గత వత్సల!*,

*అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర*

శక్తి (అమ్మవార్ల) దేవాలయాలకు వెళ్ళినప్పుడు మంత్రమును దిగువ విధంగా పల్కాలి. *దేవ* కు బదులు *దేవీ*,  *వత్సల* బదులు *వత్సలే*, *మహేశ్వర* బదులు *మహేశ్వరి*. 

*తులసి* ప్రదక్షిణ మంత్రము

*యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా, యదగ్రే  సర్వ వేదాంశ్చ, తులసీత్వాం నమామ్యహం*.

శ్రీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలప్పుడు  ఆ స్వామి వారి మంత్రం పఠించాలి.  


ధన్యవాదములు.

*(సశేషం)*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 *𝕝𝕝 శార్దూలము 𝕝𝕝* 


  *ఱాలన్ ఱువ్వఁగ జేతులాడవు, కుమారా రమ్ము రమ్మంచునేఁ*


  *జాలన్ జంపగ, నేత్రము ల్దివియఁగా శక్తుండ నేఁగాను, నా*


  *శీలం బేమనిచెప్పనున్న దిఁకనీచిత్తంబు, నాభాగ్య మో*


  *శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!!!*

            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 17*


*తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! ఒక కిరాతకుడు పూలులేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను.... భక్తశిరియాళుని వలె కుమారుని చంపి వంటచేసి నీకు నైవేద్యమిడలేను..... భక్తకన్నప్ప మాదిరి నేను నీకు నా నేత్రములను సమర్పించలేను... నా భక్తి ఎంత గొప్పదో చెప్పవలెనన్న అది నీ చిత్తము, నా భాగ్యము... సాక్షాచ్ఛ్రీమన్నారణుని చేత సేవింపబడు పాదములు కలిగినట్టివాడా*!....


✍️💐🌷🌹🙏

ప్రవాస భారతి

 ప్రవాస భారతి


గుప్పెడు కాసులున్, మిగుల గుండెల నిండుగ గంపెడాశలున్,

అప్పులు, ఆస్తులమ్ముకొని, ఆప్తుల పల్కులు, మూటగట్టి, నే

గొప్ప విమానమెక్కితిని కోర్కెలు తీర్చెడి పోరుబాటలో

ఎప్పుడు తప్పుజేయనని, ఇచ్చితి మాట ప్రవాస భారతీ..


చదువులఁ గోరుచున్ మరియుఁ జక్కని భావిని కోరి, దేశమున్

వదలగ నార్తితో, కడకు వాస్తవమిద్దను బాధకోర్చుచున్,

మదినిను నిల్పి నీస్మరణ మానక నిత్యము జేయు వారి, య

వ్వదనములందుఁజిందెఁబలు వన్నెలు నేడు ప్రవాసభారతీ..


నమ్మికలేనివానికిల నాశముఁ దప్పదు నష్టమౌను, ఆ

నమ్మకమున్న చాలునదె నాకము జేర్చును నాయదృష్టమై,

నమ్మితి తల్లినీవెయని నాడును, నేడును నామనస్సులో

నమ్మకమన్న ఆయుధము నాకును దక్కె, ప్రవాసభారతీ..


అమ్మను నమ్ముకొన్న బ్రతు కాటగు, పాటగునన్నివేళలన్,

అమ్మను నమ్ముకొన్న సరి యాదెస యీదెస ఆత్మరక్షయౌ,

అమ్మను నమ్ముకొన్న సుతునాకలి దీర్చెడి యన్నపూర్ణగా,

అమ్మయె వెంట వచ్చెనిదె ఆకృతి నీవు, ప్రవాసభారతీ..


నాటిరి దేశభక్తియను నాణ్యపు విత్తులు పెద్దలెందరో,

బూటక రాజకీయముల పుచ్చగ దేశము పూటపూటకున్,

నోటికి తాళముల్ మిగిలె నూటికి తొంబది మందికక్కటా,

నేటికి మేలుకొల్పితివి నీకిదె జోత ప్రవాస భారతీ..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్ 


(2022లో ప్రచురించిన "ప్రవాసి" పద్యకావ్యమునందలి పద్యఖండిక, అందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు)

నృసింహ స్తుతి

 నృసింహ స్తుతి 

పంచ చామరం లో 


 ఘనాఘనాయవేధసే నఖాయు ధాయశౌరిణే।                                                  కిరీటహారతేజసే పరాత్ప రాయ విష్ణవే।                                         సుపుండ్రఫాలభాగినే శుభాంగ రాజితాయతే।                      సుచిహ్నపాదుకాయతే యశస్వి నే నమోస్తుతే ।   


 గురు చరణాంబుజా ధ్యాయీ విజయకుమార శర్మా.       

      ✍️ విమలశ్రీ

శంకరా! (శతకము,)

 శంకరా!

      (శతకము,)


. 5

అంబురుహము

భభభభరసలగ.యతి 13.


బొమ్మలు సేతువుకుమ్మరి రీతిని

          మూడు రంగులు వేసెదో

దొమ్మినిగూర్చెదు బొమ్మల మధ్యను

            దుఃఖభాగులచేసెదో

కమ్మిన మాయల కన్నులు చూడని

            కారుచీకటి గుప్పెదో

ద్రిమ్మరి వెచ్చట నుండెదొ నీవని?

            తెల్పుమయ్యరొ?శంకరా!

6.

కరిబృంహితము

భనభనభనర .యతి 13.


పూలశరము లెడంద తగులగ

           మోద పులకిత గాత్రుడై

తూలి గిరిజను పట్టినిలచెను

        తోలు మడుగుల వాడు తా

కోలవిసిరిన వానిగనియెను

            కోపమొలయగ రుద్రుడై

జ్వాలలెగయగ మారుడణిగెను

              భస్మమగుచును శంకరా!

7

చంద్రశేఖర

నజరజర   యతి 13


నిరతము జీవనంపు సంద్రమందునిల్చియున్

గురుతరమైన నీతిబాధలందు గూరియున్

పరమపవిత్రమైన నీదుపాద భక్తితో

శరణము పల్కమోక్షమిత్తువయ్య శంకరా

8.

తరలి

భసనజనర. యతి 11


శ్రీకరుడవు చిన్మయుడవు

             శ్రీగళుడవు శ్రీశివా!

భీకరుడవు నాశకుడవు

             విశ్వదుడవు శ్రీభవా!

శోకభయ విమోచనుడవు

          సుందరుడవు శ్రీహరా!

లోకగతుల లోక విధుల

           లోగొనెదవు శంకరా!


డా.ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

        9550231590

భార్యకు భర్తయె దైవము

 భార్యకు భర్తయె దైవము

భర్తకు భార్యసహకార భరితము జూడన్! 

ధారుణి కోరిక దీర్చగ

ధర్మము నిలుపగ పతియెగదా! గతి మనసా!

గిరిజాపతీ

 *గిరిజాపతీ!* అనేమకుటం

పద్య శతకము 

*మత్తకోకిల పద్యపంచకం*

************************

*మాడుగులమురళీధరశర్మ* 

   *సిధ్ధిపేట/కాళేశ్వరం*

*చ.వా:-9951985880*

*************************

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

***********************

*మత్తకోకిల-1*

ఈశ్వరా!పరమేశ్వరా!జగ*

దీశ్వరా!శివ!పాహి!కా!

ళేశ్వరా!భవ!పాపమోచన!* 

హే!మహేశ్వరదేవ!;ము

క్తీశ్వరా!హర!ముక్తినాథ!సు*

తీర్థవాస!పరాత్పరా!

శాశ్వతమ్మగు దర్శనమ్మున*

సాకుమో *గిరిజాపతీ!*


*మత్తకోకిల-2*

గౌతమీ!నదిగా త్రివేణియు*

గాంచువాణి,ప్రణీతయున్!

ప్రీతిమీరగ సంగమమ్మున*

పేర్మిపంచుచు పుణ్యముల్!

ఖ్యాతిగా వెలుగొందుచున్న,సు*

కర్మభూమి త్రిలింగమై!

నాతితో శుభ మంగళమ్మిడు*

నందితా *గిరిజాపతీ!*


*మత్తకోకిల-3*

దర్శనమ్మున ముక్తినిచ్చెడు*

ధర్మదేవత వీవె;సం!

స్పర్శనమ్మున పాపహారిగ*

పానవట్ట ద్విలింగ;ని!

ష్కర్శ నాసికలున్న జంటగ*

సాంబ!మోక్షములిచ్చుసం!

దర్శనాద్భుత తన్మయత్వపు*

దాతవౌ *గిరిజాపతీ!*


*మత్తకోకిల-4*

ధర్మ కర్మ విరాజమానపు*

ధార్మికమ్మగు గౌతమీ!

నిర్మలమ్మగు పుణ్య భూమిగ*

నిత్య పుష్కర శోభలన్!

శర్మ పూజన దానధర్మము*

శాశ్వతమ్ముగ నిల్చుచున్!

శర్మమంద జలాభిషేకపు*

శంకరా! *గిరిజాపతీ!*


*మత్తకోకిల-5*

లక్షబిల్వ సురార్చనమ్మును*

లక్షణమ్మునఁ జేయగా!

నక్షయమ్మగు పుణ్యమిచ్చుచు*

నాదుకొమ్ము ముముక్షులన్!

రక్షణమ్మిడు జీవకోటికి*

రాజమౌళివి నీవుగా!

భిక్షగాండ్లను నాదుకొమ్మిల*

ప్రీతితో *గిరిజాపతీ!*

భారతమాతగామధుర

 *మాడుగులమురళీధరశర్మ*


*ఉ‌మా.1*

భారతమాతగామధుర*

భాషిత,భూషితమాధురీసుధా!

ధారగధారఁబోసినది*

ధారణ,ధైర్యము,ధీమతుల్సదా!

ధారితసర్వశాస్త్రముల*

తన్మయసారమునందిపుచ్చినన్!

కోరినకోర్కెఁదీర్చునవ*

కోవిద,కూర్పునుఁజేయు *భారతీ!*


*ఉ‌మా.2*

సాగరమందుసాగునది*

సర్వమునందుననింపుచుండినన్!

త్యాగము,ధర్మకర్మలు,సు*

యాగము,యోగము,కార్యకర్తనల్!

రాగ,సరాగ,మాలికలు*

లాస్యము,హాస్యములందుకల్గినన్!

ధీగుణదివ్యతత్వము,సు*

ధీమతిగానిడు దివ్య *భారతీ!*

వరములనిచ్చే తల్లీ

 12-8-24 సోమవారం కి కొనసాగింపు....

*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!

25కం.

హరిహరులా వాగీశుడు

పరమ ఋషులువేల్పు లెల్ల పరమేశ్వరి నీ

కరుణా దృక్కులు బడయన్

వరదాయని నిలిచినారు పాలింప గదే!!


భావము: ఓ వరములనిచ్చే తల్లీ!హరి హర బ్రహ్మలు గొప్ప ఋషులు దేవతలు నీకరుణతోకూడి చూపులకై నిలిచియున్నారు, దయ చూడుము!

 26మ.

అనుచున్ గౌరిని వేడగా కరుణతో నౌదార్యముంజూపుచున్,

తనపుత్రున్ సుకుమారు నాఘనుని సత్వంబొందగా జేయుచున్

ననిశంబున్ దనపుత్రునే జగతిలో నాఢ్యుండుగా పూజలన్

దనరం జేయుచు దైవబృందముల కద్యక్షాఖ్యునిం జేసినన్

గనగా జాలుదురెల్లరున్ గుశలముల్ గయ్యంపు భుక్త ప్రియా!!


    భావము: అని పార్వతిని వేడగా కరుణించి తనకుమారుని శక్తివంతుని చేయుచూ లోకములో సదా తన సుతునే గొప్పవానిగా పూజలందునట్లును, దైవగణములకు నాయకుడిగను జేసిన శుభము లొందుదురయ్యా నారదా అని పలికెను.

ఉత్సాహ వృత్తమ:-

 ఉత్సాహ వృత్తమ:-

అమ్మ పేర్మి కన్న మిన్నయైన దేది సోదరా!

అమ్మ ప్రక్కనున్న మనకునదియె గొప్ప ధైర్యమున్!

సొమ్ములేమి కోరదామె చూచు నీది కుక్షి నే!

అమ్మ మాట నెప్పుడైన నాలకించ మేలు రా!

                పి.వి.శైలజ

శంకరా

 శంకరా!

      (శతకము,)


1ఉత్పలమాల


శ్రీగిరి జాసతీ హృదయ చిన్మణి

          దీపక!లింగరూపకా!

నాగవిభూషకా!భువన నాశక!

         రక్షక!ఆదిభిక్షుకా!

యోగరహస్యబోధక! మహోష్ణ

        మహాంబక! క్ష్వేళభక్షకా!

రోగనిరోధకా! ఎడద రోచివి

       నీవయ గౌరి శంకరా!


 2.

చంపకమాల


హిమగిరి కందరాన వసియింతువు

         నిత్యము, వెండి కొండపై

హిమజనుగూడినాట్య మొనరింతువు,

        భీకర రుద్రభూమి లో

ఢమరుకమూని నొప్పెదవు, ధ్యానము

       చేసెడిగుండెలోన శ్రీ

రమణుడవౌచు నుందు,జన రంజకు

          డీవయ గౌరిశంకరా

3.

మత్తేభము.


జలముల్ పుక్కెడు చిల్కరించి దళముల్

         చక్కంగ పై వైచుచున్

వెలిబూదిన్ గొని పైనరాచి శివ నీవే

        దిక్కునాకంచు లో

పలుకన్ సాంబడు చేయిపట్టికొని నా

         ప్రారబ్ధకర్మంబులన్

తొలుగన్ జేయుచు సౌఖ్యమిచ్చునెపుడున్

            తోరంబుగా శంకరా!


4.శార్దూలము.

  

రారా !సాంబసదాశివా!మృగపతీ!

            రారా !జగన్నాయకా!

రారా!బాలశశాంక మౌళి! యభవా!

           రా!నాగ హారాన్వితా!

రారా!భిక్షుక!నీలకంఠ!ధవళా!

          రా యంచు గొంతెత్తి నో

రారా పిల్చిన చెంతనిల్చెదవుపో

        రాజేశ్వరా!శంకరా!


డా.ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

శరణంటి శరణంటి

 సీ

శరణంటి శరణంటి శారదామాత నీ 

చిద్రూపమును,గన చింత చేయు

చుంటిని,నోములు,చూచియు,చేసిన 

నియతి  బాటింతు నే నిష్ఠతోడ,

దర్శనముకొఱకు ధరణిలో నీకయి 

వేచియుంటినితల్లి వేల్పులమ్మ 

కన్పించవేలనో ? కనులకు రూపము 

మాత్రమే,మేలమ్మ మానవులకు!

తే.గీ.

చదువగాలేను, క్రొత్తవౌ చదువు లెల్ల

వ్రాయ గాలేను కావ్యాలు వాసి కెక్క,

జ్ఞానమేలేదునిత్యవిజ్ఞాన పఠన

జేయ, కరుణను జూపుమా చేరెద దఱి!

రూపము లేని యాత్మకు

 ఉ.

రూపము లేని యాత్మకును రూపమునద్దుచు జీవరాశిలోన్

ప్రాపును కల్గజేయుచు నపారభవాంబుధిలోన ముంచుచున్

తాప విపత్తులేర్పరచి దైన్యము నింపగజేతువేమిటో !

యాపద బాపు జీవులకునాశ్రయురాలవె ! సర్వమంగళా ! .

 


🙏🙏🙏🙏


✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,

ధర్మపురి

మత్స్యావతార చరితము

 మత్స్యావతార చరితము


విభుడీశ్వరుండైన విష్ణుదేవుండు 

వేద  భూసుర  సుర విమలసాధువుల 

ధర్మార్థ గోవుల ధరయందు గావ 

ఘనరూపములయందు , గాలిచందమున,

తనురూపములయందు, తగిలితానుండు.

ఎక్కువతక్కువ నెన్నడొందకను 

నిర్గుణత్వంబున నెఱయు ఘనుండు, 

గురుతయు దొరతయు గుణముల నొందు .

అట్టి యాపరమాత్మ యవనిని బ్రోవ 

మనుజేశ ! చోద్యమే మత్స్యంబు నగుట !

విష్ణుని మహిమలు విభవోన్నతములు 

వినుము దెల్పెదనీకు వివరంబుగాను.

ఆలకింపు మికను  నానందముగను "


బాదరాయుణుడిట్లు పలికియు న్నంత

మత్స్యావతారపు మాహాత్మ్య మంత

వీనులవిందుగా వివరించె నిటుల


     ----- మత్స్యావతారము -----


గతమందు జరిగిన కల్పాంతవేళ 

ధరయందు వెల్గొందు ద్రవిడదేశమును 

సత్యవ్రతుండను సత్త్వశోభితుడు 

పరిపాలనముజేసె ప్రజమోద మంద 


✍️గోపాలుని మధుసూదనరావు

మంగళాద్రినృసింహా

 మంగళాద్రినృసింహా!!పాహి పాహి!!

సీ..

మంగళాద్రినృసింహ మాంపాహి నరసింహ

       పానకాలస్వామి పాహి పాహి!

కృతయుగంబుననుండి యతిదయాళువునౌచు

     భక్తులబంగారు,పాహి పాహి!

:శ్రీ సుదర్శననరసింహ నముచినాశ

    పావనయజ్ఞేశ పాహి పాహి!

చీడపీడలబాధచీకుచింతలబగాథ

      పనిగట్టి పోగొట్ట పాహి పాహి!

తేగీ..

మంగళంబుల నొసగంగ మాకునెప్డు

మంగళగిరిపై కొలువైన మహితరూప

రాజ్యలక్ష్మీ ప్రియసమేత రమ్యరూప

జీవనపుటూతమగుమయ్య దేవదేవ..

పూజ

 పూజ

--------

సీ||

     హరిపూజనము సేయ నార్భాటమది యేల?

        మదిని జేసిన జాలు

        మందిరముగ!

పూజాదికాలకై పుష్పమాలిక లేల?

          స్తోత్రమాలిక చాలు 

         స్తుతుల జేయ!

నైమిత్తికమ్మగు నైవేద్యమది యేల?

            హృదయమర్పణ

           జేయ కొదువ గాదు!

హారతినిడుటేల?హరిపాద యుగళిని

             మదిని దాల్చిన 

          జాలు మరువబోక!

తే.గీ||

        భక్తి పుష్పమ్ము గోరెడి ప్రభువతండు!

శరణు గోరిన కాపాడు సదయుడతడు!

భువనముల గాయ సంసిద్ధ భూరి యశుడు!

రక్ష సేయంగ వచ్చెడి దక్షుడతడు!


------------కోడూరి శేషఫణి శర్మ

సమాచార హక్కు చట్టాన్ని

 *సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తే ఈ కింది సెక్షన్ల కింద శిక్ష సంబంధిత పౌర సమాచార అధికారి బాద్యులు అవుతారు.*


ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలో   నిర్దేశింపబడినప్పటికి సదరు ఉద్యోగి బుద్ధిపూర్వకముగా  ఇతరులకు నష్టం కలగజేయ వనలే సంకల్పంతో బిన్నముగా వ్యవహరిస్తే *ఐపీసీ 166*/ *198 BNS of 2023* ప్రకారం ఒక సంవత్సరం శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.  

       

సమాచార హక్కు ఇవ్వమని చట్టం నిర్దేశించిన  సమాచారం ఇవ్వడం లేదు.IPC 166 / * *198 BNS of 2023* సంబంధిత అధికారి శిక్ష అర్హుడు.


ఒక ప్రభుత్వ ఉద్యోగి  బుద్ధిపూర్వకముగా చట్టములోని నియమలను ఉల్లంఘించి లేక ధిక్కరించిన  ఉద్యోగిని విధుల నుంచి తోలగించాలి.ఆ వ్యక్తిని శిక్ష నుండి తప్పిoచుకునేటట్లు గా చేసినా ఆ నెరస్తునికి తక్కువ శిక్ష పడేటట్లు చేసిన  *ఐపీసీ 217*/ *255BNS of 2023* ప్రకారం శిక్ష అర్హుడు ఇలా చేసినందుకు గాను 2 సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు విధులు దుర్వినియోగం పరిచి నందుకు గాను అతన్ని  విధుల నుంచి తొలగించ కుండా జాలి చూపించిన, లంచం తీసుకొని రాజకీయ వత్తిళ్లు ఆ ఉద్యోగిని విధుల్లో కొనసాగించుట.


ఒక ప్రభుత్వోద్యోగి ఏదైనా రికార్డును తయారు చేయవలసినదిగా అదేశింపబడినప్పుడు ప్రజలను గాని లేదా ఎవరైనా వ్యక్తిని గాని నష్టపెట్టాలనే సంకల్పంతో బుద్ధి పూర్వజముగా రిజర్డును తప్పుగా చేసినా లేక ఒక వ్యక్తి చట్టము బారి నుండి శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో రికార్డును తప్పుగా తయారు చేసిన


*ఐపీసీ 218*/ *256BNS of 2023* ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.


ఒక వ్యక్తి అస్థిని మరొక వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించుట,సంతకాలు పోర్జిరి చేసిన ఐపీసీ420  /*318(4)* *BNS* *of* *2023* ప్రకారం శిక్ష అర్హుడు.  


*కొంతమంది అదికారులు రికార్డులు:*


ఉదా:- ఒక రైతు పేరిట ఉన్న భూమిని ఎటువంటి ముటేషన్ లేకుండా మరొక్క రైతు పేరిట చేర్చితే, లేక  సంబంధిత వ్యక్తులకు ఎప్పుడో పట్టాలు ఇచ్చినట్లు  రికార్డులు సృష్టించుట తాను చేసిన తప్పులు బయట పడుయనే ఉద్దేశ్యంతో   రికార్డులకు లేకుండా చేయుట చేస్తే  *ఐపీసీ 420* /  *318(4)* *BNS* *of* *2023* కింద వస్తుంది దీనికి గాను 7 సంవత్సరాలు శిక్ష విధించబడును.


దూరాలోచన పురితమైన  కావాలనే ఉద్దేశంతో       సమాచారం ఇవ్వడం లేదు. *ఐపీసీ 406*/ *316BNS of 2023*  ప్రకారం   రెండు సంవత్సరాలు లేక జరిమానా లేక రెండు విధించవచ్చు. 


 ఏదైనా ఆస్థిని విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరుల పేరిట వ్రాయుట లేక అప్పగించుట, దుర్వినియోగం చేయుట,  నమ్మక ద్రోహముగా భావించి  అట్టివారికి *ఐపీసీ 409*/   *316BNS of 2023* ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.🇮🇳& 



*u/s of 255 of BNS 2023* & *u/s 174 of BNSS & 198 of BNS** 

*read with ఆర్టికల్ *14,*19,*20,*21,*375*