11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ధైర్యం - ఉపాయం



అజేయుడు అడవిని దాటుతూ విశ్రాంతి కోసమని ఒక చెట్టుకింద కూర్చున్నాడు. ఇంతలొ దభీమని చప్పుడైంది. చూస్తే ఎదురుగా కోరలతొ భీకరాకారంలో ఓ రాక్షసుడు ఉన్నాడు.

అజేయుడు ఒక్క క్షణం భయపడ్డాడు. అయినా మెల్లగా ధైర్యం తెచ్చుకున్నాడు. "చాలా ఆకలిగా ఉందిరా! నిన్ను తినేస్తా" అన్నాడు రాక్షసుడు.

"ఎలాగూ నన్ను తినేస్తావు. కాబట్టి ముందు నా కోరికొకటి తీర్చు" అన్నాడు అజేయుడు. ఏంటది! అన్నాడు రాక్షసుడు. .

"మా అవ్వ రాక్షసులకి ఎలా కావాలంటే అలా మారే విద్య తెలుసంటుంది. నేనేమో! అదంతా అబద్ధమంటాను. నువ్వు రాక్షసుడివే కదా నిజంగా నీకావిద్య తెలిస్తే నా అరచేతిలో దోమగా మారు వాలు. తర్వాత హాయిగా నీకు ఆహారమైపోతాను" అన్నాడు అజేయుడు.

పకపకా నవ్వుతూ ఓరోరి! ఇంత చిన్న కోరికా కోరేది. నాకన్ని విద్యలూ తెలుసు. కావాలంటే చూడు దోమగా మారి నీ అరచేతిలో వాలతా" అని ఏదో తలుచుకుని దోమగా మారాడు రాక్షసుడు.

అంతే! వెంటనే అజేయుడు రెండో అరచేతితో గట్టిగా కొట్టి దోమను నలిపేశాడు. దాంతో దోమ రూపంలోని రాక్షసుడు గట్టిగా ఏడుస్తూ చనిపోయాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భయంకరమైన రాక్షసుడు మన కష్టాలు, బాధలు..
తెలివితో, ధైర్యం తో దోమను నలిపినట్టు చేస్తే అంతా మంచే జరుగుతుంది...

దేనికైనా ఓర్పు, సహనం, ఆలోచన ఉండాలి.. అవి ఉంటే అంతా విజయమే.

సర్వే జనా సుఖినోభవంతు..

ధర్మో రక్షతి రక్షితః

స్వక్షేత్ర షడ్గ్రహ యోగం

స్వక్షేత్ర షడ్గ్రహ యోగం- సకల శుభప్రదం
అందరికీ నమస్కారం ప్రస్తుతం అద్భుతమైన స్వక్షేత్ర గ్రహస్థితి ఆకాశంలో ఏర్పడి ఉంది.
ఈ కాలాన్ని అందరూ దైవ పరంగా సద్వినియోగం చేసుకోగలరు.
2020సెప్టెంబర్ 3 తారీఖు నుండి స్వక్షేత్ర పంచ గ్రహకూటమి మొదలైంది. 2020 సెప్టెంబర్ 17 వరకు ఈ పంచ గ్రహ కూటమి ఉంటుంది.
13, 14, 15 తారీకులలో స్వక్షేత్ర షడ్ గ్రహయోగం కూడా ఉండటం వల్ల ఇంకా విశేషమైన రోజులు ఇవి.
సూర్యభగవానుడు సింహరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
చంద్రుడు కర్కాటకరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
బుధుడు కన్య రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
గురువు ధనస్సు రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
శని మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.
వీరందరూ వారి వారి సొంత గృహాలలో ఉండటం చాలా అరుదుగా సంభవించే సన్నివేశం. ఈ అరుదైన షడ్గ్రహ యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజులలో విశేషమైన గ్రహబలం మానవులకు లభిస్తుంది.

భాద్రపదం శూన్యమాసం అవటంవల్ల కేవలం దైవారాధనకే ప్రాధాన్యత.
ముఖ్యంగా ఆరోగ్యం కోసమై 13, 14, 15 తారీకులలో చేసే దైవారాధనలు బాగాఫలిస్తాయి. విశేషించి వృశ్చిక లగ్నంలో చేసే దీపారాధన, పూజలు, జపాలు, అభిషేకాలు, విష్ణు, శివ లలితా సహస్రనామ పారాయణలు విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి.
ఒకటవ యోగం: 13వ తేదీ ఆదివారం భాద్రపద బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం, వరీయాన్ యోగం, బవకరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:36 నుండి 11:51 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి.
రెండవ యోగం: 14వ తేదీ సోమవారం భాద్రపద బహుళ ద్వాదశి పుష్యమి నక్షత్రం, పరిఘయోగం కౌలవకరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం
ఉదయం 11:32 నుండి 11:47 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి.
మూడవ యోగం: 15వ తేదీ మంగళవారం భాద్రపద బహుళ త్రయోదశి ఆశ్లేష నక్షత్రం, సిద్ధయోగం, గరజికరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం
ఉదయం 11:28 నుండి 11:43 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి. ఈ సమయంలో చేసే దీపారాధన, ధ్యానము, జపం అధిక శక్తినిస్తాయి.
ఇట్లు సిద్ధాంతి పంచాంగ కర్త
డాక్టర్ శంకరమంచి రామకృష్ణశాస్త్రి పిహెచ్ డి

హాస్యగుళికలు

నటూరే అంటే ఏంటి ?-
ఒక స్టూడెంటు ఇంగ్లీషు ప్రొఫెసర్ని 'నటూరే' కి మీనింగు ఏంటి అని అడిగాడు.
ప్రొఫెసర్ అ వర్డ్ ఎపుడూ విని ఉండకపోవడం వల్ల కంగారు పడి అర్ధం రేపు చెపుతానన్నాడు.ఇంటికి పోయి ఇంగ్లీషు ప్రొఫెసర్ ఎన్నో డిక్షనరీలు
రాత్రంతా వెతికినా 'నటూరే' అనే పదమే ఎక్కడా కనపడలేదు.
మర్నాడు క్లాసుకి వస్తూనే ఆ స్టూడెంటు మీనింగు చెప్పమని అడగ్గానే
గాభరాపడి రేపు చెప్తానని తప్పించుకున్నాడు.
రోజూ స్టూడెంటు అడగడం ప్రొఫెసర్ తప్పించుకోడం జరిగిపోతుండేది.
ఆ స్టూడెంటు కనపడితే చాలు ప్రొఫెసర్ కిభయంతొ కాళ్ళూ చేతులు వణికేవి.
ఆఖరికి ప్రొఫెసర్ స్టూడెంటుని అడిగాడు.
"నటూరే కి స్పెలింగ్ ఏంటో చెప్పు?"
స్టూడెంటు చెప్పాడు 'NATURE' అని.
ప్రొఫెసర్ పిచ్చికోపంతో తిట్టసాగాడు.
వెధవన్నర వెధవ! నేచర్ ని నటూరే అంటూ నా ప్రాణం తీసావు కదా!
నిన్ను కాలేజి నుంచి వెంటనే బర్తరఫ్ చేస్తున్నాను.
అలా అనగానే ప్రొఫెసర్ కాళ్ళ మీద పడి స్టూడెంటు ఏడవసాగాడు.
సార్ ! కనికరించండి. అంత పని చేయొద్దు !
నా 'ఫుటూరే' నాశనం చేయకండి సార్ !!
ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు!!!
('ఫుటూరే' = FUTURE)

*రామాయణ విజ్ఞానం*




1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారం.

*శ్రీ రామ జయం!*
🏹 *🙏

శ్రీఅధోక్షజాష్టకం


1) నమో భగవతే అధోక్షజాయ
   అతుల్యతుల్యనారహితాంగాయ
   దశదిశాంతవిస్తారత్రివిక్రమాయ 
   తృణావర్తసంహరమహాబలాయ ||

2) నమో భగవతే అధోక్షజాయ
   అపవర్గప్రదాయకకరుణార్ణవాయ
   క్షీణరహితస్థితపరమపురుషాయ
   బంధవిమోచనస్థితిప్రదాయకాయ ||




3) నమో భగవతే అధోక్షజాయ
   నీరసరహితస్థితిప్రదాయకాయ
   భీతావహమానసరహితస్థితిప్రదాయ
   పరాభవరహితస్థితిప్రదాయకాయ ||

4) నమో భగవతే అధోక్షజాయ
   అమృతతుల్యస్థితిప్రదాయకాయ
   దానవకాలనేమిసంహరణాయ
   సంసారమోహనాశకాయ ||






5) నమో భగవతే అధోక్షజాయ
   సకలయజ్ఞఫలప్రదాయకాయ
   త్రిగుణాతీతత్రయీమయాయ
   సంఖ్యతత్త్వజ్ఞానప్రబోధకాయ ||

6) నమో భగవతే అధోక్షజాయ
   ఈశానమనోల్లాసకారకాయ 
   రవీంద్వగ్నిప్రభాభాసురాయ
   సమయానుకూలప్రవర్తకాయ ||






7) నమో భగవతే అధోక్షజాయ
   సురరాజబృందార్చితాయ
   కల్పనారహితమానసాయ
   ధ్యానానందస్థితిప్రదాయకాయ ||

8) నమో భగవతే అధోక్షజాయ
   పాండవరాయబారకార్యనిర్వాహకాయ
   సమయోచితమార్గనిర్దేశకాయ
   అరిషడ్వర్గహంతజ్ఞానకుఠారాయ ||

      సర్వం శ్రీ అధోక్షజదివ్యచరణారవిందార్పణమస్తు

మహాలయ పక్షాలు

*శ్రీ బాలాంబికానాధ పీఠం మరియు సేవా సమితి*

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

2-9-2020 నుంచి 17.9.2020 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

*పితృదేవతలకు.... ఆకలా...?*

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

*ఆచార్య సద్భోదన*

ఆధ్యాత్మికతను అలవరుచుకోవడంలో ముందుగా సహనం, వినమ్రత, అణకువవంటి వాటిని అభ్యసించాలి. ఈ గుణాలను అభ్యసించాలని మన మహర్షులు పదే పదే అందుకే ప్రబోధించేవారు. నిజమైన శిష్యుడు నిశ్శబ్ధంగా వింటాడు. ఒకవేళ గురువు తనలోని లోపాలను తెలియజేస్తే వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేయడు. శిష్యుడిగా మసలుకోవడం కూడా పవిత్రమైనది. దానికై సిద్ధం కాని వారికి దానిని అందుకునే అర్హత ఉండదు.
సర్వేజనా స్సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

పరమాత్మే శరణాగతి.

పరమాత్ముడు సృష్టిని వ్యక్తపరిచే ఆలోచనతో మానవుని సాధనముగా ఎన్నుకొని వాని యందు అనేక దేవతల అధిష్ఠానముగా షోడశకళా మూర్తిగా తయారుచేసి చైతన్యముగా తానె అంశను అమర్చి"విరాట్పురుషునిగా" వ్యక్త్యమయినాడు.

దేవతల అధిష్ఠానముగా ఉన్న కళామూర్తి "జడ ప్రకృతి" ,
పరమాత్మ అంశ అధిష్ఠానముగా ఉన్న పురుషుడు "చైతన్య ప్రకృతి " .   
ఈ సృష్ఠిని అంతను "అవ్యక్త బ్రహ్మ" విరాట్పురుషుని సాక్షిగా బ్రహ్మ ,విష్ణు శివాత్మకంగా పర్యవేక్షిస్తున్నాడు.

ఈ భూతజాలమంతా విరాట్పురుషుని సంతతే. ఆ పరమ-ఆత్మ ఒక్కడే ఆక్షరుడు. అవ్యయుడు, అప్రమేయుడు.

క్షరముచెందే ఏ పదార్థమైనా భగవంతుని విశేషాంశ అవచ్చుగాని , భగవంతుడు కాలేడు.

దేవతల అధిష్ఠానముగా ఉన్న కళామూర్తి "జడ ప్రకృతి" మరణము సంభవించగానే ఆ ఆ అధిష్ఠానదేవతలలో విలీనమవుతుంది.

చైతన్య ప్రకృతి ఈ మానవుని జనన మరణముల దశ దాటినప్పుడు కాని
లేక సృష్ట్యాoతమునకాని పరమ పురుషుడిలో ఐక్యము చెందుతుంది.

అందువలన ఏ ప్రకృతులైనా పరమాత్ముని అధీనములే. ఆ పరమాత్మే శరణాగతి.

 "ఓం" అని అవ్యక్త బ్రహ్మని ఆశ్రయించినా , నారాయణా లేక చతుర్ముఖ బ్రహ్మ లేక మహేశ్వరా అని "వ్యక్త బ్రహ్మని" ఆశ్రయించినా పరమాత్మునిఆశ్రయించినట్లే.                 
                                                                                ఓం నమో నారాయణాయ !

వేమన పద్యం

గుణయుతునకు మేలు గోరంత జేసిన,
గొండయౌను  వాని గుణము చేత,
కొండ కొలది మేలు గుణహీనుడెఱుగునా,
విశ్వదాభిరామ వినుర వేమ *

భావము =

సాధారణంగా మన సమాజంలో చాలా మంది ఏవేవో ఇబ్బందులు పడుతూ, వాటిని ఎదుర్కోవటానికి ఏదో సహాయం అడుగుతూనే వుంటారు. అలాంటి సందర్భాలలో సహాయం చేయగలిగే స్థోమత వున్నప్పుడు వెనక ముందు ఆలోచన లేకుండా సాటి మనిషిని, వీలైనంత  వరకు ఆదుకోవటమే మనిషికి పరమోత్క్రుష్టము. సహాయం పొందినవాడు గుణవంతుడైతే మనం చేసిన చిన్న సహాయాన్ని కుడా తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటాడు.అదో పెద్ద సహాయంగా భావిస్తాడు, అందరికి ఆయన వల్ల నేను సహాయం పొందాను అని చెప్పుకొంటాడు.  అందుకే పెద్దలు చెపుతారు "నీవు ఎవరి ద్వారా నైనా సహాయం పొందితే నీ  జీవితాంతం మరిచిపోవద్దు అని, అదే నీవు ఎవరికైనా సహాయం చేస్తే, దాన్ని మరచిపొమ్మని. ఎంత గొప్ప మాట ఇది. మరి కొందరు గుణహీనులు,  ఓ పెద్ద సహాయాన్ని మనవల్ల పొందినా దానిని, అ ఏముందిలే అని తీసి పారేస్తారు, అది బుద్ధిహీనులు, గుణహీనులు చేసే పని .ఏది ఏమైనా మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు పోతే ప్రతి ఫలం అ భగవంతుడు ఇస్తాడు, ఇది  ఈనాటి వేమన పద్య భావన.

మీ రాజా బాబు 

*‌బతుకమ్మ పండుగ నిర్ణయం

*‌బతుకమ్మ పండుగ నిర్ణయం-తెలంగాణ విద్వత్సభ స్పష్టీకరణ*
       *అక్టోబర్‌ 16‌వ తేదీననే బతుకమ్మ పండుగ ఆరంభం అక్టోబర్‌ 24‌న చద్దుల బతుకమ్మ పండుగ*
            తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని సిద్ధాంతులు, పంచాంగకర్తలు,జ్యోతిష పండితులు ఒకే వేదికపై ‘తెలంగాణ విద్వత్సభ’ పేరుతో ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి ప్రతిసంవత్సరం పండగలను చర్చించి అందరి సమన్వయంతో పండగలను నిర్ణయిస్తున్నారు. గత సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరంపండగలను 18-08-2019 రోజున భాగ్యనగరంలోని శ్రీశృంగేరీ శంకరమఠంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలో నిర్ణయించటం జరిగింది.
ఈ విద్వత్సమ్మేళనంలో సమారు వందమంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు సహా పలువురు వేద,శాస్త్ర పండితులు, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీ‌శార్వరి నామ సంవత్సర (2019-20)పండగల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసాము. పత్రికాముఖంగా,
సామాజిక మాధ్యమాల్లో కూడా తెలియజేసాము. అయితే ఈ సంవత్సరం అధిక ఈశ్వీయుజ మాసం వచ్చిన సందర్భంలో బతుకమ్మ పండగ విషయమై కొన్ని రోజులుగా పలువురు పలు సందేహాలను వెలిబుచ్చుతూ...
సామాజిక మాధ్యమాల్లో భిన్న ప్రకటనలు చేస్తూ ప్రజల్లో కొంత గందరగోళం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్సభ అత్యవసరంగా జూమ్‌ ‌ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 32 మంది సిద్ధాంతులు, పలువురు వేద,శాస్త్ర పండితులు, పురోహితులు పాల్గొన్నారు. ‌రెండుగంటల పాటు సాగిన ఈసమావేశంలో బతుకమ్మపండుగ విషయమై కూలంకశంగా చర్చించి సిద్ధాంతులందరూ ఏకగ్రీవంగాఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
       *ఈ సంవత్సరం శ్రీ శార్వరినామ సంవత్సరంలో వచ్చే బతుకమ్మ పండుగను అధిక ఆశ్వయుజ అమావాస్య 16-10-2020 శుక్రవారం రోజున (ఎంగిలి పూల బతుకమ్మ పండుగను) ప్రారంభం చేయాలి. నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) 24-10-2020 శనివారం రోజున చద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలి. విజయదశమి దసరాపండుగ 25-10-2020 ఆదివారం రోజున జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ సిద్ధాంతులంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు.అయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చద్దుల బతుకమ్మ పండుగను ప్రాంతాచారం ప్రకారం వేర్వేరురోజుల్లో జరుపుకుంటారు కావున వారు తమ ప్రాంతాచారం ప్రకారం జరుపుకోవాలని సూచించడమైనది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో తెలంగాణలోని సిద్ధాంతులందరూ విద్వత్సమ్మేళనంలో చర్చించి నిర్ణయించింది. కావున యావన్మంది ప్రజానీకం ఈ విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాము*

 *యాయవరం చంద్రశేఖరశర్మ* 
*అధ్యక్షులు, తెలంగాణ విద్వత్సభ*                                 

*దివ్యజ్ఞానసిద్ధాంతి*
  *కార్యదర్శి, తెలంగాణ విద్వత్సభ*

వ్యక్తిత్వం

                                 

1.శాంతి అంటే ఘర్షణ లేకపోవడం కాదు,ఘర్షణ వాతావరణంలోనూ ప్రశాంతంగా ఉండగలగడం.

2.ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మె దలు వాలవు. అలాగే మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవరూ దగ్గరకు రారు.

3.గౌరవమంటే పదవిని చూసి లేచి నిలబడ టము కాదు,వ్యక్తిత్వాన్ని చూసి నమస్కరించటం.

4.అతికష్టమైన పని - నిన్ను నువ్వు తెలుసుకోవడo.అతి సులభమైన పని- ఇతరులకు సలహాలివ్వడo.

5.డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపంలాంటిది.నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది.మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. సృష్టి వున్నంతకాలం వెలుగుతూనే ఉంటుంది.🙏🏻🙏🏻

*నీతి కథ*



🌺తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.

"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు!

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.

రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.

అక్కడ మహాభారతంలో,

భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?

అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!

జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.

ఇంత తేడా ఎందుకు?

ఇంతటి తేడా ఏమిటంటే,

ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.

దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.

జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!

ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.

 *"నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు."*

" *సత్యమేవ జయతే "*👌🙏🙏🙏🙏🙏🙏🙏🕉️

ఆకుపూజ ఎందుకు?


                  ధ్యానం... విధానం
ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే– ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది?’’ అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు, ఆరోగ్యానికి చాలా మంచిది’ అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.
ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం (అరటితోట)లోనూ విహరిస్తాడు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. ఆయనకు తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

ధ్యానం... విధానం
సుఖాసనంలో.. హాయిగా.. కూర్చుని .. చేతులు రెండూ కలిపి.. కళ్ళు రెండూ మూసుకుని.. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే.. ఏకధారగా.. గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా వుండరాదు. ఈ విధమైన ఆలోచనారహిత–స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి.

ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి.. అపారంగా శరీరంలోకి ప్రవేశించి.. నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత (సంవత్సరాలు) వుంటుందో.. కనీసం అన్ని నిమిషాలు.. తప్పనిసరిగా.. రోజుకి రెండుసార్లుగా.. ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.

ధ్యానం వల్ల లాభాలు...

♦️ ధయానసాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, క్యాన్సరు, గుండెనొప్పి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. దుర్గుణాలు, దురలవాట్లను కూడా పోగొట్టుకోవచ్చు.
♦️ మనసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
♦️ జఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
♦️ ధయాన సాధన చేసిన వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలుగుతారు.
♦️ మూఢ నమ్మకాలు, భయాలు పోతాయి. చావు–పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని జయించగలరు.
♦️ ధయానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది..

సేవను మించిన భాగ్యం లేదు




ఫల్‌ కారణ్‌ సేవా కరే కరే న మన్‌ సే కామ్‌

 కహే కబీర్‌ సేవక్‌ నహి కహై చౌగుణా దామ్‌

‘‘ఫలితాన్ని ఆశించి స్వార్థ బుద్ధితో చేసే సేవ.. సేవ కాదు. సొంత లాభం కోసం చేసే సేవకులు తమ సేవకు ఎన్నో రెట్ల అధికమైన ఫలితాన్ని ఆశిస్తారు’’ అంటాడు మహాత్మా కబీరు. సేవ అనేది పరుల మేలు కోసం చేయాలి కానీ, తను ఎంతో కొంత లాభపడాలని చేసే సేవ, సేవే కాదనేది ఈ పద్యం ద్వారా కబీరు మనకు అందించే సందేశం. అహంకారాన్ని తగ్గించుకోవడానికి, మనసును సుఖశాంతులతో నింపుకోవడానికి సేవను మించిన సాధన ఏదీ లేదు. అందుకే.. మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పదని పెద్దలు అన్నారు. ‘‘దేహం కదిలే దేవాలయం. అది ఆత్మ నివాసం. రాళ్లు, సున్నంతో కట్టిన దేవాలయాల్లో ప్రవేశించి చేసే ప్రార్థనలు, పూజలకు బదులు మనం ఇతరులకు ఎన్నో విధాలైన సేవ చేయవచ్చు.

భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారాలు చేయడం కంటే.. చేతనైనంతలో సజీవమైన జీవుణ్ని పోషించడానికి కృషి చేయాలి. కష్టంలో ఉన్న వారికి సేవ చేయడమే దేహాన్ని రక్షించడం’’ అని ప్రేమావతారుడైన సత్యసాయి చెప్పారు. జపతపాలు, పూజా పునస్కారాలతో భగవంతుని కృపకు పాత్రులం కావాలని కోరుకోవడం కంటే.. ఆర్తులైనవారికి చేయూతనిచ్చి తోడ్పడడమే మానవత్వంలో దైవత్వాన్ని చూడడం అని ఆయన మాటల్లోని అంతరార్థం. మన వేదాలు, శాస్ర్తాలు, పురాణేతిహాసాలు ఈ మాటల్నే బలపరుస్తాయి. మానవ జన్మలో కొన్నైనా మనిషి మంచి పనులు చేయగలగాలి. మంచి పనులంటే ఇతరులకు మేలు చేసేవి. తనకున్న దానిలోనే ఎంతో కొంత ఆపన్నులకు దానమివ్వడం, కష్టాల్లో ఉన్నవారికి తోడ్పడం వంటివన్నీ సేవయే! తాను స్వయంగా ఆకలితో ఉన్నా.. ఆకలి అంటూ వచ్చినవారికి అన్నం పెట్టి క్షుద్బాధ తీర్చిన రంతిదేవుడి వంటివారు సేవాభావానికి నిలువెత్తు ఉదాహరణలు. అలా ప్రాణికోటి ఎడ దయ కలిగి ఉండేవాడు భగవంతుని చేరగలడు.

సేవ.. మరోకోణంలో దానం అవుతుంది. అలాంటి దాన గుణానికి నిలువెత్తు రూపం కర్ణుడు. ఆ కుంతీపుత్రుడి దానశీలత ఎంత వర్ణించినా తక్కువే. ఒకసారి కర్ణుడు తన ఇంటి ఆవరణలో తలంటుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కర్ణుడి చేతిలో ఉన్న నూనె పాత్ర.. వజ్రవైఢూర్యాలతో పొదగబడి ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణుడు.. ఆ నూనె పాత్రను తనకు దానమివ్వాలని అడుగుతాడు. కర్ణుడు మరో ఆలోచన లేకుండా తన ఎడమ చేతితో నూనెపాత్రను కృష్ణుడికి ఇవ్వబోతాడు. దానికి కృష్ణుడు.. ‘వామహస్తంతో దానం ఇవ్వకూడదని తెలియదా కర్ణా’ అని ప్రశ్నించగా.. నా కుడిచేతికి నూనె ఉంది. చేయు కడుక్కుని దానమిచ్చేలోపు ప్రాణాలుంటాయో లేదో ఎవరికి తెలుసు? పైగా దానమివ్వాలన్న నా ఆలోచన మారిపోవచ్చు కూడా’ అన్నాడు కర్ణుడు. ఇలాంటి మహానుభావులు ఎందరో మన పురాణేతిహాసాల్లో ఉన్నారు. వారందరినీ అనుసరించి సేవాభావంతో మెలగాలి. చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో, నిస్వార్థంగా చేయాలి. అప్పుడే ముక్తి.

రామాయణమ్..58


..
రామా ! మా మిధిలలో ఉన్నప్పుడు ఒక భిక్షుకి నాకు వనవాసమున్నట్లుగా ఎరుక చెప్పినది. ఒక బ్రాహ్మణుడు కూడా అదే విషయము నాకు చెప్పినాడు ! అంతే కాకుండా నాకు కూడా అడవులలో సంచరించాలనే కోరిక ఉన్నది.
.
నీతో చెట్టాపట్టాలేసుకుని చెట్టూచేమా, ఏరులు ,సరస్సులలో విహారం చేయాలని ఉంది ,విరగబూసిన కమలాలతో నిండిన సరస్సులలో మనోహరంగా తిరుగాడే హంసలను ,కారండవపక్షులను నీ చేతిలో చేయివేసి కూర్చుని ఆనందంగా వీక్షించాలని ఉన్నది . ..
.
మనోహరమైన ప్రకృతిలో నీతో కలిసి లక్షసంవత్సరాలయినా ఆనందంగా జీవించగలనురామా ! .
.
అని ఎంతో ఉత్సాహంగా పలుకుతున్న సీతమాటలకు రాముడు అడ్డువచ్చాడు ! సీతా! అరణ్యమంటే ఆషామాషీ కాదు !
.
భయంకరమైన సింహగర్జనలతో వనమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది,మత్తెక్కి క్రీడించే క్రూరమృగాలు మనుషులను చూడగనే మీదిమీదికి దూకుతుంటాయి,నదులన్నీ మొసళ్ళు,బురదతో నిండి దాటటానికి శక్యం కాకుండా ఉంటాయి.
.
దారులన్నీ డొంకలతోటి ,ముళ్ళతోటి నిండిఉంటాయి అడవికోళ్ళ అరుపులు వినపడుతుంటాయి
.
 నీరుదొరకదు.పగలంతా శ్రమపడి రాత్రివేళ ఆకులుపరచుకొని ఆ పక్కలపైపడుకోవాల్సిఉంటుంది.కందమూలాలు తవ్వుకొని తినాల్సి ఉంటుంది ,
.
కావున ఓ సుకుమారీ ! ఎండకన్నెరుగనిదానవు నీవు ,ఏడుమల్లెలెత్తుగా పెరిగినదానవు ఇన్ని కష్టాలు భరించలేవు
.
వనవాసము దుఃఖము తో కూడినటువంటుది నీవు రావలదు అని స్పష్టంగా చెప్పేశాడు రాముడు!.
.
అప్పుడు కన్నుల నీరు నింపుకొని ప్రేమగా భర్తను చూస్తూ ,రామా నిజమే ! వనవాసంలో ఇన్ని దోషాలు ఉన్నమాట నిజమే ! కానీ నీ సాంగత్యంలో అవన్నీ నాకు గుణాలే ! .
.
క్రూరమృగాలు నిన్నుచూస్తేనే పారిపోతాయి ! .
.
నీతో ఒక్కక్షణవియోగమైనా నాకు మరణహేతువు! రామా నీవు నా ప్రక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఏదీ నాకు అవసరం లేదు ! .
.
ఇంతగా ప్రాధేయపడినా రాముని మనసు కరుగలేదు ! ఇక లాభంలేదనుకుంది సీతమ్మ! .
.
ప్రేమచేత ప్రార్ధిస్తే వినటంలేదీయన అని అనుకొన్నది.
.
ఎర్రబడ్డకళ్ళతో కించిదహంకారంతో నిందించడం మొదలుపెట్టింది
.
రామా! నీవు పురుష శరీరంలో ఉన్న ఒక ఆడుదానివి ! అసలు నిన్ను ఆ మిధిలాధీశుడు ఏం చూసి అల్లుడుగా చేసుకొన్నాడో అర్ధం కావటంలేదు నాకు! .
.
నువ్వుతప్ప నాకిక్కడ ఎవ్వరూ గతిలేరు నీవులేక నేను ఒంటరిదానను ,నన్నిక్కడే వదిలివెళ్ళాలని ఎందుకనుకుంటున్నావు ! నీ భయానికి గల కారణమేమిటి ? .
.
సావిత్రి సత్యవంతుడిని అనుసరించినట్లు నీ నీడలా నిన్ను అనుసరిస్తూనే ఉంటాను !.
.
NB.
.( సినిమా ప్రభావంలో ఉన్న మనకు సీత ఇట్లా మాట్లాడిందా అనే అనుమానం కలుగుతుంది .అక్షరాలా ఇంతే మాట్లాడింది.సీత అంటే తల వంచుకొని కష్టాలు మౌనంగా భరించేది కాదు ఒక ధీరోదాత్తురాలైన స్త్రీ .తనకు ధర్మబద్ధంగాఏది ఇష్టమో ఆ పనే చేసింది. Hight of a woman's imagination in this country is Sitha and Savithry అని స్వామీ వివేకానందుడంటారు).
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
పల్లకీసేవ..పరివర్తన..

"నేను సహజంగా ఇలా మారుమూల పల్లెటూళ్లకు రానండీ..అంత సమయం కూడా నాకు దొరకదు..ఒక్కరోజు నేను మా ఆఫీస్ లో లేకపోయినా..ఎందరో ఇబ్బందిపడతారు..నాకూ అక్కడ ఒక్కక్షణం తీరిక ఉండదు..ఇదిగో ఈవిడ దత్త భక్తురాలు కాబట్టి..ఈ క్షేత్రం గురించి విని చూడాలని పట్టుబట్టింది..అందుకోసం విధిలేక ఆమెతో పాటు వచ్చాను..నేను ఈరోజే తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నాను..ఇప్పుడు పల్లకీ సేవ లో పాల్గొని..రేపుదయం హారతులు కూడా చూసి..సమాధి దర్శనం చేసుకొని వెళదామని ఒకటే పోరు పెట్టింది..ఇక తప్పలేదు..మేము ఉండటానికి ఒక ac రూము దొరుకుతుందా?.." అని హైదరాబాద్ నుంచి వచ్చిన లక్ష్మణరావు గారు అడిగారు..ఆయన ముఖంలో అసహనం కొట్టొచ్చినట్టు కనబడుతోంది..

"ఇక్కడ ac రూములు లేవు..ఉన్న రూముల్లో కూడా నేలమీద పడుకోవాలి..చాపలు ఉంటాయి..ఎక్కువమంది భక్తులు మందిరం లోనే స్థలం చూసుకొని పడుకుంటారు.. పైగా ఇప్పుడు ఆ రూములు కూడా ఖాళీ లేవు..మీకు కావాలంటే..మందిరం వెనకాల రేకుల షెడ్ ఉంది..అందులో ఖాళీ ఉంది..అక్కడ ఉండొచ్చు.." అని మా సిబ్బంది ఆయనకు చెప్పారు..

"ఖర్మ!..ఖర్మ!.." అనుకుంటూ తన భార్యను తిట్టుకుంటూ..ఆయన తన జీవితంలో ఇంత బాధ ఎన్నడూ అనుభవించలేదన్నట్లు భావిస్తూ..పోయి తన కార్ లో కూర్చున్నారు..ఆయన భార్య మాత్రం ఇవేవీ పట్టకుండా..శ్రీ స్వామివారి పల్లకీ సేవ కోసం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు..

సాయంత్రం ఏడు గంటలకు పల్లకీసేవ ప్రారంభం అయింది..అయిష్టంగానే లక్ష్మణరావు గారు భార్యతో సహా పల్లకీసేవ లో కూర్చున్నారు..అర్చకస్వాములు సంకల్పం చెప్పి..వీరి గోత్రనామాలను కూడా పలికిన తరువాత..పూజ ప్రారంభం అయింది..పల్లకీ సేవలో కూర్చున్న లక్ష్మణరావు గారి లో ఉన్న అసహనం ఎటుపోయిందో తెలీదు..ఆయన అక్కడ జరుగుతున్న తంతును అత్యంత భక్తిగా చూడసాగారు..అర్చకస్వాములు పలుకుతున్న మంత్రాలను శ్రద్ధగా వినసాగారు..పూజ అనంతరం..పల్లకీని శ్రీ స్వామివారి మందిరం చుట్టూరా మూడు మార్లు ప్రదక్షిణగా త్రిప్పుతారు..ఆ సమయం లో పల్లకీ మోయడానికి ముందుగా పేర్లు నమోదు చేసుకొని, పూజలో కూర్చున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు..ఆ క్రమంలో భాగంగా పూజలో కూర్చున్న లక్ష్మణరావు గారిని కూడా రమ్మనమని అర్చకస్వాములు చెప్పారు..మారు మాట్లాడకుండా లక్ష్మణరావు గారు పల్లకీని మోయడానికి సిద్ధపడ్డారు..ఆయన భార్య అవాక్కైపోయి చూస్తున్నది..ఇంతవరకూ తనను తిట్టిపోసిన తన భర్త..ఇప్పుడు ఈరకంగా అందరికంటే ముందుగా తయారైపోవడం ఆవిడకు అర్ధం కాలేదు..అంతా ఆ దత్తుడి దయ అని అనుకున్నది..

మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా లక్ష్మణరావు పల్లకీని మోసారు.. అంతా అయిపోయి ప్రసాదం తీసుకొని నేరుగా నాదగ్గరకు ఆ దంపతులు వచ్చారు.
"పల్లకీ సేవ లో పాల్గొనడం నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అండీ..నాకు ఈరోజు ఆ భాగ్యం కలిగింది..నిజానికి నేను చాలా విసుగుతో వున్నాను..మరి క్షణాల్లో నా మనసు మారిపోయింది..ఎలా జరిగిందో నాకూ అర్ధం కాలేదండీ..శ్రీ స్వామివారు నన్ను కరుణించారు అని మాత్రం చెప్పగలను..వీలున్నప్పుడల్లా నేను నా భార్య ఇద్దరం వచ్చి..ఈ పల్లకీసేవ లో పాల్గొంటాము..నాకున్న అపోహలన్నీ పటాపంచలై పోయాయి.." అన్నారు..

లక్ష్మణరావు గారు ఆ ప్రక్కరోజు ఉదయం శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి హైదరాబాద్ వెళ్లారు..ఈ సంఘటన జరిగి సుమారు మూడు సంవత్సరాలు అయింది..ఈ మూడేళ్ళలో ఆ దంపతులు కనీసం ఐదారు సార్లు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆయనలో మార్పు రావడానికి శ్రీ స్వామివారు ఏమి చేసారో..వారిద్దరికే తెలియాలి..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

తల్లి మాటలోని మహత్తు



అనగనగా ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.

పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారునప్పుడు...

ఒకరు డాక్టరని,
ఇంకొకరు ఇంజినీరని,
మరొకరు లాయరని
అన్నారు....

ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు🤔

టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు😆😆😆

ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో...

బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.

ఆ బాలుడు, స్కూళ్లో చెప్పిందే చెప్పాడు..

అప్పుడు ఆ తల్లి:..

"అలాగే అవుదువుగానీ, ఇలా రా"
అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,
"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు తో నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది ఆ తల్లి..

ఆ నాలుగు గుర్రాల పేర్లె...

ధర్మ,
అర్థ,
కామ,
మోక్షాలనీ..🙏🙏

ఆ బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ చెప్పింది...👏

నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.

ఆ బిడ్డడే పెద్దయ్యాక *వివేకానందుడయ్యాడు*👌

పెంపకం అంటే అదీ... పిల్లలు తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, దానిని సరిదిద్దాల్సింది తల్లే...

*🙏అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు...🙏*

తెలుగు .. పదములు

ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం. ఈ క్రింది పదబంధాలతో అర్ధవంతమైన పదాలు వ్రాయండి. ఎన్ని వ్రాయగలరో చూద్దాం.....
 1. కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ.
9.గణగణ. 10.గునగున
11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత
22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక.
27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర. 37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..
 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర.
50.భుగభుగ.
51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు.

అందుకే.......
దేశ భాషలందు తెలుగులెస్స..

భాగవత మహాత్య్మం

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- భాగవత మహా పురాణం విన్నా పరీక్షిత్తుకు మృత్యువు తప్పలేదు. ఇక భాగవత మహాత్య్మం ఏముంది?

సమాధానం;- అసలు పరీక్షిత్తు భాగవతం దేని కోసం విన్నాడు? ముని కుమారుడు ఇచ్చిన మృత్యుశాపం తప్పించుకొని బతికిపోవడానికి కాదు. భాగవత శ్రవణం వల్ల తాను తరించి, మోక్షం పొందడానికి.

ఆసలు మృత్యువంటే అర్థం ఏమిటో భారతంలో సనత్ సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మృత్యువంటే ప్రమాదం అని అర్థం. ప్రమాదం అంటే "అనవధానత". ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆ విషయంలో జాగ్రత్త పడకపోవడాన్నే ప్రమాదం అంటారు.

మన జాగ్రత్తంతా ప్రాపంచిక విషయాల మీదే తప్ప, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం ఏమవుతాం? ఈ ఆలోచన, ముందు చూపు మనకి ఉండదు. మనం ఈ ఆలోచన చేసి, జాగ్రత్త పడతామనే మనకు భగవంతుడు దుర్లభమైన మానవజన్మ ఇచ్చాడు.

దుఃఖమిశ్రితం కాని శాశ్వతం కాని శాశ్వత ఆనందం కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి. మానవజన్మ సార్థకం చేసుకోవాలి. ఈ జన్మ దాటిపోతే, మళ్ళీ వచ్చే జన్మ మానవజన్మే వస్తుందని ఎవరు చెప్పగలరు? ఈ జన్మలో మనం మనసా, వాచా, కర్మణా చేసే పాపాల వల్ల, పరపీడనం వల్ల వచ్చే జన్మలో ఏ పక్షిగానో, చెట్టుగానో, పుట్టగానో పుడతాం. క్రూర జంతువులుగానైనా పుట్టవచ్చు. మన ప్రవర్తనను బట్టే, వచ్చే జన్మ వస్తుంది.

అందువల్ల ఈ శరీరంలో ఉండగానే, సుకృతాలు ఆర్జించి, తర్వాత శాశ్వత ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇదే పరీక్షిన్మహారాజు ఆలోచన. అందుకే ఆయన భాగవత శ్రవణం.

*శుభంభూయాత్*
*🌅గురుభక్తి🌅*

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం

*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*
*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*

అయితే ఈ శ్లోకం ఎందులోది?

ఏ సందర్భంలోది?
ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! అందుకే ఈ టపా.

ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
🙏💐🙏💐🙏💐🙏

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం....

🙏💐🙏💐🙏💐🙏

*ధార్మికగీత - 17*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                           
                                        *****
         *శ్లో:- కాకః కృష్ణ: పికః కృష్ణ: ౹*
                 *కో భేదః పిక కాకయో: ౹*
                 *వసంత కాలే ప్రాప్తే తు ౹*
                 *కాకః కాకః పికః పికః ౹౹* 
                                         ***** 
*భా:- లోకం తీరు చాల చిత్ర విచిత్రంగా గోచరిస్తుంది. కాకము అనగా కాకి. పికము అనగా కోయిల. చూడడానికి కాకి నలుపే. కోయిల నలుపే. దాదాపు రెండును రూపంలో ఒకేలా ఉంటాయి. మరి రెంటికి తేడా ఏమిటి? కాకి స్వయంగా గుడ్లను పొదుగుతుంది. కోయిల గుడ్లు పెట్టడమే కాని పొదగలేదు. తమ రూప సామ్యము చేత కోయిల కాకి గూటిలోనే గుడ్లను పెట్టడం, కాకి పొదగడం నిరంతరం సాగే ప్రక్రియ. కోయిలకు పరులచే పోషింపబడేది కనుక "పరభృతం" అని పేరు వచ్చింది. వసంతకాలం రాగానే, తమ కూతల తారతమ్యం వలన కాకి నిజరూపం బయట పడి, గెంటివేతకు గురి అవుతుంది. ఉప్పు, కర్పూరము చూడడానికి ఒకటిగా ఉన్నా, రుచి చూస్తే అసలు రంగు తెలిసినట్లే, సమయం వస్తే గాని ఎవరెవరో నిగ్గుతేలదు. రారాజు, కర్ణుడు దానంలో పోటీపడ్డారు. ఇంద్రుడు పెట్టిన పరీక్షలో కర్ణుని ఉదాత్త దాతృత్వము, రారాజు నిస్సహాయత వెల్లడైనాయి. వేమన "పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అని అనడంలోని ఆంతర్యం ఇదే. ఆపత్సమయంలోనే మనిషి అసలు సిసలు రూపము, స్వభావము బయటపడతాయని సారాంశము*.
                                    *****
                      *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

44వ పద్యం

మ.
భవదుఃఖంబులు రాజకీటముల నే బ్రార్థించినన్ బాయునే?
భవదంఘ్రిస్తుతిచేత గాక, విలసద్బాల క్షుధాక్లేశదు
ష్టవిధుల్ మానునె? చూడ మేక మెడ చంటన్ దల్లి కారుణ్య దృ
ష్టివిశేషంబున నిచ్చు చంట బలె నో శ్రీకాళహస్తీశ్వరా!

*ధార్మికగీత - 7*


                                     
            *శ్లో:- అమృతం సద్గుణా భార్యా*౹
                    *అమృతం బాలభాషితమ్* ౹
                    *అమృతం రాజసమ్మానమ్*౹
                    *అమృతం మానభోజనమ్*

       
అమృతము నౌను లోకమున
             యన్నిట గూడి చరించు భార్యయున్
నమృతము నౌను లోకమున
            హాయి నొసంగెడు బాలు మాటలున్
నమృతము నౌను లోకమున
            యవ్యయ ప్రేమ సమాదరంబులున్
నమృతము నౌను లోకమున
            హార్ధిక రుచ్యపు భోజనంబుయున్

అభ్యంగన స్నానం



మానవుడికి స్నానం అనునది ఒక భోగం. ఒక యోగం. స్నానాన్ని ఏదో ఒళ్లు తడిపాము అన్నట్లుకాక తనువు మనసు తడిచేలా అనుభూతి చెందుతూ స్నానం ఆచరించాలి. చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడి నీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పురుషులు విధిగా రోజూ శిరస్నానం ఆచరించాలి. పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. శరీరానికి తైలాన్ని (నువ్వులనూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయడాన్ని 'అభ్యంగన(తలంటి)స్నానం' అంటారు. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

'అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం' (అభ్యంగన స్నానం అన్ని అవయవాలూ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడింది.

అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూడదు. శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చేయకూడదు. అనివార్యమై చేయవలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలిగి శుభం కలుగుతుంది.

అభ్యంగన స్నాన వారదోషములు

ఆదివారం - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం - కాంతి, మనోల్లాసము.
మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం - లక్ష్మీ కటాక్షము.
గురువారం - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం - భోగము

అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు. స్త్రీలకు గురు, శుక్రవారములు శుభములు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193447