13, సెప్టెంబర్ 2021, సోమవారం

శ్రీమద్భాగవతము

 *13.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2260(౨౨౬౦)*


*10.1-1377-*


*శా. పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్ గేశబంధంబు లో*

*క క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లాకల్పాంతవేళాపత*

*న్నక్షత్రంబుల భంగి రాల రణసంరంభంబు డిందించి రం*

*గక్షోణిం బడఁద్రొబ్బెఁ గృష్ణుఁడు వెసం గంసున్ నృపోత్తంసునిన్.* 🌺



*_భావము: గరుత్మంతుడు పామును ఒడుపుగా పట్టుకున్న విధంగా, శ్రీకృష్ణుడు కంసుని జుట్టుముడిని పట్టి లాగగా, ఆతని కొప్పులోని రత్నములు, మణులు కల్పాంత సమయములో నక్షత్రరాసులన్నీ జలజలా రాలి పడినట్లు పడిపోయాయి. అక్కడి ప్రజలు హాహాకారములు చేస్తుండగా, శ్రీకృష్ణుడు కంసుని మదమును అణచివేస్తూ ఒక్క ఉదుటున అతనిని రంగస్థలము మధ్యలో పడేటట్లుగా తోశాడు._* 🙏



*_Meaning: Like Garuda holding a serpent, Sri Krishna held the tuft of Kamsa with ease and pulled ferociously, the pearls and diamonds studded in his tuft were scattered and fell on the ground in a splash like the stars falling at the end of a kalpa (end of the world). The people assembled there were startled and stunned and Sri Krishna violently shoved kamsa in a huff from his throne to the middle of the wresting arena._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ప్రపంచస్థాయి ప్రమాణాలను

 🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*రఛయితలు ప్రపంచస్థాయి ప్రమాణాలను ఎలా అందుకోగలరు?*

🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

ఒకసారి ఏదో రేడియో ప్రసంగం కోసం విజయవాడ వచ్చి, విశ్వనాథ వారిని చూసి వెళ్దామని రిక్షాలో వారిఇంటికి వెళ్తుండగా, ఆయన నడిచి వస్తున్నాడు. నేను రిక్షాదిగి నమస్కారం చేశాను. ఏమయ్యా? ఇలావస్తున్నావు అన్నాడు. మిమ్మల్ని చూడడానికి వస్తున్నా అన్నాను. చూశావుగా అన్నాడు. ఆయన మాట అలాగే ఉండేది. అంటే వెళ్లిపొమ్మంటారా? అన్నా. వెళ్దువుగానిలే,రా! అంటూ భుజంమీద చేయివేసి ఇంటివైపు తిరిగాడు. నాలుగడుగులు వేసినతర్వాత 'ఈ ఏడాది నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది?' అని అడిగాడు. హెమింగ్వే కి వచ్చింది అన్నాను.

దేనికి? 'ఓల్డ్ మాన్ అండ్ ది సీ' కి.

 చదివావా?

ఎక్కడ చదువుతామండీ? ఆయన అమెరికన్ రచయిత. ఇంకా ఇండియన్ ఎడిషన్ రాలేదు. అన్నాను.

నువ్వేం ఇంగ్లీషు లెక్చరర్ వయ్యా? ఇలా రా! అని ఇంట్లోకి తీసుకుపోయి, ఆ పుస్తకం చేతిలో పెట్టి "తీసుకొనివెళ్లి చదువు" అన్నాడు. ఆయన తెలుగు లెక్చరరు. ఆయన అమెరికాకు ఉత్తరంవ్రాసి తెప్పించు కున్నాడు. అప్పటికి ఇండియా మొత్తంమీద ఏ ఇంగ్లీషు లెక్చరరూ దానిని ప్రత్యేకంగా తెప్పించుకొని చదివి ఉండడు.అలాంటి ఆయనను ఛాందసుడని మనం ముద్ర వేశాం.


చదువుతానన్నాను. మళ్లీ వచ్చినప్పుడు డిస్కస్ చేయా లన్నాడు. సరే చదివాను. ఇంతక్రితం చెప్పానే? పట్టకం (ప్రిజం)లో ప్రవేశించిన కాంతి విశ్లేషింపబడి ఏడురంగుల్లో వస్తుందని..ఆపద్ధతిలో విశ్లేషించుకొంటూ చదివాను. నాటకీయత, పాత్ర చిత్రణ, శైలి, సంఘటనలు,...ఇవన్నీ దట్టించి వ్రాసుకొన్న నోట్సుతో ఆరునెలల తర్వాత మళ్లీ పనిమీద వచ్చినపుడు ఆయన దగ్గరకు వెళ్ళాను. 


చదివావా? 

చదివాను.

ఏమిటికథ?


 ఒకముసలివాడు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లివచ్చేవాడు. వాడు తన పదహారో ఏటనుండి అరవయ్యో, డెబ్బయ్యో వచ్చేదాకా- పెద్ద చేపను ఎవరూ చూసిఉండనంత పెద్ద చేపను పట్టుకొస్తానని అంటూ ఉండేవాడు. కథ ఎక్కడ మొదలవుతుందంటే .. ఏంవోయ్? అరవై ఏళ్లనుండి అంటున్నావు పెద్ద చేపను పట్తానని, పట్టావా? అని తోటివాళ్ల అడగటంతో. 


పట్తానోయ్, అంటూ సముద్రంలోకి పడవలో వెళ్లిపోయాడు. అతనితోపాటు ఎనిమిదేళ్ల వయస్సున్న అతని మనవడూ ఉన్నాడా పడవలో. సముద్రంలో పెద్దతుఫాను.. హడావుడి.. అంతా వర్ణించాడు. కథంతా అదే. అక్కడ ఒకచేప తగుల్తుంది. కాని లొంగదు. పగ్గం విసిరి, దానిని బంధించి, ఇటువైపు కొసను నావకు కట్టాడు. వెను తిరిగి ఒడ్డుకు వస్తుంటే, అది వెనుకకు లాగుతూ ఉంటుంది. ఈ చిన్న నావతో ముందుకు రావటం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో తిమింగలాలు వచ్చి ఆ చేపను కొట్టి ఇంతింత మాంసం లాక్కొని పోతుంటాయి. బాధ భరించలేక చేప ఎగిరెగిరి పడుతుంటుంది. పడవ ఊగిపోతూ ఉంటుంది. తిరగబడబోతుంది... 


మొత్తానికి ఒడ్డుదగ్గరకు చేరారు. ముసలివాని ప్రాణాలు కడబట్టి పోతుంటాయి. "ఏరా ముసలోడా! పట్తానన్నావు, పట్టావా? అని అడుగుతారు ఒడ్డునున్న గ్రామస్థులు. పట్టాను, ఇదిగో లాగండి అంటూ త్రాడు అందిస్తాడు. దానిని పట్టి లాగగా లాగగా చివరికొక కంకాళం వస్తుంది.


ఏది? చేపను పట్తానని చెప్పి చివరికొక కంకాళం తెచ్చా వేమిటి? అన్నారు. ఏడ్చావ్! మీరెన్నడూ చూడనంత పెద్ద చేపను పట్టానా లేదా? అది కంకాళమైతే నేమి? అన్నాడు. అంతటితో కథ అయిపోయింది.


"నోబెల్ ప్రయిజిచ్చారు. ఎందుకిచ్చారు చెప్పు!" అన్నాడాయన. బాగా వ్రాశాడండి. వర్ణనలూ అవీ.. అనబోతుంటే, "వర్ణనలూలేవు, నీ మొహంలేదు. 'కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన' అని అర్థం చేసుకో. దానిని మనసులో పెట్టుకొని మళ్లీ చదువు" 


నీకర్మ నీవు చేయి. ఫలితం ఆశించకు అని గీతావాక్యం. గీతకు ప్రాణమది. దానిని అర్థంచేసుకొని ఏడవలేదు మనం వందకోట్ల జనం. ఆ ప్రాణం వాడు అందుకున్నాడు. వాడిభాషలో వ్రాశాడు. అందులోని ప్రాణం వాళ్ల కర్థమైంది. అందుకని నోబెల్ ప్రయి జిచ్చారు. మనమూ వ్రాస్తాం- పెంటకుప్పలగురించి. పెంట కుప్పలను దాటి మనదృష్టి వెళ్లదు. ఎటర్నల్ సబ్జెక్టు (శాశ్వతమైన, సార్వకాలికమైన విషయం) తీసుకుని వ్రాశాడు వాడు." 


మనకు నోబెల్ ప్రయిజు రాదేమని చాలామంది అడుగుతుంటారు. మనబుఱ్ఱ ముందుకు వెళ్లకపోతే ఎందుకు వస్తాయి? మానవ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్న సమస్య లున్నాయి. అవి ఆంధ్రుడుకాని, ఆఫ్రికన్ గానీ, పదో శతాబ్దంకానీ ఇరవయ్యో శతాబ్దంకానీ, అవి ఇండియన్ కానీ అమెరికన్ గానీ.. ఎవరైనాకానీ ఎటర్నల్ ప్రాబ్లమ్ తీసుకొని వ్రాయాలి. 


దానినే ఇంతకుముందు Ignoble ని Ennoble చేయటమన్నాను. సమకాలీనాన్ని సార్వకాలీనం చేయటమన్నాను ఆ శక్తి వస్తేనేగాని ఎవరికైనాగాని నోబెల్ ప్రయిజువంటి ప్రపంచ స్థాయి బహుమతులు రావు.


పరమ ఛాందస హిందూ వాది గానూ, పురాతన సాంప్రదాయ కవీశ్వరుడిగా‌ పేరుపడ్డ విశ్వనాధ సత్యనారాయణ గారు ఇంత గొప్ప విశ్లేషణ చేసి వివరిస్తుంటే, మ్రాన్ఫడిపోయి, నోట మాట రాక చూస్తుండిపోయాను.

🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

*(9మార్చి 2002నాడు విజయవాడలో 'సమాలోచన' నిర్వహించిన "తెలుగుకథా సమాలోచనం"లో శ్రీ ప్రోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి ప్రసంగం లోని కొంతభాగం)*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

వశిష్థ విశ్వామిత్ర శతానందాదులవంటి వారేరీ?

 ॐ పాలకులనీ ప్రజలనీ ప్రభావితం చేయగల 

    పురాణాలలోని వశిష్థ విశ్వామిత్ర శతానందాదులవంటి వారేరీ? 


    ఎప్పటివో పురాణాలు అనకుండా, అదే విధానాలని కొనసాగించిన, చరిత్ర చెబుతున్న వీరిని గూర్చి చూడండి. 


1. విద్యారణ్య స్వామి 

    శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాధిపతి. 

    శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు శారదా పీఠాన్ని అధిరోహించారు. 

    విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందారు. 

పుట్టిన సంవత్సరం : 1268

పుట్టిన స్థలం: భారతదేశం. 

సిద్ధిపొందినది : 1391  


2. సమర్దరామదాస స్వామి 

    భారతదేశ చరిత్రలో సమర్దరామదాసుగారి పాత్ర చాలా కీలకమైనది. 

    శివాజీకి మత గురువై, ఛత్రపతి శివాజీతో హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచి మలుపు తిప్పటంలో సమర్ధ రామదాసు పాత్ర గురుతుల్యమైనది. 


పుట్టిన సంవత్సరం : 1608

పుట్టిన స్థలం: అమ్బాద్

సిద్ధపొందిన సంవత్సరం : 1681

సిద్ధపొందిన స్థలం: సజ్జన్గడ్, గజవది  


3. పరమాచార్య - చంద్రశేఖరేంద్ర సరస్వతి 

    వీరు, కంచి కామకోటి పీఠం జగద్గురువుగా అధిష్టించిన వారి వరుస క్రమంలో 68వ వారని తెలుస్తుంది.

    పీఠం అధిష్ఠించినప్పటి నుండి పీఠం అదిష్ఠించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. 

    జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి తన దివ్యదృష్టితో, 

    ప్రజల సమస్యలూ బాధలూ వారే గ్రహించి తెలుపుతూ, తన దైవశక్తితో వాటిని నివారించేవారు.   

    దానికి, ఆయనననను నడిచే దైవంగా, త్రికాల జ్ఞానిగా, ప్రత్యక్షంగా అనుభూతి పొందిన ఈ కాలం పెద్దలే సాక్షులు. 

 

పుట్టిన తేదీ: 20 మే, 1894

పుట్టిన స్థలం: విలుప్పురం

సిద్ధిపొందిన తేదీ: 8 జనవరి, 1994

సిద్ధిపొందిన స్థలం: కాంచీపురం 


    ఆ విధంగా ధర్మబద్ధతతో - నిష్పాక్షిక దిశా నిర్దేశం చేసే అటువంటివారేరీ?             


    — రామాయణం శర్మ

             భద్రాచలం

ప్రశ్న పత్రం సంఖ్య: 27 RF

 ప్రశ్న పత్రం సంఖ్య: 27  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

పరికరాలు -ఉపకరణాలకు  సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు  తెలుపండి

  1) స్టౌమీద వేడిగా వున్న అన్నం గిన్నెను దింపటానికి వాడే ఉపకరణం ఏమిటి. జవాబు: పటకారు 

2) స్క్రూలను బిగించటానికి వాడే పరికరం ఏమిటి జవాబు: స్క్రూడ్రైవరు  

3) దిక్కులను సూచించేటందుకు వాడే పరికరం పేరు ఏమిటి. జవాబు: డిక్సుచి 

 4)  కారు మలుపులు తిప్పటానికి దీనిని తిప్పుతారు. జవాబు: స్టీరింగ్ 

 5) స్త్రీలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయటానికి వాడే సాధనం పేరు ఏమిటి. జవాబు: లాప్రోస్కోపు అందుకే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటారు 

6) కాగితాల మీద నిర్ణిత పొడవు గీతాలు గీయటానికి వాడే పరికరం. జవాబు: స్కెలు 

7) ద్రవపదార్ధాలను కొలవటానికి దీనిని వాడుతారు. జవాబు: లీటరు పాత్ర 

8) కూరగాయల బరువు తూకం వేయటానికి వాడే పరికరం.  జవాబు: తరాజు 

9)  పాల చిక్కదనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు. జవాబు: లాక్టోమీటరు 

10) రెండు బట్టలను కలిపి ఉంచటానికి కుట్టే చేతి పనిముట్టు ఏమిటి. జవాబు: సూది దారము 

 11) కాగితాలను కలిపి సత్వరం కొట్టటానికి వాడే చేతి సాధనం జవాబు: స్ట్రాపులర్ 

12)  జ్వేరం వచ్చినప్పుడు యెంత టెంపెరచారు వుందో తెలుసుకోవటానికి వాడే పరికరం. జవాబు: ధర్మామీటర్ 

 13) కూడికలు చేయటానికి చేతిలో పెట్టుకొనే వాడే పరికరం. జవాబు: కాలికులేటర్ 

14) హృదయస్పందన తెలుసుకొనేటందుకు వాడే పరికరం.జవాబు: స్టెతస్కోపు  

15) పొలంలో మడిదున్నటానికి వాడే ఒక వాహనం పేరు చెప్పండి. జవాబు: ట్రాక్టర్ 

16) మానవ శక్తితో నడిచే ద్విచక్ర వాహనం ఏది. జవాబు: బైసికిల్ 

17) మీ ఇంట్లో ఫాను తిరగటానికి, ఆపటానికి దేనితో నియంత్రిస్తారు. జవాబు: స్విచ్ 

 18)జీర్ణాశయంలో రుగ్మతలను ఈ స్కోపుతో చూస్తారు అది ఏది. జవాబు: ఎండోస్కోపు 

19) నక్షత్రాలను చూడటానికి వాడే పరికరం పేరు ఏమిటి. జవాబు: టెలిస్కోపు 

 20) కంటికి కనపడని సూక్ష్మమైన వాటిని చూడటానికి వాడే పరికరం ఏది. . జవాబు: మైక్రోస్కోపు