🍁 ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.
🍁 ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......
🍁 బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.
🍁 తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.
🍁 ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలం…
*************
: బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి...నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.
ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.
ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.
ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.
మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.
హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.
బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.
శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం:-
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే, కామేశ్వర్యై చ ధీమహి, తన్నోబాలా ప్రచోదయాత్.
: హరిఓం ,
*******************
ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు.
ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.
ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం. సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు... రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా! కనుక భేదం లేదు.
ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు. ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.
ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి. దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు. ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.
శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.
వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు.ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.
ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు. నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.
ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం. కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.
ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ. ఆదిశంకరులకు గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.
అతిథి తృప్తిపడినప్పుడు ‘అన్నదాతా సుఖీభవ’ అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.
అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు. సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం. అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదు. అప్పుడే అది అసలైన ఆతిథ్యం అవుతుంది............ - 🙏🙏🙏
*************************** -
ఆనంద యోగం
సంతోషం మానసిక ఉద్వేగం. అది మనిషికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మనిషికి కావాల్సింది సంతోషం కాదు... ఆనందం. కొంతకాలం మనిషికి హాయి చేకూర్చే సంతోషంకన్నా ఎప్పటికీ తరగని ఆనందం ప్రశాంతతనిస్తుంది.
ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, చాలాకాలం తరవాత బంధుమిత్రులు కలిసినప్పుడు, కోరినది లభించినప్పుడు సంతోషం తాండవిస్తుంది. ఒక సమయంలో అత్యంత సంతోషాన్ని కలిగించినవే మరొకప్పుడు విసుగు, చిరాకు, ఆందోళనలకు గురిచేస్తాయి. సంతోషం సగం బలం. ఆనందం పూర్తి అభయం.
సంతోషం వస్తుంది, పోతుంది. ఆనందం వస్తుంది, పెరుగుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఆనందం మాటలతో వర్ణించలేనిది. హృదయాన్ని పరవశింపజేసే దివ్య వరం. పరమాత్మ ఆనందస్వరూపుడు. భగవంతుడితో సాంగత్యమే ఆనందపు హరివిల్లు. మనిషికి ఈ లోకంలో ఆనందం పంచేందుకు అమ్మను, ప్రకృతిని సృష్టించి దాన్ని అందుకునే ప్రేమ హృదయాన్ని అందించాడు. బృందావనంలో గోప, గోపికల ఆనంద పారవశ్యం శ్రీకృష్ణుడి సాహచర్యఫలమే.
రాసక్రీడల ఆంతర్యం భగవంతుడితో కలిగే ఆనందానికి ప్రతిరూపం.
భృగుమహర్షి బాల్యంలో భగవంతుణ్ని తెలుసుకోవాలని తపస్సు ప్రారంభించాడు. మొదట అన్నం పరబ్రహ్మస్వరూపంగా, ప్రాణం భగవన్మయంగా, ప్రకృతినే పరమేశ్వర రూపంగా భావించాడు. చివరకు భగవంతుడే ఆనందంగా గుర్తించాడని భృగువల్లి పేర్కొంది.
తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లి ఆనంద స్వరూపాన్ని మూడు విధాలుగా వివరించింది. మనుష్యానందం, గంధర్వానందం, బ్రహ్మానందంగా గుర్తించింది. లోకంలోని అనేక ఆకర్షణలు, అనురాగాలు, బాంధవ్యాలు మనుష్యానందానికి చెందినవి. దేవతారాధన, పూజలు, దానాలు, వ్రతాలు... వీటి వల్ల లభించే ఆనందం గంధర్వానందం.
నిజమైన ఆనందం పరమాత్మ సాంగత్యంలో లభిస్తుంది. ప్రకృతిలో, పంచభూతాల్లో, సూర్యచంద్రుల్లో నిండి భూమిపై గల సర్వప్రాణులకు జీవనాధారాన్ని ప్రసాదించే పరమాత్మ అనుగ్రహ వీక్షణమే బ్రహ్మానందం. సృష్టి సమస్తం బ్రహ్మమయం. దాని ప్రాణాధారమే బ్రహ్మానంద స్థితి. మనిషి సంతోషం నుంచి ప్రయాణం సాగించి బ్రహ్మానందస్థితికి చేరాలని ఆనందవల్లి బోధించింది.
పరమాత్మను హృదయంలో అంతర్యామిగా దర్శించాలి. దానికి సాధనామార్గాలు- ధ్యానం, జపం, పూజ, తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు. సామాన్యులకు అవి అందని ద్రాక్షలు. నిరంతరం జీవనపోరాటంలో అలసిపోయే సంసారులకు యోగమార్గాలు ఆకాశదీపాలే.
సామాన్యుల కోసం అయిదు మానవతా విలువలను ఆచరణ మార్గాలుగా వేదం ప్రకటించింది. అవే- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. వాటిని నిత్యజీవితంలో అనుసరించి ప్రతి పనినీ భగవంతుడి ప్రీత్యర్థం కావిస్తే ఆనందానికి మనిషి సులువుగా చేరుకుంటాడు.
మంచినే చూడు, మంచినే విను, మంచినే మాట్లాడు అని మూడు కోతి బొమ్మలతో ఆనందరసానుభూతిని చూపు, శ్రవణం, మాటతో పొందవచ్చనే సందేశాన్ని గాంధీ మహాత్ముడు అందించాడు. మనిషి తన జీవితపరమపద సోపానం సంతోషం అనే మొదటి గడి నుంచి ప్రారంభించాలి. ఆరు దుర్గుణాలనే పాములను తప్పించుకోవాలి. మానవతావిలువలు అనే అయిదు నిచ్చెనలను అధిరోహించాలి. చివరకు బ్రహ్మానంద స్థాయి అయిన చివరి గడిని చేరాలి. అదే పరిపూర్ణ ఆనందజీవితం!
***********************
యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః
సేవ్యతా మక్షయో ధీరాసశ్రియైచా మృతాయచ
హి ధీరా= ఓ!విద్వాంసులారా జ్ఞానదయా సింధో= జ్ఞానమునకు,దయకు ను ఆశ్రయ భూతుడైన, అగాధస్య=గంభీరుడైన, యస్య=ఏ దేవుని యొక్క, గుణాః=గుణములు అనఘా= రాగాది దోషములు లేనివో
అక్షయ=నాశ రహితుడైన, సః = ఆదేవుడు, శ్రియైచ= సంపదకోరకును, అమృతాయచ= మోక్షము కొరకు, సేవ్యతాం= సేవింప బడు గాక యిది పరమాత్మ పరమైన అర్థము.సముద్ర పక్షమందు
యస్య=ఏ, అగాధస్య= లోతైన,సింధో= సముద్రుని యొక్క,,గుణాః =రత్నాకరత్వాది గుణములు, అనఘాః=నిర్దోషము లైనవో అక్షయ= విష్ణువుకు నివాసమైన సః =ఆ సముద్రుడు, శ్రియైచ=లక్ష్మీదేవి కొరకు
అమృతాయచ =అమృతము కొరకు సేవ్యతాం= సేవింప బడుగాక
అనగా పూర్వము దేవతలు సముద్రమును (మధించి) సేవించి లక్ష్మీ దేవిని, అమృతమును బడసి నట్టు భగవంతుని సేవించు వారలు ధర్మార్థ కామము లనెడి త్రివర్గ సంపదను ,మోక్షమును పొందుదురని తాత్పర్యము.
పూర్వము సంస్కృత పాఠం వినడం యిష్టం లేని కొంత మంది కొంటె కుర్రవాళ్ళు
"యస్య జ్ఞాన దయాసింధో గొడదాటితే అదే సందో " అని గోడ దూకి పారిపోయేవారట