28, జూన్ 2020, ఆదివారం

ఆకాలం కవిత సంపుటి

ఆకాలం కవిత సంపుటి కోసం క్రింది లింకుని చుడండి

రచన: సత్య భాస్కర్ 

https://mail.google.com/mail/u/0?ui=2&ik=9ee82f07ff&attid=0.1&permmsgid=msg-f:1670665021494511026&th=172f64fc48d9c5b2&view=att&disp=inline&realattid=f_katj3gdd0


ఎంగిలి దోషం.



మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.

ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.

ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?!

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో  నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.  సర్వే జనాః సుఖినో భవంతు 

ఓంకారం విలువ

ఒక మంచి ఆధ్యాత్మిక కధ

ఒక జ్ఞాని వద్దకు ఒక జిజ్ఞాసువు మోక్ష జ్ఞాన సముపార్జనకోసం వచ్చి ఆ గురువు సేవ చేస్తూ వున్నాడు కానీ గురువు గారికి ఎన్నాలైన కనికరం కలుగలేదు.  ఇక ఓపిక నశించి ఆ శిష్యుడు గురువు గారికి నమస్కరించి స్వామి నేను వచ్చి చాల రోజులు అయ్యిన్ది కానీ నాకు ఇంతవరకు ఆత్మ జ్ఞానం బోధించలేదు దయచేసి బోధించగలరని సవినయంగా వేడుకొన్నాడు.  అప్పుడు గురువు గారు మందస్మిత వదనులై నాయన నీవు ఓం కారాన్ని ధ్యానం చేయి నీకు మోక్షం కారతలామలకలం అవుతుంది అని సెలవిచ్చారు.

శిష్యుడు గురువు గారు చెప్పినట్లే ధ్యానం చేయటం ప్రారంభించాడు.  తరువాత అతను విచారిస్తే ప్రతి మంత్రంలోను ఓంకారం వుంది. నిత్యం అనేకమంది అనేక మంత్రాల్లో ఓంకారాన్ని స్మరిస్తున్నారు.  నాకు గురువు గారు చెప్పిన దానిలో ప్రత్యేకత ఏమివుంది అని అనుకొన్నాడు.  అదే విషయం గురువుగారితో చెప్పాడు.  అప్పుడు గురువు గారు  ఆశ్రమంలోనికి వెళ్లి ఒక రాయిని తీసుకొచ్చి శిష్యుడికి ఇచ్చి నాయన దీనిని తీసుకొని వెళ్లి మార్కెట్లో దీని ధర ఎంతో కనుక్కొని రా.  దీనిని మాత్రం ఎవ్వరికీ అమ్మ వద్దు అని చెప్పిశిష్యుని పంపించారు.

శిష్యుడు ఆ రాయిని తీసుకొని కూరగాయల మార్కెటుకి వెళ్లి అక్కడ కూరగాయలు అమ్మే వర్తకునికి దానిని చూపించి దీని ధర యెంత అని విచారించాడు.  ఆ వర్తకుడు ఆ రాయిని తన తక్కెట్లో (తరాజు) లో వేసి చూసి ఇది దాదాపుగా కిలో బరువు వున్నది దీనిని నేను కూరగాయలు తూకం వేయటానికి వాడుకొ వీలుంది.  దీనికి బదులుగా దీని బరువు వున్నా వంకాయలు నీకు ఇస్తాను అన్నాడు.  అది తేలుసుకొని శిష్యుడు అక్కడినుండి వెళ్లి ఒక కిరాణా దుకాణం వద్దకు వెళ్లి విచారించాడు.  దానికి ఆ షావుకారు ఇది నాకు పప్పులునలగకొట్టటానికి ఉపయోగ పడుతుంది దీనికి నేను ఒక 10 రూపాయలు ఇవ్వగలను అని అన్నాడు. అది తెలుసుకొని శిష్యుడు అతని వద్దనుంచి ఒక రత్నాల వ్యాపారి వద్దకు వెళ్లి ఆ రాయిని  చూపించాడు. ఆ వర్తకుడు దానిని చూసి అక్కడి సాన మీద అరగతీసి దాని మెరుపుని పరిశీలించి ఇది చాలా అపూర్వమైన రత్నం దీని ఖరీదు కట్టటం నా చేత కాదు.  నీకు కావాలంటే నేను ఒక లక్ష రూపాయలను నీకు ఇవ్వగలను అన్నాడు. అన్ని చోట్ల ఆ రాయి విలువ తెలుసుకొని శిష్యుడు గురువు గారివద్దకు వెళ్లి జరిగించి చెప్పాడు.  దానికి గురువు గారు ఓంకారం కూడా ఈ రాయి వంటిది ఒక్కొక్కళ్ళు దానిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ దానివిలువ వారికి తెలిసిందే అని అనుకుంటున్నారు. అకుంఠిత దీక్షతో ఓంకారాన్ని ధ్యానిస్తే తప్పక మోక్షం లభ్యమౌతుందన్నారు.  అప్పటినుండి శిష్యుడు నిరంతర దీక్షతో ఓంకార ధ్యానం చేయసాగాడు.

ఓంకారం చాల విలువైనది.  ఓంకారం సాక్షాత్తు భగవత్ స్వరూపం. భగవంతుడు శబ్దరూపంలో ఓంకారంలో నిక్షిప్తమై వున్నాడు. అందుకే మనం రోజు స్మరించే ప్రతి మంత్రం ఓంకారంతోటె ప్రారంభమవుతుంది.



ఇది నేను ఇటీవల DD National లో చూసిన ఉపనిషత్ గంగ సీరియల్లో ఒక భాగం ఆధారంగా

దూరప్రయాణాలు - పూర్ణిమ, అమావాస్య, గ్రహణం



పూర్ణిమ, అమావాస్య రోజుల్లో, గ్రహణ సమయంలో దూరప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. చంద్రుడు మనః కారకుడు, పూర్ణిమ, అమావాస్య తిధుల్లో మనసు చంచలంగా, గందరగోళంగా, అందోళనగా ఉంటుంది. గమనిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ ఈ తిధుల్లోనూ, మంగళవారం నాడు అధికంగా జరుగుతాయి. మనకు సూర్యోదయం ప్రధానం. వారం మొదలయ్యేది రాత్రి 12.00 గంటలకు కాదు, సూర్యోదయంతో, అలాగే ముగుసేది కూడా రాత్రి 12.00 కాదు, మరునాడు సూర్యోదయానికి ముగుస్తుంది. మనకు అర్ధరాత్రితో సంబంధంలేదు. సూర్యోదయంతోనే రోజును నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నిటిని గమనించి చూడండి, అధికశాతం పూర్ణిమ, అమావాస్య, గ్రహణం, మంగళవారం ఘడియాల్లోనే జరిగాయి. రాత్రి సమయం, తెల్లవారుఝామున అధికంగా జరుగుతున్నాయి.  కనుక ఇటువంటి తిధుల్లో దూరప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ||

జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః | అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||

భావం: నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!

 చంద్రశేఖర్  సిద్ధాంతి రాళ్లబండి

ఆదిత్యహృదయ పారాయణం

ఆదిత్యహృదయ పారాయణం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది.సైంటిస్ట్ లు కూడా ఈ విషయం దృవీకరించారు.ఇది స్మరణ చేసినప్పుడు హార్ట్ లో బ్లాక్ లు వుంటే క్లియర్ అవుతుందని వారి పరిశోధనలో వెళ్ళడైంది.
మనం ఇందులో ఒత్తులు,హల్లులు  పలుకుతున్నప్పుడు ఆవి మన కిడ్నీ పంక్షనింగ్ మరియు హార్ట్ పంక్షనింగ్ సక్రమంగా పనిచేస్తున్నట్లు శాస్ర్తవేత్తలు పరిశోధనలో ఆశ్చర్యపోయారు.మన ప్రాచీన భారతీయ మహర్షులు ఎంత ఆధ్యాత్మిక శక్తి గలవారో ఇది ఒక ఉదాహరణ.ఈ జాతి అంతా మన మహర్షులు కు కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది....

ఆదిత్య హృదయం

ధ్యానమ్
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ‖ 1 ‖

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః ‖ 2 ‖

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ‖ 3 ‖

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ‖ 4 ‖

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ ‖ 5 ‖

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ‖ 6 ‖

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ‖ 7 ‖

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ‖ 8 ‖

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ‖ 9 ‖

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ‖ 10 ‖

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ‖ 11 ‖

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ‖ 12 ‖

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ‖ 13 ‖

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ‖ 14 ‖

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ‖ 15 ‖

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ‖ 16 ‖

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ‖ 17 ‖

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ‖ 18 ‖

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ‖ 19 ‖

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ‖ 20 ‖

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ‖ 21 ‖

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ‖ 22 ‖

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ‖ 23 ‖

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ‖ 24 ‖

ఫలశ్రుతిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ ‖ 25 ‖

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ‖ 26 ‖

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ‖ 27 ‖

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ‖ 28 ‖

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ‖ 29 ‖

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ‖ 30 ‖

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ‖ 31 ‖

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే సప్తోత్తర శతతమః సర్గః ‖
శుభం

సామెతల్లో ఆయుర్వేదం!


.
"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
 వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే  ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "
.
అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...
.
 ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !
.
పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?
.
సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?
.
అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!
జాతి జీవనాడి నశిస్తుంది!
.
వూటుకూరు జానకిరామారావు

ఉపనిషత్తు



హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి

సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు

బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

ఉప +ని + షత్

ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట

ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.

ఉపనిషత్తుల అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి, వారి పేరు మీద చేయబడ్డాయి: అవి యాజ్ఞవల్క, ఉద్దాలక, అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద, సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఇంకనూ చర్చించు, తర్కించు, విచారించు, వివేచించు వారు అయిన గార్గి,, యాజ్ఞవల్క భార్య మైత్రేయి ముఖ్యమైన మహిళలు పేరు మీద కూడా ఉన్నాయి.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, దారా షిఖ్, 1657 లో. పెర్షియన్ భాష లోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగింది.

ఉపనిషత్తులులో ఎక్కువగా బ్రాహ్మణాలు, అరణ్యకములు యొక్క ముగింపు భాగం లోనివి.
భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములును ప్రస్థానత్రయం అంటారు.

గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. 1. పరావిద్య, 2. అపరా విద్య.

ఉపనిషత్తుల విభాగాలు

ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి:
1. ఈశోపనిషత్తు,
2. కేనోపనిషత్తు,
3. కఠోపనిషత్తు,
4. ప్రశ్నో పనిషత్తు,
5. ముండకోపనిషత్తు,
6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు,
8. ఐతరేయోపనిషత్తు,
9. ఛాందోగ్యోప నిషత్తు,
 10. బృహదారణ్యకోపనిషత్తు.*
శైవ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్‌ వర్గీకరణ ఒకటి ఉంది.

శైవులు తమవని భావించే ఉపనిషత్తులు పదిహేను ఉన్నాయి:
1. అక్షమాలికోపనిషత్తు,
2. అథర్వ శిరోపనిషత్తు,
3. అథర్వ శిఖోపనిషత్తు, 4. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు,
6. గణపతి ఉపనిషత్తు,
7. జాబాలోపనిషత్తు,
8. దక్షిణామూర్తి ఉపనిషత్తు,
9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు,
12. రుద్రహృదయో పనిషత్తు,
13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు,
14. శరభోపనిషత్తు,
15. శ్వేతాశ్వతరోపనిషత్తు.

వైష్ణవులు తమవిగా చెప్పే పదునాలుగు ఉపనిషత్తులు:
1. అవ్యక్తోప నిషత్తు,
2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోప నిషత్తు,
4. గారుడోపనిషత్తు,
5. గోపాలతాప సోపనిషత్తు,
6. తారసోపనిషత్తు,
7. త్రిపాద్వి భూతి ఉపనిషత్తు,
8. దత్తాత్రేయో పనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు,
11. రామ తాపస ఉపనిషత్తు,
12. రామరహస్యో పనిషత్తు,
13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు.

సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి:
1. అరుణికోపనిషత్తు,
 2. అవధూతోపనిషత్తు,
 3. కఠశ్రుత్యుపనిషత్తు,
4. కుండినోపనిషత్తు,
5. జాబాలోపనిషత్తు,
6. తురీయాతీత అవధూతోపనిషత్తు,
7. నారద పరివ్రాజకో పనిషత్తు,
8. నిర్వాణోపనిషత్తు,
9. పరబ్రహ్మోపనిషత్తు,
10. పరమహంస పరివ్రాజకోపనిషత్తు,
11. పరమహంసో పనిషత్తు,
12. బ్రహ్మోపనిషత్తు,
13. భిక్షుక ఉపనిషత్తు,
14. మైత్రేయ ఉపనిషత్తు, 15. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు,
16. శాట్యాయన ఉపనిషత్తు,
17. సన్యాసో పనిషత్తు.

ఉపనిషత్తుల సంఖ్య

ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది పది ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన విన వస్తుంటుంది.

 ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉప నిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ, వైదిక వాఙ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సవిూపానికి తీసుకునిపోవడం అనే అర్థం ఉన్నదనీ, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో, ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని పెద్దలు అంటారు..

 ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది

ఋగ్వేదానికి సంబంధించినవి - 10

కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32

శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19

సామవేదానికి సంబంధించినవి - 16

అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)
ఇది ఒక వాట్సాప్ మెసెజ్ నుండి సేకరణ 

ఓంకారం విలువ


ఒక మంచి ఆధ్యాత్మిక కధ
ఒక జ్ఞాని వద్దకు ఒక జిజ్ఞాసువు మోక్ష జ్ఞాన సముపార్జనకోసం వచ్చి ఆ గురువు సేవ చేస్తూ వున్నాడు కానీ గురువు గారికి ఎన్నాలైన కనికరం కలుగలేదు. ఇక ఓపిక నశించి ఆ శిష్యుడు గురువు గారికి నమస్కరించి స్వామి నేను వచ్చి చాల రోజులు అయ్యిన్ది కానీ నాకు ఇంతవరకు ఆత్మ జ్ఞానం బోధించలేదు దయచేసి బోధించగలరని సవినయంగా వేడుకొన్నాడు. అప్పుడు గురువు గారు మందస్మిత వదనులై నాయన నీవు ఓం కారాన్ని ధ్యానం చేయి నీకు మోక్షం కారతలామలకలం అవుతుంది అని సెలవిచ్చారు.
శిష్యుడు గురువు గారు చెప్పినట్లే ధ్యానం చేయటం ప్రారంభించాడు. తరువాత అతను విచారిస్తే ప్రతి మంత్రంలోను ఓంకారం వుంది. నిత్యం అనేకమంది అనేక మంత్రాల్లో ఓంకారాన్ని స్మరిస్తున్నారు. నాకు గురువు గారు చెప్పిన దానిలో ప్రత్యేకత ఏమివుంది అని అనుకొన్నాడు. అదే విషయం గురువుగారితో చెప్పాడు. అప్పుడు గురువు గారు ఆశ్రమంలోనికి వెళ్లి ఒక రాయిని తీసుకొచ్చి శిష్యుడికి ఇచ్చి నాయన దీనిని తీసుకొని వెళ్లి మార్కెట్లో దీని ధర ఎంతో కనుక్కొని రా. దీనిని మాత్రం ఎవ్వరికీ అమ్మ వద్దు అని చెప్పిశిష్యుని పంపించారు.
శిష్యుడు ఆ రాయిని తీసుకొని కూరగాయల మార్కెటుకి వెళ్లి అక్కడ కూరగాయలు అమ్మే వర్తకునికి దానిని చూపించి దీని ధర యెంత అని విచారించాడు. ఆ వర్తకుడు ఆ రాయిని తన తక్కెట్లో (తరాజు) లో వేసి చూసి ఇది దాదాపుగా కిలో బరువు వున్నది దీనిని నేను కూరగాయలు తూకం వేయటానికి వాడుకొ వీలుంది. దీనికి బదులుగా దీని బరువు వున్నా వంకాయలు నీకు ఇస్తాను అన్నాడు. అది తేలుసుకొని శిష్యుడు అక్కడినుండి వెళ్లి ఒక కిరాణా దుకాణం వద్దకు వెళ్లి విచారించాడు. దానికి ఆ షావుకారు ఇది నాకు పప్పులునలగకొట్టటానికి ఉపయోగ పడుతుంది దీనికి నేను ఒక 10 రూపాయలు ఇవ్వగలను అని అన్నాడు. అది తెలుసుకొని శిష్యుడు అతని వద్దనుంచి ఒక రత్నాల వ్యాపారి వద్దకు వెళ్లి ఆ రాయిని చూపించాడు. ఆ వర్తకుడు దానిని చూసి అక్కడి సాన మీద అరగతీసి దాని మెరుపుని పరిశీలించి ఇది చాలా అపూర్వమైన రత్నం దీని ఖరీదు కట్టటం నా చేత కాదు. నీకు కావాలంటే నేను ఒక లక్ష రూపాయలను నీకు ఇవ్వగలను అన్నాడు. అన్ని చోట్ల ఆ రాయి విలువ తెలుసుకొని శిష్యుడు గురువు గారివద్దకు వెళ్లి జరిగించి చెప్పాడు. దానికి గురువు గారు ఓంకారం కూడా ఈ రాయి వంటిది ఒక్కొక్కళ్ళు దానిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ దానివిలువ వారికి తెలిసిందే అని అనుకుంటున్నారు. అకుంఠిత దీక్షతో ఓంకారాన్ని ధ్యానిస్తే తప్పక మోక్షం లభ్యమౌతుందన్నారు. అప్పటినుండి శిష్యుడు నిరంతర దీక్షతో ఓంకార ధ్యానం చేయసాగాడు.
ఓంకారం చాల విలువైనది. ఓంకారం సాక్షాత్తు భగవత్ స్వరూపం. భగవంతుడు శబ్దరూపంలో ఓంకారంలో నిక్షిప్తమై వున్నాడు. అందుకే మనం రోజు స్మరించే ప్రతి మంత్రం ఓంకారంతోటె ప్రారంభమవుతుంది.
ఇది నేను ఇటీవల DD National లో చూసిన ఉపనిషత్ గంగ సీరియల్లో ఒక భాగం ఆధారంగా