17, ఆగస్టు 2023, గురువారం

Chaganti


 

Gravitational force


 

Jonna rotte
















 

PM


 

వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )

 : వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )


శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-

పసుపు ................. 100 grms

కుంకుమ ................100 grms

గంధం .................... 1box

విడిపూలు................ 1/2 kg

పూల మాలలు ........... 6

తమలపాకులు............ 30

వక్కలు..................... 100 grms

ఖర్జూరములు..............50 grms

అగర్బత్తి ....................1 pack

కర్పూరము.................50 grms

చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్ .................1

బ్లౌస్ పీసులు .............. 2

మామిడి ఆకులు............

అరటిపండ్లు ................ 1 dazans

ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు

అమ్మవారి ఫోటోల ......................

కలశము .................... 1

కొబ్బరి కాయలు ............ 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............

స్వీట్లు ..............................

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML


పూజా సామాగ్రి :-

 

దీపాలు ....

గంట

హారతి ప్లేటు

స్పూన్స్

ట్రేలు

నూనె

వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్


శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే

శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి *

ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు *


వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, 

లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.


వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.


కావలసినవి :-

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.


తోరం ఎలా తయారుచేసుకోవాలి :-

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.


గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణికాయ నమః,

ఓంలంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓంధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!


నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!


వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


కలశపూజ :-

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః

కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః


ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥


అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.


అధాంగపూజ:-

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.


చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి. 


(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)


శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృతై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూత హితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓంపరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః

ఓంస్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యైనమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధ సంభవాయై నమః

ఓం అనుగ్రహ ప్రదాయై నమః

ఓంబుద్ధ్యె నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓంలోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓంలోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓంపద్మముఖియై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓంపద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖీయైనమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓంచంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః

ఓంఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః

ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః

ఓంభాస్కర్యై నమః

ఓం బిల్వ నిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓంహేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః

ఓం త్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశగతానందాయై నమః

ఓంవరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓంహిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓంమంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యైనమః

ఓం నారాయణసీమాశ్రితాయై నమః

ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓంభువనేశ్వర్యై నమః


తోరపూజ :-

తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.


కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,

రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,

విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,

క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,

చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే


వ్రత కథా ప్రారంభం :-

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.

శ్రద్ధగా వినండి.


పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


వరలక్ష్మీ సాక్షాత్కారం :-

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.


అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో


సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.


అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.


వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.


భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది....

 🙏అడపా.శ్రీనివాసరావు.  ఊటసముద్రం🙏🏽

స్త్రీలు….* *జడ……*

 *స్త్రీలు….*

           *జడ……*

                      *అంతరార్థం…!*

                     ➖➖➖✍️


*స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?*


*ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.*


**రెండు జడలు వేసుకోవడం (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా ‘చిన్నపిల్ల’ అని, ’పెళ్లికాలేదని అర్ధం.’ అంటే ఆ అమ్మాయిలో ‘జీవ + ఈశ్వర’ సంబంధం విడివిడిగా ఉందని అర్ధము).*


**ఒక జడ వేసుకోవడం (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం).*


**ముడి పెట్టుకోవడం: (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం).*


*అయితే ‘ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా’ చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా  జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు అర్ధాలు ఏమిటీ., అంటే…*


1. *తానూ, భర్త, తన సంతానం* అని ఈ మూడు పాయలకు అర్ధం.


2. *సత్వ, రజ, తమో గుణాలు,*


3. *జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి* అని అర్ధములు.


*అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది.*


*ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి.*



                       🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

పెద్ద పులి,

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

పెద్ద పులి, చిరుత పులి, జాగ్వార్ ఇలా ఏ రకం పులి అయినా, సింహాలు అయినా అంతరించిపోతున్న వన్య ప్రాణి జాబితాలో ఉన్నాయి.


*1*.వాటిని కొట్టడం, చంపడం, వాటి జీవనాన్ని అడ్డుకోవడం నేరం అవుతుంది.

*2*.మానవుల మీద దాడి చేసినపుడు వాటిని పట్టి బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టాలి అంతే కాని వాటిని చంపకూడదు.

*3*.ఒక వేళ చంపాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికోసం విధి, విధానాలు ఉన్నాయి వాటిని తప్పక పాటించాలి.

*4*. ఏ మాత్రం తేడా వచ్చినా ఉద్యోగాలు పోతాయి, జైలు శిక్ష వేయడం వలన.

*5*. రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ఒకసారి జంతు పరిరక్షణ చట్టం చదివితే తెలుస్తుంది.

**********************


ఘనత వహించిన TTD చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కాలి బాటలో తిరుమల వెళ్లే భక్తులకీ చేతి కర్రలు ఇస్తాము అని అనడం బాధ్యతా రాహిత్యం!

అసలు ఆ మాట అనడానికి ఆయనకి అధికారం లేదు. అలాంటి ప్రకటన ఇవ్వాల్సింది జిల్లా కలెక్టర్ అది కూడా అటవీ శాఖ అధికారులతో సంమావేశం నిర్వహించి వేరే దారి లేదు అని అందరూ ఏకగ్రీవంగ ఒప్పుకుంటే అప్పుడు కలెక్టర్ ప్రకటిస్తారు. అఫ్కోర్స్ ఇలాంటివి కోర్టులో చెల్లవు.

*******************


ఇప్పటికే ఓ మూడు కేసులు వివిధ కోర్టులలో విచారణ లో ఉన్నాయి. ఈ కేసులు అన్నీ పులలుని చంపినందుకు గాను అటవీ శాఖ అధికారులతో పాటు చంపడానికి అనుమతి ఇచ్చిన ఆయా జిల్లా కలెక్టర్లు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.


రేపో మాపో ఎవరో ఒకరు హై కోర్టులో కానీ, సుప్రీం కోర్టులో కానీ TTD చైర్మన్ గారి ప్రకటన ని ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తారు చూడండి!

కోర్టు కనుక సదరు PIL ని విచారణ కోసం స్వీకరిస్తే అక్షింతలు తప్పవు.

కోర్టు నిపుణుల కమిటీ వేసి రిపోర్టు ఇవ్వమంటుంది.

సదరు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకుంటే ?

ముందు జనావాసాల వైపు పులులు, ఎలుగుబంట్లు ఎందుకు వస్తున్నాయో అడుగుతుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఎలాగూ కోర్టు ఒప్పుకోదు ,కాకపోతే *''సూది కోసం సోదికేళితే పాత రంకు బయట పడ్డది''* అన్న చందoగా అవుతుంది!


జగన్మోహన్ రెడ్డి మీ వాడే కరుణాకర్ రెడ్డి గారూ కానీ కోర్టులు మీ వి కాదని ఇప్పటికే చాలా సార్లు తెలిసిపోయింది కదా?

అంచేత నేనన్నది వేరు మీడియా చెప్పింది వేరు అని కరుణాకర్ రెడ్డి గారి చేత వివరణ ఇప్పించేయండి చాలు. అప్పుడు పిల్ ఉండదు మిమ్మల్ని గిల్లుడు ఉండదు.


అసలే పవన్ మాంచి ఊపు మీద ఉన్నాడు. పులులని కొట్టడానికి కర్రలు ఇస్తాడుట అంటూ బాహిరంగ సభలో మీమీద ఛలోక్తులు విసరడం ఖాయం!

అప్పుడు గౌరవనీయ మహిళా మంత్రివర్యులు, మాజీ సినీ నటి, జబర్దస్త్ కార్యక్రమ న్యాయమూర్తి గారు అయిన రోజా రెడ్డి గారు పవన్ మీద ప్రతి విమర్శలు చేయడమ్ ఇంత రచ్చ అవసరమా ? జగన్మోహన్ రెడ్డి గారు?

***********************


తిరుమల నడక దారిలో కంచె వేయడానికి మా ప్రభుత్వం లేదా TTD వద్ద తగినన్ని నిధులు లేవు అని మాత్రం అనకండి!

చూశారుగా! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్. రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం 245 కోట్లు ఇవ్వడానికి నిధులు లేవు అన్నందుకు ప్రకటనల కోసం 1100 కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్ళ దగ్గర నుండి డబ్బు వసూలు చేసి మరీ రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ కి అప్పచెపుతాము అని వార్నింగ్ ఇచ్చిందిi.చివరికి 415 కోట్లు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది హై కోర్టు.


మీదగ్గర అలాంటి అవకాశం లేదు కానీ ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వాళ్ళ కోసం సంవత్సరానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారో వివరాలు ఇవ్వమని అడగే అవకాశం ఉంటుంది!

లేదూ ఇప్పటివరకు ప్రభుత్వ సలహాదారులకి ఇచ్చింది వసూలు చేసి కంచె వెయిస్తాము అని అనవచ్చు!

కోర్టు అలా అనక ముందే మీరే కంచె వెయిస్తాము అని ప్రకటిస్తే అంతా సద్దుమణుగు


వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు,రాజకీయం అసలే వద్దు!

గోవింద!


- పార్ధసారధి పోట్లూరి


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

జిమ్ కార్బెట్

 జిమ్ కార్బెట్ అనే ఆయన పేరు చాలామంది వినే ఉంటారు .. ఆయన గౌరవార్థం .. జిమ్ కార్బెట్ట్ నేషనల్ పార్క్ కూడా ఉంది...


పులులు ఇంకా చిరుత పులులు వేటాడంలో ఆయన టాప్..  నరమాంసానికి అలవాటు పడ్డ ఎన్నో పులులను ఆయన ఒక్కడే వేటాడి సంహరించాడు..


ఆయన తన పుస్తకాలలో పులుల వేట గురించి అలాగే మనుషుల పట్ల వాటి బిహేవియర్ గురించి చాలా  వివరంగా రాశాడు.. 


అందులో చేతిలో దుడ్డు కర్ర పట్టుకున్న మనుషుల మీద దాడి చేయడానికి ..పులులు వెనకాడుతాయి అని చాలా స్పష్టంగా రాశాడు.. ఆయన పుస్తకాలు ఆన్లైన్ లో దొరుకుతాయి.. ఎవరికైనా ఆసక్తి ఉంటే చదవవచ్చు...


అలాగే మెష్ వేయచ్చు కదా అనే అపర మేధావులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెష్ వేయడానికి .. కేంద్ర అటవీశాఖ అనుమతి కావాలి..  కానీ వాళ్ళు కూడా అనుమతి ఇవ్వరు .


ఎందుకంటే పులుల ఆవాసం ఒకవైపు .. వాటికి కావాల్సిన నీటి లభ్యత మరో వైపు ఉంది ..


దీనికి  ఏదైనా తరుణోపాయం కుదిరేదాకా మెష్ అనేది కుదరదు...


కర్రలు ఇస్తారా.. అవేమైనా ..పిల్లుల్లా ..కుక్కల్లా అని ఎద్దేవా చేసేవారు ...పోనీ భక్తులకు AK 47 తుపాకులు ఇద్దాం అంటారా ??


అందుకే గుంపులుగా వెళ్ళడం .. ఒక్కో గుంపుకి ..కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ని ఇవ్వడం.. గుంపులో కొంతమంది చేతిలో ..కర్రలు ఉండటం .. ప్రస్తుతం సరైన నిర్ణయమే ...

స్వతంత్ర భారతం -

 ॐ 76 సంవత్సరాల స్వతంత్ర భారతం - 

                ఆత్మవిమర్శ చేసుకొనే విషయాలు 


3. లౌకికత - మతము - సంస్కృతి 


    42వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగ ప్రవేశికలో చేర్చుకొన్న "సామ్యవాద, లౌకిక" అనే రెండు పదాలలో "లౌకిక" అంటే ముందు తెలుసుకోవాలి. 


లౌకిక


    లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 

    ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. 

    అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. 

    దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. 

    పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు. 


మతం - స్వామి వివేకానంద 


    మతం అనేది వ్యక్తిగతమనీ, అది సామాజికం కాదనీ స్వామి వివేకానంద తమ లేఖలలో ఒకదానిలో క్రిందివిధంగా పేర్కొన్నారు. 


    Specially therefore you must bear in mind that 

    religion has to do only with the soul and 

    has no business to interfere in social matters. 

    you must also bear in mind that 

    this applies completely to the mischief which has already been done. 

    It is as if a man after forcibly taking possession of another's property, 

    cries through the nose when that man tries to regain it and 

    preaches the doctrine of the sanctity of human right! 

 

    ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు పరిశీలించాలి. 


అ) ఇండోనేషియా సైన్యం - హనుమంతుడు 


    ఇండోనేషియా ఒక ముస్లిందేశమని అందరికీ తెలిసిన విషయమే! 

    వాళ్ళు సైన్య శిక్షణాంతరం ఉండే passing out paradeకి, పాక్ ఆనాటి నియంత జియావుల్ హక్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 

    ప్రతి అధికారీ హనుమంతుని విగ్రహం ముందు పెరేడ్ చేస్తున్నాడు. శపథం స్వీకరిస్తున్నాడు. 

    ఇది చూసిన జియావుల్ హక్ కు ఒళ్ళు మండిపోయింది. 

    అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు. 

    ఆ సైన్యాధికారి ఎంతో గర్వంతో " మేము మతాన్ని మార్చుకొన్నామేగానీ, మా సంస్కృతీనీ, పూర్వులనీ మార్చుకోలేదు కదా!" అని  సమాధానమిచ్చాడు. 

    

ఆ) రామాయణం - నెహ్రూ లౌకికత 


    1950 దశకంలో ఇండోనేషియాలో "అంతర్రాష్ట్రీయ - రామాయణ మహోత్సవం" జరిగింది. 

    అందులో భాగంగా జరిగే  నృత్యనాటిక ప్రదర్శనలకి కళాకారుల బృందాలని  పంపమని ఆ దేశం ఆహ్వానిస్తే, 

    అప్పటి మన ప్రధాని నెహ్రూ, "మనది సెక్యులర్ దేశమనీ, అందువలన కళాకారులను పంపడం కుదరదనీ" తెలిపాడు. 

    మన సంస్కృతీ పరిరక్షణకన్నా, రాజ్యంగంలో అప్పుడు లేని "లౌకికత్వం" తనకి ముఖ్యమైంది. 


ఇ) ఇందిర ప్రభుత్వం - మహమ్మదీయం లౌకికత 


    మొరాకోలో జరిగిన అంతర్రాష్ట్రీయ ముస్లిం సమ్మేళనానికి, ఆహ్వానం లేకపోయినా, ఇందిర ప్రభుత్వం, 

    కేంద్రమంత్రి ఫక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ ని పంపింది. 

   చాలా ముస్లిం దేశాలకన్నా మన దేశంలో ముస్లిం జనాభా ఎక్కువట. అందువలన పంపించక తప్పలేదని తన చర్యని సమర్ధించుకొంది. 


పరస్పర విరుద్ధాలు 


(i) నెహ్రూ ప్రధానిగా రామాయణం మతపరమైనదని, లౌకికం ప్రదర్శించడం. 

(ii) ఆయన కుమార్తె ఇందిర, ప్రధానిగా ప్రభుత్వం తరఫునే ముస్లిం సమ్మేళనానికి ప్రతినిధిని పంపడం. 


ఈ) ప్రస్తుతం మనముందు 


    2016 సంవత్సరం ఇండోనేషియా దేశ, విద్య మరియు సాంస్కృతీ శాఖ మంత్రి అనీస్ - బాస్వేదన్ 

    మన దేశం వచ్చి అన్న మాటలు అందరూ తెలుసుకోవాలి. 

   "మా దేశం రామాయణ ప్రదర్శనలకు పెట్టిందిపేరు. 

    మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీ దేశంలో వివిధ నగరాలలో పర్యటించి రామాయణ ప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. 

    మీ కళాకారులు కూడా మా దేశానికి రండి. 

    ఇరు దేశాలూ కలిసి ప్రదర్శనలిద్దాం. 

    ఇరు దేశాల విద్యార్థులకూ శిక్షణనిద్దాం. 

    మా విద్యావిధానంలో రామాయణాన్ని చేర్చాం" అన్నారు. 


మన సమస్య 


    మనం "లౌకిక" అనే పేరుతో, "మత నిరపేక్ష" నుండీ "ధర్మ - సంస్కృతీ నిరపేక్ష" దేశంగా మారిపోయాం. 

    మన ధర్మ - సంస్కృతులను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. 


కారణం - పరిష్కారం 


    మహమ్మదీయం, క్రైస్తవం అనే మతాలు ఏర్పడిన కాలాలలో, 

    ఆయా ప్రదేశాలోని సంస్కృతీ ఆచారాలే, ఆయా మతాలకి సంక్రమించాయి. 

    కానీ, భారతీయ ధర్మమూ - సంస్కృతులూ మతాలకి చెందినవికావు. 


    కాబట్టి, 

    మతాలని, సంస్కృతీ - ధర్మాలనుంచీ వేరుచేసి, 

    సంస్కృతీ - ధర్మాలకి చెందిన రామాయణం "లౌకికం" అని నిర్థారించుకొంటే, 

    రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడ్డ "లౌకిక" అనే పదం, 

    దేశంలో ప్రధాన సమస్యకి పరిష్కారంగా అయిపోతుంది కదా! 


                                 సశేషం 


              భారత్ మాతాకీ జై 

                వందే మాతరమ్  


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

గోవిందరాజు సుబ్బారావు

 గోవిందరాజు సుబ్బారావు (1895 -1959 )



తెర మీద అయన కనబడితే అయన కనబడరు  అయన పాత్ర తప్ప . సహజ సంభాషణలు , అర్థవంతమైన అభినయం వాచికం ఆయన సొంతం. 


అయన సినిమాల్లో అడుగు పెట్టేనాటికి ఆయన నడివయసులో ఉన్నా అయన ప్రజ్ఞ చూసి చాలా ప్రధాన పాత్రలే వచ్చాయి. అయన వృత్తి రీత్యా వైద్యుడు . ఇటు హోమియోపతి  లో కూడా అందెవేసిన చేయి . 


ఆంగ్లం , సంగీతములో కేవలం సప లు మాత్రమే కాక అనేక రాగాల మీద ఆయనకు మంచి పట్టుంది . సంగీతం, సాహిత్యం, సైన్స్ ఇలా ఏది పట్టుకున్నా ఆయనకు అన్ని విషయాలు కరతలామలకాలే  .  


ఐన్ స్టీన్ కి   ఉత్తరాలు వ్రాసి  అణుశాస్త్రం, ఆర్గానిక్ శాస్త్రం మీద  చర్చలు జరిపినంత పట్టు ఆయనకు ఉంది . కానీ ఆయనకు వీటన్నింటిని మించి నాటకాలు సంగీతం సాహిత్యం ఇవే అమిత ఇష్టం . తొలినాళ్లలో నాటకాలు ఆ తరువాత సినిమాలు మరో వైపు వైద్యం . అటు సాత్విక పాత్రలు ఇటు క్రూర పాత్రలు ఏవైనా వేయగల దిట్ట . 


గోవిందరాజు సుబ్బారావు గారి ప్రతిభ చూసే మొదట మాలపిల్ల 1939  లో ఛాందసుడిగా ఉండే సుందర రామ  శాస్త్రి పాత్రకు ఆయన్ని  ఎంపిక చేసారు గూడవల్లి  రామబ్రహ్మం  గారు. ఆయనకు   వీరు సముద్రాల గారి ద్వారా  పరిచయం. 


మాలపిల్ల చిత్రంలో సుందర రామ శాస్త్రిగా ఆ చిత్రములో వేసినందుకు ఆయన సంఘం నుండి కొన్నాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన పట్టించుకోలేదు. అది కేవలం పాత్ర .. నేనూ సదాచార బ్రాహ్మణుణ్ణి .. ఎక్కడ ఏ రోజు ఆచారం తప్పలేదు . అది కేవలం ప్రవృత్తి అని చెప్పుకునేవారు . 


మాలపిల్ల  తరువాత ఆయన గృహలక్ష్మి లో నటించినా ఆయనకు పెద్ద పేరు తెచ్చిన చిత్రం జెమినీ వారి బాల నాగమ్మ . అందులో మంత్రాల మరాఠీ గా ఆయన చూపిన హావ భావాలూ చూసి ఆనాటి పిల్లలూ, పెద్దలూ జడుసుకున్నారట . అందుకని కన్నాంబ గారిని ఆయన్ని బూచాడు అని పిలిచేవారు . 


బాలనాగమ్మ  1942  తరువాత ఆయనకు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిన చిత్రాలు శారదా వారి పల్నాటియుద్ధము లో బ్రహ్మనాయడు పాత్రలో, ఆ తరువాత వచ్చిన గుణసుందరి 1949   కథలో మహారాజు పాత్ర, షావుకారు 1950   చిత్రములో     షావుకారు చంగయ్య పాత్ర , 1955  లో వచ్చిన వినోదా వారి  కన్యాశుల్కములో లుబ్దావధానులు పాత్ర . 


ఆయన చివరిగా కనబడిన చిత్రాల్లో చిరంజీవులు, చరణదాసి, భాగ్యరేఖ , పాండురంగ మహాత్మ్యం. ఆయన నాగయ్య గారి భక్త రామదాసులో నటించేప్పుడు మరణించారు. ప్రఖ్యాత నర్తకుడు ఉదయశంకర్ తీసిన  చిత్రము కల్పన 1948 లో ఆయన కూడా ఉన్నారు.


ఆయన అనేవారు నాటకములో ఒన్స్  మోర్ అన్నట్టు జీవితములో కూడా జరిగే మధుర స్మృతులను ఎవరన్నా ఒన్స్ మోర్ అంటే బాగుంటుంది . కానీ దైవం అనేవాడు దీనికి వీలు లేకుండా చేసాడు . భగవంతుని సృష్టి విలాసాలు ఎవరు అర్థం చేసుకోలేరు . ఆయన విశ్వ నిర్మాణమే కడుంగడు విచిత్రం . మనలో మనం ఎంత తన్నుకున్న తిట్టుకున్నా మళ్ళీ ఏదో రోజు ఒరేయ్ చలపాయ్ , ఒరేయ్ నరసింహులు , ఒరేయ్ రాముడూ, కుటుంబరావు అని ఆప్యాయంగా పిలుచుకునే రోజులు . ఉప్పిండి చేశాను కాస్త అయినా నోటిలో వేసుకోరా అని   మా వెంకమ్మత్తయ్య   అంటుండే వారు . ఆరోజులు మళ్ళీ  వస్తాయా అసలు . 


అందరూ అంటారు మీరు చేసిన సుందరరామయ్య పాత్ర, షావుకారు  చంగయ్య పాత్ర  మాకు బాగా నచ్చాయని . నాకు మాత్రం ఇంకెవరైనా తల పండిన వారు ఆ పాత్రల్లో ఉండి ఇంకా భేషుగ్గా చేసేవారని అనిపిస్తుంది . ఒక వేళ ప్రేక్షకులు బాగుందన్నా నేనూ సంతోషముతో ఎగిరిపోను .. బాగో లేదన్నా కృంగిపోను. 

నటుడుని కాబట్టి ఒక్కోసారి ఆ పాత్రలో ఇలా చేసి ఉంటే ఇంకాస్త బాగుండేమో అనిపిస్తుంది నాకు .   


నాకు సినిమా , నాటకం , మరో పక్క వైద్యకం .. మాత్రమే కాక రేడియో లో చేయడం కూడా ఇష్టమే . ఇక్కడ కనబడకుండా కేవలం మాటతోనే మన హావ భావాలూ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ముందు మూడింటి కన్నా ఇది కత్తి మీద సాము వంటిది .మొదట్లో నాటకం కంటే సినిమా నటనం కష్టం అని భయపెట్టారు. కానీ అవి రెండూ నాకు  పెద్ద గొప్పగా అనిపించలేదు గానీ .. ఈ రేడియో మాత్రం నాకు చాల సరదా ని  తెచ్చి పెట్టింది. 


మాలపిల్ల సినిమా లో చేసేప్పుడు ఓ సన్నివేశములో ఇల్లు తగలబడేప్పుడు ఆ తగులపెట్టిన పెట్రోల్ కిరోసిన్ వాసనా మరియు ఆ సెగకు , రెండూ మూడు మార్లు రి టేక్  వల్ల నా ఆరోగ్యం బాగా దెబ్బ  తింది . ఆ వాసనకు వేడికి నా ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి . సారథి వారు దయ తలచి వాళ్ల మేడ మీద నాకు బస ఏర్పాటు చేసారు.  మహానుభావుడు డాక్టర్ కేశవ పాయి గారి హస్తవాసి వల్ల బ్రతికి బయటపడ్డాను. ఆరోజుల్లో నేను పోయాను అని పేపర్ లో కూడా వచ్చిందిట . 


ఎవరో రామ బ్రహ్మం గారికి ఫోన్ చేసి ఎందరికో రోగాలు కుదిర్చిన మహానుభావుడికి ఈ రోగం వచ్చి పోవడం ఏమిటి అని  అడిగితే మా ఇంటిలో మేడ మీద గదిలో భేషుగ్గా ఉంటేనూ అని చెబితే గానీ లోకానికి తెలియరాలేదు .అందుకే  ఏదో వచ్చిన పాత్రలన్నీ చేసేయాలని నాకు లేదు . పాత్ర పది కాలాలు నిలబడగలుగుతుందా అని అనిపిస్తే మాత్రమే చేశాను. పిన్న వయసులోనే వృద్ధుడను అయిపోయాను అనిపిస్తుంది కానీ అంతా భగవంతుని లీల కదా అనిపించినపుడల్లా మనసు కుదుటపడుతుంది   .

శ్రీ చండీ స్థాన్

 🕉 మన గుడి :





⚜ బీహార్ : ముంగేర్


⚜ శ్రీ చండీ స్థాన్



💠 దేశంలో 52 శక్తిపీఠాలు ఉన్నాయి, అన్ని శక్తిపీఠాలలో అమ్మవారి శరీరం యొక్క ఒక భాగం పడిపోయింది. 

అందుకే ఇక్కడ దేవాలయాలు ఏర్పడ్డాయి. అటువంటి శక్తిపీఠం బీహార్‌లోని ముంగేర్ జిల్లాకు 4 కి.మీ దూరంలో ఉంది. 

సతీదేవి ఎడమ కన్ను ఇక్కడ పడింది.

ఈ ఆలయాన్ని చండికా స్థాన్ మరియు శ్మశాన చండి అని పిలుస్తారు. 


💠 ఒక సిద్ధిపీఠం అయిన చండీ స్థాన్ గౌహతి సమీపంలోని కామాఖ్య దేవాలయం వలె అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 


💠 స్థానిక విశ్వాసాల ప్రకారం, ఆలయాన్ని సందర్శించే భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ప్రదేశానికి సంబంధించి, కళ్లకు సంబంధించిన ప్రతి వ్యాధికి ఇక్కడ చికిత్స జరుగుతుందని ప్రజలు అంటున్నారు. 

అవును, ఇక్కడ ప్రత్యేకమైన మస్కారా( కాటుక ) అందుబాటులో ఉంది, దానిని కళ్ళలో పూయడం ద్వారా, వ్యక్తి యొక్క కళ్ళకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. 


💠 ఆలయానికి తూర్పు మరియు పడమరలలో శ్మశానవాటిక ఉన్నందున మరియు ఆలయం గంగానది ఒడ్డున ఉంది. దీని కారణంగా ప్రజలు తాంత్రిక తంత్ర విజయాల కోసం ఇక్కడకు వస్తారు. 


💠 నవరాత్రుల సమయంలో ఆలయ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఆలయంలో ఉదయం మూడు గంటలకు అమ్మవారికి పూజలు ప్రారంభించి సాయంత్రం అలంకరణ పూజలు కూడా చేస్తారు. 

ఇక్కడి అమ్మవారి ఆస్థానానికి హాజరవడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో కాల భైరవ, శివ మరియు అనేక హిందూ దేవతల ఆలయాలు ఉన్నాయి.


💠 అంతే కాకుండా ఈ ఆలయం మహాభారత కాలం నాటిది. 

కర్ణుడు మా చండికా యొక్క అత్యున్నత భక్తుడు. 

రోజూ మరుగుతున్న నూనెలో దూకి తల్లి ఎదుటే చనిపోయేవాడు, ఆ తల్లి సంతోషించి అతనికి ప్రాణదానం చేసి దానితో పాటు బంగారం కూడా ఇచ్చేవారు.

ముంగేరులోని కర్ణ చౌరహానికి తీసుకెళ్లి బంగారమంతా పంచిపెట్టేవాడు కర్ణుడు.


💠 ఈ విషయం తెలుసుకున్న ఉజ్జయిని రాజు విక్రమాదిత్య అక్కడికి చేరుకుని ఆ దృశ్యాన్నంతా తన కళ్లారా చూశాడు. 

ఒక రోజు కర్ణుడి కంటే ముందుగా గుడికి వెళ్లి బ్రహ్మ ముహూర్తంలో గంగానదిలో స్నానం చేసి, కాగుతున్న నూనె కుండలోకి దూకాడు. 

తల్లి అతన్ని బ్రతికించింది. అతను అలా మూడుసార్లు దూకాడు మరియు మూడుసార్లు తల్లి అతనికి ప్రాణం పోసింది. నాల్గవసారి దూకడం ప్రారంభించినప్పుడు, తల్లి అతన్ని ఆపి, కోరుకున్న వరం అడగమని కోరింది. రాజు విక్రమాదిత్యుడు  తల్లిని బంగారం ఇచ్చే సంచి మరియు అమృత పాత్రను అడిగాడు. 


💠 భక్తుని కోరికను తీర్చిన తరువాత, తల్లి జ్యోతిని బోల్తా కొట్టింది మరియు ఆమె లోపల అదృశ్యమైంది. నేటికీ గుడిలోని కుండ తలకిందులుగా ఉంది. ఆ లోపల తల్లి పూజించబడుతుంది. ఆలయంలో పూజలు చేసే ముందు విక్రమాదిత్యుని పేరు, ఆ తర్వాత మా చండిక అని పిలుస్తారు.


💠 ముంగేర్ పట్టణానికి ఈశాన్య మూలలో ఉన్న చండీ స్థాన్, ముంగేర్ పట్టణానికి కేవలం 2 కి.మీ దూరంలో ఉంది.

ఈ ప్రదేశం పాట్నా-భాగల్పూర్ రైల్వే లైన్‌లో జమాల్‌పూర్ స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది,

సౌందర్యలహరి 🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


.        *🌹సౌందర్యలహరి ప్రారంభం🌹*


*🍁ముముక్షువుల అర్హతను బట్టి వారి జ్ఞాన సముపార్జనకు సహాయపడేటట్లు ఆదిశంకరాచార్యులు చేసిన ప్రస్థానత్రయ భాష్యాలు (బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత), ప్రకరణ గ్రంథాలు (ఆత్మబోధ, వివేకచూడామణి, అపరోక్షానుభూతి వంటివి) కాకుండా మన స్థాయి వారికోసం చేసిన స్తోత్రాలలో శివానందలహరి, సౌందర్యలహరి ముఖ్యమైనవి*.


*🍁అయ్యవారి గురించి చేసిన స్తోత్రంలో 'ఆనందం' అనే మాట వాడితే, అమ్మవారి స్తోత్రానికి వచ్చేటప్పటికి 'సౌందర్యం' అనే శబ్దం ఎందుకు వాడారు? మనకు తెలుసు -- సుందరుడు పురుష శబ్దం, సుందరి స్త్రీ శబ్దం. అయితే అమ్మవారు కేవలం సచ్చిదానందస్వరూపిణి. ఆ స్వరూపానికి లింగభేదం అన్వయించదు. విశ్వమంతా వ్యాపించి వున్న స్వరూపమది. ఆమె తప్ప మరొకటి లేదు. అది సాధన వల్ల మాత్రమే తెలుసుకోగలిగిన తత్వము. ఆమెయే చైతన్యము, ఆ చైతన్యమే సౌందర్యం. ఆ సాధనయే శ్రీవిద్యోపాసన. ఇక లహరి అంటే కెరటాలు , తరంగాలు; నిరంతరం ఒకదాని వెనుక ఒకటిగా ప్రవహించటం. అమ్మవారి  చిచ్ఛక్తి ఆ విధంగా ప్రపంచమంతా ప్రసరిస్తూ ఉంటుంది. శివానందలహరి, సౌందర్యలహరిలలో ఏది గొప్పది అంటే ఒక్కటే చెప్పవచ్చు. అందమే ఆనందం అని. ఏది ఆనందం కలిగిస్తుందో అదే అందం. చైతన్య రూపిణితో తాదాత్మ్యం కలిగించే ఆనందమే శివానందం, సచ్చిదానందం, సత్యం-శివమ్-సుందరం*.


*🍁శంకరుల స్తోత్రాలు ఉపాసనా సంబంధమైనవి, మంత్ర శక్తి కలిగినవి. ఏ దేవతనుద్దేశించి స్తోత్రం చేస్తున్నామో, ఆ దేవత ఈ స్తోత్ర నాదంలో ఉంటుంది. ఆత్మవిద్య సాధనలో చిత్త ఏకాగ్రత అవసరం. అట్టి ఏకాగ్రతను ఉపాసన ద్వారా పొందవచ్చు. ఉపాసన ద్వారా* *అమృతమును పొందుతున్నాను అంటుంది ఉపనిషత్. అమృతత్త్వము అంటే మృత్యువు లేకపోవటం. అంటే ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందని కాదు. మృత్యువును కూడా సాక్షీభూతుడిగా చూస్తాడు జీవుడు, ఎలాటి దుఃఖము, చింత లేకుండా. దేహమే నేను అనుకోవటం అవిద్య, అజ్ఞానం. ఉపాసన ద్వారా ఈ అవిద్యను దాటి బ్రహ్మజ్ఞానమును పొందాలి. భక్తి, యోగ, జ్ఞాన సమన్వయమే  శ్రీవిద్య. అది బ్రహ్మజ్ఞానాన్నిస్తుంది. నిరంతర సచ్చిదానందమును కలిగిస్తుంది*.


*🍁సౌందర్యలహరిలో ప్రధానమైన అంశం శివ, శక్త్యైక భావం. శివ, శక్తుల ఐక్య దర్శనమే 'సమయాచారము' అన్నారు*. *మన శరీరంలోనూ, ప్రపంచంలోని అన్ని జీవుల్లోనూ, వస్తువుల్లోనూ, అవసరమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి పరమేశ్వరునిది. ఆయననూ, ఈ శక్తినీ కలిపి దర్శించగలగాలి మనం. ఆ శక్తియే మంగళం. శివునిది కాబట్టి శివే. ఈ శక్తి* *పురుషార్ధములను సాధించిపెడుతుంది కనుక సర్వార్థ సాధికే. శివుడిని వదిలేసి శక్తిని మాత్రమే పూజించటం వామాచారం అనబడుతుంది. దక్ష ప్రజాపతి అలా అనుకొనే భ్రష్టత్వం పొందాడు. శంకరులు అందుచేతనే శివానంద లహరిలోనూ, సౌందర్యలహరి లోనూ, ప్రారంభ శ్లోకాలు శివ, శక్తుల ఏకత్వాన్ని, సామ్యతను ప్రస్తుతించారు*. 


*🍁ఇవి నామ సామ్యం: శంకర/శాంకరి రూపసామ్యం ఇద్దరూ త్రినేత్రులు, చంద్రకళాధారులు*. *ఆయన కామేశ్వరుడైతే, ఈమె కామేశ్వరి  అధిష్టాన సామ్యం: శివ శక్త్యాత్మికములు కనుక లింగార్చన, శ్రీచక్రార్చన ఏది* *చేసినా ఇద్దరికీ కలిపి చేసినట్లే కృత్యసామ్యం: సృష్టి, స్థితి, లయము, తిరోధానము (మాయ ఆవరించటం) అనుగ్రహము (ఆ మాయను తొలగించటం) అనబడే పంచకృత్యములు చేయటంలో* *అమ్మవారు అయ్యవారికి ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. అమ్మ నామాల్లో సామరస్య పరాయణ అన్నారందుకే.లలితా* *సహస్రనామాల్లోని చివరి నామమైన శివా శివ శక్త్యైక రూపిణీ తో సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం ప్రారంభం అవుతుంది*. *🍁లలితా నామాలు ఇందులో శబ్దపరంగా, భావపరంగా కనబడతాయి*.


*శంకరులు ఈ స్తోత్రం చేయటం వెనుక ఒక ఇతిహాసం చెప్తారు. ఆయన దేశాటనం చేస్తూ కేదారంలో తపస్సు చేస్తూండగా దత్తాత్రేయ దర్శనం లభించి. వారి ఆదేశానుగ్రహాలతో యోగశక్తితో కైలాసం వెళ్తారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను భక్తితో ప్రార్ధించగా సంతసించిన ఈశ్వరుడు అయిదు స్ఫటిక లింగములను, అమ్మవారు నూరు శ్లోకాల స్తోత్ర గ్రంథాన్ని శంకరులకు బహుకరించారట. ఆయన తిరిగి వస్తుండగా నందీశ్వరుడు అడ్డగించి విషయం తెలుసుకొని అయిదు స్ఫటిక లింగములను తీసుకువెళ్ళమని అమ్మవారిచ్చిన నూరు శ్లోకాలలో 41 మాత్రమే శంకరులకిచ్చి మిగిలినవి తనవద్దనే ఉంచుకొన్నాడట*. 


*అంటే భోళా శంకరుడు భక్తులకు వారు అడిగినవన్నీ ఇచ్చినా అర్హతను నిర్ణయించి ఎవరికి ఎంతవరకు అవసరమో ఇస్తాడట నందీశ్వరుడు. అందుకే మనకు లోకంలో ఒక సామెత వుంది. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడు అని. ఇక అప్పుడు శంకరులు మారు మాటాడక చిదంబర క్షేత్రానికి చేరి అమ్మవారి పై మిగిలిన 59 రచించారట. చిదంబరం శ్రీచక్ర క్షేత్రమని చెప్తారు. ఇక్కడ అమ్మవారు శివకామసుందరి. నటరాజ స్వామి సాక్షాత్తు శ్రీచక్ర రూపమేనని చెప్తారు.*


🍁 *అమ్మవారు అనుగ్రహించిన 41 శ్లోకాల్లో దివ్యమైన మంత్ర*, *తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు నిక్షిప్తమై* *ఉన్నాయట ఇవి సచ్చిదానంద తత్త్వమును చెప్తాయి*. 


*🍁మిగిలిన శ్లోకాల్లో అమ్మవారి సౌందర్య వర్ణన వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి*. 


*🍁శంకరులు కైలాసంనుండి తెచ్చిన అయిదు స్ఫటిక లింగాలు ఇప్పటికీ త్రికాల పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాయి*. ఇవి


 *🚩ముక్తిలింగం - కేదారనాథ్* 

 *🚩వర లింగం - నీలకంఠ క్షేత్రం* (నేపాల్)

*🚩భోగలింగం - శృంగేరి శారదా పీఠం*

*🚩మోక్షలింగం - చిదంబరం* *నటరాజ ఆలయం* 

*🚩యోగలింగం - శ్రీ కంచీ కామకోటి పీఠం*. 


*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే* 

 *శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే*.🙏🏻*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

రామచంద్ర డోంగ్రే

 రామచంద్ర డోంగ్రే తన భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బులు లేని ఓ భాగవతకథకుడు. 



కథకు ఒక్క రూపాయి కూడా తీసుకోని మహానుభావుడా మీకు పాదాభివందనం🙏 


తులసి ఆకులను మాత్రమే తీసుకునే గౌరవనీయులైన రామచంద్ర డోంగ్రే మహారాజ్ వంటి భాగవతాచార్యులు కూడా ఉన్నారని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.  


ఆయన ఎక్కడ భాగవతకథ చెబుతారో, అందులో ఏ విరాళం వచ్చినా, 

అదే నగరంలో లేదా గ్రామం లోని పేదల సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చేవారు.


ఎలాంటి ట్రస్ట్ వారి నుండి సృష్టించబడలేదు, మరియు ఎవరినీ శిష్యులుగా చేయలేదు.


తనకిష్టమైన ఆహారాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత, ఠాకూర్జీకి భోజనం పెట్టి ప్రసాదం తీసుకునేవాడు.  


డోంగ్రే మహారాజ్ కలియుగానికి చెందిన దానవీర కర్ణుడుగా చెప్పవచ్చు.


గోరఖ్‌పూర్‌ లోని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన చౌపాటీలో ఆయన చివరి ప్రసంగంలో కోటి రూపాయలు సేకరించారు.


తానేమీ తీసుకోలేదు.


డోంగ్రే మహారాజ్ వివాహం చేసుకున్న తరువాత తన మొదటిరాత్రి సమయంలో, ఆయన తన భార్యతో, 


"దేవి, మీరు నాతో ఉన్నప్పుడు 108 భాగవతకథలను చెప్పాలనుకుంటున్నాను.

ఆ తర్వాత మీరు కోరుకుంటే, మేము గృహస్థాశ్రమం లోకి ప్రవేశిస్తాము" అని చెప్పాడు.


దీని తరువాత, 

డోంగ్రే జీ మహారాజ్ భాగవతకథలను ప్రవచనం చేయడానికి ఎక్కడికి వెళ్లినా, ఆయన భార్య కూడా ఆయనతో పాటు వచ్చేది.


108 భాగవతకథలు పూర్తికావడానికి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది.  


అప్పుడు డోంగ్రే మహారాజ్ తన భార్యతో ఇలా అన్నాడు. 

ఇప్పుడు మీరు అనుమతిస్తే, మేము గృహస్ధాశ్రమంలో ప్రవేశించి, మీకు మన వంశ ఉద్ధరణకు పిల్లలను కనాలి అనుకుంటున్నాను అన్నాడు.


దీనిపై ఆయన సతీమణి.. 

‘‘మీ నోటి నుంచి 108 భాగవతకథలు విని, గోపాలుడినే నా కొడుకుగా స్వీకరించాను, కాబట్టి ఇప్పుడు మనకు పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదు’’ అని చెప్పింది.


అలాంటి భార్యాభర్తలు ధన్యులు. 


కృష్ణునిపై వారి ప్రేమ అలాంటిది.


డోంగ్రే జీ మహారాజ్ భార్య అబూలో నివసించేవారు. మరియు డోంగ్రేజీ మహారాజ్ భాగవతకధారసాన్ని దేశంలో మరియు ప్రపంచానికి చేరవేసేవారు.


భార్య చనిపోయిన ఐదురోజుల తర్వాత ఆయనకు విషయం తెలిసింది.  

ఆయన తన భార్య అస్తికలను నిమజ్జనం చేయడానికి వెళ్ళాడు. 


ఆయనతో పాటు ముంబైకి చెందిన స్వామి "రతీభాయ్ పటేల్ జీ" కూడా ఉన్నారు.

 

రతీ భాయ్, నా దగ్గర ఏమీ లేదు, అస్తికలను నిమజ్జనం చేయడానికి ఏదైనా ఖర్చు అవుతుంది కదా! అని డోంగ్రేజీ మహారాజ్ తనతో చెప్పారని ఆయన తరువాత చెప్పారు.


అప్పుడు మహారాజ్, 'ఇలా చెయ్యి. భార్య మంగళసూత్రం మరియు చెవిపోగులు అమ్మిన తర్వాత వారికి ఎంత వస్తె అంతతో వారు అస్థికలు నిమజ్జనం కోసం ఉపయోగిస్తారు' అని చెప్పారు.


ఏడుస్తూ, సేఠ్ రతీభాయ్ పటేల్ చెప్పారు ఈ విషయం.


మహారాజశ్రీ ఆజ్ఞతో ప్రజలు దేనికైనా సిద్ధమయ్యారు అయినా ఆయన ఒప్పుకోక పోవడంతో,

ఆ మహానుభావుడు భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బు లేదు.

    

మనం ఒకే సమయంలో ఎందుకు చనిపోలేదు

అని వెక్కి వెక్కి ఏడవడం తప్ప నా నోటి నుంచి ఒక్కమాట కూడా రావడం లేదు.


సనాతన ధర్మం ప్రధానం.  


అటువంటి సాధువులు మరియు మహాత్ములు మీకు సనాతన సంస్కృతిలో మాత్రమే కనిపిస్తారు.  


మన దేశంలో చాలా విషయాలు మనందరికీ చేరవు.  


మన దేశ సంస్కృతి మనందరికీ తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను.

 

జై శ్రీ రాధే కృష్ణ 🚩🙏


అంత గొప్ప నిర్లిప్తుడైన మహాత్ముడు, సన్యాసి పాదాల వద్ద కోటినమస్కారాలు పెట్టినా తక్కువే. 🙏🙏

Dharmaanni


 

Hindu


 

Sullitipeta


 

Periya palem bhavani maa


 

వరాహ క్షేత్రం

 వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి.



కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే.  


అంతే కాదు  శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు.


 తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది.


అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. 


అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

 

తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. 


ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం 

సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.

32 గణపతుల మూర్తులు*

 *32 గణపతుల మూర్తులు* 



1.బాలగణపతి, 

2.తరుణ గణపతి, 

3.భక్తిగణపతి, 

4.వీరగణపతి, 

5.శక్తిగణపతి, 

6.ద్విజగణపతి, 

7.సిద్ధగణపతి, 

8.ఉచ్చిష్టగణపతి, 

9. విఘ్నగణపతి, 

10.క్షిప్రగణపతి, 

11.హేరంబగణపతి, 

12.లక్ష్మీగణపతి, 

13.మహాగణపతి, 

14. విజయగణపతి, 

15.నృత్తగణపతి, 

16.ఊర్ధ్వగణపతి, 

17.ఏకాక్షరగణపతి, 

18.వరగణపతి, 

19.త్య్రక్షరగణపతి, 

20.క్షిప్రదాయకగణపతి, 

21.హరిద్రాగణపతి, 

22.ఏకదంతగణపతి, 

23.సృష్టిగణపతి, 

24.ఉద్దండ గణపతి, 

25.ఋణవిమోచక గణపతి, 

26.డుంఢి గణపతి, 

27.ద్విముఖ గణపతి, 

28.త్రిముఖగణపతి, 

29.సింహగణపతి, 

30.యోగ గణపతి, 

31.దుర్గాగణపతి, 

32.సంకటహరగణపతి.(ముద్గల పురాణం ప్రకారం )


*శుభ శుభోదయం*


🙏🙏🐀🙏🙏🐀🙏🙏

సంగమేశ్వర-శివాలయం

 



శ్రీశైలం ఆనకట్ట బ్యాక్-వాటర్సవద్ద కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశలోని కర్నూలు-జిల్లాలో సంగమేశ్వర-శివాలయం గలదు౹ ప్రతి-సంవత్సరం వర్షాకాలంలో (జూలై 2వ-వారం) ఆలయం దాదాపు 6నెలలపాటు బ్యాక్-వాటర్లో పూర్తిగా మునిగిపోతుంది మరియు జనవరి-ఫిబ్రవరి నుండి నీటిలోనే ఉంటుంది. (ఈ ఏడాది జులై 20న మునక)౹

ఈ వీడియోలో ఆలయం-మునగకముందు ఆలయ-పూజారి తుదిసారిగా శివలింగానికి అభిషేకం-చేస్తున్నారు. క్షణక్షణం నీటిమట్టం పెరుగుతున్నప్పటికీని శివలింగం పూర్తిగా-మునిగిపోయేలోపు పూజారి భక్తుల-సమక్షంలో భక్తిశ్రద్ధలతో పూజలు-హారతి-అభిషేకాదులు నిర్వహించారు౹ తరుఫరి పూజారిని భక్తులు తాము సిద్ధంచేసిన-పడవలో అవతలి-ఒడ్డుకు చేరుకుంటారు౹ భక్తిపూరిత సుందర-దృశ్యం॥🙏🏽🙏🏽

బొట్టు" లేకుండా హిందువు

 🛑 "బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు స్మశానం లా ఉండకుండా చూసుకో! నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి Fashion అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం.

🛑 చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది పూర్ణత్వానికి చిహ్నం!


🔴 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో!        అది   ఐశ్వర్యానికి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!

🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను ఉన్నతస్థితికి చేరుకోమనీ అంటోంది!

🔴 కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది సౌభాగ్యానికి సోపానం!

🔴 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. 

🔴 కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు!  బొట్టుపెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టుపెట్టుకున్న నీముఖం

చూసినవారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా  చేసిపెడతారు. కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో!🙏🙏

జీవితంలో కృతార్థులు అయినట్టే.*

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 ll *శ్లోకం* ll


*వాణీ రసవతీ యస్య,*

*యస్య శ్రమవతీ క్రియ౹*

*లక్ష్మీ ః దానవతీ యస్య,*

*సఫలం తస్య జీవితం౹౹*


# *భావం* #


 *ఎవరి మాట మనసుకు ఆనందాన్నిస్తుందో, ఎవరైతే కష్టం విలువ తెలిసి పైకి వస్తారో, ఎదుటి వారి కష్టాన్ని గుర్తిస్తారో, ఎవరి ధనం దాన ధర్మాలకు, మంచి కార్యాలకు ఉపయోగపడుతుందో, వారు జీవితంలో కృతార్థులు అయినట్టే.* 


🧘‍♂️🙏🪷 ✍️🙏

చిత్తము చంచలమ్ము

 ఉ.

చిత్తము చంచలమ్ము సరసీరుహలోచనలందు సంచరిం 

చత్తఱి గీర్తి గోరు నిక నందల మెక్కగ జూచు చెచ్చెరన్ 

విత్తము గూడబెట్ట పెనుబేహరముల్ నడుపంగ నోపు నిం 

కెత్తఱి నిన్ను దల్చును మహేశ్వరి బ్రోవగదమ్మ ప్రేముడిన్ 

*~శ్రీశర్మద*

గురువులు

 *ఎంతమంది - గురువులు...???*

💅💅💅💅💅💅💅💅💅


*1. సూచక గురువు :


బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో. 

నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. 

వీరిని సూచక గురువు అంటారు, వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.


*2. వాచక గురువు :


ధర్మా ధర్మ విచక్షణ, మంచి చెడు విశ్లేషణ, చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు.

(భ్రహ్మచర్యము, గృహస్త్దము, వానప్రస్దానం, సన్యాసం). 

వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు.


*3. భోధక గురువు :


మహా మంత్రాలను ఉపదేశిస్తారు. 

లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని, అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని. 

వీరిని భోధక గురువు అంటారు, లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...ఆదిత్యయోగీ..


*4. నిషిద్ద గురువులు :

మారణ ప్రయోగాలు, వశికరణాలు, వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు.

ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది.

చిత్తాన్ని శుద్ధి చేయరు, విత్తాన్ని హరిస్తారు. 

పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.


*5. విహిత గురువు :


మన హితము కోరి సూచనలు సలహాలు ఇస్తారు, నశించి పోయే విషయ భోగాలు

పై ఆశక్తి తగ్గించి, సత్యమైన శాస్వితమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు. 

ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జివింపచేస్తారు.ఆదిత్యయోగీ.


*6. కారణ గురువు :


ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. 

ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు.

నిత్యం ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటారు.ఆదిత్యయోగీ..


*7. పరమ గురువు :


ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు, శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు. 

వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. 

నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. 

నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు పరమ గురువు...


*ఏ ఒక్కటీ అడక్కు!*


బాల్యం నుంచీ మనిషి ఎదిగిన కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. వాటిలో మంచివీ ఉంటాయి. చెడువీ ఉంటాయి. కొన్ని ధర్మ బద్ధమైనవి. కొన్ని అశైలికమైనవి. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని పదకాలు వేస్తాడో, ఎన్ని దారుల్లో వెడుతూంటాడో చెప్పలేం. 


ప్రతి కోరికా సుఖమిస్తుందని భ్రమ పడతాడు. శ్రమపడకుండా కోరికలు తీరాలని తాపత్రయ పడుతుంటాడు. ఎవరివల్లా కోరికలు తీరకపోతే ఇక దేవుడి వెంటపడతాడు. కోరికల విలువను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాడు. ఒక కోరిక తీరగానే మరొకటి పుట్టుకొస్తుంది. దాని కోసం వ మొక్కుతాడు. కోరికలు తీరడంకోసమే తీర్ధయాత్రలు చేస్తాడు. టెంకాయలు కొడతాడు. అర్చనలు, అభిషేకాలు, యాగాలు, ప్రదక్షిణలు, దక్షిణలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు... ఇలా ఎన్నెన్నో.. చేస్తూనే ఉంటాడు.ఆదిత్యయోగీ..


 కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా విపరీతమైన ఆవేదన, అశాంతి, దుఃఖం, దిగులు వీటితో కుంగిపోతూంటాడు. ఎదుటి మనిషిని ఏదైనా అడిగినవాడు సగం చనిపోయిన వాడితో సమానమని, ఎవరైనా తన ముందు చేయిచాచితే 'లేదు' అన్నవాడు పూర్తిగా O చనిపోయిన వాడితో సమానమని అంటాడు హింద్ కవి రహీమ్. అడిగినవాడి లక్షణమూ చెప్పాడు. లేదు పొమ్మని అనేవాడి లక్షణమూ చెప్పాడు. 


- ధార్మిక నిష్టతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒక్కడే. అది తెలిసికూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవడం అవివేకం. మనకు యోగం ఉంటే భగవత్ కృపాప్రసాదం లభిస్తుంది. దేనివల్ల చెడిపోతామో అది దేవుడు ఇవ్వడు. బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే! ప్రారబ్ధ దుఃఖాలు అనుభవిస్తూ దేవుణ్ని నిందించి ప్రయోజనం లేదు.


జ్ఞాని అయినవాడు తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తాడు. సుఖాలకు పొంగిపోడు, దుఃఖాలకు కుంగిపోదు. సంతృప్తితో జీవిస్తున్నవాడికి కోరికలు కలగవు. సాటి మనిషినే కాదు, పరమాత్మను కూడా ఏమీ అడగడు. భగవన్నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు. భక్తి బాందవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు. దైవసన్నిధే తనకున్న పెన్నిది. అని ఆనందిస్తాడు.


'భగవద్భజనకు తావులేని మోక్షం నాకెందుకు

స్వామీ?' అని అడిగిన రామదాసు భక్తి పారవశా వి

భాష్యం చెప్పగలమా! అది నిష్కామ భక్తి,


ఆనందాశ్రువులతో తడిసిన భక్తి. అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది. అడగకుండానే నాన్న హితవు. నడత చెబుతాడు. అడగకుండానే గురువు బోధిస్తాడు. మానవ జన్మకు ఇంతకుమించి కావలసిందేముంది! 

దారి కనబడింది.. ప్రయాణం చేయడం, గమ్యం చేరడం మన బాధ్యత. 

లక్ష్యం అందుకోవడం మన చేతిలోని పని. 

మన కృషి మీద ఆధారపడి ఉంది. 

ఇంకా ఏమిటో, ఎవరినో అడగమేమిటి? 

అది అజ్ఞానం, అలసత్వ అవివేకం.

 ఎవరినీ ఏమీ అడగవద్దు. 

అందులోనూఅందదగింది అందుతుంది. 

అందకూడనిది అందదు!..


*మన దృష్టి కోణమే మన జీవితం*

~~~~~~


నీవు దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి లలో దేనిని కలిగి ఉన్నావు?


ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్నడో  పెద్దలు పసిగడుతుంటారు.


ముఖ్యంగా గురువులు / ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.


ఇది దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని మూడు రకాలు. ఇందులో ఆత్మదృష్టి అత్యుత్తమమైనదీ, దేహదృష్టి అథమము / కనిష్టమైనది.


ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా కట్టు, బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. ఉదాహరణకి ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు.

ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే పూర్తిగా ఉండదు. వీరిది స్థూల / భౌతిక / దేహదృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.


ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు.


చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డం అదీనూ బహుశా ఈయన కవి ఏమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు.


ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, అలా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.


ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఓ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మదృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది..


రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా!


రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా! అమ్మవారిని ఆశ్రయిస్తే చాలు. సర్వులూ సులభంగా ముక్తిని పొందగలరు. భక్తిలో సర్వులూ అర్హులే. అమ్మ యొక్క ఏ నామాన్నైనా, ఏ రూపాన్నైనా, ఏ స్తోత్రాలనైనా జపించి, తపించి, స్తోత్రించి తరించవచ్చు.   ఆదిత్యయోగీ..


ఇందులో ఒకటి రాధాదేవి స్వరూపం. రాధాదేవి ఉపాసన దక్షిణాపథంలో అంత వ్యాప్తిలో లేదు. కేరళ రాష్ట్రంలోని గురువాయూరు క్షేత్రంలో నారాయణుణ్ణి ఉపాసించిన నారాయణ భట్టాద్రి 'నారాయణీయం' గ్రంథంలో రాధాదేవి రహస్యాలు వ్రాశారు. అందువల్ల దక్షిణాపథంలో ఇది లేదని అనలేం.


కానీ విస్తృతంగా వ్యాపించింది ఉత్తరాదిలో! కారణం - "బృందావనం.' అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశృత్వ బృందావనం తత్ పదాంకం.... కథం శ్యామసింధౌ కృత్స్న రస శ్యామ గాహః - రాధాదేవిని ఆరాధించకుండా, బృందావనాన్ని ఆశ్రయించకుండా, కృష్ణ కథను చదవకుండా ఆ కృష్ణ సముద్రంలో ఎవరు మునగగలరు!...


రాధానుగ్రహం లేనిదే కృష్ణానుగ్రహం లేదు. దుర్గ అనగానే శివుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మి అనగానే విష్ణువు. సరస్వతి అనగానే బ్రహ్మ.


గాయత్రికి బ్రహ్మ అని చెబుతారు (వేదస్వరూపిణి కనుక చతుర్ముఖాలలో నుంచీ బ్రహ్మ చతుర్వేదాలూ పలుకుతాడు). రాధా అనేటప్పుడు కృష్ణుడు గుర్తుకు వస్తాడు. ఈ ఐదూ పరమాత్మ యొక్క శక్తులు. పరమాత్మ, పరమేశ్వరుడు అని రెండు పేర్లున్నాయి.


సృష్టి స్థితి లయలు చెయ్యాలి అని సంకల్పించుకున్న దగ్గర నుంచీ ఆ పరమాత్మ పేరు పరమేశ్వరుడయింది. అప్పుడు తనలోని ఐశ్వరాన్ని బయట పెడుతున్నాడు. సంకల్పంతో మొదలై, ఇచ్ఛా జ్ఞాన క్రియ... మొదలైన శక్తులతో జగత్తుగా వచ్చింది.


"ఏకోహం బహుస్యాం' అన్నారు. 'ఏకః' అనే స్థితిలో పరమాత్మ, 'అహం బహుస్యాం' అన్నప్పుడు పరమేశ్వరుడయ్యాడు. లోకంలో మనం ఒక పని చెయ్యాలంటే ముందు దానికి తగిన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుండాలి. దాన్ని ఎలా చెయ్యాలి అనే పరిజ్ఞానం ఉండాలి.


దాన్ని వ్యక్తం చెయ్యగలిగే శక్తి ఉండాలి. దానికి కావలసిన సంపద ఉండాలి. ఒక పనికి ఇలా మనకు ఎన్ని కావాలో పరమాత్మకీ అవన్నీ కావాలి. అయితే ఆయన తన నుంచే అన్నీ తెచ్చుకుంటాడు.


ఎందుకంటే ఆయనకు భిన్నంగా ఏదీ లేదు కనుక! పరమాత్మ తన నుంచి తెచ్చుకున్న ఇచ్చా జ్ఞాన క్రియాత్మక శక్తి పేరు 'దుర్గ'. ఆయన వాక్ బుద్ధి, జ్ఞానశక్తి పేరు సరస్వతి. ఆయన సంపత్ శక్తి, ఐశ్వర్య శక్తి పేరు లక్ష్మి.


ఆయన వేదశక్తి స్వరూపమే గాయత్రి. ఆయన ఆనందశక్తి స్వరూపం, హృదయశక్తి స్వరూపం, హ్లాదినీ శక్తి రాధ. రాధ అంటే ఆయన యొక్క హృదయమట! రాధ అనే పేరుకు చాలా విశేషమైన అర్థం ఉంది.ఆదిత్యయోగీ..


జగత్తులో మనకు 'ఆరాధన' అనే ప్రసిద్ధమైన శబ్దం ఉంది. ఇక్కడ 'ఆ' అనేది ఉపసర్గం. ప్రధానం 'రాధనం'. రాధ అంటే అర్చన, పూజ అని చెబుతున్నారు.


అర్చన (పూజ) అంటే భగవంతుడితో మనస్సును అనుసంధానం చెయ్యడమే. కనుక రాధ అంటే ఆ భగవంతునితో అనుసంధానం చేయించే శక్తి. భగవంతుడు చేయూత నిచ్చి లాగితే కానీ మనం ఉద్దరణకు గురికాము. 'చెయ్యెత్తి కరావలంబం ఇయ్యవయ్యా' అనడం పురుష ఆ ప్రయత్నం.


ఆ పరమాత్మ కృప చూపించి (చెయ్యి పట్టుకుని) పైకి లాగడం భగవదనుగ్రహం. ఈ రెండూ కలిస్తేనే సిద్ధి. అందుకు మన నుంచి ప్రవహించే ధార (భక్తి ధార ఒకటి, ఆయన నుండి ప్రవహించే ధార కృపాధార ఒకటి) రెండు ధారలూ కలిస్తే 'ధారా... ధారా...


ధారా... ధా.... రాధా.... రాధా....


రాధా అవుతున్నది. ఈ ధారల్ని ఆధారం చేసుకున్న మహాశక్తే రాధ. అది పరమాత్మ వైపు నుండి ఆలోచిస్తే ఆయన యొక్క కృపాస్వరూపిణి రాధ. మన వైపు నుండి ఆలోచిస్తే భక్తి స్వరూపిణి అంటే రాధా దేవి అనుగ్రహం లేకపోతే భగవంతుణ్ణి ఆరాధించాలనే బుద్ధి పుట్టదట!.....

దేవాలయముల యందు

 _*దేవాలయముల యందు భక్తులు చేయకూడని పనులు*_

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

                                                                                                        ఆలయాల్లో ఇతరులకు నమస్కారము చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు- అందరూ సమానులే అని భావించాలి.


*దేవాలయాలు ఐదు రకములుగా ఉంటాయి.*


*స్వయంవ్యక్త స్థలాలు*-

 భగవంతుడే స్వయంగా వెలసినవి.. 


*దివ్యస్థలాలు*- దేవతలచేప్రతిష్టిం పబడినవి..


*సిద్ధ స్థలాలు* - మహర్షులు, తప స్సుచేసి సిద్ధి పొందినవి, స్వాములు ప్రతిష్టించినవి.


*పౌరాణిక స్థలాలు*-పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి..


*మానుష స్థలాలు*- రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉం టాయి.


*దేవాలయ గోపురాలు..*

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం,వైకుం ఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదిత ర విభాగాలు ఉంటాయి.


*ఈ పనులు చేయకండి..*


దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకా రము పూజారులు, భక్తులు, అధికా రులుఏవిధంగావ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయంలోపలి కి ఎవ్వరూ కూడా వాహనాలలో రా వడం..చెప్పులు,బూట్లు,పాదరక్షలు వంటి వాటితో తిరగడంచేయరాదు.


*దేవాలయమునకుప్రదక్షణలుచేసేఅప్పుడేలోపలికిప్రవేశించాలి..*

ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ త ర్వాతే గుడి లోపలికిప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా, టోపి ధరిం చివెళ్లకూడదు.అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించ కూడదు.


మనముతినే,తినుబండారాలను తీ సుకునివేళ్ళరాదు. ఆలయంలో దైవసన్నిధికి ఒట్టి చేతు లతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణంచేస్తూగాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.


*దేవాలయము తీసి ఉన్న సమయమున నిద్రపోరాదు..*


దేవాలయంలో అడుగుపెట్టినతర్వా త పగలు,నిద్రపోవడం, కాళ్లు చాపు కుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన, ఉమ్మివేయుట,వంటి పనులు చేయ కూడదు.


*దేవాలయమునదైవసన్నిధిలోనవివాదాలు పెట్టుకోరాదు..*


ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటి కీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏజీ వికీ హాని కలిగించడం లేదా హింసిం చడం వంటివి అస్సలు చేయరాదు.


*ఇతరులతోదేవాలయముపైవిమర్శలు,దైవదూషణ,పరనింద చేయకూడదు..*


దేవాలయప్రాంగణంలోఅహంకారం, గర్వంతో, అధికారదర్పంతోఅస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పర స్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు.    


ఒకే చేతితోనమస్కారంచేయరాదు.      అధికార గర్వంతో దేవాలయమున కూడనిసమయానఅకాలమందునదైవప్రాకారంలో ప్రవేశించి అకాల సే వలను చేయించరాదు.అలాగే,దేవు ని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూ ర్చోకూడదు.       

                                     అధికాదర్పముచూపించి తనఉనికి మరచి ప్రవర్తించరాదు.    


తనకుభక్తి శ్రద్దలేకుండా తనద్రవ్యం మ్మునుకాని,తానుసంపాదించనిపూ జాద్రవ్యములతోపూజలుచేయించు కొనరాదు.దాన,దక్షణలులేని పూజ లునిరర్దకములు.ఫలితమునివ్వజాలవు.అశుభహేతువులు.                     


దేవాలయములందుఆగమవిధులనుఅనుసరించి నడచుకొనవలెను దేవాలయపరిపాలనకు సహకరించి దేవాలయనిత్యసేవాదులునడచుటకై ధనమునుదానమిచ్చుట.దేముని కిధనము(హుండిలో)దానపాత్రలో నిక్షిప్తముచేయుట,(వేయుట) ఆర్జి త సేవలయందు దేవాలయమున సహస్రనామ,అష్టోత్తరశతనామ,హారతి,అభిషేకము,హోమములకు,వివిధపూజాసేవలకై,తప్పనిసరిగాఅం దరుటిక్కేట్టు తీసుకొనుట,విధిగా చే యవలసినపనియని,టిక్కేట్టును తీసుకొనుట అవమానమని భావించి టిక్కేట్టునుతీసుకొనక చేయించుకొ నుపూజలు దైవాపరాధములు,దైవ ద్రోహముగా ఆగమమునచెప్ప బడినది. అట్టిపుాజ ఫలసూన్యము.అశు భము.గాతెలియనగును.                   


పత్రం,పుష్పం,ఫలం,తోయం,

యో మేభక్త్యా ప్రయచ్చతి,అని శాస్ర్తవచనము. కావున మనము భక్తి శ్రద్దతోదేవాల యమందు మెలగ వలసి ఆ దేవాలయ నియమానుసార విధు లను అనుసరించి దైవదర్శనము అ ర్చనలు,సేవలు,కైంకర్యములుచేయవలసిన అవుసరం ఉన్నది, అన్నవిషయముఅందరముగ్రహించి పాటించి భగవదనుగ్రహము పొందవలసి ఉన్నది.

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 14*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 14*


నరేంద్రుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు -బహుమతి ప్రదానోత్సవమూ, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయునికి వీడ్కోలు సభా ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన మహావక్త. ఆయన ముందు ప్రసంగించడానికి విద్యార్థులెవరూ సాహసించలేదు. 


అందువలన నరేంద్రుణ్ణి ప్రసంగించమని కోరారు. అందుకు అతడు సమ్మతించాడు. పదవీ విరమణ చేస్తూన్న ఉపాధ్యా యుణ్ణి వేనోళ్ల శ్లాఘిస్తూ, ఆయన విరమణ లోటు వలన తామెంత దిగులుపడు తున్నామో దాదాపు అరగంటసేపు అనర్గళంగా, ప్రేక్షకులు స్పందించే రీతిలో ప్రసంగించాడు.  ఆ ప్రసంగాన్ని విని సురేంద్రనాథ్ బెనర్జీ అతణ్ణి మనఃస్పూర్తిగా అభినందించాడు.


నరేంద్రుడు పదిహేడో ఏట ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు ఆంగ్లం, చరిత్ర, గణితం, న్యాయశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, తత్త్వ శాస్త్రం బి.ఏ.లో అతడి పాఠ్యాంశాలు. న్యాయశాస్త్రం, తత్త్వశాస్త్రం, ఉన్నత గణితం - వీటిలో అతడికి ఎంతో ఆసక్తి. ఆంగ్లంలో చక్కని పాండిత్యం గడించడానికి అతడు ఎంతో కృషి చేశాడు. మరీముఖ్యంగా ఆంగ్లంలో సంభాషించడం లోను, వాదించడంలోను అతడు చక్కని శిక్షణ పొందాడు.


విశ్వనాథుడు నరేంద్రుడిని న్యాయశాస్త్ర శాఖలో  చేర్పించి, నియామ్ చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా ఉంచాడు.

భవిష్యత్తులో తనలా నరేంద్రుడు ప్రఖ్యాత న్యాయవాదిగా రాణించాలని విశ్వనాథుడు అభిలషించాడు. తండ్రితోపాటు ఉన్నత న్యాయస్థానానికి కూడా నరేంద్రుడు తరచు వెళ్లివచ్చేవాడు. అతణ్ణి పై చదువులకోసం ఇంగ్లండుకు పంపాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది.


ఈ రోజుల్లో నరేంద్రుని పెళ్లి మాటలు మొదలయ్యాయి. కొందరు బోలెడంత కట్నం ఇవ్వడానికి ముందుకువచ్చారు. మరికొందరు నరేంద్రుడు పై చదవుకు ఇంగ్లండు వెళ్లడానికి అవసరమైన డబ్బు ఇస్తామన్నారు. కాని ఏ ప్రలోభాల మనస్సులో చోటివ్వని నరేంద్రుడు వివాహానికి సమ్మతించలేదు.🙏.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-21🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-21🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందిస్తూ ‘‘మాతా! ఈనాడు నీకొక రహస్యము చెప్పగలవాడను వినుము. పూర్వకాలములో నేను శ్రీరామావతారము ధరించినప్పుడు నేను లేని సమయము చూసి, రావణుడు సీతను యెత్తుకుపోయాడు. 


మార్గ మధ్యములో అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడినాడట. అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి, ఆశ్రమమున మాయ సీతను వుంచితిననియూ, అతడు తీసుకుపోతున్న సీత మాయసీతే ననియు నమ్మించాడు. మాయసీత నాకేలనని రావణుడు అగ్నిదేవునకిచ్చి వేసినాడు. ‘అసలు సీత యిదిగో ఈమె’ యని చెప్పి, తనవద్దనున్న వేదవతినిరావణున కిచ్చినాడట. 


నాకు యీ విషయము తెలియదు, రావణుని నేను సంహరించిన అనంతరం సీతను ఒకవేళ లోకము శంకిస్తుందేమో యని అగ్నిప్రవేశము చేయించాను.



 అప్పుడు అగ్నిదేవుడు వచ్చి విషయము చెప్పి వేదవతినీ కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసినదని కోరాడు. అప్పుడతనితో నేను వేదవతినికలియుగములో వివాహమాడెదనని మాట నిచ్చివేయుటము జరిగినది. ఆ వేదవతియే యీ పద్మావతి. కనుకనే పద్మావతిని నేను వివాహమాడవలసి యున్నది. అన్ని వకుళతో వివరముగా చెప్పినాడు.


శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులోమెదలడము ప్రారంభించినాయి. 


కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు. అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది. అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది. 


‘బోయవాడు, బికిరివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించుకోవడము మానినది.

 వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది. 

పద్మావతి వనోవ్యాధితో మంచమెక్కినది, ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు. రాజవైద్యులు కూడా వైద్యము చేశారు. ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది. ఇక్కడ పద్మావతియిలా వుంటేఅక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.

శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది.


 శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను. శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను


నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.


వజ్ర కవచ ధర గోవిందా, వసుదేవ తనయ గోవిందా, వైజయంతి ధర గోవిందా, వేంకట నాయక గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||21||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం .

 *ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అంతరంగం

 🤘🏻"ఏమే....ఈ పూట కంది పచ్చడి చెయ్యకూడదూ" అన్నాన్నేను ...


"ఆఁ.....కంది పచ్చడితో పాటు మామిడి కాయ ముక్కల పచ్చడి కూడా చేసాను..." మా ఆవిడ రెస్పాన్స్. 


"మరి పప్పు ఏం చేస్తున్నావ్?....నిన్న దోసకాయలు తెచ్చానుగా.....పప్పులోకి దోసకాయ బాగుంటుంది" అని నేను ...


"దాంతోపాటు, నిన్న బెండకాయలు కూడా తెచ్చారుగా..కాస్త మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను", మా ఆవిడ కన్ఫర్మేషన్.


 "అట్టాగే కాసిని గుమ్మడి కాయ ఒడియాలూ, ఓ నాలుగు గారె ముక్కలూ,  ఇంగువ అప్పడాలు కూడా ఉంటాయిలెండి" మా ఆవిడ మరో వరం.


ఇదేదో "ఒకటి కొంటే ఒకటి ఫ్రీ" స్కీం లాగా, ఒకటికి రెండు ఉన్నాయని నేను మహదానందపడిపోయాను.


"ఇంత కష్టపడి పోతున్నావు.....నీకు ఏమైనా సహాయం కావాలా.....?",ఆనందాతిశయుడై అన్నాన్నేను ...


"అలా ఓ సారి మార్కెట్ దాకా వెళ్ళి నాలుగు అరిటాకులు తీసుకుని రండి......ఈ రోజు మా అమ్మ , నాన్న , అన్నయ్య , చెల్లి భోజనానికి వస్తున్నారుగా......", అంతరంగం బయటపెట్టింది మా ఆవిడ ...


నేను : 😳😳😳🤘🏻


సేకరణ .

తథాస్తు దేవతలు

 తథాస్తు దేవతలు అంటూ పెద్దలు ఉపయోగిస్తారు కదా! తధాస్తు దేవతలు ఎవరు? వారి ప్రస్తావన ఎక్కడైనా ఉన్నదా?

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు అని చెప్పగా విన్నా.

దీనిమీద కొంచెం శోధించా ..వివరాలు ఇవి.. మీ ప్రశ్న ద్వారా నూతన విషయాలు తెలుసుకున్నా. ధన్యవాదాలు.

వేదాలలో 'అనుమతి' అనే ఒక దేవత ఉన్నారట. శుభ కార్యాలు యజ్ఞ యాగాదులలో ఈ దేవతని స్మరిస్తే కార్య ఫలం లభిస్తుందంట.

ఆ అనుమతి దేవతలనే తధాస్తు దేవతలు అని అంటారంట. శుభ కార్యాలు జరిగే ప్రదేశం వారి నివాసస్థానం.

ముఖ్యంగా సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. అందుకే స్వగతంగా చెడు మాటలు పదే పదే అనుకోవద్దని పెద్దలు చెబుతారు.

మధ్యాన్న వేళకి ముందుగా అనికూడా ఎవరో ఎప్పుడో అంటే విన్నట్టు గుర్తు.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. పదే పదే చెడు మాటలు అంటూ ఉంటే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వ విషయంలోనే వర్తిస్తుంది. పరులకి కాదు.

తెలుసుకున్న పురాణ వర్ణన:

వీరి ప్రస్తావన ఋగ్వేదము 1 వ మండలంలోని 16వ అనువాకము 112 మొదలు 117 వరకు గల సూక్తములలో ఉన్నదట.

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కవల కుమారులు..

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు.

ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు.

వీరి సోదరి ఉష. ఆమె ప్రతి రోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని, మూడు చక్రాలు వుండి, అద్వరాశ్వాలనే మూడు శ్వేత అశ్వాలు నడిపే, వేయి పతాకాలుండే హిరణ్య రధాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు హిరణ్యయానమనే దారిలో వాయువేగ మనోవేగాలతో ఈ దేవతలు సంచరిస్తుంటారు.

ఆ రథంలో ఒకవైపుధనం మరొకవైపు తేనె మరియూ సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి, వారి కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది , వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.

ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారు. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు

గోవిందరాజు సుబ్బారావు

 గోవిందరాజు సుబ్బారావు (1895 -1959 )



తెర మీద అయన కనబడితే అయన కనబడరు  అయన పాత్ర తప్ప . సహజ సంభాషణలు , అర్థవంతమైన అభినయం వాచికం ఆయన సొంతం. 


అయన సినిమాల్లో అడుగు పెట్టేనాటికి ఆయన నడివయసులో ఉన్నా అయన ప్రజ్ఞ చూసి చాలా ప్రధాన పాత్రలే వచ్చాయి. అయన వృత్తి రీత్యా వైద్యుడు . ఇటు హోమియోపతి  లో కూడా అందెవేసిన చేయి . 


ఆంగ్లం , సంగీతములో కేవలం సప లు మాత్రమే కాక అనేక రాగాల మీద ఆయనకు మంచి పట్టుంది . సంగీతం, సాహిత్యం, సైన్స్ ఇలా ఏది పట్టుకున్నా ఆయనకు అన్ని విషయాలు కరతలామలకాలే  .  


ఐన్ స్టీన్ కి   ఉత్తరాలు వ్రాసి  అణుశాస్త్రం, ఆర్గానిక్ శాస్త్రం మీద  చర్చలు జరిపినంత పట్టు ఆయనకు ఉంది . కానీ ఆయనకు వీటన్నింటిని మించి నాటకాలు సంగీతం సాహిత్యం ఇవే అమిత ఇష్టం . తొలినాళ్లలో నాటకాలు ఆ తరువాత సినిమాలు మరో వైపు వైద్యం . అటు సాత్విక పాత్రలు ఇటు క్రూర పాత్రలు ఏవైనా వేయగల దిట్ట . 


గోవిందరాజు సుబ్బారావు గారి ప్రతిభ చూసే మొదట మాలపిల్ల 1939  లో ఛాందసుడిగా ఉండే సుందర రామ  శాస్త్రి పాత్రకు ఆయన్ని  ఎంపిక చేసారు గూడవల్లి  రామబ్రహ్మం  గారు. ఆయనకు   వీరు సముద్రాల గారి ద్వారా  పరిచయం. 


మాలపిల్ల చిత్రంలో సుందర రామ శాస్త్రిగా ఆ చిత్రములో వేసినందుకు ఆయన సంఘం నుండి కొన్నాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన పట్టించుకోలేదు. అది కేవలం పాత్ర .. నేనూ సదాచార బ్రాహ్మణుణ్ణి .. ఎక్కడ ఏ రోజు ఆచారం తప్పలేదు . అది కేవలం ప్రవృత్తి అని చెప్పుకునేవారు . 


మాలపిల్ల  తరువాత ఆయన గృహలక్ష్మి లో నటించినా ఆయనకు పెద్ద పేరు తెచ్చిన చిత్రం జెమినీ వారి బాల నాగమ్మ . అందులో మంత్రాల మరాఠీ గా ఆయన చూపిన హావ భావాలూ చూసి ఆనాటి పిల్లలూ, పెద్దలూ జడుసుకున్నారట . అందుకని కన్నాంబ గారిని ఆయన్ని బూచాడు అని పిలిచేవారు . 


బాలనాగమ్మ  1942  తరువాత ఆయనకు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిన చిత్రాలు శారదా వారి పల్నాటియుద్ధము లో బ్రహ్మనాయడు పాత్రలో, ఆ తరువాత వచ్చిన గుణసుందరి 1949   కథలో మహారాజు పాత్ర, షావుకారు 1950   చిత్రములో     షావుకారు చంగయ్య పాత్ర , 1955  లో వచ్చిన వినోదా వారి  కన్యాశుల్కములో లుబ్దావధానులు పాత్ర . 


ఆయన చివరిగా కనబడిన చిత్రాల్లో చిరంజీవులు, చరణదాసి, భాగ్యరేఖ , పాండురంగ మహాత్మ్యం. ఆయన నాగయ్య గారి భక్త రామదాసులో నటించేప్పుడు మరణించారు. ప్రఖ్యాత నర్తకుడు ఉదయశంకర్ తీసిన  చిత్రము కల్పన 1948 లో ఆయన కూడా ఉన్నారు.


ఆయన అనేవారు నాటకములో ఒన్స్  మోర్ అన్నట్టు జీవితములో కూడా జరిగే మధుర స్మృతులను ఎవరన్నా ఒన్స్ మోర్ అంటే బాగుంటుంది . కానీ దైవం అనేవాడు దీనికి వీలు లేకుండా చేసాడు . భగవంతుని సృష్టి విలాసాలు ఎవరు అర్థం చేసుకోలేరు . ఆయన విశ్వ నిర్మాణమే కడుంగడు విచిత్రం . మనలో మనం ఎంత తన్నుకున్న తిట్టుకున్నా మళ్ళీ ఏదో రోజు ఒరేయ్ చలపాయ్ , ఒరేయ్ నరసింహులు , ఒరేయ్ రాముడూ, కుటుంబరావు అని ఆప్యాయంగా పిలుచుకునే రోజులు . ఉప్పిండి చేశాను కాస్త అయినా నోటిలో వేసుకోరా అని   మా వెంకమ్మత్తయ్య   అంటుండే వారు . ఆరోజులు మళ్ళీ  వస్తాయా అసలు . 


అందరూ అంటారు మీరు చేసిన సుందరరామయ్య పాత్ర, షావుకారు  చంగయ్య పాత్ర  మాకు బాగా నచ్చాయని . నాకు మాత్రం ఇంకెవరైనా తల పండిన వారు ఆ పాత్రల్లో ఉండి ఇంకా భేషుగ్గా చేసేవారని అనిపిస్తుంది . ఒక వేళ ప్రేక్షకులు బాగుందన్నా నేనూ సంతోషముతో ఎగిరిపోను .. బాగో లేదన్నా కృంగిపోను. 

నటుడుని కాబట్టి ఒక్కోసారి ఆ పాత్రలో ఇలా చేసి ఉంటే ఇంకాస్త బాగుండేమో అనిపిస్తుంది నాకు .   


నాకు సినిమా , నాటకం , మరో పక్క వైద్యకం .. మాత్రమే కాక రేడియో లో చేయడం కూడా ఇష్టమే . ఇక్కడ కనబడకుండా కేవలం మాటతోనే మన హావ భావాలూ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ముందు మూడింటి కన్నా ఇది కత్తి మీద సాము వంటిది .మొదట్లో నాటకం కంటే సినిమా నటనం కష్టం అని భయపెట్టారు. కానీ అవి రెండూ నాకు  పెద్ద గొప్పగా అనిపించలేదు గానీ .. ఈ రేడియో మాత్రం నాకు చాల సరదా ని  తెచ్చి పెట్టింది. 


మాలపిల్ల సినిమా లో చేసేప్పుడు ఓ సన్నివేశములో ఇల్లు తగలబడేప్పుడు ఆ తగులపెట్టిన పెట్రోల్ కిరోసిన్ వాసనా మరియు ఆ సెగకు , రెండూ మూడు మార్లు రి టేక్  వల్ల నా ఆరోగ్యం బాగా దెబ్బ  తింది . ఆ వాసనకు వేడికి నా ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి . సారథి వారు దయ తలచి వాళ్ల మేడ మీద నాకు బస ఏర్పాటు చేసారు.  మహానుభావుడు డాక్టర్ కేశవ పాయి గారి హస్తవాసి వల్ల బ్రతికి బయటపడ్డాను. ఆరోజుల్లో నేను పోయాను అని పేపర్ లో కూడా వచ్చిందిట . 


ఎవరో రామ బ్రహ్మం గారికి ఫోన్ చేసి ఎందరికో రోగాలు కుదిర్చిన మహానుభావుడికి ఈ రోగం వచ్చి పోవడం ఏమిటి అని  అడిగితే మా ఇంటిలో మేడ మీద గదిలో భేషుగ్గా ఉంటేనూ అని చెబితే గానీ లోకానికి తెలియరాలేదు .అందుకే  ఏదో వచ్చిన పాత్రలన్నీ చేసేయాలని నాకు లేదు . పాత్ర పది కాలాలు నిలబడగలుగుతుందా అని అనిపిస్తే మాత్రమే చేశాను. పిన్న వయసులోనే వృద్ధుడను అయిపోయాను అనిపిస్తుంది కానీ అంతా భగవంతుని లీల కదా అనిపించినపుడల్లా మనసు కుదుటపడుతుంది   .

శిష్యురాలిగా

 



ఆరోజుల్లో గోదావరి ప్రాంతములో చాటపర్తి సుందరమ్మ అనే భోగం మేళం నాయకురాలు ఉండేదిట. మహా అందగత్తె .. గాయని, మరియు నాట్యములో అందెవేసిన చేయి. నా అంతవారు లేరు అని ఆమెకు మహా గర్వం. నా వాలు చూపులతో, అభినయం తో ఎంతటివారినైనా కట్టి పడేయగలను అని ధీమాగా పాడుతూ నాట్యం చేసేదిట.


ఓ సారి ఓ పేరు మోసిన వైశ్యుని కుమారుడి వివాహములో తన బృందముతో గజ్జె కట్టింది. ఆమె సంస్కృతాంధ్ర భాషల్లో పట్టున్న ఘనురాలు. "కాంతో యాసతి దూరదేశ మితి చింతా పరం జాయతే, లోకానంద కరోపి చంద్రవదనే, వైరాయాతే చంద్రమాః" అనే శ్లోకం చదువుతూ .. అభినయం చేస్తూ .. "అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా, నీలోత్పలంచ పంచైతే పంచ బాణస్యసాయకాః" అంటూ అయిదు బాణాలను ప్రేక్షకుల మీద వేసింది. 


వెంటనే సభలో ఓ ఇద్దరు వ్యక్తులు సభ మైలపడింది అంటూ గొడవ చేయసాగారు.. జనాలందరూ తికమక పడుతూ అల్లరి చేయగానే సుందరమ్మ ఎవరో పండితులు సభలో ఉన్నారని గ్రహించివారిని గుర్తు పట్టి వారి కాళ్ళ మీద పడింది .. అయ్యా నేను అభినయములో ఏమైనా తప్పు చేసానా అని అడిగింది సవినయంగా .


దానికి వారు  పంచ బాణాలు చెబుతారు కానీ అభినయములో మాత్రం వేసేది నాలుగు బాణాలే.. అయిదవది వేస్తే నాయిక మృతి పొందుతుంది.. తద్వారా 'మృతాశౌచం' అనగానే తన తప్పు గ్రహించి సంస్కృత ఆంధ్ర భాషల్లో నిపుణురాలైన ఆమె తనను శిష్యురాలిగా అంగీకరించి తనకు విద్యాదానం చేయమని కోరిందిట. ఆ పండితులెవరనుకున్నారు.. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి, మరొకరు కూచి పూడి నాట్య ప్రముఖులు వేదాంతం లక్ష్మీనారాయణ శర్మ గారు

శ్లోకం:☝️ *కార్యమద్యతనీయం యత్* *తదద్యైవ విధీయతామ్ |* *విపరీతా గతిర్యస్య* *స కష్టం లభతే ధృవమ్ ||* అన్వయం: _యత్ కార్యమ్ అద్యతనీయమ్ (అస్తి) తత్ అద్య ఏవ విధీయతామ్ | యస్య గతిః విపరీతా (అస్తి) సః (మనుష్యః) ధృవం కష్టం లభతే |_ భావం: ఈ రోజున చెయ్యాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అలా చెయ్యకుండా వాయిదాలు వేసిన వ్యక్తికి కచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది.

 శ్లోకం:☝️

*కార్యమద్యతనీయం యత్*

  *తదద్యైవ విధీయతామ్ |*

*విపరీతా గతిర్యస్య*

  *స కష్టం లభతే ధృవమ్ ||*


అన్వయం: _యత్ కార్యమ్ అద్యతనీయమ్ (అస్తి) తత్ అద్య ఏవ విధీయతామ్ | యస్య గతిః విపరీతా (అస్తి) సః (మనుష్యః) ధృవం కష్టం లభతే |_


భావం: ఈ రోజున చెయ్యాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అలా చెయ్యకుండా వాయిదాలు వేసిన వ్యక్తికి కచ్చితంగా శ్లోకం:☝️

*కార్యమద్యతనీయం యత్*

  *తదద్యైవ విధీయతామ్ |*

*విపరీతా గతిర్యస్య*

  *స కష్టం లభతే ధృవమ్ ||*


అన్వయం: _యత్ కార్యమ్ అద్యతనీయమ్ (అస్తి) తత్ అద్య ఏవ విధీయతామ్ | యస్య గతిః విపరీతా (అస్తి) సః (మనుష్యః) ధృవం కష్టం లభతే |_


భావం: ఈ రోజున చెయ్యాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అలా చెయ్యకుండా వాయిదాలు వేసిన వ్యక్తికి కచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది.

పంచాంగం 17.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 17.08.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: ప్రతిపత్తి తిధి బృహస్పతి  వాసర: మఘా నక్షత్రం పరిఘ  యోగ: బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పాడ్యమి సాయంత్రం 05:35 వరకు.

మఘ రాత్రి 07:57 వరకు.

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:38

వర్జ్యం :  ఉదయం 06:27 నుండి ఉదయం 08:15 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:15 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:17 నుండి 04:07 వరకు.


రాహుకాలం : మద్యాహ్నము  

01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార: