17, ఆగస్టు 2023, గురువారం

గురువులు

 *ఎంతమంది - గురువులు...???*

💅💅💅💅💅💅💅💅💅


*1. సూచక గురువు :


బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో. 

నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. 

వీరిని సూచక గురువు అంటారు, వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.


*2. వాచక గురువు :


ధర్మా ధర్మ విచక్షణ, మంచి చెడు విశ్లేషణ, చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు.

(భ్రహ్మచర్యము, గృహస్త్దము, వానప్రస్దానం, సన్యాసం). 

వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు.


*3. భోధక గురువు :


మహా మంత్రాలను ఉపదేశిస్తారు. 

లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని, అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని. 

వీరిని భోధక గురువు అంటారు, లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...ఆదిత్యయోగీ..


*4. నిషిద్ద గురువులు :

మారణ ప్రయోగాలు, వశికరణాలు, వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు.

ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది.

చిత్తాన్ని శుద్ధి చేయరు, విత్తాన్ని హరిస్తారు. 

పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.


*5. విహిత గురువు :


మన హితము కోరి సూచనలు సలహాలు ఇస్తారు, నశించి పోయే విషయ భోగాలు

పై ఆశక్తి తగ్గించి, సత్యమైన శాస్వితమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు. 

ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జివింపచేస్తారు.ఆదిత్యయోగీ.


*6. కారణ గురువు :


ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. 

ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు.

నిత్యం ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటారు.ఆదిత్యయోగీ..


*7. పరమ గురువు :


ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు, శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు. 

వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. 

నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. 

నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు పరమ గురువు...


*ఏ ఒక్కటీ అడక్కు!*


బాల్యం నుంచీ మనిషి ఎదిగిన కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. వాటిలో మంచివీ ఉంటాయి. చెడువీ ఉంటాయి. కొన్ని ధర్మ బద్ధమైనవి. కొన్ని అశైలికమైనవి. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని పదకాలు వేస్తాడో, ఎన్ని దారుల్లో వెడుతూంటాడో చెప్పలేం. 


ప్రతి కోరికా సుఖమిస్తుందని భ్రమ పడతాడు. శ్రమపడకుండా కోరికలు తీరాలని తాపత్రయ పడుతుంటాడు. ఎవరివల్లా కోరికలు తీరకపోతే ఇక దేవుడి వెంటపడతాడు. కోరికల విలువను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాడు. ఒక కోరిక తీరగానే మరొకటి పుట్టుకొస్తుంది. దాని కోసం వ మొక్కుతాడు. కోరికలు తీరడంకోసమే తీర్ధయాత్రలు చేస్తాడు. టెంకాయలు కొడతాడు. అర్చనలు, అభిషేకాలు, యాగాలు, ప్రదక్షిణలు, దక్షిణలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు... ఇలా ఎన్నెన్నో.. చేస్తూనే ఉంటాడు.ఆదిత్యయోగీ..


 కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా విపరీతమైన ఆవేదన, అశాంతి, దుఃఖం, దిగులు వీటితో కుంగిపోతూంటాడు. ఎదుటి మనిషిని ఏదైనా అడిగినవాడు సగం చనిపోయిన వాడితో సమానమని, ఎవరైనా తన ముందు చేయిచాచితే 'లేదు' అన్నవాడు పూర్తిగా O చనిపోయిన వాడితో సమానమని అంటాడు హింద్ కవి రహీమ్. అడిగినవాడి లక్షణమూ చెప్పాడు. లేదు పొమ్మని అనేవాడి లక్షణమూ చెప్పాడు. 


- ధార్మిక నిష్టతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒక్కడే. అది తెలిసికూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవడం అవివేకం. మనకు యోగం ఉంటే భగవత్ కృపాప్రసాదం లభిస్తుంది. దేనివల్ల చెడిపోతామో అది దేవుడు ఇవ్వడు. బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే! ప్రారబ్ధ దుఃఖాలు అనుభవిస్తూ దేవుణ్ని నిందించి ప్రయోజనం లేదు.


జ్ఞాని అయినవాడు తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తాడు. సుఖాలకు పొంగిపోడు, దుఃఖాలకు కుంగిపోదు. సంతృప్తితో జీవిస్తున్నవాడికి కోరికలు కలగవు. సాటి మనిషినే కాదు, పరమాత్మను కూడా ఏమీ అడగడు. భగవన్నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు. భక్తి బాందవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు. దైవసన్నిధే తనకున్న పెన్నిది. అని ఆనందిస్తాడు.


'భగవద్భజనకు తావులేని మోక్షం నాకెందుకు

స్వామీ?' అని అడిగిన రామదాసు భక్తి పారవశా వి

భాష్యం చెప్పగలమా! అది నిష్కామ భక్తి,


ఆనందాశ్రువులతో తడిసిన భక్తి. అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది. అడగకుండానే నాన్న హితవు. నడత చెబుతాడు. అడగకుండానే గురువు బోధిస్తాడు. మానవ జన్మకు ఇంతకుమించి కావలసిందేముంది! 

దారి కనబడింది.. ప్రయాణం చేయడం, గమ్యం చేరడం మన బాధ్యత. 

లక్ష్యం అందుకోవడం మన చేతిలోని పని. 

మన కృషి మీద ఆధారపడి ఉంది. 

ఇంకా ఏమిటో, ఎవరినో అడగమేమిటి? 

అది అజ్ఞానం, అలసత్వ అవివేకం.

 ఎవరినీ ఏమీ అడగవద్దు. 

అందులోనూఅందదగింది అందుతుంది. 

అందకూడనిది అందదు!..


*మన దృష్టి కోణమే మన జీవితం*

~~~~~~


నీవు దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి లలో దేనిని కలిగి ఉన్నావు?


ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్నడో  పెద్దలు పసిగడుతుంటారు.


ముఖ్యంగా గురువులు / ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.


ఇది దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని మూడు రకాలు. ఇందులో ఆత్మదృష్టి అత్యుత్తమమైనదీ, దేహదృష్టి అథమము / కనిష్టమైనది.


ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా కట్టు, బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. ఉదాహరణకి ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు.

ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే పూర్తిగా ఉండదు. వీరిది స్థూల / భౌతిక / దేహదృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.


ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు.


చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డం అదీనూ బహుశా ఈయన కవి ఏమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు.


ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, అలా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.


ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఓ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మదృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది..


రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా!


రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా! అమ్మవారిని ఆశ్రయిస్తే చాలు. సర్వులూ సులభంగా ముక్తిని పొందగలరు. భక్తిలో సర్వులూ అర్హులే. అమ్మ యొక్క ఏ నామాన్నైనా, ఏ రూపాన్నైనా, ఏ స్తోత్రాలనైనా జపించి, తపించి, స్తోత్రించి తరించవచ్చు.   ఆదిత్యయోగీ..


ఇందులో ఒకటి రాధాదేవి స్వరూపం. రాధాదేవి ఉపాసన దక్షిణాపథంలో అంత వ్యాప్తిలో లేదు. కేరళ రాష్ట్రంలోని గురువాయూరు క్షేత్రంలో నారాయణుణ్ణి ఉపాసించిన నారాయణ భట్టాద్రి 'నారాయణీయం' గ్రంథంలో రాధాదేవి రహస్యాలు వ్రాశారు. అందువల్ల దక్షిణాపథంలో ఇది లేదని అనలేం.


కానీ విస్తృతంగా వ్యాపించింది ఉత్తరాదిలో! కారణం - "బృందావనం.' అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశృత్వ బృందావనం తత్ పదాంకం.... కథం శ్యామసింధౌ కృత్స్న రస శ్యామ గాహః - రాధాదేవిని ఆరాధించకుండా, బృందావనాన్ని ఆశ్రయించకుండా, కృష్ణ కథను చదవకుండా ఆ కృష్ణ సముద్రంలో ఎవరు మునగగలరు!...


రాధానుగ్రహం లేనిదే కృష్ణానుగ్రహం లేదు. దుర్గ అనగానే శివుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మి అనగానే విష్ణువు. సరస్వతి అనగానే బ్రహ్మ.


గాయత్రికి బ్రహ్మ అని చెబుతారు (వేదస్వరూపిణి కనుక చతుర్ముఖాలలో నుంచీ బ్రహ్మ చతుర్వేదాలూ పలుకుతాడు). రాధా అనేటప్పుడు కృష్ణుడు గుర్తుకు వస్తాడు. ఈ ఐదూ పరమాత్మ యొక్క శక్తులు. పరమాత్మ, పరమేశ్వరుడు అని రెండు పేర్లున్నాయి.


సృష్టి స్థితి లయలు చెయ్యాలి అని సంకల్పించుకున్న దగ్గర నుంచీ ఆ పరమాత్మ పేరు పరమేశ్వరుడయింది. అప్పుడు తనలోని ఐశ్వరాన్ని బయట పెడుతున్నాడు. సంకల్పంతో మొదలై, ఇచ్ఛా జ్ఞాన క్రియ... మొదలైన శక్తులతో జగత్తుగా వచ్చింది.


"ఏకోహం బహుస్యాం' అన్నారు. 'ఏకః' అనే స్థితిలో పరమాత్మ, 'అహం బహుస్యాం' అన్నప్పుడు పరమేశ్వరుడయ్యాడు. లోకంలో మనం ఒక పని చెయ్యాలంటే ముందు దానికి తగిన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుండాలి. దాన్ని ఎలా చెయ్యాలి అనే పరిజ్ఞానం ఉండాలి.


దాన్ని వ్యక్తం చెయ్యగలిగే శక్తి ఉండాలి. దానికి కావలసిన సంపద ఉండాలి. ఒక పనికి ఇలా మనకు ఎన్ని కావాలో పరమాత్మకీ అవన్నీ కావాలి. అయితే ఆయన తన నుంచే అన్నీ తెచ్చుకుంటాడు.


ఎందుకంటే ఆయనకు భిన్నంగా ఏదీ లేదు కనుక! పరమాత్మ తన నుంచి తెచ్చుకున్న ఇచ్చా జ్ఞాన క్రియాత్మక శక్తి పేరు 'దుర్గ'. ఆయన వాక్ బుద్ధి, జ్ఞానశక్తి పేరు సరస్వతి. ఆయన సంపత్ శక్తి, ఐశ్వర్య శక్తి పేరు లక్ష్మి.


ఆయన వేదశక్తి స్వరూపమే గాయత్రి. ఆయన ఆనందశక్తి స్వరూపం, హృదయశక్తి స్వరూపం, హ్లాదినీ శక్తి రాధ. రాధ అంటే ఆయన యొక్క హృదయమట! రాధ అనే పేరుకు చాలా విశేషమైన అర్థం ఉంది.ఆదిత్యయోగీ..


జగత్తులో మనకు 'ఆరాధన' అనే ప్రసిద్ధమైన శబ్దం ఉంది. ఇక్కడ 'ఆ' అనేది ఉపసర్గం. ప్రధానం 'రాధనం'. రాధ అంటే అర్చన, పూజ అని చెబుతున్నారు.


అర్చన (పూజ) అంటే భగవంతుడితో మనస్సును అనుసంధానం చెయ్యడమే. కనుక రాధ అంటే ఆ భగవంతునితో అనుసంధానం చేయించే శక్తి. భగవంతుడు చేయూత నిచ్చి లాగితే కానీ మనం ఉద్దరణకు గురికాము. 'చెయ్యెత్తి కరావలంబం ఇయ్యవయ్యా' అనడం పురుష ఆ ప్రయత్నం.


ఆ పరమాత్మ కృప చూపించి (చెయ్యి పట్టుకుని) పైకి లాగడం భగవదనుగ్రహం. ఈ రెండూ కలిస్తేనే సిద్ధి. అందుకు మన నుంచి ప్రవహించే ధార (భక్తి ధార ఒకటి, ఆయన నుండి ప్రవహించే ధార కృపాధార ఒకటి) రెండు ధారలూ కలిస్తే 'ధారా... ధారా...


ధారా... ధా.... రాధా.... రాధా....


రాధా అవుతున్నది. ఈ ధారల్ని ఆధారం చేసుకున్న మహాశక్తే రాధ. అది పరమాత్మ వైపు నుండి ఆలోచిస్తే ఆయన యొక్క కృపాస్వరూపిణి రాధ. మన వైపు నుండి ఆలోచిస్తే భక్తి స్వరూపిణి అంటే రాధా దేవి అనుగ్రహం లేకపోతే భగవంతుణ్ణి ఆరాధించాలనే బుద్ధి పుట్టదట!.....

కామెంట్‌లు లేవు: