1, మార్చి 2024, శుక్రవారం

పేరు మార్చుకోరా

 😀😀😀😀

"ఏమండీ! మన పెళ్లి అయిన దగ్గర నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను పేరు మార్చుకోరా మీరు?" కోపంగా అడిగింది సుప్రియ.


"నువ్వు ఎన్ని సార్లు అడిగావో నేనూ అన్ని సార్లు చెప్పాను మార్చుకోనని. నా పేరు మా నాయనమ్మ పెట్టింది మా తాతగారి పేరుట", అంతే కోపంగా చెప్పాడు అప్పారావు. 


"మరీ అప్పారావు ఏమిటండీ? అప్పుల అప్పారావు లాగ. మీ వాళ్లు అందరూ 'ఒరేయ్ అప్పిగా అప్పిగా' అని పిలుస్తుంటే నాకూ ఒళ్లంతా కారం రాసుకున్నట్టుగా భగభగ మండి పోతోంది." 


"ఇప్పుడు ఏమీ చేయమంటావ్ నన్ను! ఎంతో అభిమానంతో పిలుస్తున్నారు. వాళ్లతో అలా పిలవద్దని చెప్పలేను. ఈ విషయంలో నేనూ ఏమీ చేయలేను." 


"అయితే నా కొడుక్కి మాత్రం నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటాను. అందులో మీరు తల దూర్చకండి.

ఖరాఖండిగా చెప్పింది సుప్రియ."


"సరే నీ ఇష్టం" ముఖం మాడ్చుకుని చెప్పాడు అప్పారావు.

 

చాలా బుక్స్ లో, ఇంటర్నెట్ లో వెదికి ఒక మంచి లేటెస్ట్ పేరు సెలెక్ట్ చేసి ప్రజ్వేష్ అని పెట్టింది సుప్రియ. ఆ పేరుతోనే పిలవమని ముద్దు పేర్లతో పిలవద్దని అప్పారావుకు మరీ మరీ చెప్పింది.


ఒకసారి అప్పారావు దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికి భార్యని కొడుకుని తీసుకు వెళ్లాడు.  అందరూ పిల్లాడిని ఎత్తుకుని 'మన అప్పిగాడి కొడుకు' మన 'అప్పిగాడి కొడుకు' అనుకుంటూ పిల్లాడిని ఒకరి తరువాత ఒకరు ఎత్తుకుంటూనే వున్నారు. అందులో ఒక్కరు కూడా ఆ పిల్లాడిని అసలు పేరుతో పిలవలేదు.

 

ఆ పెళ్లికి వెళ్లి వచ్చిన దగ్గరనుండి 'నీ పేరేమిటి' అని ఆ పిల్లాడిని ఎవరైనా అడిగితే వచ్చీరానీ మాటలతో  'అప్పిగాడి కొడుకుని' అని చెప్పడం మొదలు పెట్టాడు. 


తల కొట్టుకుంటూ సుప్రియ అలా 'అప్పిగాడి కొడుకు' అని చెప్పకురా! మీ నాన్నతో పోట్లాడి అందమైన పేరు పెట్టాను నీకు. ఎవరైనా అడిగితే నీ పేరు చెప్పరా అంటూ కొడుకును బ్రతిమాలి, ఆ అలవాటు మార్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది పాపం సుప్రియ.* 


కొన్ని రోజుల తరువాత ఊరునుంచి అప్పారావు మేనమామ వచ్చాడు. "నువ్వు మా అప్పిగాడి  కొడుకువు కదూ"? చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అంటూ ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకున్నాడు.  


"అవునండీ! అప్పిగాడి కొడుకునే! కానీ మా అమ్మ ఒప్పుకోవట్లేదు..... కాదంటోంది.....


ఆ మాట విని ఆ పెద్దాయన షాక్....తిన్నారు. 😃🙃😁😃😉😃😁

Panchaag


 

శ్రీ శారదా పీఠం

 🕉 మన గుడి : నెం 243


⚜ జమ్మూకాశ్మీర్  : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌


⚜ శ్రీ శారదా పీఠం 



జ్ఞానప్రదా సతీ మాతా కాశ్మీరేషు సరస్వతీ మహావిద్యా మహామాయా భుక్తిముక్తి ప్రదాయినీ 


💠 పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సరస్వతీ దేవి శక్తి పీఠాల చిత్రాలలో ఇది ఒకటి.  

దీనినే శారదా పీఠం అని కూడా అంటారు.


💠 ఈ మందిరం ఒకప్పుడు వేద రచనలు, గ్రంథాలు మరియు వ్యాఖ్యానాల ఉన్నత అభ్యాసానికి ప్రధాన కేంద్రంగా పరిగణించబడింది. 

దీనికి 5000 సంవత్సరాలకు పైగా భారతీయ వారసత్వం గొప్ప చరిత్ర ఉంది. 


💠 ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చేయి పడిపోయిన శక్తి పీఠంగా పరిగణించబడుతుంది .

ప్రస్తుతం ఆలయ శిథిలాలు మాత్రమే ఉన్నాయి 


💠 ఈ ఆలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు సర్వజ్ఞానపీఠం ( జ్ఞాన సింహాసనం) పై కూర్చునే హక్కును పొందారు .  ఆదిశంకరాచార్యులు రచించిన 'ప్రపంచసార సంగ్రహం' మొదటి శ్లోకం శారద స్తుతికి అంకితం చేయబడింది. 

దక్షిణ భారతదేశంలోని శృంగేరి శారదాంబ ఆలయంలోని శారదా చిత్రం ఒకప్పుడు గంధంతో తయారు చేయబడిందని, దీనిని ఇక్కడి నుండి  శంకరాచార్యులు తీసుకున్నారని చెబుతారు .


💠 సతీదేవి - దక్ష యజ్ఞం యొక్క పురాణ కథనం ప్రకారం సతీదేవి యొక్క శరీర భాగాలు భారత ఉపఖండంలోని అనేక ప్రదేశాలలో మరియు శ్రీలంకలోని ట్రింకోమలీలో  పడిపోయాయి. 

అలా ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠం అంటారు. 

శక్తి పీఠం సంఖ్య 108, 51 మరియు 52గా వ్యత్యాసం ఉంది, అయితే 18 శక్తి పీఠం అష్టాదశ శక్తిపీఠంగా సుపరిచితం .

ఈ ప్రదేశంలో, దేవి కుడి చేయి పడిపోయింది.


💠 శారదా పీఠము పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడిపోయిన సతీదేవి కుడి చేయి శారదా లేదా సరస్వతీ దేవి పేరుతో 18 వ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిందని నమ్ముతారు .

ప్రస్తుతం ఆలయం శిథిలావస్థలో ఉంది. ఆదిశంకరాచార్యులు శారదాదేవిని దర్శించి పూజించారని శంకర విజయ కావ్యంలో పేర్కొన్నారు. 


💠 ఇక్కడ భారత ఉపఖండంలో దేవత పేరుతో ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉంది మరియు విశ్వవిద్యాలయంలోని సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి చాలా దూరాల నుండి పండితులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించేవారు. 

ఉత్తర భారతదేశంలో శారదా లిపి అభివృద్ధి చెందడానికి మరియు కాశ్మీర్ పేరు " శారదా దేశ్" గా మారడానికి ఇదే కారణం . 


💠 హిమాలయ శ్రేణిలోని అనంత్ నాగ్ జిల్లా మార్తాండ్‌లోని అమర్‌నాథ్ మరియు సూర్య దేవాలయంతో సమానంగా శారదా పీఠ్ కాశ్మీర్ పండిట్‌లకు మూడవ ముఖ్యమైన పవిత్ర స్థలం.      


💠 శారదా పీఠం మధుమతి, కృష్ణ గంగా లేదా నీలం నది మరియు శాండిలి పవిత్ర జలాల సంగమం వద్ద శాండిల్య అని పేరు పెట్టారు.


💠 శారదా పీఠంలో పూజించబడే శారదా దేవత శక్తి దేవత యొక్క త్రిసభ్య స్వరూపమని కాశ్మీరీ పండితులు విశ్వసిస్తారు : 

శారద (విద్యా దేవత), 

సరస్వతి (జ్ఞాన దేవత), మరియు 

వాగ్దేవి (శక్తిని వ్యక్తీకరించే వాక్ దేవత). 


💠 కాశ్మీరీ పండితుల నమ్మకం ప్రకారం దేవతల నివాసమైన నీటి బుగ్గలను ప్రత్యక్షంగా చూడరాదని, ఈ మందిరంలో ఒక రాతి స్లాబ్ ఉంది, దాని కింద ఉన్న నీటి బుగ్గను దాచిపెట్టారు, శారద దేవత తనను తాను వెల్లడించుకున్న స్వరూపం అని వారు నమ్ముతారు. 


💠 మతపరమైన ఆచారంగా, కాశ్మీర్ అంతటా ఉన్న కాశ్మీరీ పండితులు, వేదాంతవేత్తలు శారదా దేవి ఆశీర్వాదం పొందడానికి వారి శాస్త్ర రచనలు ఒక వస్త్రముతో కప్పబడిన పళ్ళెంలో శారదా దేవత విగ్రహాల ముందు ఉంచుతారు. వ్రాత యొక్క పేజీలను కలవరపడకుండా వదిలివేయడం ద్వారా దేవత ఆమోదాన్ని తెలియజేస్తుందని మరియు పేజీలను చిందరవందరగా వదిలివేయడం ద్వారా నిరాకరణను తెలియజేస్తుందని వారు విశ్వసించారు.


💠 ఈ ఆలయాన్ని కాశ్మీరీ నిర్మాణ శైలిలో ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. 

ఆలయ నిర్మాణ శైలికి సంబంధించిన చారిత్రక రికార్డులు చాలా తక్కువ.

     

💠 శారద పీఠం ఆజాద్ కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ నుండి దాదాపు 150 కిలోమీటర్లు (93 మైళ్ళు) మరియు కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి 130 కిలోమీటర్లు.

ఉల్లిగడ్డ

 ఉల్లిగడ్డ ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ . 


   ఇది శరీరానికి చలువ చేయును . ఉష్ణ శరీరం కలవారు , మేహప్రకృతి కలిగినవారు , మొలల సమస్య ఉన్నవారు , అతిసారము , రక్తాతిసారం , గ్రహణి రోగము , ఉబ్బురోగం , మలమూత్ర బద్దకం కలిగినవారు దీనిని సేవించిన మంచి ఉపశాంతి కలుగును. పిత్తప్రకోపములు ఇది తగ్గించును . ఆకలి పెంచును . అగ్నిదీపనం చేయును . ఇంద్రియాలకు ఉత్సాహం కలిగించును. రక్తమును శుభ్రపరచును . శ్వాస , కాస , శ్లేష్మము , వాతములను పోగొట్టును . వీర్యవృద్ధికరము , ఈ గడ్డలు దంచి రసము తీసి ఒంటికి పూసిన దురదలు తగ్గును. తేళ్లు , కందిరీగలు కుట్టినచోట ఈ రసము పూసిన బాధ తగ్గును. రసము చెవిలో పోసిన చెవిపోటు తగ్గును . ఈ రసము ఆవనూనెతో కలిపి మర్దన చేసిన మేహ వాత నొప్పులు తగ్గును . 


           ఈ రసము 20ml తాగించి ఉల్లిగడ్డ నూరిన ముద్దను వాసన చూపించి కాటు వేసినచోట వేసి కట్టు కట్టిన ఎంతటి విష సర్పములు , వెర్రి కుక్కలు , తేళ్లు , మండ్రగబ్బల విషం అయినను విరిగిపోయి బాధ తగ్గును. 


                 15ml రసములో పంచదార చేర్చి లోపలికి తీసుకున్న మొలల రోగం నివారణ అగును. ఈ రసం మిరియాల పొడితో పుచ్చుకున్న జ్వరములు , పురాణ జ్వరములు నశించును. ఈ రసమును కాటుకలా కంటికి పెట్టుకొనుచున్న రేజీకటి తగ్గును.  ఉల్లిగడ్డ రసం ముక్కుతో లోపలికి పీల్చిన నాసికా రోగములు నివారణ అగును. గడ్డలు , వ్రణములకు ఈ గడ్డను ఉడికించి కట్టిన త్వరగా తగ్గును. 


   గమనిక  - 


      ఈ ఉల్లిగడ్డను అమితముగా తీసుకోరాదు . మేహ , ఉష్ణ ప్రకృతి కలిగిన వారికి మత్తు కలిగించును. తలనొప్పి , పార్శ్వపు నొప్పి కలిగించును . ఉలిగడ్డను సరాసరి తినరాదు. మజ్జిగ అన్నంతో కలిపి తినటం మంచిది . 


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

దండము..కమండలము

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..


*దండము..కమండలము..పాదుకలు..*


శ్రీ దత్తాత్రేయ స్వామివారు, తమ తపోసాధనలో భాగంగా కొన్నాళ్ల పాటు ఏర్పేడు వ్యాసాశ్రమంలో గడిపారు..(వ్యాసాశ్రమ విశేషాలను ఇంతకు ముందు శ్రీ స్వామివారి చరిత్ర లో చదువుకొని వున్నాము..పాఠకులకు గుర్తువుండి ఉంటుంది..) సాధన చేసే క్రమంలో దండ కమండలాలు చేత బూనడం, పాదుకలు ధరించడం మున్నగు అలవాట్లు శ్రీ స్వామివారికి వ్యాసాశ్రమం లో ఉన్నప్పుడే అలవడ్డాయి..వ్యాసాశ్రమం నుంచి బైటకు వచ్చిన తరువాత..తనతో పాటు దండ కమండలాలు, పాదుకలను కూడా తనతో పాటే తీసుకొని వచ్చారు..


చిత్తూరు జిల్లా పాపానాయుడుపేట లో శ్రీ బాలబ్రహ్మాచారి వద్ద గురుబోధ పొంది, ప్రకాశం జిల్లా లోని పుణ్యక్షేత్రం మాలకొండ లో తపోసాధన కొనసాగించడానికి శ్రీ స్వామివారు నిశ్చయం చేసుకొని..మాలకొండ లో గల శ్రీ పార్వతీదేవి మఠాన్ని తన ఆవాసంగా మలచుకున్నారు..శ్రీ పార్వతీదేవి మఠం పై భాగం లో ఉన్న శివాలయం లో సాధన చేసుకునే వారు..జన సంచారం ఎక్కువగా వున్న సమయాల్లో..శివాలయం కు పై భాగాన ఉన్న గుహల్లో కి వెళ్లిపోయేవారు..మాలకొండ చేరిన తరువాత దండ కమండలాలు మాత్రం తపోసాధనలో వినియోగించారు కానీ..పాదుకలను మాత్రం ధరించేవారు కాదు..వట్టి కాళ్ళతోనే సంచరిస్తూ వుండేవారు..


మొగలిచెర్ల గ్రామం శివార్ల లో ఉన్న ఫకీరు మాన్యం లో  ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దీ రోజుల పాటు శ్రీధరరావు ప్రభావతి గార్ల గృహం లో శ్రీ స్వామివారు వున్నారు.. ఆ సమయం లోనూ పాదుకలను ధరించలేదు..ఆశ్రమ నిర్మాణం జరిగే రోజుల్లోనూ ఆ ప్రదేశమంతా అలానే తిరిగేవారు కానీ..పాదుకలు ధరించలేదు..తనతో తెచ్చుకున్న వస్తువులలో పాదుకలు మాత్రం భద్రంగా ఉంచుకునేవారు..


ఆశ్రమ నిర్మాణం పూర్తయిన పిదప..ఆశ్రమంలో తన తపోసాధన కొనసాగించే రోజుల్లో మళ్లీ ఆ పాదుకలు వాడటం మొదలు పెట్టారు..అప్పటి నుంచీ చివరి వరకూ అంటే..తాను కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే రోజు దాకా..ఆశ్రమ ప్రాంగణం లో తిరిగినా..లేదా..ఆశ్రమం బైట వ్యాహ్యాళికి వచ్చినా ఖచ్చితంగా పాదుకలు ధరించే వుండేవారు..


మొగలిచెర్ల గ్రామానికి చెందిన శ్రీ తాళ్ళూరి నరసింహారావు అనే భక్తుడు, శ్రీ స్వామివారికి వెండి పూతతో చేసిన పాదుకలు బహూకరించి, వాటిని ధరించమని ప్రాధేయపడ్డారు..శ్రీ స్వామివారు నవ్వి..ఆ భక్తుడి తృప్తి కోసం ఒక్కసారి తన కాళ్లకు ధరించి.."ఇవి బాగా బరువుగా ఉన్నాయి నాయనా!.." అని చెప్పి ప్రక్కన పెట్టేసారు..ఆ వెండి పూతతో ఉన్న పాదుకలను ఆశ్రమం లోనే వుంచమని చెప్పి, నరసింహారావు వెళ్లిపోయారు..ప్రస్తుతం పల్లకీ సేవలో ఆ పాదుకులనే శ్రీ స్వామివారి విగ్రహం తో పాటు ఊరేగిస్తున్నాము..ఒక్కసారి శ్రీ స్వామివారి పదస్పర్శ తగిలిన ఆ పాదుకులకు చిరస్థాయిగా పల్లకీ సేవలో ఊరేగే భాగ్యం కలిగింది!..


వ్యాసాశ్రమం వీడిన రోజునుంచీ..మళ్లీ మొగలిచెర్ల లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో చేరేదాకా పాదుకలను ఎందుకు వాడకుండా ఉన్నారో ఇప్పటికీ అంతుచిక్కని విషయం..


శ్రీ స్వామివారు వాడుకున్న దండము, కమండలము, పాదుకలు..భద్రంగా శ్రీ స్వామివారి సమాధి వద్ద భద్రపరచబడి ఉన్నాయి..ఒక మహనీయుడి తపోసాధనకు ఉపయోగపడిన ఆ వస్తువులు.. అత్యంత పవిత్రమైనవిగా మేము భావిస్తాము..శ్రీ స్వామివారి సమాధిని దర్శించే భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్లకద్దుకుంటారు..తమ తమ కోర్కెలు నెరవేరాలని ఆ పాదుకలకు శిరస్సు ఆనించి మ్రొక్కుకుంటారు..


ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఈ వస్తువుల భద్రత గురించి ఆలోచించాల్సి వస్తోంది..ఎందుకంటే కొన్ని తరాలపాటు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉన్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...SPSR నెల్లూరు జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -‌ పంచమి - చిత్ర / స్వాతి -‌ గురు వాసరే* (29.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/95wkQaiiXHw?si=wmX9n8qdCpAFZD5U



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*01-03-2024 / శుక్రవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

---------------------------------------

వృషభం


నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

---------------------------------------

మిధునం


ఉద్యోగస్థులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. 

---------------------------------------

కర్కాటకం


ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి.

---------------------------------------

సింహం


మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. శుభ కార్యములకు ధనవ్యయం చేస్తారు.

---------------------------------------

కన్య


ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ధనదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట విమర్శలు అధికమౌతాయి. 

---------------------------------------

తుల


చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో ఉద్యోగమున సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

---------------------------------------

వృశ్చికం


నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు.

---------------------------------------

ధనస్సు


 ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మకరం


ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం


సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి.

---------------------------------------

మీనం


ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదాపడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 37*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ ।*

*తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ।।*


*భావము:*

యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీర మరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి తయారుకమ్ము.

 

*వివరణ:* 

2.31వ శ్లోకం నుండి శ్రీ కృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయి లోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం వుంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే, భూలోకం లో సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది, ఒకవేళ కర్తవ్య నిర్వహణ లో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే, అతను స్వర్గ లోకాలకు వెళ్తాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 42*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥 వేమన పద్యాలు --- 122*


*అధికభుక్తిచేత మొదట సొమ్ముకు హాని*

*కుదువ సొమ్ము కొన్న కొంత హాని*

*మొదట పక్షమునను మూలకర్తకు హాని*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అతిగా తినుట వలన డబ్బు నష్టము , అనారోగ్యము కలుగును.

కూడబెడితే అదోరకమైన కష్టనష్టము.

అనారోగ్యంతో మనిషి ప్రాణములను కోల్పోవును.


*💥వేమన పద్యాలు -- 123*


*అధికజనులతోడ నాప్తులతోడను*

*పరువు గురుతెరింగి పలుకకున్న*

*వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య*

*హాని చెందు దనకు నపుడు వేమా!*


*🌹తాత్పర్యము --*

అందరితోనూ మంచిగా ఉండాలి.

కావలసిన వారిని పలుకరిస్తూ ఉండాలి.

పరువు - మర్యాద తెలుసుకుని ప్రవర్తించాలి.

లేనిచో చెడ్డవాడగుతాడు.

అతని గౌరవం కూడా తగ్గును.



*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 37*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ ।*

*తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ।।*


*భావము:*

యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీర మరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి తయారుకమ్ము.

 

*వివరణ:* 

2.31వ శ్లోకం నుండి శ్రీ కృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయి లోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం వుంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే, భూలోకం లో సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది, ఒకవేళ కర్తవ్య నిర్వహణ లో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే, అతను స్వర్గ లోకాలకు వెళ్తాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే*

*శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ*

*స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ*

*ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే.*


జనార్ధనా! నీవు బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మాన్ని నాభియందు ధరించినవాడవు. సంసార దు:ఖాన్ని హరించివేస్తావు. పరమాత్మవు. నీవు ధరించిన పట్టువస్త్రం పద్మాలలోని కింజల్కాల పసిమివన్నెతో అత్యంతము, నిర్మలమై, దివ్యమై నవ్యమై ఒప్పారుతూ ఉంటుంది. నీ పాదాలు పద్మాలవలె కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. నీవు మెడనుండి పాదాలవరకూ ధరించే వనమాల మనోజ్ఞమైన తమ్మిపూలతో నిండి చూచేవారికి చూడముచ్చటగా ఉంటుంది. నీవు ఇంద్రుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారికంటె మహాత్ముడవు. సృష్టిలో ఉండే సుగుణాలన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఒప్పారుతున్నాయి. మ్రుక్కడి రక్కసులను చంపివైచి సాధువులను సంరక్షిస్తూ ఉంటావు.నీవు బ్రహ్మదేవునకు కూడా తండ్రివి. అట్టి నీకు వేలకొలది నమస్కారాలు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

ఆధ్యాత్మిక ఆనందం*

 *ఆధ్యాత్మిక ఆనందం* 

                 ➖➖➖✍️

*ఆనందం అంటే బాధలు లేకపోవడం కాదు. బాధలు మనల్ని బాధించకపోవడం.*

*బాధ గురించిన భావనలే మనల్ని బాధకంటే ఎక్కువగా బాధిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించకుండానే అర్జునుడు విషాద యోగంలో మునిగిపోయాడు. బంధుమిత్రులను సంహరించి రాజభోగాలను అనుభవించలేనని వాపోయాడు. ధర్మానికి విరుద్ధంగా శత్రుపక్షంలో ఉన్న కౌరవులు పాండవుల పట్ల ఎప్పుడూ ద్రోహ బుద్ధితోనే ఉన్నారు.*

*ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు ఆ విషయాన్నే చెబుతూ ‘అర్జునా! నీవు చంపకపోయినా ఇందులో బతకగల వారెవ్వరూ లేరు... చంపడం, చావడం నీ చేతిలో లేదు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. యుద్ధం చెయ్యడం వరకే నీ కర్తవ్యం. అది పాటించు చాలు’ అంటాడు.*

*అధర్మనాశనానికి అర్జునుణ్ని కేవలం ఒక ఉపకరణంగా, ఆయుధంగా శ్రీకృష్ణుడు ఉపయోగించుకున్నాడు. సంహార సంకల్పం పరమాత్మది.*

*నిర్మలమైన అంతరంగం గలవారికి సుఖదుఃఖాల అనుభూతి ఉండదు. శ్రీరమణులు క్యాన్సర్‌ వచ్చినప్పుడూ బాధపడిన సూచనలు ఆయన ముఖంలో ఎన్నడూ కనిపించేవి కావు.*

*అదే మందహాసం, అదే నిర్లిప్తత!సాధారణ వ్యక్తులకది అసాధ్యం. సాధనతోనే అసాధ్యాన్ని ఎవరైనా సుసాధ్యం చేసుకోగలరు.*

*ప్రతి మనిషికీ వారి వారి ఆలోచనలు, అభిరుచులను బట్టి జీవిత లక్ష్యాలు ఉంటాయి.*

*అవి ఎవరికి వారికే ప్రత్యేకం. ఆనువంశికంగా ప్రజ్ఞాప్రాభవాలు లభించవు.*

*అల్లసాని పెద్దన కొడుకు, కాళిదాసు కుమారుడు మహాకవులుగా రాణించిన దాఖలాలు లేవు.*

*రాజు కొడుకు రాజు అవుతాడు. కానీ, రాజ్యాన్ని రక్షించుకొనే సామర్థ్యం కచ్చితంగా ఉంటుందనీ చెప్పాడు


*అలా ఉండి ఉంటే రాజవంశాలు అంతరించేవి కావు. మహాకవి జాషువా చెప్పినట్లు- ఎంతటి చక్రవర్తులైనా కలకాలం ఇల మీద ఉండరు. అందరూ రుద్రభూమిలో శయనించవలసిన వారే.*

*ప్రాపంచిక సుఖాలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప ఆనందాన్ని ఇవ్వలేవు. ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా అంకితమైన వారు ఆనందభావనతో ఉంటారు.*

*ఆనందం అంటే మాటలకందని అనుభూతి. ఆ అనుభూతి వారి ముఖంలో నెలవై ఉంటుంది. ఎంతటి కష్టానికైనా వారు చలించరు. మేరుపర్వతంలా ధీరువై ఉంటారు. సేవను భాగ్యంగా భావిస్తారు. సహాయాన్నే వారు సేవగా తలుస్తారు.*

*ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎక్కువ తక్కువల తేడా చూపకుండా, మానావమానాలు పట్టించుకోకుండా సేవలు చేసేవారే నిజమైన ఆధ్యాత్మిక జీవనం గడిపేవారిగా మనం గుర్తించవచ్చు. అలాంటివారు ఎంతో అరుదుగా కనిపిస్తారు. పురుషులందు పుణ్యపురుషులంటే అలాంటి వారే.*

*ఆదర్శం అంటే చెట్టును మెచ్చుకుంటూ నీడలో హాయిగా విశ్రాంతి పొందడం కాదు...! మరికొన్ని మొక్కల్ని నాటడం. వాటిని పెంచి పోషించడం, కాపాడటం. ఆ విధంగా మరెందరికో మేలు చెయ్యడం. అందరికీ మేలు జరిగే పనులు చెయ్యడంలోనే అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది.*

*ఈ సత్యం తెలుసుకోలేక స్వార్థంలోనే ఆనందం లభిస్తుందని ఎందరో భావిస్తుంటారు.*

*ప్రాపంచిక ఆనందాలనేవి తాత్కాలికమే. మనకు ఎన్నో అనుభూతుల్ని ఇచ్చే శరీరమూ శాశ్వతం కాదు. ఒక్క ఆధ్యాత్మిక ఆనందమే శాశ్వతం. దాని చిరునామా అంతర్యామి అంతరాలయమే.*

*వెతుక్కోవలసింది మనమే. ఎవరెన్ని బోధలు చేసినా, అన్ని బాధలకూ ఓర్చి అంతర్యామిని దర్శిస్తే అప్పుడు తరగని ఆధ్యాత్మిక ఆనందం మన సొత్తవుతుంది.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

వేణువు అంటే

 *శ్రీకృష్ణుడుకి వేణువు అంటే ఎందుకు అంత ఇష్టం..?*

*ఒకసారి రాధకు ఇదే అనుమానం వచ్చింది, ఏముంది ఈ వేణువులో..? ఎందుకు దీనిని కృష్ణస్వామి వదలడు..? ఈ వేణువు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ కూచుంది రాధ, ఒక రోజు కృష్ణుడు నిద్రపోతూ కనిపించాడు, అంతే దభాలున స్వామి పక్కన ఉన్న వేణువును తీసుకుని దానిలోకి తొంగిచూసింది, దానిలో ఏమీలేదు, అంతా ఖాళీ, రాధ అలా చూస్తుండగా కృష్ణుడు నవ్వుతూ లేచి "రాధా..! ఇప్పుడు అర్థం అయ్యిందా వేణువు రహస్యం, నిన్ను నీవు ఖాళీ చేసుకుంటే, నీలోకి కృష్ణ తత్వం ప్రవేశిస్తుంది, నిన్ను నీవు అనవసర విషయాలతో నింపేసుకుంటే, ఇక నాకు చోటేది"..? అప్పుడు రాధకు వేణువును కృష్ణుడు ఎందుకు ఇష్ట పడతాడో అర్థం అయ్యింది, భౌతికంగా చూస్తే మన వెన్నెముకనే వేణువు, దాని లోని రంధ్రాలు యోగ చక్రాలకు ప్రతీకలు, దాని గుండా ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేసామంటే, కుండలిని సహస్రారానికి తగిలి కృష్ణ దర్శనం అవుతుంది, అర్థం అయ్యిందిగా కృష్ణస్వామికి వేణువు అంటే ఎందుకు ఇష్టమో..! ఇక శరీరాన్ని వెదురు చేసుకోవాలా..? వేణువు చేసుకోవాలా అనేది మన ఇష్టం..!!✍️*

స్థానబలం

 శ్లోకం:☝️

*నక్ర స్వస్థానమాసాద్య*

  *గజేంద్రమపి కర్షతి |*

*స ఏవ ప్రచ్యుతః స్థానాత్*

  *శునాపి పరిభూయతే ||*


భావం: మొసలి తన స్థానబలం వల్ల సరస్సులో నీరు త్రాగడానికి వచ్చిన పెద్ద ఏనుగును కూడా పట్టి లాగగలదు (గజేంద్ర మోక్షంలో లాగా). అయితే దాని స్వస్థలానికి దూరంగా ఉన్నప్పుడు ఒక ఊర కుక్కకి కూడా అది లోకువై అవమానించబడవచ్చు.

పంచాంగం 01.03.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 01.03.2024 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస కృష్ణ పక్ష: షష్థి తిధి భృగు వాసర: స్వాతి  నక్షత్రం ధ్రువ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి ఈ రోజు పూర్తిగా ఉంది.

స్వాతి మధ్యాహ్నం 12:45 వరకు.

సూర్యోదయం : 06:38

సూర్యాస్తమయం : 06:19


వర్జ్యం : సాయంత్రం 06:47 నుండి రాత్రి 08:30 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:58 నుండి 09:45 వరకు తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 01:39 వరకు.


అమృతఘడియలు : ఈ రోజు లేదు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 3:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార: