20, డిసెంబర్ 2025, శనివారం

పారిజాత పుష్పాల

  సమస్త మంగళప్రదం*పారిజాత పుష్పాలు ఎందుకు కొయ్యకూడదు?*

🔔 *తెలుసుకొందాం* 🔔


✨ *పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత* ✨


🌺 క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?


🌿 *పారిజాతం ప్రత్యేకత*


• పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది.


• ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.


• పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది.


• తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు.



🌸 ఎందుకు కిందపడిన పుష్పాలనే వాడాలి?


• సాధారణంగా పూలను కోసి పూజ చేస్తారు.


• కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది.


• ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం 🌿.


• అందుకే కిందపడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది.


• కిందపడిన పువ్వులను మాత్రమే ఆవుపేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి.



🌼 పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే…


🌟 ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం.



🌺 పారిజాత పుష్పాలు 9 రకాలు 🌺


1. ఎర్ర (ముద్ద) పారిజాతం ❤️


2. రేకు పారిజాతం 🍃


3. తెలుపు–ఎర్ర కాడతో (సాధారణంగా కనిపించేది) ⚪🔴


4. పసుపు పారిజాతం 💛


5. నీలం పారిజాతం 💙


6. గన్నేరు రంగు పారిజాతం 🌺


7. గులాబీ రంగు పారిజాతం 🌸


8. తెల్లని పాలరంగు పారిజాతం 🤍


9. ఎర్ర రంగు పారిజాతం 🔴


⚠️ ఎరుపు రంగు పారిజాతం విష్ణు ఆరాధనకు వాడరాదు.


ఎందుకంటే ఎరుపు = తమోగుణం, కానీ విష్ణువు = సత్వగుణం.



🕉️ పారిజాతం వరప్రసాదం 🕉️


• పారిజాత వృక్షం తపస్సు చేసి,


🌸 “నా పుష్పాలను కోయకూడదు, తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి” అనే వరం పొందింది.


• అందువల్లే కిందపడిన పువ్వులను మాత్రమే తీసుకుని పూజకు వాడడం పవిత్రం.


🌟 *పారిజాతం యొక్క పంచస్పర్శ మహిమ* 🌟


భూ స్పర్శ 🌍 + మృత్తికా స్పర్శ 🪨 + జల స్పర్శ 💧 + హస్త స్పర్శ ✋ + స్వామి స్పర్శ 🙏


➡️ ఈ ఐదు స్పర్శలతో కలిసిన పారిజాతం పంచమహా పాతకాలను తొలగిస్తుంది.

💐 అందుకే పారిజాతం పుష్పాలు – కిందపడినవే పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి అన్నది పురానవచనం.


✨ పారిజాత పుష్పం భగవంతుని  దివ్య ద్వారం. ✨


✨శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళప్రదం కావాలి.✨

మంచి వాళ్ళ సావాసం

  🌹మంచి వాళ్ళ సావాసం


అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక వేటగాడు వున్నాడు.అతను వేటకు వెళ్లి రెండు రామచిలుకలను పట్టి తెచ్చాడు.ఆ చిలుకలను రాజభవనానికి తెచ్చి రాజుకు బహుకరించాడు. ఆ రాజు ఈ చిలుకలను మంత్రికి మరియు సేనాధిపతికి ఇచ్చాడు.మంత్రికి,సేనాధిపతికి ఒక్క నిముషం కూడా పడదు . రాజు రామచిలుకకు ఎవరైతే మాటలు నేర్పిస్తారో వారికి బహుమతులు ఇస్తాను అని చెప్పాడు .మంత్రి ఇంటికి వెళ్లి భార్యతో దీనికి మాటలు నేర్పించు మనకు అన్ని బహుమతులు రావాలి అంటాడు అది విన్న మంత్రి భార్య ఎలా అండి అని అడిగింది. రాజు గారు దీనికి మాటలు నేర్పిస్తే బహుమతి ఇస్తా అన్నారు అంటాడు.

మంత్రి గారి భార్య సరే అంటుంది. సేనాధిపతి కూడా భార్యకు విషయం చెప్పి చిలుకను ఇస్తాడు.

మంత్రి భార్య ఒక సంగీతం నేర్పించే గురువు అవడం చేత అది అన్ని పాటలు ,పద్యాలు మంచి మాటలు నేర్చుకుంది. సేనాధిపతి భార్య పదవి ఉందని అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో గొడ్డు చాకిరి చేయిస్తూ అందరిని తిడుతూ ఉంటుంది అది విన్న చిలుక ఆ మాటలు తిట్లు నేర్చుకుంది.మంత్రి ఎప్పుడు రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు కనుక చిలుక కూడా రాజు గారి మీద గౌరవం పెంచుకుంటుంది సేనాధిపతి రాజుకి వ్యతిరేకంగా ఇతర రాజులతో రహస్య సమావేశాలు నిర్వహించి రాజు పై దాడికి ప్రయత్నిస్తాడు. ఒకరోజున రాజుగారు ఆ రెండు చిలుకలని సభకు తేవలసిందిగా ఆదేశించాడు. వారిద్దరూ చిలుకలను తీసుకుని వచ్చారు,రాజు మంత్రి గారి చిలుకను అడిగాడు.ఎలా వున్నావు? అని దానికి ఆ చిలుక పద్దతిగా నేను బాగున్నాను. రాజు గారు మీరు ఎలా ఉన్నారు ?అని అడిగింది

రాజు కు సంతోషం కలిగింది.సేనాధిపతి చిలుకని ప్రశ్నించాడు రాజు దానికి ఆ చిలుక నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అయిన మా సేనాధిపతి నీపైన దాడి చేయి స్తాడు .నువ్వు చస్తావ్ అని అంటుంది రాజు కి కోపం వచ్చి సేనాధిపతిని బంధిస్తాడు.


 మంచి వాళ్ళ సావాసం ఎప్పుడూ మంచే నేర్పుతుంది అందుకే అన్నారు పెద్దలు సహవాసదోషం అని అంటారు.చెడు మాటలు చేతలు తొందరగా ఆకర్షితం అవుతాయి. కనుక మంచే నేర్చుకోవాలి.🌹🌹🙏🏻🙏🏻🌹🌹

వర్జ్యం అంటే !*

  2012e6;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



              *వర్జ్యం అంటే !*

                ➖➖➖✍️



జ్యోతిష్యంలో వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. 


ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది.


వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.

అశుభ సమయం.

శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.



ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. 


జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని, చంద్రస్ఫుటం గాని, ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.



భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా, మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటారు. 


అటు దైవకార్యాలకి, ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటమనేది ప్రాచీనాకాలం నుంచి వస్తోంది. 


ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా 

ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటం వలన, అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.



ఈ నేపథ్యంలోనే ‘వర్జ్యం’ అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. 


‘వర్జ్యం’ అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. 


”ఇప్పుడు వర్జ్యం వుంది తరువాత బయలుదేరుతాం” … 

“కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది … త్వరగా బయలుదేరండి” అనే మాటలు మనం తరచూ వింటూ వుంటాం. 


వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. 


ఈ కారణంగానే పెద్దలు 

ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.



వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, 

ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది. 


ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.


ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు.



వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. 

అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. 


ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పుష్యమాసంప్రారంభం

  2012e9;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀నేటి నుండి… 


       *పుష్యమాసంప్రారంభం*

                 ➖➖➖✍️

```

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. 


‘పుష్య’ అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం, పుష్య మాసం శీతాకాలం.


ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. 

పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. 


పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది, శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. 


విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్వరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. 


ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. 


పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. 


దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి వంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. 


శని ధర్మదర్శి న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే. 


మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.


అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.  


పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. 


పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.


అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. 


మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.  


ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. 


ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. 


పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. 


పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. 


భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.


ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. 


సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. 


సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు.


సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.


ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి, పితృ తర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.


పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. 


ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.


మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*596 వ రోజు*


అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము


పామువాదన


వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవానితో " అన్నా ! ఇందు నాతప్పు ఏమీ లేదు మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు " అని పలికింది పాము. బోయ వాడు " మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నీన్ను చంపడం తప్పు కాదు " పామును చంపబోయాడు. పాము " అయ్యా ! కుమ్మరి వాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారెదా కుమ్మరి వాడిదా తప్పు. అయ్యా నరులు కనపడితే నన్నే చంపుతారు కదా ! అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది " అన్నది. బోయవాడు " బాగా చెప్పావు సర్పమా ! ఎదుటి వాడు బాణం వేసినప్పుడు బాణము వేసిన వాడిది తప్పా బాణాది తప్పా అని ఆలోచిస్తూ ఊరుకుంటామా ! వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా ! అందులో పాపము ఏముంది. అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నే కాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి " అన్నాడు. అందుకు పాము నవ్వి " అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతే కాని నాది కాదు " అన్నది.

మృత్యుదేవతవాదన


అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి " సర్పరాజమా ! నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి " అని మృత్యుదేవత పలికింది. పాము " నువ్వు చెప్పినది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్పా, నీ తప్పా అని చెప్పడానికి నేను ఎవరిని " అని " బోయవాడితో " అన్నా ! మృత్యు దేవత మాట విన్నావు కదా ! నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా ! " అన్నది. బోయవాడు నవ్వి " నువ్వూ మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయము లేదు " అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి " మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మలఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలితంగా పుట్టుకు, మరణము, సుఖము దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకో లేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు కనుక ఎవరిని నిందించ వలసిన అవసరము ఏముంది " అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి " అన్నా ! యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా ! నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి ? కనుక ఆ పామును విడిచి పెట్టు " అన్నది. ఇందరి మాట విని బోయవాడ జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచి పెట్టాడు. కనుక ధర్మనందనా ! యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే ! నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా ! " అని చెప్పాడు.

మృత్యుభయము


*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ శ్వేత వినాయకర్ ఆలయం🕉 మన గుడి : నెం 1331 ⚜  తమిళనాడు : కుంభకోణం ⚜  శ్రీ శ్వేత వినాయకర్ ఆలయం 💠 ఏదైనా కార్యం మొదలుపెట్టే సమయంలో ఖచ్చితంగా విఘ్నరాజైన వినాయకుడికి పూజ చేయాలి. లేదంటే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదన్న విషయం మన పురాణాలు చెబుతాయి. 💠 పాల సముద్రపు నురుగుతో చేసిన " శ్రీ నురుగు గణపతి " విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది.  ఈ ఆలయాన్ని సంస్కృతంలో శ్వేత వినాయక దేవాలయం లేదా తమిళంలో వెల్లై వినాయక దేవాలయం అని కూడా పిలుస్తారు, దీని అర్థం "తెల్ల వినాయకుని ఆలయం". 🔆 స్థల పురాణం  💠 అమరత్వం కోసం అమృతాన్ని సంపాదించాలని దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మధనం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట అమృతం బదులు హాలహలం వచ్చింది. 💠 ప్రసిద్ధ సముద్ర మథనం సమయంలో చాలా అడ్డంకులు వచాయి . నారద మహర్షి దేవతలు మరియు అసురులతో వారు ప్రారంభంలో గణేశుడికి ప్రార్థనలు చేయలేదని మరియు అందువల్ల వారు వివిధ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని చెప్పారు.  💠 వెంటనే దేవతలు మరియు అసురులు సముద్రం నుండి నురుగును తీసివేసి, ఒక గణేశుడిని తయారు చేసి పూజించారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే రాక్షసులతో పాటు దేవతలకు తాము చేసిన తప్పు తెలిసివచ్చింది. 💠 పరమశివుడి సూచన మేరకు సముద్ర నురగతో వినాయకుడి విగ్రహం చేసి దానిని పూజించారు. దీంతో అటు పై నిర్విఘ్నంగా వారి కార్యం కొనసాగి చివరికి అమృతం దక్కించుకొన్నారు. అటు పై ఇంద్రుడు ఆ నురుగుతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లి అక్కడ పూజించేవాడు. 💠 ఇలా కొన్నాళ్లపాటు కొనసాగిన తర్వాత అహల్య వల్ల తనకు గలిగిన శాప నివృత్తికోసం సముద్ర నురుగుతో తయారుచేసిన విగ్రహాన్ని భూమి పైకి తీసుకువచ్చి కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉంచి పూజలు చేసేవాడు. 💠 ఈ క్రమంలోనే ఒకసారి ప్రస్తుతం కుంభకోణానికి ఇంద్రుడు ఆ నురుగుతో చేసిన ఆ శ్వేత వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడి పవిత్రతకు, వాతావరణానికి ముగ్దుడైన వినాయకుడు ఇక్కడే ఉండిపోవాలనుకొంటాడు. ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు. దీంతో శివుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో అక్కడికి వస్తాడు. అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం అవుతుంది. దీంతో ఆ పిల్లవాడి చేతికి స్వేత వినాయకుడిని ఇచ్చి శివార్చనకు వెలుతాడు. శివార్చన ముగించుకొని వచ్చేదాకా ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదని చెబుతాడు. 💠 అయితే ఇంద్రుడు అలా వెళ్లిన వెంటనే పిల్లవాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న శ్వేత వినాయకుడిని అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విగ్రహం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు. అటుపై దేవ శిల్పిని రప్పించి రథం తయారు చేయిస్తాడు. ఆ రథం పై వినాయకుడు ఉన్న ప్రాంతంతో సహా వినాయకుడిని స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమవుతాడు. 💠 అదే సమయంలో అశరీరవాణి శ్వేత వినాయకుడు ఇక్కడే ఉండాలని భావిస్తున్నాడని చెబుతుంది. దీంతో ఇంద్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు. అంతే కాకుండా ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజించాలని తద్వారా ప్రతి రోజూ పూజించిన ఫలితం లభిస్తుందని అశరీరవాని ఇంద్రుడికి సూచిస్తుంది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతారు. 💠 ఇక్కడి విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు. విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తాకరని చెబుతారు. 💠 శివుడు ప్రధాన దేవుడు మరియు కపర్దీశ్వరర్‌గా పూజించబడతాడు. పార్వతి దేవిని పెరియనకై దేవత అని పిలుస్తారు. కావేరీ నది ఆలయం దగ్గర తిరుగుతుంది. 💠 ఆలయ సముదాయం 7.25 ఎకరాల విస్తీర్ణంలో 5 మండపాలతో ఉంది. తెల్ల గణేశుడి ముందు 6 అడుగుల ఎత్తులో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి. 💠 ఎనిమిది చేతులతో అష్టభుజ మహాకాళి లేదా కాళి దేవత ఆలయంలో మరొక ముఖ్యమైన మూర్తి. 💠 దుర్వాస మహర్షి నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్న ఋషులు ప్రతిష్టించారని నమ్ముతున్న అనేక శివలింగాలు ఈ ఆలయంలో ఉన్నాయి. 💠 ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు ఐదు అంతస్తుల గోపురం ఉంది. 💠 తెల్లని గణేశుడి గర్భగుడి పక్కన ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు. ఈ మండపంలో 24 సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం గాయత్రీ మంత్రంలో ఒక అక్షరాన్ని సూచిస్తుంది. 💠 ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థానిక కథనం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. 💠 ఈ శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.  రచన ©️ Santosh Kumar

 🕉 మన గుడి : నెం 1331


⚜  తమిళనాడు : కుంభకోణం


⚜  శ్రీ శ్వేత వినాయకర్ ఆలయం



💠 ఏదైనా కార్యం మొదలుపెట్టే సమయంలో ఖచ్చితంగా విఘ్నరాజైన వినాయకుడికి పూజ చేయాలి. లేదంటే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదన్న విషయం మన పురాణాలు చెబుతాయి.


💠 పాల సముద్రపు నురుగుతో చేసిన " శ్రీ నురుగు గణపతి " విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. 

ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది. 

ఈ ఆలయాన్ని సంస్కృతంలో శ్వేత వినాయక దేవాలయం లేదా తమిళంలో వెల్లై వినాయక దేవాలయం అని కూడా పిలుస్తారు, దీని అర్థం "తెల్ల వినాయకుని ఆలయం".



🔆 స్థల పురాణం 


💠 అమరత్వం కోసం అమృతాన్ని సంపాదించాలని దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మధనం చేసిన విషయం తెలిసిందే. 

అయితే మొదట అమృతం బదులు హాలహలం వచ్చింది.


💠 ప్రసిద్ధ సముద్ర మథనం సమయంలో చాలా అడ్డంకులు వచాయి . నారద మహర్షి దేవతలు మరియు అసురులతో వారు ప్రారంభంలో గణేశుడికి ప్రార్థనలు చేయలేదని మరియు అందువల్ల వారు వివిధ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. 


💠 వెంటనే దేవతలు మరియు అసురులు సముద్రం నుండి నురుగును తీసివేసి, ఒక గణేశుడిని తయారు చేసి పూజించారు.

ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే రాక్షసులతో పాటు దేవతలకు తాము చేసిన తప్పు తెలిసివచ్చింది.


💠 పరమశివుడి సూచన మేరకు సముద్ర నురగతో వినాయకుడి విగ్రహం చేసి దానిని పూజించారు.

దీంతో అటు పై నిర్విఘ్నంగా వారి కార్యం కొనసాగి చివరికి అమృతం దక్కించుకొన్నారు. అటు పై ఇంద్రుడు ఆ నురుగుతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లి అక్కడ పూజించేవాడు.


💠 ఇలా కొన్నాళ్లపాటు కొనసాగిన తర్వాత అహల్య వల్ల తనకు గలిగిన శాప నివృత్తికోసం సముద్ర నురుగుతో తయారుచేసిన విగ్రహాన్ని భూమి పైకి తీసుకువచ్చి కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉంచి పూజలు చేసేవాడు.


💠 ఈ క్రమంలోనే ఒకసారి ప్రస్తుతం కుంభకోణానికి ఇంద్రుడు ఆ నురుగుతో చేసిన ఆ శ్వేత వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాడు. 

ఇక్కడి పవిత్రతకు, వాతావరణానికి ముగ్దుడైన వినాయకుడు ఇక్కడే ఉండిపోవాలనుకొంటాడు.

ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు. 

దీంతో శివుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో అక్కడికి వస్తాడు. 

అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం అవుతుంది.

దీంతో ఆ పిల్లవాడి చేతికి స్వేత వినాయకుడిని ఇచ్చి శివార్చనకు వెలుతాడు. 

శివార్చన ముగించుకొని వచ్చేదాకా ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదని చెబుతాడు.


💠 అయితే ఇంద్రుడు అలా వెళ్లిన వెంటనే పిల్లవాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న శ్వేత వినాయకుడిని అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లిపోయాడు.

తిరిగి వచ్చిన ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విగ్రహం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు. అటుపై దేవ శిల్పిని రప్పించి రథం తయారు చేయిస్తాడు. ఆ రథం పై వినాయకుడు ఉన్న ప్రాంతంతో సహా వినాయకుడిని స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమవుతాడు.


💠 అదే సమయంలో అశరీరవాణి శ్వేత వినాయకుడు ఇక్కడే ఉండాలని భావిస్తున్నాడని చెబుతుంది. 

దీంతో ఇంద్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు.

అంతే కాకుండా ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజించాలని తద్వారా ప్రతి రోజూ పూజించిన ఫలితం లభిస్తుందని అశరీరవాని ఇంద్రుడికి సూచిస్తుంది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతారు.


💠 ఇక్కడి విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. 

అంటే ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు. 

విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తాకరని చెబుతారు.


💠 శివుడు ప్రధాన దేవుడు మరియు కపర్దీశ్వరర్‌గా పూజించబడతాడు.

పార్వతి దేవిని పెరియనకై దేవత అని పిలుస్తారు. కావేరీ నది ఆలయం దగ్గర తిరుగుతుంది.


💠 ఆలయ సముదాయం 7.25 ఎకరాల విస్తీర్ణంలో 5 మండపాలతో ఉంది. తెల్ల గణేశుడి ముందు 6 అడుగుల ఎత్తులో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి.


💠 ఎనిమిది చేతులతో అష్టభుజ మహాకాళి లేదా కాళి దేవత ఆలయంలో మరొక ముఖ్యమైన మూర్తి.


💠 దుర్వాస మహర్షి నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్న ఋషులు ప్రతిష్టించారని నమ్ముతున్న అనేక శివలింగాలు ఈ ఆలయంలో ఉన్నాయి.


💠 ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు ఐదు అంతస్తుల గోపురం ఉంది.


💠 తెల్లని గణేశుడి గర్భగుడి పక్కన ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు. 

ఈ మండపంలో 24 సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. 

ప్రతి స్తంభం గాయత్రీ మంత్రంలో ఒక అక్షరాన్ని సూచిస్తుంది.


💠 ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థానిక కథనం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.


💠 ఈ శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.


 రచన

©️ Santosh Kumar

సమస్త మంగళప్రదం

  *పారిజాత పుష్పాలు ఎందుకు కొయ్యకూడదు?*

🔔 *తెలుసుకొందాం* 🔔


✨ *పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత* ✨


🌺 క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?


🌿 *పారిజాతం ప్రత్యేకత*


• పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది.


• ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.


• పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది.


• తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు.



🌸 ఎందుకు కిందపడిన పుష్పాలనే వాడాలి?


• సాధారణంగా పూలను కోసి పూజ చేస్తారు.


• కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది.


• ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం 🌿.


• అందుకే కిందపడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది.


• కిందపడిన పువ్వులను మాత్రమే ఆవుపేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి.



🌼 పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే…


🌟 ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం.



🌺 పారిజాత పుష్పాలు 9 రకాలు 🌺


1. ఎర్ర (ముద్ద) పారిజాతం ❤️


2. రేకు పారిజాతం 🍃


3. తెలుపు–ఎర్ర కాడతో (సాధారణంగా కనిపించేది) ⚪🔴


4. పసుపు పారిజాతం 💛


5. నీలం పారిజాతం 💙


6. గన్నేరు రంగు పారిజాతం 🌺


7. గులాబీ రంగు పారిజాతం 🌸


8. తెల్లని పాలరంగు పారిజాతం 🤍


9. ఎర్ర రంగు పారిజాతం 🔴


⚠️ ఎరుపు రంగు పారిజాతం విష్ణు ఆరాధనకు వాడరాదు.


ఎందుకంటే ఎరుపు = తమోగుణం, కానీ విష్ణువు = సత్వగుణం.



🕉️ పారిజాతం వరప్రసాదం 🕉️


• పారిజాత వృక్షం తపస్సు చేసి,


🌸 “నా పుష్పాలను కోయకూడదు, తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి” అనే వరం పొందింది.


• అందువల్లే కిందపడిన పువ్వులను మాత్రమే తీసుకుని పూజకు వాడడం పవిత్రం.


🌟 *పారిజాతం యొక్క పంచస్పర్శ మహిమ* 🌟


భూ స్పర్శ 🌍 + మృత్తికా స్పర్శ 🪨 + జల స్పర్శ 💧 + హస్త స్పర్శ ✋ + స్వామి స్పర్శ 🙏


➡️ ఈ ఐదు స్పర్శలతో కలిసిన పారిజాతం పంచమహా పాతకాలను తొలగిస్తుంది.

💐 అందుకే పారిజాతం పుష్పాలు – కిందపడినవే పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి అన్నది పురానవచనం.


✨ పారిజాత పుష్పం భగవంతుని అనుగ్రహానికి దివ్య ద్వారం. ✨


✨శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళప్రదం కావాలి.✨

శనివారం🍁* *🌹20డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

 *🌹20డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                  

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి  : పాడ్యమి* ‌పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : మూల* రా 01.21 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : గండ* సా 04.17 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : నాగ* ఉ 07.12 *కింస్తుఘ్న* రా 08.13 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 12.00 సా 05.00 - 06.30*

అమృత కాలం  : *సా 06.17 - 08.03*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.27*

*వర్జ్యం    : ఉ 07.41 - 09.07 & రా 11.35 - 01.21*

*దుర్ముహూర్తం  : ఉ 06.31 - 08.00*

*రాహు కాలం   : ఉ 09.18 - 10.42*

గుళికకాళం      : *ఉ 06.31 - 07.54*

యమగండం    : *మ 01.29 - 02.52*

సూర్యరాశి : *ధనుస్సు*                  

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.41*

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.30 - 08.44*

సంగవ కాలం         :     *08.44 - 10.58*

మధ్యాహ్న కాలం    :    *10.58 - 01.12*

అపరాహ్న కాలం    : *మ 01.12 - 03.26*


*ఆబ్ధికం తిధి         : పుష్య శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :  *సా 03.26 - 05.40*

ప్రదోష కాలం         :  *సా 05.40 - 08.14*

రాత్రి కాలం           :*రా 08.14 - 11.40*

నిశీధి కాలం          :*రా 11.40 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.48 - 05.40*

<><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏 శ్రీ వేంకటేశ్వర కరావలంబమ్🙏*


*వేదాంతవేద్య భవసాగర* 

*కర్ణధారశ్రీపద్మనాభ*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


*స్థిర నిల్యావర హనుమంత*

*ఈశ బాలక హనుమంత*

*జయ బజరంగబలి*

*జయజయ జయ బజరంగబలి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

  

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

తిరుప్పావై – 5వ పాశురము*_

 🌹🌷🪔🪔🛕🪔🪔🌷🌹

*శనివారం 20 డిసెంబర్ 2025*


_*శ్రీమతే రామానుజాయ నమ:*_

_*తిరుప్పావై – 5వ పాశురము*_

_*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*_


_*5వ పాశురము*_


_*మాయనై మన్ను, వడమదురై మైన్దనై*_

_*త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై*_

_*ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై*_

_*త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై*_

_*తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుదు*_

_*వాయినాల్ పాడి, మనత్తినాల్ శిన్దిక్క*_

_*పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్*_

_*తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్*_


_*తాత్పర్యము:-*_


ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధము గల ఉత్తరదేశమునందలి మథురానగరానికి నిర్వాహకుడును, పవిత్రము, అగాధమునగు జలముగల యమునానదిరేవే తనకు గురుతుగా కలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, తల్లి యశోద గర్భమును ప్రకాశింప చేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరు డైనవాడును నగు కృష్ణభగవానునివద్దకు మనము పవిత్రులై వచ్చి, పరిశుద్ధములగు పుష్పములతో నర్చించి, అంజలిఘ్హటించి, వాక్కుతో కీరించి, మనసార ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు, ఆగామిపాపరాశియు అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుడు.


*శ్రీమతే రామానుజాయ నమ:*

*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏