7, మార్చి 2024, గురువారం

Panchaag

 


ప్రకాశం పంతులు గారు

 సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు " స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది 


అది రాజమండ్రి స్టేషన్ 

సమయం తెల్లవారి ఐదు గంటలు 


'సరే నేను వస్తా పద 'అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి వెళ్ళాడు 


అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు 


ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు 


ఆ ముసలాయన ఎవరో కాదు

 *ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు*


ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన 


వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి " అయ్యా మీరా ? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుడిని " అని నమస్కారం చేశాడట 


ప్రకాశం గారు కళ్ళు తెరిచి " ఏరా.. భోంచేశావా ?" అని అడిగాడట 


పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు 


'తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తాగావా ? అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా ? అని అడుగుతారు..మరి పంతులు గారేంటి భోంచేశావా ? అని అడుగుతున్నారు..బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలీక ఇలా అడిగారేమో


 అనుకుని పంతులు గారితో ,


"అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు..మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా ? అని అడిగినట్టున్నారు "అని అన్నాడు


దాంతో పంతులు గారు ,


"ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా ? నేను నిన్నేమ్ అడిగాను..భోంచేశావా ? అనడిగా..దానికి నువ్వేం చెప్పాలి..నేను భోంచేశా.. మీరూ చేసారా ? "అని కదా అడగాల్సింది 


స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది 


పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది 


వెంటనే ఆయనకు కావాల్సిన పదార్దాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు 


ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు 


"ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు ?" అని ఒక పెద్దమనిషి పంతులు గారిని అడిగారు 


"విజయవాడ వెళ్తా.."అన్నారు పంతులు గారు 


పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు..ఐదు రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు 


రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళమీద పడి,

 " పంతులు గారూ.. మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా..భార్య కాన్సర్ తో బాధ పడుతుందయ్యా ..అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు 


పంతులు గారు వాడ్ని లేపి " ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు..అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు 


ఇదంతా చూసిన ఓ పెద్దమనిషి " అయ్యా పంతులు గారు..మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు..మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ..సరే..ఎలాగోలా విజయవాడ చేరతారు..మళ్లీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి..ఇంకొందరు పూనుకుని మిమ్మల్ని రైలెక్కించాలి..ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ ఖర్మ ఏంటి పంతులు గారూ " అంటూ భోరున ఏడిస్తే ,


పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి ' ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు.. పాపం వీడికెవరు ఉన్నార్రా ?" అని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట 


ఆ రోజుల్లో తమకోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు 


ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు పంతులు గారు 


మరి ఇప్పుడు ?

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఋణానుబంధరూపేణా

 #ఋణానుబంధరూపేణా

#ఋణానుబంధరూపేణా


కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లంజిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం.

                                     ***

ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ వయస్సులో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళను మోకాళ్ళవరకూ దేశానికి ఇచ్చేసి... ఓ సైనికుడిగా గర్వంగా తిరిగిన ఊర్లో, సానుభూతిగా బతకడం ఇష్టంలేక... తల్లిని, భార్యను, పదేళ్ల కొడుకు మహావీర్ సింగ్ ని తీసుకుని మా కాకినాడకు వచ్చేశారు. 


కాకినాడకు వచ్చిన మూడేళ్లకు చిన్న కొడుకు ఓంవీర్ సింగ్ పుట్టాడు.

                                   ***

మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే అని నిరూపిస్తూ తన భార్య, తల్లితో కలిసి మిఠాయి దుకాణం మొదలుపెట్టారు.


బంగారు రంగులో, బెల్లం పాకంతో... వేడి వేడిగా... కరకరలాడుతూ అమృతానికి సరిజోడులా ఉండే ఆ జిలేబి రుచి గుర్తుకు వస్తే చాలు మా కాకినాడ జనాలు ఆ దుకాణం దగ్గర జేరిపోయేవారు. 

                                   ***

ప్రతీ ఆగష్టు పదిహేనుకి, జనవరి ఇరవై ఆరుకి తన దుకాణం దగ్గర జండా ఎగురవేసి అక్కడికి వచ్చే జనాలకు ఉచితంగా జిలేబి పంచేవారు. 


సినిమా రోడ్డులో ఉండే కోకనాడ అన్నదాన సమాజంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రతీ ఆదివారం తన వంతుగా పదికిలోల జిలేజీ ఇచ్చేవారు.


ఆయన గొప్పదనం.... చేతి రుచి రెండూ తెలిసిన మా కాకినాడ జనాలు ఆయన్ని ముద్దుగా జిలేబి సింగోరు అని పిలిచే వాళ్ళు. 

                                     ***

అప్పుడెప్పుడో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కట్టించిన స్కూల్లో చేరి, బాగా చదివే పెద్ద కొడుకు మహావీర్ సింగుని ఎలాగైనా పూణే దగ్గర ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడిమీలో చేర్చి, మహా వీరుడులా చూడాలి అనుకునే వారు. 


మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. బాగా చదివే మహావీర్ తాను డాక్టర్ కావాలని కోరుకున్నాడు. 


తన ఇష్టాన్ని తనలోనే ఉంచేసుకుని మహావీర్ ని అతను చదవాలి అనుకునే మెడిసిన్ లోనే చేర్చారు ధరమ్ వీర్ గారు.  

                                   ***

అలుపన్నది తెలియని సూర్యుడు ఉదయిస్తూ... అస్తమిస్తూనే ఉన్నాడు. అతనితో కలిసి కాలం పరిగెడుతూనే ఉంది.

                                   ***

చదువులో అన్నకు తగ్గ తమ్ముడిగా ఉండేవాడు ఓంవీర్. చిన్నప్పటి నుండి లెక్కల్లో ఎంతో ముందు ఉండేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కొట్లో ఉండి... అక్కడికి వచ్చే మనుషుల మనసులను చడవడం అలవాటు చేసుకోసాగాడు. 

                                    ***

ఓరోజు ధరమ్ వీర్ గారి తల్లికి బాగా సుస్తి చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు ఏదో స్ట్రైక్ లో ఉండటంతో సమయానికి సరైన వైద్యం దొరకక ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.


జరిగిన సంఘటన ఆ తండ్రీ కొడుకుల మీద చాలా ప్రభావాన్నే చూపించింది. 

                                   ***

మెడిసిన్ ఐన తర్వాత ఆ మిఠాయి దుకాణం దగ్గరే కేవలం ఐదు రూపాయల ఫీజుతో ఆసుపత్రిని మొదలుపెట్టారు మహావీర్ సింగ్. హస్తవాసి అంటారు చూడండి... అది నిజం అన్నట్లు ఎంతటి రోగమైనా సరే ఆయన చెయ్యి పడగానే తగ్గిపోయేది. అసలు ఆయన మన చేయి పట్టుకుంటే చాలు... మన రోగం సగం తగ్గిపోతుంది అనే నమ్మకం కలిగింది మా అందరికీ. నెమ్మదిగా ఆయన్ను మా కాకినాడ జనాలు ఐదు రూపాయల డాక్టరుగోరు అనడం మొదలుపెట్టారు.


తనకు మందుల కంపెనీలు శాంపిల్స్ గా ఇచ్చే మందులనే రోగులకు ఇచ్చేవారు. ఓ పాతిక రూపాయలు ఉంటేచాలు... ఆపరేషన్ కాని, ఎంత పెద్ద రోగానికైనా ఆయనతో వైద్యం చేయించుకోవచ్చు అనుకునేవాళ్ళు మావాళ్ళు.

                                   ***

దుకాణం పెట్టిన కొత్తలో రోజుకి పాతిక ముప్పై కిలోలు అమ్మే వ్యాపారం... ప్రస్తుతం రోజుకి మూడు వందల కిలోలకు పైగానే పెరిగింది.


దుకాణం నుంచి వచ్చే లాభాలలో చాలామటుకు ఆసుపత్రి నిర్వహణకే ఖర్చు పెట్టేవారు ఆ కుటుంబం.

                                    ***

ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్న వేళ మహావీర్ గారు తమ్ముడు ఓంవీర్ కూడా తనలాగే డాక్టర్ చదివితే ప్రజలకు ఇంకా సేవ చెయ్యొచ్చు అన్నారు. అది విన్న ధరమ్ వీర్ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి చిన్న కొడుకు వైపు చూశారు.


తనకు తినడానికి రొట్టెలు పెడుతున్న అమ్మకు, నమస్కరించి తండ్రి వైపు తిరిగి నేను డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని ఓంవీర్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.


అన్నయ్యా మీరు చేస్తున్న సేవ నిరాకాటంగా సాగాలి అంటే మన మిఠాయి దుకాణం కూడా కొనసాగుతూనే ఉండాలి. నేనూ చదువుకోసం దుకాణం వదిలేస్తే... నాన్నగారి తర్వాత మనం ఆ దుకాణాన్ని వదిలేసుకోవాలి. అలా చేస్తే ఇప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు చేస్తున్న పనులు ఏమీ చేయలేము. మన ఆసుపత్రి ద్వారా మీరు చేసే సేవ ఎల్లకాలం జరగాలి అంటే... మన మిఠాయి దుకాణం కూడా ఎల్లకాలం నడవాలి. అందుకని నేను మిఠాయి దుకాణం బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు.


చిన్నవాడైనా ఎంతో ముందు చూపుతో అతను చెప్పిన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. 

                                     ***

ఆ సంవత్సరం సంక్రాంతికి మా కాకినాడ ముస్తాబు అవుతోంది. 


కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉండే ఆ మిఠాయి దుకాణం, పక్కనే ఉన్న ఆసుపత్రి కొత్త రంగులు దిద్దుకుంటుంన్నాయి.


ఏ జన్మలోని ఋణానుబంధమో... ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడి జనాల కోసం తపనపడే... జిలేబి సింగోరు, ఐదు రూపాయల డాక్టరు గార్ల ఋణం మా కాకినాడ జనాలు ఎప్పటికీ తీర్చుకోలేరు.


copied from అరుణాచలశివ 🌹

వైద్య ప్రక్రియలు

 ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు -


     నవరత్నాలు అనగా మాణిక్యం , ముత్యము , పగడము , పచ్చ, పుష్యరాగము , వజ్రము , నీలము , వైడూర్యము , గోమేధికము ఈ తొమ్మిదింటిని నవరత్నాలు అని పిలుస్తారు . చాలామందికి ఇవి కేవలం ఆభరణాలలో ఉపయోగించు విలువయిన రాళ్ళగా మాత్రమే పరిచయం . భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యులు వీటిలోని ఔషధ గుణాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకుని వాటిని తమ వైద్యములో విరివిగా ఉపయోగించారు. వారు తమ పరిశోధనా ఫలితాలను తమ గ్రంథాలలో సంపూర్ణంగా వివరించారు . ఇవి ఎక్కువుగా సంస్కృత లిపిలో ఉన్నాయి . ఈ మధ్యకాలంలో నేను అటువంటి పురాతన గ్రంథాలను సేకరించి వాటిపైన కొంత పరిశోధన కూడా చేశాను . ఆ విలువైన సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను అందించబోవుతున్నాను.


         జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మాణిక్యం అనగా కెంపు సూర్యునకు , ముత్యము చంద్రునకు , పగడము అంగారకునకు , మరకతము అనగా పచ్చ బుధునకు , పుష్యరాగము గురువునకు , వజ్రము శుక్రునకు , నీలము శనికి , వైడుర్యము రాహువునకు , గోమేధికము కేతువునకు ప్రీతికరములు మరియు ప్రతిరూపములుగా పేర్కొన్నారు . మరియు ఆయా గ్రహ దోషములకు ఆయా రత్నములను ధరించి గ్రహపీడ నుండి బయటపడవచ్చు.


            ఇప్పుడు ఆయుర్వేదం నందలి నవరత్నాల ఉపయోగాలు మీకు తెలియచేస్తాను .


 * మాణిక్యం -


           ఈ మాణిక్యం పద్మరాగము అని ప్రసిద్ధి కలిగినది . తామరరేకు వన్నె కలిగి బరువుతో స్ఫుటంగా ఉండును. మిక్కిలి కాంతివంతముగా ఉండును. స్ఫుటముగా , బరువుగా , గుండ్రముగా ఉండు మాణిక్యం పరిశుద్ధం అయినది. ఈ మాణిక్యమును సరైన పద్ధతుల్లో శుద్దిచేసి పుటం పెట్టి ఆ భస్మమును ఉపయోగించిన శరీరము నందలి వాత,పిత్త, శ్లేష్మములను శాంతింపచేసి అగ్నిదీపమును కలిగించును. శరీరముకు దారుఢ్యము కలిగించును. మరియు దీనిని ధరించిన భూత , బేతాళ పీడలు తొలగును . అతి భయం వంటి మానశిక దోషాలలో ఇది మంచి ప్రభావం చూపించును.


 * ముత్యము -


           గుండ్రగా ఉండి తెల్లని కాంతి కలిగి , తేలికైనది , నీటి కాంతి కలిగి , నిర్మలంగా ఉండి అందంగా ఉన్న ముత్యము శుభకరమైనది. వెలవెలపోతూ పైన పొరలుపొరలుగా ఉండి గొగ్గులుగొగ్గులుగా ఉన్నది మంచి ముత్యం కాదుగా గ్రహించాలి.ఇలాంటి ముత్యాలను అసలు వాడకూడదు.


          మంచి ముత్యమును పుఠం పెట్టి భస్మం చేసి ఒక మోతాదులో ప్రతినిత్యం పుచ్చుకొనుచున్న మనుజులకు రక్తపిత్తం, క్షయ వంటి రోగాలు నిర్మూలనం అగును. దేహమునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. ఆయుష్షును వృద్దిచేయును . వీర్యవృద్ధి చేయును , శరీరం నందు జఠరాగ్ని వృద్ధిచెందించి శరీరానికి ఉత్సాహం కలుగచేయును .


 * పగడం -


            బాగా పండిన దొండపండు వలే ఎర్రని రంగు కలిగి గుండ్రని నునుపైన బుడిపెలు , వంకరలు , తొర్రలు మొదలగునవి లేకుండా పెద్దగా ఉండు పగడం శ్రేష్టమైనది. శుభప్రదం అయినది. 


          మంచి పగడమును సేకరించి సహదేవి ఆకు రసము నందు నానబెట్టిన శుద్ది అగును. దానిని భస్మము చేసి సేవించిన యెడల క్షయరోగములు , రక్తపిత్తములు , కాసరోగము , నేత్రరోగములు , విషదోషాలు మున్నగు వాటిని శమింపచేయును . అగ్నిదీప్తిని , జీర్ణశక్తిని కలిగించి వార్ధక్యమును పోగొట్టి దేహమునకు కాంతిని , బలమును కలిగించును. దీనిని ముట్టునొప్పికి విశేషముగా వాడుదురు.


 * గరుడ పచ్చ -


         మంచి గరుడపచ్చ ఆకుపచ్చని రంగు కలిగి మెరుగులు తేలుతూ బరువుగా , నున్నగా ఉండును. మిక్కిలి కాంతిమంతంగా ఉండును. దీనిని ఔషధముల యందు ఉపయోగించవచ్చు . తెల్లగా , నల్లగా , బుడుపులు కలిగి ఉన్న , పెలుసుగా ఉన్న ఆ పచ్చ మంచిది కాదు అని అర్థం .


            గరుడ పచ్చను ఆవుపాలలో నానబెట్టి శుద్దిచేసి భస్మము చేసి సేవించుతున్న పాండువ్యాధులు , మొలలు , విషదోషాలు , సన్నిపాత జ్వరాలు , సామాన్య జ్వరాలు , వాంతులు , శ్వాస సంబంధ సమస్యలు , కాసరోగం , అగ్నిమాంద్యం వంటి రోగాలను పోగొట్టును . దేహమున మిక్కిలి కాంతిని ఇచ్చి మేలుచేయును .


 * పుష్యరాగము -


           పుష్యరాగము శుద్ధముగా , నునుపుగా , లావుగా , బరువుగా , ఎగుడుదిగుడు లేనిదిగా ఉండి గోగుపూవ్వు రంగు కలిగి తళతళ ప్రకాశించుచుండును. ఇట్టి లక్షణాలు కలిగినది అత్యుత్తమం అయినది.ఇలా కాక గోరోచనపు రంగు గాని పచ్చగా కాని మిక్కిలి తెలుపుగా గాని ఉండిన మంచిది కాదు.


             దీని భస్మం సేవించిన తీవ్రమగు దాహమును , వాంతులను , వాతరోగములను , కుష్టు వ్యాధిని , విషదోషములను పోగొట్టి దేహమునకు మిక్కిలి కాంతిని కలుగచేయును .


 * వజ్రము - 


            ఈ వజ్రము నందు స్త్రీ, పురుష , నపుంసక అని మూడు రకాల జాతులు కలవు.


       ఎనిమిది అంచులు కలిగి , పక్షములు ఎనిమిది , కోణములు ఆరు కలిగి ఇంద్రధనస్సు వలే ప్రకాశించుతూ నీటివలె నీడదేరునది పురుషవజ్రము అనబడును.


             గుండ్రనైన ఆడుకులు గట్టి ఉండు ఆకారం కలిగి ఉండినది స్త్రీ వజ్రం అనబడును.


        మణిగిపోయిన మూలాలు , అగ్రమును కలిగి ఉండి మిక్కిలి గుండ్రముగా ఉండునది నపుంసక వజ్రం అనబడును. 


           మంచి పురుషజాతి వజ్రమును భస్మం చేసి వాడుతున్న సమస్తరోగములను పోగొట్టి వీర్యాభివృద్ధిని కలిగించి వార్థక్యమును పోగొట్టి బాగుగా ఆకలి పుట్టించును . మానవులకు ఇది అమృతప్రాయమై ఉండును. 


 * నీలము -


           దీనిలో జలనీలము , ఇంద్రనీలము అను రెండు విభిన్న రకాలు కలవు. ఇందులో ఇంద్రనీలము శ్రేష్టము . జలనీలము తేలికగా ఉండి తెలుపుతో కూడిన వర్ణము కలిగి ఉండును. ఇంద్రనీలము బరువుగా ఉండి నలుపువర్ణము నందు నీలం మిశ్రితము కాక నీలవర్ణం కాంతి కలిగి నునుపుగా మలినం లేకుండా మృదువుగా మద్యభాగము నందు కాంతి కలిగి ఉండును. ఇది అత్యంత శ్రేష్టం అయినది.


             ఈ నీలమును గాడిద మూత్రములో నానబెట్టి మంచి తీవ్రత కలిగిన ఎండలో ఎండించిన శుద్ధం అగును.


        ఈ భస్మాన్ని ఉపయోగించుతున్న శ్వాస , కాస రోగాలు మానును . వీర్యవర్ధకం , త్రిదోషాలను హరించును . అగ్నిదీప్తిని పెంచును. విషమజ్వరం , మూలశంఖ రోగము , పాపసంబంధ రోగాలను హరించును .


 * వైడుర్యము -


           నలుపు , తెలుపు కాంతి కలిగి సమానమై , స్వచ్ఛమై , బరువై , స్ఫుటమై , లొపల తెల్లని ఉత్తరీయము వంటి పొర కలిగినది శ్రేష్టమైన వైడుర్యము . నల్లగా కాని తెల్లగా కాని ఉండి పారలుపొరలుగా ఉండి లొపల ఎర్రని ఉత్తరీయము వంటి పొర కలిగినది చెడు వైడుర్యముగా గుర్తించవలెను . మంచిది కాదు.


        దీనిని కొండపిండి రసములో నానబెట్టి ఎండించి బాగా కాల్చి ఆ తరువాత గజపుటము వేయవలెను .


         ఈ భస్మము రక్తపిత్తవ్యాధిని హరించును . బుద్ధిని , శరీర బలాన్ని , ఆయుర్వృద్దిని కలిగించును. పిత్తాన్ని పెంచును , అగ్నిదీప్తిని చేయును . మలములను శరీరం బయటకి వెడలించును.


 * గోమేధికం -


            ఇది ఆవుయొక్క మెదడుని పోలి ఉండటం వలన గోమేధికం అని పేరు వచ్చినది . ఇది స్వచ్చమైన గోమూత్రము కాంతి కలిగి నునుపుగా ఉండి హెచ్చుతగ్గులు లేకుండా బరువుగా ఉండి పొరలు లేకుండా దట్టముగా ఉండును. మెరుపు లేకుండా తేలికగా ఉండి కాంతివిహీనం అయి గాజుపెంకు వలే ఉండునది దోషయుక్తము .


          దీనిని గోమూత్రము నందు నానబెట్టి ఎండించి ఆ తరువాత నేలగుమ్ముడు సమూల రసము నందు నానబెట్టి ఆ తరువాత ఎండించిన శుద్ది అగును. ఆ తరువాత నల్ల ఉమ్మెత్తకు రసము నందు నానబెట్టి ఎండించి పుఠం పెట్టిన భస్మం అగును.


        ఈ గోమేధిక భస్మమును శ్లేష్మ, పైత్య రోగాలు , క్షయ , పాండువు వంటి రోగాల నివారణలో వాడతారు. అగ్నిదీప్తిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేయును . రుచికరంగా ఉండును. ఇంద్రియాలకు బుద్దిని , బలాన్ని ఇచ్చును.


         పైన చెప్పినటువంటి రత్నభస్మాలను అనుభవవైద్యుల పర్యవేక్షణలోనే తగినమోతాదులో వాడవలెను. స్వంత నిర్ణయాలు మంచివి కాదు.


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     

     కాళహస్తి వేంకటేశ్వరరావు  


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


        9885030034

పెరుగుపల్లి గోవిందమ్మ..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పెరుగుపల్లి గోవిందమ్మ..*


"స్వామికి బియ్యం తీసుకొచ్చాను.." అంటూ పాతిక కేజీ ల బరువుండే బియ్యపు బస్తాను స్వయంగా మోసుకొచ్చి మందిరం లో పెట్టేవారు గోవిందమ్మ..ఆవిడ వయసు అరవై ఏళ్ల పై మాటే..సింగరాయకొండ వాస్తవ్యురాలు..పెరుగుపల్లి గోవిందమ్మ గా అందరూ పిలిచేవారు..సౌమ్యంగా..చిరునవ్వుతో..అత్యంత వినయంగా వుంటూ..బియ్యం తో పాటు తులసి తో కట్టిన మాల, మల్లెపూల దండ తీసుకొని..ప్రతి నెలలో రెండుసార్లు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి దర్శనానికి తప్పకుండా వచ్చేవారు..తాను తెచ్చిన తులసి మాల, మల్లెపూల దండ ను శ్రీ స్వామివారి విగ్రహానికి అర్చక స్వామి అలంకరిస్తే..ఎంతో సంతోషించేవారు..ఆ నిమిషం లో ఆవిడ ముఖం లో కొండంత తృప్తి కనిపించేది..


గోవిందమ్మ గారికి ముగ్గురు సంతానం..ఇద్దరు కుమారులు..ఒక కుమార్తె..పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడే భర్త అకాలమరణం పాలయ్యారు..చిన్న పిల్లలను పోషించే భారం ఆవిడ మీద పడింది..మొదటి నుంచీ మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన గోవిందమ్మ గారు..ఆ స్వామివారినే నమ్ముకొన్నారు..అంతవరకూ భర్త నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తాను నిర్వహించ సాగారు..గోవిందమ్మ గారికి చదువు లేదు..పిల్లలకు మాత్రం మంచి చదువులే చదివించారు..క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ స్వామివారికే తన కష్ట సుఖాలు విన్నవించుకునే వారు..


గోవిందమ్మ గారి కుమారులిద్దరూ ఉద్యోగాల్లో చేరారు..ఒక కుమారుడు అమెరికా లో ఉంటున్నాడు..మరో కుమారుడు బెంగుళూరు లో స్థిర పడ్డాడు..కూతురికి వివాహం చేశారు..అన్ని భాధ్యతలూ తీరిన తరువాత..గోవిందమ్మ గారు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి వద్దకు నెలలో మూడు నాలుగు సార్లు వచ్చి వెళ్లే వారు..ఎప్పుడైనా గోవిందమ్మ గారు రావడం ఆలస్యం అయితే.."ఈవారం గోవిందమ్మ గారు ఇంకా రాలేదా?.." అని మాలో మేము విచారించుకునే వాళ్ళం..


"ఎన్నడూ నేను ఇబ్బంది పడలేదు..ఏ కష్టం వచ్చినా ..స్వామివారే క్షణాల్లో తీర్చేవారు..నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి అని ఆ స్వామిని మర్చిపోతానా..ఇప్పుడు నాకు ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నది కనుక, తరచూ ఇక్కడికి వస్తున్నాను.." అనేవారు..చిత్రమేమిటంటే..ఏమీ చదువుకోకుండా..అమాయకంగా వుండే గోవిందమ్మ గారు..అమెరికాలో ఉన్న కుమారుడి వద్దకు ఒక్కతీ వెళ్లి వచ్చేవారు..


"అమ్మా..మీకు ఎక్కడా ఇబ్బంది కలుగలేదా?..మధ్యలో విమానం కూడా మారాలి కదా?..మరి భాషా సమస్య ఎదురు కాలేదా?..ఎలా వెళ్లగలిగారు?.." అని అడిగితే..పెద్దగా నవ్వేవారు.."నాలుగైదు సార్లు వెళ్లానయ్యా..ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..విమానం మారేటప్పుడు..ఆ స్వామే ఎవరో ఒకరిని తోడు చేసేవారు..వాళ్ళు నన్ను నేను ఎక్కాల్సిన విమానం లో కూర్చోబెట్టేవారు.." అని భక్తిగా చెప్పేవారు..ఆవిడ తాను చేస్తున్న ప్రతి పనిలోనూ శ్రీ స్వామివారినే చూసేవారు..మొగలిచెర్ల లోని మందిరానికి వచ్చినా..తనపాటికి తాను ప్రదక్షిణాలు చేసి..సమాధి దర్శనం చేసుకొని..ఒక ప్రక్కగా ఒదిగి కూర్చునేవారు..నిరంతరం శ్రీ స్వామివారి నామ స్మరణే..వేరే ఏ విషయాలూ ఆవిడకు పట్టేవి కాదు..ఆరోగ్యం బాగా లేక పోయినా..కూతురు వారిస్తున్నా..అలానే మొగలిచెర్ల కు బస్ లో వచ్చి..శ్రీ స్వామివారి దర్శనం చేసుకునే వారు..


సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం గోవిందమ్మ గారు మరణించారు..చివరి క్షణం వరకూ శ్రీ స్వామివారినే స్మరిస్తూ గడిపిన గోవిందమ్మ గారు నిజంగా ధన్యజీవి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

మహాశివరాత్రి

 *మహాశివరాత్రి*

                 *శుభాకాంక్షలు* 


మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురోః...


 అనగా ఈ మాఘమాసమున కృష్ణ చతుర్దశి అనగా అమావాస్యకు ముందు రోజు చతుర్దశి ప్రదోషకాలమందున్న చో...ఆరోజు *మహా శివరాత్రి* అనబడును ....


ఆ *మహాశివరాత్రి* రోజున *పరమశివారాధన* చేసినచో...


*అఖండ ఐశ్వర్య ప్రాప్తి*...... ..

*కైవల్య ప్రాప్తి*

*వంశవృద్ది*

 *సుఖమయ జీవనము* *ప్రాప్తించునని తెలియ వచ్చుచున్నది*

అటువంటి

 *మహా శివరాత్రి*

 రోజున అనగా రేపటి రోజున


 *08-03-2024వ తేదీ శుక్రవారం రోజున మహాశివరాత్రి మహా పర్వదినమును పురస్కరించుకుని మీ మీ గోత్రనామములతో*....


 *మహాన్యాస పూర్వక సంపూర్ణ రుద్రాభిషేకము జరుపుటకు ఆ పరమశివుని ఆజ్ఞ అయినది* 


*కావున ఈ భగవత్కార్యము నందు పాల్గొనదలచిన మరియు ఆసక్తి ...అభిలాష కలిగిన భక్తులు తమ తమ గోత్రనామములను పంపవలసినదిగా కోరుచున్నాను*

 ఇందుకై భగవదర్పణముగా

 *₹.302/-రూపాయలు* *శివార్పణము* గావించవలసినదిగా కోరుచున్నాను ...


*శుభమస్తు...*

 *నిరంతర పార్వతీ పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు!!*

🙌🙌🙌🙌🙌🙌🙌


ఇట్లు 

మీ 

*యజ్ఞ నారాయణ శర్మ*

Cell.. *9 8 4 9 4 3 5 2 9 6*

గౌరవమర్యాదలు

 సుభాషితమ్

------------------


శ్లోకం


గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ భవంతి నిర్గుణాః సుఖినః| 

బంధనమాయాంతి శుకాః 

యథేష్ట సంచారిణః కాకాః ||


తాత్పర్యం


గుణవంతులకు కష్టాలు తప్పవు గుణహీనులు సుఖంగానే ఉంటారు. "అది లోకసహజం", అందమైన రామచిలుకలు బంధింపబడితే, కాకులు స్వేచ్ఛా విహారం చేయవా.* *సుఖం కోసం గుణవంతులు తమ గుణాన్ని పోగొట్టుకోరు.అందుకే వారికి గౌరవమర్యాదలు.

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

**********

07-03-2024

గురువారం (బృహష్పతి వాసరః)

రాశి ఫలితాలు

*****

మేషం

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

--------------------------------------

వృషభం

సన్నిహితుల  నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.  విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మిధునం

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.  స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

---------------------------------------

కర్కాటకం

వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు  కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

---------------------------------------

సింహం

ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ  తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

కన్య

వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

తుల

బంధు  మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

---------------------------------------

వృశ్చికం

వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా  ఒడిదుడుకులు తప్పవు.

--------------------------------------

ధనస్సు

కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.  వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

మకరం

సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

కుంభం

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి . ఇంటా బయట పరిస్థితులు గంధరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముఖ్యమైన పనులలో  శ్రమతో గాని పనులు పూర్తి కావు.

---------------------------------------

మీనం

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.  వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను  ఆచరణలో పెడతారు.  ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

---------------------------------------

*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

గురువారం, మార్చి 7, 2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, మార్చి 7, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:ద్వాదశి రా10.17 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే) 

నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకు

యోగం:పరిఘము రా2.36 వరకు

కరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకు

వర్జ్యం:మ1.37 - 3.08

దుర్ముహూర్తము:ఉ10.13 - 11.00 & మరల మ2.55 - 3.42

అమృతకాలం:రా10.43 - 12.14

రాహుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి : మకరం 

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యోదయం:6.19

సూర్యాస్తమయం:6.03


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

గోదావరిపిలిచింది

 *గోదావరిపిలిచింది!* 

                 


‘ఇంత చదువూ చదివించింది *ఇండియాలో* పనిజేయటానికా?’


‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.


దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.


అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ?


*ఇక కథ లోకి వెళదాం...*


కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యే సరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. 


ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. 

ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం. 


కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.


ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.

తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దాం అనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని! 


భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.


అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థం అప్పుడు వియ్యంకుడితో అనేశాడు.. “మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ” అని.


‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. 


ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.


1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.


కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. 


   ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా? 

మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? 

వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?


“కడియంలో కాసేపు ఆపాలయ్యా” డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు. 


వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం. 

వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు ఎరుపూ, నలుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ అదొక పూల సామ్రాజ్యం.


కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది. “నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం” దక్షిణామూర్తి కూతురు అంది.


“సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా!” అంది దక్షిణామూర్తి భార్య హైమ.


“అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని!” కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. 


ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.


బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- “అది ఎవరి విగ్రహం మామయ్యగారూ?” అని.


హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పనిజేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా! 

చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.


దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.


అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.


మ్యూజియం ముందుభాగంలో 1840సం. లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు. 


కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన “కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.”

ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.


“ఆ రోజుల్లో అంటే 183 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం..! ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.


అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.


ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం అనేది నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత ‘పన్ను వసూలు అధికారి మాత్రమే!’ కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572 లతో పని పూర్తిచేసి చూపించాడు!”... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.


“మన వూళ్ళో పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ?” అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.


ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.


మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.

“వెళ్ళొస్తాం మామయ్యగారూ!”అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.


“సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి.” కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.


ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.


దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, ఊరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.


సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు “ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...!”

దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.

“నాన్నా, బావున్నారా?”

“బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?”

“ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...”

ఫోన్‌ అల్లుడికిచ్చింది. 


“మామయ్యగారూ బావున్నారా?”

“బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?”

“అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా”మాటల్లో ఏదో తటపటాయింపు.

“చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు!”

“నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...!” కిరణ్‌ చెబుతున్నాడు.


దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది…”అలాగే అల్లుడూ. మన ఊరు వచ్చి, మన వూళ్ళో బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను.” సంతోషంగా అన్నాడు.

“థాంక్స్‌ మామయ్యా..!”


“సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే!” దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.


“మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా! మీరు మీ ఊరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"


దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు. 

గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ కనపడింది.

‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు... నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా! కాటన్‌ దొరా... !!

నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.


దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది...

తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా..

.          

                      

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం -‌ ద్వాదశి - ఉత్తరాషాఢ -‌ గురు వాసరే* (07.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/RnC7VQHj27g?si=A3wuNMTwpJ5YDhon



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*