13, డిసెంబర్ 2021, సోమవారం

దత్తావతార స్వరూపం,

 తొలి కలియుగ దత్తావతార స్వరూపం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ! 1320 సంవత్సరం, చిత్తా నక్షత్రంలో, వినాయక చతుర్ధి నాడు పీఠికాపురాన (ఆంధ్రప్రదేశ్ లో) జన్మించి తదుపరి తన పదునారవ ఏట భరత ఖండంలో వివిధ ప్రాంతాలందు సంచరించి, తదుపరి కాలాన కురువపురమందు (నేటి కర్నాటక రాష్ట్రంలో, రాయచూర్ జిల్లాలో) తపమాచరించి 1350 సంవత్సరం, హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు, వల్లభాపురం, నేటి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ - వేణీ నదుల సంగమమందు అంతర్హితమై వల్లభాపురం, కురువపురం వచ్చే భక్తులకు తన దివ్యాశీస్సులు అందిస్తూ వారిని అనుగ్రహిస్తున్నారు ! నేడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి సందర్భంగా ఆ స్వామి అనుగ్రహం యావత్ విశ్వ జీవజాలానికి కలగాలని, ఆ స్వామి దివ్యాశీస్సులతో నేటి విశ్వ సమస్యలు, యావత్ విశ్వంలో ఆవరించియున్న సకల విష వ్యాధులు పూర్తిగా సమసిపోయి, అందరూ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా ఆశిస్తూ.. "దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ! ఔదుంబరా ఔదుంబరా దత్తావధూతా ఔదుంబరా ! " " శ్రీపాద రాజం శరణం ప్రపద్యే " 🙏🙏🙏🙏🙏 గుళ్లపల్లి ఆంజనేయులు 

కరోనోపాఖ్యానం



కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం

మొన్నొక రోజున కరోనా వైరస్ కలలో కొచ్చింది.

ఖర్మ ! ఏం చేస్తాం?

'ఏంటి ఇలా వచ్చావ్?' అనడిగా నీరసంగా.

'చూశావా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కోటిమందిని లేపేశా' అంది గర్వంగా.

'అదేంటి? WHO లెక్కల ప్రకారం ఇప్పటిదాకా పోయినవాళ్లు 3.2 మిలియన్ మాత్రమే. అంటే 32 లక్షలు. నువ్వెంటి 100 లక్షలంటావు? అనడిగా.

పెద్దగా నవ్విందది.

'అవి కాకిలెక్కలు. నాది పిచ్చుకలెక్క. నాదే అసలైన లెక్క' అంది విలాసంగా కాలూపుతూ.

'ఏంటీ? నువ్వు చంపావా?' అడిగాను.

'ఏం? కాదా?' అంది.

'కాదు. అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ ' అన్నా నవ్వుతూ.

'అదేంటి? నాకూ, తెలుగుపద్యాలు రావులే. కొంచం ఇవరించి చెప్పబ్బాయా' అంది తెనాలి యాసలో. అప్పుడు దానికొక పద్యం చదివి వినిపించా.


కర్ణుని చావుకు ఆరు కారణాలని సామెతున్నది కదా ! మహావీరుడైన కర్ణుని తాను చంపగలిగానని అర్జునుడు పొంగిపోతుంటే కృష్ణుడు దానికి సమాధానంగా చెప్పిన పద్యమని ఆంధ్ర మహాభారతంలో ఒక పద్యం ఉన్నది.


కం॥ నరవర నీచే నాచే

వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్

ధరచే భార్గవు చేతను

అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్ !


'ఓ మనుష్యులలో శ్రేష్టుడా ! అర్జునా ! నీచేత, నాచేత, కుంతిచేత, ఇంద్రునిచేత, భూదేవిచేత, పరశురామునిచేత - ఈ అరుగురిచేత కర్ణుడు హతుడైనాడు. నీ ఒక్కడి గొప్పదనం కాదు' అని కృష్ణుడు చెబుతాడు.


నీచే - నువ్వు అతనితో యుద్ధం చేసి చంపావు. కనుక నువ్వు ప్రత్యక్ష కారణానివి. అంటే డైరెక్ట్ కాస్ అన్నమాట.


నాచే - నేను నీ సారధిగా ఉంటూ రధాన్ని నడిపించాను గనుక నా పాత్ర కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్ కాస్ అన్నమాట.


వరమడిగిన కుంతిచేత - పాండవులలో ఎవరినీ చంపకు అని వరం అడిగిన కుంతికూడా కర్ణుని చావుకు పరోక్ష కారకురాలైంది. 


వాసవుచేతన్ - మారువేషంలో వచ్చి కవచకుండలాలు ఎత్తుకుపోయిన ఇంద్రుడు కూడా పరోక్ష కారణం.


ధరచే - కర్ణుని రథచక్రాలు భూమిలో దిగబడి ఉన్నపుడు వాటిని వదలకుండా పట్టుకున్న భూదేవి కూడా పరోక్ష కారణమే.


భార్గవు చేతను - అవసర సమయంలో అస్త్రమంత్రాలు నీకు గుర్తుకురాకుండుగాక ! అని శాపమిచ్చిన గురువు పరశురాముడు కూడా పరోక్ష కారకుడే.


"ఈ విధంగా ఒక ప్రత్యక్ష కారకుడు, అయిదుగురు పరోక్ష కారకులు వెరసి ఆరుగురి చేతులలో కర్ణుడు చనిపోయాడు గాని నీ ఒక్కడి వీరత్వం కాదురా అర్జునా" అని కృష్ణుడు చెబుతాడు.


అలాగే, కరోనా చావులకు కరోనా వైరస్ ఒక్కటే కారణం కాదు. ఆరు కారణాలున్నాయి. ఎలాగో చెప్పమంటారా? వినండి.


1. కరోనా వైరస్


ఇది ప్రత్యక్ష కారణం. అంటే direct cause అన్నమాట. కనుక ఇది అర్జునుడు. చస్తున్న ప్రతివాడూ కర్ణుడే. 


2. తిండి


ఇది భూదేవి. ఎందుకంటే, మనకొచ్చే తిండంతా భూమినుంచే వస్తుంది కాబట్టి. కరోనా చావులకు తిండి ఎలా కారణమౌతోంది? ఎలాగంటే, అతిగా మెక్కడం, అసలు తినకుండా ఉపవాసాలుండటం, వేళాపాళా లేకుండా తినడం, మనకే తిండి సరిపోతుందో చూసుకోకుండా ఏదిపడితే అది తినడం, సరిగ్గా నమలకుండా మింగడం, బలం బలం అంటూ నాన్ వెజ్ విపరీతంగా తిని నానారోగాలూ తెచ్చుకోవడం, త్రాగుడు, కూల్ డ్రింకులు, రోడ్లమీది జంక్ ఫుడ్ అతిగా తినడం, ఇత్యాది ఆహారపరమైన తప్పులవల్ల తప్పకుండా ఒళ్ళుగుల్ల అవుతుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు కరోనా ఏం ఖర్మ? ఏదైనా తేలికగా ఎటాక్ చేస్తుంది. కనుక ఇది భూదేవి శాపం.


3. నిద్ర


ఇది పరశురాముడు. ఎందుకంటే, నిద్రనుంచి లేచిన పరశురాముడే కర్ణుడికి శాపమిచ్చాడు. కాబట్టి నిద్రాపరంగా మానవులు చేసున్న తప్పులన్నీ పరశురామ శాపాలే. ఏంటా నిద్రాపరమైన తప్పులు?


అర్ధరాత్రి దాటి తెల్లవారుఝాము అవుతున్నా కూడా టీవీలు చూస్తూ, పార్టీలు చేసుకుంటూ, నిద్ర పోకుండా మేలుకుని ఉండటం, మర్నాడు పొద్దున్న బారెడు పొద్దెక్కినా లేవకపోవడం, సుష్టుగా తిని మధ్యాన్నం మళ్ళీ ఒక మూడుగంటలు గురక పెట్టడం. ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేసే నైట్ షిఫ్టులు ఇవన్నీ నిద్రాపరమైన తప్పులు. వీటివల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.


పరశురాముని శాపం వల్ల అవసర సమయంలో అస్త్రమంత్రాలను కర్ణుడు మర్చిపోయాడు. అలాగే, ఉత్తప్పుడు ఎవరు ఎన్ని రకాలైన మంచిమాటలు చెప్పినా, టీవీలలో యూట్యూబులలో ఎన్నెన్ని చూసినా, వినినా, చివరాఖరికి ఆచరించే సమయానికి అవన్నీ మరచిపోయి మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగడం, మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉండటం వల్ల మనిషి రోగాలపాలౌతున్నాడు.


ఇది పరశురామ శాపం.


4. తప్పుడు లైఫ్ స్టైల్


ఇది ఇంద్రుడు. ఈయన మాయవేషంలో వచ్చి మాయమాటలు చెప్పి కర్ణుడి కవచకుండలాలు కాజేశాడు. ఇదే విధంగా, విదేశీ జీవన విధానం కూడా దొంగచాటుగా, యాడ్స్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా, మనుషుల ఇళ్ళకొచ్చి, మాయచేసి, మితిమీరిన సుఖాలకు అలవాటు చేసి, మన జీవనవిధానాన్ని మనకు దూరం చేసి, సహజంగా పుట్టుకతోనే మనకొచ్చిన రోగనిరోధకశక్తిని (కవచకుండలాలను) ఎత్తుకుపోతోంది. కవచకుండలాలు లేని కర్ణుడు, శత్రువు ప్రయోగించిన అస్త్రాలకు తేలికగా పడిపోతున్నాడు. అదే విధంగా, ఇమ్యూనిటీ తగ్గిన మనిషి రోగాలకు తేలికగా లోనైపోతున్నాడు.


కనుక ఇది ఇంద్రశాపం.


5. అనవసర మందుల వాడకం


ఇది కుంతీదేవి. ఎలాగంటే, యుద్ధంలో కర్ణుని గెలుపు తధ్యమని తెలుసుకున్న కుంతీదేవి, కర్ణుడిని బ్రతిమిలాడి, అతని జన్మరహస్యం చెప్పి, 'పాండవులు నీ తమ్ముళ్లే, కనుక వారిని చంపకు' అని బ్రతిమిలాడి మాటతీసుకుంటుంది. 


అదే విధంగా, నేటి కాలపు డాక్టర్లు, వారి వైద్యవిధానం, మనుషులను మాయచేసి, సెంటిమెంట్ తో కొట్టి, 'అందరూ వాడుతున్నారు గనుక నేనూ ఈ మందులు వాడాలి' అన్న భ్రమను మనుషులకు కల్పించి, మందుల కంపెనీల ఖాతాదారులుగా వారిని మార్చేసి, అనవసరమైన మందులన్నీ వాడించి వాళ్ళ ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. కనుక మందుల కంపెనీలు, డాక్టర్లు, మెడికల్ రెప్ లు, ల్యాబ్ వాళ్ళు, వీళ్ళందరూ కుంతీదేవి స్వరూపాలు. మెత్తగా మాయమాటలు చెప్పి సెంటిమెంట్ తో చంపుతున్నారు.


కనుక ఇది కుంతీదేవి శాపం.


6. చివరిది మనసు.


ఇది కృష్ణశాపం. ఎలాగంటే, మనసే మనిషిని నడిపించేది. మనసే దేవుడు. అది దారితప్పితే మనిషి జీవితం మొత్తం దారితప్పుతుంది. అర్జునుడు వైరస్ అనుకుంటే, మనసు కృష్ణుడనుకుంటే, వైరస్ కి అనుగుణంగా జీవనరథాన్ని మనసు నడుపుతున్నది. కనుక కర్ణుడిలాంటి మనిషి చనిపోతున్నాడు.


ఆరోగ్యం బాగుపడే దిశగా నేటి మనిషి మనసు వెళ్లడం లేదు. ఒళ్ళు గుల్లచేసుకునే దిశగా పోతోంది. ఎవరెన్ని చెప్పినా ఎవరూ వినే స్థితిలో లేరు. రోడ్లమీద తిరక్కండిరా అని నెత్తీనోరూ మొత్తుకుని ప్రభుత్వం చెబుతున్నా జనం వినకపోతుంటే చివరికి కర్ఫ్యూలు, షూట్ ఎట్ సైట్ ఆర్దర్లు ఇవ్వాల్సి వస్తోందంటే మనుషులు ఎంత మొండిగా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మనిషంటే మనసే గనుక మనసులు మొండిగా తయారౌతున్నాయి. చావువైపే వెళుతున్నాయిగాని బ్రతుకువైపు మళ్లటం లేదు. ఎంతమంది మంచి చెప్పినా ఎవరూ వినడం లేదు.


కనుక ఈ మొండివైఖరే కృష్ణ శాపం. అయితే దీనిలో చాలా ఛాయలున్నాయి. అవేంటో వినండి మరి.


1. 'నాకేం కాదులే' అని నిర్లక్ష్యంగా మాస్కుల్లేకుండా ఎక్కడబడితే అక్కడ తిరగడం.

2. 'నేను రెండు డోసులూ వాక్సిన్ తీసుకున్నాను. ఇక నాకేమౌతుంది?' అని ధీమాగా అందరిమధ్యనా తిరగడం.

3. 'నా దగ్గర డబ్బుంది. ఒకవేళ కరోనా వస్తే ' ఏ - క్లాస్ ' ట్రీట్మెంట్ చేయించుకోగలను' అన్న ధనమదంతో లెక్కలేకుండా తిరగడం.

4. 'దేవుడున్నాడు, నేను మహాభక్తుడిని, నాకేం కాదు' అనుకుంటూ గుళ్ళూ గోపురాలూ తిరిగి, తీర్ధాలూ, ప్రసాదాలూ తిని కరోనా తెచ్చుకోవడం.

5. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత కూడా 'నాకేం కాదు' అన్న ధీమాతో వారం రోజులు ముదరబెట్టుకుని బ్రీతింగ్ సమస్యలు వచ్చినపుడు లబోదిబో అంటూ ఆస్పత్రుల వెంట పెరిగెట్టడం.

6. తనకు పాజిటివ్ వచ్చిందని తెలిసినా, బయట తిరుగుతూ కావాలని మరికొందరికి అంటించడం.

కృష్ణశాపంలో ఇవన్నీ రకరకాలైన షేడ్స్.

అదన్నమాట సంగతి.

ఈ కధంతా కలలోనే కరోనాకు వివరించి చెప్పాను.

కరోనా చాలా సంతోషపడింది.

'అబ్బ ! ఎంత బాగా చెప్పావు. నువ్వు చెప్పినది నిజమే సుమీ !' అని ఎంతో హాచ్చర్యపోయి చివరకు 'ఇంత మంచి వివరణ ఇచ్చావుగాబట్టి నీకొక మాంచి వరమిస్తాను' అంది.

ఎవరైతే మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, గుంపులుగా చేరకుండా శుభ్రన్గా ఉంటారో వాళ్ళ జోలికి నేను రానుగాక రాను' అంటూ మాయమైపోయింది. కరోనా

      🤔🤔🤔🤔🤔🤭🤭

   *ఇది నేను రాసినది కాదు చాలా బాగుందని పోస్టు చేశాను*


*(ఎవరు వ్రాశారో కానీ చాలా చక్కగా విశ్లేషించి వ్రాశారు వారికి ధన్యవాదాలు)*

ఆచార్య సద్భావన*

 *ఆచార్య సద్భావన*


నిజమైన భక్తుడు తన సర్వస్వాన్ని భగవదర్పణ గావిస్తాడు. అలా చేయడం వల్లనే జీవిత పరమార్థాన్ని సాధిస్తాడు. మనలో వ్యక్తమయ్యే శక్తికి మూలకేంద్రం ఒకటి ఉంది. దానిని తెరిచేందుకు నిరంతర ప్రేమ భావనతో కూడుకున్న సేవ, వినయం, భక్తి సాధనములు. ఆ శక్తి నిరంతరంగా ప్రవహించేందుకు వీలుని కలిగించాలి. మన హృదయం అణకువను కలిగి ఉన్నప్పుడే ఆ ప్రేమ జ్యోతి కాంతులు మన ద్వారా ప్రసరించబడతాయి. ఆ ప్రవాహపు వెల్లువ మన చుట్టూ ఉన్న వారికి కూడా వారి జీవితాలను కూడా ధన్యం గావిస్తుంది.


అందుకై మనం భగవంతుని ఈ విధంగా వేడుకోవాలి.


*శ్రీమన్నారాయణా!*

మేము సదా మీ అడుగుజాడలలో నడువగలిగేలా మమ్మల్ని ఆశీర్వదించుము, మిమ్మల్ని వదిలిపెడితే మాకు వేరు దిక్కు లేదనే సంగతి మేము గ్రహించెదము గాక, మా జీవనం మీ సమర్పణమై మా హృదయం శాంతి నిలయమై భాసిల్లును గాక.

సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

శ్రీరమణీయం* *-(252)*_

 _*శ్రీరమణీయం* *-(252)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"వర్తమానంలో వచ్చే కర్మలను నేను మార్చుకోవచ్చా ?"*_


_*ప్రస్తుతం మనముందుకు వచ్చే ఏ కర్మ అయినా గతంపైనే ఆధారపడి ఉంది. దాన్ని మార్చుకోలేం. మనం యోగిలా జీవించాలో, భోగిలా జీవించాలో గత కర్మలే నిర్ధేశిస్తాయి. కర్తృత్వం లేకుండా ఆ కర్మలను చేయటం ద్వారా భవిష్యత్ జీవితాన్ని మార్చుకోవచ్చు. అంతఃప్రయాణానికి ఒక ప్రత్యేక లక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే ఏ సాధనా మార్గంలో వెళ్ళినా చేరేది ఆ గమ్యానికే. కానీ బాహ్యజీవనానికి లక్ష్యం చాలా అవసరం. బాహ్య జీవనవృత్తులే మానసిక ప్రవృత్తులకు కారణం. నేరుగా మనసును నియంత్రించలేం. కాబట్టి ఆలోచనలకు కారణమైన మన బాహ్యవృత్తులనే అదుపు చేసుకోవాలి. ఈ దేహంతో ఏ పనులు చేసినా ప్రాణంగావున్న పరమాత్మే చేయిస్తున్నాడన్న సత్యం స్మరణలో ఉండాలి. మన మనసు నిశ్చలంగా లేకపోవటం అనాదిగా ఉన్నదే. దైనందిన జీవితం దైవధ్యానానికి దూరం కాదని శ్రీరమణమహర్షి చెప్పారు. రోజంతా విచ్చలవిడిగా జీవించి ఒక గంట కళ్ళుమూసుకుని కూర్చుంటే ధ్యానం తెలియదు. జీవన విధానాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే జీవితమంతా ధ్యానమే అవుతుంది. అదే మన పూర్వికులు సూచించిన ధార్మిక జీవనం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'పని స్ఫురించని మనసే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కుటుంబమే లేకపోతే

 ఒక తోటలో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.


ఒకరు, రాముడు- “నాకు ఒక మనవరాలు, పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇంజనీరింగు చదివింది. ఉద్యోగం చేస్తున్నది. ఎత్తు 5.2. అందంగానే ఉంటుంది. ఎవరైనా తగిన పిల్లవాడు ఉంటే చెప్పండి.”


మరొకరు, రంగడు- “మీ మనవరాలికి ఎటువంటి సంబంధం కావాలి?”


రాముడు- “పెద్దగా ఏమీ వద్దు. అబ్బాయి M.E., లేదా M.Tech; చేసి ఉండాలి. సొంత కారు, సొంత ఇల్లుండాలి. మంచి ఎత్తు ఉండాలి. ఇల్లంటే కాస్త తోట, చెట్లు చేమలుండాలి. మంచి ఉద్యోగం, మంచి జీతం అంటే కాస్త ఓ లక్షో, రెండు లక్షలో ఉండాలి..!”


రంగడు- “ఇంకేమైనా కావాలా?”


అప్పుడు రాముడు- “అన్నింటి కన్నా ముఖ్యంగా, ఆ పిల్లవాడు ఒంటరి వాడై ఉండాలి. అతనికి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే, వారుంటే పెళ్ళి తరువాత పోట్లాటలు కావచ్చు కదా..”


రెండవ వృద్ధుని(రంగడు)రెండు కన్నులు నిండి వచ్చాయి. ఆయన కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు- “నా స్నేహితుని మనవడున్నాడు. అతగాడికి తోబుట్టువులెవరూ లేరు. అతని అమ్మా నాన్నా ప్రమాదంలో కన్ను మూశారు. మంచి ఉద్యోగం ఉంది. లక్షన్నర జీతం. పెద్ద కారుంది, పెద్ద భవంతి ఉంది. నౌకర్లూ చాకర్లూ అందరు ఉన్నారు..”


రాముడు సంతోషంతో- “అయితే మరింకేంటి? ఆ సంబంధం ఖాయం చేయించు..”


రంగడు- “కానీ ఆ అబ్బాయికి కూడా కొన్ని షరతులున్నాయి- అమ్మాయికి అమ్మానాన్నలు, తోబుట్టువులు, బంధువులు నా అన్నవారుండ రాదు.”


(ఆ మాట అంటూనే, ఆయనకు గొంతు పూడుకు పోయింది. మళ్ళీ సర్దుకుని అన్నాడు-)


“మీ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటే, ఆ సంబంధం కుదిరినట్టే. మీ మనవరాలి పెళ్ళి, ఆ పిల్లాడితో హాయిగా, బ్రహ్మాండంగా పెళ్లి అవుతుంది. ఇహ మీ మనవరాలు సుఖంగా ఉంటుంది.”


రాముడు కోపంతో- “ఏంటీ, నీ తిక్క వాగుడు? మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలా? రేపుదయం ఆ పిల్ల సంతోషంలో, బాధలో ఎవరుంటారు దానికి తోడు-నీడగా?”


రంగడు- “అబ్బో, భలే వారండీ! తన కుటుంబమేమో కుటుంబమా, కానీ ఇతరులది కాదా..? 


చూడు నేస్తమా, నీ పిల్లలకు ముందుగా కుటుంబపు విలువలు, మానవత్వం, అందరితో కలిసిమెలిసి ఎలా బ్రతుకలో, ఉండాలో తెలియ చేయి. 


చిన్నా పెద్దా ఇంటిల్లిపాదీ మనకు ప్రతి ఒకరు ముఖ్యమైన వారే. కాదంటే, మనిషి సుఖదుఖాల విలువలు, అర్థాలు పోగొట్టుకుని, ఒంటరి జీవి అయిపోతాడు. ఇక ఆ జీవితం అంతా నీరసమై పోతుంది.”


మొదటి వృద్ధుడు సిగ్గుతో, ఏమీ మాట్లాడ లేకపోయాడు.


మిత్రులారా, కుటుంబం ఉంటేనే జీవితంలో ప్రతి ఒక్క చిన్న పెద్ద సంతోషం, ఒక సంతోషంలాగా కనిపిస్తుంది. 


ఇక కుటుంబమే లేకపోతే, మీ ఆనందం, బాధ ఎవరితో పంచుకుంటారు? కాస్త ఆలోచించండి!!!!🙏🙏

దేవుడి వైపు కు నడుద్దాం

  దేవుడి వైపు కు నడుద్దాం


ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : ' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. ' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. 


 అందుకే, శరీరానికి భోజనం | ఆహారం | ఎలాగో మనసుకు దైవ ధ్యానం దైవ నామ స్మరణ అలాగా. నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం (God realisation) అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం..

🙏🙏🙏

కొన్ని సనాతన సాంప్రదాయాలు

 *తరతరాలుగా మనం  వింటున్న - క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు*


1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు.

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు.

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి.

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు.

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు.

9. పెరుగును ఉప్పును అప్పు ఇవ్వ  రాదు.

10. వేడి వేడి అన్నం లోనికి  పెరుగు వేసుకోరాదు.

11. భోజనం మధ్యలో లేచి పోరాదు.

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవు ఊడ్చరాదు.

15.  గోడలకు పాదం ఆనించి పడుకో రాదు.

16. రాత్రీ  వేళలో బట్టలుతక రాదు.

17. విరిగిన గాజులు వేసుకోరాదు.

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి.

19. చేతి గోళ్ళను కొరకరాదు.

20. అన్న- తమ్ముడు, తండ్రి - కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు.

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు.

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు.

23. భోజనం తరువాత చేతిని ఎండ పెట్టవద్దు.

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు.

25. ఇంటి గడపపై కూర్చోరాదు.

26. తిన్న తక్షణమే పడుకోరాదు.

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు.

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు.

31. అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు.

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు.

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు.

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు.

35. ఇంటి లోపలికి చెప్పులు (Shoes) ధరించి రారాదు.

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి.

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు.

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు.

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు.

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు‌ లాంటివి వదిలించుకోవాలి.

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి.

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.


       మీరు, మీ అధికారం,  ఏవీ శాశ్వతం కావు; ఇతరులను ఎదగనివ్వండి; మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.


మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి!

.🙏🙏🙏🙏


శుభోదయం💕


శుభ శుక్రవారం 🙏


🙏సర్వేజనా సుఖినోభావంత్🙏

పద్య కవిత

 పద్య కవిత //


ధ్రువకోకిల //


తఱుమ లేనివి కోర్కెలన్నవి తాపముల్ కలిగించురా!

పరుల సొమ్ముల కాశచెందుట పాప కార్యము సోదరా!/

మరలిరానిది కాల మన్నది మంచి దారికి మళ్ళుమా!/

కరుణతో చరియించి లోకుల గౌరవమ్మును బొందుమా!//


 మత్తకోకిల //


తోలుతిత్తియె దేహమన్నది తోసుకెళ్లును మిత్తియున్ /

గాలి పోవును భస్మ రాశిగ గాల మందున నిల్చునా?/

పాలుమాలిక లేక శ్రీహరి పాద సేవలు చేయుమా!/

కూల దోయును పాప శైలము కోరినిన్ దరి జేర్చుచున్ //


మత్తకోకిల //


సంచితంబగు కర్మ వాసన జన్మలన్ కుది పేయగా

పాంచ భౌతిక దేహమే జని పండి రాలుట

ఖాయమౌ!

వంచనన్ విడ నాడి దుర్గుణ భావనల్ నిరసించుచున్

బెంచుకోవలె సద్గుణంబును ప్రేమతో చరియించుచున్ //


మత్తకోకిల //


ధర్మ మార్గము వీడి పోకుమ!దారి తప్పకు మానవా!/

కర్మ పాశము చుట్టు ముట్టిన కాలమే పగ బూనుగా /

మర్మమన్నదెఱుంగ జాలక మాయలో పడ బోకురా!/

నిర్మలాత్ముడు విష్ణువేయని నిశ్చయమ్ముగ

నమ్మురా !//


మత్త కోకిల //


జీవితంబున "గీత "సారము చింతలన్ పరిమార్చు నీ

భావి యంతయు శాంతి నిండగ పావనంబయి సాగు నా 

త్రోవలో భగవానుడే సరి తోడుగా జని బ్రోచు నా

దేవదేవుని చేయి వీడక దీధితిన్ వెలుగొందుమా //

ఓమిక్రాన్ వైరస్ గురించి

 *ఓమిక్రాన్ వైరస్ గురించి ఓ డాక్టర్ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తూ, అప్రమత్తత చేస్తూ రాసిన వ్యాసం ఇది.* 

1)ఎవరికి డేంజర్?  భయపడే వార్తలను పదేపదే చదివే వారికి,  వినేవారికి డేంజర్. వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది. ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది .  అటుపై దాని కంటే అనేక రెట్ల వేగంతో విస్తరించే డెల్టా వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్. కట్టడి చర్యల పేరుతొ మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కరోనాను నుంచి ముక్కున్న  మానవుడు తప్పించుకోలేడు అని నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను. కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు . కరోనా ఎక్కడికీ పోదు . మరో వంద ఏళ్ళైనా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మనమధ్యే వుంది. అది సాధారణ  జలుబు కలుగ చేస్తుంది . మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం. కానీ మ్యుటేషన్లు జరిగే కొద్దీ బలహీనపడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది.  కరోనా కూడా అంతే. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గానో స్థిరపడి పోతుంది. మీ జీవిత కాలంలో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. 

2)ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ.  విపరీతంగా భయపడే వారు, లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీనిఅవసరం రాదు. 

3)మ్యుటేషన్లకు గురికావడం సూక్షజీవుల లక్షణం. {ఆ మాటకు వస్తే అన్ని జీవులు. కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ}. ఓమిక్రాన్ రేపు మరో రూపంలోకి మారొచ్చు. దాన్ని ఆపలేము. దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. మన ఇమ్మ్యూనిటినే మనకు రక్ష. ప్రతిరోజు కనీసం అరగంట ఎండలో నడవండి. *శరీరానికి డి-విటమిన్ అందివ్వండి . శాఖాహారులు బి12  విటమిన్ మాత్రలు తీసుకోండి. తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా {కనీసం ముప్పై శాతం} ఉండేలా చూసుకోండి.  పన్నీర్, మొలికెత్తిన పెసలు, *పుట్టగొడుగులు* 🍄🍄,

 ,* బ్రోకలీ, జామ కాయ, చికెన్, ఫిష్ మటన్, గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు. రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి. చెమట పట్టేదాకా వ్యాయామం {కనీసం నడక} చెయ్యాలి *బాడీ హీలింగ్ వ్యాయామం* . శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.  నిద్ర బాగా పోవాలి. ఇవన్నీ ఇమ్మ్యూనిటిని బలపరుచుకొనే మార్గాలు.   

అన్నింటికన్నా భయం పెద్ద విలన్. భయం ఇమ్మ్యూనిటిని చంపేస్తుంది. అదే ఫార్మసురుల అస్రం. భయంతో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీచేసి వారి గోదాముల్లో నోట్లకట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని* కల్పించుకొంటున్నారు.  తస్మాత్ జాగ్రత్త. వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్లు దొరకపోవడం , అంబులెన్సుల క్యూలు.  ఇలాంటి స్థితి రాదు. కానీ మనదేశంలో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు. ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు, భయం  వద్దని చెబితే మొండిగా,  మూర్ఖంగా వాదించేవారు వున్నారు. వారిని    ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు. తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యంతో. ఇలా చెబుతున్నందుకు క్షంమించండి. నిజం నిష్టూరంగా ఉంటుంది. తప్పదు. 

భయాన్ని బహిష్కరించండి. నిర్భయంగా వుండండి. అప్రమత్తత అవసరం. అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒకసారి చెక్ చేసుకోండి. అది 94  పైగా ఉంటే హ్యాపీగా కాలం గడపండి. 

ఇంకోసారి చెబుతున్నా,  కరోనాకు చంపేగుణం పోయింది. భయం చంపుతుంది. అది ఓమిక్రాన్ రూపంలో కాకపోతే గుండెపోటు రూపంలో. 

డాక్టర్ షణ్ముఖ 

అపోలో హాస్పి

అంతా మిథ్యేనా.. (అంతర్మథనం)

 అంతా మిథ్యేనా.. (అంతర్మథనం)

................

కళ్ళ ముందు అన్నీ కనిపిస్తుంటే ఏమీ లేదని, అభాస అని అనేవాళ్ళని మనం ఏమనాలి? ఏదైనా అనండి, అనుకోండి. ఎందుకంటే వాళ్లకు మీ మాటల పట్టింపు ఉండదు కాబట్టి. ఈ మాటల్లో నిజమెంత అనేది మాత్రం ఆయా వ్యక్తుల ఆలోచనా విధానం, తార్కిక, తత్వ దృష్టిని బట్టి ఉంటుంది. సృష్టిలో అన్నీ ఉన్నాయి. లేనివే వీ కొత్తగా సృష్టించబడటం లేదు. కర్ర, ఇటుక, సున్నం, స్టీల్ ఇవన్నీ తయారు చేసినవా? సృష్టిలో ఉన్నవే కదా. అన్నీ కలిపి మనం ఇల్లు కడుతున్నాం. ఇవాళ నీది, ఆ తరువాత ఉంచుకుంటే నీది, లేకుంటే వేరొకరిది. అంటే ఓనర్లు మారుతున్నారు. మరి అసలు ఓనరు ఒకడు ఉండాలి కదా. వాడెవడు? వాడు సర్వాధికారి అయితే మనం ఎవళ్ళం? ఇదీ తార్కిక, తత్వ దృష్టి. ఇవన్నీ మాకెందుకు..వర్తమానం, భవిష్యత్తు మాకు ముఖ్యం అంటాం మనం. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వర్తమానం మరు నిమిషానికి గతం. భవిష్యత్తు అని మనం చెప్పేది కూడా వర్తమానంలోనే చూస్తాం. మరి ఉన్నది వర్తమానం ఒక్కటే అయితే మిగిలిన రెండూ లేనట్టేనా? మిథ్య అని చెబుతున్న వారి వాదనో, జ్ఞానమో..అది కరెక్టేనా?. మిథ్య అంటే లేదని ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే.. ఇవాళ ఉన్నది ఏదీ రేపటికి ఉంటుందని గ్యారంటీ లేదు కదా. అందం, ఆరోగ్యం, సంపద, పదవి, ఆయుష్షు..ఇవన్నీ ఆ కోవలోవే కదా. ఇది నిజం కదా. ఆ దృష్టి సదా నిలవడం కోసమే.. మిథ్యా ప్రపంచం అని పెద్దలు చెప్పి ఉంటారని అనుకుంటే జీవిత సత్యం కొంతయినా బోధపడుతుంది కదా. ఇక..మిథ్య అనే వాడిని ఎందుకు తప్పుపట్టడం? అశాశ్వతమైన వాటి కోసం జీవితాంతం వెంపర్లాడక, శాశ్వతమైన వస్తువును అన్వేషించడమే..పెద్దల చెప్పే మిథ్యా ప్రపంచానికి లోతైన అర్థంగా స్వీకరిస్తే తప్పూ లేదు, తప్పు పట్టుకోవాల్సిన పనీ లేదు కదా. సత్యాన్వేషి...సజ్జన సాంగత్యం, సద్ గ్రంథ పఠనం, సద్ గురువుల ఆశ్రయం, సత్ కర్మల ఆచరణతో ఈ విషయం నిగ్గు తేల్చుకోవాలి.. కోవచ్చు కూడా.// మీ...ఆదూరి వేంకటేశ్వరరావు. 🙏