23, జూన్ 2024, ఆదివారం

బ్రహ్మముడి

 ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః..!!🙏🙏

పెళ్లిలో ఏడడుగులు...

ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః..!!🙏🙏

పెళ్లిలో ఏడడుగులు...

బ్రహ్మముడి అర్ధం..!!


పెళ్లంటే... రెండు మనసుల కలయిక, 

నూరేళ్ల సాన్నిహిత్యం.

వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే 

ఆ సంసారం స్వర్గం. 

ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. 


మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. 

ఆ సందర్భంలో వధూవరులతో చేయించే 

ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది.


జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. 

ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. 

వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు.


ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.


ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను 

ఒకటిగా చేసేదే వివాహ బంధం.

హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ 

ఓ ప్రత్యేకత ఉంది. 


కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, 

ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. 

ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. 

వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. 


దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. 

భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, 

అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.


అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. 

ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.


మొదటి అడుగు:..!!

ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’                       

ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!


రెండో అడుగు:..!!

ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’

ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!


మూడో అడుగు..!!

త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’

వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!


నాలుగో అడుగు:..!!

చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’

మనకు ఆనందాన్ని విష్ణువు కల్గించుగాక!


అయిదో అడుగు:..!!

‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’

మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!


ఆరో అడుగు:..!!

షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’

ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!


ఏడో అడుగు:..!!

సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’

గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!


ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. 

ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. 

ప్రేమగా ఉందాం. 

మంచి మనసుతో జీవిద్దాం. 

మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.


అప్పుడు వధువు ‘ఓ ప్రాణ సఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. 

నేనూ ఏ పొరపాటు చేయక నీవెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి.

నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని.

నువ్వు మనసైతే నేను మాట.

నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే ఋత్వికుడివి.

మనిద్దరిలో వ్యత్యాసం లేదు. 

కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’ అంటుంది.


‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, 

మనకు ఉత్తమస్థితి కలగడానికి, 

మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే 

ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు’ అని 

పురుషుడు చెబుతాడు.


భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని ‘బ్రహ్మ ముడి’ వేస్తారు. 

భార్యభర్తలు ఇద్థరు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. 

ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, అరణ్యవాసమైనా భార్యా భర్తలు కలిసే ఉండాలి. 


భార్యాభర్తలుగా మారటం అంటే ఇద్థరి శరీరాలు 

ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. 

భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, 

అంటే వీళ్ళ ఇద్థరి మధ్య ఇంకొకరు దూరటానికి 

వీలు లేకుండా ఉండాలని, 

అలా ఉండిపోవాలని గోరంత అవకాశం దొరికినా 

ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి చొరబడతాడని- ఎటువంటి పరిస్థితులలో ఐనా భర్తతోనే జీవితం అనుకోవాలని  వథువుకి,     

భార్యే సర్వస్వంగా అనుకోవాలని వరుడీకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -" 

అంటే ఇరువురి శరీరాలను ఒకే ప్రాణంగా మార్చటం అన్నమాట!


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏 అర్ధం..!!


పెళ్లంటే... రెండు మనసుల కలయిక, 

నూరేళ్ల సాన్నిహిత్యం.

వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే 

ఆ సంసారం స్వర్గం. 

ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. 


మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. 

ఆ సందర్భంలో వధూవరులతో చేయించే 

ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది.


జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. 

ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. 

వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు.


ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.


ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను 

ఒకటిగా చేసేదే వివాహ బంధం.

హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ 

ఓ ప్రత్యేకత ఉంది. 


కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, 

ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. 

ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. 

వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. 


దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. 

భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, 

అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.


అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. 

ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.


మొదటి అడుగు:..!!

ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’                       

ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!


రెండో అడుగు:..!!

ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’

ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!


మూడో అడుగు..!!

త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’

వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!


నాలుగో అడుగు:..!!

చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’

మనకు ఆనందాన్ని విష్ణువు కల్గించుగాక!


అయిదో అడుగు:..!!

‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’

మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!


ఆరో అడుగు:..!!

షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’

ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!


ఏడో అడుగు:..!!

సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’

గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!


ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. 

ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. 

ప్రేమగా ఉందాం. 

మంచి మనసుతో జీవిద్దాం. 

మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.


అప్పుడు వధువు ‘ఓ ప్రాణ సఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. 

నేనూ ఏ పొరపాటు చేయక నీవెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి.

నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని.

నువ్వు మనసైతే నేను మాట.

నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే ఋత్వికుడివి.

మనిద్దరిలో వ్యత్యాసం లేదు. 

కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’ అంటుంది.


‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, 

మనకు ఉత్తమస్థితి కలగడానికి, 

మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే 

ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు’ అని 

పురుషుడు చెబుతాడు.


భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని ‘బ్రహ్మ ముడి’ వేస్తారు. 

భార్యభర్తలు ఇద్థరు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. 

ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, అరణ్యవాసమైనా భార్యా భర్తలు కలిసే ఉండాలి. 


భార్యాభర్తలుగా మారటం అంటే ఇద్థరి శరీరాలు 

ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. 

భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, 

అంటే వీళ్ళ ఇద్థరి మధ్య ఇంకొకరు దూరటానికి 

వీలు లేకుండా ఉండాలని, 

అలా ఉండిపోవాలని గోరంత అవకాశం దొరికినా 

ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి చొరబడతాడని- ఎటువంటి పరిస్థితులలో ఐనా భర్తతోనే జీవితం అనుకోవాలని  వథువుకి,     

భార్యే సర్వస్వంగా అనుకోవాలని వరుడీకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -" 

అంటే ఇరువురి శరీరాలను ఒకే ప్రాణంగా మార్చటం అన్నమాట!


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏

Panchaag


 

*శ్రీ త్రికోటేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 357*





⚜ *కర్నాటక  :-   గదగ్*


⚜ *శ్రీ త్రికోటేశ్వర ఆలయం* 



💠 జైనమతం, వైష్ణవులు మరియు శైవులు వంటి వివిధ హిందూ మతాలచే ప్రభావితమైన ప్రాంతం కావడంతో, ఈ ప్రాంతం యొక్క నిర్మాణ వారసత్వాన్ని గమనించడానికి మీకు ఆసక్తి ఉంటే గడగ్ తప్పక సందర్శించవలసిన ప్రదేశం. 

గడగ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలలో త్రికూటేశ్వర దేవాలయం ప్రధానమైనది.


💠 భారతదేశంలోని కర్ణాటకలోని గడగ్‌లో ఉన్న త్రికూటేశ్వర దేవాలయం విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవం కలిగిన భవనం. 

శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయానికి సంస్కృత పదాలైన 'త్రికూట' అంటే 3 కొండలు మరియు 'ఈశ్వరుడు' శివుడిని సూచించే పదాల నుండి ఈ పేరు వచ్చింది. 


💠 10 నుండి 12వ శతాబ్దాల మధ్య పశ్చిమ చాళుక్యుల పాలన నాటి అనేక స్మారక కట్టడాలు మరియు కట్టడాలు ఆలయ నిర్మాణంలో ఈ ప్రాంతం యొక్క గొప్ప చరిత్రకు నిదర్శనం.


💠 చరిత్ర  ప్రకారం, ఈ ఆలయ వాస్తుశిల్పి అమర శిల్పి జకణాచారి. కళ్యాణి చాళుక్యుల కాలంలోనూ, హొయసల పాలనా కాలంలోనూ అనేక దేవాలయాలను రూపొందించాడు. బేలూరులోని ప్రసిద్ధ చెన్నకేశవ దేవాలయం వాస్తుశిల్పి అమర శిల్పి జక్కనాచారి యొక్క మానస పుత్రిక.


💠 ఆలయం గోడలు మరియు స్తంభాలపై చెక్కిన బొమ్మలు ఉన్నాయి. 

గర్భగుడిలో త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర) సూచించే మూడు శివలింగాలు ఉన్నాయి.

గాయత్రి మరియు శారద దేవతలతో పాటు సరస్వతీ దేవికి అంకితం చేయబడిన మరొక మందిరం ఉంది. 


💠 దండయాత్రలో ధ్వంసమైనందున సరస్వతీ ఆలయంలో పూజలు నిర్వహించబడవు.

ఆలయం లోపల మరియు బయటి గోడలపై అలంకరించబడిన స్తంభాలు, శిల్పాలు మరియు మూలాంశాలు చూడవచ్చు. 

త్రికూటేశ్వర ఆలయంలో ఆలయ పుష్కరిణి కూడా ఉంది, ఇది మెట్ల బావి నిర్మాణంలో నిర్మించబడింది.


💠 త్రికూటేశ్వర ఆలయ సముదాయo శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యుల రాజులు 10 నుండి 12వ శతాబ్దంలో నిర్మించారు ..ఈ ఆలయం దాదాపు 1050 నుండి 1200 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిది , 

ఈ సమయంలో దాదాపు 50 దేవాలయాలు నిర్మించబడ్డాయి.


💠 హుబ్లీ-ధార్వాడ్‌కు ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో ఉన్న గడగ్ పట్టణంలో ఉంది .

బిచ్చగాడు - భగవంతుడు*

 *


ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు 

పైన కూర్చుని భగవంతుడిని 

పెద్ద పెద్ద కేకలు పెడుతూ  

తిడుతున్నాడు..  


ఆ దారినే ఆ దేశపు రాజుగారు 

గుఱ్ఱం మీద వెళుతు 

ఈ కేకలన్నీ విన్నాడు..


"ఏమైంది నీకు ! ఇంత పొద్దున్నే 

భగవంతుడిని తిడుతున్నావు..! 

అన్నాడు..


"మీకేమిటి..! 

మహారాజులు..! 

మిమ్మల్ని భగవంతుడు 

ఒక రాజు గారి కుమారుడిగా 

పుట్టించాడు..! 

మీరు చక్కగా మహారాజు 

అయిపోయారు.. 

నా ఖర్మ ఇలా ఉంది..

ఒక రూపాయి కూడా లేని

దరిద్రుడిగా పుట్టించాడు.. 

చూడండి..

దేవుడికి ఎంత పక్షపాతమో..! 

అన్నాడు..


మహారాజు చిరునవ్వు నవ్వాడు..

"అయితే భగవంతుడు 

నీకేమీ ఇవ్వలేదు..!! 

చిల్లిగవ్వ కూడా ఇవ్వ 

లేదు అంతేగా..!" 

అన్నాడు..


"నిజం చెప్పారు మా రాజా..!" 

అన్నాడు బిచ్చగాడు..


"సరే అయితే..! 

నీకు పది వేల వరహాలు ఇస్తాను.

నీ అరచేయి కోసి ఇస్తావా..! 

అన్నాడు రాజుగారు..


"భలేవారే..! అరచేయి లేక పోతే ఎలా..!" 

అన్నాడు ఆ బిచ్చగాడు..


"సరే..! నీ కుడి కాలు 

మోకాలి వరకు 

కోసుకుంటాను..

ఒక లక్ష వరహాలు ఇస్తాను..

ఇస్తావా..!" అన్నాడు రాజుగారు..


"ఎంత మాట..! ఆ గాయం మానడానికి 

ఎంత కాలం పడుతుందో ఏమిటో..! 

ఇవ్వను..!" అన్నాడు బిచ్చగాడు..


 "అన్నింటినీ కాదంటున్నావు.. 

ఆఖరిగా అడుగుతున్నాను.. 

పది లక్షల వరహాలు ఇస్తాను..   

నీ నాలుక కోసి ఇస్తావా..! 

అన్నాడు రాజుగారు..


"అమ్మో..! మీరు నా జీవితాన్ని 

అడిగేస్తున్నారు.. 

ఇవి లేకపోతే నేను ఎలా జీవించను..? 

అన్నాడు బిచ్చగాడు..


"ఓహో..! అయితే నువ్వు పేదవాడివి  

కాదన్నమాట..!!


నీ దగ్గర పదివేల కన్నా 

విలువైన అరచేయి, 

లక్ష రూపాయిల కన్నా 

విలువైన కాళ్ళు, 

పది లక్షల కన్నా 

విలువైన నాలుక..

ఇంకా ఎంతో విలువైన శరీర 

అవయవాలు 

ఉన్నాయి కదా..


మరి ఇంత విలువైన శరీరాన్ని 

నీకు ఉచితంగా ఇచ్చిన  

భగవంతుడికి 

పొద్దున్నే నమస్కారం 

పెట్టకుండా నిందిస్తావా..!! 


ఈ శరీరాన్ని ఉపయోగించి  

లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో..! 

అందరూ అదే చేస్తున్నారు..

పో ఇక్కడ నుండి..! 

అన్నాడు రాజుగారు..


సోమరితనం మనిషిని 

మరింత నాశనం చేస్తుంది..


ఎదుటి వారిని చూసి 

ఏడవడం కాదు.. 

ఆ విధంగా పైకి ఎదగడానికి 

కష్ట పడి పని చేయాలి.. 

అటువంటి ఆలోచన మనసులో 

బలంగా ఉండాలి..


మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 

అంతే తప్ప కస్టపడడానికి 

సిగ్గు పడితే 

జీవితం నాశనం అవుతుంది.. 


సోమరితనం 

మనిషిని మరింత చెడ్డ 

వ్యక్తిగా మారుస్తుంది..  


జీవితంలొ గొప్ప వ్యక్తి గా 

ఎదగడానికి కృషి చేయాలి..


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

దర్శించాలని మనవి

 Hyderabad మిత్రులు అందరూ దయచేసి..ఈ గుడినీ ఓ మారు దర్శించాలని మనవి🙏🙏


ఈ గుడి హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉన్న భైరవ స్వామి గుడి., ఇక్కడి పంతులు గారి పరిస్థితి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆ పంతులుగారు ఆటో నడిపిస్తున్నారు 


కాబట్టి చుట్టూ పక్కల ఉన్నవాళ్లు ఆ గుడికి తరచుగా వెళ్ళండి ఆ ప్లేట్ లో ఓ 20 సమర్పించండి.,


ఈ గుడితో పాటు పక్కనే కాశిబుగ్గ ఆలయం, కృష్ణుని గుడికూడా ఉంది..,


పాపం కృష్ణ మందిర్ ముందే ఓ పెద్ద చెత్త కుప్ప., చుట్టూ ముస్లిం ఏరియా..,


కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి., పైగా ఇది 200 సంవత్సర క్రితం కట్టింది..


కాబట్టి ఈ మూడు గుడులకు చుట్టూ పక్కన ఉన్నవారు వెళ్ళండి వెళ్తూ ఉంటే పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది..


ఈ గుడులకు వెళ్లిన వాళ్ళు హుండీలో కాకుండా ఆ పళ్ళెంలో మాత్రమే దక్షిణ వేసి అక్కడి పూజారిని ఆదుకోండి... వాళ్ళ పరిస్థితి కష్టంగా ఉంది... 🙏


Sudha Krish  పెట్టిన పై పోస్ట్ చదివి నిన్న సాయంత్రం ఆ ప్రదేశానికి వెళ్ళాను. అది అత్తాపూర్ దాటాక కిషన్ బాగ్ లో ఉంది.

మేముంటున్న మియపూర్ ఏరియా కి సుమారు 25 కి.మీ దూరం.


ముందుగా భైరవస్వామి దేవాలయం చూద్దామని వెళ్లాం. కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వం రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది. ఏమిటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు

 "శ్రీ మురళీమనోహర స్వామి" వారి దేవాలయం. బహుశా దీనినే కృష్ణ దేవాలయం అంటున్నారేమో.


ఈ దేవాలయం కనీసం 250 సం. ల క్రిందట కట్టబడి నట్లు ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడ ని అనుకుని లోపల అంతా రాతి మంటపం నిర్మించి ఉంది. కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది.


అహోబిలం మఠం స్వామి వారు 1750 సం. లో ఈ దేవాలయానికి విచ్చేసినట్లు శిలాఫలకం ఉంది.


ఈ స్వామి వారి మూర్తి చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు. పేరుకు తగ్గట్టే  స్వామి వారి మూర్తి మురళీ మనోహరం.


ఈ దేవాలయానికి రెండు కధలు వ్యాప్తిలో ఉన్నాయి. మొదటి దాని ప్రకారం ఢిల్లీలో వుండే రాజా రఘు రాం బహదూర్ కి పిల్లలు లేరు. అయితే ఒకరోజు  రాజా వారికి కలలో హైదరాబాద్ లో ఒక తోట, దానిలో భూమిలో 5 అడుగుల క్రింద ఉన్న కృష విగ్రహం కనిపించాయట. వెంటనే రాజా వారు అనుచరులతో కలిసి గుర్రాలు పై హైదరాబాద్ వచ్చి అన్ని తోటల్లో వెతకగా ఈ తోటలో కృష్ణుని విగ్రహం కనిపించడం, ఈ ఆలయం   నిర్మించి విగ్రహం ప్రతిషించారట.  ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగింది అని ఒక కథనం. 


రెండో కథ ఏమిటంటే..  నిజాం దగ్గర వకీల్ లేదా నిజాం కు ఎజెంట్ గా పైన చెప్పిన రాజవారు వుండేవారు అని వారే ఈ దేవాలయం నిర్మించారు అని.


ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజముల్లా హుసైన్ దర్గా ఉంది. 


ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చుట్టూ ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.. చూడబోతే ఈ విలువైన 

స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో దేవాదాయశాఖ పెద్ద నోటీసులు అంటించింది.


అక్కడకు పోయిన తరువాత నాకు అర్ధం అయింది ఏమిటంటే  ఈ దేవాలయాలకు భక్తులు ఉత్సవాలు సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావడం సంఖ్య తగ్గిపోవడానికి ఈ ప్రాంతం ఒక కారణం కావచ్చు. 


ఈ దేవాలయానికి దగ్గరలోనే భైరవస్వామి వారి దేవాలయం ఉంది. చాలా చిన్న దేవాలయం ఈ దేవాలయం కూడా సుమారు 200 సం. ల క్రిందట కట్టినట్లు చెపుతున్నారు. ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది.


చూడబోతే పైన చెప్పిన మురళీమనోహర దేవాలయంలో మంటపం, దీనిలో మంటపం  నిర్మాణ శైలి ఒకే లాగా అనిపించాయి.


ఇక్కడ పూజారి గారి పేరు నట్వర్ నాధ్ శర్మ. ఉత్తరాది బ్రాహ్మణులు.

ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో పూజారి గారు ఖాళీ సమయాల్లో పొట్ట కూటి కోసం ఆటో నడుపుకుంటున్నారు.

వారి గూగుల్ పే నెంబర్: 8886511504.


పై కారణాలు దృష్ట్యా మనకు దగ్గరలో గల ఇటువంటి దేవాలయాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కనీసం శని ఆదివారాలు లేదా శలవు రోజుల్లో అయినా ఈ దేవాలయాలు దర్శించే భక్తుల సంఖ్య పెంచవచ్చు. మన భక్తులు ఎంత ఎక్కువగా దర్శిస్తే దేవాలయాలు అంత ఎక్కువగా ప్రాచుర్యం పొంది ప్రాచీన వైభవం సంతరించుకుంటాయి, కబ్జాకు గురి కాకుండా నిలబడతాయి.


ఈ దేవాలయాలకు దగ్గరగా మరొక ముఖ్య దేవాలయం ఉంది. అదే కాశిబుగ్గ ఆలయం.

కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి.  ఇది కూడా 200 సంవత్సర క్రితం కట్టింది..


నిన్న నాకు టైం సరిపోక ఆ దేవాలయం దర్శించలేకపోయాను. మరొక్క సారి వెళ్ళాలి.


అందువల్ల అందరూ ఈ దేవాలయాలు తప్పక దర్శించి ఆలయాల పునర్వైభవానికి తమ సహకారం అందించండి..🙏🙏🙏


....చాడా శాస్త్రి....

జూన్ 24, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🕉️ *సోమవారం*🕉️

    🌹 *జూన్ 24, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : తదియ* రా 01.23 తె వరకు ఉపరి *చవితి*

వారం :*సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : ఉత్తరాషాఢ* సా 03.54 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : ఐంద్ర* ప 11.52 వరకు ఉపరి *వైధృతి*

*కరణం : వణజి* మ 02.25 *భద్ర* రా 01.23 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 09.00 - 12.00  సా 04.00 - 06.00*

అమృత కాలం :  *ఉ 09.48-11.20 & (25) తె 04.44-06.14*

అభిజిత్ కాలం :*ప 11.44 - 12.36*

*వర్జ్యం : రా 07.40 - 09.11*

*దుర్ముహుర్తం : మ 12.36 - 01.29 & 03.14 - 04.06*

*రాహు కాలం : ఉ 07.15 - 08.53*

గుళిక కాలం :*మ 01.48 - 03.27*

యమ గండం :*ఉ 10.32 - 12.10*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.37*

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం :*ఉ 05.37 - 08.14*

సంగవ కాలం :*08.14 - 10.51*

మధ్యాహ్న కాలం :*10.51 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.06*

*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ బహుళ తదియ*

సాయంకాలం :*సా 04.06 - 06.43*

ప్రదోష కాలం :*సా 06.43 - 08.54*

నిశీధి కాలం :*రా 11.48 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.53*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🕉️ *మహామృత్యుఞ్జయ*🕉️ 

          🔱 *స్తోత్రం*🔱


🪷 *రుద్రం పశుపతిం స్థాణుం నీలకణ్ఠముమాపతిమ్ |* *నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౧* 


*నీలకణ్ఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౨*


*నీలకణ్ఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౩*


*వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ | నమామి శిరసా దేవం కింనో మృత్యుః కరిష్యతి ౪*


*దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౫*


*గఙ్గాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౬*


*అనాధః పరమానన్దం కైవల్యపదగామిని | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౭* 


*స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థితివినాశకమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౮*


*ఉత్పత్తిస్థితిసంహారం కర్తారమీశ్వరం గురుమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౯*


*మార్కణ్డేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | తస్య మౄత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ ౧౦*


*శతావర్తం ప్రకర్తవ్యం సఙ్కటే కష్టనాశనమ్ | శుచిర్భూత్వా పఠేత్స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ ౧౧*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

గొంతు లొ పుండు

 గొంతు లొ పుండు ( throat ulcer ) తగ్గుట కొరకు - 


     కరక్కాయ పొడి 10 గ్రాములు ఒక గ్లాస్ మంచినీరు ఒక గిన్నెలో పోసి సగం వరకు మిగిలేలా మరిగించి వడపోసి ఆ కషాయాన్ని రెండు పూటలా సగం సగం మోతాదుగా గోరువెచ్చగా ఒక చెంచా తేనే కలిపి మెల్లమెల్లగా తాగుతూ ఉంటే గొంతులో పుండు హరించి పోతుంది . 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

అనాయాసేన మరణం!

 అనాయాసేన మరణం!

వినా దైన్యేన జీవనం!

దేహాంతే తవ సాయుజ్యం!

కృపయా దేహిమే పామేశ్వరం

************************

అంటే.

నేను ఎవరిమీదా ఆధారపడకుండా జీవితంలో 

ఎవరిముందు తలవంచకుండా

ఎవరిని నొప్పించకుండా ఎవరి

వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు

నాకు మరణము సంభవించినప్పుడు నేను నిలో

లీనమయ్యేటట్లు దివించు.

ఓ పరమేశ్వరా నాకు ఈ వరములను అనుగ్రహించు

నాకు నొప్పి. బాధ. కానీ లేని 

మరణాన్ని ప్రసాదించు.

అని అర్థం.

పండగపూటా

 *“పండగపూటా పాత మొగుడేనా”*


*అనేసామెత ఈమాట ఇచ్చే అర్ధం గురించి ఎప్పుడైనా ఆలోచించారా. "మన సంప్రదాయానికి విరుద్ధమైన అర్ధంకదా “అంటే పండగపూట కొత్తమొగుడు కావాలి" అన్న అర్ధం వచ్చింది.* 


*ఇదితప్పు అని దీని  అసలుసామెత.*

"పండగపూట పాత మడుగేనా”*

మడుగు అంటే వస్త్రం అని అర్ధం. పండగరోజు కొత్తబట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టినసామెత. "పండగపూట పాతబట్టలు కాదు, కొత్తబట్టలు కట్టుకోవాలి"అని. ఇకపై ఈసామెతకి తప్పుడుప్రచారం మనం చేయద్దు. సరైనరీతిలోనే పలుకుదాం.*

*మన భాషను కాపాడుకుందాం.*

నీతి కథ

 *#నిజాయితి___దురాశ*

××××××××××××××

విశ్వనాథ్ ఎవరికో డబ్బు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి బ్యాంక్ నుండి క్యాష్  విత్ డ్రా చేయడానికి వెళ్ళాడు. విత్ డ్రా స్లిప్ లో 1,00,000 అని వ్రాసి రెండు వైపులా సంతకం చేసి ఇచ్చాడు. ఇతడే విశ్వనాథ్ అనేది ఖచిత పరచుకున్న క్యాషియర్ డబ్బు ఇచ్చేశాడు. 

 క్యాషియర్ ఇచ్చిన డబ్బును అక్కడే పక్కన నిలబడి లెక్కిస్తే అందులో 1,00,000 రూపాయలకు బదులు 1,20,000 ఉన్నాయి. విశ్వనాథ్ క్యాషియర్ ముఖాన్ని ఒకసారి చూశాడు. ఇదేమీ తెలియనట్లుగా అతడు మరొక వ్యవహారం లో నిమగ్నమై ఉన్నాడు. విశ్వనాథ్ మెల్లిగా డబ్బును బ్యాగ్ లో పెట్టి అక్కడినుండి వెళ్ళిపోయాడు. 

నేను ఈ రకంగా చేసింది సరా, తప్పా అనే ప్రశ్న ఆయన మనసును కొరకడం ప్రారంభమైంది. ఒకసారి ఈ డబ్బును తిరిగి ఇచ్చేయాలి అని మనసు చెబితే, మరొకసారి వేరే ఎవరికైనా నేను ఈ రకంగా ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళు వెనక్కు ఇచ్చేవారా అనే ప్రశ్న   ఎదురైంది. ఎవరు ఇస్తారు ? ఎవరూ ఇవ్వరు అని మనసు చెప్పింది. కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని విశ్వనాథ్ తీర్మానించుకున్నాడు. 

  కాసేపటికే మళ్ళీ డబ్బు గురించే ఆలోచన. క్యాషియర్ ఇపుడు ఈ డబ్బును తన చేతినుండి కట్టాల్సి వస్తుంది. అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందోననే ఆలోచన వచ్చింది. మరో క్షణంలో , బ్యాంక్ వారికి మంచి జీతం వస్తుంది, ఉండనీలే, అదృష్టం కొద్దీ లభించిన డబ్బును ఎందుకు ఇవ్వాలి అన్నది మనసు. 

    బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసేవారు తక్కువమంది. కాబట్టి నాకు ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చామనేది వారికి తెలిసిపోతే, నన్నే అడిగితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. అయితే, ఒకసారి నా చేతికి డబ్బు వస్తే అది నాదే గదా అని మనసు మరొక దిశలో ఆలోచించింది. ఇలా అనేక సార్లు జరిగి సాయంత్రం నాలుగు గంటలు దాటింది. 

    అపుడు మరొకసారి ఆలోచించాడు విశ్వనాథ్. అపుడు మనసు ఇతరుల తప్పు కారణంగా లాభం పొందడం సరి కాదు. ఈ 20,000 రూపాయలు నా నిజాయితీకి ఎదురైన ఒక పరీక్ష అంతే . ఇందులో గెలవాలా, ఓడాలా అన్నదే ముఖ్యం అన్నది. దాంతో ఒక క్షణమూ ఆలోచించకుండా విశ్వనాథ్ బ్యాంక్ కు పోయాడు. 

    అక్కడ క్యాషియర్ తల మీద చేతులు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. చెమటలు పట్టి ఉన్నాయి. డబ్బును కౌంటర్ లో పెట్టి విషయం చెప్పాడు విశ్వనాథ్. క్యాషియర్ ఆ డబ్బును గుండెలకు హత్తుకుని కళ్ళలో నీరు నింపుకున్నాడు. 

   మీరు ఈ డబ్బు తెచ్చి ఇవ్వకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఈరోజు పెద్ద మొత్తాలకు సంబంధించిన డ్రా లు జరిగాయి. కాబట్టి ఎవరికి ఎక్కువ మొత్తం వెళ్ళిందనేది తెలియడం లేదు. మీరు తెచ్చి ఇవ్వకపోయుంటే నా జీతంలో నుండి దాన్ని వసూలు చేసేవారు. ఇప్పటికే పిల్లల స్కూలు ఫీజులకు అప్పు చేశాను. ఇపుడు ఈ మొత్తమూ కట్టాల్సివచ్చి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. థ్యాంక్స్ సర్. పది నిమిషాలలో పని ముగించి వస్తాను. కలసి కాఫీ త్రాగుదాం అన్నాడా క్యాషియర్. 

అపుడు విశ్వనాథ్ ' అదేమీ వద్దు. నేనే మీకు పార్టీ ఇస్తాను. అవసరమైతే మనమిద్దరమూ మన భార్యలనూ పిలుద్దాం' అన్నాడు. 

     క్యాషియర్ కు ఆశ్చర్యం. మీరెందుకు పార్టీ ఇవ్వాలి, నేను కదా ఇవ్వాల్సింది అన్నాడు. 

     అపుడు విశ్వనాథ్ మీరు 20,000 ఎక్కువగా ఇచ్చినందున ఈ రోజు నేనెంత దురాశాపరుడిని అనేది నాకు తెలిసొచ్చింది. చివరకు నేను ఈ దురాశను వదలి వేయగలను అన్నది కూడా ప్రూవ్ అయింది. అటా ఇటా అనే గందరగోళం నుండి నేను గెలిచాను. ఇలాంటి అవకాశం ఇచ్చింది మీరు. అందుకు కృతజ్ఞతగా ఈ పార్టీ అన్నాడు. 

ఇలా కూడా ఆలోచించవచ్చా అని అవాక్కయ్యాడు క్యాషియర్.


నేటి సమాజానికి ఈ నీతి కథ అవసరం ఎంతో ఉంది..

easy money కి ఆశపడే వారు ఎక్కువుగా వున్నారు..

నీతి గా ఆలోచించేవారి సంఖ్య తగ్గింది.


మీ.... మాస్టారు...!!!

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

గాలిపటం

 తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరవేస్తున్నారు

గాలిపటాన్ని ఎలా ఎగరవేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు

గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని చేతికి అందించాడు

తండ్రి,కొడుకు మొఖం సంతోషంతో వెలిగిపోయింది

కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు..


"నాన్న.. దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే.!

దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా"అన్నాడు

తండ్రి నవ్వుకున్నాడు

"దారాన్ని తెంపేద్దామా మరి.? అడిగాడు 

"తెంపేద్దాం నాన్నా.." అన్నాడు కొడుకు ఎంతో సంతోషంతో ఉత్సాహంగా ఇద్దరు కలిసి దారాన్ని తెంపేశారు..

"టప్"మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పెకి ఎగిరిపోయింది

అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలు పెట్టింది.!

చివరికి ఒక మేడమీద కూలిపోయింది..


"ఇలా జరిగింది ఏంటి నాన్న" అన్నాడు కొడుకు విచారంగా

దారం తెంపేస్తే గాలిపటం ఇంకా పైకి పోతుందనుకుంటే

కిందికొచ్చి పడిపోవడం పిల్లాడికి నిరుత్సాహం కలిగింది

తండ్రివైపు బిక్కమొహం వేసుకొని చూశాడు

కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు తండ్రి..


గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిపోనికుండా పట్టి ఉంచేందుకు కాదు.గాలి ఎక్కువైనా,తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి. ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు తండ్రి...


జీవితంలో కూడ మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది

కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని.!

నిజానికి కుటుంబం అందించిన ప్రేమ,సేవ,సౌకర్యాల వలనే మనం ఈమాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి..

కుటుంబం మనల్ని పట్టుకొని లేదు

పట్టుకొని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం..

తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం.

మరణాన్ని జయించగలడా

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 




మనిషి మరణాన్ని జయించగలడా? ఎక్కువ మంది వినోద విలాసాలు సుఖభోగాలతోనే గడపాలనుకుంటారు. లేదా నీతి నియమాలను గాలికి వదలి అక్రమ సంపాదనతో అపర కుబేరులుగా జీవించాలనుకుంటారు. అంతే తప్ప 'పరోపకార మిదమ్ శరీరమ్' అనే ఆర్యోక్తిని ఆచరించాలని పొరపాటునైనా అనుకోరు. శరీరంతో సుదీర్ఘకాలం జీవిస్తూ, స్వార్థానికి పెద్దపీట వేసేకన్నా, ఆదిశంకరుల్లా అల్పాయుష్షుతో జీవించినా జీవన సాఫల్యాన్ని సాధించి కీర్తి శరీరంతో చిరంజీవిగా ఉండిపోవచ్చు.


ఈ లోకంలోకి అనునిత్యం లక్షలమంది వస్తూ, మరికొన్ని లక్షలమంది నిష్క్రమిస్తున్నారు. కానీ, కాల చరిత్రలో వీరిలో బహుకొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఆ కొద్ది మందే తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగినట్లు మనం గ్రహించాలి. అర్థవంతంగా జీవించడమే సార్థకత.

అర్ధవంతమైన జీవితమంటే కోట్లాది రూపాయల ధనం కన్నా విలువైన ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ప్రతి మనిషీ తనకొక వ్యాపకం పెట్టుకుంటాడు. అది వృత్తి, లలితకళలు, సాహిత్యం వంటిది ఏదైనా కావచ్చు.ఉద్యోగమూ కావచ్చు. అందులో అంకితభావం ఉంటేనే సత్ఫలితాలు, పదోన్నతులు, ప్రశంసలు, పురస్కారాలు, ప్రజ్ఞకు గుర్తింపు లభిస్తాయి. అసలు ప్రజ్ఞ లభించాలంటేనే గట్టి పట్టుదలతో తాను ఎంపిక చేసుకున్న రంగంలో కృషి చెయ్యాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు తప్పక లభిస్తాయి. విద్యార్థుల చదువు విషయమూ అంతే. ఏ రంగాన్నికైనా ఇది వర్తిస్తుంది. భక్తి స్థాయిని బట్టే ఫలితాలు, దైవానుగ్రహం లభిస్తాయి.

ఆదివారం* 🌞 🌷 *జూన్ 23, 2024*🌷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం* 🌞 

   🌷 *జూన్ 23, 2024*🌷

      *దృగ్గణిత పంచాంగం:*                 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : విదియ* రా 03.25 తె వరకు ఉపరి *తదియ*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : పూర్వాషాఢ* సా 05.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : బ్రహ్మ* మ 02.27 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం : తైతుల* సా 04.21 *గరజి* రా 03.25 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 08.00 - 12.00 మ 02.00 - 04.30*

అమృత కాలం :*ప 12.26 - 01.58*

అభిజిత్ కాలం :*ప 11.44 - 12.36*

*వర్జ్యం : రా 12.40 - 02.12*

*దుర్ముహుర్తం :సా 04.58 - 05.51*

*రాహు కాలం :సా 05.05 - 06.43*

గుళిక కాలం :*మ 03.26 - 05.05*

యమ గండం :*మ 12.10 - 01.48*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.36* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల :‌ *పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.14*

సంగవ కాలం :*08.14 - 10.51*

మధ్యాహ్న కాలం :*10.51 - 01.28*

అపరాహ్న కాలం :*మ 01.28 - 04.06*

*ఆబ్ధికం తిధి:జ్యేష్ఠ బహుళ విదియ*

సాయంకాలం :*సా 04.06 - 06.43*

ప్రదోష కాలం :*సా 06.43 - 08.54*

నిశీధి కాలం :*రా 11.48 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*

______________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🌞 *సూర్య ఆరాధన*🌞 

       🙏 *ప్రాముఖ్యత*🙏


*“తేజ స్మామో విభావసుమ్‌”*


అంటే తేజస్సును పొందగోరువారు సూర్యుని ఆరాధించాలని భాగవతమందు చెప్పబడినది.


*“ఆరోగ్యం భాస్యరదాచ్చేత్‌”*


నిత్యం ప్రాతఃకాలమునందు సూర్యుని దర్శించి నమస్కార  ప్రణామాలు చేయుట వలన ఆరోగ్యం చేకూరును. 

*-మత్స్యపురాణం*


*“దినేశం సుఖార్దం”* 


సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును. 

*-స్కాంధపురాణం*

 

మద్వాల్నీకి రామాయణ  మందు శ్రీరాముడు రావణుడిని వధించుటకు అగస్త్య మహాముని ఆదిత్య హృదయమును ఉపదేశించినాడని చెప్పబడింది.


మద్భాగవంతమందు సూర్యభగవానుని ఆరాధించుట వలనే 

సత్రాజిత్తునకు శమంతకమణి ద్వారా శ్రీకృష్ణపరమాత్ముని దర్శనభాగ్యం కలిగిందని చెప్పబడినది. 


దరిద్రుడై ధర్మరాజు ఆదిత్య హృదయమును ఉపాసించి సూర్యభగవానుని కృపచే అక్షయ పాత్రను పొందబడినాడు అని చెప్పబడింది. 

 

వేదములందు సైతము సూర్యభగవానుని ప్రస్తుతింపబడినది. 

ఋగ్వేద మందు ఋక్కులు సూర్యుని కీర్తించాయి. 


అధర్వణ వేదములో సూర్యధానమువలన రోగములు ఉపశమించు మంత్రములు ఉవాచింపబడ్డాయి. 

 

అమరకవి సాంబుడు సూర్యుని స్తుతించి తమ శారీరక బాధల నుండి విముక్తి పొందెను. 


🌞 *ఓం సూర్యాయ  నమః*🌞

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహారావు*

      🌷🌹🌞🌞🌹🌷

 🌹🍃🌿🌞🌞🌿🍃🌹

మర్చిపోతాము

 *సంధ్యా వందనం వదిలేస్తే గోత్రం ప్రవర వేద శాఖ మర్చిపోతాం. తర్పణము తద్దినము వదిలేస్తే తండ్రి  తల్లి  వర్గ త్రయం మర్చిపోతాము.* 

ఇక అంతే సంగతులు మనం పోతే మనలను పై వాళ్లతో చేర్చలేరు. ఇక వచ్చే పురోహితుడు వారిపేర్లు తెలియనందున *యజ్ఞమ్మ యజ్ఞయ్య* అని కానిచేస్తారు అంతే నువ్వు అనాథవై పిశాచంగా తిరగాల్సిందే. తర్వాత నిన్ను నీ పిల్లలను కృష్ణ యజుశాఖకు మార్చేస్తారు. నేడు ఇందు వల్లే అందరు కృష్ణ యజుశ్శాఖీయులు ఐపోయారు

 *ఇప్పుటి తరం 70% పిల్లలు..*

1)తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు..

2)మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

3)లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

4)కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

5)రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు...

6)గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..

7)తిడితే వస్తువులను విసిరి కొడతారు.              8)ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

9)ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

10)ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

11)అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..                              12)20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు..

13)బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.. 

14)కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.వారిస్తే వెర్రి పనులు..మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే.ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది

కష్టం గురించి తెలిసేలా పెంచండి

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే. వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే..కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు.

అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..  మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.

కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది పండ్లు అసలు తినరు.

గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం.టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి.

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు.3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి.వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే.అందుకే తల్లిదండ్రులు మారాలి.

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి.

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*

కేవలం గుడికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు. సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..

👉  బాధ్యత

👉  మర్యాద

👉  గౌరవం

👉  కష్టం

👉  నష్టం

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక దృఢత్వం 

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు  

👉  దైవ భక్తి

👉  దేశ భక్తి

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం,ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం. భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.

నాస్వామి నన్ను రక్షిస్తాడు!*




       *నాస్వామి నన్ను రక్షిస్తాడు!*

                ➖➖➖✍️


*ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది, చీకటిపడేలా ఉంది.*


*ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తు కుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.*


*దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది.*


*అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకెవరకూ కూరుకు పోయింది.*


*ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా  బురదలో కూరుకుపోయి చనిపోతుంది.*


*ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.*


*కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది, "నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా?” అని అడిగింది.*


*దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,“నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు? అంది గొప్పగా.*


*అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా..,” అంది.*


*అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??” అంది.*


*అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, "నా స్వామి నన్ను రక్షిస్తాడు., సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు?”అంది.*


*ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.*


*కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని..వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.*


*ఈ కథలో... ఆవు’-  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.*

 *‘పులి’ -  అహంకారం నిండిఉన్న మనస్సు.*


*‘యజమాని’ - సద్గురువు/పరమాత్మ.*


 *’బురదగుంట’- ఈ సంసారం/ప్రపంచం.*


*మరియు,*


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : 

*నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.*


 *నీతి :* 


*ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,*


*"నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.*


 *దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.*


*ఈజగత్తులో 'సద్గురువు'(పరమాత్మ) ను మించిన హితాభిలాషి ,మన మంచిని కోరుకునే వారు మన రక్షణ బాద్యతను వేరే ఎవరుంటారు.?? ఉండరు.*


*ఎందుకంటే.??  వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో  మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.*


*పరమాత్మా అంతటా...అన్నిటా నీవే ఉన్నావు...! అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!  *✍️


                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము.🙏

శ్రీమన్నారాయణుని వైభవం!

 శు  భో  ద  యం🙏


పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. ,  దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా,  పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా  శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నీకర్మ నీచేత

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



 *నీకర్మ నీచేత ఆపని చేయిస్తుంది!*

                ➖➖➖✍️


*ధర్మరాజును జూదంవైపు నడిపించింది ఏది?*


```

స్వభావరీత్యా మనిషి తనకు ఇష్టంలేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం వివరించింది.


ఒక పనిని ఆచరించడంగాని, నిరాకరించడంగాని మనిషి చేతిలో లేదని, ప్రకృతిశక్తి లేదా విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి దానికి పూనుకొంటాడని 60వ శ్లోకం చెబుతోంది.


ధర్మజుడు ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి. పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు.   అంతటి వివేకి- చెడ్డదని తెలిసీ, వ్యసనమని ఎరిగీ జూదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు?


ఇదే సందేహం జనమేజయుడికీ వచ్చింది. వ్యాసమహర్షిని అడిగాడు.


దానికి వ్యాసుడు “ప్రకృతి చేయిస్తుంది నాయనా! దానిముందు నీ నిగ్రహం చాలదు... ఇష్టంలేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీచేత ఆ పని చేయిస్తాయి!” అని బదులిచ్చాడు.


జనమేజయుడికి సంతృప్తి కలగలేదు. కాని, మౌనం వహించాడు.


రాజు అసంతృప్తిని ఋషి గమనించాడు. మాట మారుస్తూ “ఓ రాజా! రేపు నీ దగ్గరకు కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనవద్దు! కొన్నా, దానిమీద స్వారీ చెయ్యకు... చేసినా ఉత్తర దిక్కుకు మాత్రం పోనేవద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు..! కలిపినా ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్నా, ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు... జాగ్రత్త!” అని హెచ్చరించాడు.


మర్నాడు కొందరు వర్తకులు మేలుజాతి అశ్వాలను అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్లగుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘దీనివల్ల ఈ గుర్రపుశాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ’ అనిపించింది రాజుకు. ఆయనకు వ్యాసమహర్షి మాట వెంటనే గుర్తుకొచ్చింది. ‘ఎక్కవద్దన్నాడు కాని కొనవద్దని చెప్పలేదుగా!’ అని సమాధానపడి పెద్ద ధరకు దాన్ని కొనేశాడు.


రోజూ అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోయేవాడు. క్రమంగా ఇష్టం పెరిగిపోయింది. ‘ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది- ఎక్కవద్దని కాదు..!’అని సరిపెట్టుకొని తక్కిన మూడు దిక్కుల్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు.


కొన్నాళ్లు గడిచాయి. ‘ఉత్తర దిశగా పోదాం... అక్కడి సుందరితో మాట్లాడకుండా తిరిగొచ్చేస్తే ఫరవాలేదు’ అని నిశ్చయించాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు.


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


అక్కడొక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తరవాత ‘ఇంతటి సౌందర్యరాశిని సొంతం చేసుకోకుంటే ఈ జన్మ వృథా!’ అనిపించింది. ‘ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు... కేవలం పెళ్ళి మాత్రమే చేసుకొందాం... ఆమె చెప్పినట్లు మాత్రం చేయవద్దు’ అన్న గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకొన్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు.


ఒకరోజు ఆ సుందరి ‘దేశంలోని సాధువులను పొలిమేరల్లోని మునులను పిలిచి సంతర్పణలు, సత్కారాలు చేయాలని ఉంది’ అని రాజును కోరింది.


అది భార్య తొలి కోరిక. పైగా చక్కని సత్కార్యం. కాదనడం దేనికనుకొన్నాడు జనమేజయుడు. అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుండగా ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువసాధువు మోహపరవశుడై ఆమెను కామదృష్టితో పరికించాడు.


ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజు పట్టరాని కోపంతో కత్తిదూసి ఆ సాధువు తల నరికేశాడు.


మరుక్షణమే ‘అయ్యో బ్రహ్మహత్యాపాతకానికి ఒడిగట్టానే’ అంటూ వలవల ఏడ్చాడు.


వ్యాసమహర్షి నవ్వుతూ ప్రత్యక్షం అయ్యాడు. తన మాయను ఉపసంహరించాడు.


జనమేజయుడికి కల చెదిరినట్లయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించడానికే తప్ప ఇక చెప్పడానికి ఏమీలేదు!✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

.                  🍀🌺🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀                         🌷🙏🌷 🙏లోకాః సమస్తాః సుఖినోభవన్తు!🙏🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

శాసన సభ్యులు - సుపరిపాలన 7*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 7*


సభ్యులకు నమస్కారములు.


ఇప్పటివరకు చట్టాలు, శాసన సభ, శాసన సభ్యులు గురించి క్లుప్తంగా విశదీకరించడం జరిగినది. ఇన్ని అంశాలకు మూలము *ప్రజాస్వామ్యం*.  

మనదేశంలో జన్వరి 26, 1950  న రాజ్యాంగము అమలులోకి వచ్చి భారతదేశం   స్వతంత్ర, సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నది. ప్రజల చేత, ప్రజల కోరకు, ప్రజలే ఎన్నుకునే విధానాన్నే ప్రజాస్వామ్యంగా నిర్వచించారు. 


ప్రజాస్వామ్యంలో పాలానాధికారాల అధికారము అప్పజెప్పుటకు  చట్ట సభలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కీలక పాత్ర వహిస్తారు.  చట్ట సభ్యుల అభ్యర్థిత్వానికి ప్రజలు ముఖ్యము, అత్యంత అవసరము. ఆలాగే ప్రజల నియోజక వర్గ  పాలనా నిర్వహణకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ముఖ్యపాత్ర పోషిస్తారు.  ఒకరిపై  ఇంకొకరు  ఆధారపడి ఉంటారు *కావున ప్రజలు మరియు చట్ట సభ్యుల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది*. 


రాజ్యాంగము, ప్రజాస్వామ్యం, చట్టసభల క్రమంలోనే *రాజకీయాలు* అను పదమును విశ్లేషించుదాము. పూర్వ కాలంలో తమ తమ ప్రాంతాల పాలనకై ఆ ప్రాంత ప్రముఖులు *కొందరు* ముందుకు వచ్చే వారు.  ఆ రాజ్య (ప్రాంత) కార్యకలాపాలు నిర్వహించే వారు కనుక వారు రాజకీయ నాయకులుగా (POLITICIANS) గా పిలువ బడేవారు.  POLITICS అను ఆంగ్ల పదానికి నిఘంటు అర్థము *పాలనా సంబంధమైన సామూహిక నిర్ణయాలు  మరియు కార్యకలాపాలు*. ఇంకొక మాటలో చెప్పాలంటే *పరిపాలన*. కాలక్రమేణా రాజ్య నిర్వహణకు సంబందించిన కార్యక్రమాలే రాజకీయాలు. 


ప్రస్తుత అధునాతన కాలంలో ప్రజాస్వామ్య పద్ధతికి లోబడి అనేక రాజకీయ సంస్థలు (PARTIES) వెలసి, ఆ పార్టీల నాయకులందరు కూడా రాజకీయ నాయకులు (POLITICIANS) గా చెలామణి అవుతున్నారు. 


వాస్తవానికి *రాజకీయం* అను పదము *పరిపాలనకు* సంబంధించినది. కాని ఈ మధ్య కాలంలో జనాలు ఆ పదానికి వింత వింత పోకడలతో  ఆ పదాన్ని  భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ పదానికి అనుచిత, అసంగతమైన, హాస్యాస్పదమైన ధోరణిలో ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకు...వాడి రాజకీయమే వేరు, అంత రాజకీయం మనకు రాదు ఇత్యాది.


*పరిణితి చెందిన రాజకీయవేత్తలను Statesman గా వ్యవహరిస్తూ ఉంటారు.* 


ధన్యవాదములు.

అతి పరిచయం

 ☝️శ్లోకం 

అతిపరిచయాదవజ్ఞతా 

సన్తతగమనాదనాదరో భవతి ।

మలయే భిల్లపురన్ధ్రీ 

చన్దనతరుకాష్ఠమిన్ధనం కురుతే 



భావం: ఒక గొప్ప వ్యక్తి తరచుగా ఎవరిదగ్గరికైనా లేదా ఎవరింటికైనా తరుచూ వెళుతూ ఉన్నా ఆ వ్యక్తి చులకనకి గురికాబడతాడు. ఇది అతి పరిచయం వలన వచ్చిన ప్రతిస్పందన. మలయ పర్వత సానువులలో అత్యంత విలువైన మంచి గంధపు చెట్లు విశ్తారంగా మొలుస్తాయి, వృద్ధి చెందుతాయి.   ఆటవిక జాతికి చెందిన భిల్ల జాతీయులు  ఆ మలయ పర్వత సానువులలోనే సంచరిస్తూ ఉంటారు. ఆ మలయ పర్వత సానువులలో  నివశించే భిల్ల జాతి స్త్రీ తన యొక్క నిత్యావసర వంటచెరుకు కోసం అక్కడ విస్తారంగా ఉండే అత్యంత విలువైన మంచి గంధపు చెట్లని కొట్టి తన వంట చెరుకుగా ఉపయోగిస్తూ ఉంటుంది.

ఉన్నతమైన వ్యక్తి ఆతని విలువని అర్థం చేసుకోలేని సామాన్య జనాన్ని అత్యంత సన్నిహితంగా మెలగనీయనిస్తే  అత్యంత విలువైన మంచి గంధపు వృక్షం వలె అవజ్ఞతా భావానికి గురికాక తప్పదు.

23.06.2024. ఆదివారం

 *నమస్తే..జై శ్రీరాం..గుడ్ మార్నింగ్*


23.06.2024.        ఆదివారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు జ్యేష్ఠ మాస బహుళ పక్ష *విదియ* తిథి రా.03.25 వరకూ తదుపరి *తదియ* తిథి, *పూర్వాషాఢ* నక్షత్రం సా.05.03 వరకూ తదుపరి *ఉత్తరాషాడ* నక్షత్రం, *బ్రహ్మ* యోగం మ.02.27 వరకూ తదుపరి *ఐంద్రం* యోగం,*తైతుల* కరణం సా.04.21 వరకూ, *గరజి* కరణం రా.03.25 వరకూ తదుపరి *వణిజ* కరణం  ఉంటాయి.

*సూర్య రాశి* : మిథున రాశిలో (ఆరుద్ర నక్షత్రం లో)

*చంద్ర రాశి* : ధనస్సు రాశి లో రా.10.48 వరకూ తదుపరి మకర రాశిలో 

*నక్షత్ర వర్జ్యం*: రా.12.40 నుండి రా.02.12 వరకూ.

*అమృత కాలం*: మ.12.26 నుండి మ.01.58 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం* : ఉ.05.43

*సూర్యాస్తమయం*: సా.06.54

*చంద్రోదయం*: సా.08.25

*చంద్రాస్తమయం*: ఉ.06.39

*అభిజిత్ ముహూర్తం*: ప.11.52 నుండి మ.12.45 వరకూ

*దుర్ముహూర్తం*: సా.05.08 నుండి సా.06.01 వరకూ.

*రాహు కాలం*: సా.05.15 నుండి సా.06.54 వరకూ

*గుళిక కాలం*:మ.03.36 నుండి సా.05.15 వరకూ

*యమగండం*: మ.12.19 నుండి మ.01.57 వరకూ.


దక్షిణ భారతదేశంలో ఈరోజు నుండి *జ్యేష్ఠ బహుళ పక్షం* ప్రారంభమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు నుండి *ఆషాఢ మాసం* ప్రారంభం అవుతుంది (పూర్ణిమాంత  పంచాంగ ప్రకారం).


*త్రి పుష్కర యోగం* ఈరోజు సా.05.03 నుండి రా.03.25 వరకూ ఉంటుంది. (ఆదివారం,విదియ తిథి, ఉత్తరాషాడ నక్షత్రం కలయిక). ఈ యోగ సమయం లో చేసే ప్రతీ పనీ జీవితం లో మరలా మూడు పర్యాయాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి.అందువలన ఈ సమయం లో ఎటువంటి తొందరపాటు,అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయం లో బంగారం,వెండి, వజ్రాలు, స్థిర ఆస్తులు, వాహనాలు, కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న  అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరడానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు.


ఆదివారం, ఉత్తరాషాడ నక్షత్ర కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* సా.05.03 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఇదే సమయం లో త్రిపుష్కర యోగం కూడా ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. 


నారాయణ స్మరణ తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్:6281604881.

భగవధ్ధ్యానం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *నిమిషం నిమిషార్థం వా*

        *ప్రాణినాం విష్ణుచిన్తనమ్*౹

        *క్రతుకోటిసహస్రాణామ్*

         *ధ్యానమేకం విశిష్యతే*౹౹


 *తా𝕝𝕝 ఆధునికత, సాంకేతికత, యాంత్రికతతో కూడిన నేటి నవీనసమాజంలో పరుగులు పెడుతున్న మనిషికి భగవంతుడిని కనీసం ఒక్క నిమిషమో అరనిమిషమో ధ్యానం చేయడంకన్నా మించినది మరొకటి లేదు.. భగవధ్ధ్యానం విశేషపుణ్యప్రదం*...


 ✍️💐🌷🌺🙏

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 23.06.2024

ఆది వారం (భాను వాసరే

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ సంయుక్త ద్వితీయాయాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే   కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ సంయుక్త ద్వితీయాయాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.33

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

కృష్ణ పక్షం పాడ్యమి ఉ. 5.41 వరకు. తదుపరి విదియ తె. 4.37 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం పూర్వాషాఢ  సా.6.24 వరకు. 

అమృతం  మ.1.39 ల 3.14 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.48 ల 5.40 వరకు.

వర్జ్యం  ఉ. 5.44 వరకు. 

వర్జ్యం తె. 2.11 ల 3.46 వరకు. 

యోగం బ్రహ్మం సా. 4.11 వరకు. 

కరణం కౌలవ ఉ.5.41 వరకు. 

కరణం తైతుల సా. 5.09 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ. 12.00 ల 1.30 వరకు.      

***********   

 పుణ్యతిధి జ్యేష్ఠ బహుళ విదియ.

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏