14, ఆగస్టు 2024, బుధవారం

పోతన అక్షర చిత్రం!

 పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. ,  దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా,  పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా  శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Panchaag


 

దానాన్ని వెనక్కి

 *బ్రాహ్మణులకు ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోకూడదు* 


ఒక బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన దానిని తిరిగి వెనక్కి తీసుకోవడం మహా పాపం.

దీనికి సంబంధించిన ఒక కధ శ్రీమద్భాగవతంలో ఉన్నది.


ఒకప్పుడు నృగ మహారాజు ఉండేవాడు. అతను ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఈయన బ్రాహ్మణులకు అనేక ఆవులను కానుకగా ఇచ్చేవాడు.

ఒకానొక సమయం లో ఆయన ఒక బ్రాహ్మణునకు కానుకగా ఇచ్చిన గోవును ఒకానొక అనుకోని సందర్బంలో మరొక బ్రాహ్మణునకు ఇవ్వటం జరిగింది. ఆ గోవు తిరిగి కొత్త గోమందలో ఎలా కలిసిందో కలిసిపోయింది. అయితే ఆ రాజుకు ఈవిషయం తెలియదు. రెండో బ్రాహ్మణునకు కానుకగా ఇచ్చిన తరువాత ఆ ఆవును మొదటగా కానుకగా పొందిన ఆ తొలిబ్రాహ్మణుడు ఆ ఆవు తనకు చెందిందని పేర్కొన్నాడు. అప్పుడే కానుకగా పొందిన ఆ బ్రాహ్మణుడు కూడా "అది నాది" అని వాదించటం ప్రారంభించాడు.

ఇద్దరి వాదన విన్నరాజు, ఇద్దరికీ ఎక్కువ గోవులను ఇస్తానని ఆ బ్రాహ్మణులకు సర్ది చెప్పి, తగాదాను విడిచి పెట్టమని వారిని ప్రార్ధించాడు. కానీ వారు రాజుగారి విన్నపాన్ని పట్టించుకోలేదు.

కొన్ని రోజుల తర్వాత ఆరాజు మరణించాడు. ఒక బ్రాహ్మణుని ఆస్తిని తీసుకున్న పాపం దృష్ట్యా తెలియకుండానే అతను ఒక పెద్ద కొండ చిలువగా జన్మించాడు. ఒక రోజు అక్కడ ఆడుకోవడానికి వచ్చిన శ్రీకృష్ణుడి పిల్లలు ఆ పాముని చూసి బయటకు తీసుకురావటానికి ప్రయత్నించారు. కానీ వారు ఆపని చేయలేక పోయారు. వారు ఈ విషయాన్ని తమ తండ్రికి చెప్పారు. క్షణంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ కొండచిలువని బయటకు తీసాడు. శ్రీకృష్ణుని హస్తస్పర్శ కారణంగా పాము శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన అసలు రూపాన్ని పొందినది.అతను పాముగా ఎలా అయ్యాడు? అని అడిగితే అతను తన కథను శ్రీ కృష్ణునికి చెప్పాడు.

ఆ కధ విన్న శ్రీకృష్ణుడు తన ప్రజలను పిలిచి ఎట్టి పరిస్థితులోనూ ఒక బ్రాహ్మణునకి కానుకగా ఇచ్చిన దానిని గానీ, దానంగా ఇచ్చిన దాన్ని దానిని తిరిగి వెనక్కు తీసుకోకూడదు అని ఆదేశించాడు.

కాబట్టి ఒకసారి ఇచ్చిన దానిని ఎవ్వరూ వెనక్కి తీసుకోకూడదు. అలాగే ఒకరి సొత్తుని మరొకరు కాజేయడకూడదు అని ఈ పురాణ కధ ద్వారా స్పష్టమగుచున్నది.


--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహా స్వామివారు*

మత్స్యావతారము

 మత్స్యావతారము


ఆతడుం డతులిత హరినిష్ఠతోడ 

నశనంబుగా నీరె నరయ గ్రోలుచును 

నొనరంగ నిష్ఠతో నొకయేటితటిని

గావించు చుండెను గాఢమౌతపము 


'కృతమాలిక'నియడా యేటిలో నిలిచి 

యత్యంత నిష్ఠతో నవనినాథుండు 

సల్పుచు న్నుండెను జలతర్పణంబు. 

అత్తరి యవనీశు డాశ్చర్య మొంద 

దోచె మీనొక్కటి దోసిలియందు.  

ఆ చేపపిల్లనా యధిపతిగాంచి 

నులికె నత్యంతగా నొడలెల్ల కదల. 

సత్యవ్రతుండంత సలిలంబులోకి 

ఝషమును దానిని జాలితో విడచె.


ఆరీతి విడివడి యంభశ్చరంబు 

మగిడి నీటిని జేరె మారాజు కతన.

జలచర పోతంబు జనపతి తోడ 

నయ్యడ నిట్లనె నభ్యర్థనమున 

"నరనాథ !వినవయ్య నా దీన గాథ

దయలేక వదలకు దక్కిన నన్ను 

చిరుమీనులనుబట్టి చేరియు జంపు 

జ్ఞాతి ఘాతకులైన ఝషములు పెక్కు 

పాపవర్తనులౌచు బ్రతికుదు రిచట.

పాపజాతి ఝషపు పాలన బడక 

తప్పించు కొనుటకై దారిని వెదికి 

నీ దోసి టందున నేజేరి యుంటి 

అరయ రక్షించక నార్తినౌ నన్ను 

దయమాలి విడుతువే దారుణంబుగను !

నట్టేటికిని మఱల నెట్టంగ తగునె! 

ఆపదొండు గలదు నంతియే గాక 

వేటాడు జాలర్లు యేటికి వచ్చి 

వదలక మామీద వలలని పన్ని 

యేఱంత కెలికియు యెఱలను బెట్టి 

గట్టిగా బట్టేరు కడు లాఘవమున

మిడిసిపోనీకను మెడపట్టుకొనిన 

యపుడెందు బోదును యనఘుడా ! నేను 

ఝషములు వేటాడి జాలి చూపకను 

పట్టినన్ సులువుగా భక్షించ గలవు 

జాలించుకను లేక జాలర్లు నన్ను 

పట్టియు సులువుగా భక్షించ గలరు 

ఇరు యాపదలనుండి వెఱగు జూపించి 

రాగంబుతో నన్ను రక్షింపు మిపుడు 

ప్రక్షీణులను గావ భాగ్యంబు గలుగు "

మత్స్య మారీతిగా మాట్లాడి నంత 

సత్త్వ శోభితుడైన సత్యవ్రతుండు 

కరుణతో దానిని కాపాడ దలచె. 


✍️గోపాలుని మధుసూదనరావు

పంచాంగం 14.08.2024

 ఈ రోజు పంచాంగం 14.08.2024 Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష  ఋతు శ్రావణ మాస శుక్ల పక్ష నవమి తిధి సౌమ్య వాసర: అనురాధ నక్షత్రం ఇంద్ర  యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి పగలు 10:19 వరకు. 

అనురాధ మధ్యాహ్నం 12:07 వరకు.


సూర్యోదయం : 06:02

సూర్యాస్తమయం : 06:39


వర్జ్యం : సాయంత్రం 05:52 నుండి 07:31 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు.


అమృతఘడియలు : రాత్రి 03:44 నుండి 05:23 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

ఆగష్టు,14, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🪷 *బుధవారం*🪷

🌷 *ఆగష్టు,14, 2024*🌷

    *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి : నవమి* ఉ 10.23 వరకు ఉపరి *దశమి*

వారం:*బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : అనూరాధ* మ 12.13 వరకు ఉపరి *జ్యేష్ట*


*యోగం  : ఐంద్ర* సా 04.06 వరకు ఉపరి *వైధృతి*

*కరణం : కౌలువ* ఉ 10.23 *తైతుల* రా 10.31 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 08.00 - 11.00 సా 04.30 - 05.30*

అమృత కాలం :*రా 03.50-05.29 తె*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం : సా 05.58 - 07.37*

*దుర్ముహుర్తం  : ప 11.47 - 12.37*

*రాహు కాలం : మ 12.12 - 01.47*

గుళిక కాలం     : *మ 10.37 - 12.12*

యమ గండం   : *ఉ 07.20 - 09.02*

సూర్యరాశి : *కర్కాటకం*

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.51*

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల  :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.51 - 08.23*

సంగవ కాలం   :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.28*

అపరాహ్న కాలం :*మ 01.28 - 04.00*

*ఆబ్ధికం తిధి  : శ్రావణ శుద్ధ దశమి*

సాయంకాలం :  *సా 04.00 - 06.33*

ప్రదోష కాలం  :  *సా 06.33 - 08.48*

నిశీధి కాలం    :*రా 11.49 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

    

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🍃🌿🌷🌷🌿🍃🌹

గణిత జ్యోతిష్యము

 గణిత జ్యోతిష్యము


అనగనగా 'భాస్కరాచార్యుడు' అనే పేరు గల గణితశాస్త్రవేత్త ఉండేవాడు. 


నేడు మనం చదువుకునే గణితశాస్త్రాన్ని, అందునా విశేషించి బీజగణితాన్ని (ఆల్జీబ్రా) అందరికీ అర్థమయ్యే తీరులో ఎప్పుడో రాసినవాడు ఈ భాస్కరాచార్యుడే. 


ఈయన రాసిన లెక్కల గ్రంథం పేరు 'లీలావతీ గణితం'. సహజంగా గ్రంథ కర్తగా ఎవరుంటే వారిపేరునే ఆ గ్రంథానికి పెట్టడాన్ని మనం చూస్తాం. ఇక్కడ భాస్కరాచార్యుడు తన గణిత గ్రంథానికి, తన పేరుని కాక తన కూతురైన లీలావతి పేరుని పెట్టడం వెనుక ఒక విషాదాత్మక కథ ఉంది. వివరంగా చూద్దాం..


గణిత శాస్త్రంలో మహాపండితుడైన భాస్కరాచార్యుడు, జ్యోతిష శాస్త్రానిక్కూడా ప్రాణం వంటిదైన గణితం ద్వారా జ్యోతిషశాస్త్రాన్ని ఆపోశన పట్టడమే కాక-తనకు ఒక్కగానొక్క కూతురైన లీలావతి పుట్టిన సమయాన్ని బట్టి ఆమె జాతకాన్ని స్వయంగా పరిశీలించి- అవాక్కైపోయాడు. 


'తన కూతురికి వివాహమైన మర్నాడే విధవరాలయ్యే యోగం' జ్యోతిషం బట్టి సుస్పష్టంగా కన్పిస్తోంది. 


'ఎలా ఈ కష్టాన్ని దాటాలి' అని తీవ్రంగా ఆలోచించాడు భాస్కరుడు. పండితులందరితోనూ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి, ఏ ముహూర్తంలో పెళ్లిని చేస్తే లీలావతికి ఏవిధంగానూ వైధవ్యయోగం పట్టనే పట్టదో, అలాంటి ముహూర్తాన్ని నిర్ణయించి పెళ్లి చేసాడు కూడ. 


అయితే భాస్కరాచార్యుని పాండిత్యాన్ని సవాలు చేస్తూ పెళ్లి అయిన మర్నాడే ఆమె విధవరాలయింది. భాస్కరాచార్యునికి తీవ్ర మనస్తాపం కల్గింది.


తన పుత్రికా, తన విద్యాప్రతిభా రెండూ ఓడిపోవడంతో, భాస్కరాచార్యుడు మహానిరాశకు గురై, అసలు జ్యోతిషశాస్త్రమే ప్రమాణం కాదనే విధంగా కొత్త పుస్తకాన్ని వ్రాయ సంకల్పించాడు


ఇంతలో తోటి పండితులంతా వచ్చి భాస్కరా! అసలు శాస్త్రమే అబద్ధమై యుంటే శాస్త్రం ప్రకారమే నిర్ణయించిన వైధవ్యం కూడ అసత్యమే కావాల్సి ఉంది కాని వైధవ్యం వఱకూ సరిగా ఎందుకు జరిగింది, ఈ కారణంగా లీలావతి పెళ్లి, శాస్త్రం ప్రకారం సరైన సమయానికి జరిగి ఉండకపోవచ్చని మాకు అనిపిస్తోంది. అంతేకాదు, పెళ్లికి వాడిన ఇసుక గడియారంలో కూడ ఏదో లోపం ఉండవచ్చేమో నని ఏకగ్రీవంగా తీర్మానించారు.


సమయం ఇంతయిందని నిర్ణయించేందుకు వీలుగా ఆ రోజుల్లో ఇసుక గడియారాలుంటూండేవి. 


క్రింద సన్నని రంధ్రం ఉన్న పెద్ద గాజు పాత్రలో జల్లించిన ఇసుకని పోసేవారు. ఆ పాత్రకి క్రిందుగా మరో గాజుపాత్రని ఉంచేవారు. క్రింది పాత్రలోనికి, పైపాత్ర నుండి సన్నగా జారిపడిన ఇసుక ఎత్తుని బట్టి, కాలాన్ని ఘడియ విఘడియ, లిప్తలనే ఆనాటి తీరు కాలమానంలో గుర్తించేవారు.


కింద ఉన్న ఆ గాజుపాత్ర బయటివైపున ఈ విధంగా కాలాన్ని ఎవరైనాసరే గుర్తించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకమైన అడ్డగీతలుండేవి. ఈ ఇసుక గడియారం వద్ద తన కూతురి పెళ్లి రోజున సరిగా సమయాన్ని చెప్పవలసిందని గట్టిగా చెప్పి, తన మేనమామనే కూచోబెట్టాడు భాస్కరుడు.


         ఇసుకని సరిగా జల్లించని కారణంగా ఒక సందర్భంలో ఒక రేణువు పైపాత్ర రంధ్రానికి అడ్డుపడి ఇసుకని పడకుండా ఆపింది. రెండు మూడు నిమిషాల పిమ్మట ఈ విషయాన్ని గుర్తించిన తన మేనమామ, పైపాత్రని కదిపి సరిచేసాడు. అయితే ఈ సమయానికి ఇంతటి ప్రాధాన్యముందనే విషయాన్ని భాస్కరుడు ఎవరికీ వివరించి చెప్పలేదు. కనీసం ఈ మేనమామకి కూడా, దాని క్కారణం కూతురి వైధవ్యాన్ని గురించి ముందే చెప్తే, ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అది ఏవిధంగా పరిణమిస్తుందోనని చెప్పలేకపోయాడు. విషయమేమిటని మేనమామని గుచ్చిగుచ్చి ప్రశ్నించేసరికి ఇసుక గడియారం కొన్ని క్షణాలు ఆగిందన్న నిజాన్ని చెప్పనే చెప్పాడు.


భాస్కరాచార్యునికి ఒక పక్క తన శాస్త్రం నిజమైందేనని పరీక్షలో తేలినందుకు సంతోషమూ, మఱోపక్క తన కూతురి జీవితం బుగ్గిపాలయి నందుకు ఆపుకోలేని దుఃఖమూ ఒకేసారి కలిగాయి. 


ఆ కష్టంలో భాస్కరుడన్న మాట ఒకటే-

'కాల సర్వేశ్వరాధీన' ఎంతగా ప్రయత్నించినా ఎంత అడ్డుకున్నా పరమేశ్వరుని నిర్ణయానికి మార్పూ మఱో తీర్పూ లేదనీ కాలం ఆయనకి అనుగుణంగానే పనిచేస్తుందనీను.


అవశ్యం భావిభావానాం

ప్రతీకారో భవే ద్యది।

తదా దు:ఖైర్న సీదేయుః

నలరామ యుధిష్ఠిరా...


రాబోయే కష్టాలని తమ మానవ సహజమైన తెలివితేటలతో దాటాలని నలుడూ, రాముడూ, ధర్మరాజూ... ఇలా ఎవరూ ఏనాడూ ప్రయత్నించి ఉండలేదు. 


కారణం, విధి ప్రకారం అనుభవించాల్సిన యోగం ఉండగా, మానవ ప్రయత్నం ఎంత చేసినా ప్రయోజనం ఉండనే ఉండబోదని తెలిసి.


ఇలా ఆలోచించి తన దుఃఖాన్ని తీర్చుకొనేందుకూ, తన పుత్రికకి ఊరట కలిగేందుకూ భాస్కరాచార్యుడు తన శాస్త్ర పరిజ్ఞానాన్ని తన కూతురు లీలావతికి చెప్తూ ఆమె పేరిటే 'లీలావతి గణితమ' నే గ్రంథాన్ని వ్రాసి శాశ్వతుడయ్యాడు. 


కాబట్టి ఈ గ్రంథానికి పేరు పెట్టడం వెనక ఇంతటి బాధామయగాథ ఉందన్నమాట.


చాల శ్లోకాల చివరలో 'ఓ లీలావతీ ఈ లెక్కకి సమాధానమెంతో చెప్పు - లీలావతీ ! నీకు దీని సమాధానం తెలుసా? ఆలోచించు లీలావతీ ! ' అనే అర్థం వచ్చేలా,


‘లీలావతి! ప్రోచ్యతామ్! 

హే! లీలావతి! జ్ఞాయతే ?...'


అంటూ వ్రాసాడు. దీనిక్కారణం అమె బాధని తనదిగా అనుభవిస్తూ, అమెకి ఊరటని కలిగించదలచుకోవడమే.


నేటి కాలపు బీజగణితం, రేఖాగణితం (జ్యామెట్రీ) ట్రిగనామెట్రీ, మెన్సురేషన్లే కాక, ఘాతమూలం (Cube -root) కనుక్కొనే విధానాన్ని మొదటగా చెప్పినవాడు కూడ భాస్కరాచార్యుడే. అయితే నాటి కాలపు లెక్కల ద్వారా లెక్కలు మాత్రమే కాక, సాహిత్యపు మాధుర్యం కూడ విద్యార్థికి తెలుస్తుండేవి.


ఎంతైనా ఈ శాస్త్రాన్ని వ్రాసింది ఒక మహాకవి కదా!