26, జనవరి 2024, శుక్రవారం

26-01-2024 / శుక్రవారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*26-01-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు  తప్పవు.  కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

---------------------------------------

వృషభం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

మిధునం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

కర్కాటకం


వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో  పూర్తిచేస్తారు. ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

---------------------------------------

సింహం


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.  వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

---------------------------------------

తుల


ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన  ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు  విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన  మానసికంగా బాధిస్తుంది.

---------------------------------------

ధనస్సు


వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.

---------------------------------------

మకరం


వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. గృహనిర్మాణ   పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున  మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి  సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------

కుంభం


ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.

---------------------------------------

మీనం


ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

మఠం - మందుల షాపు

 మఠం - మందుల షాపు


చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పూల కొట్టు, పచారి కొట్టు, మందుల షాపు ఇలా చాలా దుకాణాలు ఉండి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇండియన్ బ్యాంకు వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక. వారు తమ అలోచనని మఠం అధికారులకు తెలిపి వారి అనుమతి తీసుకున్నారు.


మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకుని శాఖను ప్రారంభించవలిసి ఉంది. ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొకచోట వాటిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి. అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంకు వారు మఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు.


రెండు సంవత్సరాల తరువాత దంపతులొకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి, స్వామి వారితో “ఈరోజు మా పెళ్ళిరోజు. పరమాచార్య స్వామి వారు మమ్మల్ని దీవించాలి” అని ప్రార్థించారు.


మహస్వామి వారు వారిని గుర్తుపట్టి, “నువ్వు మందుల షాపు ముదలియార్ కదూ?” అని అడిగారు. 

”అవును పెరియవ”


“మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేశపడ్డాడు”

”అవును పెరియవ”


వారి బాగోగుల గురించి కనుక్కున్న తరువాత మహాస్వామి వారు ఇలా అడిగారు. “ఇప్పుడు షాపు ఎక్కడ పెట్టుకున్నావు?”


“షాపు ఇంకా ఎక్కడా పెట్టుకోలేదు పెరియవ. సరైన స్థలం కోసం చూస్తున్నాము” అని చెప్పారు.


మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి ”ఎందుకు? శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాలీ చేసిన తరువాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వలఏదా?” అని అడిగారు.


ముదలియార్ సణుగుతూ ”అది పెరియవ . . ”


ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారుకి అర్థం అయ్యింది. మఠం మేనేజరు గణేశ అయ్యర్ ని పిలిపించారు. మహాస్వామి వారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు. ”మనకు వీలున్నంతలో దదాపు అందరికి మరోచోట స్థలాలు ఇచ్చాము” అని చెప్పాడు


“కాని మెడికల్ షాపు ముదలియార్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. అతను ఇంకా షాపు పెట్టుకోలేదు అని చెప్తున్నాడు” అని అడిగారు స్వామి వారు.


గణేశ అయ్యర్ తడబడుతూ ”లేదు పెరియవ అతనితో అన్ని మాట్లాడి నిర్ణయించాము. . . .”


ఆ తరువాత రోజంతా మహాస్వామి వారు ఎవ్వరితోను మాట్లాడలేదు. తీవ్రమైన చింతలో ఉన్నట్టు కనిపించారు. మందుల షాపు ముదలియారుకు వేరోకచోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది. ఇలా చేయ్యడం ఇచ్చిన మాటను అతిక్రమించడమే. అది అసత్య దోషం. వారు చివరగా తీసుకున్న నిర్ణయం అందరికి చెప్పారు. వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చెసింది.


ముదలియార్ ఇంటి చిరునామా తీసుకుని అతణ్ణి అప్పుడే పంపించివేసారు. తరువాత వారు మేనేజరుని పిలిచి విచారించారు. శ్రీమఠం వెనకాతల రోడ్డు పక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది. మఠం కాంపౌండు గోడని కూల్చితే ముదలియార్ పాత షాపు కంటే మూడింతలు పెద్ద స్థలం లభిస్తుంది. సాయిత్రం లోపల ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఒక ఇంజనీయరుకు అక్కడ దుకాణం కట్టవలసిందని అనుజ్ఞ ఇచ్చారు.


మూడునెలలో చక్కగా దుకాణాన్ని నిర్మించారు. ముదలియార్ అక్కడ తన మందుల షాపుని పెట్టుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు.


పరమాచార్య స్వామి వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసిందే. ఈ సంఘటన తరువాత మహాస్వామి వారి అనుగ్రహాన్ని తనకు కలిగిన అదృష్టాన్ని తలచుకొని ముదలియార్ చాలా సంతోషపడ్డాడు.


--- రా. వెంకటస్వామి, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

పంచాంగం 26.01.2024

 ఈ రోజు పంచాంగం 26.01.2024

Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: ప్రతిపత్తి తిధి భృగు వాసర: పుష్యమీ నక్షత్రం ప్రీతి యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి రాత్రి 01:20 వరకు.

పుష్యమి పగలు 10:29 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:04


వర్జ్యం : రాత్రి 12:38 నుండి 02:25 వరకు.


దుర్ముహూర్తం : పగలు 09:07 నుండి 09:52 వరకు తిరిగి మధ్యాహ్నం 12:51 నుండి 01:36 వరకు.


అమృత ఘడియలు : ఈ రోజు లేదు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

పంచాంగం

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.26.01.2024 

శుక్ర వారం (భృగు వాసరే)

 **********


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భృగు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు*

*శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే(*

హేమంతృతౌ పౌష్య మాసే  కృష్ణ పక్షే

*ప్రతి పత్తిథౌ*

*భృగు వాసరే అని చెప్పుకోవాలి*.


*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.38

సూ.అ.5.48

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు*

*పుష్య మాసం* 

*కృష్ణ పక్షం పాడ్యమి రా.12.04 వరకు.*

*శుక్ర వారం*. 

*నక్షత్రం పుష్యమి ఉ.9.57 వరకు*. 

అమృతం లేదు. 

దుర్ముహూర్తం ఉ. 8.52 ల 9.37 వరకు.

దుర్ముహూర్తం ప.12.35 ల 1.20 వరకు. 

వర్జ్యం రా.11.55 ల 1.40 వరకు. 

యోగం ప్రీతి ఉ.7.37 వరకు. 

కరణం బాలవ ప.11.19 వరకు.   

కరణం కౌలవ రా.12.04 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

గుళిక కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

యమగండ కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ పాడ్యమి. 

*********************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.