14, ఆగస్టు 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *14.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

* పద్యం: 2230(౨౨౩౦)*


*10.1-1334-*


*మ. జవసత్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ*

*ప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే?*

*పవివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో?*

*నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా!* 🌺



*_భావము: చాణూరుడు శ్రీకృష్ణుని అవహేళన చేస్తూ, ఇంకా రెచ్చగొడుతున్నాడు: "శరీరం లో వేగం, బలము బాగా ఉన్నాయా? సాము గీము చేస్తున్నావా? ఒళ్ళు గట్టిపడిందా? రాజుతో మిమ్మల్ని బ్రతికిపోనీయమని సిఫారసు చెయ్యాలా? మల్లవిద్యలో మెలకువలు చూస్తావా? ఇష్టమేనా? వెన్నముద్ద తినటం కాదు నా పిడికిటి పోటంటే ఏమనుకున్నావో? ఇది పిడుగుపాటువంటిది, యమదండాన్ని పోలినది, ముక్కంటినుండి వెడలిన అగ్నిజ్వాల వంటిది. జాగ్రత్త!!"_* 🙏

 


*_Meaning: In derisive language, Chanura continues to taunt and provoke Sri Krishna contemptuously: ”Is your body equipped with agility, power and speed? Are you practising wrestling bouts daily or else I can appeal to my king to pardon you? Are you interested in seeing the typical techniques in boxing from me? Beware! Receiving blows from my lightning-like clenched fist is not like eating butter and curd. This is similar to the stroke of Yama and the flame emanated from the third eye of ParamaSiva.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

మంత్రపుష్పము

 

ధాతా పురస్త్యాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః

తమేవ నమృతం ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే

ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభువం

విశ్వం నారాయణ దేవమక్షరం పరమం పదం

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం

విశ్వమే వేదం పురుష తద్విశ్వ ముపజీవతి 

పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ం శాశ్వతుగ్ం శివమచ్యుతం

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః 

నారాయణ పరంబ్రహ్మ తత్వం నారాయణ పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః

యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా 

అంతర్బహిశ్చ  తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః

అనంత మవ్యయం కవిగ్ం సముద్రేంతం విశ్వశంభువం

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం

అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి 

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్

సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం

తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం 

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః 

సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాశిఖాయామధ్యే  పరమాత్మా వ్యవస్థితః    

 బ్రహ్మ  శివః  హరిః సేంద్రఃసోక్షరః పరమస్వరాట్

ఓం యోపాం పుష్పం వేద 

పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

చంద్రమావా అపాం పుష్పం 

పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

 ఏవం వేద  యో‌పామాయతనం వేద 

ఆయతన వాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం   

ఆయతన వాన్ భవతి యోగ్నేరాయతనం వేద 

ఆయతన వాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం  

ఆయతన వాన్ భవతి  ఏవం వేద  

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

వాయుర్వా అపామాయతనం   ఆయతన వాన్ భవతి

యో వాయోరాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపోవై వాయోరాయతనం ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి 

ఆసౌ వై తపన్నపామా యతనం ఆయతన వాన్ భవతి  

యో ముష్యతపత ఆయతనం వేద ఆయతన వాన్ భవతి  

ఆపోవా అముష్యతపత ఆయతనం 

ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

చంద్రమావా అపామాయతనం ఆయతన వాన్ భవతి

యః చంద్రమస ఆయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపోవై చంద్రమస ఆయతనం 

ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

నక్షత్రాణివా అపామాయతనం ఆయతన వాన్ భవతి 

యో నక్షత్రాణామాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపో వై నక్షత్రాణామాయతనం 

ఆయతన వాన్ భవతి య ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

పర్జన్యోవా అపామాయతనం ఆయతన వాన్ భవతి 

యః పర్జన్యస్యాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపోవై పర్జన్యస్యాஉஉయతనం 

ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

సంవత్సరోవా అపామాయతనం ఆయతన వాన్ భవతి  

యఃసంవత్సరస్యాయతనం వేద ఆయతన వాన్ భవతి 

ఆపోవైసంవత్సరస్యాయతనం ఆయతన వాన్ భవతి  ఏవం వేద  

యోప్సునావం ప్రతిష్ఠితాం వేద  ప్రత్యేవ తిష్ఠతి

ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే 

నమో వయం వై శ్రవణాయకుర్మహే

సమే కామాన్ కామకామా యమహ్యం  

కామేశ్వరో వై శ్రవణో దదాతు

కుబేరాయ వై  శ్రవణాయ  

మహారాజాయ  నమః 

ఓం తద్బ్రహ్మ ఓం తత్సర్వం  ఓం తదాత్మా

ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం   ఓం తత్ పురోర్నమః 

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు 

త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ మింద్రస్త్వగ్ం

రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః

త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం  బ్రహ్మ 

భూర్భువస్సువరోం

ఈశానస్సర్వ విద్యానా మీశ్వర స్సర్వ భూతానాం  

బ్రహ్మాధిపతిర్  బ్రహ్మణోధిపతిర్  

బ్రహ్మా శివోం మే అస్తు సదా శివోం

 

మంత్రపుష్పం యజుర్వేదములోని తైత్తరీయ అరణ్యకం లోనిది.

ధాతా పురస్త్యాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః

తమేవ నమృతం ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే

ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభువం

విశ్వం నారాయణ దేవమక్షరం పరమం పదం

పుష్ప అనగా మనస్సు. అది పువ్వులాగా వికసితము చెంది ఫలము అయినట్లుగాపరిణితి చెందని మనస్సు  పరిణితి చెంది బ్రహ్మ స్థితికి చేరుకోవాలని తెలుపుతుంది మంత్రపుష్పం. అది మంత్రముద్వారా సాద్యము. మననాత్ త్రాయతే మంత్రః . మననము చేసినకొద్దీ మనలను రక్షిస్తుంది.

మంత్రపుష్పము రెండు భాగాలు. అందులో పూర్వార్ధము మొదటిది. ఇది సహస్రాశీర్షాతో ప్రారంభము అయ్యిసముద్రేంతం విశ్వసంభవంతో ముగుస్తుంది. దీనిలో మన లక్ష్యము ఏమిటో సూచిస్తుంది.

రెండవది ఉత్తరార్థము. పద్మకోశ ప్రతీకాశతో ప్రారంభము అయ్యి, ముగింపువరకు ఉంటుంది.  దీనిలో ఆ లక్ష్యము చేరుటకు చేయవలసిన సాధనా ప్రక్రియను సూచిస్తుంది.

చైతన్య ప్రకాశము అనేది నిర్గుణము.  ఆ నిర్గుణ చైతన్యమునుండే వేయి తలలు అనగా అనంతమయిన తలలునేత్రములు వ్యక్తీకరించినవి.  అనగా మనకున్న ప్రతి అంగముకణము ఆయన చైతన్య స్వరూపమే. మనమంటూ వేరే ఏమీ లేదు. ఆయనే మనముమనమే ఆయన. ఇది తెలుసుకుంటే అంతా ఆనందమేపరమానందమే. పిపీలికాది పర్యంతము చీమనుండి  బ్రహ్మవరకు ఉన్న చరాచర ప్రపంచము అంతా ఆయనేఆయన చైతన్యమే. మనము కేవలము అభాస చైతన్యము.

నారము అనగా పంచభూతములు. ఈ ప్రపంచము అనగా పంచకోశములుపంచభూతములుపంచప్రాణములుపంచతన్మాత్రలుపంచ జ్ఞానేంద్రియములుపంచ కర్మేంద్రియములు,  వగైరా లన్నిటికీ ఆశ్రయము ఒకే తత్వము. అదే అంతా వ్యాపించియున్న నారాయణ తత్వమే. ఆత్మలోనూఈ జగత్తులోనూ ఉన్నది ఒకే తత్వము అదే పరమాత్మ తత్వము.

 ఆ పరమాత్మ చేతనే అక్షరం. నామరూపమయిన ఈ జగత్తు అపరం అనగా పరిమితమయినదిఆ పరమాత్మ చైతన్యము పరం అనగా అత్యంత శ్రేష్టమయినది.  రూపరహితమయిన చైతన్యస్వరూపము తనలోని మాయా శక్తిద్వారా రూపమునామము ద్వారా వ్యక్తీకరించుస్తున్నాడు .

 

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం

విశ్వమే వేదం పురుష తద్విశ్వ ముపజీవతి 

పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ం శాశ్వతుగ్ం శివమచ్యుతం

పరమాత్మలో భాగమయిన ఈ మాయయొక్క  ఉదయములు(raisings) మరియు సాయంత్రములు (settings)  వ్యక్తీకరించని పరమాత్మను తాకలేవు. సముద్రము కదలదు. దాని అలలుబుడగలునురగ కదులుతాయి. అలాగే కదిలే ఈ మాయ అనిత్యముపరమాత్మ నిత్యము.  

పరమాత్మే పరిపూర్ణుడు. ఈ మాయా ప్రపంచమునకు ఆ పరిపూర్ణచైతన్యమే ఆధారము.  ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా సృష్టించడమే మాయా లక్షణం. ఆకాశము వాస్తవానికి నీలము కాదుకాని నీలముగా కనిపించటమే దీనికి తార్కాణము.  

ఈ మాయాజగత్తు పశువుఅనగా ఒక పాశముతో బంధించబడినది. పరమాత్మే దీనికి పతి.  ప్రాణిజగత్తుపాశముతో బంధించబడిన పశువు. నామ రూపములే అనగా ఆశలు మరియు ఆకారములు ఆ పాశము.  శుద్ధ చైతన్యము అనగా ఆత్మ ఒక్కటే బంధించబడనిది. మనో బుద్ధి చిత్త అహంకారములు అనే జీవభావము  ఉన్నంతవరకు ఈ ఆత్మ అశుద్దాత్మే. క్రియాయోగ సాధనతో జీవభావము పోగొట్టుకొని పరిపూర్ణ ఈశ్వరభావములోకి వచ్చేటంతవరకూ మాయలో కూరుకు పోతుంది. నేను నిత్యుడిని అనే ఈశ్వర భావమునే శివం అంటారు. దేనికీ తగులము లేక పోవుటను అచ్యుతం అంటారు.  ఉన్నది ఒకే ఆత్మ. దానిని విశ్వాత్మ అంటారు. జీవాత్మ అనేది ఆభాసము.

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం

మహాజ్ఞేయం అనగా అన్నిటికంటే ముందుగా తెలిసుకోవలసినది. జ్ఞానము అనగా సద్బుద్ధి. క్రియాయోగ సాధనలో మన చేతనను విశ్వచేతనతో కలిపితే వచ్చేది పరాయణం అనగా అనంతచేతనము.  దానికి దేశము, కాలమువస్తువు అనే ఎల్లలు ఉండవు.   

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః 

నారాయణ పరంబ్రహ్మ తత్వం నారాయణ పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః

ఉన్నది ఒకే పరమాత్మఒకే పరమాత్మ చైతన్యజ్యోతి. అదే అనేకరకములుగా వ్యక్తమవుతున్నట్లుగా అగుపిస్తున్నది. నిజానికి జీవుడు, జగత్తుఈశ్వరుడు వేరుకాదు. జీవుడుజగత్తుఈశ్వరుడుస్వయం ప్రకాశకులుగాదు. అంతా ఆ నారాయణ ప్రకాశమే.  అదే బ్రహ్మము. నారాయణతత్వమే అత్యంత శ్రేష్ఠమయినది. అందువలన ధ్యాత నారాయణుడే,  ధ్యేయము నారాయణుడేమరియు ధ్యానం నారాయణుడే,. మూడూ  ఒక్కటిగా అవ్వాలి.  

యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా 

అంతర్బహిశ్చ  తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః

అనంత మవ్యయం కవిగ్ం సముద్రేంతం విశ్వ శంభువం

ఈ కనబడుతున్న లేదా వినబడుతున్న జగత్తు అంతా లోపల బయటా ఆ పరమాత్మే అనగా ఆయన చైతన్యమే వ్యాపించిఉన్నది.

ఆ చైతన్యము అనంతము నిత్యమయినది. అనగా దేశాతీతముకాలాతీతము. ఈ జగత్తును రచియించిన ఆ నారాయణుడు ఆయనే మహా కవి. అన్ని చేతనలు ఆయనతో సమాప్తమవుతాయి. ఈ సముద్రములాంటి సంసారములో మునిగినవాడికి సుఖము శాంతి లేవు.

ఉత్తరార్ధం :

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం

అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి 

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్

సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం

పురుష సూక్తం అవరోహణ మార్గము. ఈ జగత్తు ఎలా ఏర్పడినది మనము ప్రస్తుతము ఉన్న స్థితికి ఎలా వచ్చాము అనే దానిమీద చర్చ. అనగా మన ఇల్లు పరమాత్మ.

ఈ మంత్రం పుష్పం ఆరోహణ మార్గము.  ఇప్పుడు ఉన్న స్థితినుండి మనిల్లు అనగా పరమాత్మలోనికి ఎలా చేరుకోవాలిమన ఆత్మ స్వరూపమునకు చేరుకునే సాధనా మార్గమును సూచిస్తుంది. దీనిలో శరీరముతో మొదలవుతుంది. తరువాతది హృదయము అనగా బుద్ధి. దానిలో ఒక భాగము వృత్తి అనగా ఆలోచన(లు). ఆ వృత్తి కేవలము శుద్ధ జ్ఞానము మీదనే ఉండవలయును. హృదయము(శతం చైక హృదయశ్య నాడ్యః--ఉపనిషద్) నుండి 101 నాడులు కలిసే చోటు. అది బుద్ధికి ఆసనము. ఒకటి మూర్ధాన మభి నిశ్రిత అనగా ఒకటి పుర్రెలోకినెత్తురు పంపుతుంది. అప్పుడు బుద్ధి ఆలోచనా తరంగములను పుట్టిస్తుంది. ఆలోచనారహితమైన పుర్రె శరీరమును భరించలేదు. అందువలననే  హృదయము మనస్సు రెండూ ఒక్కటే.

హృదయము తామర మొగ్గ మాదిరి మెడ క్రింద నాభికి పైన ఎడమవయిపు తలక్రిందులుగా గుప్పెడు పరిమాణములో ఉంటుంది. నిష్టి అనగా దానిని వ్రేళ్ళతో తడిపి feel అవ్వవచ్చు. ప్రపంచము మొత్తమునకు ఈ మనసే ఆధారము.  అట్లే దూరముగా కనబడుతున్న ప్రకాశవంతమయిన సూర్యగోళము ఈ భూ ప్రపంచమునకు, సౌరకుటుంబమునకు హృదయము. అది ఈ భౌతిక ప్రపంచమునకు ప్రకాశమునకు ఆ సూర్యగోళమే ఆధారము. అదే విధముగా ఈ శరీరమునకు ఈ హృదయమే ఆయతనం అనగా ఆధారము. 

సూర్యుడు తన ప్రకాశముతోచుట్టబడియున్నట్లేమానవ హృదయము నాడీ చక్రముతో చుట్టబడియున్నది. వ్యష్టిలో హృదయముసమిష్టిలో సూర్యుడు ముఖ్యులు.

తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం 

హృదయ మాధ్యమములో ఒక సూక్ష్మమయిన రంధ్రము ఉన్నది. దానినే హృదయాకాశము లేక దహరాకాశము అందురు. ఈ శరీరములో మన కంటికి కనబడని 72 వేల సూక్ష్మనాడులు ఉన్నవి.  బయట కనబడుతున్న ఆకాశము ఎంత అంతుచిక్కనిదోఅంతే అంతుచిక్కనిది ఈ దహరాకాశము. ఘటములో ఉన్న ఆకాశమును ఘటాకాశము అందురు. ఆ హృదయ దహరాకాశములోనే చరాచర ప్రపంచము అంతయు ఇమిడి యున్నది.  ఈ స్వయంప్రకాశితమైన దహరాకాశములోనే చిదాకాశము ఇమిడి యున్నది. అది జ్ఞాన స్వరూపము.  

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః 

హృదయ రంధ్రము అనంతమయిన అగ్ని. అగ్ని కి వెలుగు మరియు వేడి రెండూ ఉండును. ఆ అగ్ని విశ్వార్చి అనగా మంటల నాలుకలు గలది. అది విశ్వతోముఖం అనగా ఆ మంటలు అన్ని దిక్కులా వ్యాపించును. హృదయము ఒక అగ్ని గుండము. అది తనలోని రక్తమును నాడులద్వార అన్ని దిక్కులకు ప్రసారము చేయును. ఆ రక్తము వేడిగాయుండును. ఈ అగ్ని మూడు రకములు. అవి: 1) ఆహవనీయ2) దక్షిణాగ్నిమరియు 3)గార్హపత్య.  ఈ ఆహవనీయ అగ్ని ఆధ్యాత్మిక వెలుగును మన ముఖములో పొడసూపును. ఆహవనీయ అగ్ని మనము తిన్న ఆహారమును భగవంతుని ప్రసాదముగా ఆరగించును. ముఖములో పొడసూపు అగ్ని లేక ముఖాగ్ని అప్పుడు ముందుకువెళ్ళి ఉదరములో జమకూడుతుంది. అక్కడ జీర్ణమగుతుంది. అప్పుడు రసముగా మారి రక్తములో చేరి తిరిగి హృదయము చేరును. ఆ పొట్టలోని అరుగుదలకు సహాయపడు ఆ వేడిని గార్హపత్య అగ్ని అందురు. ఈ గార్హపత్య అగ్ని శరీరమును క్షీణత మరియు క్షయంనుండి కాపాడును.   అరిగిరసము రక్తములోజేరి హృదయమును చేరుకున్న తదుపరి వ్యక్తీకరించిన అగ్నిని దక్షిణాగ్ని అంటారు. హృదయములోని నాలుగు కవాటములలో దక్షిణము వయిపు ఉన్న దానిలో ప్రథమముగా కనిపించిన ఈ రక్తమును దక్షిణాగ్ని అంటారు. అప్పుడు అది ప్రాణశక్తిగా మారును.

సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

ముఖ్యమయిన స్థానములో ఉండుట వలన హృదయము సోగ్రభుక్. అటు పిమ్మట ఆహవనీయం.  తత్తదుపరి రసమును రక్తములో కలుపును. అప్పుడు అది దక్షిణాగ్ని.  ఈ విధముగా అరుగుదల జరుగును. అప్పుడు అదితిష్ఠన్. ఈ విధముగా అరిగే రసమును పద్ధతిని గార్హాపత్యము అందురు.  ఈ ఆహారమునకు అజరం అనగా క్షీణము క్షయము ఉండదు.  ఆ చైతన్యమే  ద్రష్ట అయిన కవి.

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

నాడులు వాటి సంతతులు ఈ హృదయమునుండి అన్నివైపులకు వెళ్తాయి. శరీరమునకు తాపము అనగా వేడి కలగచేయును.

తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

  

ఆ నాడుల మధ్యనుండి హృదయాగ్ని అనగా వహ్నిశిఖ అనగా అగ్నిజ్వాల ఉద్భవిస్తుంది.  ఆ అగ్నిజ్వాలను మోసుకెళ్ళే రక్త వాహిక అనీయము. అనగా అత్యంత సూక్ష్మము. అణువు కంటే సూక్ష్మము. అది సీదాగా కపాలములోకి   ఊర్ధ్వా వ్యవస్థితః అనగా దారితీయును. ఇది ఆధ్యాత్మికముగా సుషుమ్నానాడికి కలిపి ఉండును. ఈ  సుషుమ్న ఎడమ వైపు ఇడాకుడి వైపు పింగళ నాడులతో కూడియుండును.

నీలిమబ్బులలో మెరిసే విద్యుత్ లాగా ఉంటుంది ఈ సుషుమ్నా నాడి.  ఆ విద్యుత్ నీవారి (wild rice seed) ముల్లు మాదిరి అణూపమా అనగా  అత్యంత సూక్ష్మముగా పీతా భాస్వత్య అనగా సువర్ణపు రంగులో ఉండును.

తస్యః శిఖాయామధ్యే  పరమాత్మా వ్యవస్థితః    

స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాట్

దాని శిఖమధ్యమములో నిరాకార నిర్గుణ పరమాత్మ అనగా శుద్ధ జ్ఞాన చైతన్యము ఉంటుంది.  

ఆయనే బ్రహ్మఆయనే శివుడుఆయనే విష్ణువుఆయనే ఇంద్రుడుఆయనే అవినాశిఆయన తిరుగులేని అత్యంత శ్రేష్ఠుడు.  

ఓం యోపాం పుష్పం వేద 

పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

 

పుష్పాలయొక్క సత్యాన్ని గ్రహించండి.  పుష్పాల ప్రజల పశువుల అధి నాయకుడవు కమ్ము. అనగా జ్ఞానోదయం పొందు.

చంద్రమావా అపాం పుష్పం 

పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

 ఏవం వేద  యో‌పామాయతనం వేద 

ఆయతన వాన్ భవతి

 

చంద్రుడే నీరు పుష్పాలకు.  పుష్పాల ప్రజల పశువుల అధి నాయకుడవు కమ్ము. అనగా జ్ఞానోదయం పొందు. ఇదే సత్యం.నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

అగ్నిర్వా అపామాయతనం   

ఆయతన వాన్ భవతి యోగ్నేరాయతనం వేద 

ఆయతన వాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం  

ఆయతన వాన్ భవతి  ఏవం వేద  

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

 

అగ్నికి నీరు నివాసము. అంతర్వాసివి కమ్ము.   అంతర్వాసివి కమ్ము.

నీటికి అగ్ని నివాసము. అంతర్వాసివి కమ్ము. ఇదే సత్యం. నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

వాయుర్వా అపామాయతనం   ఆయతన వాన్ భవతి

యో వాయోరాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపోవై వాయోరాయతనం ఆయతన వాన్ భవతి  ఏవం వేద  యో

‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి 

వాయువుకు నీరే నివాసము. అంతర్వాసివి కమ్ము.  నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

నీటికి వాయువే నివాసము. అంతర్వాసివి కమ్ము. ఇదే సత్యం. నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

ఆసౌ వై తపన్నపామా యతనం ఆయతన వాన్ భవతి  

యో ముష్యతపత ఆయతనం వేద ఆయతన వాన్ భవతి  

ఆపోవా అముష్యతపత ఆయతనం 

ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

సూర్యుడికి నీరే నివాసము. అంతర్వాసివి కమ్ము.  నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

నీటికి సూర్యుడే నివాసము. అంతర్వాసివి కమ్ము. ఇదే సత్యం. నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

చంద్రమావా అపామాయతనం ఆయతన వాన్ భవతి

యః చంద్రమస ఆయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపోవై చంద్రమస ఆయతనం 

ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

 

చంద్రుడికి నీరు నివాసము. అంతర్వాసివి కమ్ము.  నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

నీటికి చంద్రుడే నివాసము. అంతర్వాసివి కమ్ము.  నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

నక్షత్రాణివా అపామాయతనం ఆయతన వాన్ భవతి 

యో నక్షత్రాణామాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపో వై నక్షత్రాణామాయతనం 

ఆయతన వాన్ భవతి య ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

 

నక్షత్రాలకి నీరు నివాసము. అంతర్వాసివి కమ్ము.  నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

నీరే నక్షత్రాలకి నివాసము. అంతర్వాసివి కమ్ము. నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

పర్జన్యోవా అపామాయతనం ఆయతన వాన్ భవతి 

యః పర్జన్యస్యాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆపోవై పర్జన్యస్యాஉஉయతనం 

ఆయతన వాన్ భవతి  ఏవం వేద 

యో‌పామాయతనం వేద ఆయతన వాన్ భవతి

 

మేఘాలకి నీరు నివాసము. అంతర్వాసివి కమ్ము. నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

నీటికి మేఘాలు నివాసము. అంతర్వాసివి కమ్ము.   నీ అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. అంతర్వాసివి కమ్ము.

సంవత్సరోవా అపామాయతనం ఆయతన వాన్ భవతి  

యఃసంవత్సరస్యాయతనం వేద ఆయతన వాన్ భవతి 

ఆపోవైసంవత్సరస్యాయతనం ఆయతన వాన్ భవతి  ఏవం వేద  

యోప్సునావం ప్రతిష్ఠితాం వేద  ప్రత్యేవ తిష్ఠతి

ఈ సత్యాన్ని ప్రతి ఉదయము వినండి.

ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే 

నమో వయం వై శ్రవణాయకుర్మహే

సమే కామాన్ కామకామా యమహ్యం  

కామేశ్వరో వై శ్రవణో దదాతు

కుబేరాయ వై  శ్రవణాయ  

మహారాజాయ  నమః 

రాజాధిరాజా మీకు వందనములు. ఉత్తర దిక్పాలకుడు వైశ్రవునకు అనగా శివునకు వందనములు. నాకోరికలను అనుగ్రహించు. ఇచ్ఛాధిపతీఉత్తర దిక్పాలకాఅనుగ్రహించు.

కుబేరావైశ్రవామహారాజా మీకు వందనములు.

ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం   ఓం తత్ పురోర్నమః 

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు 

త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ మింద్రస్త్వగ్ం

రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః

త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం  బ్రహ్మ 

భూర్భువస్సువరోం

 

ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ పురోర్నమః 

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు 

త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ మింద్రస్త్వగ్ మ్

రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః

త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం  బ్రహ్మ భూర్భువస్సువరోం

ఆపరబ్రహ్మయే  సర్వముఅందరి హృదయములలోను నివసించేది ఆ పరమాత్మయే.

ప్రాణులన్నిటిలోనూ అన్నిమూర్తులలోను ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే.

నిరుపాధికమయిన నీవే యజ్ఞమునిన్ను నీవే సమర్పించుకోవాలి. నెయ్యిని హవిస్ గా ఆరగించే ఇంద్రుడవు నీవే. బ్రహ్మ, విష్ణుమరియు మహేశ్వరుడు మూడూ ఒక్కడయిన నీవే.   నీవే ఈ చరాచర ప్రపంచమునకు ప్రజాపతి అని సంకల్పించుకో. ఆ తత్వములో లయమవ్వు.  నీవే భూమినీరునిప్పుగాలిమరియు ఆకాశము అనే పంచ భూతములు.  నీవే నిర్గుణుడవు. నీవే సగుణుడవు.

ఈశానస్సర్వ విద్యానామీ శ్వర స్సర్వ భూతానం  

బ్రహ్మాధిపతిర్  బ్రహ్మణోధిపతిర్  బ్రహ్మా శివోం మే అస్తు సదా శివోం

పరమాత్మయే అన్ని విద్యలకు యజమాని.  ఆ పరమాత్మయే ప్రాణులందరికీ యజమాని. శాస్త్రములకుఆఖరికీ ఆ బ్రహ్మకీ యజమాని ఆ పరమాత్మయే. బ్రహ్మను నేనే. శివుడిని నేనే. మనలోమనము మమేకమవుతే మనము నిత్య మంగళ శివ స్వరూపమవుతాను. 

పూర్తి పాఠం కోసం