21, జులై 2022, గురువారం

అదృష్టవంతుడు

 అదృష్టవంతుడు 

ఎప్పుడు ఉషారుగా వుండే రామారావు ఎందుకో రోజు మూడీగా వున్నాడు.  ఎందుకా అని నేను వెళ్లి ఏమిటి రామారావు రోజు నీవు ఏదో కోల్పోయినట్లుగా ఏమిటి అట్లా వున్నావు అన్నాను.  ఏమి చెప్పమంటావురా సుబ్బారావు నా భార్య ఆగడాలు రోజురోజుకి ఎక్కువైతున్నాయి.  రోజు కొట్టినంత పనిచేసింది (నిజానికి కొట్టింది ఆలా చెపితే బాగుండదని) అందుకే దిగులుగా కూర్చున్నాను.  రోజు క్షణక్షణం ఈశ్వరుని వేడుకొంటున్నాను నా భార్యకు మంచి బుద్దిని ప్రసాదించమని.  కానీ నా కర్మ ఇలా  కాళింది. అదే మా యింటిప్రక్క వెంకటేశ్వర రావు భార్య ఆయనను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళు తరచుగా సినిమాలకు షికార్లకు రయ్యి మని వెళుతుంటే నాకు కడుపులో దేవినట్లవుతుంది అదుష్టవంతుడు అంటే వాడురా అని అని కళ్లనీళ్లు తుడుచుకున్నాడు.  నాకు ఒక నిమిషం మాటలు రాలేదు.  యెంత మంచివాడు రామారావు ఆఫీసులో ఎవరికి సమస్య వచ్చిన యిట్టె పరిష్కరించే రామారావేనా నేను చూస్తున్నది అని అనుకున్నాను

రామారావు కొంత తమాయించుకున్న తరువాత చూడు రామారావు నిజానికి అదృష్టవంతుడు మీ ఇంటిప్రక్క వెంకటేశ్వర రావు కాదు  నీవే. వెంకటేశ్వర రావే దురదృష్టవంతుడు. అని నేను అనేసరికి ఏరా నన్ను యెగతాళి చేస్తున్నావా అని నవ్వుతు నన్ను చిన్నగా కొట్టాడు

చూడు రామారావు నేను నీ నోటితోటె నీవు అదృష్టవంతుడివి అని చెప్పేస్తాను.  ఇప్పుడు చెప్పు ఇందాక నీవు నాతొ ఏమన్నావు అన్నాను.  ఏమన్నాను నా భార్య ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అన్నాను అని అన్నాడు.  తరువాత ఏమన్నావు చెప్పు అన్నాను.  ఏమన్నాను నేను ప్రతి క్షణం ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అన్నాను.  అదే నేనంటున్నాను. నీకు ఈశ్వరుని అనుగ్రహం వున్నది కాబట్టే నీవు అనుక్షణం ఈశ్వరుణ్ణి తలుస్తున్నావు. అన్నాను. ఎన్నో జన్మలను ఎత్తినతరువాత మనకు భగవంతుడు ఇచ్చిన  అపూర్వ వరం లాంటిది    మానవ జన్మ జన్మలోనే మనం భగవంతుడి సన్నిధానం అంటే మోక్షాన్ని పొందగలం.  భగవంతుడు సాధకునికి అనేక అవాంతరాలను కలుగ చేస్తాడు.  అటువంటి అవాంతరమే నీకు వున్న పరిస్థితి అని ఎందుకు అనుకోవు.  ఒక్కసారి బాహ్య ప్రపంచంచుడు ఎంతమంది ఎన్నిరకాలుగా కస్టాలు, బాధలు అనుభవిస్తున్నారో.  కొందరికి కళ్ళు లేక అంథులుగా వుంటున్నారు, కాళ్ళు లేక, చేతులు లేక అనేకవిధాల నివారణ కానీ, లేని వ్యాధులతో భాదపడుతున్నారు.  కొంతమందికి తినటానికి తిండి, కట్టుకోటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు లేక ప్లేటుపారాలమీద, పెద్ద పెద్ద నీళ్ల పైపులలోన, చెట్లకింద జీవనం గడుపుతున్నారు వారిని చూసావా.  ఒక్కసారి ఆలోచించు నీకు వున్న కష్టం వారిముందు ఏపాటిది.  నిజానికి నీ భార్య గయ్యాలే అవవచ్చు నీకు చక్కగా భోజనం వండి పెడుతున్నది, పిల్లలను చక్కగా చేసుకుంటున్నది. ఇంకా ఏమికావాలి.  మనం ఒక్క సత్యాన్ని ఎప్పుడు మారుస్తాం అదేమిటంటే ప్రపంచంలో ఒక మనిషి మనస్తత్వాన్ని పోలిన మనిషి ఇంకొకడు ఉండదు.  కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులను బట్టి సర్దుకొని పోవటమే. మనిషి పరిస్థితులను అర్ధంచేసుకుని నడుచుకుంటాడో వాడికి ఎప్పుడు సంతోషమే ఉంటుంది.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహం నాస్తి, నాస్తి జగరతో భయమ్

కష్టపడే వారికి దారిద్ర్యం ఉండదు, జపం చేసే వారికి పాతకం ఉండదు అలాగే నిశబ్ధంగా ఉండేవారికి పోట్లాటలు వుండవు, జాగర్తగా వుండే వారికి భయం ఉండదు.  కాబట్టి మిత్రమా నీవు అనవసరమైన జగడాలకు వేళ్ళకు, సాధ్యమైనంత వరకు నిశబ్ధంగా వుండు.  కొన్ని మాటలు విన్న వినునట్లు వుండు మితంగా మాట్లాడు. తప్పకుండా నీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు  సుబ్బారావు. దానితో రామారావుకు కొత్త శక్తి వచ్చినట్లైయిన్ది.  తన డ్రాలో వున్నా భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చి నీకు సందేహం, అశాంతి, భయం కలిగిన గీత చదువు నీకు పూర్తి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంగా రామారావు ఇంటికి వెళ్ళాడు. ఆలా మూడు నాలుగు రోజులు గడిచాయి.  ఎవరి పనులల్లో వాళ్ళు వున్నారు.  సుబ్బారావు రామారావుతో క్యాజువల్గా గడిపాడు.  నాలుగవ రోజు సుబ్బారావు ప్రొద్దున్నే ఆఫీసుకు వచ్చి ఫైళ్లు   వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నారు. " కృష్ణ భగవానునికి వందనం"  మాటలు ఎవరు అంటున్నారు అని వెనుకకు తిరిగి చూసాడు వెనుక రామారావు చెందుతులుజోడించి నిలుచున్నాడు.  సుబ్బారావు నిజంగా నాకు పునర్జన్మని ఇచ్చావు నేను ఆత్మహత్య చేసుకోవాలని  అనుకున్నాను. నీ మాటల ప్రభావం వలన గీతాపారాయణ వలన నేను ఏమిటి నాకర్తవ్యం ఏమిటన్నది నాకు తెలిసింది.  ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా వున్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పు నీవు అదృష్టవంతుడవా కాదా అని సుబ్బారావు అడిగాడు.  అవును నిజంగా అదృష్టవంతుడినే అని రామారావు  అన్నాడు . ఆత్మహత్య ప్రయత్నం చేసే ప్రతి మానసిక బలహీనునికి నీలాంటి మిత్రుడు వుంది గీత  చదవమని ప్రబోధిస్తే ప్రతివాని జీవితం  వెలుగుని చూస్తుంది. అని సంతోషంగా అన్నాడు. 

ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా వుండవు   అట్లా అని ఎప్పుడు ప్రతికూలంగాను వుండవు. స్థితప్రజ్ఞుడు కష్టాలలోను సుఖాలలోను తొణకక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కానీ ఇది చెప్పినంత సులభం  కాదు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిత్యం సాధన చేస్తే  ఏదైనా సాధించవచ్చు.

 అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

 తినగ తినగ వేము తియ్యగుండు

 సాధనమున పనులు సమకూరు ధరలోన

 విశ్వధాభిరామ వినుర వేమ

కాబట్టి మిత్రమా పరిస్థితులను బట్టి మన ప్రవర్తన మార్చుకుంటే మంచిది. సత్వగుణ సంపత్తి సదా ఉత్తమం.

ఇటీవల ఒక వేదపండితుడు తన భార్య, అత్తగార్లు పెట్టిన  వేదనలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నంచేయగా తీవ్ర అనారోగ్యగ్రస్తుడు అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడని పెట్టిన పోస్టుకు భాదతో స్పందించి వ్రాసిన కధనం ఇది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

ఆభరణం ఏది?!

 *ఆభరణం ఏది?!*

                  

*ఓం శ్రీ కృష్ణ సద్గురవే నమః


*మనుషులలో కొందరికి మంచి రూపం ఉంటుంది. కొందరికి గుణం ఉంటుంది. ఈ రెంటిలో ఏది గొప్పది అనే ప్రశ్న ఉదయిస్తుంది.


*రూపమా? గుణమా?.


*అందమైన రూపం అందరినీ ఆకట్టుకుంటుంది కనుక అదే ముఖ్యమని కొందరు, మంచితనం ఉంటే చాలు అందరూ అతని దగ్గరకు వస్తారు అని మరి కొందరు వాదులాడుకుంటారు.


*వీటిలో ఏది ముఖ్యమో వివరించే సుభాషితం ఒకటుంది.


*నరస్యాభరణం రూపం

రూపస్యాభర ణం గుణమ్‌

గుణస్యాభరణం జ్ఞానమ్‌

జ్ఞానస్యాభరణం క్షమా


*మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.


*పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది.


*అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు.


*వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగి పోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు.


*అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీనులను గేలి చేయడం తగనిది.

ఇందుకు మహారాజులైనా మినహాయింపు కాదు. సామాన్యులు, గర్వాతిశయంతో తన కన్న ఏదో విధంగా తక్కువగా ఉన్న వారిని కించపరిచారంటే అది వారి మూర్ఖత్వం అని సరిపెట్టుకోవచ్చు. కాని అసామాన్యులే అలా ప్రవర్తిస్తే అజ్ఞాని అని అనుకోలేం.


*అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.


*ఒక చక్రవర్తి. యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రి ఆయనకు ఆసమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు… కళ్లునెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.


*‘మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును’ అన్నాడు.


*అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.


*తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి   ‘ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు’ అన్నాడు.


*పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.


*‘ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు’ అన్నాడు మంత్రి మళ్ళీ.


*పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.


*వెంటనే ఆలోచించాడు. మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది.  జ్ఞానోదయమయింది. వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, ‘గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్లగా ఉంచుతుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి’ అన్నాడు.


*ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు… మౌర్య చంద్ర గుప్తుడు.   ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

విష్ణు సహస్రనామం

 మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

పాము కరిచిన

 ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేయండి ప్రాణాలు కాపాడండి!


వ‌ర్షాకాలం…పాములు బ‌య‌ట సంచ‌రించే స‌మ‌యం. ఇలాంటి టైమ్ లోనే మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పాముల్లో 15 % పాములే విషాన్ని క‌లిగి ఉంటాయి. మ‌న ఇండియాలో 5 జాతుల పాములు మాత్రం అత్యంత విష‌పూరిత‌మైన‌వి. అవి కాటేస్తే 3 గంట‌ల్లో మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ఆ గ్యాప్ లోనే మ‌నం ఏదైనా చేసి పాము కాటేసిన వ్య‌క్తిని కాపాడాలి.


కాటేసిన పాము…విష స‌ర్ప‌మా? కాదా? : 

మొద‌ట నిర్థార‌ణ చేసుకోవాల్సిన అంశ‌మిదే.. విష స‌ర్పం కాటేస్తే… కాటేసిన ప్రాంతంలో 2 గాట్లు ప‌డ‌తాయి. అదే విషంలేని పాము కాటేస్తే…మూడు కంటే ఎక్కువ గాట్లు ప‌డ‌తాయి.


విష స‌ర్పం కాటేస్తే ఏం అవుతుంది?:


విషపు పాము కరిస్తే….కరిచిన చోట నుండి విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. దీంతో బాడీ అంతా పాయిజ‌న్ అయ్యి మ‌నిషి మ‌ర‌ణిస్తాడు.


ఏం చేయాలి?


పాము కాటేసిన ప్రాంతానికి కాస్త ‌పైన గుండె వైపు ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌కుండా తాడుతో బలంగా క‌ట్టాలి.!


పాము క‌రిచిన గాట్ల వ‌ద్ద సూదిలేని సిరంజీని పెట్టి రక్తాన్ని బ‌య‌ట‌కు గుంజాలి….ఇలా రెండు మూడు సార్లు చేయాలి. మొద‌ట‌గా న‌ల్ల‌ని చెడు ర‌క్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది!


హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేయాలి. ఇలా చేస్తే పాము క‌రిచిన వ్య‌క్తి త్వ‌ర‌గా కోలుకుంటాడు.!


NAJA-200 5ML బాటిల్ ధ‌ర‌ 10 రూపాయ‌లు ఉంటుంది. ఈ సీజ‌న్ లో ప్ర‌తి ఒక్క‌రి దీన్ని కొనుక్కొని ద‌గ్గ‌ర పెట్టుకుంటే మంచిది!