ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
24, అక్టోబర్ 2023, మంగళవారం
సనాతనధర్మానికి
*సనాతనధర్మానికి శత్రువు హిందువే.*
*దైవం మాట ఎత్తితే చాలు టైం లేదు అంటాడు. అన్యమతస్థులకు ఎక్కడి నుండి వస్తుంది టైం? నీకంటే కూడా గొడ్డు చాకిరి చేస్తారు. కానీ పిల్లలకి చిన్ననాటి నుండే మతబోధ చేస్తారు. మనం చేయం.*
*పోనీ చేసేవారిని సపోర్ట్ చేస్తారా అంటే అదీ ఉండదు. నీకెందుకు అంటారు. పిల్లలు ఈ విషయం మీద ఏదన్నా మాట్లాడితే ఈ వయస్సులో దేనికి నీకు అంటారు. టైం ఉండదు. చిన్నప్పుడు నేర్పక, వయస్సు లో చేయక ఎప్పుడు చేస్తారు?*
*అందుకే హిందువులలో ఉన్నవారు కన్వర్ట్ అవుతారు కానీ అన్యమతస్థులలో కన్వర్షన్ చాలా తక్కువ. మనవాళ్ళు 1000 మంది వెళితే అవతలివారిలో మహా అయితే ఓ 10మంది ఉంటారు...*
*ధర్మాన్ని ఎవరో వచ్చి నిలబెడతారు. ఎవరో వచ్చి కాపాడతారు అని యువతని సనాతనాధర్మానికి దూరం చేసేశారు. దేవుడంటే కోరికలు తీర్చేవాడుగా చేశారు. దేవాలయాలు ఈ బలహీనతలని కేవలం పూజలు, 2నిముషాలు దండ పెట్టి దర్శనాలు అంటూ పరిమతి చేసినంము.పిల్లలకి గాని, యువతకి కానీ ధర్మం చెప్పేవారు లేరు. బోధించేవారు అసలే లేరు. ఒకరిద్దరు ఏదన్నా బోధిద్దామని ప్రయత్నిస్తే భాషాజ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పట్టి వారిని అవమానిస్తున్నారు.*
*మనం మాత్రం సంపాదించాలి. మేడలు కట్టాలి. ధర్మం మాత్రం బోధించకూడదు. అదేమంటే వీటికే సమయం లేదు. అన్యమతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పిల్లలకి నేర్పుతున్నారు. మనకి ఎందుకు సమయం ఉండదో మరి... ధన్యవాదములు.*
*🌻|సర్వేజనా సుఖినోభవంతు|🌻*
🪷🪷🍁 🙏👍🙏 🍁🪷🪷
*3 పూటలా నడవండి
_*Diabetes / sugar / చక్కెర వ్యాధి ఉన్నా.. లేకపోయినా.. అందరికీ పంపించండి.*_
_*మీకు తెలిసున్న Diabetes వారికి పంపండి.. వారికి చాలా చాలా ఉపయోగం.*_
_*ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు.*_
_*ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇది చదవండి... చదివించండి.*_
_*Walking Experiment on Diabetes ఫలితాలు..*_
*రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ, సాయంత్రం కానీ, వారి వారి వీలును బట్టి ) *ఏకబిగిన* *నడిచే వారికంటే, పొద్దున్న టిఫిన్ చేసిన తరువాత ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ, అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది...!!!*
అలా *తిన్న 5 నిముషాల లోపు* *లేచి, 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది ...!!!*
*కాబట్టి, Diabetics వరకు, ఎంత సేపు వాకింగ్ చేశారు, ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే, *టైమింగ్, అనగా ఎప్పుడు నడిచారు* ? *అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది..!!!*
*ఈ పరిశోధన , ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు.*
*ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా *12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు వాలంటీర్స్ గా* *సహకరించారు.*
*ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది. వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు.*
*ఇందులో సగం మందిని, రోజుకు ఏకబిగిన 45 నిముషాలు నడవమన్నారు. మిగతా సగం మందిని 3 పూటలా, తిన్న వెంటనే ( *తిన్న 5 నిముషాల లోపే,.. లేచి..* *10 నిముషాలు నడవమన్నారు.)*
*40 రోజుల తరువాత 2 గ్రూపులకీ Blood Test లు చేసారు.*
*దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి. ముఖ్యంగా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయ్యింది.*
*Sugar complaint ఉన్నవారు, స్త్రీలైనా, పురుషులైనా, మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్యవలసిందే అని ఏకగ్రీవంగా వెల్లడి అయింది.*
_*Action point*_ :-
_*తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి.*_
లేచి,.. *మీ ఇంటి గదుల్లోన్నయినా సరే, గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి.*
*3 పూటలా నడవండి.*
*40 రోజుల తరువాత Blood Test చేయించుకోండి.*
ప్రతి ఫలం
ప్రతి ఫలం
కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇటువంటి దానికి నిదర్శనంగా ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు.
బాల శంకరులు బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించాడట కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదట. అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారట. కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను పరికించారట అంతా కాళిగా ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారట.
శంకరులవారి మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట. ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది. దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ స్వాద్విమణి దీనత్వం చూసి నీకు దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది. అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు. ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు. కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు.
నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి తెలిపింది. అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా. తల్లి నీవు చెప్పింది నిజమే ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు. మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు. ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని తల్లి బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు. మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది. తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిందట.
ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది.
చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా. కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి. దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట.
మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం వలన రెండు విషయాలు అవగతం అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది. ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు. ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్షాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.
కాబట్టి మిత్రమా ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని చేయండి. అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.
అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి. విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు. కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
⚜ శ్రీ నవదుర్గ ఆలయం
🕉 మన గుడి : నెం 218
⚜ గోవా : మడకై
⚜ శ్రీ నవదుర్గ ఆలయం
💠 ఈ దేవత గోవాలోని తిస్వాడిలో ఉన్న గాన్సిమ్ (గవాసి)కి చెందినదని చెప్పబడింది.
శ్రీ నవదుర్గ దేవాలయం పోండా తాలూకాలోని మడ్కై (పోర్చుగీస్ భాషలో మడ్కైమ్ అని ఉచ్ఛరిస్తారు) వద్ద ఉంది.
దాదాపు 500 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం క్రీ.శ.1603లో పునరుద్ధరించబడింది.
💠 నేడు మడ్కైలో ఉన్న అద్భుతమైన ఆలయం, తల వంచి ఉన్న నవదుర్గకు ప్రసిద్ధి చెందింది.
పురాణాల ప్రకారం, ఒక సంపన్నుడైన సారస్వత్ వ్యాపారి అమ్మవారి పాదాల వద్ద ఒక పువ్వును ఉంచినప్పుడు దేవత వ్యాపారి భక్తిని గుర్తిస్తూ తల వంచింది.
ఇప్పుడు కర్ణాటకలోని కొంకణి దేవాలయం (ఒకప్పుడు గోవాలోని బాణావలిలో ఉంది), కాత్యాయని బణేశ్వర్ వద్ద కూడా ఇదే విధమైన పురాణం ఉంది.
ఇక్కడ కాత్యాయనికి కూడా నవదుర్గ తల వంచి ఉంటుంది.
💠 స్థానిక పురాణాల ప్రకారం, మడ్కై గ్రామంలో నివసిస్తున్న దైవద్న్య బ్రాహ్మణ వర్గానికి చెందిన స్వర్ణకారుడు నవదుర్గా దేవి యొక్క ముసుగును తయారు చేయమని ఆలయ అధికారులు ఆదేశించారు.
స్వర్ణకారుని కలలో దేవత కనిపించి, తన కుమార్తె ముఖాన్ని పోలిన ముసుగును తయారు చేయమని చెప్పింది.
అతని కుమార్తె ముఖాన్ని పోలి ఉండే ముసుగు తయారు చేయబడింది, కానీ కొన్ని రోజుల తర్వాత అతని కుమార్తె బలహీనపడి చనిపోయింది.
ఆమె మరణంతో స్వర్ణకారుడు చాలా బాధపడ్డాడు.
💠 దేవి మరోసారి అతని ముందు ప్రత్యక్షమై, సంవత్సరానికి ఒకసారి తన కుమార్తెగా తన ఇంటికి వెళ్తానని చెప్పింది.
అందువల్ల సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల అష్టమి రోజున స్వర్ణకారుని ఇంట్లో అమ్మవారి అదే ముసుగును స్వాగతిస్తారు.
ఈ రోజును మడ్కైకర్లు (గోల్డ్ స్మిత్ కుటుంబం) పెళ్లి చేసుకున్న అమ్మాయి తన తండ్రి ఇంటికి వచ్చిన విధంగానే జరుపుకుంటారు.
💠 మడ్కై (గోవా), కుండైమ్ (గోవా) మరియు రెడి (వెంగుర్ల - మహారాష్ట్ర)లో ఉన్న నవదుర్గలు సరస్వత్ కులదేవతలుగా పరిగణించబడుతున్నాయి, అయితే మిగిలినవి గ్రామదేవతలు లేదా సాధారణ హిందూ దేవాలయాలు.
💠 నవదుర్గ గోవా & మహారాష్ట్రలో - భారతదేశంలోని అనేక గౌడ్ సరస్వత్ బ్రాహ్మణులు మరియు దైవాన్య బ్రాహ్మణులకు కులదేవత .
పోర్చుగీస్ వారి ఆచారాలలోకి బలవంతంగా మతమార్పిడి మరియు జోక్యం కారణంగా,
దేవతను ప్రస్తుత స్థలాలకు మార్చవలసి వచ్చింది.
గోవాకు ఉత్తరాన బయలుదేరిన సరస్వతులు మరియు దైవాన్యలు, తొమ్మిది వేర్వేరు ప్రదేశాలలో అమ్మవారి గౌరవార్థం ఒక ఆలయాన్ని స్థాపించారు మరియు ఆమెను ప్రతిష్టించారు.
ప్రస్తుతం ఉన్న కులపురుష దేవాలయం రెడి(మహారాష్ట్ర)లో ఉంది.
తమ కులపురుషులతో కలిసి గోవా తూర్పునకు వెళ్లిన ఇతర సరస్వతులు మరియు దైవజ్ఞులు దేవతకు అంకితం చేయబడిన ఆలయాన్ని స్థాపించారు.
💠 మడ్కైలోని నవదుర్గ ఆలయంలో పూజించబడే ప్రధాన దేవత దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం.
నవదుర్గా దేవిని మహిషాసురమర్దిని అని కూడా అంటారు.
శ్రీ నవదుర్గ విగ్రహం రాతితో నిర్మితమైంది.
ఇది 4 అడుగుల ఎత్తులో ఉంది.
నవదుర్గాదేవి మెడ కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది.
💠 ఆమె రూపంలో ఉన్న దేవత గోవాలో అత్యంత పూజ్యమైనది.
గణేష్, బేతాళ, నారాయణ, గ్రామపురుష్ మరియు రావల్నాథ్ ఈ ఆలయంలో పూజించబడే ఇతర దేవతలు.
💠 నవదుర్గ పల్లకిని ప్రతి నెల శుక్ల నవమి నాడు బయటకు తీస్తారు.
విద్యా చతుర్థి నుండి దశమి వరకు నవంబర్ నెలలో (కార్తీక మాసం) ఈ సమయంలో జరిగే వార్షిక జాత్ర కోసం వేలాది మంది భక్తులు మడ్కైలోని శ్రీ నవదుర్గ ఆలయానికి తరలివస్తారు.
ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకునే మరో పండుగ నవరాత్రి.
💠 ఆలయానికి చేరుకోవడానికి పోండా-రామనాథి-బందీవాడే-నాగేశి మీదుగా మడ్కైకి.(సుమారు 16 కి.మీ)
శ్రీరామచంద్రుడు
🌹శ్రీరామచంద్రుడు 🌹
శ్రీరామచంద్రుండు శ్రితపారిజాతుండు
సుగుణాభిరాముండు సుందరుండు
అన్యుల నుండియు న్ననయంబు గ్రహియించు
నగణితమ్మైనట్టి సుగుణములనె
సద్గుణంబులలోన సముడు భూజానికి
కౌసల్య కన్నట్టి కలిమిపంట
సతత ప్రశాంతుండు సౌమ్య వచోభాషి
యాగ్రహం బెరుగని నిగ్రహుండు
ఒరులెన్ని పరుషముల్ నొనరంగ పల్కినన్
మనముందు నిల్పని మాన్యవరుడు
అంతియే కాకుండ ననునయ వాక్యాల
సర్ది చెప్పెటి గొప్ప సౌమ్య శాలి
తండ్రి దశరథునకు మించు తనయు డతడు
సురుచిరోజ్వల గుణగణ శోభితుండు
సర్వమంగళరూపుండు సన్నుతుండు
జగతి జననుత శ్రీరామచంద్రమూర్తి.
శ్రీకరుండైనట్టి శ్రీరామచంద్రుండు
నతి మృదుల స్వభావి యంతరమున
యొరులచే కించిత్తు నుపకార మొందినన్
భావించు నద్దాని పర్వతముగ
యెవరిచే యపకార మెంతేని గల్గినన్
పట్టించుకొనడది భావమందు
నన్యుల నెవరైన నాత్మీయ మదితోడ
పలకరించును తానె ప్రథమముగను
శత్రు విషయము నందైన సౌమ్యభాషి
శరణు గోరిన వారిపై కరుణ జూపి
పగతురను జంపి నాతని భయము బాపు
రమ్య గుణగణయుక్తుడు రామవిభుడు.
✍️గోపాలుని మధుసూదన రావు 🙏