శ్రీ శారదాంబ
------------------
పరమేశు తాండవ ప్రక్రియాకేళికిన్
శబ్దాక్షరశ్రుతి ' శారదాంబ '
నారద తుంబుర నాదమాధుర్యాన
సంగీత రసధుని "శారదాంబ'"
త్యాగరాజస్వామి తనరారు కృతులందు
తారాడు నాదమ్ము ' శారదాంబ '
కవిలేఖినులలోన కవితాస్రవంతిలో
సాకార రూపమ్ము ' శారదాంబ '
సరసిజభవు రసనవాసి "శారదాంబ '"
సర్వవిద్యాస్వరూపిణి "శారదాంబ '"
సత్కవుల కల్పవృక్షమ్ము "శారదాంబ '"
సంచరించు గావుత నాదు స్వాంత వీధి !!
శ్రీ శారదాంబ
------------------
పరమేశు తాండవ ప్రక్రియాకేళికిన్
శబ్దాక్షరశ్రుతి ' శారదాంబ '
నారద తుంబుర నాదమాధుర్యాన
సంగీత రసధుని "శారదాంబ'"
త్యాగరాజస్వామి తనరారు కృతులందు
తారాడు నాదమ్ము ' శారదాంబ '
కవిలేఖినులలోన కవితాస్రవంతిలో
సాకార రూపమ్ము ' శారదాంబ '
సరసిజభవు రసనవాసి "శారదాంబ '"
సర్వవిద్యాస్వరూపిణి "శారదాంబ '"
సత్కవుల కల్పవృక్షమ్ము "శారదాంబ '"
సంచరించు గావుత నాదు స్వాంత వీధి !!
మాగంటి శ్రీరామమూర్తి
అధ్యక్షులు
పద్య సారస్వత పరిషత్
ఒంగోలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి