15, నవంబర్ 2023, బుధవారం

Panchaag


 

ఆనందతాండవ క్షేత్రం

 🎻🌹🙏కార్తీకమాసం సందర్భంగా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹🙏ఈరోజు రెండోవ పంచభూత లింగం ఆకాశ లింగం..చిదంబరం నటరాజస్వామి గురించి తెలుసుకుందాం..🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹 నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం చిదంబరం తమిళనాడు 🌹


🌸పరమశివుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేసిన మహాపుణ్యక్షేత్రం చిదంబరం. తమిళనాడులోని చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా యుగయుగాల నుంచి ప్రసిద్ధిపొందింది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.


🌿50 ఎకరాలుగా పైగా ఉన్న సువిశాల స్థలంలో విస్తరించివున్న ఈ క్షేత్రంలో శివ, కేశవ మందిరాలు ఉండటం విశేషం. వైష్ణవులకు శ్రీరంగం ఎంత పవిత్రమో.. శైవులకు చిదంబరం అంత పవిత్రమైన మహాక్షేత్రమని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.


🌸పంచభూత ఆలయాల్లోని శ్రీకాళహస్తి, కంచి, చిదంబరం ఒకే అక్షాంశంపై నిర్మితమై ఉండటం విశేషం. నటరాజస్వామి.. ఇక్కడ ఈశ్వరుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు.


🌿నాట్యభంగిమలో ఉన్న స్వామి పాదం కింద అజ్ఞానం రాక్షసుడి రూపంలో ఉంటుంది.చేతిలో నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందని అర్థం. అలాగే మరో హస్తం సర్వజగత్తును పరిరక్షించేవాడని సూచిస్తుంది. ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది. పరమశివుడు చిద్విలాస నాట్యాన్ని వీక్షించాలని ఆదిశేషువు ఆశిస్తాడు.


🌸అంత మహావిష్ణువు యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి భూమిపైకి పొమ్మని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.


           🌷  స్థల పురాణం  🌷 


🌿‘చిత్‌’ అంటే మనస్సు. అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఎన్నో యుగాలకు ముందు పరమేశ్వరుడు ఇక్కడి తిలై వనాల్లో విహరించేవాడు. శివుడు భిక్షువు రూపంలో తిరుగుతుంటే మోహిని అవతారంలోని విష్ణుమూర్తి ఆయనను అనుసరిస్తాడు.


🌸పార్వతీనాథుని ప్రకాశవంతమైన తేజస్సుకు మునుల సతీమణులు ఆశ్చర్యానికి లోనవుతారు. దీంతో ఆగ్రహించిన మునులు సర్పాలను వదులుతారు. లయకారకుడైన శివుడు వాటిని మెడకు, నడుముకు కట్టుకుంటాడు.


🌿ఈ సంఘటనతో మరింత ఆగ్రహించిన మునులు ఒక రాక్షసుడిని పంపుతారు. శివుడు ఆ రాక్షసుడి వీపు మీద కాలుమోపి కదలకుండా చేస్తాడు. అనంతరం ఆనందతాండవం చేస్తాడు. దీంతో భగవంతుని నిజ స్వరూపాన్ని గ్రహించిన మునులు ఆయనను శరణు వేడుకుంటారు.


🌸చిదంబర రహస్యమంటే.. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహ, ఆకార రహిత ఆకాశ, స్ఫటిక లింగ రూపాల్లో ఉంటారు. అయితే, విగ్రహాన్ని మాత్రమే చూడగలం గానీ ఇతర రూపాలను చూడలేము. 


🌿చిత్‌సభానాయక మండపంలోని స్వామివారు ఆకాశ రూపంలో కంటికి కనిపించకుండా ఉంటారు. పురోహితులు మందిరంలోని తెరను తొలగించి హారతిని ఇస్తారు. భగవంతుడు ఆదియును అంతమును లేనివాడు అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఉండబోదు. 


🌸మన అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతున్ని సన్నిధిని వీక్షించడంతో దివ్యానుభూతి కలుగుతుంది. గోవింద రాజస్వామి సన్నిధి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోవిందరాజస్వామి మందిరం ఉంది.


🌿శివ,కేశవ మందిరాలు ఒకే ప్రాంగణంలో ఉండటం అరుదైన విశేషం. హరి, హరులకు ఎలాంటి భేదాలు లేవని ఈ క్షేత్రం నిరూపిస్తోంది. 108 దివ్యదేశాల్లో ఒకటిగా గోవిందరాజస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. కులశేఖర ఆళ్వారు తన రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు.

మానవదేహానికి ప్రతీక.


🌸ఆలయం మానవ దేహానికి ప్రతీకగా ఉంటుందని పెద్దలు చెబుతారు. నమఃశివాయ మంత్రంలో 21,600 బంగారు పలకలను వినియోగించారు. ఒక మనిషి ప్రతిరోజూ తీసుకునే శ్వాస ప్రక్రియతో ఈ సంఖ్య సరిపోతుంది.


🌿అలాగే చిత్‌సభ (పొన్నాంబళం)లో 72 వేల మేకులు వాడారు. ఇది మన దేహంలోని నరాల సంఖ్య అని చెప్పవచ్చు. 


🌸ఇలా అనేక విశేషాల సమాహారంతో కూడిన చిదంబర క్షేత్ర సందర్శన మనకు మంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది..స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

 🕉 మన గుడి : నెం 240


⚜ గుజరాత్ : అరసూర్


⚜ శ్రీ అంబాజీమాత మందిర్


💠 అంబాజీ, భారతదేశంలోని గుజరాత్ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులో అబూ రోడ్ సమీపంలో, బనస్కాంత జిల్లాలోని దంతా తాలూకాలో, ప్రసిద్ధ వేద కన్య నది సరస్వతి యొక్క మూలానికి సమీపంలో, అరసుర్ పర్వతం కొండలపై ఉంది. 

అంబికా అరణ్యంలో నైరుతి వైపు నుండి అర్వల్లి పాత కొండల వరకు, సుమారు 480 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులో, మొత్తం 8.33 చ.కి.మీ (5 చ. మైళ్ల విస్తీర్ణం) విస్తీర్ణంలో ఉంది. 


💠 ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. అంబాజీ మాత ఆలయం భారతదేశంలోని ప్రధాన శక్తి పీఠం.

అంబాజీ ఆలయ పురాణం శతాబ్దాల నాటిది, శివుని భార్య సతీదేవి అగ్నిలో దూకి తన జీవితాన్ని త్యాగం చేసింది. 

తన భార్య మరణంతో కోపం మరియు నిరాశకు గురైన శివుడు కాలిపోతున్న మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని ప్రతిచోటా తిరగడం ప్రారంభించాడు. విష్ణువు తన దివ్య చక్రాన్ని ఉపయోగించి ఆవిడ శరీరన్ని ఖండించాడు. వ

సతి దేవి శరీర భాగాలు వివిధ ప్రాంతాలలో పడినప్పుడు శక్తి పీఠాలు ఏర్పడ్డాయని నమ్ముతారు . 

ఈ పుణ్యక్షేత్రాలు హిందూ ధర్మం లో శైవమతం శాఖచే అత్యంత గౌరవనీయమైనవిగా పరిగణించబడతాయి . 

శక్తి పీఠాలను ఎక్కువగా తంత్ర సాధకులు పూజిస్తారు.


💠 సతీదేవి యొక్క ఎడమ రొమ్ము పడిన చోటు.

శ్రీకృష్ణున్ని పతిగా పొందుటకు రుక్మిణిదేవి ఈ అమ్మవారినే ప్రార్థించింది. ఇక్కడ ప్రతిరోజు రాత్రి దుర్గా సప్తశతి చదువుతారు. 

రాణాప్రతాప్ చక్రవర్తి ప్రసిద్ధి పొందిన ఖడ్గమున్న దేవాలయముగా ఈ మందిరం ప్రసిద్ధి చెందింది.


💠 ఈ ఆలయం పట్ల ఈ దేశ భక్తుల్లో ఎంత భక్తి ఉందో, విదేశాల్లో ఉండే గుజరాతీలు కూడా ఇక్కడికి వచ్చి మాత అంబాజీని దర్శించుకుంటారు. 

 ఇక్కడ దేవి విగ్రహానికి బదులుగా, చాలా పవిత్రమైన శ్రీ యంత్రం ఉంది, దీనిని ప్రధానంగా పూజిస్తారు. కానీ, విశేషమేమిటంటే,

ఈ శ్రీయంత్రం సాధారణ కళ్లకు కనిపించదని నమ్ముతారు. అందుకే కళ్లకు గంతలు కట్టుకుని మాత్రమే పూజిస్తారు. 

ఈ ఆలయంలో ఫోటోలు తీయడం నిషేధించబడుతుందని గుర్తుంచుకోండి.


💠 ప్రతి సంవత్సరం ప్రత్యేకించి పూర్ణిమ రోజులలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. 

భదర్వి పూర్ణిమ (పౌర్ణమి రోజు) నాడు పెద్ద మేళా జరుగుతుంది. 

ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి ప్రజలు సెప్టెంబరులో అమ్మవారిని పూజించడానికి వారి స్వస్థలం నుండి నడిచి వస్తారు. 

దేశం దీపావళి పండుగను జరుపుకోవడంతో అంబాజీ పట్టణం మొత్తం వెలిగిపోతుంది.


💠 అంబాజీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

సందర్భంగా అంబాజీ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.  

గర్బా మరియు ఇతర జానపద నృత్యాలను గుజరాతీలు ఆలయ ప్రాంగణంలో అందిస్తారు. 


💠 వారాహి మాత ఆలయం, అంబికేశ్వర్ మహాదేవ్ ఆలయం, గణపతి ఆలయం మరియు ఇలాంటి అనేక దేవాలయాలు అంబాజీ ఆలయం చుట్టూ ఉన్నాయి.  ఖోడియార్ మాత, అజయ్ మాత మరియు హనుమంజీ ఆలయాలు గ్రామంలోనే స్థాపించబడ్డాయి.


💠 అంబాజీ ఆలయ సమయాలు : 

అంబాజీ ఆలయం వారంలోని ఏడు రోజులూ దర్శనం కోసం తెరిచి ఉంటుంది. 

దర్శన సమయాలు - 

ఉదయం 7 నుండి 11 వరకు, 

మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 వరకు మరియు సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు.


💠 మాత దర్శనం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అంబాజీ ఆలయానికి చేరుకుంటారు. 

ముఖ్యంగా భద్రావి పూర్ణిమ, నవరాత్రులు, దీపావళి సమయాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 


💠.ఇది మౌంట్ అబూరోడ్ 32 కి.మీ, అహ్మదాబాద్ నుండి 180 కి.మీ.ల దూరంలో ఉంది

 కార్తీక మాస విశేషాలు  - 2


తిల తైల దీపాలు


కార్తీక మాసమునందు పగలు తక్కువ  రాత్రి కాలము ఎక్కువగా నుండును. అంతేకాక వాతావరణములో వ్యత్యాసము ఏర్పడి చలి మొదలవుతుంది. దీనితో మానవుని దేహములో ఉష్ణము తగ్గుతుండును. దీని వలన అనేక దేహ అనారోగ్యములు సంభవిస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు నివారించుటకు సాయంత్రం పూట తైల దీపాలను వెలిగిస్తారు. తిల అనగా నువ్వులు. నువ్వుల నుండి తీసిన నూనెతో దీపాలు వెలిగిస్తారు.

 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వెనుక ఆధ్యాత్మికను పరిశీలిస్తే నువ్వులు శని గ్రహానికి చెప్పబడిన ధాన్యము. మూల వ్యాధి  స్త్రీల రజో దోషములను నివారించడంలో నువ్వులు ఎంతో సహాయ కారిగా ఉంటాయి. ఈ తిల తైలము మానవుని ఆరోగ్యానికీ మంచిది. తిల తైల దీపములు నుండి వెలువడు ధూపము (పొగ) వాతావరణమును శుద్ది చేయడమే కాక ఉష్ణాంశను ఎక్కువ చేయును. ఈ దీపమును చూచుట కన్నులకు కూడా మంచిది. కంటికి సంబంధించిన నరములపై (optic nerve) మంచి ప్రభావం పడి నరములు బలము పుంజుకొని దృష్టి దోషము పరిహారమగును. అంతేకాక ఈ పొగను పీల్చుట వలన శ్వాస కోశముల మూలకముగా హృదయంపై మంచి ప్రభావం కలుగును. మనుష్యుని శరీరమందుండు జీవనాడి యొక్క ఒక శాఖ (a branch of the vagus nerve) హృదయపు స్పందనను నియంత్రించునని శరీర శాస్త్రము చెబుతున్నది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము vagus nerve కు శని కారకమని చెప్పినారు. ఇందు చేత శని గ్రహపు ధాన్యమైన నువ్వుల నూనె   జ్వాల నుండి జనించు ధూమము శ్వాస కోశముల మూలముగా హృదయంపై అనగా ఈ జీవనాడిపై ప్రభావం చూపి హృదయ రోగములను నివారించుటకు సహాయకారి అగును. అంతేకాక దేహములోని ఉష్ణోగ్రత సమస్థితిలో నుండి చలి ప్రభావమును తగ్గించును.

అందువలన ఈ మాసంలో సాయంత్రపు వేళలో నువ్వుల నూనె దీపములు వెలిగించిన వాతావరణములో సమ శీతోష్ఞ స్థితి ఏర్పడటమే కాక శని భగవానుని అనుగ్రహము కూడా కలుగును. ఇంత ఆలోచించిన మన మహర్షులు కార్తీక మాసములో దీపాలు వెలిగించడాన్ని ఒక సదాచారముగా మనకు అందించినారు.


శుభం భూయాత్ !

కార్తీకపురాణం 2 వ అధ్యాయం*

 🎻🌹🙏*కార్తీకపురాణం 2 వ అధ్యాయం*

🌸🌿🌸🌿🌸


*సోమవార వ్రత మహిమ*


వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత,

తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

కుక్క కైలాసానికి వెళ్లుట…

”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడుఏ. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

*ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.*...🌸🌿🌸🌿🌸🌿🌸🙏🌹🎻

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఈ మహాకాయుణ్ణి చూసి దేవతలే గడగడలాడిపోయారు. ఇంద్రుడూ వణికిపోయాడు.

యుద్ధవాంఛను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవులమధ్య

మతారంగా బంధించి నిలబడ్డాడు. ఉన్నట్టుండి ఇంద్రా! నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు. దేవతలు

హాహాకారాలు చేశారు. ఎటువారు అటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళూ చేతులూ స్తంభించి ఎటూ

కదలలేక బిక్కచచ్చి నిలబడ్డాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు.

మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు.

శచీపతీ! ఈ మహాకాయుడు అసాధ్యుడు. మంత్రాలకూ తంత్రాలకూ లొంగడు. నీ

వజ్రాయుధంకూడా వృధా. వీడు చ్యవనుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన మదుడు.

అనివార్యుడు. ఒక్కటే మార్గం. చ్యవన మహర్షిని శరణువేడుకో. ఆ మహాత్ముడే కరుణించాలి. మరో

దారిలేదు.

బృహస్పతి ఖండితంగా చెప్పాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనస్సులోనే చ్యవనుడికి

మొక్కుకుంటూ వచ్చి కాళ్ళమీద పడ్డాడు. క్షమించు మహామునీ! ఈ మహారాక్షసుణ్ణి ఉపసంహరించు.

సర్వజ్జా ! ప్రపన్నుడివై రక్షించు. ఇకమీదట నీ మాట జవదాటను. ఈ క్షణంనుంచీ అశ్వినులు ముమ్మాటికీ

సోమార్హులే. నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఇది నిజం. నువ్వు వారికిచ్చిన మాటను నెరవేర్చడం నావిధి.

పొరపాటున అహంకరించాను. నీ తపశ్శక్తిని పరీక్షించడానికి శర్యాతి యజ్ఞకీర్తిని దశదిశలకూ చాటి

చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము నన్ను విశ్వసించు.


మయా యద్ధి కృతం కర్మ సర్వథా తు మునిసత్తమ ।

పరీక్షార్థం తు విజ్ఞేయం తవ వీర్యప్రకాశవమ్

(7-35)

ప్రసన్నచిత్తంతో అనుగ్రహించు. సకలదేవతలనూ ఆహ్లాదపరచు. ఈ మహాముడు

ఉపసంహరించు - అంటూ బతిమాలుకున్నాడు. పరమార్ధవేత్త చ్యవనుడు కోపాగ్ని దిగమింగుకున్నారు.

ఇంద్రుణ్ణి లేవనెత్తి సమాశ్వసించాడు. మదుణ్ణి ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో

జూదాలలో, మృగయా వినోదాలలో జీర్ణింపజేశాడు. సకల దేవతలకూ ధైర్యం చెప్పి శర్యాతి యజ్ఞాన్ని

దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు. యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికీ, అతడి సమక్షంలోనే

అశ్వినులకీ, సకల దేవతలకీ తృప్తిగా పంచిపెట్టాడు

భగినిహస్త భోజనము

 నేడు  భగినిహస్త భోజనము



కార్తీకమాసంలో రెండో రోజు శుద్ధ విదియను యమ ద్వితీయగా, భ్రాతృ ద్వితీయగా, భ్రాతృ విదియగా, భగినీ హస్త భోజన పర్వదినంగా పేర్కొంటారు. 

"భగని హస్తభోజనం" అంటే సోదరి చేతివంట సోదరుడు తినడం.


సమాజం అనుసరించాల్సిన ధర్మాలను, ఆచారాలను, వ్రతాలను పండుగల పేరిట సంప్రదాయం ప్రతిపాదించింది.


ఆ కోవలోనిదే యమ ద్వితీయ.

కార్తిక శుద్ధ విదియనాడు భ్రాతృ పూజనం గురించి "లింగ పురాణం" ప్రస్తావించింది. 


*శ్లో౹౹ కార్తికేతు ద్వితీయాయాం!*

*శుక్లాయాం భ్రాతృపూజనం!*

*యా నకుర్యాత్ వినశ్యంతి!*

*భ్రాతరస్సప్తజన్మసు!!*

*(లింగపురాణం)*


*ఈ తిథినాడు సోదరీమణుల ఇంట భోజనాన్ని సోదరులు ఆరగించాలని "భవిష్య పురాణం" చెబుతోంది.*


తోబుట్టువు అనురాగాలకు, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక. అపురూపమైన సహోదరుల బాంధవ్యానికి మరింత బలాన్ని చేకూర్చే ఈ భ్రాతృ విదియ పురాణ ప్రశస్తి చెందింది.


సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ., అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు.


సోదరి సొమ్మును తిని ఆమె ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్టం ఉండదు. శుభసందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. దీనికి ఓ కథ కూడా ఉంది.


నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడట. ఆయనకు ఆమె విజయ తిలకం దిద్ది, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిన దరిమిలా- ఆ పవిత్ర తరుణం భ్రాతృ ద్వితీయగా స్థిరపడిందంటారు.


*శ్లో౹౹ అస్యాం నిజగృహే పార్ధ!*

*నభోక్తవ్యంమతోబుధైః!*

*యత్నేన భగినీహస్తాత్!*

*భోక్తవ్యం పుష్టివర్ధనం!!*

*(భవిష్యపురాణం)*


యమ ద్వితీయను పాటించే విధివిధానాల్ని భవిష్య పురాణం వివరించింది. యముడి దశ నామాల్ని స్మరించి, అర్ఘ్య ప్రదానం చేయాలి. దక్షిణ దిశాధిపతి అయిన ఆయన ప్రీతి కోసం, దక్షిణ దిక్కున ఆవు నేతితో యమ దీపం వెలిగించాలి. సోదరీమణుల ఇంట్లో భోజనం చేసి, వారికి నూతన వస్త్రాల్ని బహూకరించాలి.


కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమ ద్వితీయ. సోదర సోదరీమణుల ఆత్మీయ భావనను ఈ పర్వదినం అభివ్యక్తం చేస్తుంది. ఇదే సందర్భంలో కాంతి ద్వితీయ లేదా పుష్ప ద్వితీయ అనే వ్రతాన్ని ఆచరిస్తారని ‘చతుర్వర్గ చింతామణి’ వెల్లడిస్తోంది. యమ పూజతో పాటు చిత్రగుప్త, విశ్వకర్మ ఆరాధనల్నీ నిర్వహిస్తారు.


సహోదరుల మధ్య అవగాహన, ఆపేక్షల వృద్ధికి ఉద్దేశించిన భగినీ హస్త భోజనం అపురూప సన్నివేశం. పుట్టింటి మమకారాలు మహిళలకు అపారమైన మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సంస్కారయుతమైన, సద్భావన భరితమైన సౌమనస్య తత్వానికి ప్రతీక- భగినీ హస్త భోజన పర్వదినం!


 పండుగలన్నీ మనుషుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గరున్న దాన్ని ఎదుటివారికి ఇవ్వడాన్ని నేర్పిస్తాయి, ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాయి. ఇతరులతో కలిసి జీవించడాన్ని నేర్పిస్తాయి.


భగిని హస్త భోజనం అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం, ఎందుకు చేయాలో మరో  పురాణగాధ కూడా ఉన్నది.    


*_ప్రసిద్ధపురాణగాధ_*


సూర్యభగవానునికి ఉన్న సంతానాలలో యమునా నది యముడికి (యమధర్మరాజుకి) చెల్లెలు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని కూడా అంటూ ఉంటారు! చెల్లయిన యమునా నదికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడూ అన్నగారిని ఆమె ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని కోరేది. చెల్లెలి మాటని కాదనలేక చిత్రగుప్తునితో, తన పరివారంతో సహా యమలోకాన్ని, తన పనులను వదిలేసి భూలోకం వస్తాడు యముడు. అలా వచ్చిన రోజే ఈ కార్తీక శుద్ధ విదియ. అందువలననే దీనిని యమ ద్వితీయ అని కూడా సంబోధిస్తారు. సరే అలా వచ్చిన అన్న గారిని చూసి యమున ఎంతో సంతోషించి వాళ్ళందరికీ అతిధి సత్కారాలు చేసి, ఎంతో ప్రేమాభిమానాలతో వంట చేసి అందరికీ వడ్డించి విందుభోజనం పెట్టిందిట. ఆమె ఆప్యాయత, అనురాగాలకి మురిసిపోయిన యముడు ఒక వరం కోరుకోమన్నాడుట. అప్పుడు యమున ప్రతీ ఏడాది ఈ రోజు (అనగా కార్తీక శుద్ధ విదియ) తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని కోరిందిట. సొంత అక్కా, చెల్లెళ్లు లేకపోతే వరస వాళ్ళ ఇంట్లోనయినా భోజనం చేయాలి. ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆనాడు యముడు తన చెల్లెలి ఇంటికి వచ్చి తన చేతివంట తిని వెళతానని ఆమెకు మాట ఇచ్చాడు. 


లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోక భయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ అయితే తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో  ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు. కనుక అప్పటినుండి మనం ప్రతీ సంవత్సరం దీనిని జరుపుకుంటున్నామనమాట.

శుభం భూయాత్ !

శివానందలహరీ

 🌹శివానందలహరీ 🌹


సీ. వేదముల్ మూడింట వేద్యుడయ్యెడి వాడు

               నఖిల సృష్టికి నాది యైన వాడు

     భక్త హృత్పద్మాన వరలు చుండెడి వాడు 

               త్రినయన యుక్తుండు త్రిపురహరుడు

     కదలు సర్పంబులన్ కంఠహారములుగా

               ఘన జటాజూటంబు గల్గు వాడు

     శ్రీమహాదేవుండు చిత్ స్వస్వరూపుండు

               నగజాతనాథుండు మృగధరుండు

తే. శూల ఢమరుక రుద్రాక్ష శోభితుండు

     భవ్య భస్మాంగ గాత్రుండు పావనుండు

     పార్వతీదేవి సహితుడౌ పరమశివుని

     నిందుభూషణు భజియింతు డెంద మందు.     03 *




                            04

సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా

న మన్యే స్వప్నే  వా తదనుసరణం తత్కృత ఫలమ్

హరి బ్రహ్మాదీనా మపి నికటభాజా మసులభం 

చిరం యాచే శంభోశివ తవ పదాంభోజ భజనమ్  



సీ. అల్పమౌ ఫలముల నందించు చున్నట్టి

             వేల్పులు వెదుకంగ వేలు  గలరు

    వారిచ్చు ఫలములన్ వారల విభవమున్

            కలనైన  క్షణమైన తలచ బోను  

    నిరతంబు సేవలన్ నీచెంత నుండెడి

            హరి పద్మజాదుల యమరు లకును           

    ప్రాప్తించ నట్టి నీ పదపద్మ సేవనే

             నిరతంబు కోరుదు  నియతి తోడ

తే.కరుణ వెదజల్లి నాకు నా కలిమి నిమ్ము

    శంకరా ! భవ ! సర్వేశ ! శశివిభూష !

    సర్వశుభకర! త్రిపురారి ! సాంబ ! దేవ !

    భక్తమందార! పరమేశ! పాహి పాహి            04


✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం

 🕉 మన గుడి : నెం 239





⚜ గుజరాత్ : ద్వారక 


⚜ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం 


💠 భగవంతుడు బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు సర్వోన్నత దేవుడు అనే దాని గురించి వాగ్వాదం జరిగినప్పుడు, శివుడు ఒక కాంతి స్తంభంగా కనిపించాడు మరియు ప్రతి ఒక్కరికి చివరలను కనుగొనమని అడిగాడు. 

ఎవ్వరూ పూర్తి చేయలేకపోయారు. 

ఈ కాంతి స్తంభాల భాగాలు పడిపోయిన ప్రదేశాలలో జ్యోతిర్లింగాలు ఉన్నాయని  నమ్ముతారు .


💠 నాగేశ్వర్ జ్యోతిర్లింగం భారతదేశంలోని గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో గోమతి మరియు ద్వారక మధ్య దారుకావనంలో ఉంది.

నాగేశ్వరుడు అంటే 'సర్పాలకు ప్రభువు' అని అర్థం, కాబట్టి నాగేశ్వరుడిని పూజించే వ్యక్తికి విషం లేని మనస్సు మరియు శరీరం ఉంటుంది.


💠 గుజరాత్‌లోని హిందువుల 'చార్ ధామ్' యాత్రా స్థలాలలో ఒకటైన ద్వారక సమీపంలో ఉన్న 'నాగేశ్వర్ మహాదేవ్ ఆలయం' 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  

ఆలయాన్ని సృష్టించిన తేదీ తెలియదు, కానీ, ప్రస్తుత ఆలయాన్ని 1996లో దివంగత గుల్షన్ కుమార్ పునరుద్ధరించారు. 

ఇక్కడ 'నాగ్‌దేవ్' రూపంలో పూజించబడుతున్న భగవంతుని ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.  

కూర్చున్న భంగిమలో ఉన్న 25 మీటర్ల ఎత్తైన శివుని విగ్రహం ఈ ఆలయానికి గొప్ప ఆకర్షణ.


💠 ఒక పురాణం ప్రకారం, 'బాలాఖిల్యులు', మరుగుజ్జు ఋషుల సమూహం చాలా కాలం పాటు దారుకావనంలో శివుడిని ఆరాధించారు. వారి భక్తి మరియు సహనాన్ని పరీక్షించడానికి, శివుడు తన శరీరంపై నాగులను (పాములను) ధరించి నగ్న తపస్విగా వారి వద్దకు వచ్చాడు. ఋషుల భార్యలు సాధువు పట్ల ఆకర్షితులయ్యారు మరియు వారి భర్తలను విడిచిపెట్టి అతని వెంట వెళ్ళారు. 

దీనితో ఋషులు చాలా కలత చెందారు మరియు ఆగ్రహించారు. వారు తమ సహనాన్ని కోల్పోయారు మరియు సన్యాసిని అతని లింగాన్ని విడిపోవునని శపించారు.


💠 శివలింగం భూమిపై పడటంతో ప్రపంచం మొత్తం వణికిపోయింది. బ్రహ్మ మరియు విష్ణువు శివుని వద్దకు వచ్చారు, భూమిని నాశనం నుండి రక్షించమని మరియు అతని లింగాన్ని తిరిగి తీసుకోవాలని అభ్యర్థించారు. శివుడు వారిని ఓదార్చి తన లింగాన్ని వెనక్కి తీసుకున్నాడు. (వామన పురాణం అధ్యాయం.6వ & 45వ భాగం నుండి). శివుడు దారుకావనంలో తన దివ్య ఉనికిని ఎప్పటికీ 'జ్యోతిర్లింగ'గా నిక్షిప్తం చేశాడు.


💠 శివపురాణం ప్రకారం, దారుక అనే రాక్షసుడు శివుని భార్య అయిన పార్వతీ దేవిచే అనుగ్రహించబడ్డాడు.  ఆమె ఆశీర్వాదాలను దుర్వినియోగం చేస్తూ, దారుక స్థానిక ప్రజలను దౌర్జన్యం చేశాడు మరియు సుప్రియ అనే శివ భక్తురాలిని మరికొందరు వ్యక్తులతో బంధించాడు.  సుప్రియ సలహా మేరకు, అందరూ దారుక నుండి తమను తాము రక్షించుకోవడానికి శివ మంత్రాన్ని జపించడం ప్రారంభించారు.  ఇది చూసిన దారుక కోపంతో రగిలిపోయి సుప్రియను చంపడానికి పరిగెత్తాడు, అకస్మాత్తుగా జ్యోతిర్లింగ రూపంలో శివుడు ఆమెను మరియు ఇతర భక్తులను రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు.  

అప్పటి నుండి జ్యోతిర్లింగంగా ఇక్కడ నాగేశ్వరాలయంలో ప్రతిష్టించబడింది


💠 ఇక్కడ నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించి ధ్యానం చేసే వారు భౌతిక మరియు ఆధ్యాత్మిక (కోపం మరియు ప్రలోభాల వంటి) విషాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.


💠 నాగేశ్వర్ శివ లింగం ద్వారకా శిల అని పిలువబడే రాతితో తయారు చేయబడింది, దానిపై చిన్న చక్రాలు ఉన్నాయి. ఇది 3 ముఖి రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది. 


💠 భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది అని విశ్వసించబడే వాస్తవం నుండి నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి ప్రాముఖ్యత ఏర్పడింది . 

వాస్తు శాస్త్ర సూత్రాలపై రూపొందించబడిన ఈ ఆలయం మానవ శరీరం యొక్క సయన (నిద్ర) భంగిమలో రూపొందించబడింది. 


💠 నాగేశ్వరాలయం దక్షిణం వైపు ఉండగా గోముఖం తూర్పు ముఖంగా ఉంటుంది . 

దీనికి సంబంధించి మరో చారిత్రక గాథ కూడా ఉంది. శివ భక్తులలో ఒకరైన నామ్‌దేవ్ ఒకరోజు ఆయన విగ్రహం ముందు భజనలు పాడుతూ ఉండగా, ఇతర భక్తులను భగవంతుని దర్శనాన్ని అడ్డుకోవద్దని పక్కకు వెళ్లమని కోరాడు. అందుకు శివుడు లేని దిక్కును అడిగాడు. కోపోద్రిక్తులైన భక్తులు ఆగ్రహంతో ఆయనను దక్షిణం వైపు వదిలేశారు. ఆశ్చర్యకరంగా, గోముఖం తూర్పు ముఖంగా ఉండగా, శివలింగం అకస్మాత్తుగా దక్షిణం వైపు కదిలింది.


💠 ఇక నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి కూడా, కొన్ని వాదము లు వున్నవి.

శివ పురాణం ప్రకారము, "ద్వారక" వద్ద వున్నదే అసలు జ్యోతిర్లింగం మని భావన.

కానీ మాదే " శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం "మని, మహారాష్ట్రీయుల వాదము. 

మహారాష్ట్ర లోని " పర్లి " దగ్గర

నాగేశ్వర కొండ పైనున్న  క్షేత్రం, నిజమైనదని వారి నమ్మకం.

ఇవి కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 

శ్రీ నాగేశ్వర  ఆలయం మాత్రమే నిజమైన, నాగేశ్వర జ్యోతిర్లింగం ఆలయం అని, ఆ ప్రాంత వాసుల, వాదము.

గాని ఎక్కువ మంది విశ్వసించు, " శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం "మాత్రము, ద్వారక దగ్గర నున్న క్షేత్రం మాత్రమే.


💠 ద్వారక నుండి 18 కిమీ దూరంలో ఉంది.

లింగాష్టకం యొక్క అర్థం

 లింగాష్టకం యొక్క అర్థం


🔱 *బ్రహ్మ మురారి సురార్చిత లింగం* 

🔔బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!


🔱 *నిర్మల భాషిత శోభిత లింగం* 

🔔నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!


🔱 *జన్మజ దుఃఖ వినాశక లింగం* 

🔔జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదాశివ లింగం* 

🔔ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!


🔱 *దేవముని ప్రవరార్చిత లింగం* 

🔔దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!!


🔱 *కామదహన కరుణాకర లింగం* 

🔔మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!


🔱 *రావణ దర్ప వినాశక లింగం* 

🔔రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!


🔱 *సర్వ సుగంధ సులేపిత లింగం* 

🔔అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!


🔱 *బుద్ధి వివర్ధన కారణ లింగం* 

🔔మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!


🔱 *సిద్ధ సురాసుర వందిత లింగం* 

🔔సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!


🔱 *కనక మహామణి భూషిత లింగం* 

🔔బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!

?

🔱 *ఫణిపతి వేష్టిత శోభిత లింగం* 

🔔నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!


🔱 *దక్ష సుయజ్ఞ వినాశక లింగం* 

🔔దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!


🔱 *కుంకుమ చందన లేపిత లింగం* 

🔔కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!


🔱 *పంకజ హార సుశోభిత లింగం* 

🔔కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!


🔱 *సంచిత పాప వినాశక లింగం* 

🔔సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!


🔱 *దేవగణార్చిత సేవిత లింగం* 

🔔దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!


🔱 *భావై ర్భక్తీ భిరేవచ లింగం* 

🔔చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!


🔱 *దినకర కోటి ప్రభాకర లింగం* 

🔔కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!


🔱 *అష్ట దలోపరి వేష్టిత లింగం* 

🔔ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!


🔱 *సర్వ సముద్భవ కారణ లింగం* 

🔔అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!


🔱 *అష్ట దరిద్ర వినాశక లింగం* 

🔔ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!


🔱 *సురగురు సురవర పూజిత లింగం* 

🔔దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!


🔱 *సురవన పుష్ప సదార్చిత లింగం* 

🔔దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!


🔱 *పరమపదం పరమాత్మక లింగం* 

🔔ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము


🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!


🔱 *లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ* 

🔔ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!


🔱 *శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే* 

🔔శివ లోకం లభిస్తుంది ..!!

శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది.

🙏🙏🙏

15-11-2023* *సౌమ్య వాసరః బుధ వారం* *రాశి ఫలితాలు

 *15-11-2023*

*సౌమ్య వాసరః బుధ వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

*వృషభం*

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

*మిధునం*

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనయోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

*కర్కాటకం*

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

*సింహం*

 ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

*కన్య*

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

*తుల*

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి.

*వృశ్చికం*

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు. 

*ధనస్సు*

కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. 

*మకరం*

అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి.

*కుంభం*

 నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. 

*మీనం*

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

🕉️