15, అక్టోబర్ 2022, శనివారం

సాధకుడు -క్రమబద్ద జీవనం:

 సాధకుడు -క్రమబద్ద జీవనం: 

ముముక్షువులు ఎక్కడో హిమాలయాలల్లోనో, లేక దట్టమైన అరణ్యాలలోనో మాత్రమే వుండరు. నిజానికి నీవు మోక్షార్థివి అయితే నీ ఇంట్లో వుంటూ సాధారణ గృహస్థ జీవనం చేస్తూకూడా సాధన చేయవచ్చు. జనక మహారాజు తాను చెక్రవర్తి అయి ఉండికూడా స్థితప్రజ్ఞత సాధించి మోక్షాన్ని పొందారని మనకు తెలుసు. మోక్ష సాధన అంటే చాలా కష్టమైనది.  కానీ సాధకుడు ఎంత కష్టమైన కూడా తన జీవితాన్ని ఒక క్రమబద్దమైన, క్రమశిక్షణపరంగా సాధన చేయాలి. అప్పుడే మోక్షం పొందగలడు. 

ప్రతి రోజు పరీక్ష: 

ఒక విద్యార్థికి సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే పరీక్ష  ఉంటుంది. కానీ సాధకునికి ప్రతిరోజూ పరీక్షే.  మానవ శరీరం జరా మరణాలకు లోబడివుంటుంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ శరీరం క్షీణించటం మొదలు పెడుతుంది. కానీ సాధకుడు తన నియమ బద్ద జీవనంతో సాధ్యమైనంత వరకు శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుకోవలెను. దేహ వ్యామోహాన్ని పూర్తిగా విడనాడాలి.  కానీ శరీరం పట్ల నిర్లక్ష్యం  వహించకూడదు. సమయానికి తగినంత సాత్వికమైన ఆహారాన్ని తినాలి.  రుచులపట్ల ఏమాత్రం మొహం ఉండకూడదు.  కేవలం శరీరాన్ని శుష్కిపకుండా చూసుకోవాలి. 

సాధకుని నియమాలు: 

సాధకుని రోజు ఎప్పుడు ఉషోదయ కాలంతోటే మొదలైతుంది.  అనగా సూర్యోదయం కన్నా 90 నిమిషాల ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు 6,7 గంటలకు నిద్రలేచే అలవాటు వున్నవారు ఇలా 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.  కానీ మనం మన గమ్యం వైపు నడవాలంటే తప్పకుండ అబ్యాసం చేయాలి. కొంత కాలం అబ్యాసం చేస్తే తరువాత మీరు మీకు తెలియకుండానే నిద్రనుంచి మేల్కొంటారు. ముందుగా రాత్రి భోజనం త్వరగా ముగించి తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే తప్పకుండ ఉషోదయకాలంలో నిద్ర లేవగలుగుతాడు. ఈ సాధకుడు  ప్రారంభంలో   అలారంగా పెట్టుకుని  దాని ద్వారా నిద్ర లేవాలి. మీరు మీకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోండి.  కానీ ఎట్టి పరిస్థితిలోను నిద్ర ఉదయం 4గంటలవరకే పరిమితం చేయండి. 

నిద్ర లేవంగానే మలమూత్ర విసర్జన చేసి చక్కగా దంతధావన చేసి ధ్యానానికి ఉపక్రమించండి.  స్నానం చేస్తే మంచిదే కానీ స్నానానికి ఎక్కువ సమయం కాకుండా చూసుకోండి. 

ఉదయం 4గంటల సమయం: 

నిజంగా ఈ సమయం ఎంతో పవిత్రమైనదిగా గోచరిస్తుంది. ఎందుకంటె మీకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా పిట్టల శబ్దాలు వినపడతాయి.  మీకు 5గంటలనుండి శబ్దాలు వినపడతాయి.  కాబట్టి 4నుండి 5 గంటల సమయం చాలా విలువయినది. శ్రీ కృష్ణ పరమాత్మా  చెప్పినట్లు ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే యోగి మాత్రం మేల్కొంటాడు. స్వామి చెప్పింది నిజం యోగి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. ఉదయం 4 గంటల సమయంలో చేసే ధ్యానం చక్కటి ఫలితాన్నిస్తుంది. 

ముక్తికి మార్గం: 

ఇటీవల కొంతమంది కలియుగంలో ముక్తికి కేవలం నామస్మరణ చాలు పూర్వం ఋషులు కష్టపడ్డట్లు కఠోర తపస్సు చేయనవసరం లేదు అంటూ రోజులో రెండు మూడు నిముషాలు దైవజ్యానం చేస్తూ తనకు తానుగా తరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది అస్సలు  నమ్మకండి. ఒక్కవిషయ గుర్తుంచుకోండి ప్రకృతి ధర్మం అన్ని యుగాలకు ఒకే విధంగా ఉంటుంది.  ఎప్పుడు అది మారదు .  ప్రకృతి ధర్మం అంటే ఏమిటంటే మనకు ఈ జగత్తులో కనిపించే నియమాలు ఉదాహరణకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నీరు పల్లంలోకే ప్రవహిస్తుంది, నిప్పు ముట్టుకుంటే  కాలుతుంది. మేఘాలు వర్షిస్తాయి.  నదులు సముద్రంలోనే కలుస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు.  ఇలాంటివి అనేక నియమాలు ఈ ప్రకృతిలో మనం చూస్తున్నాము.  ఇప్పుడు చెప్పిన ప్రకృతి నియమాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా వున్నాయి.ఒక యుగంలోకాని, ఒక కాలంలో కానీ ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకోలేదు, భవిష్యత్తులో కూడా మార్చుకోదు.  అటువంటప్పుడు పురుషుని (భగవంతుని) నియమాలు ఎలా  మారుతాయి. ప్రకృతికి నియంత భగవంతుడే కదా. కాబట్టి మిత్రమా కేవలం నామ స్మరణ చేస్తే మోక్షం రాదు.  ఆ మాట కేవలం కఠినమైన తపమొనర్చలేని ఆర్భకులు పలికిందే కాని మరొకటి కాదు. 

ఈ ఉపనిషట్ మంత్రం చుడండి 

ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత 

క్షురస్య ధార నిశిత దురత్యయా దుర్గం పాదస్తత్కవయో వదన్తి 

తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. ఈ మార్గం మంగలి కత్తి అంచు మీద నడవటం వలె చాలా కష్టమైనది మరియు తీక్షమైనది, కనుక చాలా కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. కాబట్టి మిత్రమా మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే ఈ జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞ్యానమే జ్ఞ్యానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు .

Bhagavthgeetha


 

Dharba


 


 


 


 

తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 2 .

 తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 2 . 


   అంతకు ముందు పోస్టు నందు వాత , పిత్త , కఫ దోషాల వలన తల్లిపాలలో కలుగు దోషాల గురించి కొంత వివరించాను. ఇప్పుడు అలా దోషం పొందిన పాలు తాగడం వలన శిశువు కు కలుగు ఉపద్రవాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 * వాతదోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు దుష్ప్రభావాలు - 


    తల్లి యందు వాతం పెరుగుట వలన స్తన్యం యొక్క రుచి చెడిపోవును . ఇలా దోషమును పొందిన స్తన్యమును సేవించిన బాలుడు కృశించును. శిశువు వృద్ది చెందుటకు చాలాకాలం పట్టును . వాతప్రభావం వలన స్తన్యము నురుగుతో కూడుకుని ఉండును. స్తన్యము కష్టము మీద బయటకి వచ్చును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు కృశించిన స్వరము , మలమూత్ర బంధనం జరిగి వాతదోషము వలన శిరోరోగము , పీనసరోగము ( పీనస రోగము అనగా ముక్కు వెంట నీరు కారుతూ ఉండును ) సంభంవించును . 


 * పిత్త దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు పిత్తము పెరుగుట వలన స్తన్యము పచ్చగా లేదా నలుపు రంగుతో వచ్చును. ఇట్టి స్తన్యమును తాగిన శిశువుకు శరీరవర్ణం మారును . చెమటయు , మలస్రావము ఎల్లప్పుడూ వేడిగా ఉండును. శరీరము ఎల్లప్పుడూ వేడిగా ఉండును . స్తన్యము నందు ఇష్టము లేకపోవుట జరుగును . పిత్తదోషము పొందిన స్తన్యమును సేవించు శిశువుకు పాండురోగము , కామెర్ల వ్యాధి సంభంవించును . 


 * కఫ దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు కఫము పెరుగుట వలన స్తన్యము జిడ్డుగా , జిగటగా ఉండును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు వాంతి , బాధ , నోటి నుండి చొల్లు కారుట , ఆయాసము , దగ్గు , నోటి నుంచి అతిగా నీరు వూరుట , నేత్రములు వాచుట , మందముగా ఉండటం వంటి సమస్యలు కలుగును. 


       తరవాతి పోస్టు నందు దోషము పొందిన స్తన్యమును శుద్ది చేయు చికిత్సలు మరియు తీసుకోవలసిన ఆహారం గురించి వివరిస్తాను . 


     మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

అబ్దుల్‌ కలామ్

 *అబ్దుల్‌ కలామ్ - భారతావని ఆణిముత్యం*

                                 ~ తుమ్మ జనార్ధన్ (జాన్)



భారత వైజ్ఞానిక ప్రగతికి బాటలువేసిన బాటసారి

చిర కీర్తి గడించిన మిస్సైల్ మాన్ 

యువతను ఉత్తేజ పరచడమే ఉద్యమంగా ఎంచుకున్న ఇగ్నైటెడ్ మైండ్

భారతావనిలో పుట్టి, విశ్వానికెదిగిన వ్యక్తిత్వం

దేశానికి ముద్దుబిడ్డ భరతమాత మెడలో భారత రత్నం.


మతం, రాజకీయం ఏమీ అంటని ఆధ్యాత్మికవేత్త

ఏమీ తేలేదని, ఏమీ తీసుకెల్లలేనని తెలిసిన తాత్వికుడు

ఆస్థి దాచని ఘనుడు, అభిమాన ధనుడు, సుజనుడు

భారతీయత నిండిన దేశప్రేమికుడు, దేశాభివృద్ధి కాముకుడు


రాష్త్రపతి పదవికే వన్నెతెచ్చిన విశ్వవిఖ్యాతుడు

ఉపన్యాసమే ఆయుధంగా కదిలిన యోధుడు

మరపురాని సంస్కారం, అలుపులేని ఆదర్శం

అందరికీ వారి తలపే స్ఫూర్తి మంత్రం


కనులు తెరచి కలలు కను-సాకారం చేసుకో, అన్న స్వాప్నికుడు

స్వయం కృషితో సాధించలేనిది లేదని నిరూపించిన కృషీవలుడు

ఊహించని అందలాలు దక్కినా చలించని వైరాగి

వారు అంచనాలకందని మహా యోగి


చివరి క్షణం వరకూ తన లక్ష్యంతో గడిపిన సాత్వికుడు

ఆశించిన విధంగానే మృత్యువును శాసించిన ఈశ్వరుడు

మీరు మాకు ఎప్పుడూ ఆదర్శం, మరువలేము మీ జీవిత సందేశం

ఇవే మీకు మా కవితా నివాళులు – కలాం సర్ మీకు మా సలాం. 

🙏🙏🙏💐🌹💐🙏🙏🙏

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

 ॐ            शिव तांडव स्तोत्र    

                  (रावण रचित)

             శివ తాండవ స్తోత్రం 

              (రావణ విరచితం)

  SIVA TAANDAVA STOTRAM 

             (BY RAAVANA) 


                           శ్లోకం :2/15  

                      SLOKA :2/15 


जटाकटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि।

धगद्धगद्धगज्ज्वल ल्ललाटपट्टपावके किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं मम: ॥२॥


జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ 

విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥ 


    శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, 

    అందులో సురగంగ వేగంగా సుడులు తిరుగుచున్నది. 

    అప్పుడు దానిలో బారులుతీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లు గొలుపుతుంది. 

    అలాంటి మహాదేవునియందు, 

  - నుదుటి భాగమున మెరుస్తున్న అగ్నిని, 

  - శిరస్సుపై బాలచంద్రుని ధరించియన్న శివునిపట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు. 


    मेरी शिव में गहरी रुचि है,

जिनका सिर अलौकिक गंगा नदी की बहती लहरों की धाराओं से सुशोभित है,

    जो उनकी बालों की उलझी जटाओं की गहराई में उमड़ रही हैं?

    जिनके मस्तक की सतह पर चमकदार अग्नि प्रज्वलित है,

और जो अपने सिर पर अर्ध-चंद्र का आभूषण पहने हैं। 


    At every moment, may I find pleasure in Shiva, 

    Whose head is situated in between the creeper-like unsteady waves of Nilimpanirjhari (Ganga), 

    in whose head unsteadily fire (energy) is fuming the like twisted hair-locks, 

    Who has crackling and blazing fire at the surface of forehead, and 

    Who has a crescent-moon (young moon) at the forehead. 

    

 https://youtu.be/HCEm0VLHrrY


                            సశేషం 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

మహర్షుల చరిత్రలు..

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈ రోజు 50,వ బకదాల్భ్య మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁ఇపుడు మనం తెలుసుకోబోయేది ఒక అతి అద్భుతమైన మహర్షి గురించి . నిజంగా ఏం గొప్పతనం ! ఎంత ఆయుషు ! ఎంత వినయం ! మహాద్భుతం . 


☘️చాలా చాలా యుగాలకి పూర్వం దాల్బ్యుడనే మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి ఎన్నికల్పాలయిపోయినా సరే మరణం లేకుండా ఉండే కొడుకు కావాలని వరం పొంది ఒక కొడుకుని పొందాడు.


🍁ఆహా ! ఎంత అదృష్టం. ఆయన ఎంత పుణ్యాత్ముడో! అంత గొప్ప కొడుకుని కన్న తండ్రి తక్కువ వాడు కాదు కదా! 


☘️ఆ పిల్లవాడు బక పుష్పం ఉన్నంత అందంగా చక్కటి సువాసనతో ఉన్నాడని బకుడని పేరు పెట్టారు.


🍁 తండ్రి పేరు కూడా కలిసి బకదాల్బ్యుడు అని, ఇతడ్ని పెంచిన తల్లిదండ్రులవల్ల ద్వ్యాముష్యాయణుడు, గ్లావుడు, గ్లావమైత్రేయుడు అని కూడ పేర్లున్నాయి.


☘️బకదాల్ఫ్యుడు చిన్నతనంలోనే ముఖ్య ప్రాణోపాసనం చేసిన మహాతపశ్శాలి, మహాత్ముడు అయ్యాడు.


🍁ఒకసారి ఒక తెల్లకుక్క కొన్ని చిన్న కుక్కలను ఒకదానితోక ఒకటి నోటితో పట్టుకుని వలయాకారంలో తిరిగి కూర్చుంటే చూసి ఋత్విజుల విధుల్ని నిర్ణయించి బకదాల్బ్యుడు

ద్వైతవనంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. 


☘️గొప్ప తపస్సు చేసి మరణాన్నే జయించి, అపర శివుడిలా తేజస్సుతో వెలిగిపోతున్నాడు. కొంతకాలం తర్వాత పాండవులు ద్వైతవనంలో ఉండడానకి వచ్చారు. వాళ్ళని పెద్ద పెద్ద మునులందరూ వెళ్ళి పలకరించి వస్తున్నారు.


🍁బకదాల్భ్య మహర్షి ఒకసారి పాండవులని చూడ్డానికి వెళ్ళి ధర్మరాజు దగ్గర అతిథి సత్కారం తీసుకుని,


☘️నాయనా ! ఉత్తములైన బ్రాహ్మణులు మీ దగ్గరికి వచ్చి పోతూ వుంటే అగ్నికి, వాయువు తోడైతే అరణ్యాన్ని ఎలా దహిస్తాయో, మా బ్రాహ్మణులు, మీ క్షత్రియులు కలిసినప్పుడు శత్రువులు కూడా అలాగే నశిస్తారు అన్నాడు.


🍁యుద్ధంలో ఏనుగుకి దారి చూపించడానికి అంకుశం ఎలా ఉపయోగపడుందో, రాజుని ధర్మమార్గంలో త్రిప్పడానికి బ్రాహ్మణుడు అలాగే ఉపయోగపడతాడన్నాడు.


☘️తర్వాత బకదాల్యుడు చిరంజీవుల్లో ఒకడై బ్రహ్మచారై ఎన్నో యుగాలు బ్రతికి సముద్రం మధ్యన ఒక దీవిలో తపస్సు చేసుకుంటున్నాడు.


🍁ఒకసారి ధర్మరాజు అశ్వమేథయాగం చెయ్యడానికి యజ్ఞాశ్వాన్ని విడిచి పెట్టినప్పుడు కృష్ణార్జునులు గుఱ్ఱంతో తిరుగుతూ మహర్షి ఉన్న చోటుకి వచ్చారు.


☘️అక్కడ కొన్ని యుగాలుగా పెరిగిన శరీరం, జడలు, గడ్డంతో, కోటి సూర్యుల తేజస్సుతో ఉన్న బకదాల్ఫ్యుణ్ణి చూసి కృష్ణార్జునులు రథం దిగి నడిచి వెళ్ళి నమస్కారం చేశారు.


🍁అర్జనుడు మహర్షిని చూసి ఆశ్చర్యపోయాడు. శరీరం చుట్టూ పుట్టలు, మోకాళ్ళు మోచేతులు నించీ చెట్లు, పుట్టల్లో ఎన్నో రకాల పాములు ఆ చెట్లమీద ఎన్నో రకాల పక్షులు చూసి అర్జనుడు మహర్షికి నమస్కారం పెట్టి ఈ మీ వింతకి పరమార్థం ఏమిటని అడిగాడు. 


☘️అర్జునా ! క్షణంలో పోయే ఈ శరీరానికి తూగుటుయ్యాలలు, పూలపాన్పులు ఎందుకు? ఈ మట్టి ఆకులు చాలవా? అన్నాడు బకదాల్బ్యడు. అర్జునుడు స్వామీ! మీ వయస్సెంత? అన్నాడు.


🍁బక దాల్ఫ్యుడు నేను పుట్టాక ఇరవై మంది బ్రహ్మలు వెళ్ళారు. ఎంతో మంది మార్కండేయులు వెళ్ళిపోయారు. నీకొక చిత్రమైన విషయం చెప్తాను విను. 


☘️ప్రళయ కాలంలో ఏడు సముద్రాలు, ముల్లోకాలు కొట్టుకొచ్చి ఇక్కడికి చేరాయి. అప్పుడిక్కడ ఒక మఱ్ఱి చెట్టుండేది. దాని కొమ్మలు వెయ్యి పైగానే ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మకి వెయ్యేసి బ్రహ్మాండాలు వ్రేలాడుతున్నాయి.


🍁ఆ మఱ్ఱి చెట్టుకి చిటారుకొమ్మ మీద ఒక చిగురాకు మీద పడుక్కుని కుడి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ నన్ను ప్రేమతో చూసి భయం లేదని అభయమిచ్చాడు ఒక బాలుడు.


☘️రమ్మనేవాళ్ళు లేక పొమ్మనే వాళ్ళు లేక అంతటికి తానే నాయకుడయ్యి హాయిగా పడుకుంటే అతని నాభిలోంచి ఒక కమలం దాంట్లోంచి ఒక బ్రహ్మ వచ్చి ఈ సృష్టినంతా చేశాడు. 


🍁అతడే శ్రీకృష్ణుడుగా పుట్టి నీకు బావై ఈ బాధలన్నీ పడుతున్నాడని చెప్పి కృష్ణుడ్ని కౌగిలించుకుని ఎలావున్నావయ్యా మూడులోకాల కుటుంబీ! అన్నాడు బకదాల్భ్య మహర్షి శ్రీకృష్ణుణ్ణి.


☘️కృష్ణుడు బకదాల్బ్యుణ్ణి పొగుడుతుంటే, పొగడ్త ఎంతటి గొప్పవాడ్నయినా నాశనం చేస్తుంది, ఒక కథ చెప్తాను వినమన్నాడు మహర్షి.


🍁అర్జనుడికి కథలంటే ఇష్టం వెంటనే చెప్పండి చెప్పండి అన్నాడు. నేను ఒక మఱ్ఱి చెట్టు దగ్గర తపస్సు చేసుకుంటుంటే నాలుగు ముఖాల బ్రహ్మ వచ్చి నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు.


☘️నీలాంటి వాళ్ళని ఇరవైమందిని చూశాను. నువ్వు నాకేమిస్తావన్నాను,నేను. బ్రహ్మకి కోపం వచ్చి వెఱ్ఱి వాడ్ననుకుంటున్నావా? అన్నాడు.


🍁నేను నవ్వుతున్నాను. ఈలోగా మా ఇద్దరి మధ్యా భూమి చీలి పెద్దగాలి వచ్చి మమ్మల్ని వేరే బ్రహ్మాండంలో పడేసింది. అక్కడ ఎనిమిది తలల బ్రహ్మ మీరెవరో నాకనవసరం నాసేవ చెయ్యండన్నాడు.


☘️మళ్ళీ అలాగే జరిగి పదహారు తలల బ్రహ్మ తన సేవ చెయ్యమన్నాడు. బ్రహ్మాండాలు దాటుతూ బ్రహ్మల్ని చూస్తూ అలా వెడుతూనే వున్నాం.


🍁చాలా ముఖాలున్న బ్రహ్మల్ని చూస్తూనే వున్నాం. చివరికి వెయ్యి తలలు, అమితమైన తేజస్సు కలవాడు అయిన బ్రహ్మ మమ్మల్ని చూసి ఎదురొచ్చి యోగక్షేమాలడిగి నేను నా పరివారం అంతా మీ ఆధీనంలోనే వున్నాం.


☘️మీకేం కావాలో అడగండి చేస్తాం అన్నాడు. బ్రహ్మలందరు సిగ్గుతో తలవంచుకుని గర్వం నశించి మహాపురుషా! నువు విష్ణుమూర్తివని, మా గర్వం అణగాలనే ఇలా చేశావని అర్ధమయింది. క్షమించమని అడిగారు.


🍁అందుకని అర్జునా! గర్వం పనికిరాదు అన్నాడు బకదాల్ఫ్యడు. కృష్ణార్జునులు బకదాల్భ్య మహర్షిని స్తుతించి ధర్మరాజు చేస్తున్న అశ్వమేధయాగానికి రమ్మని బ్రతిమలాడారు. 


☘️నవరత్నాలు పొదిగిన బంగారు పల్లకీలో మహర్షిని కూర్చోబెట్టి ధర్మరాజుకి కబురు చేసి మహర్షిని తీసుకువెళ్ళారు.


🍁ఋత్విజుల్ని మంత్ర పాఠకుల్ని నియమించి తాను బ్రహ్మగా ఉండి అశ్వమేధయాగం పూర్తి చేయించాడు మహర్షి. కొంతకాలం తర్వాత బకదాల్బ్యుడు తన దగ్గర చాలినన్ని కోడెదూడలు లేవని ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. 


☘️ధృతరాష్ట్రుడు చచ్చిపోయిన దూడల్నిచ్చి తీసుకోమన్నాడు. మహర్షి కోపంతో బ్రహ్మర్షులంటే నీకు వెటకారంగా ఉందా? నిన్ను సర్వనాశనం చేస్తానని దృతరాష్ట్రుడి రాజ్యం అంతరించిపోయేలా అభిచారిక హోమం ప్రారంభించాడు.


🍁ధృతరాష్ట్రుడు పరుగెత్తుకు వెళ్ళి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. మాలాంటి వాళ్ళు లేకపోతే నీలాంటి వాళ్ళకి పట్టపగ్గాలుంటాయా! క్షమించాను ఫో! అన్నాడు మహర్షి.


☘️ధృతరాష్ట్రుడు వెంటనే గోవుల్ని పంపించాడు మన భారత బ్రహ్మర్షులు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్యడంలో పరమేశ్వరుడంతటి వాళ్ళు.


🍁ఇదండీ బకదాల్భ్య మహర్షి కథ. రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


  సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

Darsaniya stalalu Nellure district 

నిత్యసంధ్యోపాసన

 శ్రీ గాయత్య్రైనమః

1992 సంవత్సరంలో కొందరు దక్షిణ తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ వేదపండితులు శ్రీ కంచి పరమాచార్యులను దర్శించుకుని, *జగద్గురువులతో:*

'దక్షిణ తమిళనాట, కేరళా ప్రాంతాల్లో మతమార్పిడులు ఉద్రుతంగా ఉన్నాయి, సనాతన ధర్మం నశించిపోయే ప్రమాదం ఉంది. కావున, మీరే దీనిని అడ్డుకునేందుకు ఏదైనా ఒక ఉద్యమ రూపకల్పన చేసి, మమ్ములను నడిపించవలసినదని' విన్నవించుకున్నారు.


శ్రీచరణులు కొద్ది సేపు కళ్ళు మూసుకుని మౌనం వహించారు.

ఆ తర్వాత నెమ్మదిగా:

"ఆదిశంకరులు పీఠాధిపతులను ఉద్యమాలు నడిపించమని నియమించలేదు. కేవలం సనాతన ధర్మ వ్యాప్తి మాత్రమే మాకు అప్పచెప్పారు. 

మీ ధర్మం మీరు వదలకుండా నిర్వర్తించండి. వీటన్నింటికీ కారణం బ్రాహ్మణ ధర్మం లుప్తమవుతోంది క్రమేపీ. నిత్య సంధ్యోపాసకులు తగ్గుతున్నారు.

*మీ ప్రాంతంలో కనీసం వందమంది నిత్యం సహస్ర గాయత్రి చేసేవారుండే విధంగా మీరు కృషి చేయండి.* ఎవరూ ఏమీ చేయలేరు. 

ఈవిషయం కూడా నేను చెప్పడం లేదు, నా గురువులు నాకు స్పురింపచేసారు.  

*నిత్య గాయత్రి జరిగే ప్రాంతాల్లో ఎటువంటి ఉపద్రవాలు కూడా రావని శాస్త్ర వచనం.*

కావున, ఎటువంటి ఇతరత్రా ఉద్యమాల జోలికి పోకుండా, *ప్రతి ఇంటా నిత్యసంధ్యోపాసన, ఎక్కువగా గాయత్రి అనుష్టానం జరిగే విధంగా కృషి చేయండి.* అంతా చక్కబడుతుంది."

అని ఉపదేశించి వారిని పంపారు.

భగవద్గీత

 🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏

  🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿

               -------------------------------------------------

🌺 -38- వ,శ్లోకం-యద్యప్యేతే నపశ్యంతి,లోభోప హతచేతసః |

  కులక్షయ కృతం దోషం,మిత్ర ద్రోహేచ పాతకం॥🌺

🌻39-వ,శ్లోకం-కథంనఙ్ఞేయ మస్శాభిః, పాపాదస్శాన్నివర్తితుమ్|

  కులక్షయ కృతం దోషం,ప్రపశ్యద్ద్భిర్ జనార్దన॥🌻

అర్థం-అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు! ఓ జనార్దన!రాజ్యాన్ని సంపాదించాలి అన్న చెడు మనస్సుతో దుర్యోధనుడు మొదలైన వారు వంశనాశనము వలన కలుగు దోషం మరియు మిత్ర ద్రోహం వలన కలుగు పాపం వస్తుంది అని ఒకవేళ వాళ్లకి తెలియదేమో. ఆ రెండు పాపాల గురించి తెలిసిన మనం ఎందుకు విరమించ కూడదో నాకు అర్థం కావట్లేదు.

-----------------------------------------------------------------

 వ్యాఖ్య- కామము,క్రోధము, లోభము ఈ మూడు నరక ద్వారాలు. ఈ మూడు మనిషి మనస్సుని కలుషితం చేస్తాయి. దుర్యోధనుడి మనస్సు లోభంతో కట్టి వేయబడి ఉంది. అందుకే గీతలో "లోభోపహత చేతసః" అని చెప్ప బడింది. శ్రేయస్సును కోరేవారు ఈ మూడిటితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నరక ప్రవేశం తప్పదు. దుర్యోధనుడు మొదలైన వారిలా ఎప్పటికైనా పతనం తప్పదు.అందుకే రామకృష్ణ పరమహంస అంటారు కామ, క్రోధ,లోభాలను భగవంతుడి వైపు ( ధర్మం వైపు )త్రిప్పండి తద్వారా మీరు ఇహ, పరాలలో రక్షింపబడతారు. అర్జునుడు ఇంకా కొన్ని శ్లోకములలో తన విషాదాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. ఆ తరువాత గీతామృతం ప్రారంభమవుతుంది.

------------------------------------------------------------------------------

🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొందుదాము. గీతామృతాన్ని అందరం త్రాగుదాము, 🙏

              ------------------------------------------

ధర్మాకృతి

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 3


రెండవసారి 1944 వచ్చేసరికి రమణ భక్తులకు కంచి స్వామిపై అత్యంత ఆదరభావమేర్పడింది. అప్పటికి కంచిస్వామి అనేకమంది భక్తులను రమణుల సలహాపై ఆధ్యాత్మికోన్నతి సాధించవలసినదిగా సూచించి పంపారు. 1930లో ఒక పంజాబీని, 1929 పాల్ బ్రంటన్ ను, ఇలా తమ మద్రాస్ ఉపన్యాసములలో రమణులకు జీవన్ముక్తులుగా బహుధా ప్రశంసించారు. కంచి భక్తులు రమణుల వద్దకు, రమణ భక్తులు కంచివారి వద్దకు వస్తూనే ఉన్నారు. ఈ రకంగా ఆశ్రమవాసులందరికీ కంచిస్వామిపై ఒక గౌరవభావం ఏర్పడింది.


భగవాన్ ఆశ్రమవాసులందరినీ ఒకవేళ కంచిస్వామి లోపలికి రాకుండా వెళ్ళిపోతే తప్పుగా అనుకోవద్దనీ, వారిని దర్శనం చేయమనీ సంసిద్ధులను చేశారట. స్వామివారు 8-9గం. మధ్య గేటు దరిదాపులకు వచ్చారు. ఆశ్రమవాసులంతా స్వామిని దర్శించడానికి గేటు వద్దకు వచ్చారు. నాగమ్మ గారు తాము ఒక్కరే రమణుల వద్ద మిగిలామని వ్రాశారు. రమణులు తాము మామూలుగా కూర్చుండే స్థలంలోనే కూర్చుని ఉన్నారు. “ఏం నీవు వెళ్ళలేదే” అన్నారట. ఆమెనుద్దేశించి “వారికి నావంటి వారిని (సకేశి బ్రాహ్మణ పూర్వ సువాసినులను) చూడరాదన్న నియమమున్నది కదా! వారి నియమాన్ని నేనెందుకు భంగపరచాలి” అని సమాధానమిచ్చారు. నాగమ్మగారు. అది సరి! అంటూ ఆదరపూర్వకమైన దృష్టితో చూసి మౌనం వహించారు. తరువాత కొంతసేపటికి అందరూ వచ్చి శ్రీవారు గేటువద్ద కొంచెం సేపు నిలబడి పరకాయించి చూసి వెళ్ళిపోయారని భగవాన్ తో విన్నవించారు.


అంతకుముందు కల్లూరు వీరభద్రశాస్త్రిగారు నాగమ్మ గారితో ‘స్వామివారిని చూసి వచ్చారా” అని ప్రశ్నించారట. దానికి ఆమె ‘నాకసలు భగవానుని వదిలి ఎక్కడకూ వెళ్లాలని లేదు. అయినా ఆ మాట బయటపెట్టక నాలాంటి వారిని వారు చూడరుకదా అన్నాను” అంటారు. నాగమ్మ గారి అనన్య భక్తి అతి శ్లాఘనీయమైనది. రమణ భగవానులు కూడా వారిపై అంతటి కృప చూపారని మనకు అనేక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. అయితే అయినా “ఆ మాట బయట పెట్టక” పోవడమెందుకో?


రమణుల తండ్రిగారి పేరు సుందరుడు, తల్లి గారి పేరు సుందరమ్మ(అలఘమ్మ) – పుత్రుని పేరు రమణులు. ఎంతో సబబుగా ఉంది – అమ్మగారు అవసాన కాలంలో రమణుల వద్దనే ఉన్నారు. రమణులు ఇద్దరి విషయంలో విషయ వాసనలను లయింప జేసి ముక్తి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. శిరస్సు మీద ఉరము మీదా చేతులుంచి తమ యోగబలంతో విషయ వాసనలన్నీ హృదయంలో లయింపజేశారు. పళని స్వామి విషయంలో భగవాన్ చేయి తీయగానే ప్రాణోత్క్రమణ జరిగింది. ప్రయత్నం ఫలించలేదు. అమ్మ విషయంలో రమణులు మరింత జాగ్రత్త వహించి చాలాసేపు చేతులలానే ఉంచారు.

 

“అమ్మ ముక్తి పొందింది. స్నానాలు అక్కరలేదు, మైల లేదు” అని చెప్పి సన్యాసాశ్రమార్హమైన ఖననం చేయించి శివలింగ ప్రతిష్ఠ చేయించారు. ఆ శివలింగానికి రమణుల సమక్షంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అక్కడ మహాన్యాసం చెప్పిన వేదపండితులు కంచి పీఠానికి సాయంకాల అర్చనలో పాల్గొనడానికి వచ్చారు. మహాస్వామి వారు వారిని శుద్ధి స్నానం చేసి లోనికి ప్రవేశించమన్నారు, (ఇక్కడ నాగమ్మ గారు స్వామివారు వారికి నిషేధ పత్రికలిచ్చారని వ్రాశారు. శ్రీమఠంలో అట్టి రికార్డులేమీ లేవు. పైన చెప్పింది కుంజస్వామిగారు చెప్పిన భోగట్టా) వారు నిర్ఘాంతపోయారు. మొట్టమొదట స్త్రీలకు సన్యాసార్హత ఉన్నదా! ఒకవేళ ఉన్నదనుకొన్నా రమణుల తల్లిగారికి విధివత్తుగా సన్యాసమెవరిచ్చారు? అందువల్ల ఆమె సమాధి స్మశానం అవుతుంది. శుద్ధి స్నానం చేస్తే కానీ మడి కాదన్నది ఈ సూచన అభిప్రాయం. స్వామివారికి కూడా రమణుల ఆధ్యాత్మికౌన్నత్యాన్ని వారు అంతకు ముందే అనేక పర్యాయాలు వేనోళ్ళ శ్లాఘించారు. అంతెందుకు. గిరి ప్రదక్షిణం నాటి సాయంకాలమే బహిరంగ సభలో “అన్ని ఆశ్రమాలకూ కట్టుబాట్లున్నాయనీ, అవి ఉల్లంగించేందుకు వీలు లేదనీ, అత్యాశ్రమము అవధూతాశ్రమమని ఆ భాగ్యం రమణుల వంటి మహానీయులతో సాధ్యమనీ’ ఉపన్యసిన్చారని నాగమ్మగారు వ్రాశారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మనస్సున నాటిన మాటలు

 శ్లోకం:☝️

*రోహతే సాయకైర్విద్ధం*

  *వనం పరశునా హతం l*

*వాచా దురుక్తం భీభత్సం*

  *న సంరోహతి వాక్ క్షతం ll*

  - విదురనీతి, ఉద్యోగపర్వం

బాణగాయమ్ము కాలాన మాని పోవు 

పరశుఖండిత వృక్షమ్ము పెరుగు మరల

మదిని తాకిన దూషిత మాట లెల్ల

మరల కెప్పుడు నిరతమ్ము మదన పరచు


గోపాలుని మధుసూదనరావు

భావం: బాణం వల్ల కలిగిన గాయం కాలాంతరంలో మానుతుంది. గొడ్డలివేటుకు గురియైన చెట్టు కూడా కొంత కాలానికి చిగురించవచ్చు. కానీ మనస్సున నాటిన మాటలు వెలికి తీయలేము కదా!

శ్రీవారి అభిషేక సేవ

 శ్రీవారి అభిషేక సేవతో పులకించిన హైదరాబాద్ భక్తజనం


హైదరాబాద్, 2022 అక్టోబరు 14: హైదరాబాద్‌లో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారికి అభిషేక సేవ నిర్వహించారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవను దర్శించిన భక్తులు పులకించిపోయారు.


శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించారు .


అభిషేకం ప్రాశస్యం 


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం చేస్తారు.


భగవద్రామానుజుల వారు శ్రీస్వామివారి వక్షఃస్థలంలో ”బంగారు అలమేలుమంగ” ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేలా ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం జరుగుతుంది.


ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న మహాలక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు.


శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. స్వామి వారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా అభిషేకం చూసి తరించాలనుకుంటారు. ఇలాంటి భక్తుల కోరిక తీరుస్తూ హైదరాబాదులో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం భక్తులందరిపై తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగిసింది.


అనంతరం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిజపాదదర్శనం కల్పించారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు అర్చన, రెండో నివేదన, శాత్తుమొర చేపట్టారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

.

.

#abhishekaseva #Tirumala #vaibavotsavalu #Tirupati #tirupatibalaji #tirumalatemple #tirumalatemple #Abhishekam #suprabatham #tomala #koluvu #Namoona #alamelumanga #venkateswaraswamy #venkateswara

SUPREME COURT OF INDIA CALENDAR FOR 2023