14, జూన్ 2024, శుక్రవారం

అప్సరసల పేర్లు↓

 #↓


ఏడుగురు అప్సరసల పేర్లు↓

1) రంభ. 2) ఉర్వశి 3) మేనక  4) తిలోత్తమ 5) సుకేశి 6) ఘృతాచి 7) మంజుగోష.


సప్త సంతానములు↓ అంటే

1) తటాక నిర్మాణం 2) ధన నిక్షేపం 3) అగ్రహార ప్రతిష్ట 4) దేవాలయ ప్రతిష్ట 5) ప్రభంధ రచన 6) స్వసంతానం (పుత్రుడు).

 

తొమ్మిది రకాల ఆత్మలు↓

1) జీవాత్మ 2) అంతరాత్మ 3) పరమాత్మ  4) నిర్మలాత్మ 5) శుద్దాత్మ 6) జ్ఞానత్మ  7) మహాధాత్మ  8) భూతాత్మ  9) సకలాత్మ.


(దశవిధ క్షీరాలు) పదిరకాల పాలు↓

1) చనుబాలు 2) ఆవుపాలు 3) బర్రెపాలు 4) గొర్రె పాలు 5) మేక పాలు 6) గుర్రం పాలు 7) గాడిద పాలు 8) ఒంటె పాలు 9) ఏనుగు పాలు 10. లేడి పాలు.


ముందు ముందు ఇంకొంత తెలుసుకుందాం...

సర్వే సుజనాః సుఖినోభవంతు👐

విప్రతేజం✍️నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు,


ద్వాపరయుగం 🐚* 🔔 *కలియుగం*

 🌹🌷🪷🛕🪷🌷🌹


    *🪈ద్వాపరయుగం 🐚*

      🔔 *కలియుగం* 🔔

*************************

*ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు*


 *శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది.  మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.*


*ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.*


*ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.*


*అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు.*


*ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.*


*దీని తర్వాత  కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.*


*“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.*


*కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.*


*ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.*


*కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.*


*కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.*


*అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు. తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.*


*ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.*


*మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.*


*ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.*


*ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.*


*కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.*


*ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.*


*కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.*


*కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.*


*కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో!*


*కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట , నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.*


*ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...*


*ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.*


    🌹🙏🙏🪷🙏🙏🌹

*సేకరించినది భాగస్వామ్యం* 

            చేస్తున్నాను 

*న్యాయపతి నరసింహారావు*

శ్రీవారి ధ్వజస్తంభం

 🙏🪷🙏🪷🙏

తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ మీకు తెలుసా?

🛕🛕🛕🛕🛕

కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల

పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల

ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం 

చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్ 

రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.

వందల కంఠాలు"గోవిందా! గోవిందా!" 

అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి 

నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి 

గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ 

చేరుకుంది. డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.

కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి. 

చుట్టూ చూశాడు. వేలాది యువతులు 

హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ 

తన్మయులైనారు.


అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డిగారికి,

ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి

నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు,

ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి.

ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం.

ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ

మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు

దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు

దొర్లిపడవచ్చు,మీరు హామీ ఇస్తే పైకి చేర్చి 

తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో

పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి

అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను,

పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు 

బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ

బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే

మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి.

పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో పడిపోతుందేమో

అని వెనుక వారికి భీతి కలిగేది.

ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ 

సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..

సూర్యాస్తమయం లోగా

ట్రాలీ తిరుమల చేరిపోయింది. 

వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో

గోవిందా..గోవిందా..నామస్మరణతో 

తిరుమల కొండ ప్రతిధ్వనించింది!

☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం 

దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న 

ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు 

క్షేమంగా చేరుకున్నాయి👌


🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?


నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు 

టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 

తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. 

అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు 

తాపడానికి పాలిష్ చేయడం.

నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన 

ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు 

ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు.

ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!

అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య!

ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల

గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో 

అసలు విషయం బయటపడింది. 

ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే 

ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో 

ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? 

మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచిఉంది? 

కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. 

రేపో మాపో అది కూలిపోవచ్చు!

మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?

వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో 

చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు 

బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు! 

కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్! 

స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.

స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం 

జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.

అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం" 

అని ప్రకటించారు👌

ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!


🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం 

ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.! 


ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,

కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న 

ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక

కల్గిన టేకు చెట్టు అయివుండాలి. 


ఎక్కడ? ఎక్కడ?


ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?

☘పాత మాను గురించి తెలుసుకుంటే 

దొరుకుతుంది అని 190 సంవత్సరాల 

రికార్డులన్నీ పరిశీలిస్తే..

ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు. 

మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి 

నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం. 

ఈ కొద్ది రోజుల్లో మనం..... 

ఇది చేయగలమా????ప్రశ్నలు???


🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన

ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు 

ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు 

రేడియోలో విన్నాను. అటువంటి మానులు 

కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి. 

మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను!

వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి,

అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా 

ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో 

కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావుగారు 

కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి 

వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.

ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.

ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా 

ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు. 

సమస్య అక్కడితో అయిపోలేదు.

దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని 

మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి 

తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే

బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..

సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం

మాకు ప్రసాదించండి అని..దుంగల్ని 

క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు. 

ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ

బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు 

లేకుండా తిరుమల చేరుకుంది!

1982 జూన్ 10వ తేదీన 

ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!


🍁ఉత్సవం చివరన నాగిరెడ్డిగారు ట్రైలర్ 

యజమానికి 70 వేల రూపాయల చెక్కును 

అందించారు! యజమాని.. 

"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు 

ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!" 

అని దానిని తిరస్కరించారు!

డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.

స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్, 

ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను

సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!

అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో 

కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన 

ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి 

సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..

ఆయన రెండు చేతులూ జోడించి 

ఆనందడోలికల్లో మునిగిపోయారు!

🙏🔵🙏🔵🙏

గురువార్పణం

 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏


*గురువార్పణం**🙏


ఒక పేద,అమాయకపు *గురు** భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ గురువార్పణం అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ గురువార్పణం మనడం మొదలుపెట్టింది.


ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే నిద్ర లేవగానే గురువార్పణం, పడుకొనే ముందు గురువార్పణం, భుజించే ముందు, భోజనం తరువాత, బయటకెళ్ళే ముందు ఇంటికొచ్చిన తరువాత..గురువార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ గురువార్పణం అనటమే


ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.


ఆ ఊళ్లోని ఒక అవధూత/*గురువు**పాత దేవాలయంలో *గురువు**పై చెత్త, గోమయం పడుతోంది... ప్రతీ రోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎవరికీ అర్ధంకాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ *గురువు**పై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆ దేశపు రాజు దగ్గరకు తీసుకుపోయారు.


రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ గురువార్పణమంది.


మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... . ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ...ఆమె కటిక నేల పై పడుకొనే ముందు గురువార్పణమనుకుంది. రెండవ రోజు *గురువు**గారి విగ్రహం నేలపై పడుకొనుంది.


ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా గురువార్పణం అనగానే గాయం మాయమయ్యింది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.


అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు.


“మహాప్రభో *గురువు**గారి విగ్రహం బ్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వ ట్లేదు” అని వాపోయారు.


రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని.


“నాకు తెలియదు” అంది...


“సరే ఏదో మంత్రం చదివావట కదా ?” అని ప్రశ్నిస్తే ఆమె గురువార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది.


సభలోని వారందరూ హతాశులయ్యారు.


ఆమెని “నీకు గురువార్పణమంటే ఏమిటో తెలుసా?” అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.


సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు గురువార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు.


ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్త పోసాను. నా గాయాన్ని *గురువు**కి అంటగట్టా ను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ అవధూత/గురువు ఆలయానికి పరుగు పరుగునపోయింది.


*గురువు**ని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు గురువార్పణమనడం మొదలుపెట్టింది. ఆ *గురువు** గారు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టారు,


సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు.


  భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండా రాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.మన *గురువు**


ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న అవధూత /*గురువు**

లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటా రా?!


ఎందుకు ఇంక ఆలస్యం ఒకసారి గురువార్పణం' అని అనుకుందాం,


సర్వే జనాః సుఖినోభవంతు

*సర్వం గురుమయం **🙏

*సర్వం గురువార్పణమస్తు**🙏

GRT హోటల్ కాశి/వారణాసిలో

 GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.


దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.


మేము ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేసాము....

పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.


గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.


మేము గత అమావాస్యకు అక్కడ ఉన్నాం ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్నాము... మేము డైనింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది ఉల్లి/వెల్లుల్లి లేని ఆహారం అని సూచించే పెద్ద బోర్డు ఉంది. అనేక రకాల వస్తువులు.... నిజానికి బయటి ఆహారం మనకు సరిపడదు కాబట్టి వారు తమ అతిథులను అక్కడ మాత్రమే తినమని పట్టుబట్టారు.

ఖాళీ చేస్తున్నప్పుడు ఆ అన్నదాన ట్రస్ట్ కోసం సహకారం అందించాలనుకున్నాము.. వారు అంగీకరించలేదు...


ఒక టిప్ బాక్స్ ఉంది... టిప్ ఇవ్వడం తప్పనిసరి కాదు... కానీ మేము అది లేకుండా వెళ్లలేము ఎందుకంటే వారి సేవ నిజంగా అద్భుతమైనది.... మీరు చుట్టూ తిరగడానికి అక్కడ చాలా EVలు లభిస్తాయి... V ఆనందించారు మేము అక్కడ ఉండడానికి మరియు GRT యొక్క సేవ నుండి టోపీలు...

వారణాసికి వెళ్లే ఎవరైనా, GRTలో ఉండండి... గది అద్దె కూడా చాలా చౌకగా ఉంటుంది... గదులు స్టార్ హోటల్ గదుల్లా ఉన్నాయి... సరికొత్త మోడల్ హైఫై ఫిట్టింగ్స్‌తో. 


ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రదేశాలు... శంకర మఠం, గంగానది, విశ్వనాథర్ ఆలయం మరియు ఇతర దేవాలయాలకు వెళ్లడానికి మీకు పుష్కలంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయి.


GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.


వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...

https://www.grtkasichatram.com/ లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.


కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻


ఓం నమః శివాయ 🌹🙏🌹


www.grtkasichatram.com

ఎద్దు కధ

 💦 *`చందమామ కథలు (Chandamama Kathalu) - 138`*


*🐥ఎద్దు కధ:*


*అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.*


*గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.*


*ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.*


*పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.*


*గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.*


*గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.*


*"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!*


*దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'*


*గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.*


*తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!*


*గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.*


*చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...*


*జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.*


*ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి.*

కణాదుడు

 *కణాదుడు:* క్రీ. పూ. 2 వ శతాబ్ది.


జాల సూర్య మరీచి స్థం

యత్ సూక్ష్మ్యం దృశ్యతే రజః

ప్రధమం తత్ పరిమాణానాం

త్రస రేణు రితి స్మృతిః


విభజించడానికి వీల్లేనటువంటి పరమాణువు పరిమాణం గురించి చెప్తూ, కిటికీల ద్వారా ప్రసరించు సూర్యరశ్మి సోకినప్పుడు కంటికి కనబడే అత్యంత సూక్ష్మమైన ధూళికణాల పరిమాణంలో ‘త్రసరేణం’ అంటే ఆరోభాగపు  పరిమాణం అని చెప్పబడింది. సూర్యరశ్మిలో కనపడే అతిసూక్ష్మ కణము అంగుళములో 349525 వభాగం. దానిలో ఆరింట ఒక వంతు మాత్రమే పరమాణు పరిమాణం.అంటే ఘనపు అంగుళంలో అతి సూక్ష్మభావం అని కణాదుడి ప్రతిపాదన.


కణాదుడు తన "అణువైశేషిక సిద్ధాంతం"లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించాడు. సాపేక్షత గురించి కూడా ఈ సిద్ధాంతంలో చెప్పాడు. ఈయన నాస్తికుడు. 🙏

ఎలా ప్రవర్తించాలి

 *మనం ఎలా ప్రవర్తించాలి?* 


 *మైత్రా:* 

 మనం అందరితో స్నేహంగా ఉండాలి.   ఆదిశంకరులు ఒకచోట ఇలాచెప్తూ...

 *ద్వయిమై సంయత్రికో విష్ణుః ఐ వైర్తం కుబ్యసి మయ్యసహిష్ణుః* II 

 “నీకు ఒక్కరికే చైతన్యం ఉంది.   నా దగ్గర కూడా ఉంది.   ఇది ప్రతిచోటా ఉంది.   అలాంటప్పుడు నా మీద నీకెందుకు కోపం?”  అని ఒక శ్లోకంలో చెప్పాడు.   కాబట్టి అందరితో ప్రేమగా మెలగాలి. అదొక్కటే కాదు వారు చెప్పింది....

 *కరుణ ఏవా యసి* 

 మనం అందరిపట్ల దయగా ఉండాలి.   ఇతరుల బాధలను దూరం చేయాలనే కోరికను "కరుణ" అంటారు.   మన కళ్లముందే చాలా మంది బాధపడుతున్నారు.   వారి బాధలను తీర్చే శక్తి మనకు ఉంటే, వారి బాధలను తీర్చాలి.   దానికి విరుద్ధంగా, మనం స్వార్థపరులుగా ఉంటే, ప్రపంచానికి మనవల్ల ఏమి ప్రయోజనం?   పరోపకారం లేని మానవుల కంటే జంతువులు శ్రేష్ఠమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి.   కాబట్టి మన జీవితాలు అర్థవంతంగా ఉండాలంటే మనం ఇతరుల పట్ల దయ చూపాలి.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

వసుచరిత్రలో సవతుల కయ్యం!

 


వసుచరిత్రలో సవతుల కయ్యం!


శా: ఆమందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి 'తౌ

నౌ మేల్మే' లని యార్య యల్గఁ ,బ్రణతుండై ,తత్పదాంభోజ యో

గా మర్షంబున గంగయు న్మొరయఁ జూడాభోగ సమ్యక్క్రియా

సామర్ధ్యంబున వేఁడు శంభుఁడు కృతిస్వామిం గృపన్ బ్రోవుతన్.


వసుచరిత్రము- అవతారిక- రామరాజ భూషణకవి !


ఇది రామరాజ భూషణ కవి రచించిన వసుచరిత్రలోని పద్యం. కృతిపతికి పరమశివుని ఆశీర్వాద మందజేసేపద్యం.

బలే చమత్కారాన్ని రంగరించాడుకవి. ఇద్దరు పెళ్ళాలమొగుఁడు యిరుకున బడక తప్పదేమో? వెనక పారిజాతాపహరణంలో ఆదెబ్బ యెలా ఉంటుందో ముక్కుతిమ్మన గారు మనకు రుచి చూపించారు. సత్య కాలితాపుకి కృష్ణుని తలబొప్పి గట్టింది. దాసుని తప్పు దండంతోసరియని యామె కాళ్ళకు మొక్కి యెలాగో బయట పడ్డాడు.


ఇపుడా సౌభాగ్యం శాంపిల్గా శంకరునకు చవిచూపుతున్నారు మనకవిగారు యీపద్యంలో. వినండి!


" పార్వతి పరమేశ్వరునిపై కోపించిందట. అవును కోపంరాదామరి. తానుండగానే గంగమ్మను తెచ్చి నెత్తిన బెట్టుకుని

ఊరేగుతున్నాడాయె! అందుకే పరమేశ్వరుణ్ణి నిలదీసి గట్టిగా అడిగేసింది. కాదుకాదు మాటలతో కడిగేసింది ' ఆగంగను నెత్తిని బెట్టుకొని ఊరేగుతూ దానిని కప్పిబుచ్చుట కోసమేగదా నన్ను అర్ధనారిగా (సగము ఆడది ) జేసినావు. ఆహా !నీయుక్తి తెలిసినదిలే!

ఎంత మోసకారివి. నిన్ను నమ్మి మోసపోతినిగదా " యని తన యాగ్రహమును ప్రకటింప, వేరుదారిలేక శంకరుడు క్రిందకు తలవంచి యామె పాదములను తాకినాడట! శ్రీకృష్ణుని వలెనే దాసునితప్పు దండముతో సరిపెట్టజూచెనన్నమాట. ఏమైన నేమి శంకరుడు తలవంచ శిరసున నున్న గంగా జలములు ఆమెపాదములను ప్రక్షాళణమొనరించినవి. అనగా గంగకూడ సవతిని పూజించినట్లయినది.మెడలోనున్నపాములుబుసబుసలతోక్షమింపబ్రతిమాలినవి.యిలాచాలాతెలివిగా,  శంకరుడు పాదాభివందనము చేయుటతో,ఇటు సవతి పరిచర్యల నొనరించుటతో నామెకోపము పటాపంచెలయినదట. శంకరుడు సవతికయ్యపు గండమునుండి క్షేమముగా బయటపడినాడట. అట్టి శంకరుడు కృతిభర్తను బ్రోచుగాత! యని యాశీస్సు.


కవి పార్వతిని అర్ధనారీశ్వరిగా నొనర్చుటకు ఒక కారణమును జెప్పినాడు. అట్లు చేయుట వలన నామె సగము

ఆడదియై సంతానమును పొందుటకు అనర్హ యైనదట! సంతానమే స్త్రీజన్మకు సాఫల్యము.గదా! గొడ్రాలును ఉపేక్షించి సంతానము కొరకై మగవాడు మరల పెండ్లియాడుట లోకరీతి. భార్య యుండగా పునర్వివాహ మేల ?యని యడుగు వారికి సమాధానము చెప్పుట సులభమగునుగదా, అదిగో ఆలోకరీతిని అడ్డు జేసికొనుటకై నన్ను అర్ధనారిని జేసి దీనిని నెత్తి కెక్కించు కొన్నావని పార్వతి వాదన! ఆహా! కవికెంత గొప్పయూహ!


అందుకే కిమ్మనకుండా శంకరుడు పార్వతికి మొక్కినాడు.గంగమ్మచేత కాళ్ళుకడిగించినాడు. ఇది చాలా తెలివైన పనిగదా , సరి . ఆమె కోపము పోయినది . శంకరుడు ప్రసన్నత నొందినాడు.


ప్రబంధకవులలో సవతి కయ్యములను ప్రస్తావించిన కవులిద్దరు.తిమ్మన సుదీర్ఘముగా వర్ణించి దానికొరకొక కావ్యమునే(పారిజాతాపహరణము)

వ్రాయగా, రామరాజ భూషణుడు ఒకే ఒక పద్యంతో సరిపెట్టినాడు మిక్కిలి చమత్కారంగా!

                            .స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సంద్యోపాసన

 సంద్యోపాసన ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము?


సంధ్య ఉపాసనకు ఉపాస్య దేవత ఎవరని ఒక ఔత్సాహికుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ప్రశ్నించాడు.


• సూర్యమండలమునా? (ఖగోళ గ్రహమునా? – అది ద్రవ్య రాశి)


• సూర్య దేవతనా? ( పరిమిత శక్తి కల జీవుడా? )


• విశ్వాత్మ అయిన హిరణ్యగర్భుడా? (అతడూ జీవుడే కదా? )


• విశ్వపరిపాలకుడైన ఈశ్వరుడా? ( సాపేక్షమైన బ్రహ్మ కదా?)


• బ్రహ్మమా?


దానికి స్వామి వారు అన్నియును అని చెప్పారు. 


అదెలా కుదురుతుంది ఇవన్నీ వేరు వేరు కదా అని అతడు ప్రశ్నించగా


 ఆయన ఇలా చెప్పారు:


ఉదాహరణకు నన్ను తీసుకోండి. ఎందరో నాపై గౌరవం చూపుతున్నారు.అందరూ గౌరవిస్తున్న వస్తువు “నేనే” అయినప్పటికీ గౌరవం చూపుతున్న వ్యక్తులను బట్టి కొంత కొంత మార్పు జరుగుతున్నది. 


౧. సామాన్య జనులు నా చుట్టును మహా సంస్థానపు ఆర్భాటములైన వస్త్ర భూషణాలు పరివారం చూసి ఆనందిస్తారు


౨. కొందరు నా పీఠాదిపత్యమును గౌరవిస్తారు


౩. కొందరు నా (సన్న్యాస) ఆశ్రమమును చూసి గౌరవిస్తారు


4. కొందరు నా భౌతిక దేహమునకు


5. కొందరు నా భౌతిక స్థితిని వదిలేసి నా అంత:కరణ పారిశుద్ధ్యమును, ఆధ్యాత్మిక బలమును, ఉపాసనా శక్తిని గౌరవిస్తారు


6. చాలా తక్కువమంది నా చిత్తును చూసి గౌరవిస్తారు

కానీ అందరి గౌరవం “నేను” అనబడే నా మీదనే కదా.


 ఉపాసకుని ఉపాసన అతడి స్వభావం పై ఆధార పడివుంటుంది. ఉపాసిన్చేవారిని ఉపాసింపబడే వస్తువు భేదం చూపించదు. కాబట్టి నువ్వు చెప్పిన అన్నీ కూడా ఉపాసనకు అర్హములే. అన్నీ ఒకటే.


 వారి వారి స్థాయిని బట్టి వారి ఉపాసన వుంటుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు నిత్య ఉపాసనలో స్థానములు వున్నవి.


 సంద్యోపాసన అతి సామాన్యముగా తోచినా అత్యుత్తమ స్థాయికి కూడా ఉపయోగపడగలదు. సామాన్య ప్రారంభ సాధకునికి ఎంత ఉపకరిస్తుందో తపస్సిద్ధునకు కూడా అంత ఉపకరిస్తుంది. కాబట్టి దాన్ని తృణీకరించతగదు. విస్మరించడం తప్పు.

పంచాంగం 14.06.2024 Friday.

 ఈ రోజు పంచాంగం 14.06.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: అష్టమి తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం సిద్ది యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి రాత్రి 12:03 వరకు.

ఉత్తరఫల్గుని ఈ రోజు పూర్తిగా ఉంది.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:47


వర్జ్యం : మధ్యాహ్నం 01:15 నుండి మధ్యాహ్నం 03:03 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:14 వరకు తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 01:34 వరకు.


అమృతఘడియలు : రాత్రి 12:05 నుండి 01:53 వరకు..


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

ఈ బ్లాగు మనందరిది

 ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి. 

మూల వేతనంలో 50% పింఛను!*

 *🔊మూల వేతనంలో 50% పింఛను!*


*🍥న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించ నుంది. జాతీయ పింఛను పథకం (ఎన్ పీ ఎస్)లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం( బేసిక్ పే)లో 50% పింఛనుగా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఎన్ పీ ఎస్ పై అభ్యంతరాలు, పలు రాష్ట్రాలు తిరిగి పాత పింఛను విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో 2023లో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్ పీఎస్ ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు చిట్టచివరి మూల వేతనంలో 50% మొత్తాన్ని పింఛనుగా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్ పీ ఎస్ లో మార్పులు చేయాలని కూడా సోమనాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే.. కమిటీ తన సిఫారసులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ఠ గడువు విధించలేదు.*

(14-06-2024) రాశి ఫలితాలు

  (14-06-2024) రాశి ఫలితాలు



గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

  14-06-2024

జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన  వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో  మరింత ఉత్సాహకర  వాతావరణం ఉంటుంది.


వృషభం

  14-06-2024

ఆప్తుల నుండి  ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అంచనాలు  నిజమవుతాయి.  నూతన  వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.  ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. 


మిధునం

  14-06-2024

మీ మాటతీరు ఇతరులకు భాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు  మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు ఉంటాయి. ఉద్యోగమున  అధికారుల కోపానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.


కర్కాటకం

  14-06-2024

నిరుద్యోగులకు  అనుకూల వాతావరణం ఉంటుంది.  సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పాతమిత్రుల ఆగమనంతో  గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి.


సింహం

  14-06-2024

చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో   సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి  వివాదాలు  పరిష్కారమౌతాయి. వృత్తి   వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి.


కన్య

  14-06-2024

కుటుంబ వ్యవహారాలలో  ఆకస్మిక మార్పులుంటాయి.  దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత ఋణాలు తీర్చడానికి  నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు.


తుల

  14-06-2024

ఇంటా బయట  విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని  వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసి వస్తాయి. ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.


వృశ్చికం

  14-06-2024

ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో  కాని  పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు  మందగిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.


ధనస్సు

  14-06-2024

వృత్తి ఉద్యోగాలలో  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి.


మకరం

  14-06-2024

ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు.  గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు  పెట్టుబడులు అందుతాయి.


కుంభం

  14-06-2024

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. మీప్రవర్తన ఇతరులకు  ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.


మీనం

  14-06-2024

పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి.  దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి

*శ్రీ మహతోభర మహాలింగేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 347*


⚜ *కర్నాటక  :-*


*పుత్తూరు - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ మహతోభర మహాలింగేశ్వర ఆలయం*



💠 మహతోభర శ్రీ మహాలింగేశ్వర ఆలయం

పుత్తూరు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. 

ఈ పట్టణంలో 12వ శతాబ్దానికి చెందిన మహాలింగేశ్వర దేవాలయం ఉంది, ఇది శివునికి అంకితం చేయబడింది. శివుడిని కొన్నిసార్లు పుత్తూరు మహాలింగేశ్వరుడు అని పిలుస్తారు.


💠 ఈ ఆలయం కేరళ నిర్మాణ శైలిలో నిర్మించబడింది, ఇది కేరళలోని దక్షిణ రాష్ట్రాలు మరియు పశ్చిమ కనుమలలో ఉన్న చాలా దక్షిణ భారత దేవాలయాలలో సాధారణం.

 ఇది చెక్కతో నిర్మించబడింది. 

మంగళాదేవి అమ్మవారి గుడితో పాటు, ఇతర దేవతలు మరియు దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి


💠 ఆలయంలో పూజించబడిన శివలింగాన్ని ముగ్గురు బ్రాహ్మణులు కాశీ నుండి తీసుకువచ్చారు. పూజల కోసం పుత్తూరులో శివలింగాన్ని ఉంచిన వారు దానిని అక్కడి నుంచి తొలగించలేకపోయారు.


💠 కాశీ విశ్వనాథ ఆలయం తర్వాత ఆలయానికి ఎదురుగా శ్మశాన వాటిక ఉన్న ఏకైక ఆలయం ఇదే.

ఆ ప్రదేశం నుండి శివలింగాన్ని తొలగించడానికి బ్రాహ్మణులు అనేక మంది వ్యక్తుల సహాయం మరియు భూమి రాజును కోరారు. దేశ రాజు మరియు అతని సైనికులు శివలింగాన్ని తరలించడానికి ప్రయత్నించారు, కానీ వారు చేయలేకపోయారు. 


💠శివలింగాన్ని కదల్చడానికి రాజు ఏనుగును ఏర్పాటు చేసాడు.

శివలింగం పరిమాణం పెరిగి మహాలింగేశ్వరుడిగా మారింది మరియు ఈ ప్రక్రియలో ఏనుగు చంపబడింది. 

ఏనుగు ముక్కలు ముక్కలై పుత్తూరులోని వివిధ ప్రాంతాల్లో పడినట్లుగా చెబుతున్నారు.


💠 నేటికీ పుత్తూరు పరిసర ప్రాంతాలకుకె ఏనుగులవి దాని కొమ్ము (కొంబు) పడిపోయిన ప్రదేశానికి 'కొంబెట్టు' అని, కరి పడిపోయింది 'కరియాలా', కాళ్లు పడిపోయాయి (కాలు) 'కర్జాల', చేతి(కై) 'కైపాలా' తోక పడింది 'బీడిమజలు', తల(కథ) 'తాలెప్పాడి' పడింది, వీపు (బేరి) 'బేరిపడవు' పడిపోయింది. పుత్తూరు పరిసరాలలో నేటికీ గుర్తించబడిన మరియు అదే విధంగా పిలవబడే ప్రదేశాల పేర్లు ఇవి. ఏనుగు గుడి ట్యాంకులో పడి చచ్చిపోయినప్పటి నుండి, ఈ రోజు వరకు కూడా ఏనుగులు ట్యాంక్ నీరు తాగి బతకలేవనే బలమైన నమ్మకం ఉంది.


💠 ఆలయంలో పూజించే ప్రధాన మూర్తి 1.5 అడుగుల ఎత్తు ఉంటుంది.

ఆలయానికి రెండు ప్రాంగణాలూ ఉన్నాయి. లోపలి ప్రాంగణం దాని దక్షిణ భాగంలో సప్తమాతృకలైన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైషానవి, వారాహి మరియు చాముండేశ్వరీ దేవి విగ్రహాలతో ఉంది.

అస్థ దిక్పాలకుడు, ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుత, వరుణ, వాయు, కుబేర మరియు ఈశాన విగ్రహాలు కూడా ఉన్నాయి. 


💠 పుత్తూరు మహాలింగేశ్వర మందిరము ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడింది మరియు ఆలయానికి ఎదురుగా రుద్రభూమి (శ్మశాన వాటిక) ఉంది. 

పశ్చిమాన పెద్ద చెరువు, చెరువులో నీరు పచ్చగా మారి ఏనుగులకు విషతుల్యమైనట్లు చెబుతున్నారు. చెరువు మధ్యలో ఒక మంటపం ఉంది, ఇక్కడ వర్షం కురిపించే దేవుడు వరుణ విగ్రహం ఉంది. సరస్సులో వివిధ రకాల చేపలు ఉన్నాయి.


💠 ప్రధాన ఆలయం చుట్టూ ఇతర చిన్న దేవాలయాల సముదాయం ప్రాకార గుడిలు అంటే పార్వతి గుడి, సుబ్రమణ్య గుడి, గణపతి గుడి, సాస్తావు గుడి మరియు ఇతర గుడిలు లేదా దైవాలు అంటే పంజుర్లి; పిలిబూత, రక్తేశ్వరి, అంగనాథ ఆలయాలు.


💠 పుత్తూరు శ్రీ మహాలింగేశ్వర ఆలయం రథోత్సవం అని పిలువబడే పండుగకు ప్రసిద్ధి చెందింది . ఏప్రిల్ నెలలో వైభవంగా జరుపుకునే ఈ ఆలయ ప్రధాన పండుగలలో ఇది ఒకటి. దాదాపు పది రోజుల పాటు ఈ పండుగ వేడుకలు జరుగుతాయి.

ఈ పండుగ వేడుకలో బాణసంచా చెప్పుకోదగిన అంశం. 

అంచనాల ప్రకారం, పుత్తూరు మహాలింగేశ్వర ఆలయాన్ని రథోత్సవం జరుపుకోవడానికి సుమారు 1 లక్ష మంది భక్తులు సందర్శిస్తారు. 


💠 పుత్తూరు శ్రీ మహాలింగేశ్వరునికి పడమటి వైపున ఒక చెరువు ఉంది. పురాతన కాలంలో ఈ చెరువులో ముత్యాలు ఉండేవని ప్రజల నమ్మకం . చెరువు యొక్క రాతి మెట్లు నీటికి దారి తీస్తుంది. స్థానిక మాండలికం ప్రకారం, ముత్తు అంటే ముత్యాలు. చెరువులో దొరికిన ముత్యాల మూలంగా ఆలయానికి ముత్తూరు అనే పేరు మొదట్లో వచ్చిందని, ఆ తర్వాత ముత్తూరు పుత్తూరుగా మారింది.


💠 ఈ ఆలయం మంగళూరుకు ఆగ్నేయంగా 51.2 కిలోమీటర్ల దూరంలో ఉంది.

AGNIPATH Recruitment

 Indian Army Indian Army AGNIPATH Recruitment


*  Vacancy      : 46,000 Posts

*  Job Role     : Agniveer

*  Qualify        : 8th, 10th, 12th

*  Age             : 17 to  23

*  Salary         : Rs.30,000 - 40,000/-

*  Location     : All Over India

*  Selection    : Physical, Medical

*  Apply Mode: Online


This message is very useful for the job seeker. Kindly share this information with at least one group, Benefits of *AGNIPATH*


1st Year: Rs.21000 × 12 = Rs. 2,52,000

2nd Year: Rs.23100 × 12 = Rs. 2,77,200

3rd Year: Ra.25580 × 12 = Rs. 3,06,960

4th Year: Rs.28000 × 12 = Rs. 3,36,000

*4 Years Total = Rs.11,72,160*


Retirement Time after 4th Year: Rs.*11,71,000* 


Grand Total after 4th Year = Rs. *23,43,160*


Plus:

1. Excellent Army Training,

2. Food, Clothes, Boarding & Lodging @ Army Regimental Life for 4 years.

3. Disciplined Lifestyle and

4. Matured Mindset.


*Job Offers* after 4 Years from:


1. Tri-Forces (Army, Navy, Airforce)

2.. CRPF

3. Railway Protection Force

3. GRP

5. CISF

6. BSF

7. Customs & Central Excise

8. Forest Departments

9. ONGC

10. IOCL

11. HPCL

12. Indian Railways

13. State Police

14. Banks

15. Airports

16. Seaports

17. Traffic Police Depts

18. Toll Plazas

19. ATMs

20. NMDC

21. SAIL

22. All Central PSUs

23. All State PSUs.

24. Task Force

25. Corporates like TATAs, Wipros, Mahindras.

26. Private Security Agencies

27. Logistics Companies

28. Cargo Companies

29. Warehousing Cos.

30. Road Transport Corps (RTCs)

31. Private Transport Cos.

32. Airliners (Indigo, SpiceJet, Tata Vistara etc etc)

33. Community Policing.

*and Many MORE...*


And, youth get excellent training to face rioters/looters/anti-social elements.


So, Dear YOUTH, please urgently learn that AGNIPATH is very important in your life and a Great Gift. No doubt in it.


And, *10% Quota for Agniveers in Coast Guard, Defence, Civilian Posts, and in nearly 100 Defence PSUs & Defence R&D Units* viz....

1. Hindustan Aeronautics Ltd (All 38 Divisions/Units of HAL and HAL JV Companies)

2. Bharat Electronics Ltd (all 10 Units)

3. Bharat Dynamics Ltd

4. BEML Ltd.

5. Mishra Dhatu Nigam Limited (MIDHANI)

6. Mazagon Dock Shipbuilders Limited (MDL)

7. Garden Reach Shipbuilders and Engineers Ltd (GRSE)

8. Goa Shipyard Limited (GSL)

9. Hindustan Shipyard Ltd

10. Advanced Weapons & Equipment India Limited

11. Gliders India Ltd

12. Troop Comforts Ltd

13. Armoured Vehicles Nigam Limited (AVNL)

14. Munitions India Limited (MIL)

15. Yantra India Limited (YIL)

16. India Optel Limited (IOL)

17. Defence Research and Development Organisation (DRDO) Labs/Units

18. Advanced Centre for Energetic Materials (ACEM)

19. Advanced Numerical Research & Analysis Group (ANURAG)

20. Advanced Systems Laboratory (ASL)

21. Aerial Delivery Research & Development Establishment (ADRDE)

22.Aeronautical Development Establishment (ADE)

23. Armament Research & Development Establishment (ARDE)

24. Centre for Air Borne System (CABS)

25. Centre for Artificial Intelligence & Robotics (CAIR)

26. Centre for Advanced Systems (CAS)

27. Integration of Strategic Systems

28. Centre for Military Airworthiness & Certification (CEMILAC)

29. Centre for Personnel Talent Management (CEPTAM)

30. Centre for Fire, Explosive & Environment Safety (CFEES)

31. Centre for High Energy Systems and Sciences (CHESS)

32. Centre for Millimeter Wave Semiconductor Devices & Systems (CMSDS)

33. Combat Vehicles Research & Development Establishment (CVRDE)

34. Defence Avionics Research Establishment (DARE)

35. Defence Bio-engineering & Electromedical Laboratory (DEBEL)

36. Defence Electronics Applications Laboratory (DEAL)

37. Defence Scientific Information & Documentation Centre

38. Defence Food Research Laboratory (DFRL)

39. Defence Institute of Bio-Energy Research (DIBER)

40. DRDO Integration Centre (DIC)

41. Integration of Strategic System

42. Defence Institute of High Altitude Research (DIHAR)

43. High Altitude Agro-animal Research

44. Defence Institute of Physiology & Allied Science (DIPAS)

45. Defence Institute of Psychological Research (DIPR)

46. Defence Laboratory (DL)

47. Defence Electronics Research Laboratory (DLRL)

48. Defence Materials & Stores R&D Establishment (DMSRDE)

49. Defence Metallurgical Research Laboratory (DMRL)

50. Defence Research & Development Establishment (DRDE)

51. Defence Research & Development Laboratory (DRDL)

52. Defence Research Laboratory (DRL)

53. Defence Terrain Research Laboratory (DTRL)

54. Gas Turbine Research Establishment (GTRE)

55. High Energy Materials Research Laboratory (HEMRL)

56. Institute of Nuclear Medicine & Allied Sciences (INMAS)

57. Institute of Systems Studies & Analyses (ISSA)

58. Institute of Technology Management (ITM)

59. Instruments Research & Development Establishment (IRDE)

60. Integrated Test Range (ITR)

61. Joint Cypher Bureau (JCB)

62. Laser Science & Technology Centre (LASTEC)

63. Electronics & Radar Development Establishment (LRDE)

64. Military Institute of Training (MILIT)

65. Mobile Systems Complex (MSC)

66. Microwave Tube Research & Development Centre (MTRDC)

67. Naval Materials Research Laboratory (NMRL)

68. Naval Physical & Oceanographic Laboratory (NPOL)

69. Naval Science & Technological Laboratory (NSTL)

70. Proof and Experimental Establishment (PXE)

71. Recruitment and Assessment Center (RAC)

72. Research Centre Imarat (RCI), HYD

73. Research & Development Establishment (Engrs)

74. DRDO Research & Innovation Centre (RIC)

75. Scientific Analysis Group (SAG)

76. Snow and Avalanche Study Establishment (SASE)

77. Snow and Avalanche Complex

78. Solid State Physics Laboratory (SSPL)

79. Terminal Ballistics Research Laboratory (TBRL)

80. Vehicle Research & Development Establishment (VRDE)


Copied


* Vacancy : 46,000 Posts

* Job Role : Agniveer

* Qualify : 8th, 10th, 12th

* Age : 17 to 23

* Salary : Rs.30,000 - 40,000/-

* Location : All Over India

* Selection : Physical, Medical

* Apply Mode: Online


This message is very useful for the job seeker. Kindly share this information with at least one group, Benefits of *AGNIPATH*


1st Year: Rs.21000 × 12 = Rs. 2,52,000

2nd Year: Rs.23100 × 12 = Rs. 2,77,200

3rd Year: Ra.25580 × 12 = Rs. 3,06,960

4th Year: Rs.28000 × 12 = Rs. 3,36,000

*4 Years Total = Rs.11,72,160*


Retirement Time after 4th Year: Rs.*11,71,000* 


Grand Total after 4th Year = Rs. *23,43,160*


Plus:

1. Excellent Army Training,

2. Food, Clothes, Boarding & Lodging @ Army Regimental Life for 4 years.

3. Disciplined Lifestyle and

4. Matured Mindset.


*Job Offers* after 4 Years from:


1. Tri-Forces (Army, Navy, Airforce)

2.. CRPF

3. Railway Protection Force

3. GRP

5. CISF

6. BSF

7. Customs & Central Excise

8. Forest Departments

9. ONGC

10. IOCL

11. HPCL

12. Indian Railways

13. State Police

14. Banks

15. Airports

16. Seaports

17. Traffic Police Depts

18. Toll Plazas

19. ATMs

20. NMDC

21. SAIL

22. All Central PSUs

23. All State PSUs.

24. Task Force

25. Corporates like TATAs, Wipros, Mahindras.

26. Private Security Agencies

27. Logistics Companies

28. Cargo Companies

29. Warehousing Cos.

30. Road Transport Corps (RTCs)

31. Private Transport Cos.

32. Airliners (Indigo, SpiceJet, Tata Vistara etc etc)

33. Community Policing.

*and Many MORE...*


And, youth get excellent training to face rioters/looters/anti-social elements.


So, Dear YOUTH, please urgently learn that AGNIPATH is very important in your life and a Great Gift. No doubt in it.


And, *10% Quota for Agniveers in Coast Guard, Defence, Civilian Posts, and in nearly 100 Defence PSUs & Defence R&D Units* viz....

1. Hindustan Aeronautics Ltd (All 38 Divisions/Units of HAL and HAL JV Companies)

2. Bharat Electronics Ltd (all 10 Units)

3. Bharat Dynamics Ltd

4. BEML Ltd.

5. Mishra Dhatu Nigam Limited (MIDHANI)

6. Mazagon Dock Shipbuilders Limited (MDL)

7. Garden Reach Shipbuilders and Engineers Ltd (GRSE)

8. Goa Shipyard Limited (GSL)

9. Hindustan Shipyard Ltd

10. Advanced Weapons & Equipment India Limited

11. Gliders India Ltd

12. Troop Comforts Ltd

13. Armoured Vehicles Nigam Limited (AVNL)

14. Munitions India Limited (MIL)

15. Yantra India Limited (YIL)

16. India Optel Limited (IOL)

17. Defence Research and Development Organisation (DRDO) Labs/Units

18. Advanced Centre for Energetic Materials (ACEM)

19. Advanced Numerical Research & Analysis Group (ANURAG)

20. Advanced Systems Laboratory (ASL)

21. Aerial Delivery Research & Development Establishment (ADRDE)

22.Aeronautical Development Establishment (ADE)

23. Armament Research & Development Establishment (ARDE)

24. Centre for Air Borne System (CABS)

25. Centre for Artificial Intelligence & Robotics (CAIR)

26. Centre for Advanced Systems (CAS)

27. Integration of Strategic Systems

28. Centre for Military Airworthiness & Certification (CEMILAC)

29. Centre for Personnel Talent Management (CEPTAM)

30. Centre for Fire, Explosive & Environment Safety (CFEES)

31. Centre for High Energy Systems and Sciences (CHESS)

32. Centre for Millimeter Wave Semiconductor Devices & Systems (CMSDS)

33. Combat Vehicles Research & Development Establishment (CVRDE)

34. Defence Avionics Research Establishment (DARE)

35. Defence Bio-engineering & Electromedical Laboratory (DEBEL)

36. Defence Electronics Applications Laboratory (DEAL)

37. Defence Scientific Information & Documentation Centre

38. Defence Food Research Laboratory (DFRL)

39. Defence Institute of Bio-Energy Research (DIBER)

40. DRDO Integration Centre (DIC)

41. Integration of Strategic System

42. Defence Institute of High Altitude Research (DIHAR)

43. High Altitude Agro-animal Research

44. Defence Institute of Physiology & Allied Science (DIPAS)

45. Defence Institute of Psychological Research (DIPR)

46. Defence Laboratory (DL)

47. Defence Electronics Research Laboratory (DLRL)

48. Defence Materials & Stores R&D Establishment (DMSRDE)

49. Defence Metallurgical Research Laboratory (DMRL)

50. Defence Research & Development Establishment (DRDE)

51. Defence Research & Development Laboratory (DRDL)

52. Defence Research Laboratory (DRL)

53. Defence Terrain Research Laboratory (DTRL)

54. Gas Turbine Research Establishment (GTRE)

55. High Energy Materials Research Laboratory (HEMRL)

56. Institute of Nuclear Medicine & Allied Sciences (INMAS)

57. Institute of Systems Studies & Analyses (ISSA)

58. Institute of Technology Management (ITM)

59. Instruments Research & Development Establishment (IRDE)

60. Integrated Test Range (ITR)

61. Joint Cypher Bureau (JCB)

62. Laser Science & Technology Centre (LASTEC)

63. Electronics & Radar Development Establishment (LRDE)

64. Military Institute of Training (MILIT)

65. Mobile Systems Complex (MSC)

66. Microwave Tube Research & Development Centre (MTRDC)

67. Naval Materials Research Laboratory (NMRL)

68. Naval Physical & Oceanographic Laboratory (NPOL)

69. Naval Science & Technological Laboratory (NSTL)

70. Proof and Experimental Establishment (PXE)

71. Recruitment and Assessment Center (RAC)

72. Research Centre Imarat (RCI), HYD

73. Research & Development Establishment (Engrs)

74. DRDO Research & Innovation Centre (RIC)

75. Scientific Analysis Group (SAG)

76. Snow and Avalanche Study Establishment (SASE)

77. Snow and Avalanche Complex

78. Solid State Physics Laboratory (SSPL)

79. Terminal Ballistics Research Laboratory (TBRL)

80. Vehicle Research & Development Establishment (VRDE)


Copied

రసవాద విద్య

 రసవాద విద్య  -  మూలికలతో  బంగారం చేయు విద్య 


         ప్రాచీన కాలంలో వనమూలికలు తోను , పాదరసంతోను కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ప్రతీతి. 10 వ శతాబ్దంలో కృత్రిమంగా బంగారం రూపొందించే ప్రక్రియ వ్యవహారంలో ఉండేది . 11 వ శతాబ్దంలో ఆల్బెరూని అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడ సిద్దులు బంగారం తయారుచేసేవారని పేర్కొన్నాడు నాగర్జునికి ముందు, తరువాత కూడా ఎన్నొ గ్రంథాలలో బంగారం తయారుచేసే పద్దతులు, ప్రస్తావనలు ఉన్నాయి .దేశంలో కరువుకాటకాలు సంభవించినప్పుడు రసాయనాచార్యులు కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ఆ బంగారం వల్ల ప్రజలు ఆకలిచావుల నుంచి రక్షించబడే వారు అని అనేక గ్రంథాలలో ఉంది.


                  రాగి మొదలయిన చవుక లోహాలని సువర్ణం గా మార్చే విద్య ని రసవాద విద్య అని అంటారు. కొన్ని ప్రదేశాలలో " స్వర్ణ కరణి " పగార విద్య అని కూడా అంటారు. ఈ విద్యని ఉర్దూ భాషలో " కీమియా " అని , ఇంగ్లీషు భాషలో "ఆల్కెమీ " అని అంటారు.  ఆధునిక పరిశొధకులు బంగారం పదార్దం కదా ! దానిని సృష్టించుట యేమి అంటారు.పిచ్చి అనికూడా అంటారు.


          రసవాద విద్య ప్రకారం నీచ లోహాన్ని ఉత్తమలోహంగా మార్చే ఒక వస్తువుని " పర్శవేది " అంటారు. ఈ పరుశవేది రాయి అని, ద్రవపదార్ధం అని, గడ్డిలాంటిది అని తర్జనభర్జన చేసిన వారిలొ మనదేశియులే కాక " బ్రవున్ దొర " లాంటి విదేశీయులు ఉన్నారు .  రసవాద విద్యలో పాదరసాన్ని శుద్ది సంస్కార విధానాలతో ప్రభావితం చేసి చవుకలో బంగారంగా మార్చడం మరొక సామెత కూడా ఉంది. ఇతర విదానాలతో స్వర్ణం చేయడం సిద్ధించక బ్రష్టుడై పిచ్చివాడు కావొచ్చేమో కాని రసవాద విద్యలో భ్రష్టుడైనా ఫలితం ఉంటుంది. ఎందుకంటే రసవాద విద్య తెలిసినవాడు అనేక ములికలుపైన పరిశోదిస్తాడు కావున ఒక మంచి వైద్యంలో శ్రేష్టుడు అవుతాడు. అయితే ఆదునిక పరిశొధకులు అన్నట్లు బంగారం ఒక మూల పదార్దం ( ఎలిమెంట్ ) అణు సంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 సూచికా అన్నం A U కాంతి  లొహ సమ్భన్ధమైనధి. 


        రసవాద విద్య నందు ఆరితేరిన వారిలొ ఆదిమ చంద్రసేనుడు, లంకేశ్వరుడు ( రావణుడు )  మత్తమాన్డవ్య ఇంద్రధత్త కలంబి, నాగార్జునుడు , రుశిశృంగ, రసేన్ద్రతిలక, భాలుకి, మైధిల హరీశ్వర మొదలుగా గల 27 మహామహుల చేత ను , సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్బాట  చార్యుడు , వేమనయోగి ముఖ్యులు . 


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034