24, ఏప్రిల్ 2024, బుధవారం

లోకోక్తి

 *లోకోక్తి*...


1) *పది,పన్నెండేళ్ళ వయస్సు లో*......

...ఏం చదువు తున్నావ్?


2) *ఇరవై,ఇరవై రెండేళ్ల వయసొచ్చాక* .......ఏం ఉద్యోగం చేస్తున్నావ్?


3) *ముప్పయి,ముప్పయి రెండేళ్ల ప్రాయం లో*.........పెళ్లి అయిందా, పిల్ల లెంత మంది?


4) *నలభై, నలభై రెండేళ్ల ఏళ్ళు వచ్చాక.*........ పిల్లలేం చదువుతున్నారు?


5) *యాభై, యాభై రెండేళ్ల వయస్సు లో*.........పిల్లలు ఏం ఉద్యోగం చేస్తున్నారు,సంభంధాలు చూస్తున్నారా,పెళ్లి చేశారా?


6) *అరవై,అరవై రెండేళ్ల సంవత్సరాల్లో*......... మనవలు ఎంతమంది?


7) *డెబ్బయి,డెబ్బయి రెండేళ్ల వయస్సు లో*...........(నువ్వు ఇంకా తిరుగుతూ వుంటే)....ఆరోగ్యం బాగుంటోందా?


8) *ఎనభై, ఎనభై రెండేళ్ల కు*..... నడవలేవు...మంచాన్ని అంటిపెట్టుకుంటావు....నిన్ను ఎవరు ఏమి అడగరు...అడిగిన వినపడదు...వినపడిన చెప్పలేవు...చెప్పిన వినరు....మొహమాటం కొద్ది పలకరిస్తారు....నీ నుంచి జవాబు ఆశించరు....నీతో మాట్లాడే వాళ్ళే వుండరు...


9) *తొంభై,తొంభై రెండేళ్ల సంవత్సరాలకు*........నువ్వు నివాసం వుంటున్న గదిలోకి,మంచం దగ్గరికి కూడా ఎవ్వరూ రారు.

వచ్చిన చూపులు,సంజ్ఞలు తప్ప ఇంకా ఏమి వుండవు.


10) *వంద సంవత్సరాలకు*........వంద (100%) శాతం నువ్వు వుండవు. నీ ఫోటో గోడ కు మేకు సహాయం తో వేలాడుతూ వుంటుంది.ఫోటో క్రింద ...నీ పేరు, జనన,మరణ వివరాలు ముద్రిస్తారు.


సత్యనారాయణ మూర్తి కొడవంటి,

ఫిజిక్స్ లెక్చరర్,కాలమిస్ట్,

9985617100

బలవంతుడ నాకేమని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

       🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 బలవంతుడ నాకేమని

       పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

       బలవంతమైన సర్పము

       చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!


తమకు చాలా బలం ఉంది అని గర్వంతో విర్రవీగేవారి గురించి వర్ణిస్తూ బద్దెన ఈ పద్యాన్ని చెప్పాడు....


భావం: *మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు.... వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు.... అందువల్ల వారికి మంచి కలుగదు*.... ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైనచీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది....

దానగుణ విశిష్టత!

 శు  భో  ద  యం🙏



దానగుణ విశిష్టత!


ఈరోజు దానగుణం ఎంతవిశిష్టమైనదో తెలిసికుందాము. 


                      శా:- ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంశోత్తరీయంబుపై, 

                              పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై , నూత్నమ 

                                ర్యాదంజెందు కరంబుక్రిందగుట, మీదై  నాకరమబుంటమే          

                                 ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు వాపాయమే? 


                     

                  శ్రీమదాంధ్రమహాభాగవతము - పోతన- వామనచరిత్రము 


            వివరణ:- దేవతావిరోధియగు బలిచక్రవర్తని మూడడుగులదానమును వామనుడు అడుగుసందర్భము . 

                           వచ్చినది శ్రీహరియని శుక్రాచార్యులవారు గ్రహించి దానమువలన కలుగు పరిణామము నూహించి 

                            బలిని వలదని వారింపగా బలియన్నమాటలను కవినిపుణముగా వర్ణించినాడు అంత్యప్రాసలతో 

                             నందగించిన పోతనకవితాసౌందర్యము తోబాటుగా బలి పరమౌదార్యమును తెలిసికొనుటకు

                             ప్రయత్నంచేద్దాము. 


                                                   వచ్చినవాడు'హరి'దానమీయవలదు అనివారించు శుక్రునితో " శ్రీసతి శిరోజాలంకృతిపై, మేనుపై, భుజములపైనుడు ఉత్తరీయముపైనను ,పాదపద్మములపైనను,బుగ్గలపైనను,  పయోధరములపైనను  నూత్నమర్యాదలతో సంచరించు నాశ్రీహరి హస్తము క్రిందగుట, మీదుగా నాహస్తమగుట 

ఆహా !ఎంతటి అదృష్టము. ఈరాజ్యము శాశ్వతమా? శరీరము అపాయరహితమా? ఏదియేమైనను ఇంతటిమంచి 

అవకాశమునువిడువను దానమవస్యముగా నిత్తునని యట్లేయొనరించినాడు .ఆహా!బలియెంతటిమహనీయుడు.

                దానముమిగులగప్పది .వేదములు" నకర్మణా నప్రజయా నధనేన దానేనైకేనామృతత్వమానసుః" నీవు 

     చేయుపనులవలనగానీ, నీసంతానముచేతగానీ, నీకున్నధనముచేతగానీ అమృతత్వాన్ని (అమరత్వము)పొందలేవు. 

      దానగుణం ఒకటి ఉంటేచాలును అమృతత్వం పొందగలవు. అంటోంది. కాబట్టిఉత్తమ గుణాలలో మిన్నయైన దాన

        గుణాన్ని అందరూ అలవరచుకోవటం ఉత్తమం.అది మనకు సమాజానికీ చాలామేలు చేస్తుంది .🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🏉

కర్మబంధితులై వుంటారు.

 💐వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు.💐


*అప్సరసలు దిసమొలగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు. శుకముని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. శుకుణ్ణి పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు.  విస్తుపోయాడా మహర్షి. "నవ యవ్వనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది?" అని అడిగాడు. "నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు" అన్నారు అప్సరసలు. "అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ, దర్శిస్తూ, పరవశిస్తూ, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు" అన్నది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాడిని 'ఆరూఢుడు' అంటారు. "ఇది నగరము, ఇది అరణ్యము, ఇది సౌఖ్యము, అది అసౌఖ్యము, ఇతడు పురుషుడు, ఆమె స్త్రీ' వంటి తేడాలేవీ అలాంటి పరిణత మనస్కులకు తోచవు.* *ఆరూఢుడికి ( బ్రహ్మజ్ఞానికి ) ఏది చూచినా బ్రహ్మమయమే. అతడు సంగములు సర్వమునూ కలిగి సంగి ( లోబడినవాడు ) కాడు.* *భోగములు సర్వమునూ చెంది భోక్త కాడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమ గమ్యం అదే !*

 *సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ! "సన్యాసం స్వీకరించార"ని మనం అంటూ ఉంటాం. కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు. తిరకాసంతా -  మనసుతోనే ! "బంధానికైనా, మోక్షానికైనా కారణం మనసే" అన్నది ఉపనిషత్తు. అంటే సాధ్యమూ మనసే, సాధనమూ మనసే.*

*సన్యాసాశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు. సన్యాసం అంటే కాషాయం కాదు. పరిపక్వ, వైరాగ్య, జీవన ఫలసాయం. భవబంధాలను, సుఖదుఃఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టటం (సత్ + న్యాసం ). అదే సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణయం. వైరాగ్యభావసమృద్ధి.*


*స్త్రీ, ధన, పుత్ర వ్యామోహాలనే మూడింటినీ "ఈషణత్రయం" అంటారు. ఈషణం అంటే కోరిక, వ్యామోహం. దారేషణ,  ధనేషణ, పుత్రేషణ అనే మూడు రకాలైన మోహాలతో మానవులు పీడింపబబడుతుంటారు,*

*కర్మబంధితులై వుంటారు.వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికయినా సాహసిస్తారు. వైరాగ్యమనేది ఈషణ త్రయానికి ఎదురు చుక్క. వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి దేహంలో ఆరు పువ్వులలో పూజలను చేస్తానని దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో ఆరు పువ్వులంటే షట్చక్రాలు. వాటినే షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా, హృదయాకాశంలో ఓంకారం గంటమాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన, వైరాగ్య, నిశ్చల, ఆనందపూర్ణులైనవారు జీవన్ముక్తులవుతారు. ఇదంతా ఒక్క మానవజన్మ లోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవటానికి కాదది, ముక్తి పొందటానికని చెప్పారు.*

*యోగజీవనమనేది సాధనతోనే సాకారమవుతుంది.*

పంచ పునీతాలు

 పంచ పునీతాలు

మొదటిది..వాక్ శుద్ధి:

వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు 

మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. 


రెండవది..... దేహశుద్ధి:

మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.


మూడవది.....భాండ శుద్ధి:

శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.


నాలుగవది.......కర్మశుద్ధి:

అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.


ఐదవది..........మనశ్శుద్ధి:

మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.🙏🕉️🙏

విద్యావిధానం

 నమస్తే


బ్రిటిష్ వారు, కాంగ్రెస్ వారు, నిర్మించిన విద్యావిధానం వలన


ఈ కాలం పిల్లలకు భారతీయ ప్రపంచవిజ్ఞానానికి మూలమైన సంస్కృతభాషాలో జన్మించినం జ్యోతిశ్శాస్త్రం, వ్యాకరణం, ఛందశ్శాస్త్రం, మాసాల పేర్లు, నక్షత్రాల పేర్లు, సంవత్సరాల పేర్లు తెలియవు,

ఈ కాలం పిల్లలకు పెద్దలకు రామాయణ రచయిత అయిన వాల్మికి జయంతి, వర్ధంతి తెలియదు

ఈ కాలం పిల్లలకు పెద్దలకు అష్టాదశ పురాణాల, మహాభారతం, భగవద్గీత లాంటి రచయిత అయిన వేదవ్యాస జయంతి, వర్ధంతి తెలియదు

కాలిదాసు

భవభూతి

శంకరాచార్య

రామానుజాచార్య

ఆర్యభట్ట

చాణక్య

ధణ్వంతరి

పతంజలి

పాణిని


ఇత్యాది సంస్కృతభాషా శాస్త్రావేత్తలు జన్మదినం, మరణదినం తెలియదు.


ఈ విధంగా సంస్కృతభాషా గురుశిష్యలను గురుకులాలను నాశనం చేసి 

మదర్సాలను మిషనరీ విద్యాలయాలను ఉద్ఘాటనం చేసి


హిందువులందరిని హిందువుల సాహిత్యంనుండి, విజ్ఞానం నుండి దూరం చేసినది

ఎవరు


మన హిందు పిల్లలకు సంస్కృతంలో సమ్భాషించడం రాదు, సంస్కృతభాీష శ్లోకాలు రావు, సంస్కృతభాషా స్తోత్రాలు రావు, సంస్కృతభాషా నీరాజన గీతాలు రావు


ఈ విధంగా సంస్కృతభాషను సామాన్యమానవులనుండి దూరం చేసి సంస్కృతభాషా గురుశిష్యులను సంస్కృతభాషా గురుకులాలను కాలగర్భం కలిపేసిన పాపం కుట్ర కుతంత్రం ఎవరిది


సమ్భాషణ సంస్కృతమ్ పత్రిక ఈ నాయకులను ప్రశ్నిస్తున్నది


ప్రతి సంస్కృతభాషా గురుశిష్యలు అభిమానులు పాత్రికేయులు కావాలి, సంస్కృతభాషకు జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి

మాగాయ"కూ, "ఆవకాయ"కూ

 "*మాగాయ"కూ, "ఆవకాయ"కూ మధ్య ఉన్న తేడా ఏమిటి అని అడిగారు.*


నాకు ఇట్లానేమో అనిపించింది.


భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ తొక్కలే అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...


పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 


సిద్ధిని పొందిన ఋషిలా ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక...


బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  

సాటి జనులపట్ల అమిత కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా

 బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 


అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా, తను విడిచి వెళ్లిన ఊట లోకి మళ్ళీ తానే దూకి,


మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు

ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...


ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి విశేషాలతో విరాజిల్లినట్లుగానే...

నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

మానవసేవే మాధవసేవ అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!


*****************************************************


సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా అనుకునే వివాహితునిలా...తొక్క టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,


సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...

ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 


బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 

తనతోపాటు నూనె, శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...


నేను నేనుగానే ఉండి, ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను. అని చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.

బుధవారం,ఏప్రిల్ 24,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం,ఏప్రిల్ 24,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి తె5.33 వరకు

వారం:బుధవారం (సౌమ్యవాసరే )

నక్షత్రం:స్వాతి రా11.47 వరకు

యోగం:సిద్ధి తె4.23 వరకు

కరణం:బాలువ సా4.56 వరకు

తదుపరి కౌలువ తె5.33 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:ఉ11.32 - 12.22

అమృతకాలం:మ2.16 - 4.00

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30-9.00

సూర్యరాశి: మేషం

చంద్రరాశి: తుల 

సూర్యోదయం:5.42 

సూర్యాస్తమయం:6.13


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

ఉపనిషద్దర్శనం

 🍀🌺🍀🌺👆👆🍀🌺🍀🌺🍀


           *ఉపనిషద్దర్శనం*

                ➖➖➖✍️


108 ఉపనిషత్తులు ఒకే పుస్తకంగా.


రచన: జయంతి చక్రవర్తి గారు.


1328 పేజీలు.


వెల: రూ.1716/-

కానీ..

మన గ్రూప్ సభ్యులు కోసం 

OFFER PRICE: Rs.1500/- లకే.


 Free Postage. (Regd Book post)(పోస్టేజి ఉచితం.)


కావలసిన వారు సంప్రదించండి 

Contact number 9392737062.✍️

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శాసనములు గా కీర్తించబడును

 *2013*

*కం*

ధనములు గలవాని పలుకు

ఘనమగు శాసనముకరణి గణుతించ బడున్.

ధనహీనుని వాక్కు విలువ

కనుగొనగలవాడె విదుడు గాబడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనవంతుని మాటలు గొప్ప శాసనములు గా కీర్తించబడును. ధనహీనుని మాట విలువ కనిపెట్టగలిగేవాడె గొప్పవాడగును.

*సందేశం*:-- ధనవంతునిమాటలను అందరూ గొప్పవిగానే భావిస్తారు, కానీ ధనహీనుని మాటలోని విలువ కనిపెట్టగలిగేవాడె గొప్పవాడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*24-04-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

---------------------------------------

వృషభం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమన వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

---------------------------------------

మిధునం


గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం


ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

---------------------------------------

సింహం


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

---------------------------------------

కన్య


సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల


 ప్రయాణాలు వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

వృశ్చికం


స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

ధనస్సు


దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

---------------------------------------

మకరం


బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కుంభం


అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

మీనం


కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

తరువాత నేమి చేయగలరు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 *యావత్స్వస్థో హ్యయం దేహో*

         *యావన్మృత్యుచ్చ దూరతః* |

         *తావదాత్మహితం కుర్యాత్‌*

         *ప్రాణాన్తే కిం కరిష్యతి* || 


తా𝕝𝕝 ఈ శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో, యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము, పుణ్యకర్మలు చేయవలెను.... మరణించిన తరువాత నేమి చేయగలరు?