ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
14, జనవరి 2024, ఆదివారం
సంకల్పము
**********
*శుభోదయం*
16.229192313
****
సంధ్యా వందన మరియు
ఇతర పూజాకార్యక్రమాల
సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.14.01.2024
ఆది వారం (భాను వాసరే)
***********
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ
పౌష్య మాసే శుక్ల పక్షే తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భాను వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
*ఇతర పూజలకు*
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ పౌష్య మాసే శుక్ల పక్షే
తృతీయౌపరి చతుర్ధ్యాం
భాను వాసరే అని చెప్పుకోవాలి.
*ఇతర ఉపయుక్త విషయాలు*
సూ.ఉ.6.38
సూ.అ.5.40
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం తదియ ప.12.19 వరకు.
ఆది వారం.
నక్షత్రం ధనిష్ఠ మ. 2.52 వరకు.
అమృతం తె. 6.31 ల మరునాడు ఉ.వరకు.
దుర్ముహూర్తం సా. 4.11 ల 4.55 వరకు.
వర్జ్యం రా.9.34 ల 11.04 వరకు.
యోగం సిధ్ధం ప.10.38 వరకు.
కరణం గరజి ప. 12.19 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు.
గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు.
యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు.
*********
పుణ్యతిధి పుష్య శుధ్ధ చవితి
****
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
.
శ్రీరామప్రతిష్ఠ
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*అయోధ్యలో శ్రీరామప్రతిష్ఠ గురించి అనుమాననవృత్తి*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*#అయోధ్యరామమందిర_ప్రతిష్ఠాముహూర్తపరిశీలన#*
అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠ ఈనెల 22న మధ్యాహ్నము 12:29 - 12:30 సమయానికి జరుగనున్నట్లు మనందరకూ తెలిసిన విషయమే కదా! అయితే, ఆ ముహూర్తం సరియైనదేనా? పుష్యమాసంలో ప్రతిష్ఠ చేయవచ్చునా ? ఇటువంటి సందేహాలు చాలామంది లేవనెత్తుతున్నారు. అందువలన వివరంగా పరిశీలన చేద్దాం.
1. అసలు #పుష్యమాసంలో_ప్రతిష్ఠ_సరియైనదేనా?
#సమాధానం : - నిస్సందేహముగా సరియైనదే ✅
దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం పనికి వస్తుందని జ్యోతిష గ్రంథాలలో ఉన్నదే.
" #సర్వేషాం_పౌషమాఘౌ_ద్వౌ_విబుధస్థాపనే_శుభౌ " - అని బృహస్పతి తెలిపినదే. అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థము. పైగా, ఒక్కొక్క మాసంలోని ప్రతిష్ఠ కు ఫలితాలను కూడా తెలుపుతూ . . . #పౌషే_రాజ్యవివృద్ధిస్యాత్ .... అని కూడా తెలియజేయడం జరిగింది. దీనర్థమేమంటే... "పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి ని పొందుతుంది".
మనతెలుగు రాష్ట్రాలలో పుష్యమాసం అంటే శూన్య మాసం అని తలుస్తాము. అయితే, సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశిస్తే పుష్యమాసం వివాహం, గృహారంభ- ప్రవేశాదులకు పనికి వస్తుందని ముహూర్త గ్రంథాలలో స్పష్టంగా ఉంది. #మకరస్థే_సూర్యే_పౌషే_శుభమ్ అని అంటూ #నిషేధస్తు_ధనురర్కవిషయః అని పీయూషధారయందు స్పష్టపరచటం జరిగింది.
2. తిథులలో #ద్వాదశి తప్ప ఇంకేమీ దొరకలేదా ?
#సమాధానం : ద్వాదశీ తిథికి అధిపతి విష్ణుభగవానుడు.
#యద్దినే_యస్యదేవస్య_తద్దినే_తస్యసంస్థితిః" - అని నారదమహర్షి వాక్యము. అందువలన విష్ణు భగవానుని అవతారమైన శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ కు ద్వాదశి ని మించిన తిథి ఏమున్నది? #ద్వాదశ్యాం_హరేశ్చ..... అని అగ్నిపురాణమందు కూడా ఉన్నది.
3. ప్రతిష్ఠ #మిట్టమధ్యాహ్నం చేయడమేమిటి ?
#సమాధానం: అభిజిత్ - ముహూర్తంలో ఏమి చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణ వచనం.
अपराह्णे तु संप्राप्ते अभिजिद्रोहिणोदये ।
यदत्र दीयते जन्तोस्तदक्षयमुदाहृतं” ॥ इति मत्स्यपुराणं ॥
అంతేకాక, శతృనిర్మూలనం కూడా జరిగి తీరుతుంది.
अभिमुखीभूय जयति शत्रून्.... इति वाचस्पत्यम्
4. శుభముహూర్తమేనా? గ్రహస్థితి బాగుందా? #చరలగ్నంలో ప్రతిష్ఠ ఏమిటి?
#సమాధానం : ముహూర్తం బాగుంది. లగ్నంలో గురుడున్నాడు. ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్నబలాన్ని కలిగి ఉంది. స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలం కలిగి లేవు. మేషం చరలగ్నమైనా, నవాంశ లో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది.
#లగ్నే_స్థిరే_చోభయరాశియుక్తే
#నవాంశకే_చోభయగే_స్థిరే_వా .... అని వసిష్ఠ సంహిత.
పైగా లగ్నంనుండి ద్వితీయభావమందు ( రాశియందు కాదని గమనించండి) చంద్రుడు ఉండటం ఎంతశుభప్రదమో వింశోపకబలం తెలిసినవారికి సులువుగా అవగతమౌతుంది. దీనివలన రాబోయే కాలంలో దేశమంతటా రామమందిరాలు నెలకొని, దేశం శుభపరిణామాలు చవిచూస్తుందని వసిష్ఠమహర్షి వచనం👇
లగ్నాద్ద్వితీయే శుభఖేచరేంద్రాశ్చంద్రాశ్చ పుత్రార్థశుభప్రదాస్స్యుః.....
అందువలన ముహూర్త విషయం లో సందేహాలు మాని.... ఆ శ్రీరామమందిర ప్రతిష్ఠా మహోత్సవాన్ని వీక్షించి....
ఆరోజు మనఇంట దీపమాలికలను వెలిగించి.....
దీపావళి పండుగ జరుపుకుందాం.......
✍️ మీ.. డా. తుకారాం.
ప్రముఖ సంస్కృతపండితులు మరియు జ్యోతిషశాస్త్రవేత్త.
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 32 - 33*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।*
*కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।।*
*యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।*
*త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।*
న కాంక్షే — కోరుకోవటంలేదు;
విజయం — గెలుపు;
న చ రాజ్యం — రాజ్యము కూడా వద్దు;
సుఖాని చ — సంతోషములు కూడా;
కిం — ఏమి?; నః — మనకు;
రాజ్యేన — రాజ్యముతో;
కిం — ఏమిటి?;
భోగైః — విలాసములు;
జీవితేన — జీవితము;
వా — లేదా;
యేషామ్ — ఎవరి;
అర్థే — కొరకైతే;
కాంక్షితం — కోరుకున్నామో;
నః — మా చేత;
రాజ్యం — రాజ్యము;
భోగాః — విలాసములు;
సుఖాని — సంతోషము;
తే — వారు;
ఇమే — వీరును;
అవస్థితా — నిలిచిఉన్న;
యుద్ధే — యుద్ధం కొరకు;
ప్రాణాన్ — ప్రాణాలను;
త్యక్త్వా — వదులుకొనటానికి;
ధనాని — ధనము;
*భావము:*
ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యం వలన కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏముంది?
*వివరణ:*
చంపటం ఒక పాపపు పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు ఆందోళనకి గురి అయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూర మైన పని చేసినా, ఆ గెలుపు చివరకి సంతోషాన్ని ఇవ్వలేదు - అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి.
ఈ సందర్భంలో, అర్జునుడు తక్కువ స్థాయి భావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైన స్థాయి భావాలుగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు, భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కానీ అర్జునుడు ఆధ్యాత్మిక మనోభావంతో లేడు. అతని మానసిక అయోమయం, జాలి హృదయం లాగా కనపడుతోంది. ధార్మిక మనోభావాలు, మనకు అంతర్గత ప్రశాంతత, తృప్తి మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకిక మైనది అయ్యుంటే, అతను ఆ భావనచే మహోన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ, అతని అనుభవం దీనికి విరుద్ధం గా వుంది - తన మనసు, బుద్ది కలత నొందాయి, చేయవసిన పని మీద అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ముంగిట గొబ్బిళ్ళ మురియు చుంద్రు
భోగి మకర సంక్రాతి శుభాకాంక్షలు
మార్తాండు డెప్పుడు మకరరాశిని జేరు
ఉత్తరాయణ మగు నుర్వి నపుడు
సకల జనాళియున్ సంక్రాంతి పండువన్
సంతోష చిత్తాన జరుపు కొంద్రు
కర్షకుల్ పంటను కడు తోషమున పొంది
పొంగలి నొండియు పొంగు చుంద్రు
ఆడపడచులెల్ల ఆనంద డోలల
ముంగిట గొబ్బిళ్ళ మురియు చుంద్రు
ముదము గూర్చెడి ముత్యాల ముగ్గులలర
గాలి పటముల సందడి గోల లందు
సకల జనులకు నొనగూర్చ సంతసంబు
ఘనముగా వచ్చె నేడు సంక్రాంతిలక్ష్మి
బోగిమకరసంక్రాంతి శుభాకాంక్షలు
గోపాలుని మధుసూదన, సులోచన
రాశి ఫలితాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
14-01-2024 / ఆదివారం / రాశి ఫలితాలు
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.
---------------------------------------
వృషభం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల ఉండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
మిధునం
అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. అందరి సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
---------------------------------------
కర్కాటకం
ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
---------------------------------------
సింహం
వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
---------------------------------------
కన్య
ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
---------------------------------------
తుల
ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
---------------------------------------
వృశ్చికం
బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
---------------------------------------
ధనస్సు
మాతృ వర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
---------------------------------------
మకరం
సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
---------------------------------------
కుంభం
వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.
---------------------------------------
మీనం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సలహాలు మీకు కలిసివస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
---------------------------------------
🍀 *శుభం భూయాత్* 🍁
*శ్రీ రామరక్షా స్తోత్రం - 29* -
🪷🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి।*
*శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి॥*
*శ్రీ రామచంద్ర చరణౌ శిరసా నమామి।*
*శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే॥*
- *శ్రీ రామరక్షా స్తోత్రం - 29* -
*తా* 𝕝𝕝 శ్రీరామచంద్రుని పాద పద్మాలను మనసారా స్మరించుచున్నాను. శ్రీరామ చంద్రుని చరణ కమలములను నోరార కీర్తించు చున్నాను. శ్రీరామచంద్రుని అంఘ్రయుగళికి తలవంచి నమస్కరించు చున్నాను. శ్రీ రామచంద్రస్వామీ నేను నీ పాదములను వేడుకొనుచున్నాను. శ్రీరామచంద్రుని పాదాలను మనసులో నిరంతరం స్మరిస్తున్నాను. రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను. రామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. శ్రీ రామచంద్రుని పాదాలు నాకు శరణు నొసంగుగాక. శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను. *శ్రీరామచంద్రుని పాదములను వాక్కుచే కీర్తించెదను. శ్రీరామచంద్రుని చరణసరోజములకు శిరస్సు వంచి నమస్కరించెదను. శ్రీరామచంద్రుని పాదపద్మములనే శరణువేడెదను.*
భోగి పండుగ విశేషాలు
భోగి పండుగ విశిష్టత..
భోగి పండుగ విశేషాలు తెలుసుకొనే ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు.
‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.
దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు,
ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది.
మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం..
‣ "భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.
పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందనీ, దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాధ.
శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాధ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది.
కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే.
శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి, రైతుల పాలిట దైవాన్ని భూమికి దింపిన రోజు ఇదే అనేది కూడా పురాణగాధ.
సాదారణంగా అందరు చెప్పేది - ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా.
ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీయ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.
చలికాలం లో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీయ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) విడుదల అవుతుంది. ఈ ఔషద మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
‣ కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దుండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.
‣ భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుసుకుందాం.
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల శిరస్సుల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతంలో పేరు. రేగి చెట్లు, రేగి పండు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అనీ, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందనీ మన పెద్దల విశ్వాసం.
మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అశీర్వదిస్తారు.
మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.🙏🙏🙏
సంతానం..సంతోషం..
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*సంతానం..సంతోషం..*
చాలా రోజుల క్రిందట సంగతి ఇది..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించడానికి బెంగుళూరు నుండి ఒక కుటుంబం వచ్చారు..తల్లీ తండ్రీ ఇద్దరు కుమారులు..వారి భార్యలు.. ..మొత్తం ఆరుగురు..నిజానికి వాళ్ళు మాలకొండ లోని శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం కోసం వచ్చారు..అక్కడికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గరే అని తెలుసుకొని..చూసిపోదామని వచ్చారు..ఆరోజు శనివారం..వీళ్ళు మందిరానికి చేరే సరికి సాయంత్రం నాలుగు గంటల సమయం అయింది..
ఎలాగూ వచ్చారు కనుక పల్లకీ సేవ చూసి వెళ్ళండి అని చెప్పాము..అందరూ ఒకరినొకరు సంప్రదించుకొని..సరే అన్నారు..వాళ్ళ ఉద్దేశ్యం లో పల్లకీ సేవ అయిపోగానే..ఆలస్యం గా నైనా నెల్లూరు వెళ్ళిపోయి..రాత్రికి అక్కడ బస చేయాలని..అందుకే మమ్మల్ని రూము కూడా అడగలేదు..
పెద్దవాళ్ళిద్దరూ శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు..ఆసక్తిగా విన్నారు..ముఖ్యంగా పెద్దవాళ్ళిద్దరూ ఓపికగా శ్రీ స్వామివారి మందిరం అంతా తిరిగి చూసారు..
"శ్రీ స్వామివారు తపస్సు చేసుకునేటప్పుడు.. ఈ పులిచర్మం మీద కూర్చున్నారు కదా..ఆయన శరీర స్పర్శ పొందింది కదా!.." అని ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి..మనసారా నమస్కారం చేసుకున్నారు..అలానే శ్రీ స్వామివారు నేలమాళిగ లో సాధన చేసుకునే ముందు..ఆ నేలమాళిగ పైన మూత లాగా వాడిన చెక్కపలక ను ముట్టుకుని కళ్లకద్దుకున్నారు..శ్రీ స్వామివారి గురించి మరింతగా తెలుసుకోవాలని వున్నదనీ..వీలైతే చెప్పమని నన్ను అడిగారు..ఆ సమయం లో పల్లకీ సేవ ఏర్పాట్ల లో కొద్దిగా పనిలో వున్నాను..అదే మాట వారికి చెప్పి..మా అమ్మగారు శ్రీ స్వామివారి గురించి వ్రాసిన పుస్తకం ఆయన కు ఇచ్చాను..భక్తిగా తీసుకున్నారు..
పల్లకీ సేవ లో కుటుంబం యావత్తూ పాల్గొన్నారు..ప్రసాదం తీసుకొని..ఇవతలికి వచ్చి..వారిలో వారే ఏదో మాట్లాడుకుంటున్నారు..ఒక పది నిమిషాల తరువాత నా దగ్గరకు వచ్చి.."ఏమండీ రాత్రికి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..చూసారు కదా మేము మొత్తం ఆరుగురం వున్నాము..ఏదైనా రూము వుంటే..అందులో సర్దుకుంటాము.."అన్నారు..ఒక చిన్న గది ఉందనీ..అందులో ఆడవాళ్లు అందులో సర్దుకుంటే..మొగవాళ్ళు మందిర ప్రాంగణం లో పడుకోవచ్చనీ తెలిపాను..సరే అన్నారు..
ఆ రాత్రికి అందరూ నిద్ర చేసి..తెల్లవారి ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి కి అర్చన చేయించుకొని..సమాధికి నమస్కారం చేసుకొని..ఇక బయలుదేరి పోబోతూ..నా దగ్గరకు వచ్చి.."రాత్రి..పల్లకీ సేవ వద్ద కొందరు భక్తులతో మాట్లాడానండీ.. ఇక్కడ మనస్ఫూర్తిగా మ్రొక్కుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు..పెద్దవాడికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయింది.. శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్నాము..అందుకోసమే రాత్రి ఇక్కడ నిద్ర చేసాము..అదృష్టం బాగుండి.. వాళ్లకు సంతానం కలిగితే..మళ్లీ ఇక్కడికి అందరం వచ్చి మ్రొక్కు తీర్చుకుంటాము.." అన్నారు..ఆ వెంటనే సెలవు తీసుకొని వెళ్లిపోయారు..
దాదాపు సంవత్సరం తరువాత.. ఒక ఆదివారం నాడు మళ్లీ వాళ్ళందరూ వచ్చారు..నేరుగా శ్రీ స్వామివారి అర్చన టికెట్ కొనుక్కొని..పూజ చేయించుకొని..నా దగ్గరకు వచ్చి.."శ్రీ స్వామివారు మహిమ చూపారండీ..పెద్దవాడికి అమ్మాయి పుట్టింది..శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్న విధంగా..హుండీ లో నేననుకున్న మొత్తం సమర్పించుకున్నాను..శ్రీ స్వామివారి పేరు కలిసి వచ్చేటట్లు గా పాపకు పేరు పెట్టుకుంటాము..ఆయన ప్రసాదం కాబట్టి..ముందుగా ఇక్కడికి వచ్చాము.." అన్నారు..
వాళ్ళందరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది..అందుకు కారణభూతుడైన ఆ స్వామివారు మాత్రం సమాధినుంచి చిద్విలాసంగా చూస్తూవున్నారు..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699)
పంచాంగం
ॐ శుభోదయం పంచాంగం ॐ
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*_జనవరి 14, 2024_*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*హేమంత ఋతువు*
*పుష్య మాసం**శుక్లపక్షం*
తిథి: *తదియ* మ12.18
వారం: *భానువారం*
(ఆదివారం)
నక్షత్రం: *ధనిష్ఠ* మ2.51
యోగం: *సిద్ధి* ఉ10.48
కరణం: *గరజి* మ12.18
*వణిజ* రా11.08
వర్జ్యం: *రా9.33-11.02*
దుర్ముహూర్తము: *సా4.11-4.55*
అమృతకాలం: *ఉ6.36వరకు*
*సోమవారం తె6.29నుండి*
రాహుకాలం: *సా4.30-6.00*
యమగండం: *ఉ12.00-1.30*
సూర్యరాశి: *ధనుస్సు*
చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *6.38*
సూర్యాస్తమయం: *5.40*
మీఅందరికీ
🙏 *భోగిపండుగ* 🙏
💐 *శుభాకాంక్షలు* 💐*లోకాః సమస్తాః *సుఖినోభవంతు*
పంచాంగం 14.01.2024
ఈ రోజు పంచాంగం 14.01.2024
Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు పుష్య మాస శుక్ల పక్ష: తృతీయా తదుపరి చతుర్ధి తిధి భాను వాసర: ధనిష్ఠ నక్షత్రం వ్యతీపాత యోగ: గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.
తదియ పగలు 08:00 వరకు తదుపరి చవితి రా.తె 04:59 వరకు.
ధనిష్ఠ పగలు 10:23 వరకు .
సూర్యోదయం : 06:53
సూర్యాస్తమయం : 05:57
వర్జ్యం : సాయంత్రం 04:54 నుండి రాత్రి 06:21 వరకు.
దుర్ముహూర్తం : సాయంత్రం 04:28 నుండి 05:13 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మద్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
అందరికి భోగి శుభాకాంక్షలు. మకరసంక్రమణం రాత్రి 02:40
శుభోదయ:, నమస్కార:
మంగళాచరణ శివ స్తుతి -
తెలుగు , సంస్కృత కావ్యాలలో మంగళాచరణ శివ స్తుతి -
ఉపద్రష్ఠ సత్యం!
(అ మె రి కా )
పరమశివునికి పెండ్లి జరుగుతోంది.
ఆయన ఒంటి నిండా ఆభరణాలు పెట్టారు.
కాబోయే భర్తగారి ఆ ఆభరణాల సమూహ సౌందర్యం చూసి హిమవంతుడనే కొండకు పుట్టిన కుమార్తె పార్వతీదేవి మనస్సు అనే వీథి కంపించి పోయింది.
రాతికి పుట్టిన అమ్మాయి మనస్సు కూడా రాయిలా కఠినంలా ఉండాలి కదా ! కాని ఆరాతి లాంటి చలించని మనస్సుకూడా శివుని అందానికి కదిలిపోయింది.అంటే ఇక శివుని అందం ఎంత బాగుంటుందో ఊహించండి.
హృదయంలోని కదలికకు ఆమె కొప్పు విడిపోయింది. నెమలిపింఛము అయింది.
నెమలంటే పాములకు భయం కదా !
అందువల్ల శివుని ఆభరణాల మధ్యలో ఉన్న కొన్ని చిట్టి పాములు ఆ నెమలి పింఛం చూసి భయంతో తలలు దించుకొన్నాయి
ఇదంతా గమనిస్తున్నాడు శివయ్య,
ఆ యనకి నవ్వు వచ్చింది.
అది మాములు నవ్వు కాదు.
జరుగుతున్న సంఘటనలను బాగా ఆమోదించిన నవ్వు.
అలా నవ్వే , సుఖాలను ఇచ్చే ఆ శంభుడు- మాకు ఎల్లప్పుడు అధిక సౌఖ్యాలు ఇచ్చుగాత!
ఈ మాటలు కూచిమంచి తిమ్మకవి(18వ శతాబ్దము) “రసికజనమనోభిరామము” అనే కావ్యంలో ప్రారంభంలో చేసిన పద్య కాంతులు.
అసలు పద్యమిది.
శ్రీ మీఱం దన పెండ్లి వేళ నొడలం , జెన్నారు భూషామణి
స్తోమంబుం బొడగాంచి శైలసుతచే,తో వీథి గంపింపద
ద్భామా రత్నము కొప్పు బర్హమని యప్పాముల్డలల్వంపన
త్యామోదంబున నవ్వు శంభుడిడు మా కశ్రాంత సౌఖ్యోన్నతుల్
(శ్రీ మీఱన్= కాంతి అతిశయించేటట్లుగా; తన పెండ్లి వేళన్= తన పెండ్లి సందర్భములోఒడలన్=శరీరమందు; చెన్నారు = అందమగు ; భూషామణిస్తోమంబున్= మణుల అలంకారములు; పొడగాంచి= చూసి; శైలసుత= పార్వతి;చేతో వీథి గంపింప= మనస్సు అనే వీథి చలించగా; తత్ +భామా రత్నము కొప్పు= భామలలో శ్రేష్ఠురాలయిన ఆ పార్వతీదేవి తలయందు దోపిన వెండ్రుకలముడి (విడివడి) ;బర్హమని= నెమలి పురి అని ;అప్పాముల్ =ఆ +పాముల్ =శివుని ఆభరణాలలో ఉన్న పాములు; తలల్వంపన్= భయముతో తలలు వంచుకోగా ; అతిమోదంబున నవ్వు= బాగా సంతోషముతో నవ్వు; శంభుడు = శివుడు ; మాకు= మా అందరికి, (మన అందరికి) అశ్రాంత = ఎప్పుడు; సౌఖ్యోన్నతుల్= గొప్పవైన సౌఖ్యములు ; ఇడు= ఇచ్చు గాత)
విశేషాలు
1. ఈ పద్యములో వర్ణించిన శివుడు కుక్కుటేశ్వరుడు.
కుక్కుటమంటే కోడి.తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో కుక్కుటేశ్వర ఆలయం ఉంది. రసిక జన మనోభిరామాన్ని ఈ కుక్కుట లింగ ప్రభుమణికి తిమ్మకవి అంకితమిచ్చాడు.
2. ఈ కావ్యము రసిక జనులను మెచ్చుకొనే ఇతివృత్తంతో ఉంది. అందుకే నాంది ప్రస్తావనలో కూడా రసిక జన అహ్లాదకరమైన వర్ణన కవి చేసాడు.
3. అలంకారము
అప్రస్తుత వస్తువు యొక్క గుణము, క్రియ మొదలగువాని సంబంధముచేత ప్రస్తుత వస్తువును అ ప్రస్తుతముగా తలచుట ఉ త్ప్రేక్షాలంకారం. ఉత్ప్రేక్షలో ధర్మము అప్రసిద్ధంగా ఉంటుంది. ఉపమానములో ధర్మము ప్ర సిద్ధం. ధర్మాన్ని అనుసరించి ఈ రెండలంకారాలకు భేదము వస్తుంది.
ఉత్ప్రేక్షము వాచ్యమని, గమ్యమని రెండు రకాలు.
తలంచెద, ఎంచెద, సత్యము, అదియో, అనునట్లు -మొదలయినవి ఉ త్ప్రేక్షావాచకాలు. . ఉ త్ప్రేక్షావాచకాలు ఉంటే వాచ్యోత్ప్రేక్ష, లేకపోతే గమ్యోత్ప్రేక్ష;
ఈ పద్యంలో బర్హమని అనుపదంలో " అని” అను ఉత్ప్రేక్షావాచకము ఉంది కనుక ఇది వాచ్యోత్ప్రేక్ష.
4. శమ్ అంటే సుఖం. అది ఇచ్చే వాడు కనుక శంభుడు అని శివునికి పేరు. శంభుడిడు మా కశ్రాంత సౌఖ్యోన్నతుల్
అనుచోట శంభు శబ్దము సాభిప్రాయం కనుక పరికరాలంకారం.
5. శివుని ఒంటి మీద రత్నాలున్నాయని కవి ఒక పక్క వర్ణిస్తూ, పార్వతిని భామారత్నము అన్నాడు.
ఇద్దరు అన్ని రకాలుగా సరిపోయిన, సమానమయిన జంట అనే అర్థం చదివే పాఠకులలో కలగటానికి
ఆహ్లాద కరమయిన భామారత్న విశేషణం కవి వాడాడు.
6. పిఠాపురం సంస్థానాధీశుల ఆదరణ పొందినప్పటికి, తన కావ్యాన్ని శివునికి అంకితమిచ్చిన వ్యక్తిత్వం కూచిమంచి తిమ్మకవిది.