1, ఆగస్టు 2021, ఆదివారం

దర్భ పవిత్రమైనది

 దర్భను ఎందుకు పవిత్రమైనదిగా ప్రతిపాదిస్తారు ...  

🌾దర్భ యొక్క ప్రాముఖ్యం🌾


********************************

సేకరణ - బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణగారి ఫేస్ బుక్ టైమ్ లైన్ నుండి.

*********************************


    మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. 

(i) దర్భ జాతి దర్భను అపరకర్మలకు, 


(ii) కుశజాతి దర్భను శుకర్మలకు, 


(iii) బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, 


(iv) శరము (రెల్లు) జాతి దర్భను గృహనిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.


దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. 


(1) కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది.

 

(2) వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీమహావిష్ణువు రూపములని జనులు భావించి ,భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 


వీటికి దేన్నయినా శుద్ధిచేసేశక్తి ఉందని నమ్మిక. 

ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు.

 

అలానే ముంజపర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది. 


అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణకాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను_ఉంచడం మనకు అలవాటు. 

కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే...


సూర్య, చంద్రగ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విషకిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరివెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. 

అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. 


ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని_శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. 


ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణసమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడుకిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. 


  సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. 


దీనికి కారణం దర్భల కొనలుతేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి. 


"శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరమ్"


అని భగవద్గీతలో చెప్పబడింది. 

అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. 


అలానే తైత్తరీయోపనిషత్తులో "బర్హిషావై ప్రజాపతిః" అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది.


ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. 


వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:


"దాతగానివాని తఱచుగా వేఁడినవాడుఁ 

దాతయగునె వసుధలోనఅవురు 

దర్భ యౌనె యబ్ధిలో ముంచిన

విశ్వదాభిరామ వినర వేమ!"


అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. 


ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి. 


(i) వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. 


(ii) చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, 


(iii) శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, 


(iv) అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, 


(v) పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. 


అలానే శ్రాద్ధకర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మపురాణములో చెప్పబడింది.


దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

 

"సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిమ్"


అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. 


ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. 


అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు. వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. 


ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది.

 

దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వగుణం పెరుగుతుంది. 


ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వగుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. 


వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి-


"విరించినా సహోత్పన్న పరమేష్ఠి 

నిసర్గజనుద సర్వాణి పాపాని .

దర్భ స్వస్తికరో భవ"


ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. 


దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. 


వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి.

దేవేభ్య ఆతపతి

 🚩


"యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |

పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | "

💥

భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు.

జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు.

ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు.

బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.

ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో,

దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.

........💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥.......

బలరాముని తల్లి

 🕉 భూమిని మోసే ఆదిశేషుని అవతారంగా చెప్పబడే బలరాముని తల్లి చేసిన పుణ్యం ఏమిటి ? 🕉


👉బలరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశావతారం. 

కొన్ని పురాణాలలో ఆయనను ఆదిశేషుని అవతారంగా చెబుతారు. మరి అటువంటి బలరాముని కన్న తల్లి మరి ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి ? 


👉రోహిణిదేవి గర్భంలో సంకర్షణుడిగా అవతరించిన ఆయన దేవకీ వసుదేవుల సప్తమ గర్భం నుండి వైష్ణవమాయ ద్వారా రోహిణిదేవి లోనికి సంకర్షించబడతాడు. 


👉ఇతఃపూర్వం దేవకీవసుదేవులు సాక్షాత్తు అదితి కశ్యపులు అని చెప్పుకున్నాము. మరి ఈ రోహిణిదేవి ఎవరు? 

అంటే ఈ విషయాన్ని బ్రహ్మవైవర్తన పురాణం, గర్గభాగవతం పూర్తిగా వివరిస్తాయి. 

ఆవిడ సాక్షాత్తు నాగుల తల్లి కద్రువ.


👉 కశ్యపప్రజాపతి 13 గురు దక్షుని కుమార్తెలను పెండ్లాడాడు. 

వీరి సంతానాలు : 

1.దితికి దైత్యులు 

2అదితికి ఆదిత్యులు

3దనువుకు దానవులు

4 అనాయువు-లేక-అనుగ/వశ కు సిద్ధులు. 

5ప్రాధకు గంధర్వులు

6 ముని కి అప్సరసలు, మౌనేయులు.

7 సురసకు యక్షులు, రాక్షసులు. 

8 ఇలకు వృక్షలతాతృణజాతులు. 

9 క్రోధకు పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. 

10 తామ్రకు శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు.

 11కపిల-లేక-సురభికి గోగణము

12వినతకు అనూరుఁడు-గరుడుఁడు

 13 కద్రువకు నాగులు.


👉ఒకానొక సమయములో అదితి వసంతోత్సవ రోజున అలంకరించుకుని తన భర్త ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. కశ్యపుడు ఎప్పటికీ రాకపోయేప్పటికి ఆవిడకు తన భర్తను ఎవరు ఆపారో కనుక్కుని ఆయన కద్రువ మందిరంలో ఉన్నాడని తెలుసుకుని కద్రువ మాయ చేసి అతడిని అక్కడ ఉంచిందన్న ఉక్రోషంతో ఇటువంటి ఇంతి స్వర్గమున ఉండడానికి వీలు లేదని మర్త్యలోకంలో జన్మించమని దైవప్రోత్బలంతో శాపవాక్కు విడిచింది. ఆ శాపం గురించి తెలుసుకున్న కద్రువ ఖిన్నురాలై తనను మనుష్య జన్మ ఎత్తమన్న అదితే మనిషిగా పుట్టి పుత్రునికోసం ఆక్రోశిస్తుందని శాపం ఇచ్చింది. వీరి కోపాలను దానివలన విడిచిన శాపాలను తెలుసుకున్న కశ్యపుడు ఇద్దరినీ ఊరడించి ఇదంతా విష్ణుమాయ వలన జరిగిందని ఇద్దరికీ ద్వాపరయుగంలో ఆ పరాత్పరుడిని వేరు వేరు రూపాలలో పెంచుతారని వరాలిచ్చి ఊరడిస్తాడు. 


👉ఆ శాపఫలితంగానే అదితి కశ్యపులు దేవకీ వసుదేవులగా జన్మించి ఆ పరబ్రహ్మను ఎనిమదవ గర్భంలోను, ఆయన అంశను సప్తమ గర్భంలో పొంది, విష్ణుమాయ వలన ఆ గర్భం లో ఉన్న బలరాముని కద్రువ అవతారమైన రోహిణి గర్భంలో బలరామునిగా కంటారు. రోహిణి వాసుదేవునకు అత్యంత అనుకూలురాలై ఆయన చెప్పిన విధంగా యశోదానందుల వద్దకు పోయి బలరాముని కనిపెంచుతుంది. 


👉నాగుల తల్లి అయిన ఆ కద్రువే అనంతుడైన ఆ ఆదిశేషుని అవతారాన్ని కనిపెంచిన పుణ్యాత్మురాలు.


!! ఓం నమో వేంకటేశాయ !!

స్నేహం.

 స్నేహం......


బాషకందని భావమై

ఊహకందని స్పూర్తి యై 

పాటకందని మాధుర్యమై 

మాటకందని మమతయై 

మమేకమయ్యేది స్నేహం....


కష్టమందు ఓదార్పై

సుఖమందు భాగస్వామ్యమై

సమస్యకు సమాధానమై

చీకటిలో వెలుగు కిరణమై 

సహచర తత్వ గమనమే స్నేహం...


ఆశయాల అరవిందమై 

హృదయమునకు ప్రతిబింబమై 

అనుభవాల అమరిన అలంకారమై 

ఊహల ఊపిరిగా సాంత్వన చేకూర్చేది స్నేహం...


చెంతనిలిచి, వెంటనడచి 

చేయిపట్టి త్రోవచూపి, అలసిపోక అడుగేస్తూ

కడవరకూ సాగిపోయే ప్రయాణబంధమే స్నేహం.....


.....డాక్టర్ దేవులపల్లి పద్మజ

మిత్రమా

 మిత్రమా,


నీ సందర్శనం 


మదిలో కోటితంత్రుల వీణానాదం....


నీ కరచాలనం,


 హృదిలో బోసినవ్వుల నందనవనం...


నీ పలకరింపులు 


మేమిపై కురిసే పన్నీటి జల్లుల గుబాళింపులు,


నీ నవ్వులు , 


నా పెదవులపై విరిసే చంద్రవంకలు,


నీ కంటి మెరుపులు,


ఆకశాన పున్నమి చంద్రుని వెలుగులు


నీ ఆలింగనాలు,


తనువెల్ల తడిమేటి

మలయమారుతాలు


నీ సమక్షం,


కాలాన్ని మరిపించే 

మైకపు మోక్షం


నీ వీడుకోలు వేళ,


చెలియలి కట్టలు దాటిన కన్నీళ్లు...


నీ పునర్దర్శనార్థి యై 


చకోరమైనాను


 మిత్రమా....

నీవెక్కడున్నా


 నీ జ్ఞాపకాలే వెన్నాడుతున్నాయి...


అందుకో 

ఈ ఆప్తమిత్రుని మిత్రదివస శుభాకాంక్షలు....


ఉషాకిరణ్

స్నేహం అంటే

 స్నేహం అంటే ఓ నమ్మకం...

స్నేహం అంటే ఓ ఆహ్లాదం...

స్నేహం అంటే ఇద్దరి మధ్య ఏర్పడ్డ వ్యక్తులు బంధం...

స్నేహం అంటే ఆపదలో ఆదుకోనే ఒక నిధి లాంటిది...

స్నేహం అంటే మన జీవితంలో ఒక భాగం...

                 పేగుబంధ0 అమ్మది 🤱🤱🤱ఐతే స్నేహ బంధం 👬👫👬మటికి వ్యక్తిగత నిర్ణయంతో మనకు మనం నిర్మించుకోనే బంధం....❤❤❤

        మన నడవడిక,మన ఎదుటివారి నడవడిక మనకు నచ్చిన తరువాత మన స్నేహ బంధం ఏర్పడుతుంది...👣👣👣👣👣👣

        అవసరం కోసం మాత్రమే వచ్చే స్నేహం

            కన్నా,

మన అవసరం కూడా తెలుసుకొని వాది0చి,వేది0చి......మనతో పాటు కొనసాగే లక్షణం కూడా కలిగి ఉన్న వాడే మన స్నేహితుడు...🤼‍♂️🤼‍♀️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️

        స్నేహితుడు అన్న తరువాత ఆర్దిక సహాయం చేయాలని డిమాండ్ లేదు,,,,

    స్నేహం అంటే ఆర్దక సహాయం చేయకపోయినా....

మాట సహాయం చేసినా చాలు....అదే కొండత రక్ష మనకు....💝💝💝

        ఈరోజుల్లో సంతోషం పంచుకొని పెంచుకొనేవారే కానీ,బాదను తెలుసుకొని పంచుకొనే వారు చాల అరుదు....🤔🤔🤔

#నోట్:కొన్ని కొన్ని విషయాలు అన్ని0టిని మన రీలెటీవ్స్ తో షేర్ చేసుకోలేము,కానీ అన్నీ విషయాలు స్నేహితులతో చెప్పుకోగలం....👍🏾👍🏾👍🏾

                        #రిమైండ్ :::మరికొన్ని మటికి మన మనసులోనే బంది0చుకొనేవి ఉంటాయి అవి మనతోనే ❤ ఇక్కడ ఉండిపోవాలి......మీ స్నేహితుడు అత్తిలి రోశయ్య

సంప్రదాయం

 🎻🌹🙏*సంప్రదాయం అనుసరించే వారు, ఎవరు చెప్పినా పాటించవలసిందే🙏*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


*1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు*


*2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.*


*3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.*


*4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.*


*5) నూనె, ఉప్పు, గుడ్లు చేతికి ఇవ్వరాదు.*


*6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.*


*7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.*


*8) మంచం మీద కూర్చుని తినకూడదు.*


*9) తలుపుల మీద బట్టలు వేయకూడదు."*


*10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి.* (మనదేశ సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుంది.)


*11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.*


*12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.*


*13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.*


*14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.*


*15) తెల్లవారి లేవగానే ముందు దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.*


*16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.*


*17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.*


*18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి.*


*19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.*


*20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.*


*21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.*


*22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.*


*23) ఆడవాళ్లు శిరోజాల విరబోసుకోరదు*


*24) ఆదివారం అన్నదమ్ములు ఉన్న అక్కచెల్లులు తలస్నానం చేయరాదు*


*25) ముతైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను*


*26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలను.*


*27) సంధ్య సమయం లో పడుకోకూడదు*


*పాటించేవారుంటే.. ఎన్నయినా చెప్తారు.*


 *ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు.*


*చెప్పడం చెయ్యడం మన విధి. ఆ పైన వారి ఇష్టం*


*ఇది మన భారతీయుల సత్సంప్రదాయాలు🙏.*


సేకరణ...🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

రోమ్ రోమ్ మే రామ్ నామ్ హై"

 "రోమ్ రోమ్ మే రామ్ నామ్ హై"


"రామ్నమీ" అంటే " రామ్ నామీ" సమాజ్ అని హిందూ మతం లో ఒక తెగ ఉంది. వీరు ఆరాధించే దేవుడు రాముడు.


చరిత్ర ప్రకారం 1870 లలో ప్రస్తుత చత్తీస్గహార్ రాష్ట్రంలో గల చార్పోరా గ్రామంలో చమర్ కులంలో జన్మించిన 'పరశురామ్' అనే వ్యక్తి 1890ల కాలంలో తనను దేవాలయంలోకి ప్రవేశించనివ్వలేదు అనే దానికి నిరసనగా తన నుదిటిపై "రామ్" అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనే మొట్టమొదటి గా రామ నామాన్ని ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తిగా చెప్పబడుతున్నాడు.. అతను స్థాపించిన తెగే ఈ "రామ్నమీ" లు. అందుకే ఈ తెగలో ఎక్కువగా చమర్ కులస్తులు వుంటారు. కానీ కొంత కాలానికి ఈ ఉద్యమంలో

బ్రాహ్మణ, బానిక్, కుర్మి మొదలైనవారు అందరూ కూడా చేరారు. ఈ తెగ 15 వ శతాబ్దపు భక్తి ఉద్యమం యొక్క కొనసాగింపుగా మరియు ఈ ప్రాంతం యొక్క సత్నాంపంత్ యొక్క శాఖగా చెప్పబడుతోంది. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గర్ లో నివసిస్తున్నారు.  


ఈ తెగను అనుసరించే వారు మద్యం తాగడం కానీ పొగ త్రాగటం గానీ చేయరు. ' రామ్' పేరు జపించడం వీరి దినచర్యలో ఒక భాగం. ఇలా పూర్తి శరీరం పై పచ్చబొట్లు ఉన్నవారిని "పూర్ణనాక్షిక్ " అని పిలుస్తారు. వీరు ఇప్పుడు ఎక్కువగా వారి డెబ్బైలలో ఉన్నారు. 

వివక్షకు గురి అవుతావేమో అన్న భయంతో యువతరం ఇలా పచ్చబొట్లు వేయించుకుందుకు సందేహిస్తున్నారు.


రాయ్‌పూర్ జిల్లాలోని సర్సివా గ్రామంలో డిసెంబర్-జనవరిలో పంట కాలం ముగిసే సమయానికి మూడు రోజుల భజన్ మేళా కోసం "రామ్ నామీ"లు ప్రతి సంవత్సరం సమావేశమవుతారు. అక్కడ వారు "జయోస్థంబ్‌" అంటే విజయ స్థూపం ను ఏర్పాటు చేస్తారు. అంటే ఒక తెల్లటి స్తంభం పై రామ్ నామం చెక్కబడి ఉంటుంది. ఈ ఉత్సవాల మూడు రోజులూ రామ్‌చరిత మానస్ నుండి పాటలు, భజనలు గానం చేస్తారు.


ఈ ఉత్సవాలకు సుమారు 20 వేల మంది వరకు వస్తారు అని అంచనా. అందుకే వీరి జనాభా 20 వేలు ఉంటుంది అని కొందరు చెప్తే, కాదు ఒక లక్ష వరకు ఉంటాం అని ఈ తెగ పెద్దలు చెప్తారు.


ఇటువంటి వారిని చూస్తే అందుకే అనిపిస్తుంది ఇంత విలక్షణమైన, వైవిధ్యం గల సంస్కృతి ప్రపంచంలో మరో దేశంలో కనిపించదు.  


కానీ దురదృష్టం ఏమిటంటే ఇలా మారు మూల అడవుల్లో పల్లెల్లో ఉంటూ తర తరాలుగా తమ వంశాచారాలను పాటిస్తూ, కాపాడుకుంటున్న ఇటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఒకే విధమైన సంప్రదాయాన్ని నెత్తిన రుద్దే అబ్రాహామిక్ మతాలు మత మార్పిడి ద్వారా ఈ వైవిధ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఉదారవాదం, నాస్తికత్వం, కమ్యూనిజం పేరుతో దేశంలో మేధావులుగా చెలామణీ అయ్యేవారు పరోక్షంగా ఇటువంటి మత మార్పిడి శక్తులకు ప్రోత్సాహం ఇస్తూ ఈ వైవిధ్యం నాశనానికి తమ వంతు కృషి చేస్తున్నారు.


విచిత్రం ఏమిటంటే ఎన్నో వేల సం.ల నుండి ఈ దేశంలో ప్రతీ మూలా వివిధ పద్ధతుల్లో పూజింపబడుతున్న రాముడిని ఇప్పుడు ఎదో కొత్తగా దేశం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు అని విమర్శిస్తారు. కానీ రామ్ శబ్దం

ఈ భూమి మీద ప్రతీ రేణువులో, శ్వాసలో ఉంది.

KIDNEY DESERVES THE BEST.*

 🙏🏻 _Please read this piece. Just takes 2 minutes._

*Medical Officers in the USA has sent this through to help each and everyone. Please read and take care of yourself - Dr. Okyere.*


*The rate at which young people are suffering from Kidney disease is alarming. I am sharing a post which can help us. Please read below:*


*IMPORTANT - KIDNEY DESERVES THE BEST.*


_*Barely two (2) days ago, we all received the news of the demise of the Nigerian actor as a result of kidney disease. ALSO OUR MINISTER OF PUBLIC WORKS, the Honorable Teko Lake is currently in the Hospital on life support with Kidney problems. I want to show you how to avert this menace of kidney disease.*_


_*SO HERE ARE THE TOP 6 CAUSES OF KIDNEY DISEASE:*_


*1. Delaying going to a toilet. Keeping your urine in your bladder for too long is a bad idea. A full bladder can cause bladder damage. The urine that stays in the bladder multiplies bacteria quickly. Once the urine refluxes back to the ureter and kidneys, the toxic substances can result in kidney infections, then urinary tract infections, and then nephritis, and even uremia. When nature calls – do it as soon as possible.*


_2. Eating too much salt. You should eat no more than 5.8 grams of salt daily._


*3. Eating too much meat. Too much protein in your diet is harmful for your kidneys. Protein digestion produces ammonia – a toxin that is very destructive to your kidneys. More meat equals more kidney damage.*


_4. Drinking too much caffeine. Caffeine is a component of many sodas and soft drinks. It raises your blood pressure and your kidneys start suffering. So you should cut down the amount of coke you drink daily._


*5. Not drinking water. Our kidneys should be hydrated properly to perform their functions well. If we don’t drink enough, the toxins can start accumulating in the blood, as there isn’t enough fluid to drain them through the kidneys. Drink more than 10 glasses of water daily. There is an easy way to check if you are drinking enough water: look at the colour of your urine; the lighter the colour, the better.*


*6. Late treatment . Treat all your health problems properly and have your health checked regularly. Let's help ourselves... God will protect you and your family from every disease this year.*


_(3) Avoid these Tablets, they are very dangerous:_


*D-cold*

*Vicks Action-500*

*Actified*

*Coldarin*

*Cosome*

*Nice*

*Nimulid*

*Cetrizet-D*

_*They contain Phenyl Propanol- Amide, PPA which causes Strokes & Are banned in USA.*_


*Please, before deleting, HELP your friends by passing it..! It might help someone. Forward to as many as u can.*


*WhatsApp is free, soo..forward it plz.. please read and forward this.*


_Doctors in the United States have found new cancer in human beings, caused by Silver Nitro Oxide._


*Whenever you buy recharge cards, don’t scratch with your nails, as it contains Silver Nitro Oxide coating and can cause skin cancer.*


_Share this message with your loved ones._ 


_*Important Health Tips:*_


*1. Answer phone calls with the left ear.*


*2. Don't take your medicine with cold water....*


*3. Don't eat heavy meals after 5 pm.*


*4. Drink more water in the morning, less at night.*


*5. Best sleeping time is from 10 pm to 4 am.*


*6. Don’t lie down immediately after taking medicine or after meals.*


*7. When phone's battery is low to last bar, don't answer the phone, because the radiation is 1000 times stronger.*


*Can you forward this to people you care about?*


_I just did._ 


*Kindness costs nothing But Knowledge is power...*


_*Please send it to all your friends!*_

*Note:*

_Do not save this message, send it now the other groups that you belong to._


_It is for your good and that of others, giving somebody relief is always rewarding._

Great Rani Rashmoni,

 *Do you know this Great Woman who did all these.......* 


1. Constructed bridge over Ganga at Howrah and set up Calcutta Town


2. Neither allowed British to collect taxes on the rivers nor ever allowed anyone to stop Durga procession


3. Built Dakhineswar Temple in Kolkata


4. Built large utility Wharf (ferry jetty), Quay (landing-place), bathing-place for common Kolkattans on the river Ganga in Kolkata which are still famous as Babu Ghat, Neemtala Ghat! 


5. Recovered and renovated Sankaracharya Temple in Srinagar!


6. Built walls of Krishna Janambhoomi at Mathura!!


7. Purchased Freedom for 2000 Hindus in Dhaka from Muslim Nawab!!


8. Started Boat services from Rameshwaram to Sri Lanka for Temple pilgrimage for Hindus!


9. Donated land on which Kolkata Cricket Stadium is built!


10. Constructed road from Suvarnarekha River to Puri!


11. Donated huge amount to set up Presidency College and National Library in Kolkata!!


Have Nehru, Leftists, Maulvis, Cardinals and their pet historians included this great woman in your syllabus ? *NO*


*You have never even heard of her.*


I am sure 99% Indians even don't know about this Great Woman of India who reformed Bengal. 


Name of this Great Woman is *Rani Rashmoni, the widow of a Kolkata Zamindar.*


She had done so much welfare works during her lifetime from 1793 to 1863 that her statue should have been erected across Delhi and the rest of India. 


*Rani Rashmoni Devi


*Forgotten or deliberately hidden history* 


🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻

🙏🏻🇮🇳🙏🏻 JAI HIND🙏🏻🇮🇳🙏🏻.