15, మార్చి 2023, బుధవారం

జలుబు హరించుటకు

 జలుబు హరించుటకు సులభ ఆయుర్వేద యోగాలు - 


 *  అల్లం , మిరియాలు , తులసి దళాలు సమభాగములుగా తీసుకుని దంచి కషాయం కాచి పూటకు గిద్దెడు (టీ గ్లాసు ) మోతాదులో తీసికొనవలెను . 


 *  పండు జిల్లేడు ఆకు రసం మరియు నువ్వుల నూనె కలిపి శరీరముకు మర్దన చేయుచున్న జలుబు హరించును . 


 *  10 గ్రాముల శొంఠి చూర్ణమును 50 గ్రాముల వేడి నీటిలో కలిపి నిద్రపోయే ముందు పుచ్చుకొనుచుండిన యెడల జలుబు హరించును . 


 *  నల్ల జీలకర్ర చూర్ణమును గుడ్డలో మూటకట్టి వాసన చూచుచుండిన జలుబు త్వరగా తగ్గును . 


 *  వేడి వేడి మినప గుగ్గిళ్లను ఉప్పు కలిపి భోజనము చేసిన పిమ్మట తినుచుండిన యెడల రెండు మూడు రోజుల్లో జలుబు తగ్గిపోవును . 


   పైన వివరించిన ఆయుర్వేద చిట్కాలలో మీకు అనువుగా ఉన్న ఒకదానిని ఎంచుకొని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


      జలుబు , పడిసం వంటి సమస్యలతో ఇబ్బంది పడున్నప్పుడు చల్లటి పదార్దాలు , పచ్చళ్లు , పాలు మరియు పాల సంబంధ ఉత్పత్తులు , ఫ్రిజ్ నీరు , కూల్డ్రింక్స్ వంటివి సేవించరాదు . 


         

సీతా జయంతి

  సీతా జయంతి!*


ఫల్గుణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు జానకీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజును సీతాదేవి జనక మహారాజుకు పొలంలో దొరికిన రోజుగా చెప్పుకుంటారు. సీత త్యాగానికి, అంకిత భావానికి ప్రతీక. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతా మాతను కూడా పూజిస్తే లక్ష్మీ నారాయణుల కటాక్షం దొరుకుతుందట. 


ఈ పండుగను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. సీత భూదేవి పుత్రిక కనుక భూమి అనే పేరుతో కూడా సీతను పిలుస్తారు. జీవితం ముందుకు సాగడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతిని భక్తిగా జరుపుకునే వారికి ఆనందదాయకమైన దాంపత్య జీవితం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు కూడా సీతాజయంతి రోజున సీతారాములను ఆరాధించి, ఉపవాసం చేస్తే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు.

ఆహారముతో నింపవలెను

 .


             _*|సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*ఉదరం పూరయేదర్థం* 

*అన్నైర్భాగం జలేన చ।*

*వాయోః సఞ్చారణార్థాయ*

*చతుర్థం అవశేషయేత్॥*


తా𝕝𝕝 " *పొట్టను సగభాగం ఆహారముతో నింపవలెను.... మిగిలిన సగభాగంలో సగం నీటితో పూరించవలెను*.... *దేహములోని ప్రాణవాయువు  ప్రసరించుటకు వీలుగా ఆ తక్కిన భాగం ఖాళీగా  ఉంచచలెను.*"...

ధనమును

 *సుభాషితమ్* *అర్థానామార్జనే దుఃఖం*

*ఆర్జితానాం చ రక్షణేl*

*ఆయే దుఃఖం వ్యయే దుఃఖం*    

*ధిగర్థం దుఃఖభాజనమ్|*


*ధనమును సంపాదించుట కష్టం, సంపాదించిన ధనమును రక్షించుట కూడా కష్టమే*

కష్టించి ధనమును ఎట్లో సంపాదించిననూ దానిని భద్రపరచుట కష్టమైనదే. ఇక భద్రపరచిన ధనమును ఖర్చు చేసిననూ ధనము తరిగిపోతున్నదని దుఃఖమే మానవుడికి మిగులుచున్నది.

అందువల్ల *ధనమును ఏ విధంగా చూసిననూ ఏ దశలోనైనా దుఃఖమునే కలిగించేది అని తెలియుచున్నది*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

పునర్జన్మ

 సనాతన ధర్మం - పునర్జన్మ


ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు.


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు.


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.


స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.


”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు.


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం ||


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం