28, జులై 2024, ఆదివారం

చంపకమాల

 చంపకమాల:


***********

దినకరుడెంత యోగ్యుడన,దీప్తిగనీభువి వెల్గురీతిగా! 

ఘనమగు కీరిమంతముగ, గారడిజేయునుక్షేత్రమంతటన్!!

కనుటకు నేత్రపర్వముగ,కాంచనమౌననురీతి పైరులన్!

ధనమునొసంగురీతిగను,దాతగవెల్గెను సూర్య దేవుడే!!

డొనెషన్లు

  డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

ఆదివారం సెలవువద్దు...

 ఆదివారం సెలవువద్దు...

ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం..


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||


స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


తాత్పర్యం:


మాంసం తినడం..! మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు..కుటుంబ సౌఖ్యం లేకపోవటం...

ఆనారోగ్యం కూడా..!!


ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు

ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలోముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..


అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు

(Thomas Babington Macaulay,

ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే)

ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..

మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!

ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!


ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! .స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.!

సూర్యనమస్కారాలు చేయండి.!

సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియుకొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ

దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ

క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే

కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.

డబ్బుకన్నా..తల్లిదండ్రులు మిన్న...

 డబ్బుకన్నా..తల్లిదండ్రులు మిన్న...

సీ..

జన్మకారకులౌచు జగతిలో ప్రేమించు

      త్యాగాత్త వర్తనుల్ తల్లిదండ్రు

లవ్వారి పూజ్యతనరయంగ ధర్మమౌ

    నదియెపో రక్షించు ననవరతము

పుట్టలోనిచెదలు పుట్టుచు చచ్చుచున్        

   పుడమినిల్చినయట్టి పోలికగుచు

తల్లిదండ్రుల మీద దయలేని బిడ్డలు       

    నున్నను పోయిన నుర్వికేమి?

తేగీ..

నేటి బిడ్డలు నుద్యోగనెపముతోడ

తల్లిదండ్రుల బాగోగులెల్ల గనక

వృధ్ధ శరణాలయముల చేర్పించి చేయి

దులుప క్షేమము తనకౌనె!దుఃఖకరము.


తల్లిదండ్రులదినోత్సవం సందర్భంగా...

రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి

పువ్వుల తోటలన్గనుడి

 ఉ.

పువ్వుల తోటలన్గనుడి పున్నమి చంద్రుని బోలు మోములన్ 

దివ్వెల బోలినట్లు మది తెల్లని కాంతుల పండితాళియే 

మువ్వల సవ్వడేమొయన మోదము భారతి నాట్యమాడగా 

రవ్వల నవ్వులన్విరిసె రాజిలు మోమున రామచంద్రుడే.

పువ్వుల తోటలన్గనుడి

 ఉ.

పువ్వుల తోటలన్గనుడి పున్నమి చంద్రుని బోలు మోములన్ 

దివ్వెల బోలినట్లు మది తెల్లని కాంతుల పండితాళియే 

మువ్వల సవ్వడేమొయన మోదము భారతి నాట్యమాడగా 

రవ్వల నవ్వులన్విరిసె రాజిలు మోమున రామచంద్రుడే.

మాతృదినోత్సవ సందర్భంగా...

 మాతృదినోత్సవ సందర్భంగా...


అమ్మ కెవరు సాటి అవనియందు!

----------------------------

ఆ.వె.

అమ్మ పెట్టు బువ్వ అమృతోపమానము;

ప్రేమ యనెడి తేనె వేసి కలిపి

కొసరి కొసరి పెట్టు కొడుకుకూతుళ్లకు!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

ఉన్న 'కొద్దిపాటి' అన్నమంతయు కల్పి

ప్రేమతోడ బెట్టు పిల్లలకును;

"లేదు ఆకల"నుచు లేచిపోవును తాను!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

అరువదేళ్లు వచ్చి అవ్వతాతలు నైన 

పిల్లవాళ్లె తల్లి కళ్ల కెపుడు!

తల్లి ప్రేమ మనకు తరగని పెన్నిధి!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

తండ్రి కోపగించి తా కొట్టబోవగా

అమ్మ అడ్డు వచ్చి ఆదుకొనును!

ఈగనైన మీద మూగనీకుండురా!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

ఉగ్గుపాలు బోసి ఉయ్యాలలో నూపి

నిద్రపుచ్చి నిన్ను భద్రముగను

నిద్ర లేని రేలు నినుగూర్చి గడిపెరా!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

చేయి చాచి తాను చేరబిల్చుచు నీవు

అడుగు అడుగు వేయ అమ్మ నేర్పె!

నేర్పినట్టి విద్య నిన్నెత్తునన్నిల్పె!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

కాస్త సుస్తి చేయ కలవరపడిపోవు;

వేయి మ్రొక్కులిడును వేల్పులకును;

సంతు మీది ప్రేమ యెంతొ చెప్పగ లేము!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

అమ్మ "బొమ్మ"నిచ్చి ఆటలాడగ జేసి

తనయ కపుడె "అమ్మతనము" నేర్పి

భావి మాత కొఱకు బాటను చూపించు!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

కొంత వయసు వరకు సంతు చేసిన యట్టి

మలము మూత్రములను తొలగ దీసి

మురికి కడిగి యెత్తి ముద్దులాడును కదా!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

అక్షరాలు నేర్పి 'అమ్మ' 'ఆవ'ని వ్రాయ

అమ్మ సంతసించు నమితముగను!

భవితలోని వారి బాగును దలపోయు!

అమ్మ కెవరు సాటి అవని యందు!


----------కోడూరి శేషఫణి శర్మ

కృష్ణ స్తుతి*

 *పంచ చామరం లో కృష్ణ స్తుతి*


కిరీటినం కరద్వయే చ నాగదండ ధారిణం।

విశాలఫాలమండితం సునీలవర్ణ సుందరం।

విశాలవక్షశోభితం విరాజమాన భూపతిం।

సమాశ్రయే గతిప్రదం మతిప్రదం సుధాకరం।


 కృపాకరేక్షణం చరాచరప్రకాశితం హరిం।                             మహాత్మ్యపూర్ణచేష్టితం విచిత్ర బాలవేషకం।                 

కళాత్మకం సుబోధకం విలాసి లోకపాలకం।                    భజామికృష్ణమచ్యుతం విశేషయోగిపుంగవం।


 విచిత్రచిత్రమద్వయం విలక్షణం జగద్గురుం।

విశాలతత్త్వబోధకం వివేక భాస్క రాకృతిమ్।

విభూతిధారణప్రియ ప్రపూజితం సదా।

నమామి విశ్వమోహనం వికాసబుద్ధి కారణం ।


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️విమల శ్రీ

నేటి వధువు

 నేటి వధువు

------------------

సీ||

కాలు బయటబెట్ట,కాలు నింటను బెట్ట

        కారుండ వలయును కన్య కిపుడు!

కర్లింగు హెయిరుతో కండల వస్తాదు

          సిక్సు-ప్యాకు వరుడె శ్రేష్ఠుడిపుడు!

అత్తమామలు లేని,యాడు బిడ్డలు లేని

        ఒంటరి వానికే 'ఓటు'నిపుడు!

ట్వల్వు కే ప్యాకేజి ట్వంటిటూ ప్యాకేజి

         అందుకొనెడి వరుడె అందగాడు!

తే.గీ.||

స్టౌ ను వెలిగించ తనకు నాసక్తి లేదు;

ఆనులైను ఫుడ్డు నెపుడు నారగించి

టింగురంగా యటంచును ఠీవి జూపి

పడక జేరంగ దలచును వధువు నేడు!



-----------కోడూరి శేషఫణి శర్మ

కృష్ణాష్టమి

 *కృష్ణాష్టమి వస్తున్న సందర్భంగా*


6)అష్టశ్రియాశ్రితమహామహిమావతార!

సప్తర్షి కీర్తితగుణామృత తత్వమూర్తే! 

గోవిన్ద మాధవ కృపాం కురుమే దయాళో! 

శ్రీపాదకృష్ణభగవన్ తవ సుప్రభాతమ్!

7) గోవర్ధనోద్ధర గురో నరకాదినాశ!

సాందీప పుత్రవరదాచ్యుత వాసుదేవ! 

బృందావనప్రియహరే మురళీధరాత్మన్! 

శ్రీపాదకృష్ణ భగవన్ శరణంప్రపద్యే!

8) నందప్రమోదమహదాశ్రయభాగ్యశాలిన్! 

రాధావిహారరసికోత్తమరాజరాజన్! 

మాముద్ధరత్వరితయాగురుచక్రపాణే! 

శ్రీపాదకృష్ణ భగవన్ తవ సుప్రభాతమ్!

9) కుబ్జాకురూపహరణే కరుణారసాత్మన్! 

విప్రస్యకష్టహరణేమహిమాన్వితాత్మన్! 

కంసాదిదుష్టహరణే భుజ శౌర్యకీర్తే! 

శ్రీపాదకృష్ణ భగవన్ శరణం ప్రపద్యే!

10)కర్తవ్యబోధక జయప్రద సర్వసాక్షిన్! 

విశ్వస్వరూపవిజయార్చిత పాదవిష్ణో! 

విజ్ఞానపూర్ణనిఖలాగమధర్మవేత్త:!

శ్రీపాదకృష్ణ భగవన్ తవ సుప్రభాతమ్!

11)బాల్యాత్ విచిత్ర చరితాన్విత దేవ దేవ।

భూమండలాధిపనిజాశ్రిత దు:ఖహర్త:।

కళ్యాణ వైభవ కళాధర పూర్ణ కామ! 

శ్రీపాదకృష్ణభగవన్శరణంప్రపద్యే!

12) నారాయణాదిపురుషోత్తమలోకబంధో! 

మత్స్యాద్యనంతమహిమాకృతిదేహధారిన్! 

భూతాంతరంగ వసితాఖిల విశ్వ మూర్తే।

శ్రీపాదకృష్ణభగవన్ శరణం ప్రపద్యే!

 13) త్వన్నామకీర్తనఫలం భువిముక్తిహేతు:।

త్వత్పాదచింతనగుణాత్

సకలార్థ సిద్ధి:।

త్వంబాలకోహిమధురాపురవాసనిత్యం! 

శ్రీపాదకృష్ణభగవన్ శరణం ప్రపద్యే।

 14)చిన్తాంవిదూరయసదాహృదిమేవస త్వం।

కృష్ణ త్వదీయ మననం సతతం 

దదాతు।

దీనాతిదీన పతితోద్ధర కీర్తిశాలిన్।

శ్రీ పాదకృష్ణ భగవన్ శరణం ప్రపద్యే।


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️విమల శ్రీ

శ్రీ సూర్యనారాయణాయ నమః.

 శ్రీ సూర్యనారాయణాయ నమః.


సీ.

కరము దీప్తిదమైన కరసహస్రముతోడ

ధరవారి ననిశంబు దనుపువాడు,

గ్రహరాజు తానౌచు నహరహమ్మును మిత్ర 

కోటి కానందమ్ము కూర్చువాడు,

ద్యుమణియై నభమందు తోరంపు సౌందర్య

మొప్పు మీరగ దెల్పు చుండువాడు,

ధ్వాంతశక్తిని గూల్చి తానొక్కడై నిల్చి 

వందనమ్ములు నిత్య మందువాడు

తే.గీ.

సూర్యనారాయణుం డంచు సూరికోటి 

పిలుచుచుండెడి వాడెంచ నిలకు సతము 

కర్మసాక్షిగ ధర్మంబు గరపువాడు 

తరణి భానుండు ప్రత్యక్షదైవ మతడు.

కం.

వందనము సూర్యదేవా!

వందన మో యరుణ! మిత్ర! వందనము హరీ! 

వందనము లోకబాంధవ! 

వందన మిదె స్వీకరించ వలె తిమిరారీ!


హ.వేం.స.నా.మూర్తి.

28.07.2024.

నిత్యపద్య నైవేద్యం-1562

 నిత్యపద్య నైవేద్యం-1562 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-197. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

అఘం స కేవలం భుక్తే 

య: పచత్యాత్మ కారణాత్l

యజ్ఞ శిష్టాశనం హ్యేతత్ 

సతామన్నం విధీయతేll 


తేటగీతి:

ఎవడు కేవల తనకోస మింట వంట 

చేసుకొని భోజనమ్మును చేయుచుండొ

తనదు పాపమునే తాను తినుటయగును 

సత్పురుషుల కన్నమిడుట సత్ఫలంబు.


భావం: ఎవరు కేవలం తనకోసం వంట చేసుకొని భోజనం చేస్తాడో.. వాడు తన పాపాన్నే తిన్నట్లు సుమా! సత్పురుషులకు అన్నం వడ్డించిన పిదప భోజనం చేస్తే యజ్ఞశేషాన్ని తినటంతో సమానం.

లోకంతీరు-8

 లోకంతీరు-8

కందం||

వేగంబన్నిట బెరిగెన్

రోగంబన్నిట ముదిరెను రోతగనిలలోన్

యోగంబలరగ బ్రతుకక

భోగంబులపొర్లుచుండ్రుపుడమినజనులున్


భావము:-- 

వేగములేనిదేదీయిలలో లేదు.దానితో పాటుగా జనులకు రోగాలూ పెరుగు చున్నాయి.సుఖశాంతు

తులకనువైన చద్దిమూట

లోవంటి పెద్దలమాటలను

పాటించుట లేదు.భోగాన

తేలుతూ, వికృతకరాళ

నృత్యాల జనులు నరక కూపాలలోనికి వెళ్ళుచున్నారు.


దేవరకొండ:రాజోలు

దశరథాత్మజ శతకము (21)

 దశరథాత్మజ శతకము (21)


సీ. భండన భీముండు  పరమాత్మ రాముండు

                కరుణాంత రంగుండు కడలిసముడు 

     భరతాగ్రజా ! నిన్ను  భజియించు వారికి

               భయమేల  కల్గును భక్త వరద !

     సంతాపముల మాన్పి సంతసమ్ముల నిచ్చు 

               సాకేతపురవాస ! సత్త్వ తేజ !

     నిరతమ్ము  నినుమది  నీమమ్ముతో  నెంచ 

              భవబంధ మోహముల్  బాసి పోవు 

తే.శరణు వేడిన వారిని కరుణ తోడ 

     కూర్మి రక్షించి కాపాడు కోసలేంద్ర !

     భక్తి నర్పింతు నతులను ముక్తి గోరి

     ధశరథాత్మజ !  శ్రీరామ ! ధర్మపురుష !


          జయలక్ష్మి

360. ఓం *ముణ్డిన్యై* నమః..🙏🏼

 360. ఓం *ముణ్డిన్యై* నమః..🙏🏼

శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 360వ నామము


నామ వివరణ. 

పుర్రెలమాల ధరించిన తల్లి.


తే.గీ.  *ముణ్డినీ!* రక్షవై నాకునుండు నిన్ను

నెట్లు వర్ణింప గలనమ్మ? యిందు వదన!

మండనంబుగ కవితలోనుండుమమ్మ.

వందనంబులు చేసెదనందుకొనుము.

🙏🏼

రచన .. చింతా రామకృష్ణారావు.

జీవన మార్గమిచ్చి

 జీవన మార్గమిచ్చి సుఖజీవన శాంతి లభింపజేసి లో 


కావన పావనప్రభల ఖ్యాతి గడించిన వర్షారాజమా ! 


భావనలుల్లసిల్ల సమభావము చూపి , అనుగ్రహింపుమా ! 


దీవనలిచ్చి కావుమ! సుదీర్ఘ శుభమ్ముల నందజేయుమా. ! 


బ్రతుకుల వెల్తురిచ్చి పలుబాముల దీర్చెడి దీనబాంధవా ! 


వెతలను పారద్రోలి గనువిందుగ సర్వము నాట్యమాడుతన్ 


గతుకులు పూడి , యిల్వెలుగ గర్షక మిత్రులు పైడి పంటలన్ 


బ్రతుకొక పూలబాట యయి పర్వ వినోదము నిండు ధారుణిన్. 

(1969 లోవ్రాసినవి అప్రకటితము )

క్రొత్తపలుకు-7

 క్రొత్తపలుకు-7

ఇడుము కలిగెనేని హీనుండవైపోవు 

ఓర్పుతోడ నిలువ నేర్పు కలుగు 

నిరుగు పొరుగు లెవరు నింతైన నీబోరు 

నీకు నీవె దన్ను నిగిడి గెలుము 


క్రొత్తపలుకు-8

నిన్ను వెక్కిరించ నీబంధు మిత్రులు 

మొదల నుందురయ్య మోము త్రిప్పి 

ధనము కలెగెనేని దాయాదులై నీకు 

మెచ్చుకొనుచు జేరు నుప్పు తినగ 

*~శ్రీశర్మద*

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

 *ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినది* 

ఇలాచెప్పడానికి చాలా ధైర్యం మరియు విశ్వాసంకూడా కావాలి!*

 

  *వారి మాటలలో ఇలా*


  *ఇస్లామిక్ షరియా చట్టాన్ని కోరుకునే ముస్లింలు,* వారు బుధవారం నాటికి షరియా దేశాలకు వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేకదేశాలు ఆయాదేశ మతోన్మాదముస్లింలను తీవ్రవాదులుగా భావిస్తున్నాయి.*

  * రాష్ట్రంలోని ప్రతి మసీదుపై విచారణ జరుగుతుంది, ఆ విచారణలో ముస్లింలు

మాకుసహకరించాలి.  ..*

  కానీ మేము

ఏమిచేస్తున్నామో, అది భారతదేశప్రజల ప్రయోజనాల కోసమేచేస్తున్నామని నేను భారతప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఇస్తున్నాను.

  *మేము ఇక్కడ హిందీ మాట్లాడతాము ఐతేఉర్దూ మరియు అరబిక్ కాదు .. కాబట్టి మీరు ఈ దేశంలో జీవించాలనుకుంటే మీరు హిందీ మరియు సంస్కృతం నేర్చుకోవాలి.*


  * భారతదేశంలో మేము శ్రీరాముడు మరియు కృష్ణుడిని దేవుడు మరియు దేవతలుగా భావిస్తాము, మేము సర్వేజనా సుఖినోభవంతు అన్న అత్యున్నత భావనలతో కూడుకున్న.. సర్వమానవాళి శ్రేయస్సును మరియు సౌభ్రాతృత్వాన్ని కోరుకునే..** మానవజాతి సౌలభ్య, ఆర్థిక, ఆరోగ్య,ఆనంద అవసరాలైన.., సంస్కృతి, సాంప్రదాయం,వైద్యము,వివేకం, విచక్షణ,విజ్ఞానము మరియు ఆధ్యాత్మికాలతో సమ్మిళితమై సంపూర్ణత్వాన్ని సంతరించుకున్న

మాసనాతన ధర్మాన్నిమాత్రమే నమ్ముతాము, మానవ మనుగడకు హానికలిగించే ఏ పిచ్చిమతాన్నినమ్మము, అలాగని మేము మతత్వంతో ఉన్నామని దీనిఅర్థంకాదు!  ఇక్కడ మనకు దేవుడు మరియు గ్రంథాల చరిత్ర ఉంది  ప్రతిచోటా ఆధారాలు ఉన్నాయి!* వాటిపై మాకు పూర్తివిశ్వాసం కూడాఉంది. ఇందులో రెండోమాట లేదు.


  * దీనికి మీకు అభ్యంతరం ఉంటే, ఇప్పుడే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు.*

  *భారతదేశం మన మాతృభూమి,*

  *మనభూమి, మరియు మాకు నాగరికత ఉంది. అని పూర్తి విశ్వాసంతో ఉన్న వారు మాత్రమే ఇక్కడ ఉండవచ్చు.


  మేము మీ మతాన్ని విశ్వసించము, కానీమేము మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తాము!


  * కాబట్టి మీరు నమాజ్ చేయాలనుకుంటే శబ్ధ కాలుష్యం చేస్తూ ఆఫీసులో, పాఠశాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ను అస్సలు చేయవద్దు! * * మీ ఇళ్లలో లేదా మసీదులో ప్రశాంతంగా నమాజ్‌ని అందించండి.  తద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.*


  * * మన జెండాతో, మన జాతీయ గీతంతో,

మా మతంతో లేదా మాజీవన విధానంతో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే, ఇప్పుడే ఇండియాను వదిలి ప్రపంచంలో మీరుకోరుకున్న దేశానికి వెళ్ళండి.


  లేదా ఇక్కడి విశ్వాసాలను పూర్తిగా నమ్మి సంపూర్ణ సమాజ మరియు దేశరక్షణ సహాయకారిగా సహజీవనం గడపగలిగితే ఇక్కడే ఉంటూ రాముడిలా జీవించండి-*


     *స్నేహితులు,*

  *మీరు నిజమైన భారతీయులైతే, కనీసం ఒక స్నేహితుడికైనా ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయగలరు.*


   *భారత్ మాతా కి జై*.

పద్మసంభవు ధర్మపత్ని

 *పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్*

ఈ సమస్యకు నాపూరణ. 


*వితండవాది*

పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్


*సంస్కార వంతుడు* 

ఛద్మమేల  వితండవాదివి చాలు వంకర మాటలున్


సద్మమౌ కమలాక్షి వాణికి సారసంబని  వింటిమే


పద్మసంభవు ధర్మపత్నియె పల్కులమ్మనెరుంగవా!


(ఛద్మము =మోసము

సద్మము =ఇల్లు, నీళ్ళు) 


అల్వాల లక్ష్మణ మూర్తి.

మానవ స్వభావం*

 *మానవ స్వభావం*


సభ్యులకు నమస్కారములు.


మనం పుడితే *తల్లి* సంతోషపడాలి, మనం పెరిగితే *తండ్రి* ఆనందపడాలి , మనం బ్రతికితే ఈ *సమాజం* సంబరపడాలి, మనం *చస్తే* స్మశానం కూడా *కన్నీరు* పెట్టాలి . అదే మన *జీవితం* కావాలి.


మనము  *అందంతో* పుట్టడం మన చేతుల్లో ఉండదు కాని, మంచి *మనసును* కలిగివుండడం అనేది మన చేతుల్లోనే ఉంది . మనము  *సంపన్నుల ఇళ్లలో* పుట్టడం మన చేతుల్లో ఉండదు కానీ మంచి *సంస్కారంతో* బతకడం అనేది మన చేతుల్లోనే ఉంది .


ఈ సమాజంలో ఒకరి *సమస్య* ఇంకొకరికి *నవ్వులాట* లా ఉంటుంది ఒకరి *జీవితం* ఇంకొకరికి *చులకన* గా ఉంటుంది , ఒకరి *ఆనందం* ఇంకొకరికి *అసూయగా* ఉంటుంది . ఒకరి *బాధ* ఇంకొకరికి *బరువుగా* ఉంటుంది . ఒకరి *పరువు* ఇంకొకరికి *ఎగతాళిగా*  ఉంటుంది . ఒకరి *ఆపద* ఇంకొకరికి *అవకాశంగా* ఉంటుంది . ఒకరి *బలహీనత* ఇంకొకరికి *బలంలా* ఉంటుంది .


 శాసనాలు చేసేటోళ్లే *నీతి* తప్పి డబ్బులు పంచుతుంటే,  *పట్టాలు* పొందిన పట్టభద్రులు *పైసలకు అమ్ముడు* పోతుంటే ప్రజాస్వామ్య మనుగడ *ప్రశ్నార్థకం* అవుతుంది మరియు *నీతికి* చెదలు పట్టినట్లే గదా.


క్యాలెండర్లో *పేజీలు* చిరుగుతూ ఉంటాయి, *కాలం*   గూడా గడిచిపోతూ ఉంటుంది. కాలంలో *వెనకకు* తిరిగి చూస్తే  *మనం* చేసిన మంచి *పనులు* ఏవైనా కానవస్తున్నాయా,  ఒకసారి *సరి చూసుకుందాము*.లేకపోతే *సరిచేసుకుందాము* 


.మనిషి కాలం వెంట *పరిగెడుతున్నా*, ఎప్పుడో  ఒకప్పుడు   *అగక*  తప్పదు అది *ఎప్పుడో* ఎవరికీ తెలియదు ముందుగా.


 *ఆలోగా సమాజానికి కొంత మేలు చేద్దాము* ఏ క్షణము నుండి మనము ఎదుటి వారిని సుఖము, సంతోషముగా ఉంచుతామో అప్పటి నుండి మనము ఆనందంగా ఉంటాము. *మానవ సేవయే మాధవ సేవ*.


ధన్యవాదములు.

*(సేకరణ)*

28.07.2024. ఆదివారం

 *జై శ్రీరాం..🚩🚩.      శుభోదయం..🌻🌹*


28.07.2024.       ఆదివారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం....


ఈరోజు ఆషాఢ మాస బహుళ పక్ష *అష్టమి* తిథి సా.07.27 వరకూ తదుపరి *నవమి* తిథి, *అశ్వనీ* నక్షత్రం ప.11.47 వరకూ తదుపరి *భరణీ* నక్షత్రం, *శూల* యోగం రా.08.11 వరకూ తదుపరి *గండ* యోగం ,*బాలవ* కరణం ఉ.08.20 వరకూ, *కౌలవ* కరణం సా.07.27 వరకూ తదుపరి *తైతిల* కరణం ఉంటాయి. 

*సూర్య రాశి*: కర్కాటకం (పుష్యమీ నక్షత్రం లో)

*చంద్ర రాశి* :మేషం లో.

*నక్షత్ర వర్జ్యం*: ఉ.07.59 నుండి ఉ.09.31 వరకూ మరలా రా.09.02 నుండి రా.10.35 వరకూ.

*అమృత కాలం*: తె.04.57 నుండి ఉదయం 06.28 వరకు


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం* : ఉ.05.54

*సూర్యాస్తమయం* : సా.06.51

*చంద్రోదయం*: రా.12.09

*చంద్రాస్తమయం*: మ.12.31

*అభిజిత్ ముహూర్తం*:ప.11.57 నుండి మ.12.48 వరకూ

*దుర్ముహూర్తం*: సా.05.07 నుండి సా.05.59 వరకూ

*రాహు కాలం*: సా.05.14 నుండి సా.06.51 వరకూ

*గుళిక కాలం*: మ.03.37 నుండి సా.05.14 వరకూ

*యమగండం*: మ.12.23 నుండి మ.02.00 వరకూ.


*వ్యతీపాత పర్వకాలం, వ్యతీపాత మహాపాత కాలం* ఈ రోజు రా.07.50 నుండి రా.01.14  వరకూ ఉంటుంది. రవి p చంద్ర (రవి చంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పేక్ట్), రవి గ్రహ క్రాంతి, చంద్ర గ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 18°45' కి చేరుకోవడం) ఈరోజు రా.11.00 కి ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసన మంత్రాలు జపించడానికి, అనుష్టానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి , నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్రజపాలు లక్షల సూర్య గ్రహణాల సమయం లో ఆచరించనంత ఫలితాల్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు.


ఆదివారం అశ్వనీ నక్షత్రం కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు సూర్యోదయం నుండి 11.47 వరకూ ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నారాయణ స్మరణం తో......సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

కర్మలవల్ల భక్తి

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      శ్లో 𝕝𝕝   *కర్మణా జాయతే భక్తిః* 

               *భక్త్యా జ్ఞానం ప్రజాయతే*।

               *జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః* 

               *ఇతి శాస్త్రార్థసఙ్గ్రహః*॥


    తా 𝕝𝕝  "కర్మలవల్ల భక్తి కలుగుచున్నది.....భక్తి వల్ల జ్ఞానమున్నూ, తద్వారా మోక్షము కలుగుతున్నదని శాస్త్ర నిర్ణయము."

ప్రపంచ వివాహ దినోత్సవం

 భార్యే ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు    లేకపోయినా...

ఇంట్లో  భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త  వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇల లో తను లేని ఇల్లు...  కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం  లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

* భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన

 *జీవితాన్ని అందించే తన " పట్ట మహిషి " ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. 

అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం..🪷🪷

_నమ్మకమే అనుబంధానికి



          *_నమ్మకం ఉంటే మౌనం కూడా అర్దం అవుతుంది,  నమ్మకం లేకుంటే ప్రతీమాట అపార్డమే అవుతుంది_* 

       *_నమ్మకమే  అనుబంధానికి ఆత్మ లాంటిది._*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞