10, జూన్ 2024, సోమవారం

చంద్రుడు

   చంద్రుడు

 చంద్రుడు రొజుకు రెందు ఘడియలు ఆలస్యంగా వస్తాడు.మరియు తన స్థితిలో 1/15 వంతు తక్కువగా కనపడతాడు.  ఒక ఘడియ అంటె 24 నిముషాలు, వెరసి రెండు ఘడియలు అంటె 48 నిముషాలు. ఆ లెక్కన పక్షానికి  15 X 48:= 720 ఇప్పుడు దీనిని గంటలలోకి మారుద్దాము అంటే 720/60= 12 అంటే12 గంటల ఆలస్యం అవుతుంది. 

ఇప్పుడు మనం అమావాస్య నుండి లెక్కిద్దాము. మనకు తెలుసు అమావాస్య నాడు చంద్రుడు రాత్రిపూట కనపడడు అంటే దాని అర్ధం చంద్రుడు పూర్తిగా పగటి పుట మాత్రమే ఉంటాడు.అంటే ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాడు.  చంద్రుని పరిమాణం 0 అనుకుందాము. సాధారణంగా అమావాస్య మరుసటి రోజు అంటే సాయంత్రం 6 గంటలకు 48 నిముషాలు కలిపితే 6-48 నిముషాలు వరకు చంద్రుడు ఉంటాడు చంద్రుని పరిమాణం size 1/5 వ వంతు ఉంటుంది ఆ లెక్కన ప్రతి రోజు 48 నిముషాలు సమయం కలుపుకొని 1/15 వ సైజును పెంచుకుంటూ పోతాడు. అంటే సప్తమి నాడు యెట్లా ఉంటాడో చూద్దాము 

సమయం 7 X 48అంటే  336 నిముషాలు దీనిని గంటలలోకి మారుస్తే 336/60= 3.36 అంటే రాత్రి 9 గంటల 36 నిముషాలకు చేంద్రోదయం అవుతుంది. size  1/15 X 7 = .47 అంటే దాదాపు సగము పరిమాణంలో ఉంటాడు. రెండు పక్షాలలో అంటే కృష్ణ పక్షం శుక్ల పక్షంలో కూడా చంద్రుడు దాదాపు సంగం సైజులో వుంది రాత్రిపూట సగం పగటిపూట సగంగా కనపడతాడు. చిత్రంగా లేదా. 

ఇక పౌర్ణమి నాటి లెక్క చూద్దాము ముందుగా సమయం అమావాస్యనుంచి పౌర్ణమి  15 వ రోజు వస్తుంది ఇప్పుడు లెక్క చూద్దాము 

15 X 48 = 720 నిముషాలు గంటలలోకి మారుస్తే 720/60 = 12 అంటే ఉదయం 6 గంటలకు అమావాస్యనాటికి 12 గంటలు కలిపితే సాయంత్రం 6 గంటలు వస్తుంది ఇక సైజు విషయానికి వస్తే 1/15 X  15 = 15 అంటే పూర్తీ బింబం అన్నమాట. కాబట్టి పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 గంటలవరకు చంద్రుడు ఆకాశంలో కనపడతాడు అది కూడా పూర్తీ బింబముగా. 

ఒక్క విషయం. చెంద్రుడు మనకు ఒక వైపు మాత్రమే కనపడతాడు. చెంద్రుని రెండవ వైపు మనకు కనపడదు. చంద్రుని మీద వున్న కొండలు గుట్టలు మనకు మచ్చలుగా కనపడతాయి. చంద్రుడు ఒక గ్రహం కాబట్టి స్వయం ప్రకాశం ఉండదు. సూర్యుయిని కాంతి చంద్రుని మీద పడి  reflex కావటంతో కనపడే బింబము. మనం చంద్రుని మీదకు వెళ్లి చుస్తే భూమి చంద్రుని మీద మనకు ఇక్కడ చంద్రుడు కనపడ్డట్లే కనపడుతుంది. 

శుభం 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ










బొట్టు పెట్టుకోవడం

  

బొట్టు పెట్టుకోవడం వలన ఫలితాలు భూవోఘ్రాణ స్వయస్సంధిః  అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట పెట్టుకోవాలి అని అర్థం.  ఇక్కడ ఇడ,పింగళ ,సుషుమ్న లేక గంగ ,యమున ,సరస్వతి లేక  సూర్య ,చంద్ర ,బ్రహ్మ అని పిలువబడే  మూడు ప్రధాననాడులు కలుస్తయ్ . దీనినే "త్రివేణి సంగమం "అని అంటారు.  ఇది పీయూష గ్రంధికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధస్ధానం . ఇదే జ్ఞానగ్రంధి అనికూడా పిలువబడుతుంది.   ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కల్గిస్తారో  వారు మేధావులౌతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్రంధుల పై ఉంటుంది.  " కేనన్ " అనే పాశ్చాత్య శాస్ర్తవేత      భ్రుకుటి స్థానాన్ని మ... 

వర్షాకాలం వచ్చేసింది.

 

🔯

 వర్షాకాలం వచ్చేసింది. నైఋతి ఋతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాలను తాకాయి.


🔯  వర్షాకాలం లో సాధారణంగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో , TMC మరియు Cu Sec మొదలగు పదాలు, వినిపిస్తూ ఉంటాయి. వాటి గురించి   చాలా మందికి తెలియదు. 


🔯  ముందుగా క్యూబిక్ ఫీట్ ( ఘనపుటడుగు )అంటే తెలుసుకుందాం. పొడవు, వెడల్పు, లోతు ఒక్కొక్క అడుగు చొప్పున ఉన్న ఒక పాత్రలో ఎంత నీరు పడుతుందో , దాన్ని ఒక క్యూబిక్ ఫీట్ అంటారు.


🔯 

1 క్యూబిక్ ఫీట్. = 28.3168 లీటర్లు.


🔯   జలాశయాలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పటానికి ఉపయోగించే  ప్రమాణము టీ.ఎం.సీ.  TMC - THOUSAND MILLION CUBIC FEET  అని అర్థం.

 ఒక టి .ఎం. సి .   విలువ 2,832 కోట్ల లీటర్లు ఉంటుంది.


🔯   క్యూసెక్ అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం.CU SEC - CUBIC FEET PER SECOND అని అర్థము. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశారు  అంటే  ఒక  సెకను కాలంలో గేట్ల ద్వారా 28.3168 లక్షల లీటర్ల నీరు విడుదలైంది అని అర్థం.


🔯  సాంకేతిక సమాచారం ప్రకారం        1 TMC నీరు, సుమారు 10,000 ఎకరాలు సాగు చేయడానికి సరిపోతుంది.


🔯  విచారించ దగ్గ విషయం ఏమిటంటే - గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కొక్క సంవత్సరం సుమారు 20 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానది ద్వారా హంసలదీవి వద్ద బంగాళా ఖాతం లో కలిసిపోవడం . 


🔯 ఈ నీటిని మనం నిల్వ చేయగలిగితే కొన్ని సంవత్సరాల పాటు సరియైన వర్షాలు కురవకపోయినా సాగునీటికి, త్రాగునీటికి లోటు లేకుండా మనం జీవించగలం.

🔯 ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో వేసవి కాలంలో ఏర్పడే నీటి కటకట అందరికీ తెలిసిందే. నీటి సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు యేర్పాటు చేసుకోవాలి. నీటి వృధా ను అరికట్టాలి.


🔯 అందరికీ ఈ రెండు పదాల అర్థము వివరించాలని నా ఆలోచన. ధన్యవాదములు.

  ఇట్లు

   మీ 

భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు, 

రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్.

భారతీయులారా , మీకు తెలుసా

 భారతీయులారా , మీకు ఇవి తెలుసా?...


👉భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)

👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) 

👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)

👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)

👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి) 

👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే

👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన 

వాల్మీకి మహర్షి మనవాడే 

👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు 

👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు

👉అణువులు గురించి వివరించిన కణాదుడు 

👉DNA గురించి చెప్పిన బోధిధర్మ 

👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి

👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు 

👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని

ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏


 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పరోపకార స్వభావం

 *ప్రతీఒక్కరూ పరోపకార స్వభావం కలిగివుండాలి* 


మనిషి మనసులో ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి.  అతనికి, ఇతరులకు హానికలిగించే ఆలోచనలు ఎప్పుడూ రాకూడదు.  ఇతరులకు బాధ కలిగించేవాడు చివరికి తనకుతానే ప్రమాదం తెచ్చుకుంటాడు.

 రామాయణంలో రావణుడి చర్యలలో ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది.  శ్రీరామచంద్రుని భార్య సీతామహాసాధ్విని అపహరించి లంకలో బంధించాడు.  హనుమంతుడు ఆ లంకకు వెళ్లి సీతను శ్రీరామునికి తిరిగి ఇస్తే బాగుంటుందని రావణునికి చెప్పాడు.

 అది వినకుండా రావణుడు తనకు సలహా ఇచ్చిన హనుమంతుని వాలానికి నిప్పంటించాడు.  ఆ అగ్ని హనుమంతునికి హాని చేయకుండా రావణుడు నివాస స్థలంగా ఉన్న లంకను దహించింది.

 కాబట్టి ఇతరులకు హాని చేయవద్దు.  శ్రీ శంకర భగవత్పాదులు తనకు హాని కలిగించిన వారి పట్ల కూడా సహనం ప్రదర్శించారు.ఇది గొప్పవారికి, వారి విజ్ఞతకు సంకేతం.

  *భగవాన్ గీతలో* 

 ఎదుటివారి మనసులో ఎన్నటికీ భయం పుట్టనివ్వని వాడు నాకు ప్రీతిపాత్రుడు.అని చెప్పారు.

 అలాంటి వ్యక్తి ఎవరు కావచ్చు?  అతను ఇతరులకు హాని కలిగించడానికి ఇష్టపడడు.  అటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుని యొక్క నిజమైన భక్తుడు కాగలడు.

 మహాభారతంలో కూడా యుధిష్ఠిరునికి హాని కలిగించే ప్రయత్నంలో దుర్యోధనుడు తనను తాను నాశనం చేసుకోవడం మనం చూస్తాము.

 కావున ప్రతి ఒక్కరు ఈ భాషణలో ఉందహరించిన వాటిని చక్కగా గ్రహించి ఇతరులకు హాని తలపెట్టకుండా పరోపకార స్వభావాన్ని పెంపొందించుకోవాలి. 


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

దశరథుని పూర్వీకుల గురించి

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 సీతమ్మ కథలో భాగంగా  సీతారాముల కల్యాణ ఘట్టం సాగుతోంది. మహర్షి వశిష్టుడు దశరథుని పూర్వీకుల గురించి చెబుతూ వారిలో ఏ రాజు గొప్పదనం ఏమిటో చెబుతున్నాడు.  అక్కడే మనకు రఘువంశ చరిత్ర అర్థమవుతుంది. కాళిదాసు తర్వాత ఒక్క రఘువంశాన్నే తీసుకుని మహాకావ్యమే రచించాడు. ఆ వివరాలన్నీ ఈ ఎపిసోడ్ లో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా.  పుట్టపర్తి నాగ పద్మిని గారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం చైత్ర పౌర్ణమి నాడే ఎందుకు జరుగుతుందో కూడా వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

వెంకట సుబ్బారావు జయంతి

 *జాతికి సారథి.... ఐక్యతకు వారధి.... *ప్రతిజ్ఞ* !* 

(నేడు వెంకట సుబ్బారావు జయంతి)

"జనగణమణ" రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్,  వందేమాతరం రచించింది బంకించంద్ర చటర్జీ అని ఏవరిని అడిగినా చెప్తారు. కాని...  "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు....” అంటూ ప్రతీ భారతీయుడు చేసే ప్రతిజ్ఞ, ఏవరు రాశారంటే అధికశాతం మంది నుంచి సమాధానం దొరకదు. ఈ ప్రతిజ్ఞ రూపకర్త తెలుగు వారైన పైడిమర్రి వెంకట సుబ్బారావు.  ఆరు దశాబ్దాలు దాటినా వన్నె తరగక భారతావనంతా మరింతగా  మ్రోగుతూనే ఉంది ఈ ప్రతిజ్ఞ. పదాలు కొన్నే అయినా భరతమాత బిడ్డలందరిని ఐక్యం చేసింది. చేస్తూనే వుంది. కుల, మత, ప్రాంత, లింగ వయో బేధం లేకుండా అందరి నోట అది పలుకుతూ జాతి గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అదేప్రతి పాఠశాలలోనూ ఉదయాన్నే, భవిత దివ్వెలు అయిన మన చిన్నారులు పలికే “ప్రతిజ్ఞ".


"భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు....” అంటూ ప్రతీ భారతీయుడు చేసే ఈ ప్రతిజ్ఞ భారతజాతి ఐకమత్యానికి ప్రతీకగా ఉంటూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. విద్యాబుద్ధులతో పాటు దేశపౌరునిగా మలుచుకోవలసిన బాధ్యత, విజ్ఞతను ఈ ప్రతిజ్ఞ మన చిన్నారులకు తెలియజేస్తుంది. అంతే కాకుండా భారతీయులందరూ సహెూదరులు, భరతజాతి ఔన్నత్యం పెంపునకు వీరంతా మూలస్థంబాలని ఈ ప్రతిజ్ఞ చాటి చెబుతుంది. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించి చాటివారు, జంతుజాలం పట్ల సేవా నిరతితో ఉండాలని ఇది చెబుతుంది.


 *విశాఖలోనే ఈ రచన* :

అంతటి విశిష్టత కలిగి, దేశమాతకు నిత్యం నివాళిలు అర్పించేందుకు బాసటగా నిలుస్తున్న ఈ ప్రతిజ్ఞ పుట్టింది ఆంధ్రదేశాన అందునా సాహితీ సౌరభాలకు, చైతన్యానికి కాణాచి అయిన విశాఖపట్నంలోనే కావడం ప్రతీ తెలుగువారికి ఎంతో గర్వకారణం. విశాఖ వాకిట ఉద్భవించిన ఈ ప్రతిజ్ఞ నేడు భారతావని కంతటికి ఒక స్ఫూర్తిదాయకమైన నినాదనంగాను, ఆచరణీయమైన విధానంగా మారింది. జాతీయగీతము అయిన 'జనగణమన' తో సమానమైన గౌరవం, విశిష్టతను సంపాదించుకొని నేడు విద్యాగ్రంథాల్లో వర్థిల్లుచున్నది. ఇంతటి ఖ్యాతిగాంచిన ఈ ప్రతిజ్ఞ రూపకర్త పైడిమర్రి వెంకట సుబ్బారావు విశాఖ జిల్లాకు ప్రభుత్వ కోశాధికారి (ట్రెజరర్ గా ఉన్నప్పుడు 1962 సెప్టెంబర్ 17న సుబ్బారావు దీన్ని రచించారు. 1962 చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంగా దీని ఆవశ్యకతను వివరిస్తూ విద్యాశాఖాధికారులకు, నాటి ప్రజాప్రతినిధులకు, సామాజిక స్పృహగల వ్యక్తులకు లేఖలు రాశారు. అందుకు స్పందిస్తూ నాటి, రాష్ట్ర విద్యాశాఖామాత్యులు పి.వి.జి.రాజు, స్వాతంత్ర్య సమరయోధులు, అప్పటి విశాఖ లోక్ సభ సభ్యులు తెన్నేటి విశ్వనాథంలు సుబ్బారావును అభినందిస్తూ అతని రచన అయిన “ప్రతిజ్ఞ”ను మొదటిగా విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో 1963లో ప్రవేశపెట్టేందుకు కృషి చేశారు. తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం, మానవ వనరుల శాఖ, కేంద్ర విద్యా సలహామండలి దృష్టికి తీసుకువెళ్లారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర విద్యా సలహామండలి 1964లో బెంగుళూరులో జరిగిన ప్రత్యేక సమావేశాలలో నిర్ణయించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1965 జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి ఇది దేశవ్యాప్త ప్రతిజ్ఞగా మారింది. అన్ని ప్రాథమిక, మాధ్యమిక తరగతులకు చెందిన ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతీ విద్యార్థి చదివేలా, ఆచరించేలా "ప్రతిజ్ఞ” పాటించుట సంప్రదాయంగా మారింది. అంతే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అకాడమీలు ప్రచురించే ఒకటి నుంచి పదో తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాల్లో జాతీయగీతముతో పాటు ప్రతిజ్ఞను కూడా ప్రచురిస్తున్నారు. తెలుగు భాషలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిజ్ఞను బహుళప్రయోజనార్థం ఆంగ్లం, హిందీ, సంస్కృతం తదితర ఏడు భాషల్లోకి కూడా అనువదించచి దీనికి మరింత ప్రాచుర్యం, విశిష్టత కల్పించారు. అంతటి స్ఫూర్తిదాయకమైన ఈ ప్రతిజ్ఞ విద్యార్థులు, పాఠశాలలు తు.చ. తప్పక ఆచరించి నట్లయితే భారతజాతి ఔన్నత్యం పెరగడమే కాకుండా నేటితరం మధ్య సోదరభావం, విభిన్నజాతులు, ప్రాంతాల మధ్య స్నేహభావం మరింతగా ఇనుమడిస్తుందని చెప్పవచ్చు. అదే విధంగా ప్రపంచీకరణ, పట్టణీకరణ, సాంకేతీకరణ ప్రభావానికి లోనవుతున్న నేటి చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తి, సేవానిరతి, గౌరవభావం, బాధ్యత కొరవడకుండా ఉంటుంది. అందుకే అన్నివర్గాలు ప్రతిజ్ఞను అనుసరిద్దాం... భావితరాలకు ఆదర్శనీయంగా నిలుద్దాం....


 *ఇదీ వెంకట సుబ్బారావు ప్రొఫైల్:* 

"ప్రతిజ్ఞ" రచయిత పైడి మర్రి వెంకట సుబ్బారావు వెంకటరామయ్య, రాంబాయమ్మ దంపతులకు నేటి తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. జిల్లా కోశాధికారిగా కెరీర్ ను ప్రారంభించి పలు ప్రాంతాలతో పాటు విశాఖలోనూ పనిచేశారు.


విశాఖలో ఉన్న సమయంలోనే జాతీయ ప్రతిజ్ఞ రచన చేశారు. 1971 మే లో నల్గొండలో  డి.టి.ఒ.గా పదవీ విరమణ చేసిన వెంకట సుబ్బారావు తన జీవితంలో అధిక భాగం

సాహిత్య సేవకు, భాషా ఉద్దరణకు, జనజాగృతికి అంకితమయ్యారు. 1936లో "మీ మాంసాత్రయం, 1938లో గీతా మీమాంస, దైవభక్తి వంటి గ్రంథాలు వెలువరించారు.

సింగపురీన్న కేసరీ శతకం, బాలరామాయణం, శ్రీ వెంకటేశ్వరస్తుతి, తారావళి వంటి రచనాగ్రంథాలు ఈయన కలం నుండి వెలువడ్డాయి. తెలుగ సాహితీవనాన

ప్రఖ్యాతగాంచిన “కాలభైరవుడు" నవల వెంకట సుబ్బారావు రచనే. ఈయన పలు అనువాదాలు కూడా చేశారు. అరబ్బీ భాష నుంచి "జీవిత మహాపథము" అనే గ్రంథం తెలుగులోకి అనువదించారు. “నౌతి-ధౌతి" అనే ప్రకృతి వైద్య సంబంధిత పుస్తకాన్ని కూడా రచించారు. అంతే కాకుండా ప్రకృతి వైద్యంను, హెూమియో వైద్యం కూడా చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడ్డారు. 1988 ఆగస్టు 13వ తేదీన తుదిశ్వాస విడిచారు.


 *మనమూ చేద్దాం మన ప్రతిజ్ఞ:* 

"భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని, జంతువులపట్ల దయతో మెలిగెదనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.


 *---డా. జి. లీలా వరప్రసాదరావు,* అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం.

జగన్మాతతో

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 నమశ్శివాయ సాంబాయ సగణాయ ససూనవే! ప్రధానపురుషేశాయ సర్గస్థిత్యంతహేతవే!!


తా𝕝𝕝 జగన్మాతతో, గణములతో మరియు పుత్రులతో కూడియున్నవాడు, ప్రకృతిని మరియు జీవులను నియంత్రించువాడు, సృష్టి, స్థితి, లయములకు కారణమైనవాడు అగు శివుని కొరకు నమస్కారము.


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*

అమ్మ అంటే అమృతమూర్తి

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

🚩నమః శుభోదయం 🚩🚩

విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

 

     "‘ఆలు’ అంటే స్త్రీ"

ఇంటావిడ, ఇంటి ఆలు, 

ఇంటికి యజ మానురాలు... 

అనే అర్థాల్లో ఆమెను ఇల్లాలిగా సంబోధిస్తారు. 

భార్య అనే మాటకు అర్థం వేరు. 

భర్త తన ఉద్యోగ వ్యాపారాల రీత్యా గ్రామాంతరాలకు వెళ్ళినప్పుడు భర్త స్థానంలో కుటుంబ బరువు బాధ్యతలను నిర్వహించేది భార్య. 

సత్వగుణంతో శోభించే స్త్రీ సతి. 

అన్ని వేళలా భర్తతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవనం సాగించేది దార! 

ఇలా ఒక్కో కర్తవ్యానికి ఒక్కో పేరు. బాధ్యతకు సరితూగే సంబోధన భావన. ఏ పాత్రకు ఆ పాత్రే విభిన్నం... ప్రత్యేకం. 

ప్రతిదానికీ ఎన్నో పర్యాయపదాలను ప్రతిపాదించే ఆంగ్లభాష భార్యకు ఒక్క వైఫ్‌ అనే పదాన్ని చెప్పి ఊరుకుంది. అర్ధాంగి పదానికి సరిపడేలా ‘బెటర్‌హాఫ్‌’ అనే ముద్దు పేరును వ్యాప్తిలోకి తెచ్చింది. 

భార్యకు ఎన్నో పర్యాయపదాలు వినియోగంలోకి రావడం భారతీయ భాషల పరిపుష్టికి చిహ్నం.

స్త్రీకి అన్నింటికన్నా గొప్ప గౌరవ వాచకం తల్లి. 

అమ్మ అంటే అమృతమూర్తి. 

అన్ని చోట్లా తాను ఉండలేని ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతుడే తనకు ప్రతిరూపంగా సృష్టించిన పాత్ర పేరు అమ్మ!

 బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతుంది.సరం ఉంది.

👏🏼👏🏼

భోగాల కోసం

 🕉️🕉️🕉️🕉️🕉️

*ఈశ్వరుడి కోసం వెంట పడిన వాడు ఎప్పటికీ..!సుఖంగాఉంటాడు..!* 

*భోగాల కోసం వెంట పడినవాడు.!*

 *ఎప్పటికీ దుఖం అనుభవిస్తూనే ఉంటాడు..!*

*🙏💐👍ఓంనమఃశివాయ👌💐🙏*

                             *-- ౦ --*

💐💐👍🙏🙏🙏🙏🙏🙏👌💐💐


*ఈ రెండిటికీ తేడా ఇప్పుడు తెలుసుకుందాం..!*

 


🙏ఈశ్వరుడు : మన ఇచ్చా సంకల్పాల వల్ల భగవత్

ప్రాప్తి కలుగుతుంది.


🌻భోగము : భోగ ప్రాప్తి కర్మవల్ల జరుగుతుంది. ఇచ్చా

సంకల్పాల వల్ల కాదు.


🙏ఈశ్వరుడు : ఒకసారి ఈశ్వరుడు లభించిన తర్వాత

ఇంక విడిపొడు.


🌻భోగము : భోగాలు నీవద్ద ఎప్పటికీ శాశ్వతంగా 

ఉండవు.


🙏ఈశ్వరుడు : భగవత్ ప్రాప్తి ఎప్పుడూ సంపూర్ణమే.


🌻భోగము : భోగ ప్రాప్తి ఎప్పుడూ అసంపూర్ణమే.


🙏ఈశ్వరుడు : భగవత్ ప్రాప్తి ఇచ్చ కలుగుతూనే

పాపాలు నాశనం కావడం మొదలవుతాయి


🌻భోగము : భోగ ప్రాప్తి ఇచ్చా కులుగుతునే పాపాలు

చేయడం మొదలు అవుతుంది.


🙏ఈశ్వరుడు : భగవత్ ప్రాప్తి సాధనలో సాధకుడు

శాంతిని పొందుతాడు.


🌻భోగము : భోగ ప్రాప్తి సాధనలో ఎప్పుడూ అశాంతి

కలుగుతూనే ఉంటుంది


🙏ఈశ్వరుడు : భగవత్ స్మరణలో మరణించే వాడు

సుఖ శాంతులతో మరణిస్తాడు


🌻భోగము : భోగ స్మరణతో మరణించే వాడు అశాంతి

తో దుఖంతో మరణిస్తాడు


🙏ఈశ్వరుడు : భగవత్ స్మరణలో మరణించే వాడు

నిశ్చయంగా ఈశ్వరుడిని పొందుతాడు.


🌻భోగము : భోగ స్మరణతో మరణించే వాడు నిశ్చయంగా నరకాన్ని పొందుతాడు.


ఇప్పుడు చెప్పండి భోగాలు అశాశ్వతం ఈశ్వరుడు

శాశ్వతం మనవులైన మనము ఏది శాశ్వతం ఏది

అశాశ్వతం ఇప్పటికీ ఒక అవగాహనకి రాలేకపో

తున్నాము అంటే ఎంత అజ్ఞానంలో కూరుకుపో

యామో అర్థం అవుతుంది.


భోగాలకు వెంటపడిన వాడు అలవాటు పడిన వాడు సుఖాలకు అలవాటు పడిన వాడు ఈరోజుకి సుఖం

అనిపించిన రేపు దుఖంగా మారుతుంది. ఎందు 

కంటే ఇది ప్రకృతి ధర్మం


కనుక నేను చెప్పేది ఏమిటంటే నిజమైన భోగము

ఏమిటో నిజమైన ఆనందం ఏమిటో  మనం అందరం తెలుసుకొని

అవగాహనతో జీవిస్తే జన్మ జన్మలు సుఖంగా 

జీవించవచ్చు..!

                  *--- 0 ---*


              *ఓం..! నమః..! శివాయ..

తెలుగు భాషకు

 తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగులో చరిత్ర పరిశోధనలు, విజ్ఞాన రచనలు చేయడానికి తొలి అడుగులు వేసినవారు. నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపిన మహనీయుల్లో ఎన్నదగిన వారు.



కొమర్రాజు వెంకట లక్ష్మణరావు క్రీ.శ. 1876 మే 18న ఉమ్మడి కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు.విద్యార్థిగా ఉన్నపుడు ‘సమాచార్’,’వివిధ విజ్ఞాన్ విస్తార్’ వంటి మరాఠి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘కేసరి’, ‘మహారాష్ట్ర’ వంటి పత్రికలకు విరివిగా వ్యాసాలు రాశారు. అనేక చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగులో ‘జనరంజని’ పత్రిక స్వయంగా నడిపించారు. విజయవాడలో స్త్రీ విద్యావ్యాప్తి ‘తెలుగు జనానా’ పత్రికలో సోదరి బండారు అచ్చమాంబతో కలిసి అనేక రచనలు చేశారు.


హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’ స్థాపించడంలోనూ; ‘విజ్ఞాన చంద్రికా మండలి’, ‘విజ్ఞాన చంద్రికా పరిషత్’, ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వంటి సంస్థల నిర్వహణలోనూ ఆయన పాత్ర కీలకమైనది.


లక్ష్మణరావు సాహిత్య, సామాజిక ఉద్యమ నేపథ్యానికి వారి సోదరి అచ్చమాంబ అందించిన ప్రోత్సాహం ఎంత ఉన్నతమైందో, తొలి తరం తెలుగు కథా రచయిత్రిగా అచ్చమాంబ ఎదుగు దలలో ఆయన ప్రోత్సాహం కూడా మరువలేనిది. ‘ఆంధ్ర విజ్ఞాన సర్వ స్వం’ ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టింది. ‘శివాజీ చరిత్ర’, ‘హిందూ మహా యుగము’ వంటి రచనలు చేశారు. ‘జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు’ అని నినదించారు.

పోతన సన్నివేశ చిత్రణము!



పోతన సన్నివేశ చిత్రణము! 

శ్రీ హరి భక్తరక్షణాపరాయత!


సుందర సురుచిర ఘట్టముల నావిష్కరించుటలో పోతన మొనగాడు. ప్రతిఘట్టమున కొన్ని సుందర దృశ్యములుండును.వానినిపాఠకుని మనో పటమున మరపురాని మనోజ్ఙ వర్ణరంజిత చిత్రాలుగా మలచుట ఆతని కవిత లోని ప్రత్యేకత!


       గజేంద్రమోక్షమున భక్తపరాధీనుడైనహరి,గజరాజు మొరవిని వైకుంఠమునుండి పరుగుపరుగున వచ్చుదృశ్యమును పోతన వర్ణంచిన తీరు నాన్యతో దర్శనీయము.

"తనవెంటంసిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్,/ వానివెన్కను బక్షీంద్రుడు,వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ/

క్రనికాయంబును,నారదుండు,ధ్వజనీకాంతుండురావచ్చిరొ/

య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాలగోపాలమున్;//

చివరకు వైకుంఠపురంలోని పిలాపెద్దా అంతా హరివెనుక కదిలారు.


మంచిసుందరదృశ్యము.దీనిని 


వినువీధిలో నిలచి దేవతలు చూచుచూ ఆజగద్బాంధవునకు మ్రొక్కులిడు చున్నారట!

పరిశీలిపుడు.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్,సురారాతిజీ/

వన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహృ/

ద్వనవర్తిష్ణు, సహిష్ణు,భక్తజనబృంద ప్రాభవాలంకరి

ష్ణు,నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్,


ఒకరితో నొకరు ఇలాచెప్పుకుంటుంన్నారు.


"చనుదెంచెన్హరి,యల్లవాడె!  హరిపజ్జంగంటిరే లక్ష్మి,శం/

ఖనినాదంబదె!చక్రమల్లదె ,భుజంగధ్వంసియున్ వాడె,చ/

య్యన నేతెంచెనటంచు వేల్పులు నమోనారాయణాయే/

తి! నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్;


ఆయాకాశమేమో? ఆదేవతలేమో? మ్రొక్కులిడుటేమో మనమెన్నడు చూచినవారముగాకపోయినా చదువరుల మనోకుడ్యములమీద ఆచిత్రమంతయు మద్రబడునట్లు వర్ణించినాడు పోతనమహాకవి.


 ఇదీ ఆకవికలము జేసిన వర్ణనా మాయా మహేంద్రజాలము


.ఆచిత్రములను జూచుటకు మన నయనములుగాని,సులోచనములుగానిపనికిరావు.ఆలోచనా లోచనాలతో అంతరంగమున పరికింప వలసియుండును.ప్రయత్నింపుడు.ఫలితము మీచెంతనే! ఇట్టి మనోహర కవితా నిర్మాణచాతుర్యముగల పోతనమహాకవీంద్రునకు వినమ్రాంజలులర్పించుచు,

                      స్వస్తి!

🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హనుమజ్జయంతి ప్రత్యేకం - 10/11

 ॐ 

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


X. హనుమంతుడు - గొప్ప విశ్లేషకుడు - విచారణాధికారి 


    విభీషణుడు రావణుని కొలువునుండి శ్రీరాముని శరణుగోరుతూ వచ్చాడు. అతడన్న మాటలు సుగ్రీవుడు రామునకు నివేదించాడు. 

    రాముడు ఆ విషయాలపై మిత్రులుగా అక్కడవారి అభిప్రాయాలనడిగాడు. 

    అంగదుడు, శరభుడు, జాంబవంతుడు, మైందుడు వారివారి అభిప్రాయాలను చెప్పారు. 

    ఆ అభిప్రాయాలపై విశ్లేషణ చేస్తూ, హనుమంతుడు తన అభిప్రాయంతో సమర్పించిన అద్భుతమైన నివేదిక గమనించాలి. 


హనుమ శ్రీరామునితో 


   "రామా! నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి. సర్వసమర్థుడవు. వాక్చతురుడవు. నేను 


*వాక్చాతుర్యమును ప్రకటించుటకుగానీ, 

*మంత్రులతో పోటీపడిగానీ, 

*బుద్ధిమంతుడనని స్వాభిమానంతోగానీ, 

*ఏ విధమైన ప్రయోజనము ఆశించిగానీ, పలకడంలేదు. 


    ప్రస్తుతము కార్యంయొక్క ప్రాముఖ్యమును దృష్టిలో ఉంచుకొని, యదార్థములను పలుకుచున్నాను" 


                - అని తన వాఙ్మూలము ఇచ్చి, ఈ విధంగా పలికాడు. 


1.(అంగదుడు పలికిన) "గుణదోషములను పరీక్షించుట" 


    దానికి ఇది సరియైన సమయంకాదు. ఎవరినైనను రాజకార్యములయందు నియోగింపనిదే వారి సామర్థ్యమును తెలుసుకొనుటకు వీలుకాదు. క్రొత్తవారికి కార్యభారము అప్పగించుటయు సరికాదు.


2.(శరభుడు పేర్కొన్న) "గూఢచర్యం" 


  దూరప్రదేశమునందున్న శత్రువుల వృత్తాంతములను తెలిసికొనుటకు గూఢచారులచే విచారణ చేయించుట యుక్తముగానీ, సమీపములో మన కనులముందు ఉండి తన వృత్తాంతము స్పష్టంగా తెలుపుచున్నవాని విషయమున గూఢచర్యం సాధ్యపడదు మరియు ఆ గూఢచర్యం ఇక్కడ అవుసరం లేదు. 


3.(జాంబవంతుడు చెప్పిన) "దేశకాలానుగుణము కాదు" 


    విభీషణుడు వచ్చుటకు వాస్తవంగా ఇదే తగిన స్థానమూ సమయమూ. 

    అతడు నీచుడైన రావణుని నుండి పురుషోత్తముడైన నీ యొధ్దకు వచ్చినాడు. 

    అంతకుముందు అతడు రావణునిలోని దోషాలనీ, నీలోని సుగుణాలనూ వివేచనతో గుర్తించాడు. 

    రావణుని దుర్మార్గములనూ, నీ పరాక్రమ వైభవాలనూ ఎరిగియున్నాడు, 

    కనుక అతడు ఇచ్చటికి రావడం అన్నివిధాలా సమంజసమే! 

    ఇది అతని బుద్ధి కుశలతకు నిదర్శనము, 


4.(మైందుడు సూచించిన) "ప్రశ్నించుట" 


    అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధంగా ప్రశ్నిస్తే, బుద్ధిమంతుడైన ఆ వ్యక్తి ఆ మాటలు శంకిస్తాడు. అంతేగాక తనను గూర్చి తెలిసియు, వారట్లు ప్రశ్నించుచున్నారని గ్రహించినప్పుడు ఆ సత్పురుషుని మనస్సు చివుక్కు మంటుంది. 

    అంతట సహాయపడుటకై వచ్చిన అతడు విముఖుడవుతాడు. 

    ఆ కారణాన ఒక మంచి మిత్రుని కోల్పోవటం జరుగుతుంది. 


    అంతేకాక తగినంత సమయంతో సంభాషించిన పిమ్మట, భిన్నభిన్న స్వరములతో కూడిన అతని మాటలలోని తడబాటునుబట్టి అతని సదభిప్రాయాలైనా దురభిప్రాయాలైనా గ్రహింపవచ్చును. 


    కానీ, క్షణకాల సంభాషణలో అతనియొక్క భావములను పసిగట్టుట అశక్యం, 


విశ్లేషణతో గూడిన సిఫార్సుల నివేదిక 


*మాటలలోఎట్టి దుష్టభావమూ కనబడడంలేదు. 

*మోసలక్షణమూ కనబడడంలేదు. 

*ముఖం ప్రసన్నంగా ఉంది. 

*కపటబుద్ధి ఉన్నవాడు ఎట్టి శంక (తడబాటు) లేకుండా స్వస్థచిత్తుడై సమీపానికి రాడు. 

 

    కనుక ఇతనియెడ సందేహపడవలసిన పనియేలేదు. 


    ఎవ్వరైనా తన మనో భావాలను ప్రయత్నపూర్వకంగా కప్పిపుచ్చుకోడానికి పూనుకున్నా అవి దాగవు. మానవుల అంతర్గత భావాలు వారి ముఖమునందలి కవళికలలో బయటపడే తీరును. 


*నీ కార్యదక్షతా, రావణుని మిథ్యాప్రవర్తనా ఇతడు పరికించి చూచాడు. 

*నీవు వాలిని వధించి, సుగ్రీవుని పట్టాభిషిక్తునిజేసిన విషయాలనెఱిగియున్నాడు. 

    కావున నిన్ను శరణుజొచ్చినచో తనకు రాజ్యలాభము కలుగుతుందని ఇచటికి వచ్చియుండవచ్చు. 


సిఫార్సు 


    ఈ విషయములను దృష్టిలో ఉంచుకొని ఇతనికి ఆశ్రయమిచ్చుట సముచితమని నా అభిప్రాయము. 


అంతిమ నిర్ణయం 


    ఇకమీది కార్యాన్ని నీకు నచ్చిన రీతిగా ఆచరింపుము. 


    ఈ విధంగా విషయాన్ని విశ్లేషించి నివేదించిన హనుమంతుడు బుద్ధిమతాం వరిష్ఠుడు కదా! 


స్ఫూర్తి 


    విచారణకి సంబంధించి మనకి ఈ విషయంద్వారా బోధపడేది 


* పరీక్ష ( Observe by Test ),  

* గూఢచర్యం (Through a Spy), 

* దేశకాల నిర్ణయం ( Place and Time Jurisdiction ), 

 * ప్రశ్నించడం ( Interrogation ) 

  - అనే నాలుగూ, వాస్తవాలు వెలికి తీయడానికి మార్గాలు. 

    ఆ పైన వాటి విశ్లేషణ (Analysis). 


    హనుమవంటి విచారణాధికారులూ, శ్రీరాముని వంటి పాలకులూ ఉంటే, నిర్ణయాలు ఎంత న్యాయబద్ధంగా ఉంటాయో కదా! 


                        కొనసాగింపు 

                   

               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్                  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ చతుర్థి  - పుష్యమి -‌‌  ఇందు వాసరే* (10.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం


.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రాశి ఫలితాలు

 ఈ రోజు (10-06-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

  10-06-2024

 గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


వృషభం

  10-06-2024

కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. 


మిధునం

  10-06-2024

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. 


కర్కాటకం

  10-06-2024

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవాకార్యక్రమాలు పాల్గొంటారు.


సింహం

  10-06-2024

ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు


కన్య

  10-06-2024

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.


తుల

  10-06-2024

దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 


వృశ్చికం

  10-06-2024

గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.


ధనస్సు

 10-06-2024

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.


మకరం

  10-06-2024

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.


కుంభం

  10-06-2024

దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి.


మీనం

  10-06-2024

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

పంచాంగం 10.06.2024

 ఈ రోజు పంచాంగం 10.06.2024 Monday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి ఇందు వాసర: పుష్యమి నక్షత్రం ధ్రువ యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి సాయంత్రం 04:19 వరకు.

పుష్యమి రాత్రి 09:43 వరకు.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:46


వర్జ్యం : తెల్లవారుఝామున 04:50 నుండి ఉదయం 06:31 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:42 నుండి 01:34 వరకు తిరిగి మధ్యాహ్నం 03:18 నుండి 04:10 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:58 నుండి 04:39 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

సోమవారం,జూన్10,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


సోమవారం,జూన్10,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:చవితి సా4.51 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:పుష్యమి రా10.41 వరకు

యోగం:ధృవం సా6.12 వరకు

కరణం:భద్ర సా4.51 వరకు తదుపరి బవ తె5.19 వరకు

వర్జ్యం:ఉ5.50 - 7.31

దుర్ముహూర్తము:మ12.24 - 1.16

మరల మ3.00 - 3.52&

అమృతకాలం:మ3.56 - 5.37

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -"12.00

. సూర్యరాశి: వృషభం

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.29


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

యజుర్వేద పాఠశాల

 

కంచి కామ కోటి పీఠాథి పతుల ఆశీస్సులుతో ముక్కామల గ్రామంలో గల కోనసీమ యజుర్వేద పాఠశాల ఈ రోజు నుండి (9/6/24) శెలవులు అనంతరం ప్రారంభించడం అయినది.  విద్యార్థులకు ప్రవేశములు జరుగుతున్నవి. ఆసక్తి ఉన్న వారు విద్యార్థులను చేర్పించ గలరు. కృష్ణ యజుర్వేదము నేర్పించ బడను. ఉచిత భోజన వసతిలు కల్పించ బడును. 

ఇట్లు, 

పాఠశాల నిర్వహణ కమిటీ, 

ముక్కామల.

(ఫోను : 9160004620, 9542733888, 9949495554)

ఉపాధ్యాయులు : దువ్వూరి ఫణియజ్ఞ కిరణ్ 9010344744