30, మార్చి 2023, గురువారం

ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...

 ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...


చాలా సందర్భాల్లో, ఇతరులపైన పరమాచార్య స్వామివారి ప్రేమ బహిర్గతం అవ్వదు. కాని ఒకసారి మహాస్వామివారు శ్రీమఠం బాలు మామని ఒక పని చెయ్యమని ఆదేశించారు. ఆ సంఘటన వివరాలు బాలు మామ మాటల్లో.


శ్రీమఠం మకాం షోలాపూర్ లో విడిది చేసి ఉన్నప్పుడు, ఒక సాయంత్రం మహాస్వామి వారు బాలు మామను పిలిచి, “. . . ఇతని ఇంటికి వెళ్లి, వారి అమ్మాయిని తీసుకుని తన భర్త ఇంటిలో వదిలిరా!” అని ఆజ్ఞాపించారు.


ఆ మాట విని బాలు మామ నిశ్చేష్టుడయ్యాడు.


పరమాచార్య స్వామివారు చెబుతున్న వ్యక్తీ స్వామివారికి పరమ భక్తుడు, వైశ్య కులానికి చెందినవాడు; పెద్ద సంసారం కలవాడు; ఏవో కారణాల వల్ల అతని కుమార్తె భర్త నుండి విడువడి, తల్లితండ్రుల వద్దే ఉంటోంది. కాని ఈ విషయం ఎవరూ మహాస్వామివారికి తెలుపలేదు. కాని స్వామివారి నుండి ఇటువంటి ఆదేశం వచ్చింది.


“ఏమిటి ఈ ఆదేశం? మరొకరి కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం ఎలా? ఆ అమ్మాయిని తీసుకునివెళ్ళి భర్త ఇంటిలో వదిలిరావాలా? ఇది సరైనదేనా?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు బాలు మామ. ఎటువంటి ఆజ్ఞనైనా స్వామివారి నుండి వెలువడితే, సహాయకులెవ్వరూ మరొక్క ఆలోచన లేక అమలుచేస్తారు. కాని ఈ విషయంలో బాలు మామ సంకోచిస్తున్నాడు.


బాలు మామ ఇబ్బందిని అర్థం చేసుకున్న స్వామివారు అతనికి ధైర్యంగా ఉంటుందని, “నీతోపాటు బ్రహ్మచారి రామకృష్ణన్ ని కూడా వెంట తీసుకునివెళ్ళు” అని చెప్పారు.


వారు ఆ ఇంటికి వెళ్లి, స్వామివారి ఆదేశాన్ని వారికీ తెలిపారు. స్వామివారి ఆదేశాన్ని వినగానే అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మాయిని అక్కడకు పంపడం అంటే, ప్రేమతో పెంచుకున్న చిలకను పిల్లి వద్దకు పంపడమే అని వారికి తెలుసు.


కాని వారికి మహాస్వామి వారిపై ఉన్న నమ్మకం, భక్తి చేత ఎటువంటి అనుమానానికి తావివ్వకుండా మనస్సును స్థిమితపరచుకున్నారు. పరమాచార్య స్వామివారే ఇలా ఆదేశించారంటే అందులో ఎదో ఉంటుందని వారికి తెలుసు. అమ్మాయిని పంపడానికి నిర్ణయించుకున్నారు.


ఆ అమ్మాయి ఎంత ఆలోచిస్తున్నాడో తన భర్త ఇంటికి వెళ్ళడానికి, బాలు మామ కూడా అంతే  తటపటాయిస్తున్నాడు. కాని అది స్వామివారి ఆజ్ఞ కావడంతో ఇక బయలుదేరింది. ఏమి జరుగుతుందో అని భయపడుతూ ముగ్గురూ బయలుదేరారు.


వీళ్ళు అక్కడకు వెళ్ళగానే అత్తింటి వారు ఎంతో సాదరంగా వాళ్ళను ఆహ్వానించారు. వీరు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆమె భర్త కూడా తనని ప్రేమతో ఆదరించి, ఇక్కడే ఉంచుకుంటాను అని ప్రమాణం చేశాడు.


--- శ్రీ రా. గణపతి, “శంకరర్ ఎండ్ర సంగీతం” నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాచి రక్షించవే

 భువనమ్ములేలేటి కంచి కామాక్షమ్మ 

నాబిడ్డనయిన నిను కాచి రక్షించవే ||


1) కనుపాపలోనున్న శక్తివి నీవమ్మా 

    కామితములీడేర్చు కల్పవృక్షమ్ము 

    కలనైన నీ రూపు మరపురానట్టి 

    స్థిరమయిన వరమును ఇయ్యవే జననీ ||


2) కడసారి నిన్ను నే తలతునో లేనో 

    కాలకాలుని పత్ని దయజూడవమ్మా 

    కరమున విల్లును జేపట్టి నీవు 

    కామమును నీ వశము గావించితీవి ||

పరమాచార్య వారి ఆదేశం

 పరమాచార్య వారి ఆదేశం... ఆంజనేయస్వామి వారి ప్రతిష్ట...

బెల్గామ్ కు దగ్గరలో, బ్రిటిష్ వారినీ గడగడ లాడించిన రాణి చెన్నమ్మ పరిపాలించిన కిత్తూరు లో పరమాచార్య వారు మకాం చేసిన రోజులలో జరిగిన సంఘటన..

స్వామి వారు ఒక పెద్ద చెట్టు నీడన కూర్చోని ఉన్నారు.వారికీ దూరంగా చాలా మంది భక్తులు కూర్చోని ఉన్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్వామి దర్శనానికి వచ్చారు. వారు, సాష్టాంగం చేయటానికి ప్రయత్నించగానే స్వామి "వద్ధని "వారిస్తూ సైగ చేసారు.మఠం మేనేజర్ దగ్గరకు వచ్చి "స్వామి కఠిన ఉపవాసం లో ఉన్నారు. మీరు సాష్టాంగం చేస్తే వారు ఈ స్థితిలో ఆశీర్వదించలేరు. అందుకే వద్దన్నారు "అని చెప్పి స్వామి వారి వద్దకు తీసుకోని వెళ్ళాడు.

స్వామి చీఫ్ విజిలేన్స్ ఆఫీసర్,రాజగోపాల్ తో వారి పేరు, జన్మస్థలం అడిగారు.

"తంజావూరు లోని

అడుతురై "

"అది నీ జన్మ స్థలం ఎలా అవుతుంది."

"నేను చిన్నప్పుడు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి."

"జన్మస్థలం మీ నాన్న గారి స్వస్థలం అవుతుంది కానీ అమ్మమ్మ గారి ఊరు కాదు."

స్వామి వారు అనేక గుర్తులు చెప్పినప్పటికి రాజగోపాల్ స్వస్థలం గుర్తించలేదు.

స్వామి "మీ తాత గారు ఆ ఊళ్ళో ఒక దేవాలయం నిర్మించారు. కానీ అందులో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చెయ్యలేక పోయినారు. నీవు ఆ ఊరు వెళ్లి ఆలస్యం చెయ్యకుండా ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహ ప్రతిష్ట చెయ్యి."అని ఆదేశించారు.

రాజగోపాల్ వెంటనే తొంభై సంవత్సరాల వాళ్ళ అత్తయ్య ను కలిసి తన స్వస్థలం మన్నార్ గుడికి వెళ్లే దారిలో ఉన్న కుదమరట్టి నదిని ఆనుకొని ఉన్న త్తిళ్ళాంబుర్ తన స్వస్థలం అని తెలిసింది.వెంటనే ఆ ఊరు వెళ్లి చూస్తే స్వామి వారు చెప్పినది సత్యమని తెలిసింది.

గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి మరి కొందరు కలిసిరాగా ఆగమశాస్త్ర ప్రకారం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిపించారు . రెండు దశాబ్దాలుగా ఆ గ్రామం, దేవాలయం అభివృద్ధి కి కృషి చేసి నేడు ఆంజనేయస్వామి వారి ఆలయం సుప్రసిద్దమై పెళ్లికాని అమ్మాయిల తల్లిదండ్రులు ఆరు శనివారాలు పూజ చేసి తమ బిడ్డల పెళ్లిళ్లు జరిగాయని సంతోషం గా తెలిపారు.

***స్వస్థలమే తెలియని రాజగోపాల్ గారికి వారి తాత అంతే రెండు తరాల ముందు జరగవలసిన విగ్రహ ప్రతిష్ట గురించి చెప్పారంటే స్వామి వారి దివ్యత్వం మన ఊహకు

 కూడ అందనిది.

తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ

 ఒక తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ... ఒక కొడుక్కి తండ్రిమీదున్న గౌరవం... ఒక భర్తకు భార్యమీద ఉన్న బాధ్యత...                                               ఒక భార్యకు భర్తమీద ఉన్న నమ్మకం...                                           


ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం...                                            ఒక తమ్ముడికి అన్నమీద ఉన్న మమకారం...    


అన్నీ కలకగలిపి మనిషి బతకడానికి అవసరమైనదే *రామాయణం* ..


పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగే శ్రీరాముని పెళ్లి ప్రతీసారి ఘనంగా జరగాలని కోరుకుంటూ...


హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది *రామతత్వం* !!


కష్టంలో కలిసి నడవాలన్నది *సీతాతత్వం* !


 *అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*

🌹 శుభోదయం 🙏

శ్రీరామ నవమి నాడు పూజ ఎలా చేయాలి

 శ్రీరామ నవమి నాడు పూజ ఎలా చేయాలి? ఏమేమి స్తోత్రములు వినాలి, అనే అనేక అంశాలన్నీ ఒకే చోట. 


శ్రీరామనవమి పూజా విధానం 

https://youtu.be/c7UixQ53xPE


సంక్షిప్త రామాయణం 

https://youtu.be/FvdLi4z4FUQ


సీతారాముల కల్యాణ ఘట్టం, శ్లోక పారాయణ

https://youtu.be/fgU7RoFWA2Q


పట్టాభిషేక ఘట్టం, శ్లోక పారాయణం

https://youtu.be/tuKgCxpOY-Q


పట్టాభిషేక ఘట్టం (రామనవమి నాడు తప్పక వినవల్సినది) https://youtu.be/QvT8DAos1TY


శ్రీరామాయణ ఫలశ్రుతి 

https://youtu.be/qqBdKSZDjeQ


హనుమాన్ చాలీసా

https://youtu.be/c1NoGxTZ5wg


వ్యాధులు ప్రబలినపుడు రామరక్ష గా ఏమేమి చేస్తే మంచిది ?

https://youtu.be/Jrvvh4rcwvc

శ్రీ రామ నవమి*

 

 30.03.2023 (గురువారం) శ్రీ రామ నవమి* 

🌼🌿 *శ్రీ రామ నవమి విశిష్టత మరియు ప్రాముఖ్యత ...* 🌼🌿

 

 శ్రీ రామ  నవమి  హిందువులకు  అత్యంత  ముఖ్యమైన  పండుగ .....   హిందువులు  ఈ  పండగను అత్యంత  భక్తి  శ్రద్దలతో   ఈ  పండగను జరుపుకుంటారు....   శ్రీరాముడు  వసంత ఋతువులో  చైత్ర  శుద్ధ  నవమి,  గురువారము నాడు  పునర్వసు  నక్షత్రపు  కర్కాటక  లగ్నంలో సరిగ్గా  అభిజిత్  ముహూర్తంలో  అంటే  మధ్యాహ్మం 12 గంటల  వేళలో  త్రేతాయుగంలో  జన్మించినాడు ....  ఆ  మహనీయుని  జన్మ దినమును  ప్రజలు  పండుగగా  జరుపుకుంటారు... పదునాలుగు  సంవత్సరములు  అరణ్యవాసము, రావణ  సంహారము  తరువాత  శ్రీరాముడు సీతాసమేతంగా  అయోధ్యలో  పట్టాభిషిక్తుడైనాడు.. ఈ  శుభ  సంఘటన  కూడా  చైత్ర  శుద్ధ  నవమి నాడే  జరిగినదని  ప్రజల  విశ్వాసము.... శ్రీ  సీతారాముల  కళ్యాణం  కూడా  ఈరోజునే  జరిగింది...  ఈ  చైత్ర  శుద్ధ  నవమి  నాడు  తెలుగు ప్రజలు  భద్రాచలమందు  సీతారామ  కళ్యాణ ఉత్సవాన్ని  వైభవోపేతంగా  జరుపుతారు... రామా  అనే  రెండక్షరాల  రమ్యమైన  పదం  పలుకని జిహ్వ -- జిహ్వే  కాదు..   శ్రీరామ  నవమి పండుగను  భారతీయులందరూ  పరమ  పవిత్రమైన దినంగా  భావించి  శ్రీ  సీతారాముల  కళ్యాణ మహోత్సవాన్ని  అతి  వైభవంగా  పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ  రమణీయంగా  జరుపుకోవడం ఓ  సంప్రదాయం .....  భక్తుల  గుండెల్లో  కొలువై, సుందర  సుమధుర  చైతన్య  రూపమై,  కోట్లకొలది భక్తుల  పూజ లందుకొంటున్నాడు  శ్రీరామచంద్రుడు .. శ్రీ రామ చంద్రుడిని  తెలుగువారు  ప్రతి  ఇంటా  ఇంటి ఇలవేలుపుగా  కొలుస్తారు .....   నేటికి  భ్రధ్రాచలంలో శ్రీరాముడి  పర్ణశాల  భక్తులకు  దర్శనమిస్తూ వుంటుంది ..... భధ్రాచలంలో అంగరంగ  వైభవంగా  కన్నుల  పండుగగా  జరిగే సీతారాముల  కళ్యాణ  మహోత్సవానికి  లక్షలాది

 భక్తులు  తరలి  వస్తారు .....   కళ్యాణంలో  పాల్గొని దానిని  తిలకించి  శ్రీరాముని  దర్శించి  ఆ  దేవ దేవుడి  ఆశీస్సులు పొందుతారు .....  సీతారామ కళ్యాణం  లోక  జీవన  హేతుకం,  సకల  దోష నివారణం,  సర్వ  సంపదలకు  నిలయం,  సకల జన  లోక  సంరక్షణమే  శ్రీరామనవమి  పండుగ పరమార్థం .....  శ్రీ రామచంద్రుని  క్షేత్రాలలో  అత్యంత  వైశిష్ట్య  ప్రాధాన్యత  ప్రాశస్త్యముగల  క్షేత్రం  భద్రాచలం  దివ్య  క్షేత్రం .....   భద్రుడు  అనగా రాముడు  అని  అచలుడు  అంటే  కొండ  అని అందుకే  రాముడు  కొండపై  నెలవై  ఉన్న  దివ్య ధామము  కనుక  ఈ   క్షేత్రం  భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన  పుణ్య  క్షేత్రం.... ! శ్రీరామచంద్రుడు  తన  వనవాస  జీవితం  ఇక్కడే గడపడమే  ఈ  పుణ్య  క్షేత్రం  యొక్క  వైశిష్ట్యం... శ్రీరామ  నామము  సకల  పాపాలను పోగొడుతుందని  సకల శాస్త్రాలూ చెబుతున్నాయి..   భక్త  రామదాసు  చెరసాలలో

 ఉండిపోయిన  కారణంగా  పూర్వము  సీతారాముల కళ్యాణము  మార్గశిర  శుద్ధ  పంచమినాడు జరిగినట్లుగా,  అయితే  తాను  చెరసాలనుండి తిరిగి  వచ్చాక  చైత్రశుద్ధ  నవమినాడు  శ్రీరామ చంద్రుని  పుట్టినరోజు  వేడుకలు,  కళ్యాణ  వేడుకలు ఒకేసారి  జరిపించారు....  శ్రీ సీతారామ కళ్యాణము,  రాముడు  రావణున్ని  సంహరించి అయోధ్యకు  తిరిగి  వచ్చింది  శ్రీరామనవమినాడే... ఆ మరునాడు  దశమి  శ్రీరామ  పట్టాభిషేకం రామునికి  జరిగింది....    కోదండ  రామకళ్యాణాన్ని చూసేందుకు  మనమే  కాదు  సకల  లోకాల దేవతలు  దివి  నుంచి  భువికి  దిగివస్తారంటా…. శ్రీరామచంద్రుని  దివ్య  దర్శనం  మహనీయంగా, నేత్ర  పర్వంగా  పట్ట్భాషేక  సమయాన  తిలకించి పులకితులవుతారట..   ఆంజనేయుని  పదభక్తికి మెచ్చి,  హనుమ  గుండెల్లో  కొలువైన శ్రీరాముని భక్త  పోషణ  అనన్యమైనదై  గ్రామగ్రామాన రామాలయం  నెలకొని ఉన్నాయి....  శ్రీరాముడు సత్యపాలకుడు  ధర్మాచరణం  తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు,  

 పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ  సద్గుణాలు  మూర్త్భీవించిన  దయార్ద హృదయుడు.....    శ్రీరామనవమి  రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ  సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము  నైవేద్యముగా సమర్పించుకుంటారు ....

ప్రతియేడు భద్రాచలంలో జరిగే  

శ్రీ  సీతారామ కళ్యాణము చూసి  తరించిన వారి జన్మ సార్థకం

చెందుతందనేది  భక్తుల  విశ్వాసం... !!!


*సర్వే జనా  సుఖినో భవంతు*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పసివాడి జీవితం

 పసివాడి జీవితం


పరమాచార్య స్వామివారి భక్తులు కుంబకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన.


శ్రీ ఆదిశంకరాచార్య శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు వారి రచనల్లో ఒకచోట, ఆదిశంకరుల గురించిన విశేషణాలు చెబుతూ, “ఆయన అపూర్వ శంకరులు, సాక్షాత పరమేశ్వరుల అవతారం. నాగాభారణాలను, ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని, అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి, సన్యాస రూపంతో శిష్యులతో వచ్చినవారు ఆదిశంకరులు” అని అంటారు.


ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని. 


అప్పుడు మహాస్వామివారు శివాస్థానంలో మకాం చేస్తున్నారు. పన్నెండు సంవత్సరముల బాలుడు అక్కడకు వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు. ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు. “శ్రీ పెరియవ! నాకు తండ్రి లేడు. మా అమ్మ, చెల్లి బాంబేలో ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంట్లో మా అమ్మ వంటమనిషిగా చేస్తోంది. నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాల వేశారు. ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడ అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని, అలా మతం మారితే ఎం.ఏ. డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. 


కాని నాకు మతం మారడానికి ఇష్టం లేదు. నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది. నలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము, ఉత్తరాలు రాలేదు. మ తల్లికి, చెల్లికి ఏమి జరిగిందో నాకు తెలియడంలేదు”.


మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి, ఏడుస్తూ నిలబడ్డాడు. ఆ పిల్లాణ్ణి శివాస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు. పది, పదిహేను రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లాణ్ణి స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు.


ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివాస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు. వారందరూ బాంబే నుండి వచ్చామని, స్వామివారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు. అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారు వాళ్ళందరిని పేర్లు ఇతర వివరాలు తెలపమని అడిగారు. అందుకు వారు ఎంతగానో సంతోషించారు.


అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు, ఒక వ్యక్తి పేరు చెప్పగానే, ఆ పిల్లవాణ్ణి తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు. తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు. పిల్లవాని పరిస్థితి విని అతను కదిలిపోయాడు. ఆ పిల్లాణ్ణి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కాని అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తలి, చెల్లి పనిచేస్తున్నది తన ఇంటిలోనే అని అతను అర్థం చేసుకున్నాడు.


ఆ పిల్లాణ్ణి తను ఇంతకుముందెప్పుడు చూడలేదని, అతని తల్లి, చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు. కాని నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు. పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు. మొత్తం కార్యక్రమాలను పిల్లాడి చెల్లి చేత చేయించాడు. పరమాచార్య స్వామివారి దర్శనం తరువాత మద్రాసుకు వెళ్లి అబ్బాయి గురించి విచారించాలనుకున్నట్టు తెలిపాడు. కాని మహాస్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు.


తరువాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు. “నీతోపాటు ఈ పిల్లవాణ్ణి బాంబే తీసుకునివెళ్ళు. తన తల్లికి జగవలసిన కార్యక్రమలన్నిటిని ఈ పిల్లాడి చేత చేయించు. నీ స్వంత బిడ్డలాగా ఆదరించు. ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే”

ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఇతరలుక సాధ్యం కాదు, కేవలం అది ఈశ్వరునికే సాధ్యం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఓం శ్రీరామచంద్రాయ నమః

 🌹ఓం శ్రీరామచంద్రాయ నమః 🌹


క.  మంగళ మో నారాయణ !

     మంగళ మో రామచంద్ర ! మహనీయగుణా !

     మంగళ మో సీతాపతి !

     మంగళ మో దివ్యనామ ! మదినెంతు సదా !    


మం.ద్వి.

      మంగళమో రామ ! మహానీయ నామ !

      కౌసల్య నందనా ! కమనీయ రామ !

      చక్రవర్తి తనూజ ! జానకీ రామ !

      శ్రితజన మందార !  శ్రీసార్వభౌమ !

      వినుతింతు త్వన్నామ ఘనత శ్రీరామ !

      ప్రణతుల నర్పింతు పరమాత్మ ! రామ !        


                🌻మంగళమ్🌻


అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.అభినందనలు 


గోపాలుని మధుసూదన రావు

               సులోచనా రాణి

రఘువరం

 రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ 

కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ 

రాజేంద్రం సత్యసంధం  దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ 

వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్🙏🙏🙏

రామో రామో రామయితి ప్రజానాం అని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లో చెప్పినట్లు ఈ రోజు దేశం మొత్తం రామనామ జపంలో మునిగితేలుతుంది. నిజానికి రామ అనేది రెండక్షరాల నామం మాత్రమే కాదు, ఈ జాతి గుండె చప్పుడు. అటువంటి అద్భుత నామాన్ని మనకందించిన వసిష్ఠులవారిని కూడా స్మరించుకుంటూ, ఆనామాన్ని తారక మంత్రంగా ఇచ్చి మనల్ని యుగ యుగాలుగా తరింప చేస్తున్న ఆ శ్రీ రామ దివ్య పాదారవిందాలను స్మరించుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 💐💐💐

🌼శ్రీ రామ జయం🌼

   🌸శుభోదయం🌸