12, మే 2021, బుధవారం

కొసరి పెట్టినదేదొ

 *కొసరి పెట్టినదేదొ రుచిలేని దైనను*

      *నోరు మూసుక తిని తీరవలయు* 


*విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా*

      *చూసి చూడనియట్టు చూడవలయు*


*అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు*

       *వినపడనట్టుగా వెడలవలయు*


*పై మూడు సూత్రాల పాటించి మగవారు* 

         *దీటుగా లాక్డౌను దాటవలయు*


*ఆశ వీడకుండ నారాటపడకుండ* 

*మూడు సూత్రములను వాడు వాడు*

*హాయిగా తరించు  నాపద నొoదడు*

*ఆవిడైన గాని కోవిడైన గాని* !!!

      

😅😁😂

*భ భా భి భీ భు భూ....?*

 *భ భా భి భీ భు భూ....?*


*ధారానగరం లో భుక్కుండుడు  అనే ఓ గజ దొంగ వుండే వాడు. నగరంలో దొంగతనాలు చేసి చేసి వేరే రాజ్యానికి వెళ్లి పోయి మరీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మరీ దొంగతనాలు చేసే వాడు. కానీ వాడు ధన వంతుల ఇళ్ళలోనే దొంగతనం చేసే వాడు. ఆ సొమ్ములో చాలా భాగం బీదలకు పంచె వాడు. రాజ సైనికులు ఎంత ప్రయత్నించినా అతనిని పట్టుకొన లేక పోయే వారు. ఒకసారి ఒకరింటికి కన్నం వేస్తూ దొరికి పోయాడు. భటులు వాడిని రాజ సభ లో ప్రవేశ పెట్టినారు  యిన్ని సంవత్సరాలుగా దొంగతనాలు    చేసిన భుక్కుండుడికి మరణ శిక్ష విధించాలి అని మంత్రి, యితర సభ్యులు రాజును కోరారు. తనకు రాజు  మరణ శిక్ష వేస్తాదేమో నని వాడికి భయం వేసింది. యుక్తిగా ఈ శ్లోకం చెప్పాడు.*


  *"భట్టిర్నష్టః, భారవి శ్చాపి నష్టః*

*భిక్షుర్నష్ట:. భీమసేనోపి నష్టః*

*భుక్కుండో హం భూపతి: త్వం  రాజన్*

*భబ్భావళ్యామ్   అంతక:  సం నివిష్ట:*

 

అర్థము:-- *రాజా! నన్ను శిక్షించండి. కానీ నాకు ఒక్కటే భయం. మీరు గమనించారో లేదో భట్టి చనిపోయాడు, భారవి కవి కీర్తి శేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షుకవి కూడా మరణించాడు, ఇటీవలే భీమకవి కూడా కాల ధర్మం చెందాడు, మరి నేను భుక్కుండుడిని. ఈ యమధర్మ రాజు 'భ' గుణింతాన్నే పట్టుకొని భట్టినీ, భారవిని, భిక్షు కవినీ, భీమ కవినీ తీసుకెళ్ళి పోయాడు. తర్వాత వాడిని నేను భుక్కుండుడిని. నన్ను తీసుకొని  పొతే భ భా భి భీ భు తర్వాత భూపతివి  నీవు, నీ పేరులో కూడా 'భ' కారం వుంది నా తర్వాత నీ వంతే నేమోనని, యింత మంచి రాజు మరణిస్తే ప్రజలకు గతి ఏమి? అని నేను భయ పడుతున్నాను. (పైన చెప్పిన కవులంతా  భోజుడి ఆస్థానం లోని కవులే) అన్నాడు.*


*రాజ దండన పొంద బోతూ కూడా ఇలా చమత్కారంగా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది, నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకుంటూ సరే!భుక్కుండా  ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను.  అని వాడికి కావలిసి నంత ధనం  యిచ్చి యిక ముందు దొంగతనాలు చేయ కుండా మంచిగా బ్రతుకు అని మందలించి వదిలేశాడు.*


*(భబ్భావళి అంటే 'భ' గుణింతం అంతక= యమ ధర్మరాజు సంవిష్ట: అంటే దృష్టి పెట్టిన వాడు)*       .  


*భలే బావుంది కదూ!*

       .

ఆకలి విలువ

 నిత్యం మనం చూసేదే.

మనకు బాగా తెలిసిందే!

ఐనా ఒకసారి చదవుదాం


    🤔ఆకలి విలువ🤔

  [రచన-కుంచే స్వర్ణలత]

                    

హైదరాబాద్ , 

బంధువుల పెళ్లి కని

బయల్దేరాము. 

బాగా ఆకలి వేస్తే 

ఒకచోట హోటల్ చూసి

ఆగాము. 

తలా ఒక్కో ప్లేట్ 

ఆర్డర్ చేసి తిన్న తరువాత, 

బాగా ఆకలిగా ఉందని 

మరో ప్లేట్ ఆర్డర్ చేసి

తెప్పించుకున్నారు 

మా అమ్మాయిలిద్దరూ.


టిఫిన్ సగం తిని, 

సగం  వదిలేసి  

మధ్యలోనే లేచి వెళ్లి

చేతులు కడిగేశారు.  

మిగిలి పోయిన 

టిఫిన్  చూసి 

నా మనసులో కలుక్కుమంది.  

ఆకలి వేసి

తెప్పించుకున్నారు కదా!

మొత్తం

తింటారనుకున్నగాని 

ఇలా వదిలేస్తారనుకోలేదు.


దారి మధ్యలో ఒకదగ్గర

పుచ్చకాయముక్కలు కోసి

ఐస్ పైనపెట్టి  

ఒకప్లాస్టిక్ ప్లేటులో 

ఆ ముక్కలు ఉంచి,

వాటిమీద  ఉప్పు చల్లి 

అమ్ముతున్నారు. 

అవి తిందామని 

బతిమాలి 

కారు ఆపించారు.  

ఇక్కడా అదే తంతు.

అందరం తిన్నతరువాత

మరో ప్లేటు ఆర్డర్ చేసి,

సగం తిని 

సగం వదిలేసారు. 

ఈ సారి వారిలో 

నా శ్రీమతి కూడా చేరింది.  మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను.  

వద్దని వారిస్తే పిసినారి 

పైసా పోనీయడు, 

తాను తినడు, 

తినేవారిని  తిననీయడు

అని తిట్టుకుంటారని 

నోరు కట్టేసుకున్నాను.


అంగరంగవైభవంగా

అలంకరించిన వేదిక. 

వచ్చి పోయే అతిథులతో 

పెళ్లి మండపం

కిటకిటలాడిపోతుంది. 


వేదికముందు 

కుర్చీలలో కూర్చున్నవారికి 

కూల్ డ్రింకులు

అందిస్తున్నారు.

కూల్ డ్రింక్ తాగిన వారిలో

చాలా మంది 

సగం వదిలేశారు.  

పెళ్ళి వారిని పలకరించి,

భోజనాలవైపు

బయలుదేరాము.


ఎన్నిరకాల 

వంటకాలు పెట్టారో,

లెక్కపెట్టడానికే

పదినిమిషాలు పడుతుంది.

 నాకైతే అదంతా చూశాకే

సగం కడుపు

నిండిపోయింది.  

భోజనాల దగ్గర 

జనాలను చూస్తుంటే 

కరువు ప్రాంతాలనుండి

వచ్చిన వారిలాగా

ఎగబడుతున్నారు. 


జీవితంలో ఏనాడూ

అలాంటి పదార్థాలు

చూడలేదు, తినలేదు,

ఇప్పుడు  తినకపోతే

జీవితం ఇంతటితో

ముగిసిపోతుంది

అన్నంత ఇదిగా

ఎగబడ్డారు. ఎంత

వడ్డించుకుంటున్నారో,

ఎంత తింటున్నారో,

ఎంతవదిలేస్తున్నారో 

వారికే తెలియడంలేదు. 

వడ్డించిన భోజనంలో 

సగం వృధాగా పోతుంది.  


అక్కడ జరుగుతున్న

తతంగమంత గమనిస్తూ

ఆలోచనలో 

పడిపోయిన నన్ను 

మా అమ్మాయి పిలిచింది భోజనానికి. 

చేతిలో పళ్లెంతో 

దానినిండా పదార్థాలు. కలుపుకోవడానికి 

కూడా చోటులేదు. 

అది చూసి అన్నం తినబుద్దికాలేదు.  

నాకు ఆకలిగాలేదు 

మీరు తినండి అని వారిని పురమాయించి, 

ఓ పక్కన కూలబడిపోయాను.


అక్కడినుండి వస్తుంటే

ఎవరో ఇద్దరు కూలీలు

పళ్ళాలలో వదిలేసిన

భోజనాన్ని డేగిసలో 

నింపి గోడవతల

విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. 

వెంటనే 

మా అమ్మాయిలిద్దరిని

పిలిచి చూపించాను.  

నోరెళ్ళబెట్టి చూసారు, 

కానీ వారి ముఖంలో 

ఏ రకమైన భావాలు

కనిపించలేదు. 

నాకు మాత్రం 

గుండెల్లో దేవినట్లు,

కాలికింద నేల

కదిలిపోయినట్లు

అనిపించింది.


తిరుగుప్రయణంలో, 

నా మనసంతా 

వృధా అవుతున్న 

భోజనం చుట్టే తిరిగింది.

ముభావంగా

ఉండిపోయాను.


ఏమైంది నాన్నా?*


పిల్లలిద్దరూ పిలిచేసరికి

ఆలోచనల్లోంచి తేరుకుని,

ఒక్కక్షణం ఆగి,

జేబులోనుండి

వందరూపాయల నోటుతీసి

బయటపడేయమని 

నా శ్రీమతి చేతిలో పెట్టాను.

అకస్మాత్తుగా నేనలా

చెప్పేసరికి విస్తుపోయి

చూసింది.

నేను కల్పించుకుని, 

నువ్వు విన్నది నిజమే 

వందరూపాయల నోటు

బయట పడేయమన్నాను. 

మరోసారి చెప్పాను.


 ఏం మాట్లాడుతున్నారండీ

మీరు? 

భోజనాల దగ్గరనుండి

చూస్తున్నాను. 

ముభావంగాఉంటున్నారు.

ఏమిమాట్లాడటంలేదు,

ఏమైందని పలకరిస్తే,

వందరూపాయలు 

బయట పడేయమంటారా?

గాలిగాని సోకిందా,

విసురుగా చూసింది.


ఒకవంద రూపాయల నోటు

బయట పడేయమంటేనే 

నీకు అంతకోపం వచ్చింది కదా....?   


పొద్దున్నుండి 

మీరు హోటల్లో టిఫిన్,

పుచ్చకాయముక్కలు,

పెళ్లిభోజనాల

దగ్గరకూరలు. 

వదిలేసిన వచ్చిన 

వాటి విలువ 

ఎంతో తెలుసా?   

మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి

రూపాయలు అవుతుంది

తెలుసా? 

అంటే మీరు 

వేయి రూపాయలు

బయటపడేసారు. 

నేను వందరూపాయల

నోటు విసిరేయడం

పిచ్చయితే  

మీరు అవసరాన్ని మించి

భోజనం వడ్డించుకుని,

వదిలేయడం పిచ్చి కాదా? 


"అన్నం పరబ్రహ్మ స్వరూపం" అన్నారు.


 అలాంటి అన్నాన్ని పడేసి

మనం దైవాన్ని

అవమానించినట్లు కాదా?


వృధాగా పడేసే అన్నం 

ఒక పేదవాడి 

ఆకలి తీరుస్తుంది. 

మనం భోజనాన్ని 

వృధా చేయక పోతే 

ప్రతి సంవత్సరం 

వందల కోట్ల రూపాయల

దుర్వినియోగాన్ని 

ఆపినట్లే లెక్క. 


నేను ఆవేశంగా చెబుతున్న మాటల్ని అడ్డుకుంటు ...

మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, 

అడిగింది మా అమ్మాయి.


అవునమ్మా  

చిన్నచిన్న నదులు కలిసి

సాగితేనే మహానదులు

ఏర్పడతాయి.

ఒక్కొక్కనీటిచుక్క 

కలిసి కుంభవృష్టి 

వర్షం అవుతుంది. 

వేల మైళ్ళ గమ్యమైన

ఒక్కఅడుగుతోనే

మొదలవుతుంది. 

చెప్పడం ఆపేశాను. అందరూ ఆలోచనల్లో పడిపోయారు. 


"మార్పుకి 

బీజం పడినట్లే."


{సేకరణ-

వెలిశెట్టి నారాయణరావుగారు}

అసురాంతకం


అసురాంతకం" కథ*

                🌷🌷🌷


“ *చేతనా*!”


“ యెస్! హు ఈజ్ స్పీకింగ్? “..... అమెరికాలో ఉన్న తనకు ఇంత అర్ధరాత్రి పూట ఎవరా... కాల్ చేస్తున్నారు... అనుకుంటూ... కించిత్ ఆదుర్దాతో.. 


“ ఎవరండి? చెప్పండి!”... అంది. మనసులో లక్ష సందేహాలు! 


“ చేతనా! నేను దినేష్ మెహతాను!  దయాకర్ కొలీగ్ ను! నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.  దయాకర్ లాంటి ధైర్యవంతుడు, ఎఫీషియంట్ పోలీస్ ఆఫీసర్.... ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకుంటాడని... ఇలాంటి ట్రాజిక్ ఎండ్ మీట్ అవుతాడని కలలో కూడా. ఊహించ లేకపోతున్నాం. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్....  అట్టుడిగి పోతోంది ఈ వార్తవిని. “...... ఆమెను ప్రిపేర్ చేస్తూ నిదానంగా చెప్తున్నాడు అతను. 


అతన్ని మధ్యలో ఆపి...” ఏమయింది దయాకర్ కు! ట్రాజిక్ ఎండ్ ఏమిటి?....ఓ మై గాడ్..”... ఆమె హిస్టీరిక్ గా అరిచింది. 


ఆరోజు ఉదయమే ఎనిమిది గంటలకు... తన స్వగృహంలో ఆమె భర్త దినకర్... తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడని... ఎలాంటి సూసైడ్ నోట్ లేదని... గత రెండునెలలుగా వివిధ లైగింకవేధింపుల కేసుల్లో అతనిపై జరుగుతున్న ఎంక్వయిరీకి మనస్థాపం చెంది... అలాంటి చర్యకు పూనుకున్నాడని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని... ఆ సమయంలో వయోవృద్ధురాలయిన అతని తల్లి తప్పా మరెవరూ లేరని... ఆమె ఆరోగ్యదృష్ట్యా ఆమెకు తామింకా తెలుపలేదని... దినేష్ మాటల సారాంశం! 


అంత్యక్రియల కోసం ఆమె , పిల్లలు రావలసి ఉంటుందని కూడా చెప్పి... తన ప్రగాఢ సానుభూతి ప్రకటించి పెట్టేసాడు అతను! 


స్థాణువై పోయింది చేతన. అచేతనంగా... బుర్రలో విన్న విషయాలేవీ ...రిజస్టర్ అవ్వనట్టు కూర్చుంది. కొడుకును లేపి చెప్పాలన్న ప్రాధమిక విషయం కూడా ఆమె మనసుకు తట్టలేదు!  


ఆమె బుర్రకు వెంటనే తట్టిన మొట్టమొదటి వ్యక్తి... తన అత్తగారు! 


“ అమ్మమ్మ! అయ్యో! అమ్మమ్మ ఒక్కతీ ఉందా ఆ ఇంట్లో! ఎలా తట్టుకోగలదు... కొడుకు మరణం! ఈ వయసులో ఇంత దుఃఖం తీసుకోగలదా"  అమ్మకు ఫోన్ చెయ్యాలి.  కీర్తనకు కూడా! అమ్మమ్మ దగ్గరే ఉండమని”... 


విచిత్రంగా ఆమె భర్త మరణానికి విలపించడం లేదు. కేవలం ఆశ్చర్యపోతోంది అంతే! అతనిలోని దుర్మార్గం, చపలత్వం, స్త్రీలోలత చూసింది కానీ... అంత సులువుగా లోకాన్ని వదిలేయగల మొండి ధైర్యాన్నీ, దుడుకుతనాన్నీ ఎప్పుడూ చూడలేదు. 


ఈలోపున కొడుకుకు వార్త అందినట్టుంది.  గాభరాగా కిందకు ... తల్లిగదిలోకి పరుగెత్తుకు వచ్చాడు! ఫోన్ పట్టుకుని రాయిలా కూర్చుండిపోయిన తల్లి తలను ..తన గుండెలకు ఆనించుకున్నాడు.  అతని చెంపల వెంట కన్నీటిధారలు... తండ్రిదుర్మరణాన్ని తలుచుకుంటూ! 


“అమ్మా! కీర్తన ఫోన్ చేసి చెప్పింది! ఇప్పుడే ఏజెంట్ కు చెప్పి టికెట్స్ బుక్ చేయిస్తా!రేపు మొదటి ఫ్లయిట్ కల్లా ఇండియా బయలుదేరుతాం”. పరిస్థితిని చేతుల్లోకి తీసుకుంటున్న కొడుకు కేసి బేలగా చూసి... సరేనన్నట్టు తలూపింది చేతన! 


ఆ అబ్బాయికి బాగా తెలుసు... తల్లి మనసులో రగులుతున్న అగ్నిపర్వతాలన్నీ! ఎటువంటి సాంత్వనాపూర్వక మాటలు, సానుభూతి చూపించకుండానే మౌనంగా నిష్క్రమించాడు! 


ఇంతలో ఆమె తల్లి నుండి ఫోన్ వచ్చింది! ఆవిడ అనబోయే మాటలన్నీ ఆమెకు తెలుసు. ఎత్తాలనిపించకపోయినా... ఆపకుండా చేస్తున్న ఆవిడకు జవాబివ్వకపోతే... జరిగే రచ్చకు భయపడి.. కాల్ తీసుకుంది. 


“ఏం తల్లీ! ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా...ఆఖరికి నా తమ్ముడు ప్రాణాలు తీసుకున్నాకా! ఏరోజూ వాడికి సపోర్ట్ గా ఉన్నావు గనక! చిన్నతనంలోనే “తమ్ముడికిచ్చి పెళ్ళిచేసేసావని”.. కొన్నాళ్ళు నా మీద ఏడుపు.  నీకు ఆ ముసల్ది మా అమ్మ వత్తాసు! సరే చదువన్నావు.  లా వెలగబెట్టావు.  వాడు కిమ్మనలేదు.  ఇష్టం లేని కాపురమంటూనే...పిల్లల్నీ కన్నావు!  వాడి హోదాలన్నీ అనుభవించావు.  ఇంతోటి దిక్కుమాలిన లా ప్రాక్టీసుతో... వాడి మీద కేసులు పెట్టిస్తావా! కోర్టుకెళ్ళి సాక్ష్యాలు చెప్తావా, మొగుడికి విరుద్ధంగా! మనిషివా... పశువ్వా! చంపేసావు కదే నా తమ్ముడ్ని అన్యాయంగా...” అక్కడ గుండెలు బాదుకుంటున్నట్టు ఉంది.... ఆ కోపం, ఆక్రోశం... చేతన చెవులకు కర్ణకఠోరంగా వినబడుతోంది. 


“ఆస్థులు పోకోడదు... పైగా తమ్ముడు ఐపీఎస్.” అంటూ పదిహేనేళ్ళ తనకు పాతికేళ్ళ పైబడ్డ దయాకర్ నిచ్చి పెళ్ళిచేసిన అహంకారి. తాపట్టిన కుందేలుకు మూడేకాళ్ళంటూ... తన ప్రతీపంతం నెగ్గించుకునే తల్లి అంటే చేతనకు మహాభయం.  ఒకరకంగా కంపరం కూడా! 


అచ్చం తన తల్లిలాగే... మూర్ఖత్వం, భోగలాలసత్వం , విలాసాలూ, తలబిరుసుతనం వంటి అన్ని లక్షణాలూ పుణికి పుచ్చుకుని, తన తల్లి తర్ఫీదులో మరింత దిగజారుడుతనం అలవర్చుకున్న తన కూతురు కీర్తన అన్నా అంతే! పాకుడురాళ్ళ మీద నడుస్తూ.. పట్టుతప్పుతున్నా, ఆ తప్పుడు నడకలకే కట్టుబడి... జీవితంలో అధోముఖంగా జారిపోతున్న కూతురి గురించి ఆమెకేమీ ఆశల్లేవు! 


ఎందుకంటే కీర్తనకు ...తన తండ్రి దయాకర్ అడుగుల జాడలే ఆదర్శాలు! కన్నతండ్రి మరణిస్తే... సంతాపసూచకంగా నయినా తల్లితో ఒక సాంత్వనవచనం పలకాలనే ఇంగితం కూడా లేదు ఆ కూతురికి! 


చేతన జీవితంలో వెలుగునింపి, ఆమె ఆశల్నీ, ఆశయాల్నీ వెలిగించి... అర్ధం చేసుకుని...గౌరవించేవారు ఆమె అమ్మమ్మ... ఆమె తండ్రి రాఘవరావు.. ఆమె కొడుకు, శుభకర్.. మాత్రమే! 


భారత్ కు బయలుదేరిన విమానంలో కూడా చేతనను వెంటాడుతున్నవి దయాకర్ తో పంచుకున్న క్షణాలే! స్మృతుల్లా లేవవి.  వెంటాడే నీడల్లా ఉన్నాయి!  తోడేలు అతను!  క్రూరత్వం, మోసపుజిత్తులు, కుతంత్రం, అతని నైజం! 


పొడవైన మనిషి... కురచైన శీలం! మనోహరమైన అతని నవ్వు వెనకాల, తరచి చూస్తే స్పష్టంగా కనిపించే మాయాజాలం!  అధికారం, దండం చేతికిచ్చిన ఉన్నతమైన పదవి.   దయాదాక్షిణ్యాలను తుంగలో తొక్కి... విచ్చలవిడిగా.. లంచాలతో తడిసిన చేతులు! 


ధనికుల పాలిట, తమ హక్కుల రక్షకుడు! డబ్బులు రాలని చోట నరరూప రాక్షసుడు! అవసరాలు ఉన్న సర్వులకూ ఆప్తుడు!  “ఆమె ఆలోచనల లంకెలు తెంపుతూ... కొడుకు పలకరించాడు! 


“ కాసేపు కళ్ళు మూసుకో అమ్మా! అక్కడికెళ్ళాకా నీకస్సలు విశ్రాంతి ఉండదు. చాలా సంఘర్షణ ఉంటుంది! 

“కొడుకు కేసి అభావంగా చూస్తూ... “శుభకర్! భర్త దుర్మార్గుడయినపుడు... అతని వలన ఒక అమాయకురాలు అన్యాయంగా ప్రాణం పోగొట్టుకుంటే.... నేను ఎదురుతిరగడం తప్పా! ఎంత వయసురా అపర్ణది... మన కీర్తన వయసుది కదా! కూతురులాంటి ఆడపిల్లను చేరదీసి లోకం చూడనీకుండా, బంధించి...ఆ పిల్ల భవిష్యత్తు నాశనం చేసి... చివరకు చంపేస్తాడా!  ఆ పిల్ల ఉసురు కొన్నితరాలు మన కుటుంబానికి శాపమై కూర్చోదూ!  ఇదే పని తన కూతురికి జరిగితే...? అది అడిగాననే కదా.. పశువును బాదినట్టు బాదాడు...” ఎంత గొంతు తగ్గించినా... ఆమె మాటల తీవ్రత వలన చుట్టుపక్కల ఎవరైనా వింటారేమోనని.. “ హుష్ అమ్మా! అవన్నీ ఇప్పుడెందుకు.  పడుకో! “... అని తల్లిని చిన్నగా గదమాయించాడు శుభకర్! ఆమె చూపు మళ్ళీ కిటికీలోంచి మేఘాలను ఆశ్రయించింది! 


అపర్ణ ఒక్కతేనా! ఎంత మంది అమ్మాయిలతో ఆడుకున్నాడో!  “నువ్వు సవ్యంగా ఉంటే... వాడు బయట చిరుతిళ్ళు ఎందుకు వెతుక్కుంటాడు?  అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కు తినానివ్వదు.. అన్న చందాన ఉంది నీ యేడుపు! అయినా నీతో సాత్వికంగానే ఉంటాడుగా! నెత్తిన పెట్టుకునే మొగుడులో రంధ్రాన్వేషణ చేసేదాన్ని నిన్నే చూసా” అంటూ తన తమ్ముడి వికృతచేష్టలు సమర్ధిస్తూ, కూతుర్ని ఈసడించే తన తల్లిని చూసాకా,  మాతృత్వపు నిజాయితీ మీదే నమ్మకం పోయింది చేతనకు! 


“ భవాని”.....ఆమె కళ్ళారా చూసింది ఆ ఘటన. 

ఒక తీరప్రాంతంలో బినామీ పేరిట వారికొక  గెస్ట్ హౌస్ ఉంది.  కజిన్ పెళ్ళికని వచ్చిన వారిద్దరూ.. పెద్దతుఫాను రావడంతో  నాలుగురోజులు చిక్కడిపోయారు!  ఆమె పెళ్ళివారింట.... దయాకర్ గెస్ట్ హౌస్ లో!  అక్కడ జరిగే కార్యక్రమాలు ఊహించగలదు కనుక ఆమె అక్కడ అడుగు కూడా పెట్టదు.  కానీ ఆరోజు వెళ్ళక తప్పలేదు! 


ఎడతెరిపి లేకుండా సముద్రతీరపు నగరాన్ని ఊపేస్తున్న అల్పపీడన ప్రభావం మరో హుడ్ హుడ్ ను తలపిస్తోంది.  కిటికీలోంచి తుఫాన్ భీభత్సాన్ని చూస్తోంది చేతన! 


అంత విధ్వంసం జరుగుతుంటే  మరి ఎలా రాగలిగిందో తెలీదు,  గుమ్మంలో "భవానీ".... గెస్ట్ హౌజ్ లో పనిచేసే అమ్మాయి, తన రెండుచేతుల్లో అడ్డంగా “ నాలుగేళ్ళ పిల్లాడిని”ని పెట్టుకుని....! 


అస్థవ్యస్థమైన ఆకారంతో, కన్నీటి కాటుకచారల కళ్లు విస్ఫులింగాలు వెదజల్లుతుంటే... విరబోసుకున్న జుట్టు గాలికెగురుతూ.. కలకత్తా కాళీలా ఉంది భవానీ! 


"బేవార్స్ ఎదవా! దుర్మార్గుడా! ఇడిగోరా నీ కొడుకు! అచ్చంగా నీకే పుట్టిన కొడుకు.  నా చిన్నబాబు! నీ దౌర్జన్యం వలన సమాధయిపోయాడు. చచ్చిపోయాడు నాబాబు"... పిల్లాడి శవాన్ని గాలిలోకి ఊపుతూ..పట్టలేని దుఃఖంతో కదిలిపోతోంది ఆమె! 


"ఏమయింది భవానీ? ఏంటిదంతా?"...ఆ శోకతప్త మాతృమూర్తిని చూసి తల్లడిల్లిపోయింది చేతన! 

“అమ్మా ! ఐదేళ్లయింది ఈ గెష్టు అవుస్ లో పని కుదిరి. అయ్యగారు నన్ను చేరదీసారు.  ఈ పిల్లాడు మీ యాయనగారి బిడ్డ.  నేనే ఎప్పుడూ చెప్పలేదు.... తరిమేస్తారని! 

నిన్న పొద్దున్నే ..బాబును అంగన్వాడీలో దించి ఇక్కడికొచ్చా! మధ్యాన్నం.. "నేనెళ్లాలయ్యగారూ" అంటే ఈయన నన్ను బలవంతంగా ఉంచీసారు.  ఏడ్సుకుంటూనే ఉన్నా!  ఈరోజు సాయంత్రం నాలుగింటికి ప్రాణాలకు తెగించి బయటపడ్డా.  బీచీ రోడ్డు మీద పడుతూ, లేస్తూ, డేక్కుంటూ పోతున్నా. కొండల మీంచి చెట్టకొమ్మలొచ్చి పడిపోతున్నాయి.  పోలీసోళ్లు చూసి జీపెక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు.  యేసిన తాళం యేసినట్టే ఉంది.  మళ్లీ అంగన్వాడీకి పరిగెట్టా.  రేకు కింద సచ్చిపోయి బాబు!"... గొల్లున ఏడుస్తోంది భవాని! 


దయాకర్ లో చలనం లేదు, కనీస కనికరం కూడా లేదు. గదిలోకి వెళ్ళాడు.  రివాల్వర్ తెచ్చుకొచ్చాడు. “ పోతావా! చంపీసి పాతిపెట్టేయాలా!”.... అతని కఠినత్వం చూసి.. అన్నేళ్ళు భార్యగా సహజీవనం చేస్తున్న చేతనకే వెన్ను వణికింది! ఆ క్షణం ఆమెచేతిలో ఆయుధం ఉంటే ఆమె ఏ హత్యలు చేసుండేదో, ఆమెకే తెలీదు! 


ఒక న్యాయశాస్త్రపట్టా చేతిలో పెట్టుకుని, స్త్రీలహక్కుల కోసం ఎన్నో న్యాయపోరాటాలు చేస్తూ, ఎందరో అభాగినుల, వంచితుల తరుఫున వాదించి న్యాయపరమైన పరిష్కారాలు చూపించి, అత్యాచార నిందితులకు శిక్షలు పడేలా చేసి, వుమెన్స్ రైట్స్ ట్రిబ్యునల్ లో ఉన్నతపదవి నలంకరించి, సత్వరగతిని స్త్రీల సమస్యలు పరిష్కరించిన ... చేతన ముందు సవాలుగా తన భర్త....ఒక అభాగ్యురాలి జీవితంతో ఆడుకుంటూ! అసమర్ధతతో... తనక్కడ మౌనసాక్షిగా నిలబబడి! 


ఆ తరువాత భవానీకి న్యాయం చెయ్యడం కొరకై ఆమె ఆచూకీ కోసం చాలా ప్రయత్నించింది చేతన. అయితే భవానీ అన్న వ్యక్తిని జనాభాలెక్కల్లోంచే శాస్వతంగా తప్పించారన్న వార్త కాస్త ఆలస్యంగా తెలిసింది. 


దయాకర్ తో మరి బ్రతుకు కొనసాగింపు దుర్భరంగా తోచి పిల్లాడితో బయటకొచ్చి... ఐదేళ్ళు వేరుగా ఉంది చేతన. ఊహ తెలిసిన కూతురు ... అందలాలు వదిలి రానంది. నైతిక పతనానికి పునాదిరాయి వేసుకుంది! 


అమ్మమ్మ అనారోగ్యం... తండ్రి రికమెండేషన్.. ఆమెను తిరిగి దయాకర్ వద్దకు తిరిగి తెప్పించినా, పగిలిన పింగాణీకి అతుకుపెట్టిన చందమే అయింది వారి కాపురం! 


సమాంతర రేఖల్లా ఒకరి జీవితాలను మరొకరు స్పృశించకుండా  సాగుతున్న ఆ కుటుంబంలో “అపర్ణ” రాక సంచలనం అయింది. 


అపర్ణ... కీర్తన క్లాస్ మేట్! ప్రయివేట్  కాలేజ్ లో, మూడవయేడు ఎంబీబీఎస్ చదువుతోంది.  తండ్రి హఠాన్మరణంతో... ఆర్ధిక సంక్షోభంలో పడింది. 

ఈ క్షణానికి కూడా .... ఆరోజు తమింట్లో జరిగిన డైనింగ్ టేబిల్ సంభాషణలు, చేతన బుర్రలో పచ్చిగానే ఉన్నాయి! 


“అప్పూ! చూడూ ...ఈ కార్న్ ఫ్లేక్ కు నీ పెదవులను వదలాలని లేనట్టుంది.  చూడు, ఎలా అంటుకుని పోయిందో!” అంటూ దయాకర్ సుతారంగా తన వేలికొసను ఆమె పెదవులకు తాకించి... తన కపట మెస్మరైజింగ్ నవ్వు నవ్వుతూ... ఆమె కళ్ళలోకి చూస్తుంటే... ఆ అమ్మాయి... సిగ్గులమొగ్గై పోయినట్టు మెలికలు తిరిగిపోతూ, అతని చెయ్యి పట్టుకుని ఆపుతూ..” కమాన్ అంకుల్! యూ నాటీ!” అంటూ ఆంగ్లంలో అలరిస్తుంటే, ఒళ్ళు కంపరంతో ఊగిపోయింది చేతనకు! 


“కాల్ మీ దయా.. అప్పూ! ఫీల్ ఫ్రీ టు ఆస్క్ వాటెవర్ యు వాంట్”... అంటూ దయాకర్ హింట్ ఇస్తుంటే... కీర్తన పెద్దగా నవ్వుతూ” దేర్ యు ఆర్ డేడీ! యు ఆర్ టోటల్లీ అబ్సెస్డ్ విత్ అప్పూ! “ హే అప్పూ! యువర్ డే వజ్ మేడ్... మా డాడీ అన్నీ చూసుకుంటాడు. హీ ఈజ్ మై హీరో...” అంటూ కన్నతల్లి, సమక్షంలో ... ఎలాంటి జంకూగొంకూ లేకుండా... సిగ్గూయెగ్గూ లేకుండా... స్నేహితురాలిని ప్రోత్సహిస్తూ, తండ్రికి మార్గం సుగమం చేస్తున్న కూతురి అనైతికత... చేతనను మానసికంగా నిర్విణ్ణురాలినే చేసింది. 


రెండేళ్ళు అపర్ణ జాడే లేదు! 


ఈలోపున ఎవరినో ప్రేమించానూ, పెళ్ళి చెయ్యండని ....ఒక బెంగాలీ అబ్బాయిని తెచ్చి చూపించింది కీర్తన.  చదువు మీద శ్రద్ధలేకుండా... ఎలాంటి పాజిటివ్ జీవితలక్ష్యం లేని కీర్తనకు పెళ్ళికి తొందరేమొచ్చిందో అర్ధం కాలేదు చేతనకు.  కీర్తనకు నచ్చచెప్పబోయి భంగపడింది. దయాకర్ మాత్రం... తన అంతస్థుకు తగినవాడినే చూసుకుందని సంతోషించి... భారీగా కట్నకానుకలిచ్చి.. పెళ్ళి చేసి కూతుర్ని వదిలించుకున్నాడు. 


తల్లిఛాయలో పెరిగిన శుభకర్ ... దయాకర్ దృష్టిలో ...తన వంశాన్ని ముందుకు తీసుకుని పోయేవాడు మాత్రమే! ఆసక్తిలేదు అతనిపై... ఆపేక్షా లేదు! 


రెండు నెలల క్రితం... ఒకరోజు చేతన హైకోర్ట్ లో పని చూసుకుని ... ఇంటికి బయలుదేరి వెళ్తున్న వేళలో... ఫోన్ కాల్! ఎవరిదో అపరిచిత నంబర్! ఎత్తగానే.... ఎవరో అమ్మాయి పెద్దగా ఏడుస్తూ..! “ఆంటీ అపర్ణను.  నేను చాలా ప్రమాదంలో ఉన్నా, మీరు తప్ప ఎవ్వరూ నన్ను కాపాడలేరు!..”... ఇంకా ఏదో మాట్లాడుతోంది... కానీ ఆ అమ్మాయి గొంతుకు అక్కడి ట్రాఫిక్ రొదలో కలిసిపోయి ... ఏమీ వినిపించడం లేదు. పెట్టేసి తిరిగి కాల్ చెయ్యబోయింది... కానీ అది అన్ లిస్టెడ్ శాటిలైట్ ఫోన్! 


ఆ ఫోన్ నంబర్ కనుక్కోడానికి విశ్వప్రయత్నాలు చేసింది. చేతన తండ్రిగారు కూడా ప్రయత్నించారు!  చివరి ప్రయత్నంగా... అపర్ణ వివరాలకోసం కీర్తనను సంప్రదించింది!  తల్లి మీద ముందు నుండీ విముఖత్వమున్న కీర్తన ... పొడిపొడిగా మాట్లాడి... అపర్ణ వివరాలు తనకు తెలియవని చెప్పి పెట్టేసింది. 


కీర్తనతో మాట్లాడిన అరగంటకు దయాకర్, అతని ఇన్నోవాలో బయటకు వెళ్ళిపోయాడు! 


మూడురోజుల తరువాత .... మురిక్కాలువలో తేలింది ఐదు నెలల గర్భవతి అపర్ణ... శవమై! 


ఆ వార్త విని పిచ్చెక్కిపోయింది చేతనకు.  తన అసమర్ధత మీద అసహ్యం వేసింది. అపర్ణకు న్యాయం చెయ్యకపోతే.... తను మళ్ళీ నల్లకోటు వేసుకోకూడదని నిర్ణయించుకుంది!  ప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నియమించుకుని... అపర్ణ గురించి వివరాలు సేకరించసాగింది. 


అపర్ణ మెడిసిన్ మధ్యలోనే  మానేసిందని... ఆమె తల్లి ఆమెను చూసి రెండేళ్ళయిందని,  “ముంబయిలో మోడలింగ్ చేస్తున్నానని “...డబ్బు పంపుతోందని... చాలా అరుదుగా కాల్ చేసేదని... ఈమధ్య అదీ లేదని చెప్పడం విని, చేతన మనసు రకరకాల అనుమానాలూ... సందిగ్దాలతో నిండిపోయింది! ఆమె మనసూ... మేధస్సూ.. ఒకేఒక వ్యక్తివేపు సూచిస్తున్నాయి.  “దయాకర్”! 


చేతన పనిని సులువు చేస్తూ... ఒకబ్బాయి.. తాను అపర్ణ ఉండే పెంట్ హౌజ్ కింద ఉంటానని... అపర్ణ రాసిన ఉత్తరమని... ఎట్టి పరిస్థితులలో కూడా పోలీసులకు ఇవ్వొద్దని చెప్పి మాయమైపోయాడు! 


ఆ ఉత్తరమంతా... ఓ దయనీయమైన గాధ! ఒక ఆడపిల్ల... చదువు కోసం... తప్పటడుగు వేసయినా... ముందుకు సాగాలని చేసిన సాహసం, ఆమెను ఏ విధంగా ఓ పంజరపు నరకకూపంలోకి తోసిందో, ఎలాంటి అకృత్యాలకు, లైంగికహింసకూ, బెదిరింపులకూ...ఒక ఖాకీ చేతిలో ఆమె గురయిందో.... గర్భ విచ్ఛిత్తికి వీలుకాక తన జీవితం ఏ రకమైన ప్రమాదపుటంచులకు చేరిందో, హృదయవిదారకంగా రాసింది. 


అపర్ణ ఇచ్చిన అన్ని ఆధారాలతో.... దయాకర్ అరాచకాలకు స్వస్థి చెప్పదలచుకుంది చేతన. మీడియా సాయం తీసుకుంది. తను అజ్ఞాతంగానే ఉంటూ... కేస్ హియరింగ్ కు రాగానే... అపర్ణ తల్లితో... దయాకర్ ను దోషిగా నిరూపించే, ఆధారాలన్నీ బయటపెట్టించింది. 


కేస్ చివరిదశకు రావడంతోనే దయాకర్ కు ఈ కేస్ వెనుక చేతన హస్తం ఉందని అనుమానం రావడమేంటి.... కొడుకు శుభకర్ దగ్గరకు, అమెరికా వెళ్ళిపోయింది! ఇదిగో ఇలా మళ్ళీ స్వదేశంలో అడుగుపెడుతూ!        


కుటంబం నుండి పెద్ద ఒత్తిడి లేకపోవడంతో... దయాకర్ ఆత్మహత్య ఎంక్వయిరీ... ఒక ఫార్మాలటీ లాగ ముగిసిపోయింది.  చేతన మనసు ప్రశాంతంగా ఉంది. 


ఆమెకు అత్యంత ప్రీతిపాత్రురాలు, ఆదర్శమూ అయిన తన అమ్మమ్మ మంచం మీద.. పాదాల దరి కూర్చుంది.  నారాయణ తైలం తీసుకుని, ఆమె దుర్బలమైన పాదాలకు మృదువుగా రాయసాగింది. 


ఆ వృద్ధురాలు చేతనను తన దగ్గరగా కూర్చోమని పిలిచింది.  కేవలం చేతనకు మాత్రమే వినిపించేట్టు,” అమ్మలూ!  నేనే దయాని చంపేసాను”..... అంది! ఒక్కసారి చేతనకు పక్కలో బాంబు పడ్డట్టయింది. అపనమ్మకంగా చూసింది ! 


ముసలమ్మగారు గొంతు సవరించుకుంటూ “ ఆ రాత్రి... ఇంట్లో పార్టీ జరిగింది. పెద్దవాళ్ళెవరో వచ్చారు. కేసు నీరు కార్చడానికి బేరాలు జరుగుతున్నాయి!  నా నర్సును పంపించేసాడు దయా! అన్నీ సెటిల్ చేసుకుని వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేడ మీదకు వెళ్ళా.  అతికష్టం మీద.  ఆఖరి మాటగా తల్లిమాట వింటాడేమోనని!  తప్పతాగి పడున్నాడు.  పక్కనే అపర్ణ ఫోటో పడి ఉంది... పూర్తిగా ఛిద్రమై! వాడింక మారడు! రూఢీగా తెలిసిపోయింది. అలాంటి కలుపుమొక్కను కన్న పాపానికి నేనే దానిని పీకేసి... పాప ప్రక్షాళన చెయ్యాలనుకున్నా! 

పక్కనే లోడెడ్ పిస్టల్ ఉంది. నా చేతికి వూలు గ్లవ్స్ ఉన్నాయి! వాడి పుర్రచేతి వాటం గుర్తొచ్చి... ఎడమ కణత మీద పెట్టి... ఒక్క నొక్కు నొక్కా! నరకాసుర వధ జరిగిపోయింది.  వాడి ఎడం చేతిలో పిస్టల్ పెట్టేసి... కిందకొచ్చి నాలుగు నిద్రమాత్రలు వేసుకుని పడుకుండిపోయాను. బాధంటావా... బాధుండదా! ఎంత చెడ్డా కొడుకు”.... ఆవిడ వెక్కివెక్కి ఏడుస్తోంది. 


అమ్మమ్మను లేపి... తన చేతులతో చుట్టేసింది చేతన ఆర్తితో... ఓదార్పుతో! కాసేపటికి దుఃఖతీవ్రత తగ్గి ఆవిడ శాంతించారు! పూర్తి నిర్మోహత్వం , వైరాగ్యం ఆవహించాయి ఆ పెద్దామెకు!  అదే “ సత్యభామమ్మగారికి”! . 

అమ్మగా ... ప్రేమతో పెంచి, అనురాగాన్ని పంచి, మంచి నేర్పేది అమ్మ!

తప్పటడుగుల వేళ తడబాటు పడకుండా నడక నేర్పేది అమ్మ! తప్పుటడుగు వేయ తప్పని చెప్పెడి న్యాయమూర్తి అమ్మ.  దుష్టబుద్ధిని త్రునుమ, సత్యభామగ మారి దండించు దండమూ అమ్మే! 


అమ్మ ప్రేమను పొందుదాము! క్రోధాన్ని కాదు! 

మాతృమూర్తులకు శతకోటి వందనాలతో... జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన అమ్మకు ప్రేమతో... శశి, చిన్నమ్మాయి!

భారతీయులం

 *మేమే భారతీయులం..*


*డబ్బు కోసం మానవత్వాన్ని సైతం అమ్ముకొనే వారం. చివరకు విపత్కర పరిస్థితుల్లో కూడా తినే ఆహారం నుంచి, ప్రాణం పోసే వైద్యాన్ని కూడా కాసులుగా మార్చుకొనే అవకాశాన్ని చూసుకొనే కక్కుర్తి గల ఆధునిక భారతీయులం !! మా తప్పును కప్పెట్టి పరాయి దేశాలపై ఏడ్చే పనికిమాలిన వాళ్ళం !!*


*Corona is not killing the people of India. Corrupt Indians, Politicians, Bureaucrats & Technocrats are killing the people in India today !!*


*ఒక కరోనా బెడ్ మీద ఇద్దరిని పెడితే, ఒక మనిషి శవంగా మారాక కూడా, రెండు గంటల పాటు అదే శవంతో పక్కనే పడుకోవడం ఆ రోగికి ఎంత నరకం?*


*₹600 పల్స్ ఆక్సిమీటర్ ను ₹3,000 లకు అమ్మేది తోటి భారతీయుడేగా?*


*కరోనా పేషెంట్ ని రెండుగంటల దూరం ఉన్న హాస్పిటల్ కి చేర్చడానికి లక్ష రూపాయలు ప్రైవేట్ అంబులెన్స్ కి అడిగింది మన భారతీయుడేగా?*


*₹800 రూపాయల రేమిడిసివిర్ ₹40,000 లకు అమ్మేది మన భారతీయుడేగా?*


*₹40 వేలు ఖరీదు చేసే తొసిలిజుమాబ్ ఇంజక్షన్ ₹10,00,000 లకు బ్లాక్ మార్కెట్ చేసేది మన భారతీయుడేగా?*


*రోగుల నిస్సహాయ స్థితిని ఆదాయ వనరుగా చూస్తున్న కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ను నడిపేది మన భారతీయుడేగా?*


*ప్రపంచంలో ఈ టైంలో ఇంత అరాచకం ఎక్కడన్నా ఉందా?*


*మన దగ్గర ఇంత కుళ్ళు పెట్టుకొని, వాడెవడో ఈ వైరస్ కనిపెట్టాడు, వీడేవడో మన దేశాన్ని ఎదో చేయాలనుకుంటున్నాడు? అని వాపోవటం ఎందుకు?*


*ఆ మాటకొస్తే ఈ సెకండ్ వేవ్ ద్వారా మన (దేశ వ్యవస్థ) యొక్క డొల్లతనం బయటపడింది !! పొరుగు దేశాల యొక్క ఉదారస్వభావం పతాకస్థాయికి చేరింది !!*


*దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ వారు పుట్టిన భూమిలో పుట్టిన మనం ఊరికే మన దేశం గూర్చి గొప్పలు చెప్పుకుంటూ పైపైన పొంగిపోకుండా నిజాయితీగా మన లంచగొండి తనాన్ని, అక్రమ విధానాలను, చేతకాని తనాన్ని ఒప్పుకుంటూ కనీసం భవిష్యత్తులో అయినా ఇటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి నుండి బయటపడే విధానాలను/బయటపెట్టే వ్యక్తులను సిద్దం చేద్దాం !!*


*మనలో మార్పు రానంత వరకు, వ్యవస్థల్లో మార్పురాదు, మన దేశం మారదు !!*

ఆక్సిజన్

 ఓ చిన్నతప్పుకు మనవాళ్ళు ఆక్సిజన్ అందక చనిపోతున్నారు ఆ తప్పు ఏమిటంటే వేడి నీటి ఆవిరి. 

1 )  ఆవిరి పట్టమన్నారు గానీ ఊపిరితిత్తులకు పీల్చమనలేదు ! మనవాళ్ళందరూ ఆవిరిని ఉపిరితిత్తులోకి పీల్చుతున్నారు కనుక ఆక్సిజన్ అందక చావును కొని తెచ్చుకుంటున్నారు. 

2 ) ఆవిరిని ఉపిరితిత్తులోకి పిల్చుతే ఏమవుతుంది?

3 ) న్యూమోనియా వస్తుంది .  ఎలా?

4 ) ఎలా  అంటే  ఆవిరి ఉపిరితిత్తులోకి వెళ్లి చల్లబడి అది మరల నీటిగా మారి ఊపిరితిత్తులలో నీరు చేరుతుంది. అంటే రోజుకు రెండు మూడుసార్లు ఆవిరి పీల్చడంవలన ఉపిరితిత్తులోకి నీరు బాగా చేరి న్యూమోనియా అను జబ్బుగా మారినప్పుడు మీకు ఊపిరి పిలిచుకోవడానికి చాల ఇబ్బంది పడతారు,  ఆయాస పడతారు. అప్పుడు మీరు చనిపోతారేమో అని బయపడతారు .

5 ) ఆవిరి పట్ట మన్నారు గాని ఉపిరితిత్తులలోకి పిల్చమనలేదు. 

6 ) ఆవిరి పట్టడం ఎలా?

7 ) ఆవిరిమీద ముఖము పెటేముందు,  ప్రతి ఒక్కరు ముందుగా శ్వాసను బాగా పీల్చుకొని బిగపట్టి అప్పుడు వేడి ఆవిరిమీద ముఖము పెట్టి ఆవిరిని పట్టాలి.  మీరు ముందుగా పీల్చిన శ్వాసను వదిలేటప్పుడు ముఖమును ప్రక్కకు తిప్పుకొని వదలాలి,  వదిలిన తరువాత మరల బాగా శ్వాస తీసుకొని బిగపట్టి అప్పుడు మరల ఆవిరి పట్టాలి.  అంతేకాని ఆవిరిపై ముఖము పెట్టి శ్వాస - నిశ్వాసలు చేయకూడదు,  ఆలా చేస్తే మీ చావును మీరే ఆసుపత్రిలో కొనుకుంటారు,  డబ్బులు పోయే,  శరీరము పోయే 

8 ) ఆవిరి పట్టడం అవసరం  -  ఆవిరిని లోనికి పీల్చడం మరణము. 

9 ) ఒకవేళ మీకు శ్వాస ఇబ్బంది పెడితే ఈ రెండు ప్రాణాయాములు చేయండి. మొదటిది 

 కాపలాబాత్ర్ 10  నిముషాలు, రెండోవది   అగ్ని హోత్రి  

10 నిముషాలు . ఇవి ఎలా చేయాలో తెలియకపోతే YouTube  లో  చూడండి.  ఇవి చేసేటప్పుడు ఒకరికి ఒకరు ఎదురు ఎదురుగా కుర్చొవకూడదుx  .  ఇవి చేసెటప్పుడు శ్వాస  - నిశ్వాసములు చాల force   గా ఉంటాయి.  అందుకే  పక్క పక్కన దూరముగా కూర్చొని చేయవచ్చు. కోవిద్ వున్నవాళ్లు ఇవి చేస్తే ఆక్సిజన్ అవసరము రాదు.

10 ) వేడినీళ్లలో గాని,  పాలల్లో గాని పసుపు వేసుకొని త్రాగవద్దు x . ఎందుకు అంటే పసుపు క్రిమి సంహారిణి ,  పసుపుకు తెలియదు ఏది పాజిటివ్ బాక్టీరియా - ఏది  నెగటివ్ బాక్టీరియా అని.  అది రెండిటిపై సమానముగా పనిచేస్తాది కనుక మన శరీరములో ఏ బాక్టీరియా ఎక్కువ, తక్కువలు మనకు తెలియవు కనుక ప్రస్తుతము పసుపు ద్రవముతో లోనికి తీసుకోవడం హానికరం,  పై పూతగా శరీరముపై వాడుకోవచ్చు. 

11 ) బొప్పాయి,  జామ,  ఉసిరి ,  నేరేడు, మొదలగు పళ్ళు  అమృతము. అరటిపండు ప్రస్తుతం మంచిది కాదు , చిన్నపిల్లలకు ఇవ్వకండి, అది అరగపోతే కఫము చేస్తది ,  ఆయాసము అనిపిస్తది .

12 ) చిన్న పిల్లలు birthday స్ లేక మీ  wedding   డే's కు దూరంగా ఉండండి . అప్పుడు మీరు తినే కేక్స్,  జంక్ ఫుడ్స్  ప్రస్తుతం హానికరం,  వినక పోతే మీకు డెత్ డే conform!  

13 ) మిరియాలు, తులసి , అల్లం  ఈ మూడింటిని ఎలా వాడాలో చాల వీడియోస్ లో ఆయుర్వేద వైద్యులు చెప్పారు ఆలా చేయండి. ప్రస్తుతం అది అమృత పానీయం . 

14 ) మన ఇంటిలో కోవిద్ పేషెంట్ ఉంటె ఒకరూములో 

ఉంచాలి,  ఆ  రూముకు వెంటిలేషన్  బాగా ఉండాలి. వెంటిలేషన్ బాగా ఉన్న రూములోనే అతడిని ఉంచాలి.  ఇది కంపల్సరీ గమనించాలి పాటించాలి . 

15 ) అవసరమైతే మనమందరము అతనికోసం  ఓ  మంచి రూమును 15  రోజులు త్యాగంచేయాలి .  అతనికి ఆహారం ఇచ్చేటప్పుడు గాని,  ఇంకేదైనా  అవసరం కోసం అతని రూము తలుపులు తెరిచేటప్పుడు  రూములోని ఫ్యాన్ ను  మొదటగా ఆపి తలుపులు తెరవాలి . 

16 ) ఒకవేళ సపరేట్  రూమ్ లేనప్పుడు అతనిని మనతోటె వుంచుకోవచ్చు,  ఏమి ప్రమాదంకాదు ,  కానీ కోవిద్ ఉన్న వ్యక్తి నిరంతరం N- 95  మాస్క్ ధరించాలి, మరియు ఒక కాటన్ తువ్వాలు ఎప్పుడు అతని భుజం మీద ఉండాలి . రోజుకు  మూడు మాస్క్లు  మార్చాలి. తుమ్మినా,  దగ్గినా ,  మాస్కు మార్చాలి. ఆ  మాస్కును గాని , తువ్వాలును గాని,  అయన వేసుకున్న  బట్టలను గాని  12  గంటలకు  ఒకసారి వేడినీళ్లలో  సర్ఫ్ వేసి కొంచెంసేపు  నానబెట్టాలి.  ఆ తరువాత ఉతికి ఎండలో ఆరబెట్టాలి. వీలైతే ఎవరిపని వల్లే చేసుకుంటే మంచిది. వీలు కానప్పుడు ఎవరైనా జాగ్రత్తగా చేయవచ్చు.

17 ) ఇంట్లో అందరు వంటలు వేడిగా ఉండగానే తినవలెను. 

18 ) కోవిద్ పేషెంట్  నాలుకకు రుచి తెలియనప్పుడు దబ్బ పచ్చడి కొద్దిగా వేడి అన్నం తో తీసుకుంటే బాగుంటాది.

19 ) అసలు ఏమి తినలేనివాడు  రోజు గంటగంటకు ఒక గ్లాసుడు వేడి నీరు,  రెండు టేబుల్ స్పూన్స్ మంచి తేనె ,  ఒక అర ముక్క నిమ్మ రసం మూడు కలుపుకొని తీసుకోవాలి.  అది మీకు చాల శక్తిని ఇస్తుంది, మీరు భోజనం లేకపోయినా నీరసం రాదు. మన పెద్దవాళ్ళు ఉపవాసం రోజు నీరసం రాకుండా ఉండాలని ఈ తేనీరు తాగుతారు . 

20 ) మనకు మన శరీరము చాల మంచి రక్షణ వ్యవస్థ కలిగి వున్నది.  అందులో మొదటిది లాలాజలం,  ఈ లాలాజలాన్ని చాలామంది వివిధ అలవాట్లతో 

స్మోకింగ్దు, panparag,  వాటితో   దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే మనకు హుమ్యూనిటీ  తక్కువ .  ఈ పరిస్థితులలో లాలాజలం చాల అవసరం కనుక,  దానికోసం రోజుకు మూడుసార్లు అంటే మూడుపూటలు ఉసిరిముక్కలను బుగ్గన పెట్టుకొని చప్పరించాలి,  దీనివలన రెండు లాభాలు ఒకటిది లాలాజలం వూరటం, రెండోది విటమిన్ C  రోజుకు మూడుసార్లు  తీసుకున్నట్లు,  ప్రత్యేకముగా విటమిన్ C  టాబ్లెట్స్ అవసరంలేదు. 

21 ) తెల్లవారి  బ్రష్  తరువాత  రెండు  గ్లాసులు వేడి నీళ్లు  

త్రాగండి ,  వేడి అంటే మీరు త్రాగేంత వేడి అన్నమాట ,ఆ  తరువాత తరువన్తో అన్నము లేక చద్దిఅన్నం దానిలో పుల్లటి పెరుగు,  గ్యాస్ ప్రాబ్లెమ్ లేకపోతె నాలుగు చుక్కలు నిమ్మ రసం,  తినగలిగితే ఒక ఒడియం తో టిఫిన్గా తినాలి .  షుగర్ పేషెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎండు కంటే ఇది చద్దిఅన్నంగా  మారినప్పుడు ఇందులో కాలరీస్ తక్కువ,  ఐరన్,  మెగ్నీషియం,  పొటాషియం, జింక్ గా సయోగంమార్పు చెడుతుంది .  అందుకే ఉదయాన్నే ఇది అమృత ఆహారం . 

22 ) toothbrushes  & టంగ్ క్లీనర్స్ ఎవరికీ వారు వేరు వేరుగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఎవరి ప్లేట్ వారిదే,  ఎవరి వాటర్ బాటిల్ వారిది  సపరేట్. ఒకరిది ఇంకొకరు 

వాడకూడదు. 

23 ) మిగతావి  డాక్టర్  చెప్పినవి  పాటించాలి . 

24  ) కోవిద్ వైరస్ జీవిత కాలం 14  రోజులు . మీఇంట్లో  కోవిద్ పేషెంట్ ఉంటే ఈ  14  రోజులు  ఫై జాగ్రత్తలు తీసుకుంటే  మీకు హాస్పటల్  అవసరం రాదు . 

25 ) ప్రతి రెండు గంటలకు ఒకేసారి పల్స్ oximeter  తో చెక్ చేసుకోండి.

కరోన తనంతట తానే తగ్గే వ్యాధి*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*గాభరా పడకండి.....80% మందిలో కరోన తనంతట తానే తగ్గే వ్యాధి*


డా౹౹వేణు గోపాల రెడ్డి


జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, మందులు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని సామెత(మళ్ళీ చదువండి).


ఈ సామెత కరోన కు కూడా వర్తిస్తుంది. *కరోన ఒక సెల్ఫ్ లిమీటింగ్ డిసీస్*

అంటే 80%మందిలో దానంత అదే తగ్గిపోతుంది. 


కరోన వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అనేక అవరోధాలు ఉంటాయి.


వాటిని దాటుకుని వస్తే INNATE IMMUNITY *చతురంగ బలాలు* ద్వారా ఎదుర్కొంటుంది


1. General Barriers

2. Physical Barriers

3. Chemical Barriers

4. Biological Barriers ఈ వైరస్ ని తరిమే పనిలో ఉంటాయి.


ఈ లోగా శరీరంలోని Acquired Immunity ఉత్తేజితం అయి *ద్విముఖ వ్యూహం* ద్వారా

1. Cell mediated immunity (T. Cells)


2. Humoral Immunity (B. Cells)

 ఇందులో భాగంగానే కొన్ని రసాయనాలు, అంటిబాడీస్ ఉత్పత్తి అవుతాయి.


*(ఇమ్మునిటీ అంటే అందరూ అనుకునేట్టు అంటిబొడిఎస్ ఒక్కటే కాదు)*


ఈ యుద్ధం దాదాపు 14 రోజులు నడుస్తోంది. 80% మందిలో ఈ యుద్ధంలో మన ఇమ్మునిటీ గెలిచి వైరస్ ని తరిమేస్తుంది. ఇందుకు అసలు బయట నుండి ఎటువంటి సహయం అవసరం లేదు.


మనం ప్రస్తుతం వాడుతున్న అంటి బియోటిక్స్, విటమిన్స్ ఇతరత్రా మందులన్ని ఈ సమయంలో ఇతర వ్యాధులు రాకుండా, ఇమ్మునిటీ బాగా పనిచేసేందుకు కొంత సహకారాన్ని అందిస్తాయి. అంతకు మించి అవి వైరస్ తో సూటిగా యుద్ధం చేసేవి కాదు.


వైరస్ తో యుద్ధం చేసేది మన ఇమ్మ్యూనిటి మాత్రమే.... అందుకే 80% మందిలో వైరస్ 14 రోజుల్లో తోక ముడుస్తుంది..... అందుకే గాభరా వద్దు....జాగ్రత్తగా ఉండండి....ఎప్పటికప్పుడు వైద్యుల సలహా పాటించండి.

విశ్వామిత్ర

 విశ్వామిత్ర వక ఋషి పేరు. కానీ అది విశ్వ సృష్టికి సంబంధించిన కాంతి లక్షణమని వేదం తెలుపుచున్నది. విశ్వం అన్న పదం సమస్తం అని అది విష్ణు చైతన్య తత్వ మని మనకు తెలియుచున్నది. మిత్ర అనే పదం విశ్వ శక్తి మిత్ర రక్షించుట యని కూడా. మిత్ర పదం సూర్య శక్తి యైన సవితా గాయత్రీ అంశయైన అణు ఆత్మ రూప  మూల శక్తియని గాయత్రీ యనగా సూర్య శక్తి యని అది విశ్వమంతా ఆవహించి వివిధ రూపములుగా వ్యాప్తమైనది. విషు శక్తి విశ్వ వ్యాప్తియని అందుకే విష్ణువని వ్యాప్తమైనది సూర్య శక్తి విష్ణు వేయని. దానిని తెలుసుకొన్న తత్వం విశ్వామిత్ర శబ్ధ లక్షణం. కాంతి యే విశ్వ చైతన్య ప్రకృతి లక్షణమైన ప్రకృతి. దానిని కాపాడితే అందరూ విశ్వామిత్రులే.మనం కూడా సృష్టి చేయుచున్నాము.అఙ్ఞానంతో, కాని ప్రకృతిని రక్షించే సృష్టిని చేయుట లేదు. దానిని నాశనం చేసే లక్షణములు గల సృష్టిని చేయుచున్నాము. అది కూడా పరిశీలన చేసిన మన చేతుల్లోనే వుంది.మనం ఏది కోరితే అదే వస్తోంది. వచ్చిన తరువాత అహం కూడా వస్తోంది, దానితో పాటు. కోరిక విశ్వ వ్యాప్తమైనదియై వుండాలి. వేదం సమస్తం ప్రకృతి ద్వారా సృష్టి దాని పరిణామ క్రమాన్ని క్రమ పద్దతిలో ప్రత్యక్షంగా వివరించినది. అందుకే భిన్న ప్రకృతిని భిన్నమైన మనస్సుతో ఆలోచించుటకు దీనికి మూలకారణం. అందరికీ ప్రకృతి రూప అమ్మ వకటే. కాని విభిన్నమార్గములలో మనం ఆలోచిస్తూ వున్నాము. యిది అమ్మ ౮ి కాదు. సృష్టి చేయుట వరకే తల్లి విధి. యిది తెలియుటయే ఙ్ఞానమని. లేనిది ఎంత చదివినా అఙ్ఞానమే.అహం వదలిన గాని ఙ్ఞానం రాదు.విెశ్వామిత్రునిలాగ.అఙ్ఞానంలో వుందామా ఙ్ఞానంలో వుందామా? దీనినే తమసోమా జ్యోతిః గమయ.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*పునీతమైన ఇల్లు..గ్రామం..*


*(ఇరవై ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటిలో విడిది చేశారు..ఆ రాత్రి గడిచింది..తెల్లవారుఝామునే లేచి ఆ ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరుగసాగారు..దాదాపు ఒక ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణలో ప్రతి మూలా తిరుగుతూ చూస్తున్నారు..తెల్లవారే సరికే..మొగలిచెర్ల గ్రామమంతా వార్త ప్రాకిపోయింది.."శ్రీధరరావు ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు..దిగంబరంగా వున్నాడు.."అంటూ చెప్పుకోసాగారు..


మరి కొద్దిసేపటికే.."ఆ భార్యాభర్తలకు పిచ్చిగానీ పట్టలేదు కదా..ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా?..ఎంత అప్రదిష్ట?.." అని కొందరూ..


"ఏ లంకెబిందెల కోసమో..లేకపోతే నిధుల కోసమో..ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకొచ్చారు..లేకుంటే..ఇలాటి వాడిని ఇంటికి రానిస్తారా?.." అని కొందరూ..


వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు..కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదిలివచ్చింది..సాయంత్రం దాకా తిరునాళ్ళ ను తలపించేలా వచ్చి వెళ్లారు..


ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా..శ్రీధరరావు ప్రభావతి గార్లు చెక్కుచెదరలేదు..వాళ్ళు ఒక ధృడ నిశ్చయానికి వచ్చారు..ఎటువంటి వ్యాఖ్యలకూ స్పందించదలచుకోలేదు.. కొన్ని విషయాలు ఈ దృశ్య జగత్తుకు సంబంధించినవి..అవి కళ్ళకు కనిపిస్తాయి..కానీ..కొన్ని మనసుకు మాత్రమే గోచరం అవుతాయి..అవి దైవప్రేరితాలు..అలా మనసుకు గోచరమైన భావన ను నిజమని విశ్వసించి..అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమ మార్గం..ఆ మార్గం లోనే పయనించాలని శ్రీధరరావు ప్రభావతి గార్లు నిర్ణయం తీసుకొని..దానికే కట్టుబడి వున్నారు..


శ్రీ స్వామివారి గురించి, వీళ్లిద్దరి బంధువర్గం లోనూ కొందరు హేళన తో మాట్లాడటం జరిగింది..అప్పుడూ మౌనంగానే వున్నారు..శ్రీ స్వామివారి తపోసాధనకు కానీ..వారి ఏర్పాట్ల కోసం గానీ..ఏలోటూ రానీయలేదు..


శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకూ కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారం తో ఉండటం..ఆ దంపతులకు పెద్ద ఊరట నిచ్చే విషయం..


చిత్రంగా రెండు మూడు రోజుల్లోనే..పరిస్థితి తారుమారు అయింది..ఎవరైతే హేళన చేసారో..ఎవరైతే అపనమ్మకం తో ఉన్నారో..వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు..శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనబడసాగింది..కొందరు, శ్రీ స్వామివారు తమకు.. "పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి" లాగా కనబడుతున్నారనీ..మరికొందరు..తమకు సాక్షాత్తూ ఆ "పరమ శివుడు" లాగా కనబడుతున్నారనీ..నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు..మరో రెండురోజుల కల్లా.. మొగలిచెర్ల గ్రామం మొత్తం..శ్రీ స్వామివారిని భక్తి పూర్వకంగా కొలవడం ప్రారంభించారు..


మొదట హేళనలూ..తిరస్కారాలూ..చూసి..ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధరరావు ప్రభావతి గార్లకు..తమ జన్మ సార్ధకత చెందిందని..ఆ స్వామి పాదం మోపిన తమ గృహం పావనం అయిందనీ..అనుభూతి చెందసాగారు..తాము ఆ యోగిపుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవం లక్ష్మీనారసింహుడిని ప్రార్ధించారు..


శ్రీ స్వామివారు వరుసగా మూడు రోజులపాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకొని..లోపల ధ్యానం లో మునిగిపోయారు..చిత్రంగా ఆ మూడురోజులూ ఆ యింటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వ్రాలాయి..ఆ యింటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగసాగింది.. ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు గానీ..దంపతులిద్దరూ వద్దని వారించారు..అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది..రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడసాగింది..శ్రీధరరావు గారు, ప్రభావతి గార్లు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటుంటే విన్న సత్యనారాయణమ్మ గారు .."ఒక్కసారి స్వామివారున్న గది వద్దకు తీసుకుపొమ్మని" ప్రభావతి గారిని అడిగారు..ప్రభావతి గారు, ఆవిడను తీసుకొని ఆ గది వద్దకు తీసుకువెళ్లి..కిటికీ లోంచి శ్రీ స్వామివారిని చూపించారు..కొద్దిసేపటికే ఆవిడ ఏదో తెలీని అనుభూతితో.."అమ్మాయీ..ఈయన సామాన్యుడు కాదమ్మా..నాకు బ్రహ్మం గారిలాగా గోచరిస్తున్నారు.." అని నమస్కారం చేసుకున్నారు..


మూడోరోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుండి బైటకు వచ్చారు..ఆరోజు సాయంత్రం మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు..శ్రీ స్వామివారు ఆరుబయట అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చుని..అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు..సర్పం వచ్చిందని చెప్పగానే..శ్రీ స్వామివారు ఒక్కక్షణం కళ్ళుమూసుకుని.."అది దివ్య సర్పం..దానికి హాని తలపెట్టవద్దని..తాను తపస్సులో వున్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందనీ..మాలకొండ లో కూడా ఉండేదని.." చెప్పారు..ఆసరికే గ్రామస్థులలో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి..అందరూ శ్రీ స్వామివారిని దైవస్వరూపుడిగా మనసారా భావించి, కొలవసాగారు..


సాధువు..సన్యాసి..అవధూత..సద్గురువు..ఇలా అన్నీ కలబోసిన ఆ మహాత్ముడు..ఆ విధంగా ఆ దంపతుల జీవనాన్ని మలుపు త్రిప్పడానికి వారింటి లోనే అడుగుపెట్టాడు..


జ్ఞానబోధ..రామకోటి..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

ప్రాముఖ్యతను

 👍👌కింది వాటి యొక్క ప్రాముఖ్యతను నేను ఇప్పుడు నేర్చుకున్నాను:

 * 1. * బాత్‌రూమ్‌లు మరియు మరుగుదొడ్లు * మా ఇళ్ల వెలుపల * ఎందుకు * లోపల * లేవు.

 * 2. * మంగలి దుకాణం లేదా అంత్యక్రియల నుండి తిరిగి వచ్చేటప్పుడు మనం దేనినీ, ఎవరినీ తాకకూడదు.  మీరు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే స్నానం చేసిన తర్వాత * సాధారణ స్థితికి తిరిగి రావచ్చు.

 * 3. * ఫుట్‌వేర్లను ఇంటి వెలుపల ఎందుకు ఉంచారు మరియు లోపల కాదు.

 * 4. * మేము పాఠశాల నుండి తిరిగి వచ్చినప్పుడు లేదా బయట ఆడిన తర్వాత ఎందుకు చేతులు కడుక్కోవాలి.

 * 5. * ఇంట్లో పుట్టినప్పుడు లేదా కుటుంబంలో మరణం ఉన్నప్పుడు తప్పనిసరిగా 10 రోజుల ఐసోలేషన్ / దిగ్బంధం ఎందుకు అవసరం).

 * 6. * ఇంటి లోపల మృతదేహం ఉంటే గృహాలు ఎందుకు ఉడికించకూడదు.

 * 7. * బట్టలు ఉతకడం ఇంటి వెలుపల ఎందుకు జరిగింది.

 * 8. * వంటగదిలోకి ప్రవేశించి వంట చేసే ముందు స్నానం చేయడం ఎందుకు తప్పనిసరి.

 * 9. * ఒకసారి మీరు స్నానం చేసిన తర్వాత, స్నానం చేయాల్సిన వారిని శారీరకంగా తాకకూడదు.


 మన "పాశ్చాత్య విద్య" మన 'ఆధునిక' ప్రపంచంలో అనుసరించడానికి చోటు లేని ఈ విషయాలన్నింటినీ "ఆర్థడాక్స్" గా చూడటానికి మనల్ని కడిగివేసింది.కానీ ఇవి ఇప్పుడు మన రక్షణకు వస్తున్నాయి. శారీరక పరిశుభ్రత, సామాజిక దూరం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం  నవ్వారు, ఎగతాళి చేశారు, అవమానించారు, క్రమపద్ధతిలో.


 మన పూర్వీకులు ఎంత అభివృద్ధి చెందారో ఆలోచించండి మరియు కారణ కారకాలు, శానిటరీ పద్ధతులు మరియు సంక్రమణ నియంత్రణ గురించి వారి జ్ఞానం.


 మన మూలాలకు తిరిగి వెళ్ళే సమయం.🙏💐😷

Jప్రత్యేక పాసుల జారీ.*

 *ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ.*


హైదరాబాద్, మే 11 :: రాష్ట్రంలో రేపటినుండి పదిరోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి తెలియ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు మాత్రమే పాస్ లను జారీ చేస్తారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్ లు జారీ చేస్తారని అన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు.

           లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని  స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడినుండైనా పేర్కొన్నవెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకై దరకాస్తు చేసుకోవాలని తెలిపారు.

-------------------------------------------------------------------------------------------------------------------------

*సీపీఆర్ఓ, డీజీపీ కార్యాలయం చే జారీ చేయనైనది*