12, మే 2021, బుధవారం

భారతీయులం

 *మేమే భారతీయులం..*


*డబ్బు కోసం మానవత్వాన్ని సైతం అమ్ముకొనే వారం. చివరకు విపత్కర పరిస్థితుల్లో కూడా తినే ఆహారం నుంచి, ప్రాణం పోసే వైద్యాన్ని కూడా కాసులుగా మార్చుకొనే అవకాశాన్ని చూసుకొనే కక్కుర్తి గల ఆధునిక భారతీయులం !! మా తప్పును కప్పెట్టి పరాయి దేశాలపై ఏడ్చే పనికిమాలిన వాళ్ళం !!*


*Corona is not killing the people of India. Corrupt Indians, Politicians, Bureaucrats & Technocrats are killing the people in India today !!*


*ఒక కరోనా బెడ్ మీద ఇద్దరిని పెడితే, ఒక మనిషి శవంగా మారాక కూడా, రెండు గంటల పాటు అదే శవంతో పక్కనే పడుకోవడం ఆ రోగికి ఎంత నరకం?*


*₹600 పల్స్ ఆక్సిమీటర్ ను ₹3,000 లకు అమ్మేది తోటి భారతీయుడేగా?*


*కరోనా పేషెంట్ ని రెండుగంటల దూరం ఉన్న హాస్పిటల్ కి చేర్చడానికి లక్ష రూపాయలు ప్రైవేట్ అంబులెన్స్ కి అడిగింది మన భారతీయుడేగా?*


*₹800 రూపాయల రేమిడిసివిర్ ₹40,000 లకు అమ్మేది మన భారతీయుడేగా?*


*₹40 వేలు ఖరీదు చేసే తొసిలిజుమాబ్ ఇంజక్షన్ ₹10,00,000 లకు బ్లాక్ మార్కెట్ చేసేది మన భారతీయుడేగా?*


*రోగుల నిస్సహాయ స్థితిని ఆదాయ వనరుగా చూస్తున్న కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ను నడిపేది మన భారతీయుడేగా?*


*ప్రపంచంలో ఈ టైంలో ఇంత అరాచకం ఎక్కడన్నా ఉందా?*


*మన దగ్గర ఇంత కుళ్ళు పెట్టుకొని, వాడెవడో ఈ వైరస్ కనిపెట్టాడు, వీడేవడో మన దేశాన్ని ఎదో చేయాలనుకుంటున్నాడు? అని వాపోవటం ఎందుకు?*


*ఆ మాటకొస్తే ఈ సెకండ్ వేవ్ ద్వారా మన (దేశ వ్యవస్థ) యొక్క డొల్లతనం బయటపడింది !! పొరుగు దేశాల యొక్క ఉదారస్వభావం పతాకస్థాయికి చేరింది !!*


*దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ వారు పుట్టిన భూమిలో పుట్టిన మనం ఊరికే మన దేశం గూర్చి గొప్పలు చెప్పుకుంటూ పైపైన పొంగిపోకుండా నిజాయితీగా మన లంచగొండి తనాన్ని, అక్రమ విధానాలను, చేతకాని తనాన్ని ఒప్పుకుంటూ కనీసం భవిష్యత్తులో అయినా ఇటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి నుండి బయటపడే విధానాలను/బయటపెట్టే వ్యక్తులను సిద్దం చేద్దాం !!*


*మనలో మార్పు రానంత వరకు, వ్యవస్థల్లో మార్పురాదు, మన దేశం మారదు !!*

కామెంట్‌లు లేవు: