12, జూన్ 2024, బుధవారం

నక్షత్రాలు

 నక్షత్రాలు  -  రెమిడిలు .


   ప్రతి నక్షత్రం లో పుట్టిన జాతకుడు కొన్ని దానాలు చేయడం వలన ఆ జాతకుడి భవిష్యత్తు ఆనందకరం గా ఉంటుంది. అలాగే హొమాలు , జపాలు చేయించుకోవలసి ఉంటుంది. అవి చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి .అలా చేయించుకోలేని వారి కోసం తంత్ర శాస్త్రం ప్రకారం ఈ రెమిడిస్ చెప్పటం జరిగింది. వీటిని పాటించి సంతొషం గా ఉండగలరు అని భావిస్తూ ...వెంకటేశ్వరరావు. కాళహస్తి.


 అశ్వని - 

 

 * రెమిడి - 


  వాయువ్యం లో గుఱ్ఱపు బొమ్మ లొహం తో చేసినది పెట్టండి.


 భరణి - 


*  రెమిడి - 


  ఏ పప్పుతో అయినా పంచదార వేసి         " పూర్ణం " తయారు చేసి లక్ష్మీ దేవి కి నైవేద్యం పెట్టి తినాలి . భార్యకు తినిపించాలి.


కృత్తిక - 

 

  * రెమిడి - 


  తెల్లని పువ్వులు దేవాలయం లొ దానం ఇవ్వాలి . వేదజ్ఞుల ఆశీర్వాదం తీసుకోవాలి .కుల పురోహితుడి ఆశీర్వాదం తీసుకోవాలి .


 రోహిణి - 

 

  * రెమిడి - 

 

 ఆవులకు ఆహారం తినిపించాలి. తెల్లటి ఎద్దును శివాలయం పుజించాలి. దానికి ఆహరం తినిపించాలి.


 మృగశిర - 

 

  * రెమిడి - 


  * అమ్మ వారికి యలుకులతో పుజ చేయించండి .


  * అమ్మ వారి ఆలయం లో ఎర్రని బావంచాలు దానం చేయండి .


  * పళ్ళు ఆలయం లో దానం చేయండి .

 

  * సంగీతజ్ఞుల ఆశీర్వాదం తీసుకొండి.

 

  * పోస్ట్ మాన్ కు బట్టలు పెట్టండి.


 ఆర్ద్ర -


 రెమిడి - 


  * జంతువధ నిరోధానికి తోడ్పడండి.

 

  * రెండు పప్పు దినుసులు కలిసి ఆహారంగా ఉపయోగించండి.


   * దొంగలని పట్టించండి. లేదా పట్టుకోవడానికి సహాయపడండి 


 పునర్వసు - 


 రెమిడి - 


   * మేలి రకం బియ్యం మీ ఊరిలో గాని దగ్గరలో గాని పడమర దిశగా ఉన్న శివాలయం లొ దానం ఇవ్వండి.

 

 పుష్యమి - 


 రెమిడి - 

 

  * బార్లి, గోధుమలు, బియ్యం , చెరుకు వీటిలో ఏ వస్తువు అయినా సరే యజ్ఞాలు  చేసే వారికి అయినా సత్ప్రవర్తన కలిగిన వారికి ఎవరికి అయినా శివాలయం లో దానం ఇవ్వండి.


 ఆశ్రేష - 

 

 రెమిడి - 

 

  * దుంప జాతి ఆహారాలను దానం ఇవ్వండి.

 

  * పాము బొమ్మ చిన్నది  సీసం తో చేయించి చెరువులో లేదా నుతిలో లేదా నదిలో వేయండి .


  * వైద్యులని సన్మానించండి .


 మఖ - 


 రెమిడి - 


  * మాత,పితలను సేవించే వారిని వెతికి ఆశీర్వాదం పొందండి.


  * కొండపై వెలసిన దైవ సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకొండి.


 పుబ్బ - 


 రెమిడి - 


  * నట, సంగీత ,కళాకారులను గౌరవించండి .


  * తేనే దానం ఇవ్వండి.


 ఉత్తర - 


 రెమిడి - 

 

 * ఉత్తమ ధాన్యము ను  సత్ప్రవర్తన గలవారికి దానం చేయండి .


 హస్త - 


 రెమిడి - 

 

 * వెండి ఏనుగు బొమ్మ లేక గణపతి విగ్రహం వేద పండితునికి దానం చేయండి .


  * వేద పండితుల శిష్యరికం చేయండి .


 చిత్త - 


 రెమిడి - 


  * యాలుకలు, కస్తూరి, లవంగాలు, పునుగు, జవ్వాది ఇవన్ని ఎర్ర వస్త్రం లొ కట్టి దానం ఇవ్వండి.

 

 * చేనేత వస్త్రం నేసేవారికి బహుకరించండి.


  * చనిపొయిన తరువాత నేత్ర దానం చేసేలా వీలునామా రాయండి.


 స్వాతి - 


 రెమిడి - 

 

  * 2 కిలొల శనగ పప్పు దైవ ధ్యాసలో గడిపే వారికి దానం చేయండి .

 

 విశాఖ - 


 రెమిడి - 


  * ఉత్తర దిశలొ పై మొక్కలు పెంచండి.


  * శనగలు దానం ఇవ్వండి.


 అనురాధ - 


 రెమిడి - 

 

 *  బియ్యం , కొబ్బరి, ఖర్జూరం , బెల్లం ఇవన్ని మిశ్రమం తయారు చేసి దానం ఇవ్వండి.


 జ్యేష్ట - 


 రెమిడి - 

 

 * కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానం చేయండి .

 

 మూల - 


 రెమిడి - 


  * పేదలకి ఉచితం గా వైద్యం చేయడానికి ఆయుర్వేదిక్ వైద్యునికి మందుల డబ్బులు ఇచ్చిరండి.


 పుర్వాషాడ - 


 రెమిడి - 


  * ఏనుగులకు అరటిపళ్ళు తినిపించడానికి మావటి వాళ్లకు ఇచ్చి దగ్గర ఉండి తినిపించండి.


 శ్రవణం - 


 రెమిడి -


  * శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి వెళ్లి విష్ణు దర్శనం , విష్ణు భక్తుల దర్శనం చేసుకు రండి.


 ధనిష్ట - 


 రెమిడి - 

 

  * గొధుములు పుణ్యాత్ములకు శివాలయం లొ దానం చేయండి .


 శతబిషం - 


 రెమిడి - 

 

 * కొంత మద్యాన్ని నీటిలో ప్రవహింప జేయండి .


 పుర్వాబాధ్ర -


 రెమిడి - 

 

  * కొంత నెయ్యి ఒంటరిగా జీవించే సత్పురుషులకి ఇచ్చి రండి.


ఉత్తరాబాధ్ర -


 రెమిడి - 

 

 * కోవాను ప్రత్యేకం గా తయారు చేయించి 8 మంది వృద్ద  బ్రాహ్మణులకు  శివాలయం లో  దానం ఇవ్వండి.


 రేవతి - 


 రెమిడి - 

 

 * పద్మములు , సువాసన గల పుష్పాలు , యలుకులు, కస్తూరి , పునుగు , జువ్వాది ఇవన్ని ప్యాకింగ్ తయారు చేసి శివాలయం లో  దానం చేయండి .  


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag


 

మంచితనం

 *మన మంచితనం *మనల్ని కాపాడుతుంది.* అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.


ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. ‘మనం కూడా ఇలా చేయాలి’ అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ‘మనం ఎలాగూ పూజ చేయలేము, ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం’ అని అనుకున్నాడు.

కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.

అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగుపాము ఒకటి అందులో ఉన్నది. ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో… “అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు.

ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక తులసి దళాలతో నాగు పాము ఉండడం గమనించాడు. అతడితో … “నాయనా నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు!” అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.


రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావువని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి “నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత. కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను.” అని అన్నాడు.

ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ‘ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?’ అని అడిగినప్పుడు రాహువు…అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు” అని రాహువు చెప్పగానే …బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా “అతడికి దానం ఇస్తున్నాను” అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైంది


ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా?

ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ? దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా?

బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి “ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి!” అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు

ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి మిత్రులారా! 


సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

బిల్వాష్టకం

 బిల్వాష్టకం!!


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః

తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం


కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః

కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం


కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం

ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం


ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః

నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం


రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా

తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం


అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం

కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం


ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ

భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం


సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః

యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం


దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ

కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం


బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం

అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం


సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే

అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం


అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా

అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం


బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం!


ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

శ్రీమద్భాగవత విశిష్టత

 శ్రీమద్భాగవత విశిష్టత  !!    


భాగవతంలోని అంశాలు - ప్రత్యేకత 


    శ్రీమద్భాగవతం ఇతర పురాణాలకంటే విశిష్టమైనది. 

    ఇతర పురాణాలలో ప్రధానంగా, 

1. సర్గము, 

2. ప్రతి సర్గము, 

3. వంశము, 

4. మన్వంతరములు, 

5. వంశానుచరితము - అనే ఐదే అంశాలు ఉంటాయి. 


    అయితే, శ్రీమద్భాగవతంలో అలా కాక పది అంశాలుంటాయి. 


శ్లో॥ 

అత్ర సర్గోవిసర్గశ్చ స్థానం పోషణ మూతయః I 

మన్వంతరేశాను కథాః నిరోధోముక్తిరాశ్రయః ॥ 


ఆ పది అంశాలు 


1. సర్గము : ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అనేవి పంచభూతాలు. 

    శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేవి పంచతన్మాత్రలు. 

    వాక్, పాణి, పాద, పాయు అవస్థలనేవి కర్మేంద్రియాలు. 

    త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలనేవి జ్ఞానేంద్రియాలు. 

    మనోఽహంకార చిత్తాలతో కూడిన ఇవన్నీ ఏర్పడిన విధానాన్ని నిర్ణయించడమే సర్గము. 

2. విసర్గము : సత్త్వరజస్తమో గుణాలనే ప్రకృతి ధర్మాలతో పరమాత్మ భిన్నభిన్న స్వరూపాన్ని వర్ణించడం. 

3. స్థానం : వైకుంఠుడైన పరమాత్మ సర్వులనూ జయించి సర్వోత్కర్షగా ప్రకాశించినట్లు వర్ణించడం. 

4. పోషణం : పరమాత్మ అనుగ్రహాన్ని వర్ణించడం. 

5. ఊతులు : ఆయాకర్మ వాసనలు ఎల్లా ప్రభావం చూపెడతాయో వర్ణించడం. 

6. మన్వంతరము : సజ్జనులుండవలసిన విధానాన్ని వర్ణించడం. 

7. ఈశాను కథలు : పరమాత్మా, ఆయనకు అనుయాయులైన విశిష్ట భక్తులూ అవతరించి చేసిన ఘనకార్యాలని వర్ణించడం. 

8. నిరోధము : పరమాత్మ తన శక్తులతో నిద్రాముద్ర వహించడాన్ని వర్ణించడం. 

9. ముక్తి : శరీదాది ఇతర స్వరూపం తనది కాదనీ, తాను కేవలం ఆత్మననీ గ్రహించడం. 

    శరీరాదులయందు "నేను" అను భ్రమను తొలగించుకొని స్వస్వరూపంతో ఉండడమే ముక్తి. 

10. ఆశ్రయం : ఎవరి నుండీ, 

                       ఎవరి యందే, 

                       ఎవరి వలననే, 

    ఈ జగత్తుకు సృష్టి, 

                        స్థితి, 

                        లయాలు ఏర్పడుతున్నాయో, అలాంటి పరమాత్మే ఆశ్రయము. 


*  భాగవతాన్ని ఆశ్రయించి లబ్ధి పొందడమే జీవిత గమ్యం - అని వ్యాసమహర్షి అందిచ్చిన అద్భుత గ్రంథం భాగవతం. 

*  తెలుగువారికి పోతనామాత్యులవారు అందిచ్చిన భాగవతం, మరింత సులువుగా భక్తి జ్ఞాన వైరాగ్యాలని అందించడానికి, సాక్షాత్తూ శ్రీరామచంద్రుని అనుగ్రహం.!!

* 🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శరణము దైవమే!


శరణము దైవమే!


"గురుడుగురుండు,వాలుశతకోటి,సుపర్వులువాహినీపతుల్,/సురభవనంబుకోట,మధుసూదనుడుంసైదోడు,దంతిది/క్కరపతి ,కాగనోడడె,సురేంద్రుడు;దాయలచేతనాజిలో,/ "శరణముదైవమే!పురుషశక్తి నిరర్ధకమెన్ని భంగులన్;"-

              --భర్తృహరి సుభాషితం!


     ఎన్ని సాధనసంపత్తులుంటే ఏమిటి?దైవశక్తిలేకపోతే అవన్నీ వృధా !

              దేవేంద్రుడు మహాబలవంతుడు.అతనిసాధనసంపత్తియా అనన్యసామాన్యం!

      "కష్టంవస్తే మంచి సలహాలుచెప్పటానికొకరుకావాలి.ఆయనకోగురువుగారున్నారు.ఆయనేగురువు(బృహస్పతి)ఆయనసలహాలుకూడా పనిచేయలే,దానవులతోయుద్దంజరిగినపుడు.(జాతకంలో గురుగ్రహం ఉఛ్ఛదశలోఉంటే ఆవ్యక్తికింకతిరుగుండదు.అలాఉన్నాయిక్కడ పరిస్థితివేరైనది)

        చేతనున్నఆయుధమా,అరిభంజకమైన వజ్రాయుధం.దానికి నూరంచులు.అంటే ఒక్కవేటుకు నూరుగురు ఠా!!

            సైనికులా అమృతపానంచేసినబలిష్ఠులు.వారుసేనానులు.

        అందరకీ అందరాని ఆకాశంలో కోట.ఆదుర్గంలోపలరాజధాని అమరావతి.

        అవసరపడితే సాయపడటానికి చక్రధారి సోదరున్నాడు.

       పట్టపుటేనుగా ఐరావతం.దిగ్గజం.

      ఇన్నిసాధనసంపత్తులున్నా,దేవేంద్రుడు దానవులచేతినోడి యడవులపాలవలేదా?

     అందుచేత దైవమనుకూలింపకున్న, మనసాధనసంపత్తులన్నియు వ్యర్థమే!

          "దైవమేదిక్కని మొక్కుటదప్ప కరోనా బారినుండి తప్పించుటకు వేరుపాయము పూజ్యమే!


        మిత్రులారా! మీమీయిష్టదైవములను ప్రార్ధించండి .మనసా వాచా కర్మణా .సత్కార్యములను చేయండి.మీపరిసరాలలోని దీనులను కాపాడండి.అసేవలే దైవప్రీతికి మూలమై మనలనందర రక్షింపగలవు.


లో కాః స మ స్తాః

 సు ఖి నో భ వ న్తు!!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ధన్యుడు

 ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్

నొప్పింపక తానొవ్వక

తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.


భావము : ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొని అప్పటికది మాట్లాడి తాను బాధపడకుండా, ఇతరులను బాధించకుండా తప్పించుకొని తిరిగేవాడే ఈ లోకంలో ధన్యుడు. 

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🪷 *బుధవారం*🪷

  🌷 *జూన్ 12, 2024*🌷

     *దృగ్గణిత పంచాంగం*                 

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*జ్యేష్ఠమాసం - శుక్లపక్షం*

*తిథి : షష్ఠి* రా 07.16 వరకు ఉపరి *సప్తమి*

వారం :*బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : మఖ* రా 02.12 వరకు ఉపరి *పుబ్బ*

*యోగం : హర్షణ* సా 05.16 వరకు ఉపరి *వజ్ర*

*కరణం   : కౌలువ* ఉ 06.17 *తైతుల* రా 07.16 ఉపర *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 11.00  సా 04.00 - 05.00*

అమృత కాలం :*రా 11.33 - 01.19*

అభిజిత్ కాలం :*ఈరోజు లేదు*

*వర్జ్యం* : *మ 12.55 - 02.42*

*దుర్ముహుర్తం : ప 11.41 - 12.34*

*రాహు కాలం : మ 12.07 - 01.46*

గుళిక కాలం     : ఉ 10.29 - 12.07

యమ గండం :*ఉ 07.13 - 08.51*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 05.34* 

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల :‌*ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.34 - 08.12*

సంగవ కాలం :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం :*10.49 - 01.26*

అపరాహ్న కాలం :*మ 01.26 - 04.03*

*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ శుద్ధ షష్ఠి*

సాయంకాలం :*సా 04.03 - 06.40*

ప్రదోష కాలం :*సా 06.40 - 08.51*

నిశీధి కాలం :*రా 11.46 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

______________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🪷 *సరస్వతీ అష్టకమ్*🪷


*యాక్షీరస్ఫతికేందు శంఖధవళా, యా శ్వేత వస్త్రాన్వితా*


*యా వీణాంకుశ పాశపుస్తకధరా, యాచేంద్ర నీలాకలా*


*యా రాకాశశిబింబ రమ్యవదనా, యా నేత్ర పద్మోజ్వలా*


*సాపుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ*🙏


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

విశ్వ మహా విద్యాలయం

 *శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహా విద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ). కాంచీపురం.*


23 జూన్ తేదీన  

నిజామాబాదులోని స్థానిక గంగాస్థాన్ ఫేస్ 2, 


ఉత్తర తిరుపతి క్షేత్రం, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చినంద స్వామీజీవారి ఆశ్రమంలో


ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 


యూనివర్సిటీ వారి 

స్పాట్ కౌన్సిలింగ్ జరుగును. 


కావున ఈ సమాచారం మీ తోటి విద్యార్థిని విద్యార్థుల కు పంపించగలరు. 


కంచి యూనివర్సిటీ లో

డోనేషన్లు లేవు, 

ముందు చెల్లింపు గా భారీ డిపాజిట్లు లేవు.

మేనేజ్మెంట్ కోటా సీట్లు లేవు.


ఇంటర్మీడియట్ లో మేథ్స్ కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ - ఈ సబ్జెక్ట్ లలో రెండేళ్ల మార్కుల ఆధారంగా మరియు డిగ్రీ 

*మెరిట్* ను గౌరవిస్తూ 

స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇవ్వబడును‌.‌

మార్కుల ఆధారంగా మాత్రమే 


మెరిట్ స్కాలర్షిప్ లు కలవు,


చక్కని హాస్టల్ వసతులు..


ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ/శిక్షణ.


అన్ని కోర్సులు అందుబాటులో..( ENGINEERING, BBA, BCA, MBA, MCA, B.Ed)

 మరియు 

 Data science and Artificial intelligence technology courses  కి సంబంధించి ట్రైనింగ్ అడిషనల్ డిగ్రీ సర్టిఫికేషన్ (free of cost) ఇవ్వబడును 


ఎక్స్పీరియన్స్డ్ ఫాకల్టీ 


ఉన్నత ప్రమాణాల్తో కూడిన

లైబ్రరీ, లేబరటరీ


95 శాతం క్యాంపస్ సెలక్షన్స్ 


- అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి*


*ఇటువంటి సదవకాశం మీరు పొందడమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి*. ఈ క్రింద తెలియ బరచిన మొబైల్ నంబర్ లను సంప్రదించి మీ రిజిస్ట్రేషన్ లను 16 జూన్ లోపు చేసుకో గలరు. 


*మరిన్ని వివరాలకు*...

కుప్ప జగన్నాథ శర్మ  - 98496 58030           


రవి చంద్ర.  -    9866765439             


శ్రీపాద ఫణి చక్రవర్తి-  9848071008     


గోపాలకృష్ణ శర్మ- 9440473706.        


ధారా చంద్రశేఖర్, ప్రజ్ఞా భారతి, - 94900 06800, 83284 09111


పి రవి కుమార్ - 98482 75028 


నోట్ : 23 జూన్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కు హాజరు అయ్యే విద్యార్థులకు మరియు తల్లి తండ్రులకు భోజన వసతి ఏర్పాటు ఉండును,  ఇట్టి మహత్తర కార్యక్రమ ఏర్పాటుకు  ఉత్తర తిరుపతి క్షేత్రం, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి  ఆశ్రమంలోని, యాజమాన్య సంపూర్ణ సహాయ సహకారాలతో నిర్వహించడమైనది


కావున అధిక సంఖ్యలో అర్హతగాల విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొల్సినదిగా మనవి


విద్యార్థులతోపాటు వచ్చే వారి పేరెంట్స్/గార్డియన్స్ సంఖ్య  వివరాలు తెలిపితే తగిన ఏర్పాట్లు చేయబడును

దేవాలయాభివృధ్ధిలో

 *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూర్తయేనమః*

కనీసం *11₹* పంపి దేవాలయాభివృధ్ధిలో పాలుపంచుకోండి.

 రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో ప్రతిష్ఠించబడిన మన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పూర్వపు అభీష్ట గణపతి ఆలయంతో స్లాబ్ కలపకపోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం క్రుంగుతోంది. ఆర్థిక వనరులు సరిపడకపోవడంతో పునాది మాత్రమే కలిపి నిర్మాణం పూర్తిచేసి ప్రతిష్ఠా మహోత్సవం పూర్తి నిర్వహించాము. కానీ ఇప్పుడు స్లాబ్ భాగం కూడా సాధ్యమైనంత త్వరలోనే కలిపి రెండు ఆలయాలకు శిఖర నిర్మాణాలు చేయడానికి సంకల్పం చేసాము. తద్వారా దేవాలయం పటిష్ఠమై వర్ధిల్లగలదు. దయచేసి భక్తులు యధాశక్తి ఆర్థిక సహాయం చేయగలరని ఆకాంక్షించడమైనది.

*ఈ నిర్మాణం కొరకై ప్రతీ భక్తుడు కనీసం 11₹ పంపి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పిలుపునిచ్చుచున్నాము.*

ఈ దేవాలయంలో నిత్యాభిషేకాద్యర్చనలతో బాటుగా *ప్రతీ పున్నమికి గోమయపు ప్రమిదలలో "సంధ్యాదీపోత్సవం",ప్రతీ సంకష్టహర చతుర్థి నాడు "పల్లకి సేవ" ,ప్రతీ మాస శివరాత్రికి "మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం" నిర్వహించబడుచున్నాయి.* ఇవియేకాక నిత్య వేదపారాయణం మరియు అనేక వైదిక క్రతువులు కూడా నిర్వహించబడుతున్నాయి. 

ప్రతి ఒక్కరూ కూడా ఒక్క *11₹* చొప్పున పంపి ఈ మహాకార్యంలో భాగస్వామ్యం తీసుకుని మన దేవాలయ అభివృద్ధి కి సహకరించగలరని ఆకాంక్షిస్తున్నాము.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

*ABHEESTA GANAPATHI ALAYA TRUST*

మా గూగుల్ పే/ఫోన్ పే/UPI and WhatsApp number 9492050200 on the name of K.Srinivasa Sarma, FPCA of the trust.


*A/C No: 011712010001038*

*IFSC : UBIN0801178* 

*Devi Chowk Branch, Rajamahendravaram*.

దయచేసి విరాళాలు పంపిన వారు UPIరసీదు సాఫ్ట్ కాపీని మాకు వాట్సాప్ చేయగలరు.

భగవంతుని సేవకే

 *శరీరంలోని అవయవాలనన్నీ భగవంతుని సేవకే వినియోగించాలి* 


మీ మనస్సులో భగవంతుని రూపాన్ని నిత్యం ధ్యానించండి. మీ నోటితో భగవంతుని నామమును జపించాలి, మీ శరీరముతో భగవంతుని సేవ చేయాలి.   భగవంతుని సేవలో మీ మనసు, వాక్కు, నాయనాలు వినియోగిస్తే తన్మయత్వం అవుతావు.   శంకరులు ఒకచోట కూడా ఇదే విషయాన్ని చెప్పారు . 


 *సర రసన దే నయనే దవేవ                   కరేల స ఏవ కృతకృత్య: ఐ*                         

 *యా యే యేల యో పర్గం వడ్తీక్షేదే సతార్చదా: స్మ్రతి II* అని చెప్పారు. 

  “నాలుక అంటే ఏమిటి?   భగవంతుని నామాన్ని ఉచ్చరించేది నాలుక.   భగవంతుని నామాన్ని ఉచ్చరించకుండా అయాచిత మాటలు మాట్లాడే నాలుక కాదు.ఇది పనికిరానిది. కన్ను అంటే ఏమిటి?   భగవంతుని సన్నిధిలో ఏ కన్నుతో స్వామిని దర్శించగలమో ఆ నేత్రమే నేత్రము. లేకపోతే కన్ను ఎందుకు?   చేయి అంటే భగవంతుడిని పూజించే హస్తం ఆ చేత్తో నిత్యం పూజ చేయకపోతే ఏ హస్తం ఇంకెందుకు? అందుకే భగవంతుడు మనకు ఈ దేహంలో ప్రసాదించిన ప్రతి  అవయవము  ఇది ఇందులకే అని చెప్పక తప్పదు.   మన సమస్త దేహేంద్రియాలు కూడా భగవంతుని సేవలో పంచిపెట్టబడతాయి, అప్పుడే మన దేహం, జన్మ పరిపూర్ణం అవుతాయి.   అందుచేత భగవంతుడిని ఎన్నటికీ మరచిపోకండి.  మీ మనస్సులో నిత్యం భగవంతుని స్వరూపాన్ని ధ్యానించండి" అని భగవత్పాదులు తన స్తోత్ర సాహిత్యంలో చాలా అందంగా వ్యక్తపరిచారు.  మనమంతా ఆయన స్తోత్రాలు నిత్యం చదవాలి. వారు చెప్పినవానిని సరిగ్గా అర్థం చేసుకోవడం, వాని ప్రకారం మన జీవితాన్ని స్వంతం చేసుకోవడం అత్యంత అవశ్యం.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

వేద ఆశీర్వచనం


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ షష్ఠి  - మఘ -‌‌  సౌమ్య వాసరే* (12.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పుణ్యాన్ని ఇస్తుంది

 శ్లోకం:☝️

*సతాం హి దర్శనం పుణ్యం*

 *తీర్థభూతాశ్చ సజ్జనాః ।*

*కాలేన ఫలతే తీర్థం*

 *సద్యః సజ్జనసంగతిః ॥*


భావం: సత్పురుషుల దర్శనం పుణ్యాన్ని ఇస్తుంది. వారు పుణ్యక్షేత్రాల వంటివారు. పుణ్యక్షేత్రాలు కొంతకాలం తర్వాత ఫలితాన్నిస్తాయి, కానీ సత్పురుషుల దర్శనం తక్షణమే ఫలితాన్ని ఇస్తుంది.🙏

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యావందనం

 మరియు ఇతర

 పూజాకార్యక్రమాల 

సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 12.06.2024

బుధ వారం (సౌమ్య వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే శుక్ల పక్షే షష్ఠ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే  శుక్ల పక్షే షష్ఠ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.30

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

శుక్ల పక్షం

షష్ఠి రా. 7.06 వరకు. 

బుధ వారం. 

నక్షత్రం మఘ రా.తె.2.25 వరకు.

అమృతం రా.11.48 ల  1.32 వరకు. 

దుర్ముహూర్తం  ప.11.33 ల 12.25 వరకు.

వర్జ్యం మ.1.21 ల 3.05 వరకు.

యోగం హర్షణం సా. 6.08 వరకు. 

కరణం కౌలవ ఉ. 6.15 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ప. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

***********   

పుణ్యతిధి జ్యేష్ఠ శుద్ధ షష్ఠి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

సమస్య పూరణ

 *ద్వేషము హెచ్చినన్ గలుగు దేశపు సుస్థిర శాంతి సౌఖ్యముల్*

ఈ సమస్యకు  పూరణ. 



దోషములెన్నొ సల్పుచును దోహద మెంచక కీడు నెంచగా


రోషము పెచ్చరిల్లు గద  రుద్దిన కక్షలు తోటివారిపై


ద్వేషము హెచ్చినన్-గలుగు దేశపు సుస్థిర శాంతి సౌఖ్యముల్ 


యాషలు వీడి బంధముల కాదరణంబులు పెంచుచుండినన్. 


(యాష =హింస) 


అల్వాల లక్ష్మణ మూర్తి.

సృష్టి_రహస్య_విశేషాలు

 #సృష్టి_రహస్య_విశేషాలు..


1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది

2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది

3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి

( సృష్ఠి )  ఆవిర్బావము.

1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది

2  శివం యందు  శక్తి

3  శక్తి యందు నాధం

4  నాధం యందు బిందువు

5  బిందువు యందు సదాశివం

6  సదాశివం యందు మహేశ్వరం

7  మహేశ్వరం యందు ఈశ్వరం

8  ఈశ్వరం యందు రుద్రుడు

9  రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11  బ్రహ్మ యందు ఆత్మ

12  ఆత్మ యందు దహరాకాశం

13  దహరాకాశం యందు వాయువు

14  వాయువు యందు అగ్ని

15  ఆగ్ని యందు జలం

16  జలం యందు పృథ్వీ. 

17. పృథ్వీ యందు ఓషధులు

18. ఓషదుల వలన అన్నం

19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.

( సృష్ఠి ) కాల చక్రం.

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు  

ఎంతోమంది విష్ణువులు  

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.

1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం

నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.

ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 

శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు  3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం.  2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు

పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.

సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1  సత్వ గుణం 

2  రజో గుణం

3  తమో గుణం

( పంచ భూతంలు ఆవిర్భావం )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.

5  ఙ్ఞానేంద్రియంలు

5  పంచ ప్రాణంలు

5  పంచ తన్మాత్రలు

5  ఆంతర ఇంద్రియంలు

5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

1  ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )

జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )

భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )

భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.

( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు

1  శబ్ద

2  స్పర్ష

3  రూప

4  రస

5  గంధంలు.

5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు

2  చర్మం

3  కండ్లు

4  నాలుక

5  ముక్కు

5  ( పంచ ప్రాణంలు )

1  అపాన 

2  సామనా

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )

1  మనస్సు

3  బుద్ది

3  చిత్తం

4  జ్ఞానం

5  ఆహంకారం

1  వాక్కు

2  పాని

3  పాదం

4  గుహ్యం

5  గుదం

6  (  అరిషడ్వర్గంలు  )

1  కామం

3  క్రోదం

3  మోహం

4  లోభం

5  మదం

6  మాత్సర్యం

3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం

2  సూక్ష్మ  శరీరం

3  కారణ  శరీరం

3  (  అవస్తలు  )

1  జాగ్రదావస్త

2  స్వప్నావస్త

3  సుషుప్తి అవస్త

6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట

2  పుట్టుట

3  పెరుగుట

4  పరినమించుట

5  క్షిణించుట

6  నశించుట

6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి

2  దప్పిక

3  శోకం

4  మోహం

5  జర

6  మరణం

.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం

2  రక్తం

3  మాంసం

4  మేదస్సు

5  మజ్జ

6  ఎముకలు

7  శుక్లం

3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు

2  తైజుడు

3  ప్రఙ్ఞుడు

3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు

2  అగామి  కర్మలు

3  సంచిత  కర్మలు

5  (  కర్మలు  )

1  వచన

2  ఆదాన

3  గమన

4  విస్తర

5  ఆనంద

3  (  గుణంలు  )

1  సత్వ గుణం

2  రజో గుణం

3  తమో గుణం

9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప

2  అధ్యాసాయం

3  ఆభిమానం

4  అవధరణ

5  ముదిత

6  కరుణ

7  మైత్రి

8  ఉపేక్ష

9  తితిక్ష

10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )

      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం

2  వాయువు

3  ఆగ్ని

4  జలం

5  భూమి


14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు

2  వాయువు

3  సూర్యుడు

4  వరుణుడు

5  అశ్వీని దేవతలు

6  ఆగ్ని

7  ఇంద్రుడు

8  ఉపేంద్రుడు

9  మృత్యువు

10  చంద్రుడు

11  చతర్వకుడు

12  రుద్రుడు

13  క్షేత్రజ్ఞుడు

14  ఈశానుడు


10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి

2  పింగళ

3  సుషుమ్నా

4  గాందారి

5  పమశ్వని

6  పూష

7  అలంబన

8  హస్తి

9  శంఖిని

10  కూహు

11  బ్రహ్మనాడీ

10  (  వాయువులు  )

1  అపాన

2  సమాన

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

6  కూర్మ

7  కృకర

8  నాగ

9  దేవదత్త

10  ధనంజమ

7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార

2  స్వాదిస్థాన

3  మణిపూరక

4  అనాహత

5  విశుద్ది

6  ఆఙ్ఞా

7  సహస్రారం


(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగుళంలు

8  జానల పోడవు

4  జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62  కీల్లు

37  ముారల ప్రేగులు

1  సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4  సేర్లు మాంసం

1  సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం

(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7

1  భూలోకం  -  పాదాల్లో

2  భూవర్లలోకం  -  హృదయంలో

3  సువర్లలోకం  -  నాభీలో

4  మహర్లలోకం  -  మర్మాంగంలో

5  జనలోకం  -  కంఠంలో

6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో


అధోలోకాలు  7

1  ఆతలం  -  అరికాల్లలో

2  వితలం  -  గోర్లలో

3  సుతలం  -  మడమల్లో

4  తలాతలం  -  పిక్కల్లో

5  రసాతలం  -  మొకాల్లలో

6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం  -  పాయువుల్లో


(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం

2  ఇక్షి సముద్రం  -  చెమట

3  సూర సముద్రం  -  ఇంద్రియం

4  సర్పి సముద్రం  -  దోషితం

5  దది సముద్రం  -  శ్లేషం

6  క్షీర సముద్రం  -  జోల్లు

7  శుద్దోక సముద్రం  -  కన్నీరు


(  పంచాగ్నులు  )

1  కాలాగ్ని  -  పాదాల్లో

2  క్షుదాగ్ని  -  నాభిలో

3  శీతాగ్ని  -  హృదయంలో

4  కోపాగ్ని  -  నేత్రంలో

5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో


7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబుా ద్వీపం  -  తలలోన

2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన

3  శాక ద్వీపం  -  శిరస్సుపైన

4  శాల్మల ధ్వీపం  -  చర్మంన

5  పూష్కార ద్వీపం  -  గోలమందు

6  కూశ ద్వీపం  -  మాంసంలో

7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో


10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం

2  భేరి  -  నాధం

3  చణీ  -  నాధం

4  మృదంగ  -  నాధం

5  ఘాంట  -  నాధం

6  కీలకిణీ  -  నాధం

7  కళ  -  నాధం

8  వేణు  -  నాధం

9  బ్రమణ  -  నాధం

10  ప్రణవ  -  నాధం.


🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩