నక్షత్రాలు - రెమిడిలు .
ప్రతి నక్షత్రం లో పుట్టిన జాతకుడు కొన్ని దానాలు చేయడం వలన ఆ జాతకుడి భవిష్యత్తు ఆనందకరం గా ఉంటుంది. అలాగే హొమాలు , జపాలు చేయించుకోవలసి ఉంటుంది. అవి చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి .అలా చేయించుకోలేని వారి కోసం తంత్ర శాస్త్రం ప్రకారం ఈ రెమిడిస్ చెప్పటం జరిగింది. వీటిని పాటించి సంతొషం గా ఉండగలరు అని భావిస్తూ ...వెంకటేశ్వరరావు. కాళహస్తి.
అశ్వని -
* రెమిడి -
వాయువ్యం లో గుఱ్ఱపు బొమ్మ లొహం తో చేసినది పెట్టండి.
భరణి -
* రెమిడి -
ఏ పప్పుతో అయినా పంచదార వేసి " పూర్ణం " తయారు చేసి లక్ష్మీ దేవి కి నైవేద్యం పెట్టి తినాలి . భార్యకు తినిపించాలి.
కృత్తిక -
* రెమిడి -
తెల్లని పువ్వులు దేవాలయం లొ దానం ఇవ్వాలి . వేదజ్ఞుల ఆశీర్వాదం తీసుకోవాలి .కుల పురోహితుడి ఆశీర్వాదం తీసుకోవాలి .
రోహిణి -
* రెమిడి -
ఆవులకు ఆహారం తినిపించాలి. తెల్లటి ఎద్దును శివాలయం పుజించాలి. దానికి ఆహరం తినిపించాలి.
మృగశిర -
* రెమిడి -
* అమ్మ వారికి యలుకులతో పుజ చేయించండి .
* అమ్మ వారి ఆలయం లో ఎర్రని బావంచాలు దానం చేయండి .
* పళ్ళు ఆలయం లో దానం చేయండి .
* సంగీతజ్ఞుల ఆశీర్వాదం తీసుకొండి.
* పోస్ట్ మాన్ కు బట్టలు పెట్టండి.
ఆర్ద్ర -
రెమిడి -
* జంతువధ నిరోధానికి తోడ్పడండి.
* రెండు పప్పు దినుసులు కలిసి ఆహారంగా ఉపయోగించండి.
* దొంగలని పట్టించండి. లేదా పట్టుకోవడానికి సహాయపడండి
పునర్వసు -
రెమిడి -
* మేలి రకం బియ్యం మీ ఊరిలో గాని దగ్గరలో గాని పడమర దిశగా ఉన్న శివాలయం లొ దానం ఇవ్వండి.
పుష్యమి -
రెమిడి -
* బార్లి, గోధుమలు, బియ్యం , చెరుకు వీటిలో ఏ వస్తువు అయినా సరే యజ్ఞాలు చేసే వారికి అయినా సత్ప్రవర్తన కలిగిన వారికి ఎవరికి అయినా శివాలయం లో దానం ఇవ్వండి.
ఆశ్రేష -
రెమిడి -
* దుంప జాతి ఆహారాలను దానం ఇవ్వండి.
* పాము బొమ్మ చిన్నది సీసం తో చేయించి చెరువులో లేదా నుతిలో లేదా నదిలో వేయండి .
* వైద్యులని సన్మానించండి .
మఖ -
రెమిడి -
* మాత,పితలను సేవించే వారిని వెతికి ఆశీర్వాదం పొందండి.
* కొండపై వెలసిన దైవ సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకొండి.
పుబ్బ -
రెమిడి -
* నట, సంగీత ,కళాకారులను గౌరవించండి .
* తేనే దానం ఇవ్వండి.
ఉత్తర -
రెమిడి -
* ఉత్తమ ధాన్యము ను సత్ప్రవర్తన గలవారికి దానం చేయండి .
హస్త -
రెమిడి -
* వెండి ఏనుగు బొమ్మ లేక గణపతి విగ్రహం వేద పండితునికి దానం చేయండి .
* వేద పండితుల శిష్యరికం చేయండి .
చిత్త -
రెమిడి -
* యాలుకలు, కస్తూరి, లవంగాలు, పునుగు, జవ్వాది ఇవన్ని ఎర్ర వస్త్రం లొ కట్టి దానం ఇవ్వండి.
* చేనేత వస్త్రం నేసేవారికి బహుకరించండి.
* చనిపొయిన తరువాత నేత్ర దానం చేసేలా వీలునామా రాయండి.
స్వాతి -
రెమిడి -
* 2 కిలొల శనగ పప్పు దైవ ధ్యాసలో గడిపే వారికి దానం చేయండి .
విశాఖ -
రెమిడి -
* ఉత్తర దిశలొ పై మొక్కలు పెంచండి.
* శనగలు దానం ఇవ్వండి.
అనురాధ -
రెమిడి -
* బియ్యం , కొబ్బరి, ఖర్జూరం , బెల్లం ఇవన్ని మిశ్రమం తయారు చేసి దానం ఇవ్వండి.
జ్యేష్ట -
రెమిడి -
* కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానం చేయండి .
మూల -
రెమిడి -
* పేదలకి ఉచితం గా వైద్యం చేయడానికి ఆయుర్వేదిక్ వైద్యునికి మందుల డబ్బులు ఇచ్చిరండి.
పుర్వాషాడ -
రెమిడి -
* ఏనుగులకు అరటిపళ్ళు తినిపించడానికి మావటి వాళ్లకు ఇచ్చి దగ్గర ఉండి తినిపించండి.
శ్రవణం -
రెమిడి -
* శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి వెళ్లి విష్ణు దర్శనం , విష్ణు భక్తుల దర్శనం చేసుకు రండి.
ధనిష్ట -
రెమిడి -
* గొధుములు పుణ్యాత్ములకు శివాలయం లొ దానం చేయండి .
శతబిషం -
రెమిడి -
* కొంత మద్యాన్ని నీటిలో ప్రవహింప జేయండి .
పుర్వాబాధ్ర -
రెమిడి -
* కొంత నెయ్యి ఒంటరిగా జీవించే సత్పురుషులకి ఇచ్చి రండి.
ఉత్తరాబాధ్ర -
రెమిడి -
* కోవాను ప్రత్యేకం గా తయారు చేయించి 8 మంది వృద్ద బ్రాహ్మణులకు శివాలయం లో దానం ఇవ్వండి.
రేవతి -
రెమిడి -
* పద్మములు , సువాసన గల పుష్పాలు , యలుకులు, కస్తూరి , పునుగు , జువ్వాది ఇవన్ని ప్యాకింగ్ తయారు చేసి శివాలయం లో దానం చేయండి .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి