16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

Life saving tricks


 

Village tricks


 

Chip making


 

Ic sticks


 

Portable


 

Love of father


 

Dogs high jump


 

Three seats


 

న మమేతి విముచ్యతే!!

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 ద్వే పదే మోక్ష బంధస్య, మమేతి, న మమేతి చ -

మమేతి బద్ధ్యతే జంతుః, న మమేతి విముచ్యతే!!


తా𝕝𝕝 ముక్తికి గానీ, బంధానికి గానీ రెండు పదాలు కారణమౌతున్నాయి. 


“మమ” అనుకుంటే అది బంధం! 


"న మమ”  అనుకుంటే మోక్షం!


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

సైనసైటిస్ కొరకు

 సైనసైటిస్  కొరకు కొన్ని సులభ యోగాలు   -


 *  రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.


 *  తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.


 గమనిక  - 


        కఫాన్ని కలిగించే ఆహారపదార్థాల అయిన చల్లని నీరు , కూల్ డ్రింక్స్ , మినుములు , బచ్చలికూర, గొంగూర, పనసకాయ , ఖర్జూరం , కొబ్బరినీరు , తీపి , పులుపు , ఉప్పు పదార్థాలు, అజీర్తి కలిగించేవి వంటి పదార్థాలు నిషిద్దం .


      పెసరపప్పు , ఉలవలు , బార్లీ , పొట్లకాయలు, కాకరకాయలు, నక్కదోసకాయలు, అరటిపువ్వు , శెనగలు, కంద, వాము , బూడిదగుమ్మడి , దాల్చినచెక్క, నిమ్మపండు, పసుపు,మిరియాలు , మునగాకులు తప్పక ఆహారం లో ఉండేలా చూసుకోండి.


       నీరు తాగినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగండి. 

 

       పై నియమాలు పాటించటం వల్ల వీలయినంత తొందరలో సైనసైటిస్ సమస్య తీరును .


అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మహాతేజం రథసప్తమి

 *🚩_ రథసప్తమి_🚩*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మహాతేజం రథసప్తమి : అంటే ఏమిటి , ఎందుకు ?*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.


సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.


1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు ,

3. జ్యేష్టం - మిత్రుడు ,

4. ఆషాఢం - వరుణుడు ,

5. శ్రావణంలో ఇంద్రుడు ,

6. భాద్రపదం - వివస్వంతుడు ,

7. ఆశ్వయుజం - త్వష్ణ ,

8. కార్తీకం - విష్ణువు ,

9. మార్గశిరం - అంశుమంతుడు ,

10. పుష్యం - భగుడు ,

11. మాఘం - పూషుడు ,

12. ఫాల్గుణం - పర్జజన్యుడు.


ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం

బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని *'యుగ సహస్ర యోజన పరాభాను'* అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.


దీన్ని లెక్క కడితే *'యుగం.. 12000 ఏళ్లు , సహస్రం 1000 , యోజనం 8 మైళ్లు , మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు.* ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే


ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.


ఆ ఏడు గుర్రాల పేర్లు

1. గాయత్రి ,

2. త్రిష్ణుప్పు ,

3. అనుష్టుప్పు ,

4. జగతి ,

5. పంక్తి ,

6. బృహతి ,

7. ఉష్ణిక్కు

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని *'ఆదిత్య హృదయం'* ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక , మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు , రాత్రికి ప్రతీక అని , చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు , ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.

అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.


ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు , ఐశ్వర్యం , ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి , రోగము , శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక , ఏడు జన్మల్లో చేసిన పాపములను , ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.


*☘ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:☘*


*నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !*

*అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!*

*యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !*

*తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!*

*ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !*

*మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!*

*ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !*

*సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!*


*పూజ విదానం:-*


చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి , ఒక్కొక్క దళం చొప్పున రవి , భాను , వివస్వత , భాస్కర , సవిత , అర్క , సహస్రకిరణ , సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం , ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు , జిల్లేడు , రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జిల్లేడు , రేగు , దూర్వాలు , ఆక్షతలు , చందనాలు కలిపిన నీటితోగాని , పాలతో గాని , రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

మనం చేసే పూజలు , వ్రతాలు అన్ని

 పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

Dayyam


 

Camarin park


 

Luna kinetic toy


 

 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 


శ్లో𝕝𝕝 రథః శరీరం పురుషస్య దృష్టమ్

ఆత్మా నియన్తేన్ద్రియాణ్యాహురశ్వాన్ |

తైరప్రమత్తః కుశలీ సదశ్వైః

దాన్తైః సుఖం యాతి రథీవ ధీరః ||


*మహాభారతమ్. :: ధర్మవ్యాధోపాఖ్యానమ్.*


తా𝕝𝕝 "కంటికి కనబడే ఈ స్థూలశరీరం రథం అనీ, ఆత్మ(బుద్ధి) సారథి అనీ, ఇంద్రియాలను గుర్రాలు అనీ, శ్రుతివాక్కులు చెపుతున్నవి. నేర్పరి జాగ్రత్తకల ధీరుడయిన సారథి ఎట్లయితే ఉత్తమాశ్వములను తన వశంలో ఉంచుకొని సుఖంగా ప్రయాణం చేస్తాడో అట్లే అప్రమత్తుడు, కుశలుడు ధీరుడు అయిన పురుషుడు మాత్రమే ఇంద్రియాలను తన వశం చేస్కొని సుఖంగా జీవితమార్గంలో ప్రయాణిస్తాడు".

శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *92వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*సాళ్వుని వధించుట* 


అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి త్రిపురాల వంటిదీ గొప్ప మాయతో విరాజిల్లుతున్నది అయిన సాల్వుడి సౌభకవిమానాన్ని తుత్తునియలు చేసాడు.ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. ఓ రాజా నరేంద్రా! సాల్వుడు వజ్రాయుధంతో సమానమైన భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు ప్రళయకాల సూర్యమండల ప్రభలను వెదజల్లే సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని చంపినట్లుగా, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి మకరకుండల రత్నాలతో విరాజిల్లుతున్న సాల్వుడి తలను ఖండించాడు.


 దంతవక్త్రుని వధించుట 


ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు తన మిత్రులైన సాళ్వ, పౌండ్రక, వాసుదేవ, శిశుపాలురకు ఉత్తరక్రియలు పూర్తి చేసి; మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. పండ్లు పట పట కొరుకుతూ, కళ్ళనుండి నిప్పుకణాలు రాలుస్తూ, పాదఘట్టనలతో భూమివణికేలా అడుగులు వేస్తూ, గద గిరగిర త్రిప్పుతూ, ఎండాకాలపు సూర్యుడిలాగా మండిపడుతూ దంతవక్త్రుడు కృష్ణుడిని వచ్చి తాకాడు. ఆ విధంగా

తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూసిన శ్రీకృష్ణుడు వికసించిన హృదయంతో గద చేత పట్టి రథం దిగాడు. పూని ఉగ్రంగా విరోధికి ఎదురు నడిచాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా గద త్రిప్పుతూ నీచంగా మురారిని.....

ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. “ఓ కృష్ణా! ఈనాడు నీవు నా భాగ్యవశం వలన నాకు ఎదురుగా కనపడ్డావు. నువ్వు బంధువు రూపంలో ఉన్న విరోధివి. శరీరంలో ప్రవేశించిన భయంకరవ్యాధిని మందులతో పోగొట్టే వైద్యుడిలా, మేనమామ కొడుకువు అనే అభిమానం లేకుండా వజ్రాయుధం లాంటి నా గదాయుధంతో మిత్రద్రోహివైన నిన్ను యమలోకానికి పంపిచేస్తాను. నిన్ను చంపి నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను.” అంటూ దంతవక్త్రుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడుతూ దగ్గరకు వచ్చి..దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు. అంకుశం పోటుకి కోపించెడి మదగజంలా, శ్రీకృష్ణుడు ఆగ్రహించి వజ్రాయుధంలాంటి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి.....కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు.అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో.....మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు. ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు. మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు.


ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు.


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

రథసప్తమి

 *రథసప్తమి* special


*16-2-2024 తారీకున రథసప్తమి* రోజు ఆచరించవలసిన కొన్ని నియమాలు.


రథసప్తమి కొరకు ముందు రోజు నుంచే తయారు కావాలి. షష్టి రోజు నూనె వెయ్యని పదార్థాలు తినాలి రాత్రి ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చెయ్యాలి ఇవన్నీ రథసప్తమికి ముందు రోజే అనగా షష్టి రోజు చేయవలసిన పనులు.(ఆరోగ్యం బాగున్న వారికి మాత్రమే).


రథసప్తమి రోజు చేయవలసిన నాలుగు విధులు


1. ప్రత్యేక స్నానం చేయాలి 

2. ఉపాసన 

3. నైవేద్యం 

4. దానం


1. ప్రత్యేక స్నానం చేయాలి:- రథసప్తమి రోజు వీలైతే ప్రవహించే నీరు (నది) లో స్నానం చేస్తే చాలా మంచిది అలా కానిపక్షంలో షవర్ ఉన్నవారు షవర్ స్నానం చేయండి. ఈ స్నానం చేస్తున్నప్పుడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు శిరస్సుపై ఉంచుకొని 


నాలుగు శ్లోకాలు:


నమస్తే రుద్ర రూపాయా రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే 


**యధా జన్మ కృతం పాపం, మయా జన్మసుజన్మసు

తన్మే రోగంచ శోకంచ మఖరీ హంతు సప్తమి** 


**ఏతత్ జన్మ కృతం పాపం, యచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కాయజం యచ్చ, జ్ఞాతా జ్ఞాతేచ యే పునః**


**ఇతి సప్తవిధం పాపం, స్నానాన్ మే సప్త సప్తికే 

సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి**


చదువుతూ స్నానమాచరిస్తే ఉత్తమ ఫలితం.


2. ఉపాసన:- వీలైనంతవరకు రక్త వర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు ధరించాలి చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజాదికములు నిర్వహించాలి. వీలైన వారు సూర్యనారాయణ ప్రతిమను ఆ రథంలో ఉంచాలి లేనిపక్షంలో తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యుని బొమ్మ చిత్రించి ఆ ఆకుని అందులో ఉంచాలి.


3. నైవేద్యం:- తులసి కోట దగ్గర వీలైతే ఆవు పిడకలతో (తంపి)పెట్టి దానిపై ఆవుపాలతో కొత్త బియ్యం నెయ్యి బెల్లంతో ప్రసాదం తయారు చేయాలి. ఈ ప్రసాదం కలపటానికి చెరుకు గడను వినియోగించాలి.


4. దానం:- రథసప్తమి రోజు దానం అక్షయ తృతీయ లాగే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంతవరకు దానం చేయాలి. నోములు, వ్రతాలు, మంత్ర సాధన కొరకు గురు ఉపదేశం పొందుటకు రథసప్తమి చాలా అనువైన శుభదినం.

రథసప్తమికి జిల్లేడకుకి

 *.*


*ఇది సేకరణ*

👇👇👇👇👇👇👇👇👇👇


*రథసప్తమికి జిల్లేడకుకి సంబంధం ఏమిటి?*


రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.


దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.


ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.


అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.


అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.


అలా జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.


ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.


అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.

రథసప్తమి

 🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏


💥మాఘ శుద్ధ సప్తమి.. #రథసప్తమి.


ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర |

దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే ||


సకల జీవకోటికి ప్రాణప్రదాత అయిన సూర్యున్ని హిందువులు ప్రత్యక్ష్య దైవంగా భావిస్తారు.


సమస్త జీవజాలం సూర్యునిపైనే ఆధారపడి ఉందని ఋగ్వేదం (1-164) చెబుతోంది. వైదిక సాంప్రదాయాల్లో సూర్యుడికి విశిష్ట స్థానం కల్పించబడింది.


సూర్యున్ని త్రిమూర్తి స్వరూపుడిగా భావించి..


బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం|

సాయం ధ్యాయే సదా విష్ణుం త్రయీమూర్తిద్ధివాకరః||


అంటే ఉదయం బ్రహ్మ స్వరూపంగా, మధ్యాహ్నం పరమేశ్వర స్వరూపంలో, సాయంకాలం విష్ణురూపునిగా స్తుతిస్తాం.


రథసప్తమి రోజున సూర్యోదయ కాలంలో పుణ్యస్నానాన్ని చేయడం, సూర్యున్ని పూజించడం చేయాలి.


ఈనాటి సూర్యారాధన వలన ఎంతటి అనారోగ్యమైనా తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, అకాల మరణం నివారింపబడుతుందని, సకల సంపదలు కలుగుతాయని చెప్పబడినది.


💥రథసప్తమి వ్రతాచరణలో స్నానం, దీపం, అర్ఘ్యం, ఉపచార పూజ, తర్పణం ముఖ్యమైనవి.


#స్నానం:


సప్తమి ముందురోజు రాత్రి అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి, సప్తమి నాడు సూర్యోదయ సమయంలో స్నానాన్ని ఆచరించాలి.


రథసప్తమి స్నానం వలన సకల రోగాలు నివారింపబడుతాయి, ఏడేడు జన్మల పాపాలు హరింపబడుతాయని ధర్మ సింధువు పేర్కొంటుంది.


రథసప్తమి స్నానాన్ని నదిలోనో, పుణ్యతీర్థం లోనో, చేయడం మంచిది. అది వీలుకానప్పుడు కనీసం చెఱువులోనో, కాలువలోనో లేక బావి దగ్గరో చేయటం మంచిది.


స్నానం చేసేటప్పుడు...


యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః


అనే మంత్రాన్ని చెప్పుకోవాలని ధర్మ సింధువు చెబుతోంది.


అంటే జన్మ మొదలుగా చేసిందీ, జన్మాంతరాలలో చేసిందీ అయినటువంటి రోగ రూపంలోనూ, శోక రూపంలోనూ ఉండే పాపమంతా మకరంలోని సప్తమి హరింపచేయాలని, ఈ జన్మలోనూ, జన్మాంతరంలోనూ మనస్సు చేత, వాక్కు చేత, ఇంద్రియముల చేత తెలిసి, తెలియక చేసిన పాపములన్నీ సూర్య ప్రియమైన ఈ మకర సప్తమి స్నానం చేత నశింపబడాలనే అర్థంలో ఈ మంత్రాన్ని పఠిస్తారు.


రథసప్తమి స్నానంలో జిల్లేడు లేదా రేగు ఆకులను తలపైనా, భుజాల పైన, చేతులపైన, మోకాళ్ల పైన ఉంచుకొని స్నానం చేయాలి.


#దీపం:


స్నానానికి ముందు ప్రమిదలో గానీ, ఆకులతో చేసిన దొన్నెలో గానీ దీపాన్ని వెలిగించి దానిని తలపై పెట్టుకుని


నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః|

అరుణాయ నమస్తేస్తు హరిద్రాశ్వ నమోస్తుతే||


అని సూర్యుని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి. దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి. లభించని పక్షంలో నువ్వుల నూనె లేక ఇతర నూనెలు వాడవచ్చు.


#అర్ఘ్యం:


స్నానం తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యాన్ని


సప్త సప్తివహ ప్రీత! సప్తలోక ప్రదీపన!

సప్తమీ సహితో దేవ! గృహాణార్ఘ్యం దివాకరః!


అనే మంత్రంతో ఇవ్వాలి.


#ఉపచార_పూజ:


అర్ఘ్యాన్ని ఇచ్చిన తరువాత సూర్యదేవుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. ఈ పూజలో సూర్యునికి విధిగా తీపి పొంగలిని నివేదించాలి.


ఈ పొంగలిని ధనుర్మాసంలో పెట్టే గొబ్బి పిడకలతో పొయ్యిని వెలిగించి చేయటం కొన్ని చోట్ల ఆచారంగా ఉంది.


సూర్యునికి ఎదురుగా ఆవు పేడ పిడకలతో ...ఇత్తడి గిన్నెలో ఆవుపాలను పొంగిస్తారు. పొంగిన తరువాత బియ్యం, బెల్లం కలిపి పరమాన్నం చేస్తారు. చిక్కుడు ఆకులలో ప్రసాదంగా తీసుకొంటారు.


#తర్పణం:


ఈ రోజు నుంచి వరుసగా అయిదు రోజులు అంటే – సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశిలను “#భీష్మ_పంచకం” అని అంటారు.


భారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు అప్పటికి ఇంకా దక్షిణాయనం అవటం వలన ఉత్తరాయణ పుణ్యకాలం రావటం కోసం అంపశయ్య మీద ఎదురుచూసి ఈ అయిదు రోజులలో రోజు కొక్కటి చొప్పున పంచ ప్రాణాలు వదిలేసాడని పురాణ గాధ. అందుకే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా ఉంది.


సూర్యానుగ్రహం వలన సకల కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. 

🪷🪷🪷

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*16-02-2024 / శుక్రవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.

---------------------------------------

వృషభం


ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.

---------------------------------------

మిధునం


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారమౌతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.

---------------------------------------

కర్కాటకం


ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

---------------------------------------

సింహం


గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

---------------------------------------

కన్య


సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

తుల


దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక  రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  మందకోడిగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

---------------------------------------

మకరం


ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.

---------------------------------------

కుంభం


ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి.

---------------------------------------

మీనం


ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

కౌపీన పంచకం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


2. *మూలం తరో కేవల మాశ్రయన్త:*

     *పాణిద్వయం భోక్తు మమన్త్ర యన్త:*

      *కన్థామినా శ్రీ మపి కుత్సయన్త:*

      *కౌపీనవంతః ఖలు భాగ్యవంతః:*


👉 *కౌపీన పంచకం ( శ్రీ శంకరాచార్య )*


భావము: *చెట్టునీడయేఆశ్రయంగాచేసుకోని , రెండు చేతులను భోజన పాత్రగా చేసుకోని ఐశ్వర్యమనిన విముఖతతో ఉండే కౌపీనధారులు చాలా భాగ్యవంతులు*.!!!

రథసప్తమీ

 *ॐ  16/02/ 2024 - రథసప్తమీ / శ్రీ సూర్య జయన్తీ_ 卐*

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


మాఘ శుద్ధ సప్తమి శ్రీ సూర్య జయంతి పర్వదినం.... దీనినే రథసప్తమి అని కూడా వ్యవహరిస్తారు....

ప్రభవ నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువు, మాఘ శుద్ధ సప్తమి ఆదివారం అశ్వినీ నక్షత్రం లో సూర్యుడు జన్మించినట్లు పురాణ వచనం...... 


సూర్య భగవానుడు సర్వదేవతా స్వరూపుడు.... నమస్కార ప్రియుడు.... ప్రతిరోజూ వేకువజామునే లేచి స్నానం చేసి సూర్యనమస్కారాలు ఆచరించినట్లయితే విశేషమైన ఆయురారోగ్యాలు కలుగుతాయి.....


మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు....


*_సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు...._*


*1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'*

*2. వైశాఖంలో అర్యముడు,*

*3. జ్యేష్టం-మిత్రుడు,*

*4. ఆషాఢం-వరుణుడు,*

*5. శ్రావణంలో ఇంద్రుడు,*

*6. భాద్రపదం-వివస్వంతుడు,*

*7. ఆశ్వయుజం-త్వష్ట్ర,*

*8. కార్తీకం-విష్ణువు,*

*9. మార్గశిరం- అంశుమంతుడు,*

*10. పుష్యం-భగుడు,*

*11. మాఘం-పూషుడు,*

*12. ఫాల్గుణం-పర్జన్యుడు,*


*ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.*


*సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది....*


*ఆ ఏడు గుర్రాల పేర్లు*

(సప్త ఛందస్సులు) 

*1. గాయత్రీ,*

*2. త్రిష్ణుప్,*

*3. అనుష్టుప్,*

*4. జగతీ,*

*5. పంక్తి,*

*6. బృహతి,*

*7. ఉష్ణిక్*


*వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.....*


తిథులలో సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు.....అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి.....

దీనికి సూర్యసప్తమి అని పేరు....


అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది?


అంటే...?


సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది....ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట....ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే..... సూర్యుని రథం మటుకు ఒకే చక్రం......నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు.... కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి....


దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి...... ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా....కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి.......ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు......సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.....


*రధ సప్తమి ఎలా చేయాలి?*


ఈ రోజున అరుణోదయకాలంలో స్నానికి ముందు


నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః । అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే ॥


అను శ్లోకాన్ని చదువుతూ సూర్యభగవానుడికి నమస్కరించ వలయును....


నేటి అరుణోదయ వేళలో జిల్లేడాకులు లేక చిక్కుడాకులు, లేక రేగుపళ్ళు తల పైనా, బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి.... 


1-సప్త సప్తి ప్రియే దేవి –సప్త లోకైక పూజితే,

సప్త జన్మార్జితం పాపం –హర సప్తమి సత్వరం.... 


2-లోల కిరాణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం,

సప్త జన్మ క్రుతైః పాపైః—ముక్తిర్భవతి తక్షణాత్..... 


 3-మాఘే మాసే సితే పక్షే –సప్తమీ కోటి భాస్కరా,

కుర్వాత్ స్నారార్ఘ్యం దానాభ్యాం–ఆయురారోగ్య సంపదః..... 


4-నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!


5-యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!


6-ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!


7-ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!


ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి...... 


౧. ఈ జన్మలో చేసిన, ౨. జన్మాంతరాలలో చేసిన, ౩. మనస్సుతో, ౪. మాటతో, ౫. శరీరంతో, ౬. తెలిసీ, ౭. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది..... 


స్నానం చేసిన తర్వాత, ఆరు బయట తులసి మొక్క దగ్గర చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి......ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.....


ఆవు పిడకలపై క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి..... ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి......పాలు పొంగుతున్నప్పుడు ‘’నమో సూర్య నారాయణ ‘’అంటూ నమస్కరించి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది..... ఆ క్షీరాన్నాన్ని సూర్యునికి నైవేద్యం పెట్టాలి. తర్వాత దీనినే ప్రసాదంగాకళ్ళకు అద్దుకొని అందరూ స్వీకరించి తినాలి.... 


జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి.....జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది... 


సూర్య దండకమో ఆదిత్య హృదయమో, చదువుకోవాలి. వస్తే అరుణ పారాయణం చేయాలి.... 


ఏ శ్లోకాలూ రాని వారు


1-ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర –దివాకర నమోస్తుతే


2-సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం –శ్వేతపత్ర (ఏక చక్ర )ధరం దేవం –తమ్ సూర్యం ప్రణమామ్యహం అని ‘’చదువుకోవచ్చు... 


రధ సప్తమినాడే ఆడవాళ్ళు కొత్త నోములు ప్రారంభిస్తుంటారు....దీనినే నోము పట్టటం అంటారు...


"సూర్యగ్రహణ తుల్యాతు శుక్లామాఘస్య సప్తమీ"


ఆ కారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది....తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది....


 ☀️ *_ఓం మిత్రాయ నమః_* ☀️


🌹 *_రథసప్తమి శుభాకాంక్షలు_* 🌹


🍁 *_లోకా సమస్తా సుఖినోభవన్తు_* 🍁