9, ఏప్రిల్ 2021, శుక్రవారం

రాశుల వారిగా* *2021-2022 ఫలితాలు....

 *రాశుల వారిగా*

*2021-2022 ఫలితాలు....*


1. https://youtu.be/yLNW_DzBApk   *తుల రాశి*

________________________________

2. https://youtu.be/tSicv32g0jw          *సింహ రాశి*

________________________________

3. https://youtu.be/saitHjhB8vo         *మిథున రాశి*

________________________________

4. https://youtu.be/mzy53bUGCYA    *కన్య రాశి*

________________________________

5. https://youtu.be/ljaJ6RxQttU         *ధనుస్సు రాశి*

________________________________

6. https://youtu.be/k_9lT70TJ6M      *కర్కాటక రాశి*

________________________________

7. https://youtu.be/k9HojxsHOVc      *వృశ్చిక రాశి*

________________________________

8. https://youtu.be/jeKpae5yFWE      *మేష రాశి*

________________________________

9. https://youtu.be/exRokfSNJNo      *వృషభరాశి*

________________________________

10. https://youtu.be/DoDJ_alL5lQ       *మకర రాశి*

________________________________

11. https://youtu.be/LV0t5Q3Lyng       *కుంభ రాశి*

________________________________

12. https://youtu.be/H64C1UuPty8      *మీన రాశి*


*సర్వేజనా సుఖినోభవంతు* @AB6 NEWS

1లడ్డు తింటేచాలు, 90ఏళ్ళు వచ్చినా రోగాలు రావు, మోకాళ్ళనొప్పి, కీళ్ళనొప్ప...

శ్రీరమణీయం* *-(138)*_

 _*శ్రీరమణీయం* *-(138)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నేను చేసే కర్మలకు నిజమైన పరిపూర్ణత రావాలంటే ఎలా ?"*_


_*ఏ తెలివితేటలతో పనిలేకుండానే యావత్ ప్రాణికోటి జీవిస్తున్నా మనిషి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు వరంగా సంక్రమించిన తెలివితేటలను అజ్ఞానంగా మార్చుకుంటున్నాడు ! మనం కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహేంద్రియాలను సహాయంగా చూస్తున్నామేగాని, వాటికి ఆధారంగా జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్న భగవంతుడ్ని గమనించటంలేదు. ఇది గుర్తించిన రోజు కర్తృత్వం పోయి మన కర్మలో కౌశలం వస్తుంది. అంటే మన కర్మలకు నిజమైన పరిపూర్ణత సిద్ధిస్తుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కరిఘట్ట-కర్ణాటక*

 *బైరాగి వెంకటేశ్వర స్వామి - కరిఘట్ట-కర్ణాటక* 


🍁🍁🍁🍁


కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆలయం అంటే తిరుపతే గుర్తుకువస్తుంది. ఇక్కడ సకల భోగాలూ అనుభవించే వేంకటేశ్వరుని బైరాగిగా ఊహించుకోగలమా! 


కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు అలాగే కనిపిస్తారట. 


ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అక్కడి స్వామి ప్రత్యేకత ఏంటి?


కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. 


రెండువేల అడుగులకు పైనే ఎత్తు ఉండే ఈ కొండ మీద ఉన్న ఆలయం గురించే మనం చెప్పుకొంటున్నది.


 ఈ కొండని ‘కరిఘట్ట’ అని పిలుస్తారు. కరి అంటే నలుపు అన్న అర్థం ఉంది కాబట్టి నల్లటి కొండ అన్న ఊహతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు. కరి అంటే ఏనుగు అన్న అర్థం కూడా ఉంది కదా! ఈ కొండ మీద ఏనుగులు తినే గడ్డి బాగా ఎదిగి కనిపిస్తుంది. అందుకనే ఏనుగుకొండ అన్న ఆలోచనతోనూ ఆ పేరు పెట్టి ఉండవచ్చు.


కరిఘట్ట మీద ఉన్న ఆలయం ఈనాటిది కాదు.


 వరాహపురాణంలో సైతం దీని ప్రస్తావన ఉంది. ఇక్కడి కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని అందులో పేర్కొన్నారు.


 అప్పట్లో ఈ కొండను నీలాచలం అని పిలిచేవారట. మన తిరుపతిలో కనిపించే ఏడుకొండలలో ఒకటైన నీలాద్రిలోని కొంతభాగమే ఈ నీలాచలం అని అంటారు. 


ఇక్కడి మూలవిరాట్టుని వైకుంఠ శ్రీనివాసుడు లేదా కరిగిరివాసుడు అని పిలుస్తారు. 


ఆరడుగుల నల్లని రాతిలో కనిపించే ఈ మూలవిరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. 


ఈ స్వామికి అలంకారం చేసినప్పుడు, బైరాగిలా అగుపిస్తాడట. అందుకనే ‘బైరాగి వెంకటరమణుడు’ అని కూడా పిలుచుకుంటారు.


 పేరుకి బైరాగే కానీ ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల నమ్మకం. 


జీవితంలో ఓర్చుకోలేని బాధలు వచ్చినప్పుడు, ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పక ఫలితం దక్కుతుందట.


కరిఘట్ట ఆలయానికి చేరుకునేందుకు 400కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కలేనివారు వాహనాల్లో చేరుకునేందుకూ రహదారి ఉంది. కొండ పక్కనే కావేరి ఉపనది అయిన లోకపావని ప్రవహిస్తూ ఉంటుంది.


మైసురు నుంచి శ్రీరంగపట్నానికి వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ కరిఘట్ట ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. 


🍁🍁🍁🍁

మొగలిచెర్ల

 *ఒక తండ్రి తపన..*


"శ్రీపాద శ్రీవల్లభుల ఆలయం కడుతున్నారని విన్నాను..ఒక దిగంబర అవధూత దత్తాత్రేయుడి కొఱకు తపస్సు చేసి..కపాలమోక్షం ద్వారా ఆ పరమాత్మలో ఐక్యం చెందిన అతి పవిత్ర స్థలంలో..త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడికి ఒక చిన్న మందిరం ఏర్పాటు చేశారు..అలానే ఆ దత్తాత్రేయుడి ప్రథమ అవతారంగా భావించే శ్రీపాదశ్రీవల్లభుడికీ గుడి ఏర్పాటు చేస్తున్నారు..దత్తావరంగా కొలిచే శ్రీ సాయిబాబా మందిరం కూడా ఉన్నది..ఒక సంపూర్ణ దత్తక్షేత్రం గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు..చాలా సంతోషం గా ఉంది నాయనా.." అని నాతో అన్నారు..వారిని ఇంతకుముందు ఎన్నడూ నేను చూడలేదు..నాతో బాగా పరిచయం ఉన్న వారిలాగా మాట్లాడారు..నా ప్రక్కనే కూర్చున్నారు..


"అయ్యా..మీరెవరో గుర్తుకురావడం లేదు..మీ పేరు తెలుపుతారా?..ఇంతకుముందు ఈ క్షేత్రానికి ఎప్పుడైనా వచ్చారా?.." అని అడిగాను..నా వైపు కొద్దిసేపు పరిశీలనగా చూసి.."నా పేరు వాసుదేవరావు..సుమారు ముప్పై ఐదేళ్ల ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను..అప్పుడు మీ నాన్నగారు ఈ మందిరాన్ని నిర్వహిస్తున్నారు..అప్పట్లో ఇక్కడ ఈ స్వామివారి సమాధి మందిరం ఒక్కటే ఉండేది..ముందువైపు చిన్న వరండా..ఆ ముందు పందిరి ఉండేది..ఒకరకంగా చెప్పాలంటే నేను మీకు దూరపు బంధువును కూడా..మీ నాన్న అమ్మ గార్లు బాగా పరిచయం..ఆరోజుల్లో శుభకార్యాలలో కలుస్తూ వుండేవాళ్ళము..ఆ తరువాత నేను ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాను..కొన్నాళ్ళు ఉత్తరాల ద్వారా పలకరింపులు ఉండేవి..మీ నాన్నగారు అనారోగ్యం పాలైన తరువాత అవికూడా లేవు..మొన్న మా ఊరుకు వచ్చాను..ఇంతదూరం వచ్చాను కదా అని ఇక్కడకు వచ్చాను..నేను మొదటినుంచీ దత్త భక్తుడిని..ఇక్కడకు రాగానే ఒక్కసారిగా  ఒళ్ళు పులకరించింది..చాలా సంతోషం వేసింది.." అన్నారు.."స్వామివారి సమాధిని దర్శించుకున్నారా?.." అని అడిగాను.."ఇంకా లేదు.." అన్నారు.."లోపలికి వెళ్లి..దర్శించుకొని రండి.." అన్నాను..


"ముందు మీతో మాట్లాడాలి.." అన్నారు.."నన్ను మీరు..మీరు..అని పిలవద్దు..మా తండ్రి గారి వయసు మీది.." అన్నాను.."అలాగే నాయనా.." అన్నారు.."ఏదో మాట్లాడాలి అన్నారు కదా.." అన్నాను.. ఒక్కసారిగా గంభీరంగా మారిపోయారు.."ఈ క్షేత్రం గురించి నువ్వు సోషల్ మీడియా లో రాస్తున్న అనుభవాలు మా పెద్ద అమ్మాయి ప్రతిరోజూ చదువుతున్నది..నాకూ పంపుతుంది..నేనూ చదువుతున్నాను..ఒక సమస్య తో బాధపడుతున్నాను..నాకు ఇద్దరు ఆడపిల్లలు..ఇద్దరికీ వివాహాలు చేసాను..ఇప్పుడు సమస్య రెండో అమ్మాయిది..ఒక్కొక్కసారి తన ప్రవర్తన విపరీతంగా ఉంటున్నది..పిల్లల మీదా..భర్త మీదా పెద్దగా కేకలు వేస్తూ..పిచ్చిదానిలా మారిపోతుంది..మళ్లీ కొంతసేపటికి మామూలుగ ఉంటుంది..తాను ఇంతకు ముందు అలా ప్రవర్తించానే అని ఏడుస్తుంది..ఇద్దరు ముగ్గురు డాక్టర్ల కు చూపించాము..ఏదో డిప్రెషన్ అన్నారు..మందులు ఇచ్చారు..తగ్గలేదు..ఏ దిక్కూ తోచలేదు..రోజూ ఈ  స్వామివారి గురించి చదువుతున్నాను కదా..ఒక్కసారి ఇక్కడ మొక్కుకొని వెళదామని వచ్చాను.." అన్నారు.."స్వామివారి పాదుకుల వద్ద మనస్ఫూర్తిగా మొక్కుకోండి..ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకొని రండి.." అని చెప్పాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..ప్రదక్షిణ చేసి..నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకలకు శిరస్సు ఆనించి ప్రణామం చేసుకొని ఇవతలకు వచ్చారు..స్వామివారి విభూతి గంధం వారికి ఇచ్చి..అమ్మాయికి వాడమని చెప్పాను..అవి భక్తిగా కళ్లకద్దుకొని తీసుకొని..మరి కొద్దిసేపు వుండి వెళ్లిపోయారు..


పదిరోజుల తరువాత వాసుదేవరావుగారు అత్యంత ఆనందంగా ఫోన్ చేసి.."నాయనా ప్రసాద్..స్వామివారు సత్యంగా ఉన్నారయ్యా..అమ్మాయికి ఈ వారం నుంచీ ఎటువంటి విపరీతపు పోకడలూ లేవు..నువ్వు ఇచ్చిన విభూతి గంధం బొట్టులాగా పెట్టి..పడుకునేటప్పుడు తలక్రింద కూడా పెట్టించాను..ఏ గొడవా లేదు..హాయిగా ఉంది..మరో పదిరోజుల్లో అమ్మాయి అల్లుడిని తీసుకొని వస్తున్నాను..అక్కడే నిద్ర చేస్తాము..ఇన్నాళ్ల మా వేదన తీరింది.." అన్నారు..అనుకున్న విధంగానే అల్లుడిని కూతురిని ఒక శనివారం తీసుకొని వచ్చి..స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ఆ ప్రక్కరోజు ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లారు..శనివారం నాటి రాత్రి అన్నదానం వ్యయం అంతా వారే భరించారు..


"నాయనా..ఇక్కడ స్వామివారి తపో శక్తి నిక్షిప్తమై ఉన్నది..అది కొన్ని తరాలపాటు ఉంటుంది అని మీ తల్లిదండ్రులు అప్పట్లో నాతో చెప్పేవారు..ఇన్నాళ్లకు నాకూ అనుభవానికి వచ్చింది.." అని వాసుదేవరావు గారు పదే పదే చెప్పారు..ఆ పలుకులు అక్షర సత్యాలని మాకూ బోధపడుతూనే ఉన్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

చెట్టు కోరిక

 🍁🌿   చెట్టు కోరిక    🌿🍁


గురువుగారు….దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా.. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా?" 


"అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను"  


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి

ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు. 


శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. 


" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." 


"ఏమిటా కోరిక గురువు గారూ" 


"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని." 


"వచ్చే జన్మలోనా" 


"కాదు ఈ జన్మలోనే" 


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా" 


" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"


" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత. 


శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత

విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 


గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." 


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.

ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 

చేశాడు శిష్యుడు. 


భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సనాతన ధర్మం

 మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.

సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.

మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి?

ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. కనుక అన్ని మతాలకు ఉండాలని, ఒక మతానికి ఒక ప్రవక్త ఉన్నాడు కనుక మన మతానికి కూడా ఉండాలని చెప్పడానికి లేదు. ఒక్కొక్క మతస్వరూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు దేనికీ లేవు. అన్ని మతాలనీ మనం గౌరవిద్దాం.

హిందూమత గ్రంథాలు

కానీ మన మతంపైన అవగాహన కలగాలి. మన మతం పేరు సనాతన ధర్మమని, హిందూధర్మమని, ఆర్ష ధర్మమని పేరు. అయితే విశేషించి ఈ సనాతన ధర్మంలో ఒక గ్రంథం అంటూ ఉండదు. ఙ్ఞానం ఉంటుంది. అయితే ఙ్ఞానం గాలిలోంచి వచ్చినట్లుగా కాకుండా దీనికీ ఏదైనా గ్రంథం చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథం వేదం.

“వేదోక్తేన ధర్మమిదం” అని చెప్పుకోవాలి. వేదము యొక్క భాష కానీ, అందులో వచ్చిన అంశములు కానీ సామాన్య జనులకి ఉపదేశించే నీతి వాక్యాల్లా ఉండవు. మంత్రాలు ఉశుల సమాధి స్థితిలో దర్శించిన దివ్య శబ్దాలు. పరమ సత్యం సమాధి స్థితికి అర్థం అవుతుంది. కానీ మామూలు మనుషుల ఊహ, తర్కానికి, ఆలొచనకి గొప్ప ధర్మాలు అర్థం కావు. అది తపస్సు చేత వికసించిన అతీంద్రియ ప్రఙ్ఞ కలిగిన ఋషులు ఏ సత్యాన్ని దర్శించారో ఆ సత్యాల సమాహారమే వేదము.

కనుక వాటిలోని అంతర్యాలని, అవి మనకు చూపిస్తున్న జీవన విధానాన్ని మనకి అందించడానికి మహర్షులు మరొక పనిచేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. కనుక వేదాలు మొదలుకొని పురాణ, ఇతిహాస, ధర్మ శాస్త్రముల ద్వారా మన సనాతన ధర్మం వర్ధిల్లింది. కనుక పిల్లలు అడిగితే మనం చెప్పవలసింది సనాతన ధర్మానికి ఆధారం వేదం అని. వేదములలోని లోతైన భావాలు సామాన్యులకు అందజేయడానికై ఆ వేద ఋషుల్లో కొందరు మనకు పురాణాల్ని, ఇతిహాసాల్ని అందించారు. వారిలో వాల్మీకి, వ్యాసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది చెప్పబడుతూ ఉంటారు. వారందరూ ఇటు పురాణాల్లోనూ, అటు వేదాల్లోనూ తెలియబడుతూ ఉంటారు.

అంటే వేదాలలో ఉన్న మహర్షులే మనకి పురాణ, ఇతిహాసాల్లోని ఙ్ఞానాన్ని అందించారు.

ఇది సామాన్యులకు కూడా చేరడానికి వారు చేసిన ప్రక్రియ. అందుకే హిందూమతం అత్యంత సామాన్య జనుల్లోకి కూడా చొచ్చుకుపోయింది.

ఇవి హిందూమతానికి గ్రంథాలు అని తెలుసుకోవాలి.

హిందూమతానికి ప్రవక్తలు ఎవరు?

ఇక హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అంటే పరమేశ్వరుడే. “యస్య నిశ్వసితం వేదాః” అంటే పరమాత్మయొక్క ఊపిరియే వేదములు. పరమేశ్వరుడు ప్రవక్త అయినప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమైన వేదాలను మహర్షులు దర్శించారు.

కనుక మహాత్ములు అందరూ ప్రవక్తలే అని చెప్పుకోవాలి. ఈ మహర్షులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ప్రవక్త ఇచ్చిన విఙ్ఞానం కాదు. అనేకమంది మహర్షులు ఇచ్చిన విఙ్ఞానం. సాధారణంగా ఇద్దరు, ముగ్గురు మూడు మాటలు చెప్తేనే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన కుదరదు. ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ పొంతన కుదరదు. ఇంతమంది మహర్షులు ఇంత విఙ్ఞానం ఇచ్చినా ఎక్కడా పరస్పర విరుద్ధంగా లేవు. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప అంశం.

ఎవరియొక్క విఙ్ఞానం వారిదే అయినా ఒకరి విఙ్ఞానానికి ఇంకొకరి విఙ్ఞానానికి వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. అది మన మతం యొక్క ప్రత్యేకత. ఈవిషయాన్ని పిల్లలకు తెలియజేయగలగాలి.

విశ్వేశ్వరస్వామికి

 *🚩🕉️కాశీలోని విశ్వేశ్వరస్వామికి మందిరం పక్కన ఉన్న..సగము మందిరంగా,సగము మసీదుగా..ఉన్న నిర్మాణంపైన సర్వే చేయమని..పురావస్తు శాఖ వారిని ఆదేశించిన వారణాసి న్యాయస్థానం..కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేయనున్నారు, వారి సర్వే ప్రకారం అక్కడ మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని తేలితే...అయోధ్యలో శ్రీ రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్టు గానే..కాశీలో విశ్వేశ్వర మందిరాన్ని మళ్లీ నిర్మిస్తారు.. భారతీయ జనతా పార్టీ సాధించబోయే మరో చారిత్రాత్మక విజయానికి నాంది పునాది పడింది...🛕🔱*


*🚩వారణాసి కోర్టు తెలిపిన ప్రకారం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ వెయ్యాలి..వారంతా పురావస్తు శాఖకు, చారిత్రాత్మక జ్ఞానం కలిగిన వారు ఉండాలి.. ముగ్గురు సభ్యులు హిందూ ధర్మానికి చెందిన వాళ్లు ఉండాలి, ఇద్దరు మైనార్టీ MUSLIM వర్గానికి చెందిన వారు ఉండాలి..త్వరగా సర్వే చేసి అన్ని చారిత్రాత్మక ఆధారాలు, వాస్తవాలతో కోర్టుకు నివేదిక సమర్పించాలని మరి కోర్టు ఆదేశించడం జరిగింది...*


*🔥వాస్తవానికి భారతదేశం పూర్తిగా హిందూ సనాతన భారతదేశం...మొఘల్ రాజులు పరమ దుర్మార్గులు, అక్రమ వలసదారులు, హిందుస్థాన్ మీద దండయాత్ర చేసి అక్రమంగా వచ్చి చొరబడి దేశాన్ని ఆక్రమించుకొని, అత్యంత పరమ దుర్మార్గమైన కిరాతక పాలన చేశారు... లక్షలాది దేవాలయాలను గొప్ప సంపద కలిగిన హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నింటిని ధ్వంసం చేశారు, కూలగొట్టారు తగలబెట్టారు..కోట్లాది రూపాయల దేవాలయాల సంపదను దోచుకున్నారు..భారత దేశంలో వేలాది మందిరాలను పడగొట్టి, అత్యంత అక్రమంగా వేలాది మసీదులను నిర్మించారు..చూసినా హిందూ దేవాలయాల చిహ్నాలు, అవశేషాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి..మరికొన్నింటిని మీద అయితే సగం మసీదు సగం మంది రంగా ఉంటుంది..*


 *🔥చరిత్రాత్మక మందిరాలు దుర్మార్గుల చేతిలో నాశనం చేయబడ్డాయి...స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ బాయ్ పటేల్ లాంటి వారు ఎంతో పోరాడిన.. దొంగ గాంధీ నెహ్రూలు దగుల్బాజీలు.. ఇస్లామిక్ మతోన్మాదుల ముడ్డి కడుగుతూ వాళ్ళ సంక నాకారు..ఈ దేశాన్ని అవసరమైతే ఇస్లామిక్ దేశం చేయాలని పరమ కుట్రపన్నారు..గాంధీ నెహ్రూల గాడిది రాజకీయం వల్ల దేశం ముక్కలైపోయి..PAKISTAN ఇండియా గా విడిపోయింది.. దొంగ దిక్కులేని సెక్యులరిజం దేశంగా ఇండియా మారింది..ISLAMIC దేశం పాకిస్తాన్లో ఎన్నో వైభవం కలిగిన ఆలయాలను మందిరాలను, ఇస్లామిక్ మతోన్మాద గుండాలు పడగొట్టారు, సర్వనాశనం చేశారు, ఇప్పటికి కూడా ఇస్లామిక్ దేశాల్లో ప్రతినిత్యం హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి.. మనం పెట్టే ముష్టి, బిక్ష మీద బతికే బంగ్లాదేశ్ కూడా ఇటీవల హిందూ దేవాలయాల మీద దాడి చేసింది, ధ్వంసం చేసింది.. ఇదంతా దొంగ గాంధీ నెహ్రూల గాడిDA రాజకీయమే కారణం..*


*🚩భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెబుతుంది..HINDUS మనోభావాలను దెబ్బ తీసి మా మందిరాలను పడగొట్టే.. అక్రమంగా ఇస్లామిక్ రాజులూ మసీదులను నిర్వహించారు.. సర్వే చేయండి వాస్తవాలను తేల్చండి మా మందిరాలు మాకు అప్పగించండి అని మొదటి నుండి చెబుతుంది.. ఇది వాస్తవమే అయినా ఒక గొప్ప చారిత్రాత్మక పోరాటం.. హిందూ సనాతన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో.. సగర్వంగా గౌరవించ బడాలి భారతీయ జనతాపార్టీ అదే చేస్తుంది..రాబోయే రోజుల్లో కాశీలో రామమందిరం మాదిరిగానే విశ్వేశ్వర మందిరం గొప్పగా నిర్మించబడుతుంది..హిందువులంతా ఆనందోత్సాహాలతో సంతోషంగా ఉంటారు..జయహో నరేంద్ర మోడీ జయహో*


*🇮🇳🚩🕉️...S.R.R...🕉️🚩🇮🇳*


కాశీ విశ్వనాధ మందిరం దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు.నాడు హిందువులను కాఫిర్లని... హిందువుల ఆరాధనా పద్దతులు ఇస్లాం కు వ్యతిరేకం కాబట్టి ఔరంగజేబ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను కూల్చివేశాడు...హిందువులకు ప్రధాన పురాణపురుషులైన రాముని గుడిని బాబర్ కూల్చివేస్తే ..లయకారకుడు శివమందిరాన్ని దానితోపాటు 172 ఆలయాలను ఔరంగజేబ్ కూల్చివేశాడు.. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు ముస్లిం పాలకులచేతిలో కూల్చివేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. నేటి ఐసిస్ లకు ఆదర్శప్రాయుడు ఔరంగజేబు కాలంలో అప్పటి విశ్వనాధ మందిరం విధ్వంసం చేయబడింది మూల విరాట్టు విశ్వనాధున్ని నాటి ముస్లిం ఉగ్రవాదులనుంచి కాపాడడానికి సమీపంలోని బావిలో అప్పటి పూజారులు పడేశారు...ఇప్పటికీ దానిపైన ఇనుప మూత వేసి రక్షిస్తున్నారు... మహాదేవుడు అభిషేకప్రియుడు కదా అందుకే నీళ్ళలోనే ఉండడానికి ఇష్టపడ్డారేమో!!... తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఇప్పుడు యు.పి ఒక స్వయంసేవక్ చేతిలోకి వెళ్ళింది...ఆయన కరసేవకుడు కూడా.... విశ్వనాధుడు అలక వీడి యోగి ఆదిత్యనాధుడి చేతులమీదుగా స్వగృహప్రవేశం చేస్తారని మహాదేవుడ్ని ప్రార్దిస్తూ... హర హర మహాదేవ్....

పలకరింపు

 _*పలకరింపు*_


_{ పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాలు ! }_


_మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది._


_పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది._


_నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు._


_ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !_


_పలకరింపుకు అంత శక్తి వుంది. *పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు*. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి._


_ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీల్లా పని చేస్తాయి._


_పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి._


_ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు *"తీయని పలకరింపు"* అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు నన్ను చాలా మంది పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని ఆ పాత్రలో వివరిస్తుంది._


*_డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి.* ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం._


_లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి._


_మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి._


_కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం._


_నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు._


_*''నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !*


_*అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు !*_


        *ధన్యవాదాలు*