6, ఫిబ్రవరి 2024, మంగళవారం

నూరు నియమాలు

 నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 

4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 

5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 

6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు. 

7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. 

8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు. 

11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 

12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. 

14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.


16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 

18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 

19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 

20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. 

21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 

22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు. 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. 26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 

29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. 

30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు. 

31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు. 

32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. 

36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. 

37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. 

38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. 

39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు. 

40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. 

41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 

42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 

45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. 


46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి. 


47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. 


48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు. 


49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు. 


50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు. 


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. 


52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. 


53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 

54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.

55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు. 

56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. 


60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు. 


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు. 


62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 

64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు. 

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 

68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం. 


73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి. 


76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. 


77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. 

80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 

84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది. 


90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


91. దిగంబరంగా నిద్రపోరాదు. 

92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం. 

93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు. 


94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 

96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 

99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. 


100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.

భక్తి..బంధుత్వం.

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*భక్తి..బంధుత్వం..*


"మేము స్వామివారి కి బంధువులం అవుతామండీ..ఈరోజు ఇక్కడ నిద్ర చేయాలని అనుకున్నాము..మేము ఉండడానికి ఏదైనా గది ఇస్తారా?.." అని ఆ దంపతులు అడిగారు..ఇద్దరిదీ వయసు ముప్పై ఏళ్ల లోపలే..శ్రీ స్వామివారికి వారికి ఏవిధంగా బంధుత్వం వున్నదో కూడా తెలిపారు.. గది కేటాయించాము..ఇద్దరూ స్నానాదికాలు ముగించుకొని తిరిగి మందిరం లోనికి వచ్చారు..ఆరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి వీలు లేదు కనుక..దూరం నుంచే నమస్కారం చేసుకున్నారు..


"మాకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతున్నది..ఇద్దరమూ డెంటల్ డాక్టర్ల గా నెల్లూరు లో ప్రాక్టీస్ చేస్తున్నాము..సరిగ్గా జరగడం లేదు..ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాము..దుబాయ్ లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ నుంచి మమ్మల్ని రమ్మనమని కబురు వచ్చింది..వెళ్లాలని అనుకుంటున్నాము..కానీ గత మూడు నెలలుగా ఏదో ఒక అడ్డంకి వలన మేము అక్కడికి వెళ్లలేక పోతున్నాము..మాకున్న ఈ ఆర్థిక సమస్యలు తీరిపోయి..దుబాయ్ వెళ్ళడానికి వీలుకుదరాలని స్వామివారికి విన్నవించుకుందామని వచ్చాము.." అని చెప్పారు..సాయంత్రం పల్లకీ సేవ ఎన్నిగంటలకో అని అడిగి తెలుసుకున్నారు..పల్లకీ సేవ లో తామిద్దరం పాల్గొంటామని చెప్పారు..సరే అన్నాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ ప్రారంభం అయింది..దంపతులిద్దరూ భక్తిగా పాల్గొన్నారు..పల్లకీ మందిరం చుట్టూ తిరిగే మూడు ప్రదక్షిణాల లోనూ అతనే పల్లకీని మోశాడు..పల్లకీ సేవ తరువాత, అన్నదాన సత్రానికి వెళ్లి, అన్నప్రసాదం స్వీకరించి వచ్చారు..వాళ్లకోసం గది ని కేటాయించినా కూడా ఆ రాత్రి మండపం లోనే పడుకుంటామని చెప్పి, అక్కడే నేలమీద నిద్ర చేశారు..


ప్రక్కరోజు ఆదివారం తెల్లవారుఝామున లేచి..స్నానం చేసి..శ్రీ స్వామివారి మండపం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చారు..ప్రభాత పూజ, హారతులు అయిపోయిన తరువాత..ఇద్దరూ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, సుమారు పది నిమిషాల పాటు నిలబడ్డారు..తమ కోర్కెను శ్రీ స్వామివారికి విన్నవించుకున్నామని ఇవతలికి వచ్చి నాతో చెప్పారు..


"ఎందువల్లో తెలీదండీ..శ్రీ స్వామివారి సమాధి వద్ద మా బాధలు విన్నవించుకున్న తరువాత..మా మనసులకు ప్రశాంతత వచ్చింది.." అన్నారు..మధ్యాహ్నం దాకా మందిరం లో గడిపి..తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..


పదిహేను రోజులు గడిచిపోయాయి..మేము దాదాపుగా ఆ దంపతుల గురించి మర్చిపోయాము..ఒకరోజు శ్రీ స్వామివారి బంధువు మరొక వ్యక్తి మందిరానికి వచ్చాడు..మాటల మధ్యలో ఈ దంపతుల ప్రస్తావన వచ్చింది..పదిహేను రోజుల క్రిందటే వాళ్లిద్దరూ వచ్చి వెళ్లారని తెలిపాను..గత నాలుగైదు నెలలుగా వాళ్లిద్దరూ తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారని..మానసికంగా కూడా వత్తిడి లో ఉన్నారనీ..అప్పుడు ఆ అమ్మాయి తల్లి గారు వాళ్ళను మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని శరణు కోరమని చెప్పిందనీ..ఆవిడ మాట ప్రకారం వాళ్లిద్దరూ ఇక్కడకు వచ్చారని..తెలిపాడు..శ్రీ స్వామివారికి మ్రొక్కుకున్న మూడు రోజుల్లోనే దుబాయ్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని..మరో వారం లోపలే ఆ దంపతులు దుబాయ్ వెళుతున్నారని..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని.." ఆ వచ్చిన వ్యక్తి తెలిపాడు..


ప్రస్తుతం ఆ దంపతులిద్దరూ దుబాయ్ లో లక్షణంగా ఉన్నారు...శ్రీ స్వామివారి దయ వలన ఆ భార్యా భర్తల కోరిక నెరవేరిందని అనుకున్నాము..బంధుత్వం కన్నా..వాళ్లిద్దరూ కనపరచిన భక్తి విశ్వాసాలే వాళ్ళను శ్రీ స్వామివారికి దగ్గర చేసాయి.. ఎందుకంటే శ్రీ స్వామివారు భక్త సులభుడు కదా!..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ఏకాదశఉత్పలమాల

 *శ్రీరామచంద్రునకు ఏకాదశఉత్పలమాల పాదరేకులు*


రామునిమీరుమానవులిలన్ కనిపించరుసద్గుణంబునన్

ప్రేమనుపంచువల్లభుడువిశ్వమునందునరాముడొక్కడే

భీమపరాక్రమంబునవిభిన్నమనస్కుడురామచంద్రుడే

కోమలులందరున్ సతముకోరెడునందనుడాతడొక్కడే

నామముచెప్పినంతనెమనంబునగొల్చెడుదేవుడాతడే

భామలమెప్పుపొందెడుస్వభావముగల్గుమగాడురాముడే

నీమముతప్పనట్టియపనిందలకోర్వనిరూపమాతడే

కామములేనిక్షత్రియుడుగంగనుమించుపవిత్రుడాతడే

క్షేమముగూర్చియెల్లరకుకీడునుబాపెడుమూర్తియాతడే

క్షామములేనిరాజ్యమునుస్థాపనచేసినరాజురాముడే

ఆమహనీయమూర్తికథఅద్భుతమైధరనిల్చెసత్యమై

       తపస్వీవిజయవాడ

గురు బ్రహ్మ

 గురు బ్రహ్మ గురు విష్ణు 

గురు దేవో మహేశ్వరః.

గురు సాక్షాత్ పర బ్రహ్మ 

తస్మైశ్రీ గురువే నమః.


ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది ? మొదట ఎవరు పలికారు ?ఎందుకు పలికారు ? దాని వెనుక ఉన్న కథ..

పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాణ్ణి విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.

గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.

వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.

కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు ,పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు.ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.

కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.

అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.

గురు బ్రహ్మ గురు విష్ణు 

గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ 

తస్మైశ్రీ గురువే నమః

తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.

ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ.

కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి..స్వస్తి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  -‌ ఏకాదశి -  జేష్ఠ / మూల -‌ భౌమ వాసరే* *(06-02-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/1cXtx1pBqtQ?si=CyLs4l2wEvzT40Qi


🙏🙏

మంగళ వారం/ రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*06-02-2024 / మంగళ వారం/ రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

---------------------------------------

వృషభం


 వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా  ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

---------------------------------------

మిధునం


బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి.

---------------------------------------

కర్కాటకం


విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

---------------------------------------

సింహం


మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు  వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

కన్య


నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

---------------------------------------

తుల


ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గ బంధువులతో వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం


గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంత వరకు బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.  ఆప్తుల  నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

---------------------------------------

ధనస్సు


 వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు  అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

---------------------------------------

మకరం


నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు. ధనదాయ మార్గాలు పెరుగుతాయి.  వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

కుంభం


ఉద్యోగమున సహోద్యోగుల నుండి  విమర్శలు అధికమవుతాయి. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

మీనం


స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల  కలలు ఫలిస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

పుత్రుడు చేయరాదు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝.  

*తత్కర్మ నియతం కుర్యాత్*

*యేన తుష్టో భవేత్ పితా*।

*తన్నకుర్యాత్  యేన పితా*

*మనాగపి విసీదతి॥* 


తా𝕝𝕝  

*ఏ పని చేస్తే తండ్రి సంతుష్టుడగునో, ఆ పనిని పుత్రుడు తప్పక చేయవలెను..... తండ్రికి ఏ కొంచెము దుఃఖము కలిగించునదైనను, ఆ పని పుత్రుడు చేయరాదు....*

షట్తిల ఏకాదశి

 _ షట్తిల  ఏకాదశి*

(6-2-2024)🪷🪷..


పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి , పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది.

షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట. 


*షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు*


*ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..*


1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.


2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం


3) తిల హోమం - ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.


4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట , నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.


5) తిలదానం - నువ్వులు కాని , నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.


6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది)

ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు , మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు.సుబ్బారెడ్డి


*సూచన:-*  షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము , దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుపవలసి ఉంటుంది.


*షట్తిల ఏకాదశి యొక్క చారిత్రక పురాణ కథనం*


మత విశ్వాసాల ప్రకారం , నారద ముని విష్ణువును చూడటానికి వైకుంఠమును సందర్శించి , షట్తిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపమని అడిగినారు. నారద ముని విష్ణువును పట్టుబట్టిన తరువాత ,

పురాతన కాలంలో , ఒక బ్రాహ్మణ భార్య భూమిపై నివసించేది ,  ఆమె నాకు పెద్ద భక్తురాలు , తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం , భక్తితో ఆరాధించేది. ఒక సారి ఆమె నా ఆశీస్సులు పొందటానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంది. ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుండి స్వచ్ఛంగా మారింది.  కానీ ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు మరియు దేవతలకు ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు. కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను , అందువల్ల నేను ఆమెను సాధు , బ్రాహ్మణుడిగా మారువేషంలో పరీక్షించాలనుకున్నాను.


ఒకానొకనాడు నేను మారువేషంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు , ఆమె మట్టి ముద్దను తెచ్చి నా చేతుల్లో ఉంచింది. నేను దాన్ని తిరిగి వైకుంఠమునకు తీసుకువచ్చాను. కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠము వచ్చినప్పుడు ఆమెకు గుడిసె , మామిడి చెట్టు అందించారు. ఖాళీ గుడిసెను చూసిన ఆమె ఆందోళన చెందింది.  నేను ధర్మవంతునైనప్పుడు కూడా నాకు ఖాళీ గుడిసె ఎందుకు వచ్చింది అని అన్నది. ఇవన్నీ మీరు ఆహారం దానం చేయకపోవడం మరియు నాకు బురద ఇవ్వడం వల్లనే అని నేను ఆమెకు చెప్పాను. అప్పుడు నేను ఆమెకు చెప్పాను , మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవవద్దు  దేవ కన్యలు షట్టిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెప్తారు.


దేవ కన్యలు చెప్పినట్లు ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది. ఉపవాసం యొక్క ప్రభావాలతో , ఆమె గుడిసెలో ఆహార పదార్థాలు మరియు పంటలు నిండిపోయాయి. అందువల్ల , నారద , ఈ ఏకాదశి ఉపవాసం చేసి , ఆహారం మరియు నువ్వులను దానం చేసిన వారెవరైనా ఆశీర్వాదం , సంపద మరియు మోక్షం పొందుతారు.